రామ్ చరణ్ "జగదేకవీరుడు"-జాహ్నవి "అతిలోకసుందరి"

మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన "జగదేక వీరుడు - అతిలోక సుందరి" ఎంతటి హిట్ సాధించిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. మళ్లీ ఆ చిత్రానికి సీక్వెల్‌గా నిర్మాత అశ్వనీదత్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ, శ్రీదేవి కుమార్తె జాహ్నవితో "జగదేక వీరుడు - అతిలోక సుందరి -2" చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాలీవుడ్ న్యూస్. కాగా ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను కె. రాఘవేంద్ర రావు చేపడతారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో నిర్మించనున్నట్లు అశ్వనీదత్ సూచనప్రాయంగా తెలియజేశారు. ఇదిలావుండగా శ్రీదేవి కుమార్తె జాహ్నవి తన తొలి చిత్రాన్ని అక్కినేని నాగచైతన్యతో చేయనున్నట్లు భోగట్టా.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jun 2010 | 9:28 am

స్టాక్ మార్కెట్: స్వల్ప లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీల ర్యాలీ

వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ తేలిక పాటి ఒడిదుడుకుల మధ్య ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభనష్టాలతో మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో 30 పాయింట్ల మేర లాభపడింది. దీంతో సెన్సెక్స్ సూచి 17,052 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 15 పాయింట్ల స్వల్ప వృద్ధితో 5,126 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2010 | 9:25 am

నేను అడగాలేదు.. వాళ్లు ఇవ్వాలేదు: ధర్మపురి శ్రీనివాస్

తనకు రాజ్యసభ సీటును కేటాయించాలని పార్టీ అధిష్టానాన్ని కోరలేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో అధిష్టానం మొండిచేయి చూపిందన్ని మీడియా ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానం ఇచ్చారు.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2010 | 9:22 am

బాధ్యతాయుత సూపర్ శక్తిగా ఆవిర్భవిస్తున్న భారత్

ప్రపంచ చిత్ర పటంలో భారత్ ఒక బాధ్యతాయుత సూపర్ పవర్‌గా ఆవిర్భవిస్తోందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు. అలాగే, భారత్-అమెరికా దేశాల మధ్య సంబంధాలు 21వ శతాబ్దిలో అత్యంత కీలకమైనవిగా ఆయన పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2010 | 8:59 am

రాజ్యసభ ఎన్నికలు: అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

త్వరలో దేశ వ్యాప్తంగా జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆరుగురు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటించింది. వీరిలో కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి అంబికా సోనీ ఉన్నారు. ఈమెను తిరిగి పంజాబ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2010 | 8:45 am

ప్రపంచమార్కెట్‌ ప్రభావంతో దేశంలో తగ్గిన బంగారం ధరలు

ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గడంతో దేశీయ బులియన్ మార్కెట్‌లోను వాటి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో శుక్రవారం దేశీయ బులియన్ మార్కెట్‌లో ప్రతి పది గ్రాముల బంగారం ధర రూ. 102లు తగ్గి రూ. 18,355లకు చేరుకుందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2010 | 8:42 am

వైఎస్.జగన్-రోశయ్య మధ్య శాంతి దూతగా ఉండవల్లి

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి కె.రోశయ్యల మధ్య శాంతి దూతగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యవహరించనున్నారు. జగన్-రోశయ్యల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు వీలుగా ఉండవల్లి ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం వ్యవహరించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నేతలు కోరనట్టు సమాచారం.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2010 | 8:36 am

అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటీషన్‌పై చర్యలు వేగవంతం!

పార్లమెంట్ దాడి కేసులో ఉరిశిక్ష పడిన ముద్దాయి అఫ్జల్ గురు దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటీషన్‌పై చర్యలు వేగవంతమయ్యాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తేజీందర్ ఖన్నా తన అభిప్రాయాన్ని కేంద్ర హోంశాఖకు వెల్లడించారు. ఈ పిటీషన్ వ్యవహారంలో తదుపరి చర్య తీసుకునేందుకు వీలుగా ఆయన శుక్రవారం అఫ్జల్ గురు ఫైలును పంపినట్టు న్యూస్ ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2010 | 7:49 am

రాత్రంతా గంతులేసిన అల్లు అర్జున్..!!

