మరణ శిక్ష కంటే.. నకరాన్ని చూపిస్తున్న జీవితం: అఫ్జల్

ప్రస్తుతం తాను అనుభవిస్తున్న జైలు జీవితం మరణశిక్ష కంటే నరకాన్ని చూపిస్తోందని పార్లమెంట్‌ దాడి కేసులో ఉరిశిక్ష పడిన ముద్దాయి అఫ్జల్ గురు అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని ఆయన తరపు న్యాయవాది ఎన్.డి.పంచోలీ బుధవారం వెల్లడించారు. అందువల్ల అతను పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్‌పై త్వరగా నిర్ణయం వెలువరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడని తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 26 May 2010 | 9:29 am

పుంజుకున్న ట్రేడింగ్: లాభాల్లో సెన్సెక్స్. నిఫ్టీ!

దేశీయ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 267 పాయింట్లు వృద్ధి చెంది, 16,289 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 83 పాయింట్లు లాభపడి, 4,890 పాయింట్ల మార్కును తాకింది.
Source: Yahoo! Telugu: News | 26 May 2010 | 9:16 am

ఏఐ సమ్మెతో విమానాలను నడుపుతున్నాం: ఎన్ఏసీఐఎల్

ఎయిర్ ఇండియా ఇంజనీర్లు, క్యాబిన్ క్రూ సిబ్బంది దేశవ్యాప్తంగా రెండు రోజుల నుంచి సమ్మె చేస్తుండటంతో నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) బుధవారం మూడు విమానాలను నడుపుతున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 26 May 2010 | 9:14 am

ఉత్తర - దక్షిణ కొరియాల మధ్య యుద్ధ వాతావరణం!

ఉత్తర - దక్షిణ కొరియా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దక్షిణ కొరియాకు చెందిన యుద్ధ నౌకను ఉత్తర కొరియా సముద్ర జలాల్లో ముంచేసిన విషయం తెల్సిందే. దీంతో ఉత్తర కొరియాతో ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను దక్షిణ కొరియా పూర్తిగా తెంచుకుంది. ఉత్తర కొరియా దుశ్చర్యలను ఇకేమాత్రం సహించజాలమని, అందువల్ల ఆ దేశంతో తాడోపేడో తేల్చుకుంటామని దక్షిణ కొరియా ప్రకటించింది
Source: Yahoo! Telugu: News | 26 May 2010 | 9:00 am

జూలైలో విడుదల కానున్న భూమిక "తకిట తకిట"

కొత్త తారలతో భూమికా చావ్లా ముఖ్యపాత్రలో, కింగ్ నాగార్జున, అరుంధతి అనుష్క స్పెషల్ అప్పియరెన్స్‌తో డౌన్‌టౌన్ ఫిలిమ్స్ పతాకంపై శ్రీహరి నాను దర్శకత్వంలో భూమిక చావ్లా సమర్పణలో భరత్ ఠాకూర్ నిర్మిస్తున్న తకిట తకిట చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత భరత్ ఠాకూర్ మాట్లాడుతూ... ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న తకిట తకిట షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూన్ 9న ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. జూన్ 18న ఆడియో రిలీజ్ చేసి, జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 May 2010 | 8:52 am

బీడబ్ల్యూఏ స్పెక్ట్రం వేలంపాట రూ.3 వేల కోట్ల పైమాటే

దేశంలో బ్రాడ్‌బ్యాండ్ వైర్లెస్ యాక్సెస్ (బీడబ్ల్యూఏ)స్పెక్ట్రం వేలంపాట సోమవారం ప్రారంభమైంది. మంగళవారం నాటికి వేలంపాట రూ. 3.198 కోట్లకు చేరుకుంది. ప్రభుత్వం ఊహించిన దానికన్నా 83 శాతం ఎక్కువని టెలికాం విభాగం పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 26 May 2010 | 8:08 am

విదేశీ మార్కెట్ల ప్రభావం: లాభాల్లో స్టాక్ మార్కెట్

ఆసియా స్టాక్ మార్కెట్ ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి పురోగమనం దిశగా ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 191 పాయింట్లు లాభపడింది. దీంతో సెన్సెక్స్ సూచి 16,213 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్చాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 62 పాయింట్లు పుంజుకుని, 4,869 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 26 May 2010 | 7:34 am

