|
ఆ బుల్లెట్ రవిశంకర్‌ను లక్ష్యంగా చేసుకున్నది కాదు!ఆర్ట్ ఆఫ్ లివింగ్ (ఏఓఎల్) వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని తుపాకీ కాల్పులు జరుపలేదని కర్ణాటక డీజీపీ అజయ్ కుమార్ సింగ్ మరోమారు పునరుద్ఘాటించారు. మహదేవ్ ప్రసాద్ అనే వైద్యుడు తన కారుకు అడ్డంగా వచ్చిన కుక్కల మందపై కాల్పులు జరిపారని, అందులో ఒక బుల్లెట్ అదుపుతప్పి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలోకి వెళ్లిందని డీజీపీ వివరణ ఇచ్చారు.Source: Yahoo! Telugu: News | 5 Jun 2010 | 9:16 am మార్చిలో ప్రారంభం కానున్న అల్ మక్తూమ్ విమానాశ్రయంవచ్చే ఏడాది మార్చి నెలలో దుబాయ్‌లోని నూతన విమానాశ్రయం అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంకానుందని దుబాయ్ వరల్డ్ సెంట్రల్ ఉపాధ్యక్షుడు ఆండ్రూ వాల్ష్ శనివారం దుబాయ్‌లో తెలిపారు.Source: Yahoo! Telugu: News | 5 Jun 2010 | 8:13 am సీఎం క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ పంచాయతీ!జీహెచ్ఎంసీ పంచాయతీ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. మేయర్ కార్తికా రెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కె.రోశయ్య చర్యలు చేపట్టారు. సమస్య పరిష్కారంలో భాగంగా వీరిద్దరితో విడివిడిగా సమావేశమైన ముఖ్యమంత్రి.. శనివారం మరోమారు వారిద్దరిని పిలిచి మందలించారు. అనంతరం ఎమ్మెల్యే జయసుధ మాట్లాడుతూ.. మేయర్ కార్తికా రెడ్డితో తనకెలాంటి విభేదాలు లేవని ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 5 Jun 2010 | 8:00 am పర్యావరణాన్ని కాపాడుకుందాం... కలసి రండి..!!ప్రతి ఏటా జూన్ 5వ తేదీని పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రోజురోజుకీ పర్యావరణం కలుషితమవడం పట్ల ప్రతి ఏటా ఆయా దేశాలు సమావేశాలు పెట్టి ఆందోళనలు వ్యక్తపరచడం తప్పించి అందుకు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.Source: Yahoo! Telugu: News | 5 Jun 2010 | 7:55 am ఈరోజుతో ముగియనున్న మద్యం టెండర్ల గడువు!మద్యం టెండర్ల గడువు శనివారం సాయంత్రంతో ముగియనుంది. ఈనెల ఎనిమిదో తేదీన మద్యం షాపులను దక్కించుకున్న వారి పేర్ల జాబితాను వెల్లడిస్తారు. ఇదిలావుండగా, ఈ టెండర్లు వేసే సందర్భంగా వరంగల్ జిల్లాలో స్వల్పంగా ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బస్వరాజ్ సారయ్య తనయుడు హంగామా చేశాడు. టెండరు వేయడానికి వెళ్తున్న ఓ వ్యక్తిని అడ్డగించి టెండర్ ఫారాలను చింపి వేశాడు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు.Source: Yahoo! Telugu: News | 5 Jun 2010 | 7:53 am 11 శాతం వడ్డీతో గృహ రుణాలిస్తాం : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ఆస్తి తనఖా పెట్టుకుని రుణాలనిచ్చేందుకు తమ బ్యాంకు మళ్ళీ సిద్ధపడిందని, ఇందులో భాగంగా 11.25 శాతం మేరకు వడ్డీతో రుణాలను మంజూరు చేసేందుకు బ్యాంక్ ప్రణాళికలు రూపొందించుకుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించింది.Source: Yahoo! Telugu: News | 5 Jun 2010 | 7:42 am ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం?ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇవ్వాలని భారత్ చేస్తున్న విజ్ఞప్తిని పరిశీలిస్తామని అమెరికా ప్రకటించింది. భారత్-అమెరికా వ్యూహాత్మక చర్చల్లో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఈ విషయాన్ని వెల్లడించారు. