ఎల్టీటీఈ అధ్యాయం ముగిసిందని చెప్పలేం..!: రాజపక్సే

ప్రముఖ తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ అధ్యాయం ముగిసినట్లు చెప్పలేమని శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సే తెలిపారు. లంకలో ఎల్టీటీఈ సంస్థకు కార్యకలాపాలకు స్వస్తి పలికినట్లు భావించలేమని రాజపక్సే ఉద్ఘాటించారు. ఇందుకు శ్రీలంక సైనిక సంచారం గల పలాలీ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించడమే నిదర్శనమని రాజపక్సే గుర్తు చేశారు.
Source: Yahoo! Telugu: News | 2 Jun 2010 | 9:29 am

పాములా పాకుతావో..? కప్పలా గెంతుతావో..? మాకెందుకు...?!!

త్వరలో విడుదల కాబోతున్న "హిస్‌స్" చిత్రం కోసం పాములను శరీరంపై వేసుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతున్న నాగిని మల్లికా శరావత్‌పై ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కొరడా ఝుళిపించింది. ఓ హిందీ చిత్రంలో నటిస్తానని చెప్పి ఆనక హిస్‌స్ చిత్రానికి అంకితమైపోయిన మల్లికకు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే "మస్కురాడె" చిత్రంలో నటిస్తానని ఒప్పుకుంటూ మల్లికా శరావత్ ఆ చిత్ర నిర్మాత నుంచి 25 లక్షల రూపాయలను తీసుకున్నది. ఆ తర్వాత చెప్పా పెట్టకుండా ఆ ప్రాజెక్టును వదిలేసి నెలల తరబడి హిస్‌స్ చిత్రంలో పాములా నటిస్తూ కాలం గడుపుతోంది. దీంతో చిర్రెత్తిపోయిన దర్శకుడు కుందన్ షా మల్లికా శరావత్‌పై ఫిర్యాదు చేశాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jun 2010 | 9:01 am

తమిళనాడు సీఎం కరుణతో ముఖ్యమంత్రి రోశయ్య భేటీ!

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్. కరుణానిధితో, సీఎం కె. రోశయ్య సమావేశం కానున్నారు. బుధవారం చిత్తూరు పర్యటన చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య, సాయంత్రం తమిళనాడుకు బయలుదేరుతారు. చెన్నైకి చేరుకున్న తర్వాత కె. రోశయ్య కరుణానిధితో సమావేశమవుతారని ప్రభుత్వ వర్గాల సమాచారం.
Source: Yahoo! Telugu: News | 2 Jun 2010 | 8:57 am

లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి!

బుధవారం బాంబే స్టాక్ మార్కెట్‌కు అన్ని విధాలా కలిసొచ్చింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో 63 పాయింట్లు బలపడి, 16,635 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 27 పాయింట్లు పుంజుకుని, ఐదు వేల మార్కుకు దరిదాపుల్లో (4,997) ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 2 Jun 2010 | 8:43 am

హిల్లరీతో భేటీ కానున్న విదేశాంగ మంత్రి ఎస్.ఎమ్.కృష్ణ!

అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌తో.. కేంద్ర మంత్రి ఎస్.ఎమ్. కృష్ణ భేటీ కానున్నారు. దీనికోసం దేశ విదేశాంగ మంత్రి ఎస్.ఎమ్. కృష్ణ ఇప్పటికే వాషింగ్టన్‌కు చేరుకున్నారు. మంగళవారం రాత్రి వాషింగ్టన్ చేరుకున్న ఎస్.ఎమ్.కృష్ణతో పాటు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్, ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్, శాస్త్ర, సాంకేతిక శాఖమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కేంద్ర విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావులతో కూడిన మంత్రుల బృందం వాషింగ్టన్‌కు చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 2 Jun 2010 | 7:45 am

సానంద్‌లో ప్రారంభమైన నానో కర్మాగారం

ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు లభించే నానో కార్ల కర్మాగారాన్ని గుజరాత్‌లోని సానంద్‌లో టాటా మోటార్స్ సంస్థ బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించింది.
Source: Yahoo! Telugu: News | 2 Jun 2010 | 7:31 am

స్టాక్ మార్కెట్: 96 పాయింట్ల సెన్సెక్స్ వృద్ధి!

బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి పురోగమనం వైపు ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 96 పాయింట్ల వృద్ధితో 16,668 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 29 పాయింట్లు పుంజుకుని 4,999 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 2 Jun 2010 | 7:31 am

విదేశీ స్టాక్ మార్కెట్ల ప్రభావం: లాభాల్లో సెన్సెక్స్!

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 87 పాయింట్ల మేర లాభపడి, 16,659 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 26 పాయింట్లు బలపడి, ఐదువేల దిగువ స్థాయికి (4,996) పడిపోయింది.
Source: Yahoo! Telugu: News | 2 Jun 2010 | 7:13 am

అధిష్టానంతో అమీతుమీకి వైఎస్ జగన్ రె"ఢీ"..?!!

ఢిల్లీ నాయకుల వ్యవహార శైలిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. ఓదార్పు యాత్ర అంశంపై వీరప్ప మొయిలీ తనతో అత్యంత సానుకూలంగా మాట్లాడి ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో ప్లేటు ఫిరాయించారని జగన్ వాపోతున్నట్లు తెలుస్తోంది.
Source: Yahoo! Telugu: News | 2 Jun 2010 | 7:00 am

వాహనాల ధరలను పెంచిన హీరో హోండా

దేశీయ ద్విచక్ర వాహన నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న హీరో హోండా సంస్థ తన ద్విచక్ర వాహనాల ధరలను దాదాపు రూ. 1,000ల మేరకు పెంచినట్లు సంస్థ న్యూ ఢిల్లీలో బుధవారం ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 2 Jun 2010 | 6:55 am

పాస్‌పోర్ట్ జప్తుపై కర్ణాటక హైకోర్టులో నిత్యానంద పిటిషన్!

భక్తిముసుగులో రాసలీలలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద కర్ణాటక హైకోర్టులో కేసు పెట్టారు. పాస్‌పోర్ట్, బ్యాంక్ బాలెన్స్ జప్తును సవాలు చేస్తూ, కర్ణాటకలోని రామ్‌నగర్ కోర్టులో నిత్యానంద పిటిషన్ దాఖలు చేశారు. అత్యాచారంతో పాటు క్రిమినల్‌ నేరాల క్రింద అరెస్టయిన నిత్యానంద ఎఫ్‌ఐఆర్‌ నమోదయినందుకే తన పాస్‌పోర్టు స్వాధీనం చేసుకోవడం సరి కాదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 2 Jun 2010 | 6:54 am

బికినీలో నన్ను చూడలేరు: ప్రియా ఆనంద్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "లీడర్" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఎన్నారై భామ ప్రియా ఆనంద్. తెలుగు స్పష్టంగా మాట్లాడగలదు. "రామరామ కృష్ణకృష్ణ"లో నటించింది. అయితే ఇప్పుడిప్పుడే ఎదిగే నటీమణులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెపుతోంది. గ్లామర్ పాత్రలు చేయాల్సి వస్తే తప్పదనీ, అయితే తాను బికినీ వేస్తే చూడ్డానికి బాగోనని మంచి సంప్రదాయ పాత్రల్లో సరిపోతానని అంటోంది. భవిష్యత్‌లో దర్శకత్వం వహిస్తానంటోంది. చిన్నప్పటి నుంచీ మోడలింగ్ అంటే తనకు ఇష్టమని, ఆ మోడలింగ్ రంగం నుంచే సినిమాల్లోకొచ్చాననీ, నటనకన్నా టెక్నికల్ అంశాలపై తనకు ఆసక్తి ఎక్కువని అంటోంది ప్రియా ఆనంద్.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jun 2010 | 6:24 am