ఓ పట్టాన పట్టుకోను.. పట్టుకుంటే వదలను: వైఎస్.జగన్

ఓ పట్టాన పట్టుకోను.. పట్టుకుంటే వదలను.. ఇది వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రాథమిక సూత్రం. తన తండ్రి జీవించి ఉన్న సమయంలోనే ఆయన తన నైజానికి విరుద్ధంగా ఏనాడూ నడుచుకోలేదు. అందువల్లే అనతికాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 26 May 2010 | 7:23 am

దేశంలో 71 శాతం పెరిగిన బంగారం దిగుమతులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో దేశంలో బంగారం దిగుమతుల్లో 71 శాతం వృద్ధిచెంది 34.2 టన్నులకు చేరుకుందని బొంబాయి బులియన్ అసోసియేషన్ బుధవారం తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 26 May 2010 | 7:20 am

జగన్‌ యాత్రతో కేసీఆర్ కొంప కొల్లేరు: కొండా సురేఖ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టే ఓదార్పు యాత్ర వల్ల తమ కొంప కొల్లేరవుతుందనే భయం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుకు పట్టుకుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ యాత్ర వల్ల తమ పార్టీ మనుగడతో పాటు.. తమ భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. అందువల్లే ఈ జగన్ యాత్రను అడ్డుకోవాలని వారు పిలుపునిచ్చారని గుర్తు చేశారు.
Source: Yahoo! Telugu: News | 26 May 2010 | 6:56 am

బాబు సమక్షంలో సొంత గూటికి చేరిన కళా వెంకట్రావు!

ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు తిరిగి సొంత గూటికి చేరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన బుధవారం తెదేపా సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తనకు సముచిత స్థానాన్నే కల్పించారన్నారు.
Source: Yahoo! Telugu: News | 26 May 2010 | 6:45 am

చిరు చీతాస్-బాలయ్య లైన్స్-నాగ్ కింగ్స్-వెంకీ వారియర్స్

ఐపీఎల్‌ని తలపించేలా జూన్ 13న జరుగనున్న టాలీవుడ్ ట్రోఫీ టి-20కి సంబంధించిన నాలుగు జట్ల లోగోలను హైదరాబాదులోని ఫిలిమ్ ఛాంబర్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. చిరు చీతాస్, బాలయ్య లైన్స్, నాగ్ కింగ్స్, వెంకీ వారియర్స్ పేరిట నాలుగు టీమ్‌ల మధ్య ఈ టి-20 జరుగనుంది. "మా" అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ... తెలుగు చలనచిత్ర పరిశ్రమ, ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్ అసోసియేషన్, ఫెడరేషన్... ఇలా అందరి సహకారంతో ఈ క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించనున్నాం. మొత్తం నాలుగు టీమ్‌ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో ఏ టీమ్‌లో ఎవరు ఆడనున్నారు అనే విషయాన్ని ఈ నెల 27న జయభేరి క్లబ్‌లో లక్కీ డ్రా పద్ధతి ద్వారా మీడియా సమక్షంలో తెలియజేయనున్నాము.
Source: Yahoo! Telugu: Entertainment | 26 May 2010 | 6:26 am

హాలీవుడ్ పిక్చర్ "దొంగలకు దొంగ"

హాలీవుడ్‌లో అత్యంత భారీ వ్యయంతో రూపొంది బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్‌గా నిలిచిన "ది టేకింగ్ ఆఫ్ పెల్హామ్ 123" చిత్రం ఇప్పుడు తెలుగులో "దొంగలకు దొంగ"గా రాబోతోంది. జాన్ ట్రావోల్టా, డెంజిల్ వాషింగ్టన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని కొలంబియా పిక్చర్స్, సోని పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు. విక్టరీ ఫిలిమ్స్ టి.దుర్గారావు సమర్పణలో నిర్మాత బొప్పన సీతారామయ్య దొంగలకు దొంగ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. త్వరలో ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదల కానుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 26 May 2010 | 5:50 am

మరణ శిక్ష కంటే.. నకరాన్ని చూపిస్తున్న జీవితం: అఫ్జల్

ప్రస్తుతం తాను అనుభవిస్తున్న జైలు జీవితం మరణశిక్ష కంటే నరకాన్ని చూపిస్తోందని పార్లమెంట్‌ దాడి కేసులో ఉరిశిక్ష పడిన ముద్దాయి అఫ్జల్ గురు అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని ఆయన తరపు న్యాయవాది ఎన్.డి.పంచోలీ బుధవారం వెల్లడించారు. అందువల్ల అతను పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్‌పై త్వరగా నిర్ణయం వెలువరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడని తెలిపారు.
Source: జాతీయ | 26 May 2010 | 3:59 am