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని అమెరికా కూడా కోరుతుందన్నారు.Source: Yahoo! Telugu: News | 5 Jun 2010 | 7:19 am పక్షం రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటు: శిబూ సొరేన్ వెల్లడిమరో పక్షం రోజుల్లో జార్ఖండ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు జార్ఖండ్ ముక్తి మోర్ఛా అధినేత శిబూ సొరేన్ వెల్లడించారు. ఇందుకోసం భావసారూప్య పార్టీల నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఇదేవిషయంపై ఆయన శనివారం రాంచీలో మాట్లాడుతూ.. జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలో మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 5 Jun 2010 | 7:05 am శ్రీలక్ష్మీ నరసింహుని దయతో "సింహా" హిట్: బాలకృష్ణసినిమా సక్సెస్ కావాలని షూటింగ్ తొలి షాట్‌కు ముందు పూజా కార్యక్రమాలు నిర్వహించి సరిపెట్టుకునేవారు. కానీ నేడు పరిస్థితి మారింది. సినిమా విడుదలకు ముందు సక్సెస్ కావాలనీ, విడుదలైన తర్వాత సక్సెస్ అయినందుకు దేవదేవుళ్లకు మొక్కే నటీనటులు ఎక్కువవుతున్నారు. ఇటీవల అనుష్క తన పంచాక్షరి చిత్రం సూపర్ హిట్ కావాలని బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని వేడుకున్నారు. అంతకముందు "సింహా" బాలకృష్ణ సైతం తన చిత్రం సూపర్ డూపర్ హిట్ అయినందుకు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని పూజాది కార్యక్రమాలు చేశారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి దయతోనే తన సింహా చిత్రం అంచనాలకు మించి సూపర్ హిట్ అయినదని బాలకృష్ణ చెపుతున్నారు. సింహా చిత్రంలో లక్ష్మీ నరసింహునికి సంబంధించిన సన్నివేశాలు మీకోసం....Source: Yahoo! Telugu: Entertainment | 5 Jun 2010 | 6:53 am బుద్దదేవ్‌కు స్థానిక ఎన్నికల సెగ : రాజీనామా యోచన!పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్యకు స్థానిక ఎన్నికల ఓటమి సెగ తగిలింది. కోల్‌కతా మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో లెఫ్ట్ కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఫలితాలను జీర్ణించుకోలేని ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలను సీపీఎం నేతలు కొట్టిపారేశారు.Source: Yahoo! Telugu: News | 5 Jun 2010 | 6:31 am హెడ్లీ వద్ద విచారణ: ఎట్టకేలకు ఎన్ఐఏకు అనుమతి లభ్యంముంబై దాడులతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్-అమెరికా లష్కర్ తోయిబా తీవ్రవాది డేవిడ్ కలోమెన్ హెడ్లీ వద్ద విచారణ జరిపేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు ఎట్టకేలకు అనుమతి లభించింది. ఈ కేసులో హెడ్లీ వద్ద విచారణ జరిపేందుకు అమెరికా వెళ్లిన ఎన్ఐఏ దర్యాప్తు బృందానికి అనుమతి ఇచ్చినట్టు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేమ్స్ జోన్స్ వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 5 Jun 2010 | 6:14 am ఆ బుల్లెట్ రవిశంకర్‌ను లక్ష్యంగా చేసుకున్నది కాదు!ఆర్ట్ ఆఫ్ లివింగ్ (ఏఓఎల్) వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని తుపాకీ కాల్పులు జరుపలేదని కర్ణాటక డీజీపీ అజయ్ కుమార్ సింగ్ మరోమారు పునరుద్ఘాటించారు. మహదేవ్ ప్రసాద్ అనే వైద్యుడు తన కారుకు అడ్డంగా వచ్చిన కుక్కల మందపై కాల్పులు జరిపారని, అందులో ఒక బుల్లెట్ అదుపుతప్పి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలోకి వెళ్లిందని డీజీపీ వివరణ ఇచ్చారు.Source: జాతీయ | 5 Jun 2010 | 3:46 am సీఎం క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ పంచాయతీ!జీహెచ్ఎంసీ పంచాయతీ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. మేయర్ కార్తికా రెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కె.