|
కాంగ్రెస్ పార్టీతో విభేదాలు లేవు: మంత్రి మమతా బెనర్జీకాంగ్రెస్ పార్టీతో విభేదాలు తలెత్తినట్టు వస్తున్న వార్తలను కేంద్ర రైల్వే శాఖామంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తోసిపుచ్చారు. తమపై లేనిపోని ఆరోపణలు రావడం సహజం. ఇలాంటి సహజమేనన్నారు. యూపీఏ ప్రగతి నివేదిక విడుదల కార్యక్రమంలో తాను కూడా పాలుపంచుకుంటానని ఆమె తెలిపారు.Source: Yahoo! Telugu: News | 1 Jun 2010 | 9:29 am పంతొమ్మిది వేలకు చేరుకున్న బంగారం ధరదేశీయ బులియన్ మార్కెట్‌లో మంగళవారం ప్రతి పది గ్రాముల బంగారం ధర రూ. 19,000లకు చేరుకుంది. చరిత్రలోనే బంగారం ధరలు పంతొమ్మిది వేలకు చేరుకోవడం ఇదే ప్రథమమని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 1 Jun 2010 | 9:04 am మధ్య అమెరికాలో తుఫాను ధాటికి 150 మంది మృతిసెంట్రల్ అమెరికాలో అగథా తుఫాను భారీ ప్రాణ, ఆస్తి నష్టం కల్పించింది. ఈ తుఫాను ధాటికి ఇప్పటి వరకు 150 మంది మృత్యువాత పడ్డారు. వేలాది మంది నిరాశ్రయులైనట్టు మధ్య అమెరికా అధికారులు వెల్లడించారు. డజన్ల కొద్దీ జనం కనిపించ కుండా పోయినట్టు వారు తెలిపారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు.Source: Yahoo! Telugu: News | 1 Jun 2010 | 8:57 am అమ్మకాల ఒత్తిడి: సెన్సెక్, నిఫ్టీల పతనం!దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. మంళవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 292 పాయింట్ల మేర క్షీణించి, 16,652 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 93 పాయింట్లు పడిపోయి, 4,993 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 1 Jun 2010 | 8:53 am ట్రేడింగ్ క్షీణిత: నష్టాల్లో స్టాక్ మార్కెట్దేశీయ వాటాల ట్రేడింగ్ క్షీణించడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 81 పాయింట్లు పడిపోయింది. దీంతో సెన్సెక్స్ సూచి 16,863 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 38 పాయింట్లు పతనమై, 5,047 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 1 Jun 2010 | 8:42 am కార్ల అమ్మకాల్లో రికార్డు సృష్టించిన మారుతిదేశీయ కార్ల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న మారుతి సుజుకీ ఇండియా సంస్థ గడచిన మే నెలలో 1,02,175 కార్లను అమ్మి రికార్డు సృష్టించిందని ఆ సంస్థ ప్రధాన కార్యనిర్వహణాధికారి (మార్కెటింగ్, అమ్మకాలు) మయాంక్ పరీక్ మీడియాకు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 1 Jun 2010 | 8:27 am తెలుగుదేశంలో కరివేపాకులా నందమూరి హీరో బ్యాచ్!?తెలుగుదేశం పార్టీలో నందమూరి హీరోలు కరివేపాకులా మారనున్నారా? అవుననే అంటున్నారు.. రాష్ట్ర రాజకీయ పరిశీలకులు. ఇటీవల గండిపేటలో జరిగిన ఆ పార్టీ మహానాడులో ఈ విషయం తేటతెల్లమైందని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో అభిమానులు, కార్యకర్తలు ఆదేశిస్తే పార్టీ పగ్గాలు చేపడుతానని, దైవేచ్చ ఉంటే ముఖ్యమంత్రిని అవుతానని సినీ నటుడు బాలకృష్ణ ప్రకటించారు. