|
22 మంది క్రిమినల్స్‌ను పట్టుకున్నాం: హర్యానా పోలీసులుహర్యానాలో పలు నేరాలకు పాల్పడిన 22 మంది క్రిమినల్స్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. గత ఐదు నెలల్లో హర్యానాతో పాటు రొథాక్ వంటి నాలుగు జిల్లాల్లో 22 మంది నేరస్థులను అరెస్టు చేశామని పోలీసులు గురువారం ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 27 May 2010 | 9:32 am లఖ్వీ పిటిషన్‌ను తిరస్కరించిన పాక్ సుప్రీంకోర్టుభారత ఆర్థిక రాజధాని ముంబైలో 26/11/2008న జరిగిన దాడుల కేసు నుంచి తనను విముక్తి కల్పించాలని కోరుతూ లష్కర్-ఏ-తొయిబా కమాండర్ జకీర్ రెహ్మాన్ లఖ్వీ పాక్ సుప్రీం కోర్టులో పిటీషన్ వేశాడు. ఆయన వేసిన పిటీషన్‌ను పాక్ సుప్రీం కోర్టు గురువారం తోసిపుచ్చింది.Source: Yahoo! Telugu: News | 27 May 2010 | 9:29 am కాంగ్రెస్ పార్టీపై మమతా బెనర్జీ విమర్శల వర్షం!తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీని ఆమె "నమ్మక ద్రోహం" చేసే పార్టీగా అభివర్ణించారు. అందుకే కోల్‌కతా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేయకూడదని మమతా పిలుపునిచ్చారు.Source: Yahoo! Telugu: News | 27 May 2010 | 8:25 am భారతదేశం ప్రపంచశక్తిగా ఎదుగుతోందిః పీజే క్రౌలేభారతదేశం ప్రపంచశక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి పీజే క్రౌలే తెలిపారు. వచ్చే వారం ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు సమావేశం కానున్నట్లు ఆయన వాషింగ్టన్‌లో గురగువారం తెలిపారుSource: Yahoo! Telugu: News | 27 May 2010 | 8:21 am పుంజుకున్న ట్రేడింగ్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి!దేశీయ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ (సెన్సెక్స్) మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో 141 పాయింట్ల మేర లాభపడింది. దీంతో సెన్సెక్స్, 16,529 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 32 పాయింట్లు బలపడి, 4,950 మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.Source: Yahoo! Telugu: News | 27 May 2010 | 8:05 am జూన్ 2న గుజరాత్ కర్మాగారం నుంచి నానో కారుదేశీయ మోటారు వాహనాల నిర్మాణరంగంలో అగ్రగామిగానున్న టాటా సంస్థకు చెందిన నానో కారుకు చెందిన మరో ప్లాంట్ గుజరాత్‌లోని సానంద్‌లోవుంది. ఈ కర్మాగారం నుంచి నానో కారు వచ్చే నెల రెండవ తేదీన మార్కెట్‌లోకి రానుందని కంపెనీ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.Source: Yahoo! Telugu: News | 27 May 2010 | 7:52 am మీ ఇష్టం వచ్చిన రేటును ఫిక్స్ చేసుకోండి: తమన్నాహ్యాపీడేస్ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన తెల్లపిల్ల తమన్నా తాజా తమిళ చిత్రం "సురా" బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. దీంతో తమిళ నిర్మాతలు ఆమె పారితోషికాన్ని ఉన్నఫళంగా తగ్గించేశారని వినికిడి. ఇదిలావుంటే ఈ అమ్మడికి టాలీవుడ్ రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానం పలుకుతోంది. ఇప్పటికే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ ఆమెను రెండు చిత్రాలకు బుక్ చేసుకున్నది. ఇంకా మరికొందరు నిర్మాతలు తమన్నాను తమ చిత్రాలలో నటింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తన "సురా" ఢమ్‌మని పేలిపోవడంతో తమన్నా ఉన్నఫళంగా కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చి తన నిర్మాతలతో టచ్‌లో ఉంటోందట. నిర్మాతలు అడగక ముందే తన పారితోషికంలో కత్తెర వేసుకోమని సలహాలు సైతం ఇస్తోందట.Source: Yahoo! Telugu: Entertainment | 27 May 2010 | 7:41 am యూనియన్ కార్యాలయాలను సీజ్ చేసిన ఏఐఎయిర్ ఇండియా సిబ్బంది సమ్మె విరమించినా విమానరాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుండటంతో దేశవ్యాప్తంగానున్న ఏఐ సిబ్బంది యూనియన్ కార్యాలయాలను ఎయిర్ ఇండియా గురువారం మూసివేసింది.Source: Yahoo! Telugu: News | 27 May 2010 | 7:22 am విదేశీ మార్కెట్ల ప్రభావం: లాభాల్లో స్టాక్ మార్కెట్!అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ మార్కెట్, తిరిగి లాభాలను ఆర్జించింది.ఫలితంగా గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, 136 పాయింట్లు లాభపడి, 16,524 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ (నిఫ్టీ) కూడా 45 పాయింట్లు వృద్ధి చెంది, 4,962 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.Source: Yahoo! Telugu: News | 27 May 2010 | 7:01 am ఆరేళ్ల కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయం: బాబురాష్ట్ర రాజధానిలోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ 29వ మహానాడు ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెదేపా పతాకాన్ని ఎగురవేసి ఎన్టీఆర్ ఫోటో ప్రదర్శనను, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.Source: Yahoo! Telugu: News | 27 May 2010 | 6:57 am బీమారంగంలో ముందున్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్దేశీయ బీమారంగంలో ఎస్‌బీఐ లైఫ్‌ను వెనక్కునెట్టి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ముందు వరుసలోకి చేరుకుందని బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) గురువారం న్యూ ఢిల్లీలో వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 27 May 2010 | 6:57 am షూటింగ్ లేకపోతే పిచ్చెక్కి పోతోంది: "లీడర్" రానాఅది రామానాయుడు స్టూడియోలోని కొత్తగా కట్టిన భవంతి. అక్కడే కొత్తగా ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ స్థాపించారు. అందులో ఓ భాగం రానా ఆఫీస్. అక్కడికి హీరోగా కాకముందే గ్రాఫిక్ వర్క్ కోసం వస్తుండేవారు. ఇప్పుడు తను రావడం చాలా కొత్తగా ఉందనీ, అందరూ కొత్తగా గౌరవిస్తున్నారని రానా అంటున్నారు. ఆయన రూమ్‌కు వెళ్లగానే... ఆయనే ఎదురుగా వచ్చారు. "హాయ్ రానా..! ఎలా ఉన్నార"ని పలుకరించి...హీరో అయ్యాక ఎన్నిసార్లు ఆఫీసుకు వచ్చి ఉంటారు..?నేను హీరో కాకముందు రోజూ ఇక్కడికి వచ్చేవాడిని. నా పని నేను చేసుకుని వెళ్లిపోతుండేవాడిని. కానీ లీడర్ సినిమా చేశాక.. రావడం కుదరలేదు. హిందీ సినిమా షూటింగ్ కొన్ని రోజుల గ్యాప్ రావడంతో ఇక్కడికి వచ్చాను. అదే స్టాఫ్ నన్ను కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు... గౌరవ మర్యాదలు కొంచెం ఎక్కువ చేస్తున్నట్లు గ్రహించాను.Source: Yahoo! Telugu: Entertainment | 27 May 2010 | 6:37 am 22 మంది క్రిమినల్స్‌ను పట్టుకున్నాం: హర్యానా పోలీసులుహర్యానాలో పలు నేరాలకు పాల్పడిన 22 మంది క్రిమినల్స్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. గత ఐదు నెలల్లో హర్యానాతో పాటు రొథాక్ వంటి నాలుగు జిల్లాల్లో 22 మంది నేరస్థులను అరెస్టు చేశామని పోలీసులు గురువారం ప్రకటించారు.Source: జాతీయ | 27 May 2010 | 4:03 am కాంగ్రెస్ పార్టీపై మమతా బెనర్జీ విమర్శల వర్షం!తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీని ఆమె "నమ్మక ద్రోహం" చేసే పార్టీగా అభివర్ణించారు. అందుకే కోల్‌కతా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేయకూడదని మమతా పిలుపునిచ్చారు.Source: జాతీయ | 27 May 2010 | 2:57 am ఆరేళ్ల కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయం: బాబురాష్ట్ర రాజధానిలోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ 29వ మహానాడు ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెదేపా పతాకాన్ని ఎగురవేసి ఎన్టీఆర్ ఫోటో ప్రదర్శనను, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.Source: ఏపీ న్యూస్ | 27 May 2010 | 1:28 am సీఆర్పీఎఫ్ జవాను కుటుంబానికి రూ.5లక్షల సాయం!