జులైలో "తకిట తకిట" విడుదల చేస్తాం: భూమిక

భూమికి ప్రధానపాత్రలో ఆమె భర్త భరత్ ఠాకూర్ నిర్మిస్తోన్న చిత్రం తకిటతకిట. ఇందులో ఇవా అనే యూకేకు చెందిన నటి కూడా నటిస్తోంది. శ్రీహరి నాను దర్శకుడు. చిత్రం గురించి భూమిక మాట్లాడుతూ, ఈ చిత్రంలో కథ ప్రకారం 11మంది ప్రధాన తారాగణం ఉన్నారు. ఇది కాలేజీ జీవితానికి సంబంధించిన చిత్రం. ఈ సినిమాలో నేను టీచర్‌గా నటించాను.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jun 2010 | 6:03 am

తమిళనాడు సీఎం కరుణతో ముఖ్యమంత్రి రోశయ్య భేటీ!

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్. కరుణానిధితో, సీఎం కె. రోశయ్య సమావేశం కానున్నారు. బుధవారం చిత్తూరు పర్యటన చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య, సాయంత్రం తమిళనాడుకు బయలుదేరుతారు. చెన్నైకి చేరుకున్న తర్వాత కె. రోశయ్య కరుణానిధితో సమావేశమవుతారని ప్రభుత్వ వర్గాల సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 2 Jun 2010 | 3:28 am

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదు: ముఖ్యమంత్రి

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. ప్రస్తుతమున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం తప్పనిస్తే, ఆ పథకాలకు మరిన్ని నిధులను కేటాయించడం కుదరదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కానీ సంక్షేమ పథకాలు అమలు కొనసాగుతుందని సీఎం తేల్చి చెప్పారు. ఇంకా పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామని సీఎం వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jun 2010 | 1:41 am

అధిష్టానంతో అమీతుమీకి వైఎస్ జగన్ రె"ఢీ"..?!!

ఢిల్లీ నాయకుల వ్యవహార శైలిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. ఓదార్పు యాత్ర అంశంపై వీరప్ప మొయిలీ తనతో అత్యంత సానుకూలంగా మాట్లాడి ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో ప్లేటు ఫిరాయించారని జగన్ వాపోతున్నట్లు తెలుస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 2 Jun 2010 | 1:31 am

పాస్‌పోర్ట్ జప్తుపై కర్ణాటక హైకోర్టులో నిత్యానంద పిటిషన్!

భక్తిముసుగులో రాసలీలలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద కర్ణాటక హైకోర్టులో కేసు పెట్టారు. పాస్‌పోర్ట్, బ్యాంక్ బాలెన్స్ జప్తును సవాలు చేస్తూ, కర్ణాటకలోని రామ్‌నగర్ కోర్టులో నిత్యానంద పిటిషన్ దాఖలు చేశారు. అత్యాచారంతో పాటు క్రిమినల్‌ నేరాల క్రింద అరెస్టయిన నిత్యానంద ఎఫ్‌ఐఆర్‌ నమోదయినందుకే తన పాస్‌పోర్టు స్వాధీనం చేసుకోవడం సరి కాదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Source: జాతీయ | 2 Jun 2010 | 1:25 am

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: మమతా పార్టీ విజయభేరి!

పశ్చిమ బెంగాల్‌లోని 81 పురపాలక, నగర పాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించింది. ఈ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధిక మెజారిటీతో గెలుపొందింది. కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల మధ్య నువ్వా? నేనా? అంటూ సాగిన ఈ ఎన్నికల పోటీలో తృణమూల్ పార్టీమే విజయం వరించింది.
Source: జాతీయ | 2 Jun 2010 | 12:32 am

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అబద్ధాలకోరా...?!!