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలపై బాలయ్య వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.Source: Yahoo! Telugu: News | 1 Jun 2010 | 7:51 am నష్టాల్లో కొనసాగుతున్న బాంబే స్టాక్ మార్కెట్మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు ర్యాలీని పయనింపజేస్తున్న బాంబే స్టాక్ మార్కెట్, ఉదయం 11 గంటల ప్రాంతంలో క్షీణించింది. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో కూరుకుపోయాయి. దేశీయ వాటాల ట్రేడింగ్ క్షీణించడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది.Source: Yahoo! Telugu: News | 1 Jun 2010 | 7:34 am నాడు వైఎస్ఆర్ జపాలు.. నేడు కె.రోశయ్యకు భజనలు!తెలంగాణ ప్రాంతానికి చెందిన 11 మంది కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు తమ రాజకీయ భవిష్యత్-స్వలాభాల కోసం భజనలు చేయడంలో ఆరి తేరారు. ప్రజానేత వైఎస్ జీవించి ఉన్న సమయంలో ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భజనలు చేశారు. వైఎస్ మరణానంతరం రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆ ఎంపీలు కూడా ఫ్లేటు ఫిరాయించారు. మొన్నటి వరకు వైఎస్‌కు, ఆయన కుమానికి అండగా నిలిచిన ఈ ఎంపీలు... నేడు రోశయ్య చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అండగా నిలుస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 1 Jun 2010 | 7:17 am ఐశ్వర్యా రాయ్‌తో "రావణ్" విక్రమ్ సూపర్ రొమాన్స్మణిరత్నం రూపొందిస్తోన్న "రావణ్" చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో దేవ్ పాత్రలో తమిళ నటుడు విక్రమ్ నటిస్తున్నాడు. అతడి ప్రేయసి రాగిణి శర్మగా అందాల తార ఐశ్వర్యారాయ్ నటిస్తోంది. ఇటీవల వీరిద్దరిపై దర్శకుడు మణిరత్నం సూపర్ రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారు. మణిరత్నం రొమాంటిక్ సన్నివేశాలంటే ఇక వేరే చెప్పనక్కర్లేదు. ఆయన చిత్రించిన శృంగారభరిత సన్నివేశాలను చూస్తే టీనేజ్ జంటలు ప్రేమ మైకంలో మునిగిపోతే, కొత్త దంపతులు తొలిరేయి జ్ఞాపకాలను నెమరేసుకోవలసిందే. ఈ సంగతి ప్రక్కనపెడితే ఐశ్వర్యారాయ్ భర్త అభిషేక్ బచ్చన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడుగా కనిపించనున్నాడు. బీర అనే పాత్రలో రాగిణి శర్మను చెరబట్టే పాత్రలో నటిస్తున్నాడు. కనుక ఐష్ పట్ల అభిషేక్ రావణ్ అన్నమాట. ఈ చిత్రంపై ఆయా సినీపరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.Source: Yahoo! Telugu: Entertainment | 1 Jun 2010 | 6:58 am 26/11 దాడులు: హెడ్లీని ప్రశ్నించనున్న ఎన్ఐఏ బృందంఅమెరికాలో అరెస్టయిన లష్కర్ తోయిబా తీవ్రవాది రిచర్డ్ హెడ్లీ వద్ద జాతీయ దర్యాప్తు బృందానికి చెందిన నలుగురు అధికారుల బృందం విచారణ జరపునుంది. ఇందుకోసం సోమవారం అమెరికా బయలుదేరిన ఈ బృందం క్షేమంగా చికాగోకు చేరుకుంది. ఈ బృందంలో ఎన్ఐఏ ఉన్నతాధికారితో పాటు.. నలుగురు న్యాయాధికారులు ఉన్నారు.Source: Yahoo! Telugu: News | 1 Jun 2010 | 6:45 am మారుతి సుజికి ఘర్షణలో రామ్‌చరణ్ తేజమగధీర చిత్రం విడుదల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ ఇమేజ్ ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయింది. అందుకేనేమో ఇప్పుడు ప్రతి కంపెనీ రామ్‌చరణ్‌తో తమ తమ కార్యక్రమ ప్రారంభోత్సవాలను చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల మా టీవీ చేపట్టిన ఘర్షణ కార్యక్రమానికి రామ్‌చరణ్ హాజరై వీక్షకుల్లో ఉత్తేజాన్ని నింపారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ మీకోసం...Source: Yahoo! Telugu: Entertainment | 1 Jun 2010 | 6:14 am కాంగ్రెస్ పార్టీతో విభేదాలు లేవు: మంత్రి మమతా బెనర్జీకాంగ్రెస్ పార్టీతో విభేదాలు తలెత్తినట్టు వస్తున్న వార్తలను కేంద్ర రైల్వే శాఖామంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తోసిపుచ్చారు. తమపై లేనిపోని ఆరోపణలు రావడం సహజం. ఇలాంటి సహజమేనన్నారు. యూపీఏ ప్రగతి నివేదిక విడుదల కార్యక్రమంలో తాను కూడా పాలుపంచుకుంటానని ఆమె తెలిపారు.Source: జాతీయ | 1 Jun 2010 | 3:59 am తెలుగుదేశంలో కరివేపాకులా నందమూరి హీరో బ్యాచ్!?తెలుగుదేశం పార్టీలో నందమూరి హీరోలు కరివేపాకులా మారనున్నారా? అవుననే అంటున్నారు.. రాష్ట్ర రాజకీయ పరిశీలకులు. ఇటీవల గండిపేటలో జరిగిన ఆ పార్టీ మహానాడులో ఈ విషయం తేటతెల్లమైందని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో అభిమానులు, కార్యకర్తలు ఆదేశిస్తే పార్టీ పగ్గాలు చేపడుతానని, దైవేచ్చ ఉంటే ముఖ్యమంత్రిని అవుతానని సినీ నటుడు బాలకృష్ణ ప్రకటించారు. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలపై బాలయ్య వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.Source: ఏపీ న్యూస్ | 1 Jun 2010 | 2:22 am నాడు వైఎస్ఆర్ జపాలు.. నేడు కె.రోశయ్యకు భజనలు!తెలంగాణ ప్రాంతానికి చెందిన 11 మంది కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు తమ రాజకీయ భవిష్యత్-స్వలాభాల కోసం భజనలు చేయడంలో ఆరి తేరారు. ప్రజానేత వైఎస్ జీవించి ఉన్న సమయంలో ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భజనలు చేశారు. వైఎస్ మరణానంతరం రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆ ఎంపీలు కూడా ఫ్లేటు ఫిరాయించారు. మొన్నటి వరకు వైఎస్‌కు, ఆయన కుమానికి అండగా నిలిచిన ఈ ఎంపీలు... నేడు రోశయ్య చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అండగా నిలుస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 1 Jun 2010 | 1:48 am జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన: కేంద్ర కేబినెట్ ఆమోదంజార్ఖండ్ రాష్ట్రం మరోమారు రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శిబూ సొరేన్ విశ్వాస పరీక్షకు ముందే సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో మరోమార్గం లేక పోవడంతో గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంపై చర్చించేందుకు మంగళవారం హస్తినలో సమావేశమైన కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతి పాలనకు ఆమోదం తెలిపింది.Source: జాతీయ | 1 Jun 2010 | 1:06 am అక్షరధామ్ కేసు: ఉరిశిక్షలను సమర్థించిన హైకోర్టుఅక్షరధామ్ దాడి కేసులో ముగ్గురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ పోటా కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. 