ఛత్తీస్‌ఘడ్ నక్సలైట్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన తిరునెల్వేలి సీఆర్పీఎఫ్ జవాను సుబ్రహ్మణ్యం కుటుంబానికి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధి రూ.5లక్షల నష్టపరిహారం ప్రకటించారు. దంతెవాడ మావోయిస్టుల దాడిలో తమిళనాడుకు చెందిన సీఆర్పీఎప్ దళ అధికారి సుబ్రహ్మణ్యం మృతి చెందారు.Source: జాతీయ | 27 May 2010 | 1:05 am జగన్ "ఓదార్పు" జరిగి తీరుతుంది: కొండా సురేఖవైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరంగల్ జిల్లాలో తలపెట్టిన ఓదార్పు యాత్ర జరిగి తీరుతుందని మాజీమంత్రి కొండా సురేఖ వెల్లడించారు. కొంతమంది చెపుతున్నట్లుగా అధిష్టానం జగన్ యాత్రకు ఎటువంటి రెడ్ సిగ్నల్ ఇవ్వలేదనీ, యధావిధిగా వైఎస్ జగన్ ఓదార్పు అనుకున్న సమయానికే వరంగల్‌లో ప్రారంభమవుతుందని సురేఖ వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 27 May 2010 | 12:11 am నిత్యానంద రిమాండ్‌ను పొడిగించిన రామ్‌నగర్ కోర్టు!భక్తి ముసుగులో రాసలీలలకు ఒడిగట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందకు రామ్‌నగర్ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఏప్రిల్ 21వ తేదీన అరెస్టయిన నిత్యానందను పోలీసులు రామ్‌నగర్ కోర్టులో గురువారం హాజరు పరిచారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు, నిత్యానందను విడుదల చేయడం తగదని పేర్కొంటూ.. రిమాండ్ కాలాన్ని జూన్ తొమ్మిదో తేదీవరకు పొడిగించింది.Source: జాతీయ | 27 May 2010 | 12:01 am టెలికాం మంత్రి రాజా వెనుక అదృశ్య శక్తి: జయలలితస్పెక్ట్రమ్ కేటాయింపుల్లో కేంద్ర ఐటీ శాఖ మంత్రి ఏ రాజా వెనుక అదృశ్య శక్తివుందని అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత ఆరోపించారు. ప్రధానికి సంబంధించినంత వరకూ రాజా చాలా చిన్న వ్యక్తి. ఆయనకంటే శక్తిమంతమైన వ్యక్తి జోక్యం ఇందులో ఉన్నందువల్లే రాజాపై చర్యలు తీసుకోవడం లేదని ఆమె విమర్శించారు.Source: జాతీయ | 26 May 2010 | 11:55 pm మాయావతి ఆదాయం మూడేళ్ళలో రూ. 35 కోట్లు!!ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన మాయావతి మూడు సంవత్సరాల కాలంలో 35 కోట్ల రూపాయలను ఆర్జించినట్లు ఆమె సభకు తెలిపారు.Source: జాతీయ | 26 May 2010 | 11:55 pm జగన్... వరంగల్‌లో "ఓదార్పు" మానుకో..: మొయిలీవరంగల్ జిల్లాలో శుక్రవారం నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ అధిష్టానం బ్రేక్ వేసింది. జగన్ యాత్రపై వరంగల్ జిల్లాలో వ్యతిరేకత పెల్లుబుకుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఓదార్పు యాత్రకు ఎర్రజెండా చూపింది.Source: ఏపీ న్యూస్ | 26 May 2010 | 11:52 pm మంచిర్యాల వద్ద ఘోర ప్రమాదం: 35 మంది దుర్మరణం!ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 35 మంది దుర్మరణం పాలైయ్యారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పెళ్లి వ్యాను-టిప్పర్ లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 35 మంది తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.Source: ఏపీ న్యూస్ | 26 May 2010 | 11:50 pm మీడియా మంటపెట్టడం మానుకోవాలి: రోశయ్యవరంగల్ జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రపై ముఖ్యమంత్రి రోశయ్య స్పందించడానికి నిరాకరించారు. గురువారం ఆయన పలు విషయాలపై మాట్లాడారు. తొలుత శ్రీకాళహస్తిలో గాలిగోపురం కూలిపోయిన ఘటనపై మాట్లాడుతూ దాని స్థానంలో తిరిగి కొత్త నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 26 May 2010 | 11:35 pm రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన నటిస్తా: జయప్రదవెండితెరపై మూడున్నర దశాబ్దాలుగా అలరిస్తున్న ప్రముఖ నటి జయప్రద బుల్లితెరపై తెరంగేట్రం చేసింది. వైజయంతీ మూవీస్ వారి లోకల్ టీవీలో ఆమె "జయప్రదం" అనే టాక్ షోతో టీవీ రంగంలోకి ప్రవేశించింది. ఈ కార్యక్రమం బుధ, గురువారాలలో రాత్రి 7.30 సమయంలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాదులోని ఎఫ్.