|
ఫేస్‌బుక్‌పై నిషేధాన్ని తొలగించిన బంగ్లాదేశ్ ప్రభుత్వంప్రముఖ సోషల్ నెట్‌వర్క్ సైట్ ఫేస్‌బుక్‌పై ఉన్న నిషేధాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎత్తివేసింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద కార్టూన్లు వేసినందుకు గాను ఫేస్‌బుక్‌పై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు బంగ్లాదేశ్ టెలీకమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ కమిషన్ (బీటీఆర్సీ) తెలిపింది.Source: Yahoo! Telugu: News | 6 Jun 2010 | 9:33 am ఒకేసారి ఉద్దీపన ప్యాకేజీలు ఉపసంహరించం: ప్రణబ్ప్రపంచ ఆర్థిక మాంద్యం ఛాయలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, అందువల్ల ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలను ఒకేసారి ఉపసంహరించలేమని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. వస్తున్న ఆదాయం కంటే.. ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు ఎక్కువగా ఉన్నాయన్నారు. అయినప్పటికీ.. ఉద్దీపన ప్యాకేజీల ఉపసంహరణ అంశంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామన్నారు.Source: Yahoo! Telugu: News | 6 Jun 2010 | 8:49 am యూపీఏలో పూర్తికాలం కొనసాగుతాం: మమతా బెనర్జీకేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారుతో పూర్తికాలం కొనసాగుతామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ ప్రకటన ద్వారా వచ్చే యేడాది జరుగనున్న పశ్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగుతామనే అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం ఏ ఒక్క దారిని తాము మూసి వేయలేదన్నారు.Source: Yahoo! Telugu: News | 6 Jun 2010 | 8:38 am త్వరలోనే లొంగిపోనున్న ఉల్ఫా నేతలు: హోంశాఖయునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఉల్ఫా)కు చెందిన నేతలు త్వరలోనే లొంగిపోతారని కేంద్ర హోంశాఖ కార్యదర్శి జీకె.పిళ్లై అన్నారు. లొంగిపోయే నేతల్లో బంగ్లాదేశ్, మియన్మార్‌లకు చెందిన వారు ఉంటారన్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్, మియమన్మార్‌లలో ఉంటూ ఉల్ఫా కార్యకలాపాలు సాగిస్తున్న కొంతమంది నేతలు లొంగి పోయేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 6 Jun 2010 | 7:52 am వచ్చే వారంలో పెరగనున్న పెట్రోల్-డీజల్ ఛార్జీలువచ్చే వారంలో పెట్రోల్, డీజల్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. సోమవారం ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పెట్రో వడ్డనపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.Source: Yahoo! Telugu: News | 6 Jun 2010 | 6:07 am అమెరికా సాయం వల్ల భారత్‌కు హాని ఉండదు: కృష్ణపాకిస్థాన్కు అమెరికా భారీ ఎత్తున నిధుల సాయం చేస్తున్నా భారత్‌కు ఎలాంటి హాని కలుగబోదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ అభిప్రాయపడ్డారు. భారత్-అమెరికా వ్యూహాత్మక చర్చలు ముగిసిన సందర్భంగా ఆయన విలకరులతో మాట్లాడారు. పాకిస్థాన్ పట్ల భారత్ అభిప్రాయాలూ, వాదన పూర్తిగా అమెరికాకు తెలుసన్నారు. అందువల్ల భారత్‌కు హాని కలిగించే చర్యలను అమెరికా చేపట్టబోదన్నారు.Source: Yahoo! Telugu: News | 6 Jun 2010 | 6:00 am నాసా కీలక పదవుల్లో భారతీయులు వద్దు: చార్ల్స్ బోల్డెన్అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో ఇకపై కీలకమైన పదవులను భారతీయులకు కట్టబెట్టరాదని నాసా అధినేత చార్ల్స్ బోల్డెన్ అభిప్రాయపడ్డారు. ఇటీవల వాషింగ్టన్‌లో కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్ సభ్యులతో జరిపిన ఒక కీలకమైన భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.Source: Yahoo! Telugu: News | 6 Jun 2010 | 5:31 am ఈనెల 7 నుంచి పైప్‌టెక్ అంతర్జాతీయ సదస్సు!