జయాబచ్చన్‌కు మళ్ళీ రాజ్యసభ టిక్కెట్ కేటాయింపు

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్‌కు సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ రాజ్యసభ టిక్కెట్‌ను కేటాయించింది. దీంతో ఆమెకు సీటు ఇవ్వబోరని మీడియాలో వచ్చిన వార్తలకు ఆ పార్టీ తెరదించింది.
Source: జాతీయ | 26 May 2010 | 3:42 am

ఓ పట్టాన పట్టుకోను.. పట్టుకుంటే వదలను: వైఎస్.జగన్

ఓ పట్టాన పట్టుకోను.. పట్టుకుంటే వదలను.. ఇది వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రాథమిక సూత్రం. తన తండ్రి జీవించి ఉన్న సమయంలోనే ఆయన తన నైజానికి విరుద్ధంగా ఏనాడూ నడుచుకోలేదు. అందువల్లే అనతికాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 May 2010 | 1:54 am

జగన్‌ యాత్రతో కేసీఆర్ కొంప కొల్లేరు: కొండా సురేఖ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టే ఓదార్పు యాత్ర వల్ల తమ కొంప కొల్లేరవుతుందనే భయం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుకు పట్టుకుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ యాత్ర వల్ల తమ పార్టీ మనుగడతో పాటు.. తమ భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. అందువల్లే ఈ జగన్ యాత్రను అడ్డుకోవాలని వారు పిలుపునిచ్చారని గుర్తు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 26 May 2010 | 1:26 am

బాబు సమక్షంలో సొంత గూటికి చేరిన కళా వెంకట్రావు!

ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు తిరిగి సొంత గూటికి చేరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన బుధవారం తెదేపా సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తనకు సముచిత స్థానాన్నే కల్పించారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 May 2010 | 1:16 am

హైకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేయనున్న రాథోడ్!

టెన్నిస్ క్రీడాకారిణి రుచికా గిరిహోత్రా ఆత్మహత్య కేసులో 18 మాసాల జైలుశిక్ష పడిన హర్యానా మాజీ డీజీపీ ఎస్పీఎస్.రాథోడ్ హైకోర్టులో రివ్యూ పిటీషన్‌ను దాఖలు చేయనున్నారు. దాదాపు 20 సంవత్సరాల క్రితం రుచికాపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ యువతి మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈకేసులో రాథోడ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన ఆరు నెలల జైలుశిక్షను ఛండీగఢ్ కోర్టు 18 నెలలకు పొడగించింది.
Source: జాతీయ | 26 May 2010 | 12:47 am

జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన తప్పదేమోః విశ్లేషకులు

జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన తప్పేటట్టు లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శిబూసోరెన్‌ ప్రభుత్వానికి భారతీయ జనతాపార్టీ మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ కాంగ్రెస్‌పార్టీ తొందరపడటం లేదు.
Source: జాతీయ | 26 May 2010 | 12:24 am

నేడు మంత్రివర్గ భేటీ: కులాల వారీ జనగణనపై చర్చ!

కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి మన్మోహన్ అధ్యక్షతన బుధవారం భేటీకానుంది. ఇందులో కులాల వారీగా జనాభా లెక్కలను చేపట్టే అంశంపై కీలకంగా చర్చించనున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న 2011 జనాభా లెక్కల సేకరణను కులాల వారీగా చేపట్టాలని యాదవ త్రయమైన లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ), ములాయం సింగ్ యాదవ్ (ఎస్పీ), శరద్ యాదవ్ (జేడీయు)లు డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇదే అశంపై వారు పార్లమెంట్‌ను సైతం ఓ కుదుపు కుదిపారు.
Source: జాతీయ | 26 May 2010 | 12:23 am

సీమాంధ్ర దుష్టశక్తులను పారదోలేందుకే కేసీఆర్ అవతారం

శ్రీకృష్ణ కమిటీ ముందు తెలంగాణాలోని పలు జేఏసీలు తమ తమ వాదనలను వినిపించాయి. మంగళవారం సైతం ఉస్మానియా విద్యార్థి జేఏసీ కమిటీ ముందు తెలంగాణా రాష్ట్ర ఆవశ్యకత గురించి వాదించింది. వారి వాదనలను సావధానంగా విన్న శ్రీకృష్ణ కమిటీ సభ్యులు, తెలంగాణాలోని వెనకబాటుతనం రాష్ట్ర ఏర్పాటుతో సమసిపోతుందని భావిస్తున్నారా... అని సూటిగా ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 25 May 2010 | 11:58 pm

ఐఐటీ-జేఈఈ ఫలితాలు విడుదల: రాష్ట్ర విద్యార్థుల హవా!

