కాసుల వర్షం కురిపించనున్న కామన్వెల్త్ క్రీడలు!

దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగనున్న కామన్వెల్త్ క్రీడలు కాసుల వర్షం కురిపించనున్నాయి. ఈ క్రీడలను క్యాష్ చేసుకునేలా ఢిల్లీలోని బడా, చిరు వ్యాపారులు ఆసక్తిగా ఉన్నారు. కామన్వెల్త్ క్రీడలను తిలకించేందుకు వచ్చే స్వదేశీ, విదేశీ అతిథులకు అవసరమైన బస కల్పించడం, భారతీయ ఆహార రుచులను చవిచూపించడం వల్ల నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని వారు భావిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 7 Jun 2010 | 9:03 am

యువనేతలూ.. రాహుల్‌ని చూసి నేర్చుకోండి: రోశయ్య

రాష్ట్రంలోని కాంగ్రెస్ యువనేతలకు ముఖ్యమంత్రి కె.రోశయ్య ఓ ఉచిత సలహా ఇచ్చారు. తనకు అందుబాటులో అన్నీ ఉన్నా.. అధికారానికి ఆమడదూరంలో ఉంటూ.. సాధారణ జీవనం గడుపుతున్న రాహుల్ గాంధీని చూసి యువనేతలంతా ఎంతో నేర్చుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో పల్లెకు పోదాం అనే కార్యక్రమాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు.
Source: Yahoo! Telugu: News | 7 Jun 2010 | 7:47 am

వైఎస్.జగన్‌జీ... మరోచోటికి తరలించి ఓదార్చు: చిరంజీవి

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డికి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఒక సూచన చేశారు. ఆయన తండ్రి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక అశువులు బాసిన కుటుంబాలను జగన్ ఇప్పటికిపుడే పరామర్శించాలనే తపన ఉంటే వారందరినీ మరో ప్రాంతానికి తరలించే సరిపోతుందని చిరంజీవి ఉచిత సలహా ఇచ్చారు. ఇందుకోసం పార్టీ హైకమాండ్ అనుమతి అవసరం లేదన్నారు. అలాగే, స్థానిక నేతల బెడదా ఉండదన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా నిర్వాసితులు కానున్న వారిని తాను ఇలాగే మరో ప్రాంతానికి తరలించి పరామర్శిస్తున్నట్టు చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 7 Jun 2010 | 7:37 am

స్టాక్ మార్కెట్: భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!

పెరగనున్న పెట్రోల్ ధరల ప్రభావం బాంబే స్టాక్ మార్కెట్‌పై పడింది. పెట్రోల్ ధరలపై తుది నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర మంత్రిమండలి సోమవారం భేటీ కానున్న నేపథ్యంలో.. బాంబే స్టాక్ మార్కెట్ భారీగా క్షీణించింది. ఫలితంగా సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 368 పాయింట్లు భారీగా పతనమై, 16,749 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 107 పాయింట్లు క్షీణించి, 5,028 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 7 Jun 2010 | 7:27 am

15 నుంచి ఓదార్పు యాత్ర: అయినా.. అనుమతి లేదు!

ఈనెల ఎనిమిదో తేదీ నుంచి కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేయతలపెట్టిన ఓదార్పు యాత్రను వచ్చే 15వ తేదీకి వాయిదా వేసుకున్నట్టు సమాచారం. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వలేదని ఏఐసీసీ వర్గాలు సోమవారం ఢిల్లీలో వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 7 Jun 2010 | 7:21 am

మాది ఉమ్మడి కుటుంబం అంటున్న "ఆ నలుగురు"

తెలంగాణా గొడవ మహిమో ఏమో కానీ టాలీవుడ్ అగ్రశ్రేణి నటులందరూ తమదంతా ఉమ్మడి కుటుంబమని ముక్తకంఠంతో చెప్పారు. వివరాలలోకి వెళితే... ఆదివారం రాత్రి టాలీవుడ్ క్రికెట్ డ్రెస్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్రశ్రేణి నటులందరూ మాట్లాడుతూ.. రాజకీయాలు, సినీ నటుల మధ్య విబేధాలు సృష్టించలేవనీ, తమ ఐకమత్యానికి అవి అడ్డంకి కాబోవని చెప్పారు. వందేమాతరం అంటూ దేశభక్తిని నింపుతూ చిరంజీవి, బాలృష్ణ, నాగార్జున, వెంకటేష్ చిందులు వేశారు. యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియం దీనికి వేదికైంది. ఇక హీరోయిన్లు ఛార్మి, అనుష్క, భూమిక, ప్రియమణి ఒక్కో హీరోకు ఒక్కొక్కరు ప్రచారకర్తగా వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jun 2010 | 7:21 am

