|
ప్రధాని పదవి నుంచి తప్పుకుంటా..!: మాధవ్ కుమార్మావోయిస్టుల హెచ్చరికలకు శిరసావహించి నేపాల్ ప్రధాన మంత్రి మాధవ్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మావోయిస్టుల నుంచి వరుసగా బెదిరింపులు, హెచ్చరికలు రావడంతో ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు మాధవ్ కుమార్ ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 29 May 2010 | 9:12 am కేసీఆర్ పెద్ద "బఫూన్": ప్రజారాజ్యం పార్టీ రెబల్ ఎద్దేవావైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర భగ్నం తర్వాత తెలంగాణా ప్రాంత నాయకుల మధ్య పరస్పర దూషణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా ప్రజారాజ్యం పార్టీ రెబల్ మహేశ్వర్ రెడ్డి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పై విరుచుక పడ్డారు. కేసీఆర్ "పెద్ద బఫూన్" అని ఆయన అభివర్ణించారు.Source: Yahoo! Telugu: News | 29 May 2010 | 9:01 am ప్రజలకు వ్యతిరేకంగా మావోయిస్టుల పోరు: ప్రకాష్ కారత్జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ వంటి ఘాతుకాలను బట్టి చూస్తుంటే.. మావోయిస్టులు ప్రజలకు వ్యతిరేకంగా పోరుకు నాంది పలికినట్లు తెలుస్తోందని మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌లో గురువారం అర్థరాత్రికి తర్వాత జరిగిన జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి మావోయిస్టులు కారణమని రైల్వేశాఖ ప్రకటించిన నేపథ్యంలో.. పశ్చిమ బెంగాల్‌లో మావోలు ఒడిగట్టిన భారీ విధ్వంసాన్ని ప్రకాష్ కారత్ తీవ్రంగా ఖండించారు.Source: Yahoo! Telugu: News | 29 May 2010 | 8:46 am వైఎస్ జగన్ తెలంగాణా ద్రోహి: ఈటెల రాజేందర్తెలంగాణా ప్రాంతంలో ఓదార్పు యాత్ర చేపట్టి హింసాత్మక ఘటనలు చోటుచేసుకునేందుకు కారణమైన తెలంగాణా ద్రోహి జగన్‌కు తెలంగాణా ప్రజలు బుద్ధి చెప్పాలని తెరాస నాయకుడు ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. తెలంగాణా బంద్ లో భాగంగా ఆయన తెలంగాణా శ్రేణులతో సహా పలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.Source: Yahoo! Telugu: News | 29 May 2010 | 7:51 am "బాబు"కోసం నా చివరి రక్తపు బొట్టు వరకూ శ్రమిస్తా: జూ.ఎన్టీఆర్హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుకు యువరత్న బాలకృష్ణతోపాటు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. మహానాడుకు వచ్చిన కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుగారిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరు కష్టపడాలనీ, తనమటుకు తాను తన శరీరంలోని ఆఖరి రక్తపు బొట్టు వరకూ తెలుగుదేశం పార్టీకోసం కృషి చేస్తానని వెల్లడించారు.నాడు "అన్న" స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకోసం ఎందరో తెలుగు తమ్ముళ్లు ప్రాణాలర్పించి పార్టీకోసం పాటుపడ్డారని ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బలహీన ప్రభుత్వం ఉందనీ, ఇది ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు కనుక అందరూ ఎన్నికలకోసం సిద్ధంగా ఉండాలన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 May 2010 | 7:35 am భారత గడ్డపై టిబెటెన్ల వ్యతిరేక చర్యలను అనుమతించం..!భారత గడ్డపై చైనాకు వ్యతిరేకంగా టిబెట్లను చేపడుతున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించదనిరాష్ట్రపతి ప్రతిభా పాటిల్ వెల్లడించారు. చైనా ప్రభుత్వ చర్యలకు నిరసనగా భారత్‌లో టిబెట్లను చేసే కార్యక్రమాలను తమ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లోనూ అంగీకరించదని చైనాకు ప్రతిభా పాటిల్ హామీ ఇచ్చారు.Source: Yahoo! Telugu: News | 29 May 2010 | 7:16 am మరో నాలుగేళ్లలో టోల్ కలెక్షన్ల ద్వారా రూ.10వేల కోట్లుదేశంలోని జాతీయ రహదారుల ద్వారా రాబోయే నాలుగేళ్లలో టోల్ వసూళ్లు రూపేణా సుమారు 10 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.Source: Yahoo! Telugu: News | 29 May 2010 | 7:03 am ఒరిస్సాతో పాటు ఐదు రాష్ట్రాల్లో రాత్రిపూట నడిచే రైళ్లు రద్దు!