తాను చెప్పని మాటను చెప్పినట్లుగా మీడియా ముందు ప్రకటించడంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ కడప ఎంపీ జగన్ మోహన్ రెడ్డిపై గరంగరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుని విషయంలో మీడియా ముందు వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఇంతవరకూ మొయిలీకి ఎదురు కాలేదని ఆయన సన్నిహితులు అంటున్నారు.
Source: ఏపీ న్యూస్ | 1 Jun 2010 | 11:55 pm

కోల్‌కతా మున్సిపల్ ఎన్నికలు: తృణమూల్ ఆధిక్యం!

కోల్‌కతా నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 141 స్థానాలకు గాను మెజారిటీ స్థానాల్లో తృణమూల్ ఆధిక్యంలో ఉందని తెలిసింది. ఇప్పటివరకు జరిగిన లెక్కించిన ఓట్లను బట్టి తృణమూల్ ముందంజలో ఉన్నట్లు సమాచారం.
Source: జాతీయ | 1 Jun 2010 | 11:33 pm

"ఓదార్పు" పై స్పందించాల్సిన అవసరం లేదు: పురంధరేశ్వరి

దివంగత మహానేత, వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు, కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డి ఓదార్పు యాత్రపై స్పందించాల్సిన అవసరం లేదని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు.వైఎస్సార్ మరణంతో హఠాన్మరణం చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర తన వ్యక్తిగతమని జగన్ చెబుతున్నప్పుడు ఆ యాత్రపై స్పందించాల్సిన అవసరం ఏముందని పురంధరేశ్వరి ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 1 Jun 2010 | 11:24 pm

ఎన్ఏసీలో స్థానం పొందిన మేధావులు, శాస్త్రవేత్తలు

సోనియా గాంధీ అధ్యక్షతన జాతీయ సలహా మండలి(ఎన్‌ఏసీ)కి 14 మంది సభ్యులను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నియమించారు. ఈ సలహా మండలిలో ప్రఖ్యాత శాస్తవ్రేత్తలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు ఉన్నారు
Source: జాతీయ | 1 Jun 2010 | 10:22 pm

మాంద్యంలోను ప్రభుత్వాన్ని నడిపాం : మన్మోహన్

యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా 68 పేజీల ప్రగతి నివేదిక - 2009-10ను యూపీఏ అధినేత్రి సోనియా గాంధీతో కలిసి ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంలోను తాము ప్రభుత్వాన్ని నడిపామన్నారు.
Source: జాతీయ | 1 Jun 2010 | 9:45 pm

యూ ట్యూబ్‌లో బిపాసా బసు టాప్‌లెస్

వివేక్ ఒబెరాయ్, బిపాసాలపై చిత్రీకరించిన ఓ ప్రకటనలో బిపాసాబసు టాప్‌లెస్‌గా కనిపించిందట. ప్రస్తుతం బిపాసా టాప్‌లెస్ దృశ్యాలు యూ ట్యూబ్‌లో దర్శనమిస్తున్నాయి. దీంతో సైబర్ కేఫ్‌లో బిపాసా ప్రియులు ఎగబడుతున్నారట.కాగా యూ ట్యూబ్ బిపాసా టాప్‌లెస్ దృశ్యాలను జోడిస్తూ... ఆ దృశ్యాలను కెన్ నాహౌమ్ అనే దర్శకుడు చిత్రీకరించాడని వెల్లడించింది. పైగా ఈ దృశ్యాలు భారతదేశంలోనే తీసినట్లు తెలిపింది. అయితే వివేక్ ఒబెరాయ్‌తో కలిసి బిపాసా టాప్‌లెస్‌గా నటించిందన్న వార్తలపై ఒబెరాయ్ వ్యక్తిగత కార్యదర్శి స్పందించడానికి నిరాకరించారు. అసలాయన బిపాసాతో కలిసి అటువంటి వాణిజ్య ప్రకటనలో నటించారో లేదో తమకు తెలియదని చెప్పారు. అయితే బిపాసాబసు మేనేజర్ మాత్రం వాణిజ్య ప్రకటనలో ఆమె నటించిన మాట వాస్తవమేనంటున్నాడు. ఆమె 1999లో ఆ ప్రకటనలో నటించిందని చెప్పుకొచ్చాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Jun 2010 | 10:09 am