ఈనెల ఏడో తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో స్టేట్ ప్లాస్టిక్ మ్యూనుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పైప్‌టెక్ పేరుతో ఓ అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. ఈ సందస్సుకు అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన నిపుణులతో పాటు జర్మనీ, ఇటలీ వంటి వివిధ దేశాల నుంచి ఎందరో మేధావులు హాజరు కానున్నారని వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 6 Jun 2010 | 5:16 am మార్కెట్లో కోడిగుడ్లు ధరలురాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో ఆదివారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.232గా ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.2.60గా ఉంది. అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.234గాను, విజయవాడలో రూ.226, విశాఖపట్నంలో రూ.237, గోదావరి మార్కెట్‌లో రూ.226, తూర్పుగోదావరిలో రూ.226, చిత్తూరులో 264 రూపాయలుగా ఉంది. ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.271 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో 272 రూపాయలుగా పలుకుతోంది.Source: Yahoo! Telugu: News | 6 Jun 2010 | 5:14 am విదేశీ కరెన్సీ రేట్లువిదేశీ కరెన్సీ రేట్లు ఈ విధంగా ఉన్నాయిఅమెరికా డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) 44.15 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 49.35యూరో కరెన్సీ కొనుగోలు రేటు (థామస్ కుక్) 52.75 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 58.80జపాన్ యెన్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 47.65 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 53.05బ్రిటన్ పౌండ్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 64.10 అమ్మకపు రేటు రూ. 71.10.Source: Yahoo! Telugu: News | 6 Jun 2010 | 5:13 am యూపీఏలో పూర్తికాలం కొనసాగుతాం: మమతా బెనర్జీకేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారుతో పూర్తికాలం కొనసాగుతామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ ప్రకటన ద్వారా వచ్చే యేడాది జరుగనున్న పశ్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగుతామనే అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం ఏ ఒక్క దారిని తాము మూసి వేయలేదన్నారు.Source: జాతీయ | 6 Jun 2010 | 3:08 am త్వరలోనే లొంగిపోనున్న ఉల్ఫా నేతలు: హోంశాఖయునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఉల్ఫా)కు చెందిన నేతలు త్వరలోనే లొంగిపోతారని కేంద్ర హోంశాఖ కార్యదర్శి జీకె.పిళ్లై అన్నారు. లొంగిపోయే నేతల్లో బంగ్లాదేశ్, మియన్మార్‌లకు చెందిన వారు ఉంటారన్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్, మియమన్మార్‌లలో ఉంటూ ఉల్ఫా కార్యకలాపాలు సాగిస్తున్న కొంతమంది నేతలు లొంగి పోయేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు.Source: జాతీయ | 6 Jun 2010 | 2:22 am ఈవీఎంలతో ఫలితాలు తారుమారు చేయలేరు: నవీన్ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయలేరని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నవీన్ చావ్లా స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు ఆయన తోసిపుచ్చారు.Source: జాతీయ | 5 Jun 2010 | 11:28 pm దళాలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం: ఆంటోనీనక్సల్స్ అణిచివేతకు సైన్యాన్ని ఉపయోగించే అంశంపై పదాతి దళాలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ నక్సల్స్ సమస్యను కేంద్ర ప్రభుత్వం సునిశితంగా, సమర్థవంతంగా పరిష్కరిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.Source: జాతీయ | 5 Jun 2010 | 11:20 pm శ్రీకాకుళంలో ఓదార్పు యాత్ర కొనసాగుతుంది..!: జగన్శ్రీకాకుళంలో తలపెట్టాల్సిన ఓదార్పు యాత్ర కొనసాగుతుందని దివంగత మహానేత, కడప ఎంపీ. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దివంగత మహానేత, తన తండ్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరణానంతరం హఠాన్మరణానికి గురైన కుటుంబాలను పరామర్శించే దిశగా చేపట్టిన ఓదార్పు యాత్ర కొనసాగదని ఎవరన్నారని జగన్ ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 5 Jun 2010 | 11:08 pm టాలీవుడ్‌పై మరోసారి దండెత్తిన రామ్‌గోపాల్ వర్మరామ్గోపాల్ వర్మ ఇక నుంచి "దెయ్యం", "భూతం" వంటి చిత్రాల నుంచి ఆర్‌జీవి బ్యానర్‌లో తెలుగు చిత్రాలపై దృష్టి సారించారు. అవి సమకాలీన సమస్యలపై చేయనున్నారు. ఒక రకంగా ఆయన పని రాక్షసుడని ఆయనతో కాసేపు చర్చల్లో పాల్గొంటే బోలెడన్ని విషయాలు తెలుసుకోవచ్చని పూరీ జగన్నాథ్ కూడా ఇటీవలే సర్టిఫై ఇచ్చారు. ఐదు రోజుల క్రితం పూరీ జగన్నాథ్‌తో రామ్‌గోపాల్ వర్మ హైదరాబాదులోని ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆయనతో కథా చర్చలు ముగిసేటప్పటికి తెల్లవారు జాము 3 గంటలయిందిని పూరీ చెప్పారు. తను నిద్రపోయేది తక్కువేనని వర్మ గురించి పూరీ కితాబిచ్చారు.Source: Yahoo! Telugu: Entertainment | 5 Jun 2010 | 1:01 pm ఆ పాత పాట మధురంలో 'అందమె ఆనందం..'అందమె ఆనందం అందమె ఆనందంఆనందమే జీవిత మకరందం! పడమట సంధ్యారాగం,కుడి ఎడమల కుసుమపరాగం ఒడిలో చెలి మోహన రాగం...జీవితమే మధురానురాగం పడిలేచే కడలి తరంగం,వడిలో జడిసిన సారంగం సుడిగాలిలో ఎగిరే పతంగంజీవితమే ఒక నాటకరంగం! చల్లని సాగర తీరం, మదిజిల్లను మలయ సమీరంమదిలో కదిలే సరాగం, జీవితమే అనురాయ యోగం!!Source: Yahoo! Telugu: Entertainment | 5 Jun 2010 | 11:23 am మా ఆయన నాకేదో సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తాడు: రంభకెనడాకు చెందిన ఇందిరన్ అనే వ్యాపారవేత్తను వివాహమాడిన గ్లామర్ క్వీన్ రంభ తన పుట్టినరోజు సెలబ్రేషన్ కోసం ఇండియా వచ్చింది. తన భర్త తన పుట్టినరోజును తన పుట్టిన గడ్డపై చేసుకోమని మరీమరీ పంపారని ఎంతో సంతోషంగా చెపుతోంది. అంతేకాదు... పుట్టినరోజు కానుకగా తనకు చెప్పకుండా ఏదో సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ కూడా ఇస్తానని తనతో చెప్పాడని రెండు పెదవులను బాగా సాగదీసి మరీ నవ్వుతూ చెపుతోంది. "నీ అభిమానులు, నీ కుటుంబం మధ్య పుట్టినరోజు సంబరం చేసుకుంటే ఆ సంతోషమే వేరు... అందుకనే నీ పుట్టినరోజు వేడుకను అక్కడే చేసుకో" అని తన భర్త ఎంతో ప్రేమగా చెప్పారని మురిసిపోతూ చెపుతోంది రంభ. పెళ్లయిన తర్వాత తనకిది తొలి పుట్టినరోజు పండుగ అనీ, కెనడాకు వెళ్లిన తర్వాత తన భర్త ఇందిరన్ తనకు కొత్త లోకాన్ని చూపించాడని ఆయనపై పొగడ్తల వర్షం కురిపిస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 5 Jun 2010 | 10:12 am 7వ తేదీన పోలవరం నిర్వాసితులతో చిరంజీవి భేటీ!ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఈనెల ఏడో తేదీన పోలవరం నిర్వాసితులతో సమావేశం కానున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలోని నిర్వాసితులతో ఆయన పోలవరం వద్ద భేటీ అవుతారు. ఈ విషయాన్ని ప్రరాపా ప్రధాన కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.Source: ఏపీ న్యూస్ | 5 Jun 2010 | 8:16 am రాజకీయ యాత్ర కాబట్టే అనుమతి లేదు: రాఘవులుకడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర వ్యక్తిగత యాత్ర కాదని, రాజకీయ యాత్రేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ.రాఘవులు అన్నారు. ఇది వ్యక్తిగత యాత్ర అని జగన్ పదేపదే చెపుతున్నా కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రోశయ్య సర్కారుపై ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశాలకు రాఘవులు హాజరయ్యారు.Source: ఏపీ న్యూస్ | 5 Jun 2010 | 7:23 am శ్రీలక్ష్మీ నరసింహుని దయతో "సింహా" హిట్: బాలకృష్ణసినిమా సక్సెస్ కావాలని షూటింగ్ తొలి షాట్‌కు ముందు పూజా కార్యక్రమాలు నిర్వహించి సరిపెట్టుకునేవారు. కానీ నేడు పరిస్థితి మారింది. సినిమా విడుదలకు ముందు సక్సెస్ కావాలనీ, విడుదలైన తర్వాత సక్సెస్ అయినందుకు దేవదేవుళ్లకు మొక్కే నటీనటులు