|
పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో చెలరేగిన హింస!పశ్చిమబెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో స్వల్పంగా హింస చెలరేగింది. ఈ ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయించేందుకు పోటీ పడుతున్న లెఫ్ట్ కూటమి, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో స్వల్పంగా హింస చెలరేగింది.Source: Yahoo! Telugu: News | 30 May 2010 | 9:45 am సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్‌పై బంగ్లాదేశ్ నిషేధం!సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్‌పై మొన్న పాకిస్థాన్ నిషేధం విధించగా, తాజాగా, బంగ్లాదేశ్ కూడా ఇదే తరహా చర్య చేపట్టింది. మహ్మద్ ప్రవక్తను కించ పరిచేలా ఫేస్‌బుక్‌లో కార్టూన్లు దర్శనమివ్వడంతో ఈ చర్య తీసుకున్నారు. అయితే, దీనికి సంబంధించి అధికారపూర్వక ప్రకటనను బంగ్లాదేశ్ ప్రభుత్వం వెలువరించలేదు. కానీ, డైలీ స్టార్ న్యూస్ పేపర్ మాత్రం బంగ్లాదేశ్ టెలీ కమన్యూనికేషన్ రెగ్యులేటరీ కమిషన్‌కు చెందిన పేరు వెల్లడించని సీనియర్ అధికారి చెప్పినట్టు పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 30 May 2010 | 9:33 am భారత్‌తో పూర్తిస్థాయి యుద్ధానికి తావులేదు: జర్దారీభారత్తో పూర్తిస్థాయి యుద్ధానికి ఏమాత్రం తావులేదని పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ అన్నారు. ప్రస్తుతం తమ దేశ మనుగడ కోసం తీవ్రవాదంపై అలుపెరగని పోరు సాగిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆయన ఒక వార్తా పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్నేళ్ళలో తమ దేశ రాజకీయ వ్యవస్థ బాగా పరిణితి చెందిందన్నారు. దీనికి నిదర్శనమే 18వ రాజ్యాంగ బిల్లని ఆయన పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 30 May 2010 | 8:52 am ప్రతి రెండు రోజులకు ముగ్గురిని చంపుతున్న మావోలుమావోయిస్టులు విధ్వంసం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజల బాగోగుల కోసం తుపాకీ చేతబట్టామని చెపుతున్న మావోయిస్టులు.. ఆ ప్రజల ప్రాణాలనే తృణప్రాయంగా తీస్తున్నారు. గత ఐదు సంవత్సరాల్లో ప్రతి రెండు రోజులకు ముగ్గురు చొప్పున హతమార్చుతున్నట్టు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి.Source: Yahoo! Telugu: News | 30 May 2010 | 8:44 am మహిళ ఎదుగుదలను ఓర్వలేని రాజకీయ నేతలు: రోజారాజకీయాల్లో ఒక మహిళ స్వయంకృషితో ఎదగడాన్ని రాజకీయ నేతలు ఓర్వలేరని తెలుగుదేశం పార్టీ మాజీ మహిళానేత, సినీ నటి ఆర్.కె.రోజా అభిప్రాయపడ్డారు. ఆమె ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయ రంగ ప్రవేశం చేసినట్టు చెప్పారు. అయితే, తాను చేసిన సేవకు మంచి పేరు, గుర్తింపు రావడాన్ని ఓర్వలేని కొందరు తనను అణగదొక్కారని ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 30 May 2010 | 7:55 am చిరుతో వైఎస్సే సంప్రదింపులు జరుపమన్నారు: జేసీదివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి జీవించి ఉన్న సమయంలోనే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో సంప్రదింపులు జరుపమన్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ చిరంజీవిని కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పిలిచి మంతనాలు జరుపడం వెనుక ప్రాధాన్యత ఉందన్నారు.Source: Yahoo! Telugu: News | 30 May 2010 | 7:37 am సెంట్రల్ బ్యాంకు సీజీఎంగా సోమయాజులు నియామకంసెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్‌గా కేఏ.సోమయాజులు నియమితులయ్యారు. ప్రస్తుతం సోమయాజులు అంతర్జాతీయ, ట్రెజరీ శాఖలకు జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బ్యాంకు విస్తరణ, అభివృద్ధికి ఆయన పలు రకాల చర్యలు తీసుకున్నారు.Source: Yahoo! Telugu: News | 30 May 2010 | 7:21 am జ్ఞానేశ్వరి రైలు ప్రమాదం: 114కు పెరిగిన మృతులుజ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 114కు చేరుకున్నట్టు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. అదేసమయంలో ఈ ప్రమాదం వెనుక రాజకీయ కుట్ర దాగివుందని కేంద్ర రైల్వేశాఖామంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అందువల్ల ఈ ప్రమాదంపై సీబీఐతో విచారణ జరిపించనున్నట్టు ఆమె తెలిపారు. ఇదిలావుండగా, ఈ మార్గంలో ఆదివారం నుంచి రైలు సేవలను పునరుద్ధరించారు.Source: Yahoo! Telugu: News | 30 May 2010 | 7:16 am అణు ఒప్పందానికి పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి: బ్లేక్భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన ప్రతిష్టాత్మక పౌర అణు ఒప్పందం అమలులో జాప్యం నెలకొనడం పట్ల తాము నిరాశ చెందడం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ ఒప్పందం అమలుకు భారత పార్లమెంట్ ఆమోదం తప్పనిసరని దక్షిణా, మధ్య ఆసియా ప్రాంతాల విదేశాంగ మంత్రి సహాయ మంత్రి రాబర్ట్ బ్లేక్ అభిప్రాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 30 May 2010 | 7:05 am లాహోర్ మసీదులపై దాడులు: పాక్ తాలిబన్ల హస్తంఇటీవల లాహోర్‌లో మసీదులపై జరిగిన దాడుల వెనుక తాలిబన్ల హస్తం ఉన్నట్టు పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు తీవ్రవాదుల్లో ఒకరు వెల్లడించారు. ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు వజీరిస్థాన్, గిరిజన ప్రాబల్య ప్రాంతంలో ప్రత్యేకంగా శిక్షణ పొందినట్టు వారు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 30 May 2010 | 6:57 am పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో చెలరేగిన హింస!పశ్చిమబెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో స్వల్పంగా హింస చెలరేగింది. ఈ ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయించేందుకు పోటీ పడుతున్న లెఫ్ట్ కూటమి, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో స్వల్పంగా హింస చెలరేగింది.Source: జాతీయ | 30 May 2010 | 4:15 am ప్రతి రెండు రోజులకు ముగ్గురిని చంపుతున్న మావోలుమావోయిస్టులు విధ్వంసం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజల బాగోగుల కోసం తుపాకీ చేతబట్టామని చెపుతున్న మావోయిస్టులు.. ఆ ప్రజల ప్రాణాలనే తృణప్రాయంగా తీస్తున్నారు. గత ఐదు సంవత్సరాల్లో ప్రతి రెండు రోజులకు ముగ్గురు చొప్పున హతమార్చుతున్నట్టు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి.Source: జాతీయ | 30 May 2010 | 3:14 am మహిళ ఎదుగుదలను ఓర్వలేని రాజకీయ నేతలు: రోజారాజకీయాల్లో ఒక మహిళ స్వయంకృషితో ఎదగడాన్ని రాజకీయ నేతలు ఓర్వలేరని తెలుగుదేశం పార్టీ మాజీ మహిళానేత, సినీ నటి ఆర్.కె.రోజా అభిప్రాయపడ్డారు. ఆమె ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయ రంగ ప్రవేశం చేసినట్టు చెప్పారు. అయితే, తాను చేసిన సేవకు మంచి పేరు, గుర్తింపు రావడాన్ని ఓర్వలేని కొందరు తనను అణగదొక్కారని ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 30 May 2010 | 2:26 am చిరుతో వైఎస్సే సంప్రదింపులు జరుపమన్నారు: జేసీదివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి జీవించి ఉన్న సమయంలోనే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో సంప్రదింపులు జరుపమన్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ చిరంజీవిని కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పిలిచి మంతనాలు జరుపడం వెనుక ప్రాధాన్యత ఉందన్నారు.Source: ఏపీ న్యూస్ | 30 May 2010 | 2:08 am జ్ఞానేశ్వరి రైలు ప్రమాదం: 114కు పెరిగిన మృతులుజ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 114కు చేరుకున్నట్టు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. అదేసమయంలో ఈ ప్రమాదం వెనుక రాజకీయ కుట్ర దాగివుందని కేంద్ర రైల్వేశాఖామంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అందువల్ల ఈ ప్రమాదంపై సీబీఐతో విచారణ జరిపించనున్నట్టు ఆమె తెలిపారు. ఇదిలావుండగా, ఈ మార్గంలో ఆదివారం నుంచి రైలు సేవలను పునరుద్ధరించారు.Source: జాతీయ | 30 May 2010 | 1:46 am మావోల దాడులు: రాత్రిపూట రైళ్లను రద్దు చేసిన రైల్వేమావోయిస్టుల దాడుల కారణంగా నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో రాత్రిపూట తిరిగే అన్నిరకాల ప్యాసింజర్ రైళ్లను కేంద్ర రైల్వే శాఖ రద్దు చేసింది. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు నడిచే అన్ని రకాల రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.Source: జాతీయ | 29 May 2010 | 11:08 pm కర్ణాటకలో బస్సు ప్రమాదం: 30 మంది సజీవ దహనంకర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన డీజల్ ట్యాంకర్‌తో ఢీకొన్న ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. చల్లనకేరి ఏరియాలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.Source: జాతీయ | 29 May 2010 | 11:07 pm మోహన్ బాబూ.. పిల్లలున్నారు.. ఇప్పుడవన్నీ ఎందుకూ..?: చిరుచిత్రరంగంలో హేమాహేమీలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని, యువరత్న బాలకృష్ణను, దర్శకరత్న దాసరి నారాయణరావులను "ఝుమ్మంది నాదం" ఆడియో కార్యక్రమానికి మోహన్ బాబు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.మోహన్ బాబు మాట్లాడుతూ... "చిరంజీవీ... నీ గురించి చెప్పాలయ్యా.. నువ్వు పరిచయం అయినప్పుడు.." అంటూ ఏదో చెప్పబోతుండగా... లాభం లేదని చిరంజీవి మోహన్ బాబు చేతిలోంచి మైకుని లాక్కుని... "మోహన్ బాబూ.. నీకు ఏజ్ పెరిగినా ఎలా మాట్లాడాలో ఇంకా తెలియడం లేదు. పిల్లలున్నారు.... మనం మన ఏజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మాట్లాడాలి" అని చురక అంటించారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 May 2010 | 2:35 pm "ఝుమ్మంది నాదం" ఆడియో కార్యక్రమంలో చిరు -బాలయ్యకె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్, తాప్సీ జంటగా నటించిన ఝుమ్మంది నాదం ఆడియో విడుదల శుక్రవారం రాత్రి రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, దాసరి నారాయణరావు హాజరుకావడం ప్రత్యేకత సంతరించుకుంది. బాలకృష్ణ మాట్లాడుతూ.. చక్కటి ఫీల్ గల టైటిల్. కీరవాణి కాంబినేషన్ అంటేనే సక్సెస్‌ఫుల్. నిర్మాత లక్ష్మీప్రసన్న వాళ్ల నాన్నలా మంచి మనస్తత్వం. అన్ని శాఖలను ఆమె సమన్వయం చేస్తూ నిర్మాతగా మంచి పేరు తెచ్చుకుంది. నటిగా కూడా మారిన లక్ష్మీ ప్రసన్న నిర్మాతగా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 May 2010 | 12:46 pm తెలంగాణా బంద్: పట్టించుకోని భాగ్యనగర వాసులుతెలంగాణా బంద్ శనివారంనాడు హైదరాబాదులో పాక్షికంగా జరిగింది. ఉస్మానియా యూనివర్శిటీ చుట్టుప్రక్కల కొన్ని ప్రాంతాలవరకూ బందోబస్తు మధ్య బస్సులు తిరిగాయి. ట్యాంక్‌బండ్ దాటిన తర్వాత బంద్ ప్రభావమే కన్పించలేదు. పంచాగుట్ట, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్‌లోని రోడ్లు బిజీగా కనిపించాయి.Source: ఏపీ న్యూస్ | 29 May 2010 | 8:15 am రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు: చిరంజీవి ప్రశ్న!రేపు (భవిష్యత్) ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. రాజకీయాల్లో ఎపుడు ఎం జరుగుతుందో చెప్పలేమన్నారు. అందువల్ల రేపుటి సంగతి తాను ఎలా చెప్పగలనన్నారు.Source: ఏపీ న్యూస్ | 29 May 2010 | 8:14 am "బాబు"కోసం నా చివరి రక్తపు బొట్టు వరకూ శ్రమిస్తా: జూ.ఎన్టీఆర్హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుకు యువరత్న బాలకృష్ణతోపాటు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. మహానాడుకు వచ్చిన కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుగారిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరు కష్టపడాలనీ, తనమటుకు తాను తన శరీరంలోని ఆఖరి రక్తపు బొట్టు వరకూ తెలుగుదేశం పార్టీకోసం కృషి చేస్తానని వెల్లడించారు.నాడు "అన్న" స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకోసం ఎందరో తెలుగు తమ్ముళ్లు ప్రాణాలర్పించి పార్టీకోసం పాటుపడ్డారని ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బలహీన ప్రభుత్వం ఉందనీ, ఇది ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు కనుక అందరూ ఎన్నికలకోసం సిద్ధంగా ఉండాలన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 May 2010 | 7:35 am సీఎం పదవి కంటే రాష్ట్రాభివృద్ధే ముఖ్యం: చంద్రబాబుతనకు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కంటే రాష్ట్రాభివృద్ధే ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గండిపేటలో శనివారంతో ముగిసిన ఆ పార్టీ మహానాడులో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఎనిమిదో సారి తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం పూర్తిగా అవినీతిమయంలో కూరుకుని పోయిందన్నారు.Source: ఏపీ న్యూస్ | 29 May 2010 | 6:52 am తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నికనారా చంద్రబాబు నాయుడు మరోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. గండిపేటలో జరిగిన మహానాడు చివరి రోజునాడు ఆయన ఎన్నికను సభ్యులందరూ ముక్త కంఠంతో ఆమోదించారు.Source: ఏపీ న్యూస్ | 29 May 2010 | 6:41 am రాజశేఖర్ "మా అన్నయ్య బంగారం"ఏడుగురు అన్నదమ్ముల కథ నేపధ్యంగా మా అన్నయ్య బంగారం చిత్రం రూపొందుతోంది. డాక్టర్ రాజశేఖర్, కమిలినీ ముఖర్జీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జొన్నలగడ్డ శ్రీను దర్శకుడు. హైదరాబాదులో ఈనెల 14 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ రాజశేఖర్ ఇంటి సెట్‌ను నానక్‌రామ్‌గూడా స్టూడియోలో 25 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నామనీ, ఈసెట్‌లో 24 నుంచి జూన్ 15 వరకూ షూటింగ్ జరుపుతామని పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 May 2010 | 6:35 am జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ఘాతుకం: 104కి చేరిన మృతుల సంఖ్య!పశ్చిమ బెంగాల్‌లో గురువారం అర్థరాత్రికి తర్వాత జరిగిన జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 104కి చేరుకుంది. ఈ ప్రమాదంలో భోగీల కింద చిక్కుకుపోయిన 104 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. ఇంకా రైలు భోగీల కింద ప్రయాణీకుల మృతి దేహాలున్నట్లు రైల్వేశాఖ అనుమానిస్తోంది.Source: జాతీయ | 29 May 2010 | 6:09 am ఓదార్పు వద్దని జగన్‌కి స్పష్టంగా చెప్పాం: ప్రణబ్ ముఖర్జీవైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రపై తొలిసారిగా ఢిల్లీ స్థాయి నేత స్పందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శనివారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఓదార్పు యాత్రను ఆపేయమని కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్పష్టమైన సంకేతాలను పంపిందని చెప్పారు.Source: జాతీయ | 29 May 2010 | 5:55 am "స్నేహగీతం" ట్రెయిలర్లార్స్కో ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై మధుర శ్రీధర్‌రెడ్డి దర్శకత్వంలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం 'స్నేహ గీతం. ఈ చిత్రం గురించి లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ "నూతన తారాగణంలో ఆహ్లాదకరంగా, సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈనాటి యువత మనోభావాలకు దర్పణం మా 'స్నేహగీతం.Source: Yahoo! Telugu: Entertainment | 29 May 2010 | 5:47 am కేసీఆర్ పెద్ద "బఫూన్": ప్రజారాజ్యం పార్టీ రెబల్ ఎద్దేవావైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర భగ్నం తర్వాత తెలంగాణా ప్రాంత నాయకుల మధ్య పరస్పర దూషణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా ప్రజారాజ్యం పార్టీ రెబల్ మహేశ్వర్ రెడ్డి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పై విరుచుక పడ్డారు. కేసీఆర్ "పెద్ద బఫూన్" అని ఆయన అభివర్ణించారు.Source: ఏపీ న్యూస్ | 29 May 2010 | 3:34 am ప్రజలకు వ్యతిరేకంగా మావోయిస్టుల పోరు: ప్రకాష్ కారత్జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ వంటి ఘాతుకాలను బట్టి చూస్తుంటే.. మావోయిస్టులు ప్రజలకు వ్యతిరేకంగా పోరుకు నాంది పలికినట్లు తెలుస్తోందని మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌లో గురువారం అర్థరాత్రికి తర్వాత జరిగిన జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి మావోయిస్టులు కారణమని రైల్వేశాఖ ప్రకటించిన నేపథ్యంలో.. పశ్చిమ బెంగాల్‌లో మావోలు ఒడిగట్టిన భారీ విధ్వంసాన్ని ప్రకాష్ కారత్ తీవ్రంగా ఖండించారు.Source: జాతీయ | 29 May 2010 | 3:17 am వైఎస్ జగన్ తెలంగాణా ద్రోహి: ఈటెల రాజేందర్తెలంగాణా ప్రాంతంలో ఓదార్పు యాత్ర చేపట్టి హింసాత్మక ఘటనలు చోటుచేసుకునేందుకు కారణమైన తెలంగాణా ద్రోహి జగన్‌కు తెలంగాణా ప్రజలు బుద్ధి చెప్పాలని తెరాస నాయకుడు ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. తెలంగాణా బంద్ లో భాగంగా ఆయన తెలంగాణా శ్రేణులతో సహా పలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.Source: ఏపీ న్యూస్ | 29 May 2010 | 2:23 am
|