ఒకనాటి రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ డాన్స్ వేస్తూనే ఉన్నానని అల్లు అర్జున్ చెప్పాడు. ఎవరికైనా సంతోషమో, అనుకున్న పని జరిగితే తెగ సంబరపడిపోయి ఆనందంతో డాన్స్ చేస్తుంటారు. మరి మీరు అలా ఎప్పుడైనా చేశారా...? అని అల్లు అర్జున్‌ను అడిగితే.. నిర్మొహమాటంగా చెప్పాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jun 2010 | 7:38 am

మిశ్రమ ఫలితాల్లో బాంబే స్టాక్ మార్కెట్

వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప పాటి ఒడిదుడుకులకు గురవుతోంది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ మార్కెట్, ఉదయం 11.45 గంటల ప్రాంతంలో మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంది. దీంతో సెన్సెక్స్ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 17,032 పాయింట్ల మార్కును తాకింది. అయితే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ మాత్రం నాలుగు పాయింట్ల స్వల్ప నష్టంతో, 5,105 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2010 | 7:35 am

తెదేపా అధినేత బాబుపై అలిగిన టీడీపీ నేతలు!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. రాజ్యసభ టిక్కెట్లను ఆశించి భంగపడిన వారంతా చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వారిలో కంభంపాటి రామమోహన్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి నేతలు కూడా ఉన్నారు.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2010 | 7:23 am

రాజ్యసభ సీట్లను అమ్ముకున్న బాబు: తెదేపా నేతలు

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో ముసలం ఆరంభమైంది. రాజ్యసభ సీట్లను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డబ్బులకు అమ్ముకున్నారని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. తెదేపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కృష్ణ బాబు, కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య, మరో నేత కాట్రగడ్డ బాబు వంటి వారు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2010 | 7:08 am

నేను అడగాలేదు.. వాళ్లు ఇవ్వాలేదు: ధర్మపురి శ్రీనివాస్

తనకు రాజ్యసభ సీటును కేటాయించాలని పార్టీ అధిష్టానాన్ని కోరలేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో అధిష్టానం మొండిచేయి చూపిందన్ని మీడియా ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానం ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2010 | 3:52 am

రాజ్యసభ ఎన్నికలు: అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

త్వరలో దేశ వ్యాప్తంగా జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆరుగురు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటించింది. వీరిలో కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి అంబికా సోనీ ఉన్నారు. ఈమెను తిరిగి పంజాబ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది.
Source: జాతీయ | 4 Jun 2010 | 3:16 am

వైఎస్.జగన్-రోశయ్య మధ్య శాంతి దూతగా ఉండవల్లి

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి కె.రోశయ్యల మధ్య శాంతి దూతగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యవహరించనున్నారు. జగన్-రోశయ్యల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు వీలుగా ఉండవల్లి ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం వ్యవహరించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నేతలు కోరనట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2010 | 3:06 am

అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటీషన్‌పై చర్యలు వేగవంతం!

పార్లమెంట్ దాడి కేసులో ఉరిశిక్ష పడిన ముద్దాయి అఫ్జల్ గురు దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటీషన్‌పై చర్యలు వేగవంతమయ్యాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తేజీందర్ ఖన్నా తన అభిప్రాయాన్ని కేంద్ర హోంశాఖకు వెల్లడించారు. ఈ పిటీషన్ వ్యవహారంలో తదుపరి చర్య తీసుకునేందుకు వీలుగా ఆయన శుక్రవారం అఫ్జల్ గురు ఫైలును పంపినట్టు న్యూస్ ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 4 Jun 2010 | 2:19 am

తెదేపా అధినేత బాబుపై అలిగిన టీడీపీ నేతలు!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. రాజ్యసభ టిక్కెట్లను ఆశించి భంగపడిన వారంతా చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వారిలో కంభంపాటి రామమోహన్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి నేతలు కూడా ఉన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2010 | 2:09 am

రాజ్యసభ సీట్లను అమ్ముకున్న బాబు: తెదేపా నేతలు

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో ముసలం ఆరంభమైంది. రాజ్యసభ సీట్లను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డబ్బులకు అమ్ముకున్నారని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. తెదేపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కృష్ణ బాబు, కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య, మరో నేత కాట్రగడ్డ బాబు వంటి వారు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2010 | 1:53 am

ప్రయోగాలు వద్దు.. సిట్టింగ్‌లే ముద్దు: కాంగ్రెస్ తీరిది!

రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రకటించాయి. ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా నిరంతరం మీడియాలో నలుగుతున్న వారిని పక్కన పెట్టి అనూహ్యంగా కొత్తవారికి చోటు కల్పించింది. అదే కాంగ్రెస్ విషయానికి వస్తే.. కొత్తవారికి అవకాశం ఇవ్వకుండా.. సిట్టింగ్‌లకే పెద్దపీట వేసింది. రాజ్యసభ సీటుపై ఎన్నో రకాల ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి రేణుకా చౌదరికి, ప్రముఖ వార్తా పత్రిక ఎండీ గిరీష్ సింఘీకి కాంగ్రెస్ మొండి చేయి చూపింది.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2010 | 12:23 am

మరణశిక్షపై హైకోర్టులో అప్పీలు చేయనున్న కసబ్!

ముంబై మారణ హోమం కేసులో ప్రధాన నిందితుడు అజ్మల్ అమీర్ కసబ్, తనపై కోర్టు విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ హైకోర్టుకు అప్పీలు చేయనున్నాడు. ముంబై పేలుళ్ల కేసులో కీలక పాత్ర పోషించినట్లు రుజువు కావడంతో ప్రత్యేక కోర్టు మే ఆరో తేదీన కసబ్‌కు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. కసబ్ హైకోర్టులో అప్పీలు చేసుకోనున్నాడు.
Source: జాతీయ | 3 Jun 2010 | 11:59 pm

ముంబైలో తప్పిన ఘోర విమాన ప్రమాదం

ముంబై విమానాశ్రయంలో కింగ్‌ఫిషర్‌కు చెందిన విమానం రన్‌వేపై ల్యాండ్‌ అవబోతుండగా అక్కడ అప్పటికే స్పైస్‌ జెట్‌కు చెందిన మరో విమానం ఉన్నట్లు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ హెచ్చరించడంతో కింగ్‌ఫిషర్‌‌‍‌కు చెందిన విమాన పైలెట్ అప్రమత్తమయ్యాడు. దీంతో పైలెట్‌ టేకాఫ్‌ తీసుకుని మరో రన్‌వేపై దిగటంతో అందులోనున్న 400 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.
Source: జాతీయ | 3 Jun 2010 | 10:18 pm

అసెంబ్లీ ఎన్నికలు ముందే జరపాలిః మమతా

కోలకతా మున్సిపల్‌ ఎన్నికల్లో విజయాన్ని చేజిక్కించుకున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, కేంద్ర రైల్వేశాఖ మంత్రి మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలను బీహార్‌తో పాటు అక్టోబర్‌లో నిర్వహించాలని గురువారం స్థానిక ఎన్నికల కమీషన్‌ను కోరారు.
Source: జాతీయ | 3 Jun 2010 | 10:17 pm

అనుష్కకు శింబు డైమండ్ నెక్లెస్ గిఫ్ట్.. ఆపై...

తమిళ నటుడు, నయనతార మాజీప్రియుడు శింబు ఇప్పుడు అనుష్క వెంట బడుతున్నాడని కోలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూస్తోంది. శింబు మనసు తెలుసుకున్న అనుష్క కూడా అతడిని చూసి తనకే తెలిసిన ఓ మెత్తనైన మత్తు నవ్వి నవ్విందట. ఇక ఆ తర్వాత ఏమైందీ అని చూస్తే... ఇటీవలే శింబు ఖరీదైన ఓ డైమండ్ నెక్లెస్‌ను అనుష్కకు బహూకరించాడట. దానికి తోడు అనుష్క శింబు ఇంటికి కూడా వెళ్లిందట. అక్కడ శింబు తల్లి ఆమెను సాదరంగా ఆహ్వానించి మనస్పూర్తిగా ఆశీర్వదించినట్లు సమాచారం. ఈ సంగతిని శింబు స్వయంగా ఓ బార్‌లో మందుకొడుతూ అనుష్కతో తనకు గల సాన్నిహిత్యాన్ని వివరించడమే కాక త్వరలో ఆమెను పెండ్లి చేసుకుంటానని చెప్పినట్లు అతడి సన్నిహితులు చెపుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Jun 2010 | 12:29 pm

"మంచు"ను మింగేసిన "అల్లు": మనోజ్ కుయ్యో మొర్రో..!!