జగన్ ఓదార్పు యాత్రకు అనుమతి అడుగలేదు: మొయిలీ

వైఎస్.జగన్ చేపట్టనున్న ఓదార్పు యాత్రకు తాను అనుమతి ఇవ్వలేదని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో వీరప్ప మొయిలీని కలిసిన కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్ ఈనెల 8వ తేదీ నుంచి ఓదార్పు యాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ యాత్రకు వీరప్ప మొయిలీ అనుమతి ఇచ్చారని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 1 Jun 2010 | 7:50 am

ఐశ్వర్యా రాయ్‌తో "రావణ్" విక్రమ్ సూపర్ రొమాన్స్

మణిరత్నం రూపొందిస్తోన్న "రావణ్" చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో దేవ్‌ పాత్రలో తమిళ నటుడు విక్రమ్ నటిస్తున్నాడు. అతడి ప్రేయసి రాగిణి శర్మగా అందాల తార ఐశ్వర్యారాయ్ నటిస్తోంది. ఇటీవల వీరిద్దరిపై దర్శకుడు మణిరత్నం సూపర్ రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారు. మణిరత్నం రొమాంటిక్ సన్నివేశాలంటే ఇక వేరే చెప్పనక్కర్లేదు. ఆయన చిత్రించిన శృంగారభరిత సన్నివేశాలను చూస్తే టీనేజ్ జంటలు ప్రేమ మైకంలో మునిగిపోతే, కొత్త దంపతులు తొలిరేయి జ్ఞాపకాలను నెమరేసుకోవలసిందే. ఈ సంగతి ప్రక్కనపెడితే ఐశ్వర్యారాయ్ భర్త అభిషేక్ బచ్చన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడుగా కనిపించనున్నాడు. బీర అనే పాత్రలో రాగిణి శర్మను చెరబట్టే పాత్రలో నటిస్తున్నాడు. కనుక ఐష్‌ పట్ల అభిషేక్ రావణ్ అన్నమాట. ఈ చిత్రంపై ఆయా సినీపరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Jun 2010 | 6:58 am

జూన్ 5 నుంచి అమర్నాథ్ యాత్ర పేర్ల నమోదు ఆరంభం!

ప్రతియేటా ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్రకు సందడి ఆరంభమైంది. ఈ యాత్రకు వెళ్లాలని భావించే భక్తులు తమ పేర్లను ఈనెల ఐదో తేదీ నుంచి నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా 121 శాఖలను ప్రారంభించినట్టు శ్రీ అమర్నాథ్ ఆలయ బోర్డు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
Source: జాతీయ | 1 Jun 2010 | 6:31 am

జగన్ వ్యాఖ్యలపై తర్వాత స్పందిస్తా: ముఖ్యమంత్రి రోశయ్య

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు తర్వాత స్పందిస్తానని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. జగన్ మాటలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నోరు విప్పుతానని చెప్పారు. జగన్ తొందరపడి చేశారా లేదా పొరపాటున చేశారా లేదా అవగాహనా లోపంతో చేశారా అనే అంశాలపై పరిశీలించి స్పందిస్తానని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 1 Jun 2010 | 6:20 am

మారుతి సుజికి ఘర్షణలో రామ్‌చరణ్ తేజ

మగధీర చిత్రం విడుదల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ ఇమేజ్ ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయింది. అందుకేనేమో ఇప్పుడు ప్రతి కంపెనీ రామ్‌చరణ్‌తో తమ తమ కార్యక్రమ ప్రారంభోత్సవాలను చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల మా టీవీ చేపట్టిన ఘర్షణ కార్యక్రమానికి రామ్‌చరణ్ హాజరై వీక్షకుల్లో ఉత్తేజాన్ని నింపారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ మీకోసం...
Source: Yahoo! Telugu: Entertainment | 1 Jun 2010 | 6:14 am

బీఎస్ఎఫ్‌లో మహిళా ఆఫీసర్ల నియామకానికి బ్రేక్!

భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), ఇండో టిబెట్ బెటాలియన్ పోలీసు (ఐటీబీపీ), ససస్త్రా సీమా బాల్ (ఎస్ఎస్‌బీ) విభాగాల్లో మహిళా ఆఫీసర్ల నియమాకాన్ని నిలిపివేస్తున్నట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) వెల్లడించింది.
Source: జాతీయ | 1 Jun 2010 | 5:30 am

యూ ట్యూబ్‌లో బిపాసా బసు టాప్‌లెస్

వివేక్ ఒబెరాయ్, బిపాసాలపై చిత్రీకరించిన ఓ ప్రకటనలో బిపాసాబసు టాప్‌లెస్‌గా కనిపించిందట. ప్రస్తుతం బిపాసా టాప్‌లెస్ దృశ్యాలు యూ ట్యూబ్‌లో దర్శనమిస్తున్నాయి. దీంతో సైబర్ కేఫ్‌లో బిపాసా ప్రియులు ఎగబడుతున్నారట.కాగా యూ ట్యూబ్ బిపాసా టాప్‌లెస్ దృశ్యాలను జోడిస్తూ... ఆ దృశ్యాలను కెన్ నాహౌమ్ అనే దర్శకుడు చిత్రీకరించాడని...
Source: వినోదం | 1 Jun 2010 | 4:40 am

ఓదార్పు యాత్ర విఫలంలో ప్రభుత్వ హస్తం లేదు: మంత్రులు

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో తలపెట్టిన ఓదార్పు యాత్ర అర్థాంతరంగా ఆగిపోవడం వెనుక ప్రభుత్వ వైఫల్యం లేదా హస్తం ఏమాత్రం లేదని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. ఈ అంశంపై రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గీతా రెడ్డి, గాదె వెంకటరెడ్డి, దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, పొన్నాల లక్ష్మయ్య తదితరులు మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 1 Jun 2010 | 4:18 am

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు: ప్రజారాజ్యం

వచ్చే నెలలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజారాజ్యం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 1 Jun 2010 | 4:09 am

కాంగ్రెస్ పార్టీతో విభేదాలు లేవు: మంత్రి మమతా బెనర్జీ

కాంగ్రెస్ పార్టీతో విభేదాలు తలెత్తినట్టు వస్తున్న వార్తలను కేంద్ర రైల్వే శాఖామంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తోసిపుచ్చారు. తమపై లేనిపోని ఆరోపణలు రావడం సహజం. ఇలాంటి సహజమేనన్నారు. యూపీఏ ప్రగతి నివేదిక విడుదల కార్యక్రమంలో తాను కూడా పాలుపంచుకుంటానని ఆమె తెలిపారు.
Source: జాతీయ | 1 Jun 2010 | 3:59 am

తెలుగుదేశంలో కరివేపాకులా నందమూరి హీరో బ్యాచ్!?

తెలుగుదేశం పార్టీలో నందమూరి హీరోలు కరివేపాకులా మారనున్నారా? అవుననే అంటున్నారు.. రాష్ట్ర రాజకీయ పరిశీలకులు. ఇటీవల గండిపేటలో జరిగిన ఆ పార్టీ మహానాడులో ఈ విషయం తేటతెల్లమైందని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో అభిమానులు, కార్యకర్తలు ఆదేశిస్తే పార్టీ పగ్గాలు చేపడుతానని, దైవేచ్చ ఉంటే ముఖ్యమంత్రిని అవుతానని సినీ నటుడు బాలకృష్ణ ప్రకటించారు. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలపై బాలయ్య వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
Source: ఏపీ న్యూస్ | 1 Jun 2010 | 2:22 am