2002 సంవత్సరం సెప్టెంబరు 24వ తేదీన ఇద్దరు తీవ్రవాదులు అహ్మదాబాద్, గాంధీనగర్‌లో ఉన్న అక్షరధామ్‌పై ఆటోమేటిక్ ఆయుధాలు, గ్రెనైడ్లతో దాడి చేశారు. ఇందులో 32 మంది చనిపోయారు. వీరిలో 28 మంది సందర్శకులు ఉండగా, ఇద్దరు కమెండోలు, ఒక ఎన్.ఎస్.జి కమెండో, స్టేట్ రిజర్వు పోలీసుకు చెందిన ఒక కానిస్టేబుల్ ఉన్నారు.Source: జాతీయ | 1 Jun 2010 | 12:26 am ఓదార్పు యాత్రకు అధిష్టానం అనుమతి: జగన్ వెల్లడికాంగ్రెస్ హైకమాండ్ ఆదేశంతో తాను చేపట్టిన ఓదార్పు యాత్ర యధావిధిగా సాగుతుందని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల ఎనిమిదో తేదీన శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్ర సాగుతుందన్నారు.Source: ఏపీ న్యూస్ | 1 Jun 2010 | 12:02 am శాంతి భద్రతలు పరిరక్షించడం నేను చేసిన తప్పా: సీఎంవైఎస్.జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్ర సందర్భంగా శాంతి భద్రతలు పరిరక్షించేలా చర్యలు చేపట్టడం నేను చేసిన తప్పా అని తెలంగాణ ఎంపీల వద్ద ముఖ్యమంత్రి రోశయ్య వాపోయారు. కనీసం వయస్సుకు కూడా మర్యాద ఇవ్వకుండా... ఆ కుర్రోడు అలా మాట్లాడటం సబబేనా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 31 May 2010 | 11:50 pm జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించండిః ఫరూక్జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబూ సొరేన్ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి ఒక రోజు ముందే రాజీనామా సమర్పించడంతోపాటు, కాంగ్రెస్, భాజపా నాయకులు వచ్చి తనను కలిసి తమ వాదాలను వినిపించారని, దీంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఎంఓహెచ్ ఫరూక్ తన నివేదికను కేంద్రానికి పంపారు.Source: జాతీయ | 31 May 2010 | 9:57 pm కేంద్రప్రభుత్వం నిద్రపోతోందిః నరేంద్ర మోడీకేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం నిద్రపోతోందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సూరత్‌లో ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తున్నట్లు నటిస్తోందన్నారు.Source: జాతీయ | 31 May 2010 | 9:46 pm ఈ హీరోయిన్ల వల్లే "రామరామ కృష్ణకృష్ణ" అందిటఈమధ్య హీరోయిన్లపై నిర్మాత దిల్ రాజు విమర్శలు ఎక్కువ చేస్తున్నారు. అది పబ్లిసిటీ స్టంటో లేక హీరోయిన్లపై కోపమో తెలీదు కానీ... ఆమధ్య "మరోచరిత్ర" హీరోయిన్ గురించి చులకనగా మాట్లాడారు. సినిమాకు ఆమె మైనస్ అంటూ విమర్శించారు. అసలు ఆ చిత్రానికి హీరోనే మైనస్ అని కొంతమంది అంటే... దిల్ రాజు "మరోచరిత్ర" సినిమా తీయడమే మైనస్ అని ఇండస్ట్రీలో చాలామంది వ్యాఖ్యానించారు. వీటన్నింటిపైనా ఎదురుదాడి చేసేందుకు హీరోయిన్‌పై నెపం నెట్టేశారు. తీరా ఆ హీరోయిన్ కూడా ఘాటుగానే స్పందించింది. సెలక్షన్ టైమ్‌లో దగ్గరుండి మరీ ఎంపికచేసిన ఆయన ఏం ఆశించి అలా మాట్లాడారో తెలియదని చురక వేసింది. తాజాగా మరో వివాదం ముందుకు వచ్చింది.Source: Yahoo! Telugu: Entertainment | 31 May 2010 | 12:09 pm ఊటీలో బర్త్ డే కేక్ కట్ చేసిన నటశేఖర కృష్ణఅలనాటి