ఓరాక్జాయీలో హతమైన 30మంది ఉగ్రవాదులు

పాకిస్థాన్‌లోని వాయువ్యప్రాంతంలోనున్న కబాయిలీ క్షేత్రం ఓరాక్జాయీలో బుధవారం రాత్రి యుద్ధ హెలికాప్టర్ల సహాయంతో 30 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పాక్ భద్రతా బలగాలు గురువారం వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 3 Jun 2010 | 9:25 am

తాత్కాలిక ఉద్యోగులను పర్మనెంట్ చేసిన కరుణానిధి

తమిళనాడు ముఖ్యమంత్రి, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత కరుణానిధి గురువారం 87వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ శాఖలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Source: Yahoo! Telugu: News | 3 Jun 2010 | 9:07 am

టీడీఎస్ నియమాల్లో మార్పులుః సిబిడిటి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టీడీఎస్ సర్టిఫికేట్, టీడీఎస్ రిటర్న్ నియమాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) మార్పులు చేసినట్లు గురువారం న్యూ ఢిల్లీలో ప్రకటించింది. తమ శాఖ మార్పులు చేసిన నియమాలు ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెల నుంచే అమలులోకి వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 3 Jun 2010 | 8:47 am

నేను రాజీనామా చేస్తానంటే చేయమనడానికి ఆయనెవరు..?!!

హైదరాబాద్ మేయర్ కార్తీకరెడ్డిపై సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, నటీమణి జయసుధ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ వార్డు కమిటీ ఎన్నికల్లో మేయర్ భర్త జోక్యం చేసుకోవడంపై జయసుధ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను సూచించిన పేర్లు వార్డు కమిటీల్లో లేకుంటే పదవికి రాజీనామా చేస్తానని ఆమె హెచ్చరించారు.
Source: Yahoo! Telugu: News | 3 Jun 2010 | 8:47 am

స్టాక్ మార్కెట్: 17వేల మార్కును తాకిన సెన్సెక్స్!

బాంబే స్టాక్ మార్కెట్‌ లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 273 పాయింట్లు భారీగా లాభపడింది. దీంతో సెన్సెక్స్ సూచి 17,015 మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 89 పాయింట్లు బలపడి, 5,109 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 3 Jun 2010 | 8:28 am

అణ్వాయుధాల సంఖ్యను పెంచే దేశాల్లో "పాక్" నెంబర్ వన్..!

అణ్వాయుధాల సంఖ్యను పెంచుకునే దేశాల్లో పాకిస్థాన్ నెంబర్ వన్ అని పరిశోధనలో తేలింది. స్వీడెన్ దేశానికి చెందిన స్టాక్‌హోమ్ అంతర్జాతీయ పరిశోధన కేంద్రం నిర్వహించిన సర్వేలో, భారత్ కలిగివున్న అణ్వాయుధాల కంటే పాకిస్థాన్ అణ్వాయుధాల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉందని తెలిసింది.
Source: Yahoo! Telugu: News | 3 Jun 2010 | 7:47 am

ఎగుమతుల్లో 15 శాతం వృద్ధిః ఆనంద్ శర్మ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఉత్పత్తుల ఎగుమతుల్లో 15 శాతం వృద్ధి చెందవచ్చని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి ఆనంద్ శర్మ గురువారం ముంబైలో వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 3 Jun 2010 | 7:13 am