రోశయ్య చర్యలు చేపట్టారు. సమస్య పరిష్కారంలో భాగంగా వీరిద్దరితో విడివిడిగా సమావేశమైన ముఖ్యమంత్రి.. శనివారం మరోమారు వారిద్దరిని పిలిచి మందలించారు. అనంతరం ఎమ్మెల్యే జయసుధ మాట్లాడుతూ.. మేయర్ కార్తికా రెడ్డితో తనకెలాంటి విభేదాలు లేవని ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 5 Jun 2010 | 2:31 am ఈరోజుతో ముగియనున్న మద్యం టెండర్ల గడువు!మద్యం టెండర్ల గడువు శనివారం సాయంత్రంతో ముగియనుంది. ఈనెల ఎనిమిదో తేదీన మద్యం షాపులను దక్కించుకున్న వారి పేర్ల జాబితాను వెల్లడిస్తారు. ఇదిలావుండగా, ఈ టెండర్లు వేసే సందర్భంగా వరంగల్ జిల్లాలో స్వల్పంగా ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బస్వరాజ్ సారయ్య తనయుడు హంగామా చేశాడు. టెండరు వేయడానికి వెళ్తున్న ఓ వ్యక్తిని అడ్డగించి టెండర్ ఫారాలను చింపి వేశాడు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు.Source: ఏపీ న్యూస్ | 5 Jun 2010 | 2:23 am పక్షం రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటు: శిబూ సొరేన్ వెల్లడిమరో పక్షం రోజుల్లో జార్ఖండ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు జార్ఖండ్ ముక్తి మోర్ఛా అధినేత శిబూ సొరేన్ వెల్లడించారు. ఇందుకోసం భావసారూప్య పార్టీల నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఇదేవిషయంపై ఆయన శనివారం రాంచీలో మాట్లాడుతూ.. జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలో మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు.Source: జాతీయ | 5 Jun 2010 | 1:36 am బుద్దదేవ్‌కు స్థానిక ఎన్నికల సెగ : రాజీనామా యోచన!పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్యకు స్థానిక ఎన్నికల ఓటమి సెగ తగిలింది. కోల్‌కతా మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో లెఫ్ట్ కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఫలితాలను జీర్ణించుకోలేని ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలను సీపీఎం నేతలు కొట్టిపారేశారు.Source: జాతీయ | 5 Jun 2010 | 1:05 am మళ్లీ అటువంటి ఉత్తరాలు రాయొద్దు: సోనియా గాంధీవైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 8వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో చేపట్టాల్సిన ఓదార్పు యాత్ర సస్పెన్స్‌లో పడింది. తన కుమారుడు సీమాంధ్రలో చేపట్టదలచిన ఓదార్పు యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని వైఎస్ జగన్ తల్లి శ్రీమతి విజయలక్ష్మి పంపిన లేఖ బుట్ట దాఖలైనట్లు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 5 Jun 2010 | 12:42 am బాధ్యతను గుర్తించి కాలుష్యాన్ని తగ్గించండి : సీఎంపర్యావరణ పరిరక్షణపై అందరూ బాధ్యతను గుర్తించి కాలుష్యాన్ని తగ్గించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య పిలుపు నిచ్చారు. పర్యావరణ పరిరిక్షణ సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని రోశయ్య పేర్కొన్నారు. దీన్ని అందరూ గుర్తించి మెలిగితే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని రోశయ్య సూచించారు.Source: ఏపీ న్యూస్ | 5 Jun 2010 | 12:31 am ఐతే.. ఓకే: లేదంటే రాజీనామా అస్త్రమే: వైఎస్.జగన్తాను చేపట్టనున్న ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి అనుమతి ఇస్తే సరేసరి. లేదంటే తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన అనుచరులతో అన్నారు. ముందుగా ప్రకటించినట్టుగా ఓదార్పు యాత్ర కొనసాగించి తీరాల్సిందేనని నొక్కివక్కాణించారు. తన వెనుక నేతలు వచ్చినా రాకపోయినా సరే తాను ఒంటరిగానైనా యాత్రను పూర్తి చేస్తానని ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 5 Jun 2010 | 12:31 am వై.ఎస్.