8-9 శాతం పెరగనున్న ఆసియా స్టీల్ డిమాండ్

ఆసియా మార్కెట్‌లో స్టీల్ డిమాండ్ ఎనిమిది నుంచి తొమ్మిది శాతం మేరకు పెరగవచ్చని ప్రముఖ స్టీల్ దిగ్గజం టాటా స్టీల్ అభిప్రాయపడింది. ఆర్థిక మాంద్యం నుంచి ఆసియా తిరిగి కోలుకుని గాడిన పడటంతో నాలుగు నుంచి ఆరు శాతం మేరకు విస్తరించనుందని ప్రపంచ స్టీల్ ఉత్పత్తిలో ఎనిమిదో స్థానంలో ఉన్న టాటా స్టీల్ మేనేజింగ్ డైరక్టర్ హేమంత్ నెరూర్కర్ వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 7 Jun 2010 | 6:59 am

రూ. 12వేల కోట్లు చెల్లించండి: వొడాఫోన్‌కు ఐటీ శాఖ లేఖ

టెలికం దిగ్గజం వొడాఫోన్ సుమారు 12 వేల కోట్ల రూపాయలు చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం ఆ సంస్థకు ఓ లేఖను పంపింది. సుమారు 10 బిలియన్ డాలర్ల మూలధనం పెట్టుబడులలో ఆదాయపు పన్ను కింద 20 శాతం చెల్లించాల్సి ఉన్నదని తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 7 Jun 2010 | 6:44 am

అమెరికాతో మరింత దగ్గరి సంబంధాలు: జపాన్ ప్రధాని

జపాన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నవోటో ఖాన్ తన మనస్సులోని మాటను వెలుబుచ్చారు. అమెరికాతో మరింత సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు గట్టిగా కృషి చేస్తానని ప్రకటించారు. అలాగే, జాతీయ, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సైనిక, రక్షణ, వాణిజ్య, దౌత్య పరమైన సంబంధాలను మరింత మెరుగు పరుచుకోనున్నట్టు చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 7 Jun 2010 | 6:43 am

స్టాక్ మార్కెట్: 405 పాయింట్లు భారీగా పతనమైన సెన్సెక్స్!

సోమవారం బాంబే స్టాక్ మార్కెట్‌కు బ్లాక్‌డేగా పరిణమించింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే కుప్పకూలిన బాంబే స్టాక్ మార్కెట్, మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో భారీగా క్షీణించింది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, 405 పాయింట్లు భారీగా పతనమై, 16,712 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 124 పాయింట్లు క్షీణించి, 5,011 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 7 Jun 2010 | 6:31 am

భోపాల్ గ్యాస్ లీకేజీ కేసు: నిందితులందరూ దోషులే!

భోపాల్ గ్యాస్ ప్రమాదం కేసులో సోమవారం తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొంటున్న ఎనిమిది మందినీ స్థానిక కోర్టు దోషులుగా తేల్చుతూ తుది తీర్పును వెలువరించింది. కాగా, నిందితుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు ఇప్పటికీ పరారీలో ఉన్నారు.
Source: Yahoo! Telugu: News | 7 Jun 2010 | 6:29 am

ప్లీజ్ కమల్... త్రిష పెదవులను గాఢంగా చుంబించవూ..!!

కమల్ హాసన్‌తో నటించే ఏ నటైనా ఖచ్చితంగా ఆయన ముద్దు రుచి ఎలా ఉంటుందో చూసి తీరాల్సిందే. ఈ నేపధ్యంలో తాజాగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్, త్రిష జోడీగా రూపొందనున్న "మన్మథన్ అంబు" చిత్రంపై తమిళ చిత్ర పరిశ్రమలో బెట్టింగ్‌లు జోరుగా చోటుచేసుకుంటున్నట్లు కోలీవుడ్ న్యూస్. కమల్ - త్రిషల మధ్య లిప్ టు లిప్ సన్నివేశం ఉంటుందా...? ఉండదా...? అనే ప్రశ్నపై పందేలు వేసుకుంటున్నట్లు భోగట్టా. సహజంగా క్రీడల్లో ఇటువంటి బెట్టింగ్‌లు చోటుచేసుకోవడాన్ని మనం చూస్తుంటాం. కానీ త్రిష - కమల్ ముద్దు సన్నివేశంపై వేల రూపాయల్లో పోటీకి దిగడం కాస్తంత ఆశ్చర్యం కల్గించే అంశమే మరి. అంతేకాదండోయ్... కొంతమందైతే కమల్ హాసన్‌కు సెల్‌ఫోన్ల ద్వారా "కమల్... త్రిష పెదవులను గాఢంగా చుంబించే సన్నివేశంలో నీవు నటిస్తే చూడాలనుంది. ప్లీజ్.. త్రిషకు లిప్ టు లిప్ ముద్దివ్వవూ.." అనే సందేశాలను పంపుతున్నారట. మరి కమల్ హాసన్ త్రిష పెదవులను ఏం చేస్తాడో చూడాలి మరి...!!
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jun 2010 | 5:49 am