ఎక్కువవుతున్నారు. ఇటీవల అనుష్క తన పంచాక్షరి చిత్రం సూపర్ హిట్ కావాలని బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని వేడుకున్నారు. అంతకముందు "సింహా" బాలకృష్ణ సైతం తన చిత్రం సూపర్ డూపర్ హిట్ అయినందుకు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని పూజాది కార్యక్రమాలు చేశారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి దయతోనే తన సింహా చిత్రం అంచనాలకు మించి సూపర్ హిట్ అయినదని బాలకృష్ణ చెపుతున్నారు. సింహా చిత్రంలో లక్ష్మీ నరసింహునికి సంబంధించిన సన్నివేశాలు మీకోసం....Source: Yahoo! Telugu: Entertainment | 5 Jun 2010 | 6:53 am హత్య కేసులో ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యేకు జీవిత శిక్ష!ఓ హత్య కేసులో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ (ఆర్జేడీ)కి చెందిన మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరికి జీవిత కారాగార శిక్షను విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు శిక్ష విధించింది. 2005 సంవత్సరంలో జరిగిన ఈ హత్య కేసులో శనివారం తుది తీర్పు వెలువడింది.Source: జాతీయ | 5 Jun 2010 | 5:17 am జగన్ యాత్ర గొడవ మనకెందుకు: మంత్రులతో సీఎం!కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న ఓదార్పు యాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని పలువురు మంత్రులు ముఖ్యమంత్రి రోశయ్యను కోరారు. దీనిపై వెంటనే కలుగజేసుకున్న ఆయన ఆయన యాత్ర గొడవ మనకెందుకూ.. అధిష్టానం చూసుకుంటుంది కదా అని అని సమాధానం ఇచ్చినట్టు వినికిడి.Source: ఏపీ న్యూస్ | 5 Jun 2010 | 5:00 am మెత్తబడిన వైఎస్.జగన్: ఓదార్పు యాత్ర వాయిదా!కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి మెత్తబడ్డారు. తాను చేపట్టిన ఓదార్పు యాత్రను వాయిదా వేసుకోవాలనే తలంపులో ఉన్నారు. అధిష్టానం అనుమతితోనే తదుపరి యాత్రను చేపట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీకి తన అనుచరల ద్వారా సంకేతాలు పంపినట్టు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 5 Jun 2010 | 4:05 am ఆ బుల్లెట్ రవిశంకర్‌ను లక్ష్యంగా చేసుకున్నది కాదు!ఆర్ట్ ఆఫ్ లివింగ్ (ఏఓఎల్) వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని తుపాకీ కాల్పులు జరుపలేదని కర్ణాటక డీజీపీ అజయ్ కుమార్ సింగ్ మరోమారు పునరుద్ఘాటించారు. మహదేవ్ ప్రసాద్ అనే వైద్యుడు తన కారుకు అడ్డంగా వచ్చిన కుక్కల మందపై కాల్పులు జరిపారని, అందులో ఒక బుల్లెట్ అదుపుతప్పి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలోకి వెళ్లిందని డీజీపీ వివరణ ఇచ్చారు.Source: జాతీయ | 5 Jun 2010 | 3:46 am సీఎం క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ పంచాయతీ!జీహెచ్ఎంసీ పంచాయతీ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. మేయర్ కార్తికా రెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కె.రోశయ్య చర్యలు చేపట్టారు. సమస్య పరిష్కారంలో భాగంగా వీరిద్దరితో విడివిడిగా సమావేశమైన ముఖ్యమంత్రి.. శనివారం మరోమారు వారిద్దరిని పిలిచి మందలించారు. అనంతరం ఎమ్మెల్యే జయసుధ మాట్లాడుతూ.. మేయర్ కార్తికా రెడ్డితో తనకెలాంటి విభేదాలు లేవని ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 5 Jun 2010 | 2:31 am ఈరోజుతో ముగియనున్న మద్యం టెండర్ల గడువు!మద్యం టెండర్ల గడువు శనివారం సాయంత్రంతో ముగియనుంది. ఈనెల ఎనిమిదో తేదీన మద్యం షాపులను దక్కించుకున్న వారి పేర్ల జాబితాను వెల్లడిస్తారు. ఇదిలావుండగా, ఈ టెండర్లు వేసే సందర్భంగా వరంగల్ జిల్లాలో స్వల్పంగా ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బస్వరాజ్ సారయ్య తనయుడు హంగామా చేశాడు. టెండరు వేయడానికి వెళ్తున్న ఓ వ్యక్తిని అడ్డగించి టెండర్ ఫారాలను చింపి వేశాడు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు.Source: ఏపీ న్యూస్ | 5 Jun 2010 | 2:23 am
|