కాల్పులకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన జేఏసీ‌!

మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో ఒక తెలంగాణావాది మరణించడాన్ని నిరసిస్తూ.. తెలంగాణ జేఏసీ శనివారం బంద్‌కు పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రజలు, తెరాసతో పాటు తెలంగాణలోని తొమ్మిది రాజకీయ పార్టీలు, వాణిజ్య సంస్థలు ఈ బంద్‌కు సహకరించాలని జేఏసీ పిలుపునిచ్చింది. చట్ట నిబంధనలకు ఉల్లఘించకుండా ప్రశాంత వాతావరణంలో తెలంగాణ బంద్ నిర్వహించాలని తెలంగాణ ఐక్య కార్యచరణ కమిటీ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 28 May 2010 | 9:18 am

ఒబామాను కలవనున్న పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్

పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తమ అధ్యక్షుడు బరాక్ ఒబామాను జూన్ 9న అమెరికాలో కలవనున్నట్లు ఆ దేశం ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 28 May 2010 | 9:01 am

పుంజుకున్న స్టాక్ మార్కెట్: లాభాల్లో సెన్సెక్స్!

బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్ 145 పాయింట్లు పుంజుకుని, 16,811 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 42 పాయింట్లు బలపడి, 5,045 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 28 May 2010 | 8:55 am

అల్లరి నరేష్ - కె. విశ్వనాథ్ చిత్రం "శుభప్రదం"

కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించే చిత్రానికి శుభప్రదం అనే పేరు పెట్టారు. ఈ టైటిల్‌ను బుధవారం రాత్రి హైదరాబాదులో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దాడి వీరభద్రరావు, రచయిత సాయినాథ్, ఇవివి సత్యనారాయణ, కె.విశ్వనాథ్, నిర్మాత గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.విశ్వనాథ్ మాట్లాడుతూ, వేటూరి లేనిలోటు తీర్చలేనిది. నా సినిమాలకు అన్నీ ఆయనే సాహిత్యాన్ని రాసి వన్నె తెచ్చారు. ఆయన లేకుండా శుభప్రదం అనే పేరు పెట్టడం బాగోకపోయినా.. తప్పలేదు. ఈ సినిమాలో అందరూ బాగా పనిచేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2010 | 8:51 am

ధరలు తగ్గి 16.23 శాతానికి చేరుకున్న ఆహార ద్రవ్యోల్బణం

కూరగాయలు, పండ్లు, మసూరి పప్పు ధరలు తగ్గడంతో మే 15తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గి 16.23 శాతానికి చేరుకుంది. అదే అంతక మునుపటి వారాంతానికి( మే 8) ఆహార ద్రవ్యోల్బణం 16.49 శాతంగా ఉండింది. దీంతో పోలిస్తే 0.26 శాతంమేరకు ఆహార ద్రవ్యోల్బణం తగ్గింది.
Source: Yahoo! Telugu: News | 28 May 2010 | 8:08 am

వై.ఎస్. జగన్ అరెస్టు: కొండా సురేఖ ఆత్మహత్యాయత్నం!

మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ శుక్రవారం ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. వై.ఎస్. జగన్మోహనరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కలత చెందిన కొండా సురేఖ ఆత్మహత్యకు పాల్పడినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన రెడ్డి వరంగల్‌లో చేపట్టదలచిన "ఓదార్పు యాత్ర"లో విధ్వంసం నెలకొంది.
Source: Yahoo! Telugu: News | 28 May 2010 | 7:39 am

ఎన్ని అరెస్టులు చేసినా నా యాత్ర ఆగదు: జగన్

వరంగల్ జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్ర ప్రారంభానికి ముందే రక్తసిక్తమైంది. దీంతో ఆయనను నల్గొండ జిల్లా వలిగొండ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ అరెస్టుతో ఆ ప్రాంతమంతా ఆయనకు అనుకూల వ్యతిరేక నినాదాలతో హోరెత్తిపోయింది.
Source: Yahoo! Telugu: News | 28 May 2010 | 7:28 am

విదేశీ స్టాక్ మార్కెట్ల ప్రభావం: సెన్సెక్స్ వృద్ధి!

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేసుకోవడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధిబాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి, 16,813 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 37 పాయింట్లు వృద్ధి చెంది, 5,040 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 28 May 2010 | 7:24 am

"నల్లధనం"పై జాబితా: భారత్‌‍కు పంపిన జర్మనీ ప్రభుత్వం!