రాధాకృష్ణ (క్రిష్) "గమ్యం" తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం "వేదం". మంచు మనోజ్, అల్లు అర్జున్, అనుష్క నటిస్తున్నారు. ఈ చిత్రం మల్లీస్టారర్ చిత్రమని ప్రకటించారు. అయితే అదే కొంప ముంచింది. మల్టీస్టారర్ చిత్రమంటే ఇద్దరికీ సమాన న్యాయం చేయాలి. లేదంటే తేడాలు వస్తుంటాయని అగ్రహీరోలు చాలా ఇంటర్వ్యూలలో సెలవిచ్చారు. తాజాగా మంచు మనోజ్, వేదంలో తన పాత్రకు న్యాయం జరగలేదని రుసరుసలాడుతున్నాడట. ఇదే విషయంపై దర్శకుడిపై ధ్వజమెత్తారు. తనకు కథ చెప్పినపుడు 20 సన్నివేశాలు, రెండు పాటలు ఉంటాయని అన్నాడనీ, కానీ సినిమా పూర్తయ్యాక చూసుకుంటే 11 సీన్లు, ఒక్కపాట మాత్రమే తీశారని ధ్వజమెత్తుతున్నాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Jun 2010 | 9:45 am

చిరంజీవి హోం మినిస్టర్.. కాదు కాదు విద్యాశాఖా మంత్రి...

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజారాజ్యం పార్టీ మద్దతు పలికిన దగ్గర్నుంచీ ఆ పార్టీపై రకరకాల ఊహాగానాలు తిరుగాడుతున్నాయి. రాజ్యసభ ఎన్నికలు, అసెంబ్లీ ఉపఎన్నికల అనంతరం ప్రజారాజ్యం పార్టీలోని ఇద్దరు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవులను కట్టబెడుతుందన్న వార్తలు వినబడుతున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 3 Jun 2010 | 9:39 am

హైకమాండ్‌పై వైఎస్ జగన్ ఫ్యామిలీ సెంటిమెంట్ బాణం

ఓదార్పు యాత్ర విషయంలో అధిష్టానం ఆగ్రహానికి గురైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకమాండ్‌పై ఆఖరుగా మరో శక్తివంతమైన ఫ్యామిలీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించనున్నారు. తన తల్లి, సోదరిలతో కలసి అధినేత్రి సోనియాగాంధీని ప్రసన్నం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jun 2010 | 8:06 am

బ్రాందేయవాదిగా ముఖ్యమంత్రి: దాడి వీరభద్ర రావు

వేషధారణలో గాంధేయవాదిగావున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య బ్రాందేయవాదిగా మారిపోయారని తెలుగుదేశం పార్టీ అగ్రనేత దాడి వీరభద్రరావు వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jun 2010 | 8:06 am

జైల్లో వేసినా.. మావోలకు మద్దతిస్తా..!: అరుంధతి రాయ్

దేశానికి పెను సవాలుగా పరిణమించిన మావోయిస్టులకు ప్రముఖ రచయిత అరుంధతి రాయ్ మద్దతిస్తానని ప్రకటించారు. తనను జైలులో వేసినప్పటికీ మావోయిస్టుల ఆయుధ పోరాటానికి పూర్తి మద్దతిస్తున్నట్లు రాయ్ ఉద్ఘాటించారు.
Source: జాతీయ | 3 Jun 2010 | 7:44 am

నా స్థానంలో వేరొకరుంటే ఆత్మహత్య చేసుకునేవారే..!: పూరీ

"జీవితాన్ని జీవితంగా చూడాలి. సినిమా భాషలో చెప్పాలంటే.. జామ్‌చేసి చూడకూడదు. వైడ్‌లోనే చూడాలి. అప్పుడే అందంగా ఉంటుంది.." అని అనుభవపూర్వకంగా చెబుతున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. గత మూడేళ్ళుగా ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నానని, ప్రస్తుతం గోలిమార్ చిత్రం విజయంతో కాస్త ఊపిరిపీల్చుకున్నానంటున్నారు. ఈ సందర్భంగా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..ప్రశ్న: గోలిమార్ ఎంతరేంజ్‌లో హిట్ అయిందనుకుంటున్నారు?జ: రేంజ్ ఇంత అనేది చెప్పలేను. కానీ నాకు మాత్రం పూర్తి సంతృప్తికరంగా ఉంది. ప్రశ్న: ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారనే టాక్ ఉంది. ఏమైనా కోలుకున్నారా?జ: ఆర్థికంగా చాలా దెబ్బతిన్నా. నా స్థానంలో వేరే ఒకరు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారే. ఎన్నివిధాలా మైండ్‌ను కంట్రోల్ చేసుకుని అవన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చా. చాలామటుకు సమస్యలు తీరిపోయాయి. ఇప్పడు చాలా హ్యాపీ.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Jun 2010 | 7:12 am

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌కు రెండో స్థానం..!