నా స్థానంలో వేరొకరుంటే ఆత్మహత్య చేసుకునేవారే..!: పూరీ

"జీవితాన్ని జీవితంగా చూడాలి. సినిమా భాషలో చెప్పాలంటే.. జామ్‌చేసి చూడకూడదు. వైడ్‌లోనే చూడాలి. అప్పుడే అందంగా ఉంటుంది.." అని అనుభవపూర్వకంగా చెబుతున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. గత మూడేళ్ళుగా ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నానని, ప్రస్తుతం గోలిమార్ చిత్రం విజయంతో కాస్త ఊపిరిపీల్చుకున్నానంటున్నారు. ఈ సందర్భంగా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..ప్రశ్న: గోలిమార్ ఎంతరేంజ్‌లో హిట్ అయిందనుకుంటున్నారు?జ: రేంజ్ ఇంత అనేది చెప్పలేను. కానీ నాకు మాత్రం పూర్తి సంతృప్తికరంగా ఉంది. ప్రశ్న: ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారనే టాక్ ఉంది. ఏమైనా కోలుకున్నారా?జ: ఆర్థికంగా చాలా దెబ్బతిన్నా. నా స్థానంలో వేరే ఒకరు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారే. ఎన్నివిధాలా మైండ్‌ను కంట్రోల్ చేసుకుని అవన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చా. చాలామటుకు సమస్యలు తీరిపోయాయి. ఇప్పడు చాలా హ్యాపీ.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Jun 2010 | 7:12 am

తీవ్రవాదాన్ని అరికట్టడంలో భారత్-అమెరికాల పనీతీరు భేష్!

తీవ్రవాదంపై ఉక్కపాదం మోపేందుకు భారత్-అమెరికాలు పూర్తి మద్దతు తగిన చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.ఎమ్. కృష్ణ అన్నారు. ఇరు దేశాలు పూర్తి మద్దతుతో ఉగ్రవాద చర్యలను అరికట్టడంలో ముందడుగు వేస్తున్నాయని కృష్ణ స్పష్టం చేశారు. తీవ్రవాదాన్ని అరికట్టడం, అంతర్జాతీయ అణుశక్తి భద్రత వంటి పలు అంశాలపై భారత్-అమెరికాలు సన్నిహిత సహకారం అందిపుచ్చుకుంటున్నాయని ఎస్.ఎమ్. కృష్ణ వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 3 Jun 2010 | 6:48 am

లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 310 పాయింట్ల వృద్ధి!

బాంబే స్టాక్ మార్కెట్ గురువారం లాభాలతో పుంజుకుంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, ఉదయం 11.45 గంటల ప్రాంతంలో 310 పాయింట్లు లాభపడి, 17,052 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 98 పాయింట్లు వృద్ధి చెంది, 5,118 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 3 Jun 2010 | 6:28 am

16.55 శాతానికి చేరుకున్న ఆహార ద్రవ్యోల్బణం

దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో మే 22తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం 0.32శాతం పెరిగి 16.55 శాతానికి చేరుకుంది. అదే అంతకమునుపటి వారాంతం(మే 15) ఆహార ద్రవ్యోల్బణం 16.23 శాతంగా ఉండింది.
Source: Yahoo! Telugu: News | 3 Jun 2010 | 6:26 am

నేను రాజీనామా చేస్తానంటే చేయమనడానికి ఆయనెవరు..?!!

హైదరాబాద్ మేయర్ కార్తీకరెడ్డిపై సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, నటీమణి జయసుధ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ వార్డు కమిటీ ఎన్నికల్లో మేయర్ భర్త జోక్యం చేసుకోవడంపై జయసుధ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను సూచించిన పేర్లు వార్డు కమిటీల్లో లేకుంటే పదవికి రాజీనామా చేస్తానని ఆమె హెచ్చరించారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jun 2010 | 3:43 am

తాత్కాలిక ఉద్యోగులను పర్మనెంట్ చేసిన కరుణానిధి

తమిళనాడు ముఖ్యమంత్రి, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత కరుణానిధి గురువారం 87వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ శాఖలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Source: జాతీయ | 3 Jun 2010 | 3:38 am

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న వై.ఎస్. జగన్మోహన రెడ్డి ..!?

మహబూబాబాద్ ఉదంతంతో కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న దివంగత మహానేత, వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు, కడప ఎంపీ, జగన్మోహన రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వరంగల్ ఓదార్పు యాత్రకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయలేదని, అధిష్టానం సైతం పట్టించుకోకపోవడంతో జగన్ బీజేపీలో చేరే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
Source: ఏపీ న్యూస్ | 3 Jun 2010 | 12:54 am

హైకమాండ్‌పై జగన్ ఫ్యామిలీ సెంటిమెంట్ బాణం

ఓదార్పు యాత్ర విషయంలో అధిష్టానం ఆగ్రహానికి గురైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకమాండ్‌పై ఆఖరుగా మరో శక్తివంతమైన ఫ్యామిలీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించనున్నారు. తన తల్లి, సోదరిలతో కలసి అధినేత్రి సోనియాగాంధీని ప్రసన్నం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jun 2010 | 12:52 am

డబ్బులిచ్చిన చౌదరికి రాజ్యసభ టిక్కెట్టా..?: హరీష్ రావు

ఎన్నికల్లో డబ్బులిచ్చిన కారణంగా సీమాంధ్రకు చెందిన సుజనా చౌదరికి రాజ్యసభ టిక్కెట్ ఇవ్వడం సరికాదని మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఇప్పటికే సీమాంధ్రకు చెందిన హరికృష్ణ, మైసూరారెడ్డిలు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారని హరీష్ రావు గుర్తు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jun 2010 | 11:42 pm

ఢిల్లీలో కమ్ముకున్న ఇసుక తుపాన్: స్తంభించిన ట్రాఫిక్

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఇసుక మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయ్యింది.
Source: జాతీయ | 2 Jun 2010 | 10:51 pm

గుజరాత్‌లో ఫీట్: భారీ వర్షాలతో ఇబ్బందిపడుతున్న ప్రజలు

అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉష్ణ మండల తుపాను ఫీట్ తీవ్రంగా పెరిగింది. ఇది ఆగ్నేయ దిశగా కదులుతూ కచ్ జిల్లా నాలియాకు వాయువ్యంగా వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖాధికారులు తెలిపారు.
Source: జాతీయ | 2 Jun 2010 | 10:23 pm

జగదీశ్‌, అనిల్‌ శర్మలకు ఉద్వాసన పలకిన అధిష్టానం

బీహార్ రాష్ట్రంలో రానున్న రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచేందుకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ జగదీశ్‌, అనిల్‌ శర్మకు ఉద్వాసన పలికారు.
Source: జాతీయ | 2 Jun 2010 | 9:59 pm

అర్జున్ పాకీవాడుగా నటిస్తే అది బయట కూడా చేయిస్తారా...?

వేదంలో అల్లు అర్జున్ కేబుల్ రాజా పాత్ర పోషించాడు. ఆ చిత్రంలో తన పాత్ర ఎలా ఉంటుందో ప్రేక్షకులకు, అభిమానులకు తెలియజేయాలని జూబ్లిహిల్స్‌లోని ఓ మాస్ ఏరియాను ఎన్నుకుని (అక్కడ చిరు అభిమానులు ఎక్కువ) ఓ స్తంభానికి నిచ్చెన వేసి పైకి ఎక్కి కేబుల్ వైర్లు వేసి ఇంటిలోకి కనెక్షన్ వచ్చిందో లేదో అనే తంతును బుధవారం ఏర్పాటు చేశారు. దీనిని కవర్ చేసేందుకు పొలోమంటూ... కెమేరాలు వేసుకుని ఎలక్ట్రానిక్ మీడియా వెళ్లింది. అయితే... అక్కడ అందరూ అభిమానులే ఉండాలన్న రూలేమీ లేదు కదా... వీరి రాకతో కాస్త హడావిడి జరిగి పక్కనే ఉన్న కొన్ని ఇళ్లపై జనాలు ఎక్కి ఇంటి రేకుల్ని పచ్చడిపచ్చడిగా తొక్కి పడిపోయేలా చేశారు. దీంతో ఆ ఇంటి యజమాని కోపంతో ఊగిపోతూ... నానా తిట్లు తిట్టడమే కాక... అల్లు అర్జున్ పాకీవాడుగా నటిస్తే.. ఆ పనిని కూడా బయట చేయించి షూట్ చేస్తారా..? అంటూ విరుచుక పడ్డాడు. ఇదేదో రాద్దాంతం అయ్యేట్లుగా ఉందని అక్కడ మీడియానే కాస్త క్షమించమని వేడుకుంది. వారికి తగిన పరిహారం ఇచ్చేలా చూస్తానని ఓ అభిమాని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jun 2010 | 12:11 pm

బాలయ్య - ఎన్టీఆర్ మాటలను పట్టించుకోని బాబు

రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో అటు పాలకపార్టీ ఇటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశ పార్టీలలో హడావుడి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జైరామ్ రమేష్, జేడీ శీలం పేర్లను దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. మరో ఇద్దరి ఎంపికపై కసరత్తు జరుగుతోంది.
Source: ఏపీ న్యూస్ | 2 Jun 2010 | 9:08 am

పాములా పాకుతావో..? కప్పలా గెంతుతావో..? మాకెందుకు...?!!