జగన్ అధిష్టానాన్ని ధిక్కరించలేదు: మంత్రి ఆనందివంగత మహానేత, వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు, కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డి అధిష్టానాన్ని ఎప్పుడూ ధిక్కరించలేదని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు.హైకమాండ్‌ను ధిక్కరించే దిశగా జగన్ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆనం స్పష్టం చేశారు. ఓదార్పు యాత్రపై ఆనం మాట్లాడుతూ.. ఓదార్పు యాత్రమే తానేమీ మాట్లాడేది లేదని చెప్పారు. ఇంకా ఓదార్పు యాత్ర జగన్ వ్యక్తిగతమని ఆనం వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 5 Jun 2010 | 12:26 am కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదుః అజిత్ సింగ్తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోను కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ)పార్టీ అధినేత అజిత్ సింగ్ స్పష్టం చేశారు. తమ పార్టీ కేవలం రాజ్యసభ ఎన్నికలకు మాత్రమే ఆ పార్టీకి మద్దతు తెలిపిందన్నారు.Source: జాతీయ | 4 Jun 2010 | 10:40 pm పశ్చిమ బెంగాల్‌లో ఓటమిపై సమీక్ష జరపనున్న సీపీఎంపశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సీపీఎం ఓటమిపాలవ్వడంతో దీనిపై ఆ పార్టీ పొలిట్ బ్యూరో ఈ రోజు సమీక్ష జరపనుంది. ఓటమికిగల కారణాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాలు రెండు రోజులపాటు జరగనున్నాయని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.Source: జాతీయ | 4 Jun 2010 | 10:25 pm ఐదు కథల "వేదం"..! అబ్బో.. అర్థమవడం కష్టమే..!!సృష్టికి మూలాలు తెలుసుకోవాలంటే వేదం తెలియాలంటారు. మనిషి ఎలా బతకాలో.. అసలెందుకు బతుకుతున్నాడో జీవితానికి అర్థం ఏమిటో వేదాల్లోనే తెలుస్తాయని నానుడి. అలాంటి వేదం పేరును టైటిల్‌గా ఎంచుకుని మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయి. ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారు అనేది ఐదు కథల ద్వారా దర్శకుడు చెప్పే ప్రయత్నం చేసాడు. మొదటి భాగమంతా ఆ ఐదు కథల గమ్యం ఎటువైపు పోతుందో అర్థం చేసుకునేలోపే ఇంటర్వెల్ పడుతుంది. మిగిలిన సగభాగం అందరూ ఒకేచోట కలవడంతో సినిమా ముగుస్తుంది. మామూలు సినిమాకు ఇది భిన్నమైన కథ. హీరో హీరోయిన్ల లవ్, యాక్షన్, ఫైట్లు రొటీన్ సినిమాలో ఉండేవే అయినా కొత్త ప్రయోగంగా అనిపించింది. మంచు మనోజ్, అల్లు అర్జున్‌లు నటిస్తున్నారనగానే మల్టీస్టారర్ అనే ఆరంభంలో ఇద్దరూ చెప్పారు. కానీ ఈ చిత్రం టైటిల్‌లో మంచు మనోజ్‌కు మాత్రం గెస్ట్ అప్పీయరియన్స్ అని వేయడం విశేషం.Source: Yahoo! Telugu: Entertainment | 4 Jun 2010 | 1:14 pm రామ్ చరణ్ "జగదేకవీరుడు"-జాహ్నవి "అతిలోకసుందరి"మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన "జగదేక వీరుడు - అతిలోక సుందరి" ఎంతటి హిట్ సాధించిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. మళ్లీ ఆ చిత్రానికి సీక్వెల్‌గా నిర్మాత అశ్వనీదత్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ, శ్రీదేవి కుమార్తె జాహ్నవితో "జగదేక వీరుడు - అతిలోక సుందరి -2" చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాలీవుడ్ న్యూస్. కాగా ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను కె. రాఘవేంద్ర రావు చేపడతారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో నిర్మించనున్నట్లు అశ్వనీదత్ సూచనప్రాయంగా తెలియజేశారు. ఇదిలావుండగా శ్రీదేవి కుమార్తె జాహ్నవి తన తొలి చిత్రాన్ని అక్కినేని నాగచైతన్యతో చేయనున్నట్లు భోగట్టా.Source: Yahoo! Telugu: Entertainment | 4 Jun 2010 | 9:28 am రాత్రంతా గంతులేసిన అల్లు అర్జున్..!!