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత దేశం రెండో స్థానంలో ఉందని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలవడం మనకందరికీ గొప్ప గౌరవమని చిదంబరం వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 3 Jun 2010 | 6:10 am

"రాజ్యసభ" చక్రం తిప్పుతున్నది బాబు కాదు.. లోకేష్?!

జూనియర్ ఎన్టీఆర్ - బాలయ్యల మాటలను చివరికి చంద్రబాబు నాయుడు ఆలకించినట్లే కనబడుతున్నారు. కుర్రాళ్లకు, మహిళలకు ప్రాధాన్యమివ్వు మావయ్యా... అని జూనియర్ ఎన్టీఆర్ నోరు తెరిచి అడిగినందుకో ఏమోగానీ తెలుగుదేశం తరపున బరిలోకి దిగుతున్న రాజ్యసభ అభ్యర్థుల ఎంపికను యువకుడైన నారా లోకేష్‌కు చంద్రబాబు అప్పగించారని సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 3 Jun 2010 | 5:08 am

రుచికా హత్య కేసు: రాథోర్ బెయిల్‌పై విచారణ వాయిదా!

రుచికా అత్యాచార కేసులో కీలక నిందితుడు, హర్యానా మాజీ డీజీపీ రాథోర్ బెయిల్ అప్పీలుపై విచారణను కోర్టు వాయిదా వేసింది. 1990 ఆగస్టులో 18 ఏళ్ల బాలిక రుచిక గిర్హోత్ర అనే మైనరు బాలిక మీద రాథోడ్‌ అత్యాచారానికి పాల్పడిన అభియోగం కోర్టులో రుజువైంది. ఈ కేసులో ఎస్‌పిఎస్‌ రాథోడ్‌కు ఏడాడిన్నర జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
Source: జాతీయ | 3 Jun 2010 | 4:36 am

"మంచు"ను మింగేసిన "అల్లు": మనోజ్ కుయ్యో మొర్రో..!!

రాధాకృష్ణ (క్రిష్) "గమ్యం" తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం "వేదం". మంచు మనోజ్, అల్లు అర్జున్, అనుష్క నటిస్తున్నారు. ఈ చిత్రం మల్లీస్టారర్ చిత్రమని ప్రకటించారు. అయితే అదే కొంప ముంచింది. మల్టీస్టారర్ చిత్రమంటే ఇద్దరికీ సమాన న్యాయం చేయాలి. లేదంటే తేడాలు వస్తుంటాయని అగ్రహీరోలు చాలా ఇంటర్వ్యూలలో సెలవిచ్చారు. తాజాగా మంచు మనోజ్, వేదంలో తన పాత్రకు న్యాయం జరగలేదని రుసరుసలాడుతున్నాడట. ఇదే విషయంపై దర్శకుడిపై ధ్వజమెత్తారు. తనకు కథ చెప్పినపుడు 20 సన్నివేశాలు, రెండు పాటలు ఉంటాయని అన్నాడనీ, కానీ సినిమా పూర్తయ్యాక చూసుకుంటే 11 సీన్లు, ఒక్కపాట మాత్రమే తీశారని ధ్వజమెత్తుతున్నాడు.
Source: వినోదం | 3 Jun 2010 | 4:17 am

నేను రాజీనామా చేస్తానంటే చేయమనడానికి ఆయనెవరు..?!!

హైదరాబాద్ మేయర్ కార్తీకరెడ్డిపై సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, నటీమణి జయసుధ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ వార్డు కమిటీ ఎన్నికల్లో మేయర్ భర్త జోక్యం చేసుకోవడంపై జయసుధ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను సూచించిన పేర్లు వార్డు కమిటీల్లో లేకుంటే పదవికి రాజీనామా చేస్తానని ఆమె హెచ్చరించారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jun 2010 | 3:43 am

తాత్కాలిక ఉద్యోగులను పర్మనెంట్ చేసిన కరుణానిధి

తమిళనాడు ముఖ్యమంత్రి, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత కరుణానిధి గురువారం 87వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ శాఖలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Source: జాతీయ | 3 Jun 2010 | 3:38 am