త్వరలో విడుదల కాబోతున్న "హిస్‌స్" చిత్రం కోసం పాములను శరీరంపై వేసుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతున్న నాగిని మల్లికా శరావత్‌పై ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కొరడా ఝుళిపించింది. ఓ హిందీ చిత్రంలో నటిస్తానని చెప్పి ఆనక హిస్‌స్ చిత్రానికి అంకితమైపోయిన మల్లికకు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే "మస్కురాడె" చిత్రంలో నటిస్తానని ఒప్పుకుంటూ మల్లికా శరావత్ ఆ చిత్ర నిర్మాత నుంచి 25 లక్షల రూపాయలను తీసుకున్నది. ఆ తర్వాత చెప్పా పెట్టకుండా ఆ ప్రాజెక్టును వదిలేసి నెలల తరబడి హిస్‌స్ చిత్రంలో పాములా నటిస్తూ కాలం గడుపుతోంది. దీంతో చిర్రెత్తిపోయిన దర్శకుడు కుందన్ షా మల్లికా శరావత్‌పై ఫిర్యాదు చేశాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jun 2010 | 9:01 am

జ్ఞానేశ్వరి ప్రమాదం: సీబీఐ విచారణకు కేంద్రం నిర్ణయం!

జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై సమగ్ర విచారణను సీబీఐకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 148 ప్రాణాలను బలిగొన్న ఈ ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ తెలియజేశారు. గత నెల మే 28వ తేదీ పశ్చిమ బెంగాల్, పశ్చిమ మిడ్నాపూర్ జిలాల్లో జ్ఞానేశ్వరీ ఎక్స్‌ప్రెస్ భారీ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 148 మంది ప్రయాణీకులు అక్కడికక్కడే మరణించగా, మరో 200 మంది గాయపడ్డారు.
Source: జాతీయ | 2 Jun 2010 | 7:45 am

కుప్పకూలిన చేతక్ హెలికాప్టర్: పైలెట్ మృతి

అనకాపల్లి సమీపంలోని శారదా నది ఒడ్డున చేతక్ నావికాదళ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ మృతి చెందారు. కాగా నలుగురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. కాగా ఘటనకు కారణం హైటెన్షన్ విద్యుత్ వైర్లేనని తెలియవచ్చింది.
Source: ఏపీ న్యూస్ | 2 Jun 2010 | 7:18 am

బికినీలో నన్ను చూడలేరు: ప్రియా ఆనంద్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "లీడర్" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఎన్నారై భామ ప్రియా ఆనంద్. తెలుగు స్పష్టంగా మాట్లాడగలదు. "రామరామ కృష్ణకృష్ణ"లో నటించింది. అయితే ఇప్పుడిప్పుడే ఎదిగే నటీమణులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెపుతోంది. గ్లామర్ పాత్రలు చేయాల్సి వస్తే తప్పదనీ, అయితే తాను బికినీ వేస్తే చూడ్డానికి బాగోనని మంచి సంప్రదాయ పాత్రల్లో సరిపోతానని అంటోంది. భవిష్యత్‌లో దర్శకత్వం వహిస్తానంటోంది. చిన్నప్పటి నుంచీ మోడలింగ్ అంటే తనకు ఇష్టమని, ఆ మోడలింగ్ రంగం నుంచే సినిమాల్లోకొచ్చాననీ, నటనకన్నా టెక్నికల్ అంశాలపై తనకు ఆసక్తి ఎక్కువని అంటోంది ప్రియా ఆనంద్.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jun 2010 | 6:24 am

స్వర్గీయ వైఎస్సార్ మరో కాటన్ దొర: రోశయ్య

ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేసేందుకు పూనుకున్న మహనీయుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి మరో కాటన్ దొర అని ముఖ్యమంత్రి రోశయ్య కొనియాడారు. బుధవారం చిత్తూరు జిల్లా కలికిరి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... వైఎస్ పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jun 2010 | 6:16 am