ఐఐటీ-జేఈఈ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు విజయభేరి మోగించారు. ఒకటి నుంచి వరకు ఉన్న పది ర్యాంకుల్లో ఐదు ర్యాంకులను సొంతం చేసుకున్నారు.రాష్ట్రానికి చెందిన జితేందర్‌కు మొదటి, ర్యాంకు, ఉదయ్‌షాకు రెండో ర్యాంకు, మధు కిరణ్‌కు నాలుగో ర్యాంకు, కార్తీక్‌కు ఆరో ర్యాంకు, సబరేష్ నిఖ్‌ల్‌కు ఎనిమిదో ర్యాంకు దక్కింది. నారాయణ, శ్రీచైతన్య వంటి తదితర సంస్థల నుంచి విద్యార్థులు మంచి ర్యాంకులను సాధించారు.
Source: ఏపీ న్యూస్ | 25 May 2010 | 11:51 pm

మహేష్ అందంలో కొంచెమైనా నాకిస్తే...: రామ్ చరణ్

గ్లామర్ ఇండస్ట్రీలో అందానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. హీరోయిన్లయితే గ్లామర్ కోసం రకరకాలుగా మెయిన్‌టైన్ చేస్తారు. ఇక మగవారు అందగాడైతే చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఎన్టీఆర్ అందాన్ని చూసి మనసుపడి, ముచ్చటపడిన భామలు ఎంతోమంది. ఇప్పటి జనరేషన్‌లో మహేష్ బాబు అందగాడు అంటారు. అందులో ఆశ్చర్యం లేదు. మహిళల్లో కూడా ఆయన ఫ్యాన్సే ఎక్కువే. ఇక మగవారు కూడా ఆ అందాన్ని చూసి కాస్త ఈర్ష్య పడినవారూ లేకపోలేదు. ఇటీవలే చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తన మనసులోని మాటను ఆవిష్కరించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 May 2010 | 2:33 pm

నా నగ్న ఫోటో చూశారా..? ఎలా ఉంది..?: షెర్లిన్ ప్రశ్న

షెర్లిన్ చోప్రా తన నగ్న శరీరాన్ని పూర్తిగా తన అభిమానులకు చూపించాలనుకున్న ఆశను నెరవేర్చుకుంది. తాజాగా తన నగ్న ఫోటోను నేరుగా ట్విట్టర్‌లో అప్ చేయడం ద్వారా తను అనుకున్నది చేసి పారేసింది. శరీరంపై నూలుపోగు లేకుండా కనిపించడమే కాక తన అభిమానులకోసమే అలా నగ్న ఫోటోను పెట్టినట్లు రాసుకున్నది. అయితే ఇంతకుముందు ఎన్నో నగ్న ఫోటోలలో దర్శనమిచ్చినా షెర్లిన్, తాజాగా ట్విట్టర్‌లో మాత్రం భిన్నమైన భంగిమలో కనబడుతూ టీనేజ్ కుర్రకారుకు హీటెక్కిస్తోందట. ట్విట్టర్‌లో నగ్న ఫోటోను పెట్టిన విషయంపై షెర్లిన్‌ను కదిలిస్తే... నా ఆల్బమ్ కలెక్షన్లలో ఆ అందమైన ఫోటోను చూశా. ఆ ఫోటోను నా స్నేహితులతోపాటు ట్విట్టర్‌ను అనుసరిస్తున్న వీక్షకులు కూడా చూసి ఆనందిస్తారన్న తలంపుతో ఆ ఫోటోను అక్కడ పెట్టా. నా నగ్న ఫోటో ఎలా ఉందని ఎటువంటి సిగ్గు లేకుండా అడిగేస్తోందట.
Source: Yahoo! Telugu: Entertainment | 25 May 2010 | 9:12 am