ఒకనాటి రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ డాన్స్ వేస్తూనే ఉన్నానని అల్లు అర్జున్ చెప్పాడు. ఎవరికైనా సంతోషమో, అనుకున్న పని జరిగితే తెగ సంబరపడిపోయి ఆనందంతో డాన్స్ చేస్తుంటారు. మరి మీరు అలా ఎప్పుడైనా చేశారా...? అని అల్లు అర్జున్‌ను అడిగితే.. నిర్మొహమాటంగా చెప్పాడు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Jun 2010 | 7:38 am ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న జయసుధ?సినీ నటి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ కార్తికా రెడ్డితో ఏర్పడిన విభేదాల కారణంగా ఆమె ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి చిత్రసీమలో కొనసాగాలనే యోచనలో ఉన్నట్టు ఆమె అనుచరులు చెపుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 4 Jun 2010 | 7:23 am ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థపై తీవ్రవాద ముద్ర!ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థపై కేంద్ర ప్రభుత్వం తీవ్రవాద ముద్ర వేసింది. భారత కేంద్రంగా పని చేసే సిమీతో పాటు పాక్ కేంద్రంగా పని చేసే లష్కర్ ఇ తోయిబా తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగివున్నందుకు గాను ఈ చర్య తీసుకున్నట్టు కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 4 Jun 2010 | 7:02 am ఏకగ్రీవం కానున్న రాజ్యసభ అభ్యర్థులు ఎంపిక!రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఎంపిక దాదాపు ఏకగ్రీవంకానుంది. రాష్ట్రం నుంచి ఏర్పడిన ఆరు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో వీరి ఎంపిక ఇక లాంఛన ప్రాయంగా మారనుంది.Source: ఏపీ న్యూస్ | 4 Jun 2010 | 5:59 am ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో 'రెండాకుల' రెపరెపలు: జయలలితఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెండాకులను రెపరెపలాడిద్దామని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆమె సమక్షంలో అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె వారినుద్దేశించి ప్రసంగింస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అన్నాడీఎంకేను మరింత పటిష్టం చేసే దిశగా నేతలు, కార్యకర్తలు చేస్తున్నారన్నారు.Source: జాతీయ | 4 Jun 2010 | 5:19 am శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్ర కోసం ఏర్పాట్లు షురూ!కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తాను చేపట్టనున్న శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానంతో రాజీ పడేందుకు వీలుగా ఆయన పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇందుకోసం తమ కుటుంబ ఆప్తమిత్రుడు డాక్టర్ కేవీపీ.రామచంద్రరావుతో రాయబారం నడుపుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 4 Jun 2010 | 4:14 am నేను అడగాలేదు.. వాళ్లు ఇవ్వాలేదు: ధర్మపురి శ్రీనివాస్తనకు రాజ్యసభ సీటును కేటాయించాలని పార్టీ అధిష్టానాన్ని కోరలేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో అధిష్టానం మొండిచేయి చూపిందన్ని మీడియా ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానం ఇచ్చారు.Source: ఏపీ న్యూస్ | 4 Jun 2010 | 3:52 am రాజ్యసభ ఎన్నికలు: అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్త్వరలో దేశ వ్యాప్తంగా జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆరుగురు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటించింది. వీరిలో కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి అంబికా సోనీ ఉన్నారు. ఈమెను తిరిగి పంజాబ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది.Source: జాతీయ | 4 Jun 2010 | 3:16 am
|