పోలీసు రిక్రూట్‌మెంట్ ముమ్మరం చేయండిః చిదంబరం

నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో పోలీసు రిక్రూట్‌మెంట్ ద్వారా మరింతమంది పోలీసు సిబ్బందిని నియమించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి పి. చిదంబరం సూచించారు.
Source: జాతీయ | 2 Jun 2010 | 6:08 am

జులైలో "తకిట తకిట" విడుదల చేస్తాం: భూమిక

భూమికి ప్రధానపాత్రలో ఆమె భర్త భరత్ ఠాకూర్ నిర్మిస్తోన్న చిత్రం తకిటతకిట. ఇందులో ఇవా అనే యూకేకు చెందిన నటి కూడా నటిస్తోంది. శ్రీహరి నాను దర్శకుడు. చిత్రం గురించి భూమిక మాట్లాడుతూ, ఈ చిత్రంలో కథ ప్రకారం 11మంది ప్రధాన తారాగణం ఉన్నారు. ఇది కాలేజీ జీవితానికి సంబంధించిన చిత్రం. ఈ సినిమాలో నేను టీచర్‌గా నటించాను.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jun 2010 | 6:03 am

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: మమతా పార్టీ విజయభేరి!

పశ్చిమ బెంగాల్‌లోని 81 పురపాలక, నగర పాలక స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించింది. అలాగే కోల్‌కతా కార్పొరేషన్ ఎన్నికల్లో తృణమూల్ పార్టీ ముందంజలో నిలిచింది. ఈ ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధిక మెజారిటీతో గెలుపొందింది.
Source: జాతీయ | 2 Jun 2010 | 4:37 am

చిరంజీవి పీఆర్పీకి ఉరి వేసినట్లే: నారాయణ

అవినీతి కాంగ్రెస్‌ను మట్టిగరిపిస్తానంటూ కొత్త పార్టీ స్థాపించిన చిరంజీవి అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఆత్మహత్యాసదృశమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. చిరంజీవి తన చేతల ద్వారా తన పార్టీకి ఉరి వేసి అంతం చేసేందుకు సన్నద్ధులవుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jun 2010 | 4:32 am

పాములా పాకుతావో..? కప్పలా గెంతుతావో..?

త్వరలో విడుదల కాబోతున్న "హిస్‌స్" చిత్రం కోసం పాములను శరీరంపై వేసుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతున్న నాగిని మల్లికా శరావత్‌పై ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కొరడా ఝుళిపించింది. ఓ హిందీ చిత్రంలో నటిస్తానని చెప్పి ఆనక హిస్‌స్ చిత్రానికి అంకితమైపోయిన మల్లికకు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే "మస్కురాడె" చిత్రంలో నటిస్తానని ఒప్పుకుంటూ మల్లికా శరావత్ ఆ చిత్ర నిర్మాత నుంచి 25 లక్షల రూపాయలను తీసుకున్నది. ఆ తర్వాత చెప్పా పెట్టకుండా ఆ ప్రాజెక్టును వదిలేసి నెలల తరబడి హిస్‌స్ చిత్రంలో పాములా నటిస్తూ కాలం గడుపుతోంది. దీంతో చిర్రెత్తిపోయిన దర్శకుడు కుందన్ షా మల్లికా శరావత్‌పై ఫిర్యాదు చేశాడు.
Source: వినోదం | 2 Jun 2010 | 3:32 am

తమిళనాడు సీఎం కరుణతో ముఖ్యమంత్రి రోశయ్య భేటీ!

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్. కరుణానిధితో, సీఎం కె. రోశయ్య సమావేశం కానున్నారు. బుధవారం చిత్తూరు పర్యటన చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య, సాయంత్రం తమిళనాడుకు బయలుదేరుతారు. చెన్నైకి చేరుకున్న తర్వాత కె. రోశయ్య కరుణానిధితో సమావేశమవుతారని ప్రభుత్వ వర్గాల సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 2 Jun 2010 | 3:28 am