ఒరిస్సాతో పాటు ఐదు రాష్ట్రాల్లో రాత్రిపూట నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఉత్తర రైల్వే బోర్డు సభ్యుడు వివేక్ సహాయ్ వెల్లడించారు. పశ్చిమబెంగాల్, ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్ వంటి ఐదు రాష్ట్రాల్లో రాత్రిపూట నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివేక్ సహాయ్ శనివారం విలేకరుల సమక్షంలో ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 29 May 2010 | 6:52 am రాజశేఖర్ "మా అన్నయ్య బంగారం"ఏడుగురు అన్నదమ్ముల కథ నేపధ్యంగా మా అన్నయ్య బంగారం చిత్రం రూపొందుతోంది. డాక్టర్ రాజశేఖర్, కమిలినీ ముఖర్జీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జొన్నలగడ్డ శ్రీను దర్శకుడు. హైదరాబాదులో ఈనెల 14 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ రాజశేఖర్ ఇంటి సెట్‌ను నానక్‌రామ్‌గూడా స్టూడియోలో 25 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నామనీ, ఈసెట్‌లో 24 నుంచి జూన్ 15 వరకూ షూటింగ్ జరుపుతామని పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 May 2010 | 6:35 am తెలంగాణలో ప్రశాంతంగా పాక్షికంగా సాగుతున్న బంద్తెలంగాణలో తెలంగాణ వాదులు తలపెట్టిన బంద్ ప్రశాంతంగా పాక్షికంగా సాగుతోంది. వరంగల్ జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లో ఈ బంద్ ప్రభావం పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ కూడా వోల్వో బస్సులు మినహా మిగిలిన అన్ని సర్వీసులను నడుపుతోంది. పలు చోట్ల ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించిన తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేశారు.Source: Yahoo! Telugu: News | 29 May 2010 | 6:18 am జూన్ 3 నుంచి ప్రధాని మన్మోహన్ అమెరికా పర్యటనప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ వచ్చే నెల మూడో తేదీ నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అగ్రరాజ్యం అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమై ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కీలకంగా చర్చించనున్నారు.Source: Yahoo! Telugu: News | 29 May 2010 | 5:52 am "స్నేహగీతం" ట్రెయిలర్లార్స్కో ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై మధుర శ్రీధర్‌రెడ్డి దర్శకత్వంలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం 'స్నేహ గీతం. ఈ చిత్రం గురించి లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ "నూతన తారాగణంలో ఆహ్లాదకరంగా, సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈనాటి యువత మనోభావాలకు దర్పణం మా 'స్నేహగీతం.Source: Yahoo! Telugu: Entertainment | 29 May 2010 | 5:47 am ఆస్ట్రేలియాలో విద్యాభ్యాసం: భారీగా తగ్గిన దరఖాస్తులు!ఆస్ట్రేలియాలో విద్యాభ్యాసం కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గత యేడాదితో పోల్చుకుంటే ఈ యేడాది ఇప్పటి వరకు 20 శాతం మేరకు దరఖాస్తులు తగ్గాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 29 May 2010 | 5:43 am కేసీఆర్ పెద్ద "బఫూన్": ప్రజారాజ్యం పార్టీ రెబల్ ఎద్దేవావైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర భగ్నం తర్వాత తెలంగాణా ప్రాంత నాయకుల మధ్య పరస్పర దూషణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా ప్రజారాజ్యం పార్టీ రెబల్ మహేశ్వర్ రెడ్డి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పై విరుచుక పడ్డారు. కేసీఆర్ "పెద్ద బఫూన్" అని ఆయన అభివర్ణించారు.Source: ఏపీ న్యూస్ | 29 May 2010 | 3:34 am ప్రజలకు వ్యతిరేకంగా మావోయిస్టుల పోరు: ప్రకాష్ కారత్జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ వంటి ఘాతుకాలను బట్టి చూస్తుంటే.. మావోయిస్టులు ప్రజలకు వ్యతిరేకంగా పోరుకు నాంది పలికినట్లు తెలుస్తోందని మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌లో గురువారం అర్థరాత్రికి తర్వాత జరిగిన జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి మావోయిస్టులు కారణమని రైల్వేశాఖ ప్రకటించిన నేపథ్యంలో.. పశ్చిమ బెంగాల్‌లో మావోలు ఒడిగట్టిన భారీ విధ్వంసాన్ని ప్రకాష్ కారత్ తీవ్రంగా ఖండించారు.Source: జాతీయ | 29 May 2010 | 3:17 am వైఎస్ జగన్ తెలంగాణా ద్రోహి: ఈటెల రాజేందర్తెలంగాణా ప్రాంతంలో ఓదార్పు యాత్ర చేపట్టి హింసాత్మక ఘటనలు చోటుచేసుకునేందుకు కారణమైన తెలంగాణా ద్రోహి జగన్‌కు తెలంగాణా ప్రజలు బుద్ధి చెప్పాలని తెరాస నాయకుడు ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. తెలంగాణా బంద్ లో భాగంగా ఆయన తెలంగాణా శ్రేణులతో సహా పలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.Source: ఏపీ న్యూస్ | 29 May 2010 | 2:23 am ఒరిస్సాతో పాటు ఐదు రాష్ట్రాల్లో రాత్రిపూట నడిచే రైళ్లు రద్దు!ఒరిస్సాతో పాటు ఐదు రాష్ట్రాల్లో రాత్రిపూట నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఉత్తర రైల్వే బోర్డు సభ్యుడు వివేక్ సహాయ్ వెల్లడించారు. పశ్చిమబెంగాల్, ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్ వంటి ఐదు రాష్ట్రాల్లో రాత్రిపూట నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివేక్ సహాయ్ శనివారం విలేకరుల సమక్షంలో ప్రకటించారు.Source: జాతీయ | 29 May 2010 | 1:23 am తెలంగాణలో ప్రశాంతంగా పాక్షికంగా సాగుతున్న బంద్తెలంగాణలో తెలంగాణ వాదులు తలపెట్టిన బంద్ ప్రశాంతంగా పాక్షికంగా సాగుతోంది. వరంగల్ జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లో ఈ బంద్ ప్రభావం పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ కూడా వోల్వో బస్సులు మినహా మిగిలిన అన్ని సర్వీసులను నడుపుతోంది. పలు చోట్ల ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించిన తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేశారు.Source: ఏపీ న్యూస్ | 29 May 2010 | 12:48 am జూన్ 3 నుంచి ప్రధాని మన్మోహన్ అమెరికా పర్యటనప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ వచ్చే నెల మూడో తేదీ నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అగ్రరాజ్యం అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమై ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కీలకంగా చర్చించనున్నారు.Source: జాతీయ | 29 May 2010 | 12:22 am రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తథ్యం: బాలయ్య జోస్యంరాష్ట్రంలో పరిస్థితులు అస్తవ్యస్థంగా మారాయని, ఏ క్షణాన్నైనా మధ్యంతర ఎన్నికలు రావొచ్చని సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ జోస్యం చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఆ పార్టీ మహానాడు శనివారంతో ముగియనుంది. ఈ ముగింపు వేడుకల్లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు పాల్గొన్నారు.Source: ఏపీ న్యూస్ | 28 May 2010 | 11:21 pm రాజ్యసభ ఎన్నికలు: సోనియాతో భేటీకి హస్తినకు చిరుప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి శనివారం హస్తినకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీకి వెళుతున్నట్టు ప్రకటించారు. దీనిపై ఆయన శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ ఎన్నికలపై చర్చించేందుకే తాను ఢిల్లీ వెళుతున్నట్టు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 28 May 2010 | 11:08 pm ఎస్పీ ఇచ్చిన అవకాశాన్ని తిరస్కరించిన జయా బచ్చన్సమాజ్వాదీ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ప్రముఖ నటి జయా బచ్చన్ నిరాకరించారు. రాజ్యసభకు తనను తిరిగి నామినేట్ చేసేందుకు ఎస్పీ ఇచ్చిన అవకాశాన్ని తాను స్వీకరించడం లేదని ఆమె తెలిపారు. దీనిపై ఆమె మాట్లాడుతూ క్రియాశీలక రాజకీయాలకు కొద్దికాలం దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు చెప్పారు. అందువల్లే ఎస్పీ అవకాశాన్ని తిరస్కరిస్తున్నట్టు ఆమె తెలిపారు.Source: జాతీయ | 28 May 2010 | 10:34 pm సయీద్‌ను విడుదల చేయడం విచారకరం: మంత్రి కృష్ణముంబై దాడుల సూత్రధారిగా భావిస్తున్న లష్కర్ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సహీద్‌ను సుప్రీంకోర్టు గృహ నిర్భంధం నుంచి విముక్తి కల్పించడం పట్ల కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ఎం.కృష్ణ విచారం వ్యక్తం చేశారు. 26/11 దాడులకు సంబంధించి సయీద్ పాత్ర ఉన్నట్టు నిరూపించే అనేక సాక్ష్యాధారాలను పాక్‌కు సమర్పించినప్పటికీ ఇలా జరగడం దురదృష్టకరమన్నారు.Source: జాతీయ | 28 May 2010 | 10:22 pm టాలీవుడ్ టి-20 క్రికెట్ టీమ్‌లు రెడీపేద కళాకారులకోసం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన క్రికెట్ మ్యాచ్ జూన్ 13న జరుగనుంది. ఈ సందర్భంగా నాలుగు టీమ్‌ల సభ్యుల వివరాలను వెల్లడించారు.వెంకటేష్ టీమ్‌లో: తరుణ్ వైస్ కెప్టెన్, మనోజ్, శ్రీకాంత్, కల్యాణ్ రామ్, రోహిత్, ఆదర్శ్, కౌశిక్, నవీన్ రెడ్డి, రాజా, ఆర్యన్ రాజేష్, నారా రోహిత్, నిఖిల్, శివాజీ రాజా, అల్లరి నరేష్, చిత్రం శ్రీను, వెంకట్, శ్రీనివాస రెడ్డి, శివాజీ, రమణ ఉన్నారు.చిరంజీవి టీమ్‌లో: రామ్ చరణ్ - వైస్ కెప్టెన్, రవితేజ, ఆకాష్, రానా, అయ్యప్ప శర్మ, రఘు, సచిన్, అజయ్, అల్లు అర్జున్, వైభవ్, నితిన్, రాఘవేంద్ర, బ్రహ్మాజీ, శివబాలాజీ, శ్రీహరి, మాదాల రవి, జీవీ, వడ్డే నవీన్, సంగీప్ ఉన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2010 | 2:07 pm అత్యంత ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలుస్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద హరికృష్ణ, బాలకృష్ణ, పురంధేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్ తదితర కుటుంబ సభ్యులు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. ఆ తర్వాత మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్ సందర్శించారు.Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2010 | 11:59 am అల్లరి నరేష్ - కె. విశ్వనాథ్ చిత్రం "శుభప్రదం"కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించే చిత్రానికి శుభప్రదం అనే పేరు పెట్టారు. ఈ టైటిల్‌ను బుధవారం రాత్రి హైదరాబాదులో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దాడి వీరభద్రరావు, రచయిత సాయినాథ్, ఇవివి సత్యనారాయణ, కె.విశ్వనాథ్, నిర్మాత గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.విశ్వనాథ్ మాట్లాడుతూ, వేటూరి లేనిలోటు తీర్చలేనిది. నా సినిమాలకు అన్నీ ఆయనే సాహిత్యాన్ని రాసి వన్నె తెచ్చారు. ఆయన లేకుండా శుభప్రదం అనే పేరు పెట్టడం బాగోకపోయినా.. తప్పలేదు. ఈ సినిమాలో అందరూ బాగా పనిచేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2010 | 8:51 am నేను ముందు నుంచే చెపుతున్నా.. రావద్దని: కేసీఆర్వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణా జిల్లాల్లో ఓదార్పు చేస్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని తాను ఆది నుంచే హెచ్చరిస్తూనే ఉన్నానని తెరాస చీఫ్ కేసీఆర్ అన్నారు. ఎంత చెప్పినప్పటికీ మొండి వైఖరితో వరంగల్ జిల్లా ఓదార్పుకు వెళ్లి హింసకు కారణమయ్యారని అన్నారు.Source: ఏపీ న్యూస్ | 28 May 2010 | 8:12 am ముమ్మాటికీ జగన్‌దే తప్పు: జానా - కాకా - కేకేకాంగ్రెస్ హైకమాండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకూ అందరూ వరంగల్ ఓదార్పు యాత్ర వద్దని చెపుతున్నా మొండి వైఖరితో జగన్ యాత్రకు పూనుకోవడం వల్లనే మహబూబాబాద్ లో హింస చెలరేగిందని తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ధ్వజమెత్తారు.Source: ఏపీ న్యూస్ | 28 May 2010 | 7:05 am గూడ్స్ రైలు "ఢీ" కొట్టకపోతే.. ఘోర ప్రమాదం జరిగేది కాదు..!