|
స్వల్ప నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్సోమవారం బాంబే స్టాక్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటున్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి తేలికపాటి ఒడిదుడుకులను ఎదుర్కుంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 11 పాయింట్లు స్వల్పంగా నష్టపోయింది. దీంతో సెన్సెక్స్ సూచి 16,851 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా ఏడు పాయింట్లు క్షీణించి, 5,059 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 31 May 2010 | 9:13 am స్టాక్ మార్కెట్: స్వల్ప లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!సోమవారం బాంబే స్టాక్ మార్కెట్ తేలికపాటి ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ మార్కెట్, మధ్యాహ్నానికి స్వల్ప లాభాల వెంట ర్యాలీని కొనసాగిస్తోంది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 20 పాయింట్లు స్వల్పంగా పుంజుకుని, 16,883 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా స్వల్ప లాభంతో 5,066 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 31 May 2010 | 9:00 am కేసీఆర్ చేతిలో చావుదెబ్బలు తింటున్న "తెలంగాణా బంతి"తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌పై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణా ప్రాంతాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకుంటూ అమాయకులను బలి తీసుకుంటున్నారని ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 31 May 2010 | 8:25 am స్వల్ప లాభాల్లో బాంబే స్టాక్ మార్కెట్!బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఊపందుకున్న బాంబే స్టాక్ మార్కెట్, మధ్యాహ్నానికి స్వల్ప లాభాలను నమోదు చేసుకుంటోంది. ఫలితంగా మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ ఐదు పాయింట్లు స్వల్ప వృద్ధితో, 16,868 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 8 పాయింట్లు స్వల్పంగా లాభపడి 5,057 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 31 May 2010 | 7:50 am బీఓఆర్ ఉద్యోగులను తొలగించే ప్రసక్తే లేదుః చందా కోచ్చర్బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్(బీఓఆర్) ఉద్యోగులను తొలగించేం ప్రసక్తే లేదని ఆ బ్యాంకును చేజిక్కించుకున్న ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కోచ్చర్ జైపూర్‌లో స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 31 May 2010 | 7:50 am వెనుకబడిన దేశీయ ఐటీ కంపెనీలుః బీఎస్ఈప్రపంచవ్యాప్తంగానున్న ఐటీ కంపెనీల్లో అగ్రగాములుగానున్న ఎప్పల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల మధ్య గట్టిపోటీ నెలకొంది. కాని దేశీయ ఐటీ కంపెనీల్లో ఎలాంటి పోటీతత్వం కనపడటం లేదు. ఎప్పల్ లేదా మైక్రోసాఫ్ట్ ఐటీ కంపెనీలకు పోటీనిచ్చే స్థితిలో దేశీయ ఐటీ కంపెనీలు లేవని బీఎస్ఈ ఐటీ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది.Source: Yahoo! Telugu: News | 31 May 2010 | 7:28 am ముదుసలి సల్మాన్‌తోనా...? కుర్రాడ్ని చూస్కోండి.. వస్తా!!ముక్కుకు సూటిగా మాట్లాడేవారు సినీ పరిశ్రమలో చాలా తక్కువగానే ఉంటారు. ఎందుకంటే అలా మాట్లాడితే ఆఫర్లు ఎడారి ఒయాసిస్సులా మారిపోతాయ్. కానీ అవార్డుల క్వీన్ ప్రియమణి ముక్కుకు సూటిగానే కాదు ముక్కు బద్ధలయ్యేటట్లు మాట్లాడేవారిలో ఒకర్తె.ప్రియమణి నటనను చూసి ముచ్చటపడ్డ ఓ బాలీవుడ్ నిర్మాత ఆమెతో ఓ సిన్మా చేయాలని ఇటీవల సంప్రదించాడట. కథంతా విన్న తర్వాత ఇంతకీ హీరో ఎవరూ అని ప్రశ్నించిందట ప్రియమణి. దాంతో అతను సల్మాన్ ఖాన్ అని చెప్పడంతో... ముదుసలి సల్మాన్‌ఖాన్‌తోనా...? నా ఏజ్‌కు తగ్గట్లుగా నాతో సరిజోడీగా ఉండే కుర్ర హీరోను చూస్కోండి. అప్పుడు ఆలోచిస్తా అని అతడి ముఖం మీదే చెప్పేసిందట ప్రియ. ప్రియమణి దృష్టిలో సల్మాన్, అమీర్ వంటి బాలీవుడ్ హీరోలందరూ ముసలాళ్ల కిందే లెఖ్ఖన్నమాట. మరి టాలీవుడ్ జగపతి బాబు కుర్రాడేనా ప్రియమణీ అని అడిగితే ఏం సమాధానం చెపుతుందో..? ఈసారి అడుగుదాం...Source: Yahoo! Telugu: Entertainment | 31 May 2010 | 7:16 am కంపెనీలు సామాజిక బాధ్యత వహించాలిః సల్మాన్ ఖుర్షీద్దేశంలోని కంపెనీలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల బాగోగుల కోసం సామాజిక బాధ్యతను నిర్వర్తించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖమంత్రి సల్మాన్ ఖుర్షీద్ కోరారు.Source: Yahoo! Telugu: News | 31 May 2010 | 7:03 am లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి!సోమవారం బాంబే స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే బాంబే స్టాక్ మార్కెట్ పురోగమనం దిశగా ర్యాలీని కొనసాగిస్తోంది. ఫలితంగా సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, 68 పాయింట్ల లాభంతో, 16,931 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 15 పాయింట్ల స్వల్ప వృద్ధితో 5,082 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 31 May 2010 | 6:16 am రామ్ గోపాల్ వర్మ నాగార్జునకు "పెద్ద చెంచా"ఒకరికి అడుగులు మడుగులొత్తినట్లు ఎవరి ప్రవర్తనైనా ఉంటే సదరు వ్యక్తిని చెంచాగాడని అందరూ అంటుంటారు. క్రియేటివ్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మాత్రం తనకూ తానే ఒకప్పుడు టాలీవుడ్‌లో తానో చెంచాగాడిలా పనిచేశానంటూ పాత సంగతులను ఒక్కసారి నెమరేసుకున్నారు. "శివ" సినిమా తీయడానికి ముందు వర్మ బి.గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారట. అప్పట్లో నాగార్జున చిత్రం కలెక్టర్ గారి అబ్బాయి షూటింగ్ జరుగుతుంటే నాగ్‌ను ఇంప్రెస్ చేయడానికి రామ్‌గోపాల్ వర్మ శతవిధాలా ప్రయత్నించేవారట. వర్మ సిన్సియారిటీని చూసిన నాగార్జున కూడా ఆయన పట్ల సానుకూలంగా స్పందించేవారట. దీంతో వర్మను అందరూ "నాగార్జున చెంచా" అని పిలిచేవారట.Source: Yahoo! Telugu: Entertainment | 31 May 2010 | 5:59 am హెడ్లీ వద్ద విచారణ: అమెరికాకు వెళుతున్న భారత బృందంలష్కర్ తోయిబా తీవ్రవాది డేవిడ్ హెడ్లీ వద్ద విచారణ జరిపే నిమిత్తం భారత విచారణ బృందం సోమవారం అమెరికాకు బయలుదేరి వెళ్లనుంది. గత 2008 నవంబరు 26వ తేదీన ముంబై మహానగరంపై జరిగిన తీవ్రవాద దాడుల్లో డేవిడ్ హెడ్లీ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఆయనపై అమెరికా పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబై దాడుల కేసులో హెడ్లీ వద్ద ప్రత్యక్షంగా విచారణ జరిపేందుకు భారత్ కోరగా, దానికి అమెరికా అనుమతి ఇచ్చింది.Source: Yahoo! Telugu: News | 31 May 2010 | 5:54 am గత నాల్గవ త్రైమాసికంలో 8.6 శాతానికి చేరుకున్న వృద్ధిరేటుగత ఆర్థిక సంవత్సరం (2009-11) నాల్గవ త్రైమాసికం (జనవరి-మార్చి)లో దేశీయ ఆర్థిక వృద్ధి 8.6 శాతానికి చేరుకుందని కేంద్ర గణాంకాల సమాఖ్య సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.Source: Yahoo! Telugu: News | 31 May 2010 | 5:47 am కేసీఆర్ చేతిలో చావుదెబ్బలు తింటున్న "తెలంగాణా బంతి"తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌పై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణా ప్రాంతాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకుంటూ అమాయకులను బలి తీసుకుంటున్నారని ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 31 May 2010 | 2:56 am ఓదార్పు యాత్రను ఆపను... ఆపలేను: జగన్ మోహన్ రెడ్డితాను చేపట్టిన ఓదార్పు యాత్ర పూర్తిగా వ్యక్తిగతమని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరోమారు పునరుద్ఘాటించారు. అందువల్ల ఈ యాత్రను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తే లేదన్నారు. ఆరు నూరైనా యాత్రను కొనసాగించి తీరుతానని మనస్సులోని మాటను వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 31 May 2010 | 1:37 am చిరంజీవికి మంత్రి పదవి: జేసీ.దివాకర్ రెడ్డి సమాధానం!ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి మంత్రిపదవిని కట్టబెట్టే అంశంపై కాంగ్రెస్ హైకమాండ్, ముఖ్యమంత్రి కె.రోశయ్యలు తుది నిర్ణయం తీసుకుంటారని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేసీ.దివాకర్ రెడ్డి అన్నారు. ప్రజారాజ్యం పార్టీని ప్రభుత్వంలో చేర్చుకోవడం వల్ల పార్టీకి మేలు జరుగుతుందని హైకమాండ్ భావిస్తే.. ఆ విధంగానే చర్యలు తీసుకుంటుందన్నారు.Source: ఏపీ న్యూస్ | 31 May 2010 | 12:06 am జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం: 148కు చేరిన మృతులుజ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన సంఘటనలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య ఇప్పటి వరకు 148కు చేరుకుంది. నుజ్జునుజ్జు అయిన రైల్వే బోగీలలో చిక్కుకున్న మృతదేహాల కోసం ఇంకా గాలిస్తున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే.Source: జాతీయ | 30 May 2010 | 11:40 pm అభ్యర్థుల ఎంపిక వార్తలు ఊహాగానాలే: మొయిలీవచ్చే నెలలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం అభ్యర్థులను ఎంపిక చేసినట్టు వస్తున్న వార్తలను కేంద్ర న్యాయశాఖామంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ తోసిపుచ్చారు. ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని ఆయన పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 30 May 2010 | 11:33 pm హస్తినకు వెళ్లిన వైఎస్.జగన్: అధిష్టానానికి వివరణ!కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంటరీ ఫైనాన్స్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హస్తినకు వెళ్లారు. ఈ సమావేశం అనంతరం ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిసే అవకాశం ఉంది.Source: ఏపీ న్యూస్ | 30 May 2010 | 10:26 pm రవిశంకర్‌పై హత్యాయత్నం: అదుపులో అనుమానితుడు!పండింట్ రవిశంకర్‌పై గుర్తుతెలియని అగంతుకులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు సత్సంగ్ నుంచి తన కుటీరానికి కారులో వెళుతుండగా ఓ అగంతకుడు కాల్పులు జరిపాడు. అయితే, ఈ కాల్పుల నుంచి రవిశంకర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కానీ, ఆయన పక్కన ఉండే అనుచరునికి బుల్లెట్ గాయమైంది.Source: జాతీయ | 30 May 2010 | 9:47 pm విశ్వాస పరీక్షకు ముందే తప్పుకున్న శిబూ సొరేన్!జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం నుంచి జార్ఖండ్ ముక్తిమోర్ఛా చీఫ్ శిబూ సొరేన్ తప్పుకున్నారు. భారతీయ జనతా పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చిన ఆయన.. ఆ పార్టీ మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ఆయన సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది. ఇందులో ఓటమి పాలుకావడం తథ్యమని గ్రహించిన సొరేన్.. ఒక రోజుకు ముందుగానే తన పదవికి రాజీనామా చేశారు.Source: జాతీయ | 30 May 2010 | 9:38 pm పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో చెలరేగిన హింస!పశ్చిమబెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో స్వల్పంగా హింస చెలరేగింది. ఈ ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయించేందుకు పోటీ పడుతున్న లెఫ్ట్ కూటమి, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో స్వల్పంగా హింస చెలరేగింది.Source: జాతీయ | 30 May 2010 | 4:15 am ప్రతి రెండు రోజులకు ముగ్గురిని చంపుతున్న మావోలుమావోయిస్టులు విధ్వంసం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజల బాగోగుల కోసం తుపాకీ చేతబట్టామని చెపుతున్న మావోయిస్టులు.. ఆ ప్రజల ప్రాణాలనే తృణప్రాయంగా తీస్తున్నారు. గత ఐదు సంవత్సరాల్లో ప్రతి రెండు రోజులకు ముగ్గురు చొప్పున హతమార్చుతున్నట్టు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి.Source: జాతీయ | 30 May 2010 | 3:14 am మహిళ ఎదుగుదలను ఓర్వలేని రాజకీయ నేతలు: రోజారాజకీయాల్లో ఒక మహిళ స్వయంకృషితో ఎదగడాన్ని రాజకీయ నేతలు ఓర్వలేరని తెలుగుదేశం పార్టీ మాజీ మహిళానేత, సినీ నటి ఆర్.కె.రోజా అభిప్రాయపడ్డారు. ఆమె ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయ రంగ ప్రవేశం చేసినట్టు చెప్పారు. అయితే, తాను చేసిన సేవకు మంచి పేరు, గుర్తింపు రావడాన్ని ఓర్వలేని కొందరు తనను అణగదొక్కారని ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 30 May 2010 | 2:26 am
|