యువనేతలూ.. రాహుల్‌ని చూసి నేర్చుకోండి: రోశయ్య

రాష్ట్రంలోని కాంగ్రెస్ యువనేతలకు ముఖ్యమంత్రి కె.రోశయ్య ఓ ఉచిత సలహా ఇచ్చారు. తనకు అందుబాటులో అన్నీ ఉన్నా.. అధికారానికి ఆమడదూరంలో ఉంటూ.. సాధారణ జీవనం గడుపుతున్న రాహుల్ గాంధీని చూసి యువనేతలంతా ఎంతో నేర్చుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో పల్లెకు పోదాం అనే కార్యక్రమాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jun 2010 | 2:17 am

వైఎస్.జగన్‌జీ... మరోచోటికి తరలించి ఓదార్చు: చిరంజీవి

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డికి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఒక సూచన చేశారు. ఆయన తండ్రి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక అశువులు బాసిన కుటుంబాలను జగన్ ఇప్పటికిపుడే పరామర్శించాలనే తపన ఉంటే వారందరినీ మరో ప్రాంతానికి తరలించే సరిపోతుందని చిరంజీవి ఉచిత సలహా ఇచ్చారు. ఇందుకోసం పార్టీ హైకమాండ్ అనుమతి అవసరం లేదన్నారు. అలాగే, స్థానిక నేతల బెడదా ఉండదన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా నిర్వాసితులు కానున్న వారిని తాను ఇలాగే మరో ప్రాంతానికి తరలించి పరామర్శిస్తున్నట్టు చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jun 2010 | 2:08 am

15 నుంచి ఓదార్పు యాత్ర: అయినా.. అనుమతి లేదు!

ఈనెల ఎనిమిదో తేదీ నుంచి కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేయతలపెట్టిన ఓదార్పు యాత్రను వచ్చే 15వ తేదీకి వాయిదా వేసుకున్నట్టు సమాచారం. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వలేదని ఏఐసీసీ వర్గాలు సోమవారం ఢిల్లీలో వెల్లడించాయి.
Source: ఏపీ న్యూస్ | 7 Jun 2010 | 1:55 am

భోపాల్ గ్యాస్ లీకేజీ కేసు: నిందితులందరూ దోషులే!

భోపాల్ గ్యాస్ ప్రమాదం కేసులో సోమవారం తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొంటున్న ఎనిమిది మందినీ స్థానిక కోర్టు దోషులుగా తేల్చుతూ తుది తీర్పును వెలువరించింది. కాగా, నిందితుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు ఇప్పటికీ పరారీలో ఉన్నారు.
Source: జాతీయ | 7 Jun 2010 | 1:00 am

జెఠ్మలానీకి రాజ్యసభ టిక్కెట్ కేటాయించిన భాజపా

దేశంలోని ప్రముఖ క్రిమినల్ న్యాయవాదుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన రాం జెఠ్మలానీకి భారతీయ జనతా పార్టీ రాజ్యసభ టిక్కెట్‌ను కేటాయించింది. రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఆయన పోటీ చేస్తారని భాజపా వెల్లడించింది. 87 సంవత్సరాల జెఠ్మలానీ రాజ్యసభకు పోటీ చేయడం ఇది రెండోసారి.
Source: జాతీయ | 7 Jun 2010 | 12:10 am

ఈ సాయంత్రం శ్రీకాకుళం ఓదార్పు యాత్రపై నిర్ణయం!