జ్ఞానేశ్వర్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ సమీక్షిస్తోంది. ట్రాక్‌పై నుంచి ఒరిగిపోయిన బోగీలను ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలు ఢీ కొట్టియుండకపోతే ఈ ఘోర ప్రమాదం జరిగి వుండేది కాదని ఉత్తర రైల్వే బోర్డు సభ్యుడు వివేక్ సహాయ్ చెప్పారు. గూడ్స్ రైలు ఢీకొనకకుండా ఉంటే ప్రాణనష్టం జరిగి వుండేది కాదని వివేక్ సహాయ్ వెల్లడించారు.Source: జాతీయ | 28 May 2010 | 6:16 am ఎన్ని అరెస్టులు చేసినా నా యాత్ర ఆగదు: జగన్వరంగల్ జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్ర ప్రారంభానికి ముందే రక్తసిక్తమైంది. దీంతో ఆయనను నల్గొండ జిల్లా వలిగొండ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ అరెస్టుతో ఆ ప్రాంతమంతా ఆయనకు అనుకూల వ్యతిరేక నినాదాలతో హోరెత్తిపోయింది.Source: ఏపీ న్యూస్ | 28 May 2010 | 6:13 am జగన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి: దామోదర్ రెడ్డిఅధిష్టానం ఆదేశాలను బేఖాతరు చేసి వరంగల్‌లో పర్యటించేందుకు సిద్ధమైన దివంగత ముఖ్యమంత్రి కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంటలిజెన్స్ వర్గాలు, ప్రభుత్వం, కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ వరంగల్‌లో ఓదార్పు యాత్ర వద్దంటూ వారించినా, చెప్పిన మాట వినకుండా యాత్ర తలపెట్టేందుకు ప్రయత్నించిన జగన్మోహన రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని దామోదర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 28 May 2010 | 5:59 am జగన్‌ను ముందస్తుగా అరెస్టు చేయలేం: డీజీపి గిరీష్మహబూబాబాద్ హింసాత్మక ఘటనకు సంబంధించి రాష్ట్ర డీజీపి గిరీష్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఎమ్మెల్యేలు కొండా సురేఖ, కవితలకు ప్రాణ హాని ఉన్నదన్న ఆందోళన వ్యక్తమయ్యే పరిస్థితిలో గన్‌మెన్లు కాల్పులకు పాల్పడే అవకాశం ఉన్నదనీ, అయితే దీనిపై సమగ్ర దర్యాప్తు చేయనున్నట్లు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 28 May 2010 | 5:25 am రైలు ప్రమాదానికి "మావో"లే కారణం: భూపిందర్ సింగ్దేశానికి పెను సవాలుగా పరిణమించిన మావోయిస్టులే జ్ఞానేశ్వరీ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి కారణమని పశ్చిమ బెంగాల్ పోలీసు ఉన్నతాధికారి భూపిందర్ సింగ్ తెలియజేశారు. రైల్వే పట్టాల కింద ఉంచిన బాంబు పేలడంతోనే ఈ ఘోర ప్రమాదం సంభవించిందని ఆయన వెల్లడించారు.Source: జాతీయ | 28 May 2010 | 4:15 am అల్లరి నరేష్ - కె. విశ్వనాథ్ చిత్రం "శుభప్రదం"కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించే చిత్రానికి శుభప్రదం అనే పేరు పెట్టారు. ఈ టైటిల్‌ను బుధవారం రాత్రి హైదరాబాదులో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దాడి వీరభద్రరావు, రచయిత సాయినాథ్, ఇవివి సత్యనారాయణ, కె.విశ్వనాథ్, నిర్మాత గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.విశ్వనాథ్ మాట్లాడుతూ, వేటూరి లేనిలోటు తీర్చలేనిది. నా సినిమాలకు అన్నీ ఆయనే సాహిత్యాన్ని...Source: వినోదం | 28 May 2010 | 3:21 am రైల్వే పట్టాలను పేల్చేసిన మావోలుః 68 మంది మృతిపశ్చిమబెంగాల్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పశ్చిమమిడ్నాపుర్ జిల్లాలో జార్‌గామ్ వద్ద రైల్వే పట్టాలను పేల్చివేశారు. దీంతో లోకమాన్య తిలక్ జ్ఞానేశ్వరీ సూపర్ డీలక్స్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 20మంది మృతి చెందగా మరో 150 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.Source: జాతీయ | 28 May 2010 | 3:19 am
|