బెబ్బులిలా తిరగబడతాం.. కాస్కోండి: కేసీఆర్ హెచ్చరిక

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తెలంగాణ గడ్డపై కాలు పెడితే తెలంగాణ బిడ్డలు బెబ్బులిలా తిరగబడతారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన 11 మంది కాంగ్రెస్ ఎంపీలు ముక్త కంఠంతో వద్దంటున్నా ఒక్క ఎంపీ యాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడమేమిటని ఆయన ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 25 May 2010 | 7:40 am

ఐటమ్ సాంగ్‌లో నీతూ చంద్రా ఓవర్ ఎక్స్‌పోజింగ్

బాలీవుడ్ సెక్స్ బాంబ్ నీతూచంద్ర మాధవన్ నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ "యావరమ్ నలమ్" చిత్రం ద్వారా తమిళ సినిమాల్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత విశాల్ సరసన నటించింది. ఇప్పుడు "యుద్ధం సే" అనే చిత్రంలో ఐటమ్ సాంగ్ చేస్తోంది. హీరోయిన్ పాత్రలు కాకుండా ఐటమ్ సాంగ్‌లు చేస్తుండటంతో కోలీవుడ్‌లో ఆమె పని అయిపోయినట్లు కొంతమంది అంటున్నారు. దీనిపై నీతూ చంద్ర మాత్రం మండిపడింది. ఐటమ్ సాంగ్ చేయడం వల్ల తన ఇమేజ్ ఏమాత్రం తగ్గదనీ, పైపెచ్చు అవకాశాలు సైతం తన్నుకొస్తాయని అంటోంది. అన్నట్లు ఈ ఐటమ్ సాంగ్‌లో నీతూ చంద్ర తన అందాలను పరిమితికి మించి ఆరబోసినట్లు కోలీవుడ్ సినీజనం చెపుతున్నారు. నీతూ ఐటమ్ ఆటను చూసిన పలువురు దర్శకనిర్మాతలు ఆమెను తమ తదుపరి చిత్రాల ఐటమ్ సాంగ్‌లలో నటించమని అడుగుతున్నారట. మరి దీనికేం సమాధానం చెపుతుందో నీతూ..!!
Source: Yahoo! Telugu: Entertainment | 25 May 2010 | 7:26 am

నా ఎత్తు దెబ్బకు విలన్, హీరోయిన్లు ఛేంజ్: రానా

రామానాయుడు మనవడు జూనియర్ రామానాయుడు హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తను నటిస్తున్న చిత్రాలపై ఆయన మంగళవారం సినీ పాత్రికేయులతో మాట్లాడారు. తను ఎత్తు తనకు ప్లస్‌గా ఉన్నప్పటికీ కొందరికి మాత్రం చాలా సమస్యలను కలిగిస్తోందని అన్నారు. హిందీలో అభిషేక్ బచ్చన్, ప్రీతి బబ్బర్‌లతో కలిసి నటిస్తున్న దమ్మరే దమ్ చిత్రంలో తొలుత తనకు జోడీగా నటించాల్సిన హీరోయిన్ తన ముందు మరుగుజ్జులా కనిపించడంతో సదరు నిర్మాత మరో హీరోయిన్‌‍ను బుక్ చేసినట్లు చెప్పారు. అదేవిధంగా విలన్ కూడా తన హైట్ ముందు తేలిపోవడంతో తన ఎత్తుక తగ్గ విలన్‌ను ఎంపిక చేసుకోవాల్సి వచ్చిందన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 May 2010 | 6:51 am

కోల్ మాఫియాను అరికడతాం: మంత్రి శ్రీప్రకాష్ జైశ్వాల్

బొగ్గు ఉత్పత్తి రాష్ట్రాల్లో తమ అధికారాన్ని చెలాయిస్తున్న బొగ్గు మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర బొగ్గు గనుల శాఖామంత్రి శ్రీప్రకాష్ జైశ్వాల్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ దురదృష్టవశాత్తు బొగ్గు ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ప్రధానంగా రెండు సమస్యలను ఎదుర్కొంటున్నాయన్నారు. వీటిలో ఒకటి నక్సలిజం కాగా మరొకటి కోల్ మాఫియా అన్నారు. ఈ బొగ్గు మాఫియాలు సుమారు పదివేల గ్రూపుల వరకు ఉన్నట్టు కేంద్రం అంచనా వేసిందని, వీటిని నిర్మూలించనున్నట్టు చెప్పారు.
Source: జాతీయ | 25 May 2010 | 6:27 am