ఎన్.సి.సిలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జయప్రద, లోకల్ టీవీ సీఈఓ విష్ణువర్థన్, ఎమ్.డి స్వప్నాదత్ పాల్గొన్నారు. జయప్రద మాట్లాడుతూ... ఈ రోజుతో నా జీవితంలో కొత్త అధ్యాయం, కొత్త మలుపు ప్రారంభమైంది. రాజమండ్రి నుంచి రాంపూర్ వరకూ సాగిన నా ప్రయాణంలో ఇప్పటివరకూ ఎనిమిది భాషలలో 300 పైగా చిత్రాల్లో నటించాను. ఆంధ్ర నుంచి కొంత దూరమై బాలీవుడ్‌కు ప్రమోట్ అయిన నాకు తెలుగు చిత్రాలంటే ఇప్పటికీ ప్రత్యేకమైన అభిమానం ఉంది.Source: Yahoo! Telugu: Entertainment | 26 May 2010 | 12:10 pm జూలైలో విడుదల కానున్న భూమిక "తకిట తకిట"కొత్త తారలతో భూమికా చావ్లా ముఖ్యపాత్రలో, కింగ్ నాగార్జున, అరుంధతి అనుష్క స్పెషల్ అప్పియరెన్స్‌తో డౌన్‌టౌన్ ఫిలిమ్స్ పతాకంపై శ్రీహరి నాను దర్శకత్వంలో భూమిక చావ్లా సమర్పణలో భరత్ ఠాకూర్ నిర్మిస్తున్న తకిట తకిట చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత భరత్ ఠాకూర్ మాట్లాడుతూ... ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న తకిట తకిట షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూన్ 9న ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. జూన్ 18న ఆడియో రిలీజ్ చేసి, జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 26 May 2010 | 8:52 am బాలయ్యకు చంద్రబాబు వార్నింగ్: తేరుకున్న 'సింహా'!సినీ హీరో నందమూరి బాలకృష్ణను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెదిరించారా? ఈ ప్రశ్నకు పలువురు రాజకీయ నేతలు అవుననే సమాధానం ఇస్తున్నారు. ఎందుకంటే.. 'సింహా' చిత్రం విజయయాత్రలో భాగంగా బాలకృష్ణ బుధవారం కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని శ్రీలక్ష్మీ నరసింహ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.Source: ఏపీ న్యూస్ | 26 May 2010 | 7:46 am వైఎస్.జగన్ ఓదార్పు యాత్రకు పెరుగుతున్న మద్దతు!వైఎస్.జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్రకు సీమాంధ్ర నేతలతో పాటు తెలంగాణ ప్రాంత నేతల నుంచి మద్దతు వస్తోంది. నిన్నటి వరకు వరంగల్ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ ఒక్కరే ఈ యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించగా, బుధవారం ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి కూడా మద్దతు ప్రకటించారు. అలాగే, మరికొంతమంది తెలంగాణ నేతలు కూడా జగన్ యాత్ర చేయడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 26 May 2010 | 7:19 am చిరు చీతాస్-బాలయ్య లైన్స్-నాగ్ కింగ్స్-వెంకీ వారియర్స్ఐపీఎల్ని తలపించేలా జూన్ 13న జరుగనున్న టాలీవుడ్ ట్రోఫీ టి-20కి సంబంధించిన నాలుగు జట్ల లోగోలను హైదరాబాదులోని ఫిలిమ్ ఛాంబర్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. చిరు చీతాస్, బాలయ్య లైన్స్, నాగ్ కింగ్స్, వెంకీ వారియర్స్ పేరిట నాలుగు టీమ్‌ల మధ్య ఈ టి-20 జరుగనుంది. "మా" అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ... తెలుగు చలనచిత్ర పరిశ్రమ, ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్ అసోసియేషన్, ఫెడరేషన్... ఇలా అందరి సహకారంతో ఈ క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించనున్నాం. మొత్తం నాలుగు టీమ్‌ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో ఏ టీమ్‌లో ఎవరు ఆడనున్నారు అనే విషయాన్ని ఈ నెల 27న జయభేరి క్లబ్‌లో లక్కీ డ్రా పద్ధతి ద్వారా మీడియా సమక్షంలో తెలియజేయనున్నాము.Source: Yahoo! Telugu: Entertainment | 26 May 2010 | 6:26 am మంత్రుల గ్రూపునకు కులాల జనగణన అంశం: కేబినెట్ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కులాల ప్రాతిపదికన జనాభా లెక్కల సేకరణ చేపట్టే అంశంపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశాన్ని మంత్రుల గ్రూపునకు అప్పగించాలని ఇందులో తీర్మానించారు. 2011 జనాభా లెక్కలను కులాల వారీగా చేపట్టాలని పలు పార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ అంశంపై చర్చించేందుకు గురువారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది.Source: జాతీయ | 26 May 2010 | 6:10 am పనిలేని లోకేష్.. బాలయ్య-ఎన్టీఆర్ బిజీబిజీ: చంద్రబాబుసినీ నటులు నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు కొత్త చిత్రాలతో బిజీబిజీగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు నారా లోకేష్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్నది ఆయన వ్యక్తిగతమన్నారు. అలాగే, తన వారసుడు ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారన్నారు.Source: ఏపీ న్యూస్ | 26 May 2010 | 5:50 am హాలీవుడ్ పిక్చర్ "దొంగలకు దొంగ"హాలీవుడ్‌లో అత్యంత భారీ వ్యయంతో రూపొంది బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్‌గా నిలిచిన "ది టేకింగ్ ఆఫ్ పెల్హామ్ 123" చిత్రం ఇప్పుడు తెలుగులో "దొంగలకు దొంగ"గా రాబోతోంది. జాన్ ట్రావోల్టా, డెంజిల్ వాషింగ్టన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని కొలంబియా పిక్చర్స్, సోని పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు. విక్టరీ ఫిలిమ్స్ టి.దుర్గారావు సమర్పణలో నిర్మాత బొప్పన సీతారామయ్య దొంగలకు దొంగ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. త్వరలో ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదల కానుంది.Source: Yahoo! Telugu: Entertainment | 26 May 2010 | 5:50 am మరణ శిక్ష కంటే.. నరకాన్ని చూపిస్తున్న జీవితం: అఫ్జల్ప్రస్తుతం తాను అనుభవిస్తున్న జైలు జీవితం మరణశిక్ష కంటే నరకాన్ని చూపిస్తోందని పార్లమెంట్ దాడి కేసులో ఉరిశిక్ష పడిన ముద్దాయి అఫ్జల్ గురు అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని ఆయన తరపు న్యాయవాది ఎన్.డి.పంచోలీ బుధవారం వెల్లడించారు. అందువల్ల అతను పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్‌పై త్వరగా నిర్ణయం వెలువరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడని తెలిపారు.Source: జాతీయ | 26 May 2010 | 5:25 am జయాబచ్చన్‌కు మళ్ళీ రాజ్యసభ టిక్కెట్ కేటాయింపుబాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్‌కు సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ రాజ్యసభ టిక్కెట్‌ను కేటాయించింది. దీంతో ఆమెకు సీటు ఇవ్వబోరని మీడియాలో వచ్చిన వార్తలకు ఆ పార్టీ తెరదించింది.Source: జాతీయ | 26 May 2010 | 3:42 am జూలైలో విడుదల కానున్న భూమిక "తకిట తకిట"కొత్త తారలతో భూమికా చావ్లా ముఖ్యపాత్రలో, కింగ్ నాగార్జున, అరుంధతి అనుష్క స్పెషల్ అప్పియరెన్స్‌తో డౌన్‌టౌన్ ఫిలిమ్స్ పతాకంపై శ్రీహరి నాను దర్శకత్వంలో భూమిక చావ్లా సమర్పణలో భరత్ ఠాకూర్ నిర్మిస్తున్న తకిట తకిట చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత భరత్ ఠాకూర్...lSource: వినోదం | 26 May 2010 | 3:23 am
|