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో చేపట్టనున్న ఓదార్పు యాత్రపై సోమవారం సాయంత్రం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వ్యక్తిగత రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో జగన్ ఫోనులో మాట్లాడగా, ఆయన ఈ మేరకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 6 Jun 2010 | 11:53 pm

స్వాతంత్ర్యం కాదు.. స్వయంప్రతిపత్తి కావాలి: దలైలామా

టిబెట్‌కు స్వయంప్రతిపత్తి కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌ పరిష్కారం కోసం అహింసా మార్గాన్నే ఆయుధంగా చేసుకోవాలని టిబెట్ బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా నిర్ణయించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ టిబెట్‌కు స్వాతంత్ర్యం కల్పించాలని తాము కోరడం లేదని అర్థవంతమైన స్వయంప్రతిపత్తి కల్పించాలని మాత్రమే కోరుతున్నట్టు చెప్పారు.
Source: జాతీయ | 6 Jun 2010 | 11:41 pm

కాంగ్రెస్ అధిష్టానానికి సిగ్గూశరం ఉందా: తెరాస అధినేత

తెలంగాణ రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ ఇస్తే ఉప ఎన్నికలకు దూరంగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది. దీనిపై ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు మాట్లాడుతూ.. తెలంగాణ అంశంపై ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీ.. ఉప ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా అని ఆయన ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 6 Jun 2010 | 10:59 pm

భోపాల్ గ్యాస్ లీకేజీ ప్రమాదంపై నేడు తుది తీర్పు

దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన భోపాల్ గ్యాస్ లీకేజీ ప్రమాదం కేసుపై సోమవారం తుది తీర్పు వెలువడనుంది. ప్రపంచంలోనే అత్యంత విషాదకరమైన సంఘటనల్లో భోపాల్‌ కార్బైడ్ ఫ్యాక్టరీ ప్రమాదం ఒకటిగా గుర్తింపు పొందిన విషయం తెల్సిందే. ఈ ప్రమాదంపై గత 23 సంవత్సరాలుగా కేసు దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో సోమవారం చీఫ్‌ జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ మెహన్‌ పి తివారీ తుది తీర్పును వెలువరించనున్నారు.
Source: జాతీయ | 6 Jun 2010 | 10:07 pm

జమ్మూ కాశ్మీర్‌లో ప్రధాని రెండు రోజుల పర్యటన!

ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సోమవారం నుంచి రెండు రోజుల పాటు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ రాష్ట్ర వేర్పాటు వాదులు చర్చలకు రావాలని ఆయన మరోమారు విజ్ఞప్తి చేశారు. అలాగే, గతంలో శాంతిపై జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాల తర్వాత రాష్ట్రం సాధించిన ప్రగతిపై కూడా సమీక్ష నిర్వహిస్తారు.
Source: జాతీయ | 6 Jun 2010 | 10:01 pm

ఉప ఎన్నికల్లో పోటీ చేద్దామా వద్దా: నేతలతో డీఎస్ ఆరా!

తెలంగాణ ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేద్దామా వద్దా అని ఆ ప్రాంతానికి చెందిన నేతలతో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఆరా తీస్తున్నారు. మొత్తం 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల్లో కలిపి అధికంగా ఎనిమిది సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఈ రెండు జిల్లాలకు చెందిన నేతలతో ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 6 Jun 2010 | 6:44 am

చిల్డ్రన్స్ డే రోజున చిన్నారులకు ఏం చేస్తున్నారు!

బాలల దినోత్సవం రోజున చిన్నారులకు ఏం చేస్తున్నారని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించారు. చిల్డ్రన్స్ డేను మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజుకు బదులు లాల్ బహుదూర్ శాస్త్రి బర్త్‌డే రోజును జరుపుకోవాలని మోడీ సూచించారు.
Source: జాతీయ | 6 Jun 2010 | 6:14 am

యూపీఏలో పూర్తికాలం కొనసాగుతాం: మమతా బెనర్జీ

కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారుతో పూర్తికాలం కొనసాగుతామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ ప్రకటన ద్వారా వచ్చే యేడాది జరుగనున్న పశ్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగుతామనే అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం ఏ ఒక్క దారిని తాము మూసి వేయలేదన్నారు.
Source: జాతీయ | 6 Jun 2010 | 3:08 am

త్వరలోనే లొంగిపోనున్న ఉల్ఫా నేతలు: హోంశాఖ

యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఉల్ఫా)కు చెందిన నేతలు త్వరలోనే లొంగిపోతారని కేంద్ర హోంశాఖ కార్యదర్శి జీకె.పిళ్లై అన్నారు. లొంగిపోయే నేతల్లో బంగ్లాదేశ్, మియన్మార్‌లకు చెందిన వారు ఉంటారన్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్, మియమన్మార్‌లలో ఉంటూ ఉల్ఫా కార్యకలాపాలు సాగిస్తున్న కొంతమంది నేతలు లొంగి పోయేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు.
Source: జాతీయ | 6 Jun 2010 | 2:22 am