ఊరికి మొనగాడు.. సూపర్‌స్టార్ కృష్ణ ప్రస్తుతం ఊటీలో వేసవి విడిదికోసం వెళ్లారు. అక్కడే అభిమానుల సమక్షంలో తన 68వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఊటీలోని ఆయన గెస్ట్ హౌస్‌లో కొద్దిమంది అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొనగా కేక్‌ను కట్ చేశారు. ప్రతి ఏడాది హైదరాబాదులోనే జరుపుకుంటున్న తన పుట్టినరోజును ఈసారి ఊటీలో జరుపుకోవడం విశేషంగా చెప్పారు. ఆల్ ఇండియా కృష్ణా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాదర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విజయనిర్మల, నరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను సినిమాలు చేసినా చేయకపోయినా ప్రతి పుట్టినరోజునాడు శ్రేయోభిలాషులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేయడం పట్ల వారికి ధన్యవాదాలు తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 31 May 2010 | 11:51 am నాలుగో షెడ్యూల్‌లో శ్రీకాంత్ - ఛార్మిల "సేవకుడు"శతచిత్ర కథానాయకుడు శ్రీకాంత్ హీరోగా వి. సముద్ర దర్శకత్వంలో యం. సుధాకర్ శ్రీమహా గణపతి ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్న సేవకుడు చిత్రం నాలుగో షెడ్యూల్ హైదరాబాదులో జరుపుకుంటోంది. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ... శ్రీకాంత్ హీరోగా మాస్ ప్రేక్షకులను, ఇటు క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించే కథతో మేము నిర్మిస్తున్న సేవకుడు చిత్రం మూడో షెడ్యూల్‌ని రామానాయుడు స్టూడియోస్, సారథి స్టూడియోస్, నానక్‌రామ్‌గూడలోని రామానాయుడు స్టూడియోస్ మొదలైన ప్రాంతాల్లో జరిపాము. ఛార్మిపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాం. ఇందులో ఛార్మి జాబ్ కోసం తను చేసే ప్రయత్నాల్లో అనుకోకుండా ఓ సందర్భంలో శ్రీకాంత్‌ను కలిసి అతని లవ్‌లో పడుతుంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనబడతారు అని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 31 May 2010 | 11:35 am చంద్రబాబు నాయుడైతే ఆ పని చేసేవాడు...?: జగన్తన ఓదార్పు యాత్రపై అధిష్టానంలో కొన్ని అపోహలు నెలకొని ఉన్నాయనీ, వాటిని తొలగించేందుకే తాను ఢిల్లీ వచ్చానని కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. సోమవారం సోనియా గాంధీని కలిసి తన యాత్ర గురించి చర్చించాలనుకున్న జగన్‌కు చుక్కెదురైంది. ఆయనకు సోనియా అపాయింట్‌మెంట్ దొరకలేదు.Source: ఏపీ న్యూస్ | 31 May 2010 | 8:11 am కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలునైరుతి రుతుపవనాలు సోమవారం కేరళ తీరప్రాంతాన్ని తాకాయి. దీంతో ఈ రోజు ఆ రాష్ట్రంలో భారీ వర్షం కురిసింది. కేరళతోపాటు కర్నాటక తీరప్రాంతం, తమిళనాడు, తూర్పు తీరప్రాంతాల్లోనున్న రాష్ట్రాల్లో వర్షాలుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.Source: జాతీయ | 31 May 2010 | 7:55 am ఓదార్పు యాత్ర కాదు.. విగ్రహ ప్రతిష్ట యాత్ర: కేసీఆర్కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన యాత్ర ఓదార్పు యాత్ర కాదని, ఆయన తండ్రి వైఎస్ విగ్రహ ప్రతిష్ట యాత్ర అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అభిప్రాయపడ్డారు. అలాగే, తెలంగాణ వాదులపై కాల్పులు జరిపింది పోలీసులు కాదని ప్రైవేటు వ్యక్తులని ఆయన ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 31 May 2010 | 7:17 am ముదుసలి సల్మాన్‌తోనా...? కుర్రాడ్ని చూస్కోండి.. వస్తా!!