మినరల్ వాటర్ ఇవ్వమంటే.. సాధారణ నీరిచ్చారు: విప్

తమకు తాగేందుకు మినరల్ వాటర్ ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరితే వారు సాధారణ మంచినీరు ఇచ్చారని ప్రభుత్వ చీప్ విప్ శైలజానాథ్ అన్నారు. ఆ నీటితోనే తాము సర్దుకుని పోతున్నామన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిగా వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఎంపిక చేయాలని అధిష్టానానికి మెజారిటీ ఎమ్మెల్యేలు వినతి పత్రం సమర్పించారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 May 2010 | 5:59 am

ప్రధాని వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను దిగజార్చాయి: బాబు

ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సోమవారం చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెప్పినట్టు తాను పాలన సాగిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించడం ప్రధాని పదవి హోదాను దిగజార్చడమేనన్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 May 2010 | 4:44 am

రుచికా హత్య కేసులో మాజీ డీజీపీకి జైలు శిక్ష ఖరారు

టెన్నిస్ క్రీడాకారిణి రుచికా గిరిహోత్రా హత్య కేసులో హర్యానా మాజీ డీజీపీ ఎస్ఎస్‌పీ.రాథోడ్‌కు ఛండీగఢ్ హైకోర్టు ఏడాదిన్నర జైలుశిక్షను ఖరారు చేసింది. కింది కోర్టు ఆరు నెలల శిక్ష విధించగా, పైకోర్టు ఈ శిక్షా కాలాన్ని ఏడాదిన్నర కాలానికి పెంచడం గమనార్హం.
Source: జాతీయ | 25 May 2010 | 4:24 am

జగన్ యాత్రపై నిరసనలు విచారకరం: మంత్రి దానం

వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర పేరుతో తలపెట్టిన యాత్రను అడ్డుకోవాలనుకోవడం బాధాకరమని రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ అన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జీవించి ఉన్న సమయంలో ఆయన చుట్టూ తిరిగి భజన చేసిన వారే ఇపుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఇది ఎంతో విచారకరమన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల వైఎస్ ఆత్మ క్షోభిస్తుందని ఆయన చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 25 May 2010 | 3:52 am

నా నగ్న ఫోటో చూశారా..? ఎలా ఉంది..?: షెర్లిన్ ప్రశ్న

షెర్లిన్ చోప్రా తన నగ్న శరీరాన్ని పూర్తిగా తన అభిమానులకు చూపించాలనుకున్న ఆశను నెరవేర్చుకుంది. తాజాగా తన నగ్న ఫోటోను నేరుగా ట్విట్టర్‌లో అప్ చేయడం ద్వారా తను అనుకున్నది చేసి పారేసింది. శరీరంపై నూలుపోగు లేకుండా కనిపించడమే కాక తన అభిమానులకోసమే అలా నగ్న ఫోటోను పెట్టినట్లు రాసుకున్నది.
Source: వినోదం | 25 May 2010 | 3:48 am

ఇది వ్యక్తిగత పర్యటనే.. అడ్డుకోవద్దు: వైఎస్.జగన్మోహన్

తాను చేపట్టబోయే ఓదార్పు యాత్ర కేవలం వ్యక్తిగత పర్యటన మాత్రమేనని, దీన్ని రాజకీయం చేసి అడ్డుకోవద్దని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఓదార్పు యాత్ర బాధితకుటుంబాలకు ధైర్యానిచ్చేందుకేనని చేపట్టనున్నట్టు తెలిపారు. ఇది రాజకీయ యాత్ర కాదన్నారు. సభలు, సమావేశాలు, రాజకీయ ఉపన్యాసాలు చేయడం తన అభిమతం కాదని ఆయన తేల్చి చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 25 May 2010 | 3:33 am

మావోలపై దాడి చేయడం సైన్యం విధి కాదు: మాలిక్

మావోయిస్టులపై దాడి చేయడం సైన్యం ప్రాథమిక విధి కాదని భారత ఆర్మీ మాజీ చీఫ్ వీపీ.మాలిక్ అభిప్రాయపడ్డారు. అదేసమయంలో మావోల ఏరివేతకు సైన్యాన్ని ఉపయోగించరాదన్నారు. సైన్యం వినియోగం అనేది చిట్టచివరి అంశంగా మాత్రమే ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 25 May 2010 | 3:05 am