అంతర్జాతీయ బ్యాంకుల్లో నల్లధనం దాచేసిన భారతీయుల జాబితాను జర్మనీ ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి పంపింది. విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచేసిన వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో, జర్మనీ తమ దేశ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న వ్యక్తుల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపింది.
Source: Yahoo! Telugu: News | 28 May 2010 | 7:15 am

భారత్‌‍తో సంబంధాలను పటిష్టపరచుకుంటాం: హిల్లరీ

భారత్, చైనాలాంటి అభివృద్ధిచెందుతున్న దేశాలతో తాము సత్సంబంధాలను మరింత దృఢపరచుకుంటామని అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ అన్నారు. ప్రత్యేకంగా భారత్‌తో సంబంధాలు తమ దేశానికి చాలా మంచిదని ఆమె అన్నారు.
Source: Yahoo! Telugu: News | 28 May 2010 | 7:13 am

షోరూంలను విస్తరించనున్న బాటా ఇండియా

దేశీయ చెప్పులు, షూల నిర్మాణంలో అగ్రగామిగానున్న బాటా ఇండియా కంపెనీ రానున్న మూడు సంవత్సరాల్లో రూ. 150-200 కోట్ల పెట్టుబడులు పెట్టి షోరూంలను విస్తరించనున్నట్లు కంపెనీ ఛైర్మెన్ పిఎమ్ సిన్హా కోలకతాలో వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 28 May 2010 | 7:00 am

కాల్పులకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన జేఏసీ‌!

మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో ఒక తెలంగాణావాది మరణించడాన్ని నిరసిస్తూ.. తెలంగాణ జేఏసీ శనివారం బంద్‌కు పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రజలు, తెరాసతో పాటు తెలంగాణలోని తొమ్మిది రాజకీయ పార్టీలు, వాణిజ్య సంస్థలు ఈ బంద్‌కు సహకరించాలని జేఏసీ పిలుపునిచ్చింది. చట్ట నిబంధనలకు ఉల్లఘించకుండా ప్రశాంత వాతావరణంలో తెలంగాణ బంద్ నిర్వహించాలని తెలంగాణ ఐక్య కార్యచరణ కమిటీ తెలిపింది.
Source: ఏపీ న్యూస్ | 28 May 2010 | 3:50 am

రైల్వే పట్టాలను పేల్చేసిన మావోలుః 68 మంది మృతి

పశ్చిమబెంగాల్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పశ్చిమమిడ్నాపుర్‌ జిల్లాలో జార్‌గామ్‌ వద్ద రైల్వే పట్టాలను పేల్చివేశారు. దీంతో లోకమాన్య తిలక్ జ్ఞానేశ్వరీ సూపర్ డీలక్స్ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో 20మంది మృతి చెందగా మరో 150 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
Source: జాతీయ | 28 May 2010 | 3:19 am

వై.ఎస్. జగన్ అరెస్టు: కొండా సురేఖ ఆత్మహత్యాయత్నం!

మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ శుక్రవారం ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. వై.ఎస్. జగన్మోహనరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కలత చెందిన కొండా సురేఖ ఆత్మహత్యకు పాల్పడినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన రెడ్డి వరంగల్‌లో చేపట్టదలచిన "ఓదార్పు యాత్ర"లో విధ్వంసం నెలకొంది.
Source: ఏపీ న్యూస్ | 28 May 2010 | 2:09 am

ఎన్ని అరెస్టులు చేసినా నా యాత్ర ఆగదు: జగన్

వరంగల్ జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్ర ప్రారంభానికి ముందే రక్తసిక్తమైంది. దీంతో ఆయనను నల్గొండ జిల్లా వలిగొండ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ అరెస్టుతో ఆ ప్రాంతమంతా ఆయనకు అనుకూల వ్యతిరేక నినాదాలతో హోరెత్తిపోయింది.
Source: ఏపీ న్యూస్ | 28 May 2010 | 1:59 am

వైఎస్ జగన్ మోహన్ గో బ్యాక్: తెలంగాణావాదుల ఆందోళన

కాంగ్రెస్ హైకమాండ్ మాటను తోసిరాజని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరంగల్ ఓదార్పు యాత్రకు బయలుదేరి వెళ్లారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను జనగామ స్టేషన్ వద్ద ఆందోళనకారులు అడ్డుకున్నారు. రైల్వే ట్రాక్‌పై పెద్ద పెద్ద వృక్షాలను అడ్డుగా వేశారు. మరికొన్నిచోట్ల రైల్వే పట్టాలను కోసి వేశారు. దీంతో రైల్వే అధికారులు రైలును ఆపివేశారు.
Source: ఏపీ న్యూస్ | 28 May 2010 | 1:24 am

కేసీఆర్ దమ్ముంటే నా ముందుకు రా... తేల్చుకుందాం

మహబూబాబాద్‌లో తనను హత్య చేయాలని కేసీఆర్ అండ్ కో పూనుకున్నదని మాజీమంత్రి కొండా సురేఖ ఆరోపించారు. కిరాయి గూండాలను, రౌడీలను రంగంలోకి దింపి తమను హతమార్చాలని కేసీఆర్ - కోదండరామ్ - హరీశ్ రావు పన్నాగం పన్నారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 28 May 2010 | 1:14 am