ముక్కుకు సూటిగా మాట్లాడేవారు సినీ పరిశ్రమలో చాలా తక్కువగానే ఉంటారు. ఎందుకంటే అలా మాట్లాడితే ఆఫర్లు ఎడారి ఒయాసిస్సులా మారిపోతాయ్. కానీ అవార్డుల క్వీన్ ప్రియమణి ముక్కుకు సూటిగానే కాదు ముక్కు బద్ధలయ్యేటట్లు మాట్లాడేవారిలో ఒకర్తె.ప్రియమణి నటనను చూసి ముచ్చటపడ్డ ఓ బాలీవుడ్ నిర్మాత ఆమెతో ఓ సిన్మా చేయాలని ఇటీవల సంప్రదించాడట. కథంతా విన్న తర్వాత ఇంతకీ హీరో ఎవరూ అని ప్రశ్నించిందట ప్రియమణి. దాంతో అతను సల్మాన్ ఖాన్ అని చెప్పడంతో... ముదుసలి సల్మాన్‌ఖాన్‌తోనా...? నా ఏజ్‌కు తగ్గట్లుగా నాతో సరిజోడీగా ఉండే కుర్ర హీరోను చూస్కోండి. అప్పుడు ఆలోచిస్తా అని అతడి ముఖం మీదే చెప్పేసిందట ప్రియ. ప్రియమణి దృష్టిలో సల్మాన్, అమీర్ వంటి బాలీవుడ్ హీరోలందరూ ముసలాళ్ల కిందే లెఖ్ఖన్నమాట. మరి టాలీవుడ్ జగపతి బాబు కుర్రాడేనా ప్రియమణీ అని అడిగితే ఏం సమాధానం చెపుతుందో..? ఈసారి అడుగుదాం...Source: Yahoo! Telugu: Entertainment | 31 May 2010 | 7:16 am యంగ్ అండ్ డైనమిక్ లీడర్ వైఎస్.జగన్: మొయిలీకడప పార్లమెంట్ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్‌గా ఆయన కొనియాడారు. అదేసమయంలో ఆయన పార్టీని వీడిపోతారని వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని ఆయన అన్నారు.Source: జాతీయ | 31 May 2010 | 6:41 am ఊటీలో బర్త్ డే కేక్ కట్ చేసిన నటశేఖర కృష్ణఅలనాటి ఊరికి మొనగాడు.. సూపర్‌స్టార్ కృష్ణ ప్రస్తుతం ఊటీలో వేసవి విడిదికోసం వెళ్లారు. అక్కడే అభిమానుల సమక్షంలో తన 68వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఊటీలోని ఆయన గెస్ట్ హౌస్‌లో కొద్దిమంది అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొనగా కేక్‌ను కట్ చేశారు. ప్రతి ఏడాది హైదరాబాదులోనే జరుపుకుంటున్న తన పుట్టినరోజును ఈసారి ఊటీలో జరుపుకోవడం విశేషంగా చెప్పారు. ఆల్ ఇండియా కృష్ణా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాదర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విజయనిర్మల, నరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను సినిమాలు చేసినా చేయకపోయినా ప్రతి పుట్టినరోజునాడు శ్రేయోభిలాషులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేయడం పట్ల వారికి ధన్యవాదాలు తెలిపారు.Source: వినోదం | 31 May 2010 | 6:21 am నాలుగో షెడ్యూల్‌లో శ్రీకాంత్ - ఛార్మిల "సేవకుడు"శతచిత్ర కథానాయకుడు శ్రీకాంత్ హీరోగా వి. సముద్ర దర్శకత్వంలో యం. సుధాకర్ శ్రీమహా గణపతి ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్న సేవకుడు చిత్రం నాలుగో షెడ్యూల్ హైదరాబాదులో జరుపుకుంటోంది. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ... శ్రీకాంత్ హీరోగా మాస్ ప్రేక్షకులను, ఇటు క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించే కథతో మేము నిర్మిస్తున్న...Source: వినోదం | 31 May 2010 | 6:06 am రామ్ గోపాల్ వర్మ నాగార్జునకు "పెద్ద చెంచా"ఒకరికి అడుగులు మడుగులొత్తినట్లు ఎవరి ప్రవర్తనైనా ఉంటే సదరు వ్యక్తిని చెంచాగాడని అందరూ అంటుంటారు. క్రియేటివ్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మాత్రం తనకూ తానే ఒకప్పుడు టాలీవుడ్‌లో తానో చెంచాగాడిలా పనిచేశానంటూ పాత సంగతులను ఒక్కసారి నెమరేసుకున్నారు. "శివ" సినిమా తీయడానికి ముందు వర్మ బి.గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారట. అప్పట్లో నాగార్జున చిత్రం కలెక్టర్ గారి అబ్బాయి షూటింగ్ జరుగుతుంటే నాగ్‌ను ఇంప్రెస్ చేయడానికి రామ్‌గోపాల్ వర్మ శతవిధాలా ప్రయత్నించేవారట. వర్మ సిన్సియారిటీని చూసిన నాగార్జున కూడా ఆయన పట్ల సానుకూలంగా స్పందించేవారట. దీంతో వర్మను అందరూ "నాగార్జున చెంచా" అని పిలిచేవారట.Source: Yahoo! Telugu: Entertainment | 31 May 2010 | 5:59 am జ్ఞానేశ్వరి ప్రమాదం వెనుక మావోల హస్తం: చిదంబరంపశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం వెనుక మావోయిస్టుల హస్తం ఉందని కేంద్ర హోం మంత్రి చిదంబరం ఆరోపించారు. ఆయన సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులు అమాయక ప్రజలను కిరాతకంగా హతమార్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.Source: జాతీయ | 31 May 2010 | 5:13 am తెలంగాణా ద్రోహి చిరును అక్కున చేర్చుకుంటారా...?సమైక్యవాదాన్ని నరనరంలో జీర్ణించుకుని యాత్రలు చేపడుతున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆహ్వానించడం తెలంగాణా ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని కాంగ్రెస్ మాజీమంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 31 May 2010 | 4:34 am పొలిటికల్ ఏబీసీడీలు తెలియని బాలకృష్ణ - ఎన్టీఆర్రాష్ట్ర కేబినెట్‌లో ఎంతమంది మంత్రులు పనిచేస్తున్నారో చెప్పమంటే చెప్పలేని వారు కూడా రాజకీయాలు గురించి మాట్లాడుతున్నారని ఆనం సోదరులు పరోక్షంగా యువరత్న బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ల విమర్శిస్తూ మాట్లాడారు.Source: ఏపీ న్యూస్ | 31 May 2010 | 4:10 am ఆ కాల్పులు హత్యాయత్న చర్య కాదు: కర్ణాటక డీజీపీఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పండిట్ రవిశంకర్ ఆశ్రమంలో జరిగిన కాల్పులు హత్యాయత్న కాల్పులు కాదని కర్ణాటక రాష్ట్ర డీజీపీ సోమవారం స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక సంఘటన మాత్రమేనని, హత్యాయత్న దాడి కాదని పోలీసులు వివరణ ఇచ్చారు.Source: జాతీయ | 31 May 2010 | 3:57 am కేసీఆర్ చేతిలో చావుదెబ్బలు తింటున్న "తెలంగాణా బంతి"తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌పై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణా ప్రాంతాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకుంటూ అమాయకులను బలి తీసుకుంటున్నారని ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 31 May 2010 | 2:56 am
|