వైఎస్ జగన్ "ఓదార్పు" రణం: తెలంగాణావాది మృతి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణా జిల్లాల్లో చేపట్టిన ఓదార్పు యాత్ర రక్తసిక్తమవుతోంది. మహబూబాబాద్‌లో వైఎస్ జగన్ అడుగు పెడితే రణరంగమవుతుందని తెలంగాణావాదులు హెచ్చరిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 28 May 2010 | 12:51 am

మహబూబాబాద్‌లో యుద్ధ వాతావరణం: పోలీసుల కాల్పులు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర మహబూబాబాద్‌లో యుద్ధవాతావరణాన్ని సృష్టించింది. స్టేషన్లో కొండా సురేఖ మరికొంతమంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వేచివున్న వెయిటింగ్ హాలుకు తెలంగాణా ఆందోళనకారులు నిప్పు పెట్టడమే కాక రాళ్లదాడి చేస్తున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 28 May 2010 | 12:28 am

మృతుల కుటుంబాలకు రూ.5లక్షల నష్టపరిహారం: ప్రధాని

పశ్చిమ బెంగాల్‌లో మావోయిస్టుల దుశ్చర్యతో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో రైల్వే పట్టాలను మావోయిస్టులు పేల్చేసిన సంఘటనలో మృతి చెందిన కుటుంబానికి రూ.5లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు.
Source: జాతీయ | 28 May 2010 | 12:07 am

వైఎస్ జగన్ మోహన్‌పై సోనియా గాంధీ "మెగా" అస్త్రం!

రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ సహకారం కావాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణకు తెరపడనుంది. ఈ మేరకు రాజ్యసభ ఎన్నికల్లో ప్రరాపా మద్దతు కావాలని యూపీఏ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పీఆర్పీ అధినేత చిరంజీవిని కోరినట్లు వార్తలు వస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 27 May 2010 | 11:56 pm

ఇస్పాత్, జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ళ రద్దుః ఎస్ఈఆర్

మావోయిస్టులు గురువారం అర్ధరాత్రి పశ్చిమ మిడ్నాపుర్‌ జిల్లాలో జార్‌గామ్‌ వద్ద రైల్వే పట్టాలను పేల్చివేశారు. దీంతో హౌరా-బారబలీ మధ్య నడిచే జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్, హౌరా-జంషెడ్‌పూర్‌ మధ్య నడిచే ఇస్పాత్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు దక్షిణ-తూర్పు రైల్వే శాఖ శుక్రవారం ప్రకటించింది.
Source: జాతీయ | 27 May 2010 | 11:53 pm

అధిష్టానం ఆదేశాలు బేఖాతరు: వరంగల్‌లో జగన్ "ఓదార్పు"!

వరంగల్‌లో ఓదార్పు యాత్ర వద్దని అధిష్టానం ఆదేశించినా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు, కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డి శుక్రవారం వరంగల్ ఓదార్పు యాత్రకు బయలుదేరారు. మహానేత వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక గుండెపగిలి మరణించిన కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ చెప్పినట్లే వరంగల్‌లో ఓదార్పు యాత్రను ప్రారంభించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 27 May 2010 | 11:10 pm

బీహార్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్

బీహార్‌లో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోను జతకట్టకూడదని కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సన్నాహాలు ప్రారంభించింది.
Source: జాతీయ | 27 May 2010 | 10:28 pm

మాస్‌పై పేలిన తూటా గోపీచంద్ "గోలీమార్"

గోలీమార్ చిత్రం మొదట్లోనే రామ్‌గోపాల్ వర్మకు ధన్యవాదాలు తెలియజేసే స్లైడ్‌ను పూరీ జగన్నాథ్ వేశాడు. కథ ముందుగా చెప్పినట్లుగా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ గురించి. రామ్‌గోపాల్ వర్మ "అబ్‌తక్ చప్పన్" సినిమా రూపొందించారు. అందులో హీరో పాత్రను పూరీ గోపీచంద్‌కు ఆపాదించాడు. దయానాయక్ ప్రేరణగా తెలుగులో సినిమాలు చాలా వచ్చాయి. అరకులో చాలా పాటలు షూట్ చేశారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుందంటున్నారు పూరీ. ఇది ఆయన స్టైల్‌లో ఉంది. కాకపోతే పోలీస్ కథాంశం అనగానే "పోకిరి"ని ఇంకా మర్చిపోలేదు ప్రేక్షకులు, అలాగే పూరీ కూడా ఆ సినిమాను మర్చిపోయినట్లు కనబడలేదు. అదే ప్యాట్రన్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమాను లాగించేశాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 27 May 2010 | 11:39 am

తెలంగాణా యివ్వకపోతే యుద్ధం ఖాయం: కేసీఆర్

తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట చంద్రశేఖర రావు మరోసారి మీడియా ముందుకు వచ్చారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను తూర్పారబట్టారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణాకు అనుకూలమేనని వక్కాణించిన నాయకులు నేడు మాట తప్పి మాట్లాడుతున్నారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 27 May 2010 | 8:44 am

మీ ఇష్టం వచ్చిన రేటును ఫిక్స్ చేసుకోండి: తమన్నా

హ్యాపీడేస్ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన తెల్లపిల్ల తమన్నా తాజా తమిళ చిత్రం "సురా" బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. దీంతో తమిళ నిర్మాతలు ఆమె పారితోషికాన్ని ఉన్నఫళంగా తగ్గించేశారని వినికిడి. ఇదిలావుంటే ఈ అమ్మడికి టాలీవుడ్ రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానం పలుకుతోంది. ఇప్పటికే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ ఆమెను రెండు చిత్రాలకు బుక్ చేసుకున్నది. ఇంకా మరికొందరు నిర్మాతలు తమన్నాను తమ చిత్రాలలో నటింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తన "సురా" ఢమ్‌మని పేలిపోవడంతో తమన్నా ఉన్నఫళంగా కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చి తన నిర్మాతలతో టచ్‌లో ఉంటోందట. నిర్మాతలు అడగక ముందే తన పారితోషికంలో కత్తెర వేసుకోమని సలహాలు సైతం ఇస్తోందట.
Source: Yahoo! Telugu: Entertainment | 27 May 2010 | 7:41 am

కార్గిల్ యుద్ధ నివేదికలో అవకతవకలు!: సైనిక ట్రిబ్యునల్

కార్గిల్ యుద్ధ నివేదికలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనిక వీరులకు అందజేసిన అవార్డులు మరియు ప్రమోషన్‌లలో అవకతవకలు జరిగినట్లు సమాచారం. సైనిక కమాండర్లు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, సైనికులకు అవార్డులు, ప్రమోషన్లు ఇవ్వడంలో పక్షపాతంగా వ్యవహరించినట్లు తెలిసింది.
Source: జాతీయ | 27 May 2010 | 6:40 am

షూటింగ్ లేకపోతే పిచ్చెక్కి పోతోంది: "లీడర్" రానా

అది రామానాయుడు స్టూడియోలోని కొత్తగా కట్టిన భవంతి. అక్కడే కొత్తగా ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ స్థాపించారు. అందులో ఓ భాగం రానా ఆఫీస్. అక్కడికి హీరోగా కాకముందే గ్రాఫిక్ వర్క్ కోసం వస్తుండేవారు. ఇప్పుడు తను రావడం చాలా కొత్తగా ఉందనీ, అందరూ కొత్తగా గౌరవిస్తున్నారని రానా అంటున్నారు. ఆయన రూమ్‌కు వెళ్లగానే... ఆయనే ఎదురుగా వచ్చారు. "హాయ్ రానా..! ఎలా ఉన్నార"ని పలుకరించి...హీరో అయ్యాక ఎన్నిసార్లు ఆఫీసుకు వచ్చి ఉంటారు..?నేను హీరో కాకముందు రోజూ ఇక్కడికి వచ్చేవాడిని. నా పని నేను చేసుకుని వెళ్లిపోతుండేవాడిని. కానీ లీడర్ సినిమా చేశాక.. రావడం కుదరలేదు. హిందీ సినిమా షూటింగ్ కొన్ని రోజుల గ్యాప్ రావడంతో ఇక్కడికి వచ్చాను. అదే స్టాఫ్ నన్ను కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు... గౌరవ మర్యాదలు కొంచెం ఎక్కువ చేస్తున్నట్లు గ్రహించాను.
Source: Yahoo! Telugu: Entertainment | 27 May 2010 | 6:37 am

22 మంది క్రిమినల్స్‌ను పట్టుకున్నాం: హర్యానా పోలీసులు

హర్యానాలో పలు నేరాలకు పాల్పడిన 22 మంది క్రిమినల్స్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. గత ఐదు నెలల్లో హర్యానాతో పాటు రొథాక్ వంటి నాలుగు జిల్లాల్లో 22 మంది నేరస్థులను అరెస్టు చేశామని పోలీసులు గురువారం ప్రకటించారు.
Source: జాతీయ | 27 May 2010 | 4:03 am

కాంగ్రెస్ పార్టీపై మమతా బెనర్జీ విమర్శల వర్షం!

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీని ఆమె "నమ్మక ద్రోహం" చేసే పార్టీగా అభివర్ణించారు. అందుకే కోల్‌కతా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేయకూడదని మమతా పిలుపునిచ్చారు.
Source: జాతీయ | 27 May 2010 | 2:57 am