ప్రభుత్వ పిటీషన్‌ను కొట్టివేసిన పాకిస్థాన్ సుప్రీం కోర్టు

జైషే మొహ్మద్ తీవ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ మొహ్మద్ సయీద్‌ను కింది కోర్టు విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటీషన్‌ను పాకిస్థాన్ సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ముంబై దాడుల కేసులో సయీద్‌ కీలక సూత్రధారిగా భారత్ ఆరోపిస్తున్న విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 25 May 2010 | 9:42 am

కొత్త క్యాంపస్‌ల ఏర్పాటులో ఇన్‌ఫోసిస్, విప్రోః మురుగేశ్

దేశంలో గార్డెన్ సిటీగా పేరొందిన బెంగుళూరు నగరంలోని సిలికాన్ వ్యాలీ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు కొత్త క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిచుకుంటున్నట్లు కర్నాటక పరిశ్రమల శాఖ మంత్రి మురుగేశ్ నిరానీ మంగళవారం మీడియాకు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 25 May 2010 | 9:35 am

జగన్ యాత్రపై నిరసనలు విచారకరం: మంత్రి దానం

వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర పేరుతో తలపెట్టిన యాత్రను అడ్డుకోవాలనుకోవడం బాధాకరమని రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ అన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జీవించి ఉన్న సమయంలో ఆయన చుట్టూ తిరిగి భజన చేసిన వారే ఇపుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఇది ఎంతో విచారకరమన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల వైఎస్ ఆత్మ క్షోభిస్తుందని ఆయన చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 25 May 2010 | 9:22 am

భారీ నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ మార్కెట్

మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో భారీ నష్టాలతో 16,110 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా భారీగా క్షీణించి, 4,835 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
Source: Yahoo! Telugu: News | 25 May 2010 | 9:12 am

నా నగ్న ఫోటో చూశారా..? ఎలా ఉంది..?: షెర్లిన్ ప్రశ్న

షెర్లిన్ చోప్రా తన నగ్న శరీరాన్ని పూర్తిగా తన అభిమానులకు చూపించాలనుకున్న ఆశను నెరవేర్చుకుంది. తాజాగా తన నగ్న ఫోటోను నేరుగా ట్విట్టర్‌లో అప్ చేయడం ద్వారా తను అనుకున్నది చేసి పారేసింది. శరీరంపై నూలుపోగు లేకుండా కనిపించడమే కాక తన అభిమానులకోసమే అలా నగ్న ఫోటోను పెట్టినట్లు రాసుకున్నది. అయితే ఇంతకుముందు ఎన్నో నగ్న ఫోటోలలో దర్శనమిచ్చినా షెర్లిన్, తాజాగా ట్విట్టర్‌లో మాత్రం భిన్నమైన భంగిమలో కనబడుతూ టీనేజ్ కుర్రకారుకు హీటెక్కిస్తోందట. ట్విట్టర్‌లో నగ్న ఫోటోను పెట్టిన విషయంపై షెర్లిన్‌ను కదిలిస్తే... నా ఆల్బమ్ కలెక్షన్లలో ఆ అందమైన ఫోటోను చూశా. ఆ ఫోటోను నా స్నేహితులతోపాటు ట్విట్టర్‌ను అనుసరిస్తున్న వీక్షకులు కూడా చూసి ఆనందిస్తారన్న తలంపుతో ఆ ఫోటోను అక్కడ పెట్టా. నా నగ్న ఫోటో ఎలా ఉందని ఎటువంటి సిగ్గు లేకుండా అడిగేస్తోందట.
Source: Yahoo! Telugu: Entertainment | 25 May 2010 | 9:12 am

ఇది వ్యక్తిగత పర్యటనే.. అడ్డుకోవద్దు: వైఎస్.జగన్మోహన్

తాను చేపట్టబోయే ఓదార్పు యాత్ర కేవలం వ్యక్తిగత పర్యటన మాత్రమేనని, దీన్ని రాజకీయం చేసి అడ్డుకోవద్దని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఓదార్పు యాత్ర బాధితకుటుంబాలకు ధైర్యానిచ్చేందుకేనని చేపట్టనున్నట్టు తెలిపారు. ఇది రాజకీయ యాత్ర కాదన్నారు. సభలు, సమావేశాలు, రాజకీయ ఉపన్యాసాలు చేయడం తన అభిమతం కాదని ఆయన తేల్చి చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 25 May 2010 | 9:02 am

మావోలపై దాడి చేయడం సైన్యం విధి కాదు: మాలిక్

మావోయిస్టులపై దాడి చేయడం సైన్యం ప్రాథమిక విధి కాదని భారత ఆర్మీ మాజీ చీఫ్ వీపీ.మాలిక్ అభిప్రాయపడ్డారు. అదేసమయంలో మావోల ఏరివేతకు సైన్యాన్ని ఉపయోగించరాదన్నారు. సైన్యం వినియోగం అనేది చిట్టచివరి అంశంగా మాత్రమే ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 25 May 2010 | 8:34 am

మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు: లంక వినతి

తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని ఐక్యరాజ్య సమితికి శ్రీలంక విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ఆ దేశ విదేశాంగ మంత్రి పెరిస్ మాట్లాడుతూ ఎల్టీటీఈ అణిచి వేత పేరుతో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టు ఆరోపణలు వచ్చాయని, దీనిపై తమ దేశ ప్రభుత్వమే విచారణ జరుపుతోందన్నారు. అయితే, తమ దేశ ప్రభుత్వం చేపట్టే విచారణపై నమ్మకం లేని విధంగా ఐరాస సొంతగా విచారణ జరపాలని నిర్ణయించడం సరైన చర్య కాదని ఆయన హితవు పలికారు.
Source: Yahoo! Telugu: News | 25 May 2010 | 8:18 am

మెరుపు సమ్మెకు దిగిన ఎయిర్ ఇండియా ఇంజనీర్లు

ఎయిర్ ఇండియా ఇంజనీర్లతోపాటు క్యాబిన్ క్రూ సిబ్బంది, ఇతర సిబ్బంది దాదాపు 25 వేలమంది దేశవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సమ్మెకు దిగారు.
Source: Yahoo! Telugu: News | 25 May 2010 | 8:17 am

గాయత్రి ప్రాజెక్ట్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సెమ్‌కార్ప్

రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోనున్న కృష్టపట్నం బేసిన్ వద్ద థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి గాయత్రి ప్రాజెక్ట్స్ సంస్థతో అమెరికాకు చెందిన సంస్థ సెమ్‌కార్ప్ సంస్థ మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది.
Source: Yahoo! Telugu: News | 25 May 2010 | 7:52 am

నష్టాల్లో స్టాక్ మార్కెట్: భారీగా క్షీణించిన సెన్సెక్స్!

దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి తిరోగమనం వైపు పయనిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 361 పాయింట్లు భారీగా క్షీణించి, 16,107 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 110 పాయింట్లు భారీగా పతనమై, 4,833 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 25 May 2010 | 7:47 am

ఐటమ్ సాంగ్‌లో నీతూ చంద్రా ఓవర్ ఎక్స్‌పోజింగ్

బాలీవుడ్ సెక్స్ బాంబ్ నీతూచంద్ర మాధవన్ నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ "యావరమ్ నలమ్" చిత్రం ద్వారా తమిళ సినిమాల్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత విశాల్ సరసన నటించింది. ఇప్పుడు "యుద్ధం సే" అనే చిత్రంలో ఐటమ్ సాంగ్ చేస్తోంది. హీరోయిన్ పాత్రలు కాకుండా ఐటమ్ సాంగ్‌లు చేస్తుండటంతో కోలీవుడ్‌లో ఆమె పని అయిపోయినట్లు కొంతమంది అంటున్నారు. దీనిపై నీతూ చంద్ర మాత్రం మండిపడింది. ఐటమ్ సాంగ్ చేయడం వల్ల తన ఇమేజ్ ఏమాత్రం తగ్గదనీ, పైపెచ్చు అవకాశాలు సైతం తన్నుకొస్తాయని అంటోంది. అన్నట్లు ఈ ఐటమ్ సాంగ్‌లో నీతూ చంద్ర తన అందాలను పరిమితికి మించి ఆరబోసినట్లు కోలీవుడ్ సినీజనం చెపుతున్నారు. నీతూ ఐటమ్ ఆటను చూసిన పలువురు దర్శకనిర్మాతలు ఆమెను తమ తదుపరి చిత్రాల ఐటమ్ సాంగ్‌లలో నటించమని అడుగుతున్నారట. మరి దీనికేం సమాధానం చెపుతుందో నీతూ..!!
Source: Yahoo! Telugu: Entertainment | 25 May 2010 | 7:26 am

నా ఎత్తు దెబ్బకు విలన్, హీరోయిన్లు ఛేంజ్: రానా

రామానాయుడు మనవడు జూనియర్ రామానాయుడు హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తను నటిస్తున్న చిత్రాలపై ఆయన మంగళవారం సినీ పాత్రికేయులతో మాట్లాడారు. తను ఎత్తు తనకు ప్లస్‌గా ఉన్నప్పటికీ కొందరికి మాత్రం చాలా సమస్యలను కలిగిస్తోందని అన్నారు. హిందీలో అభిషేక్ బచ్చన్, ప్రీతి బబ్బర్‌లతో కలిసి నటిస్తున్న దమ్మరే దమ్ చిత్రంలో తొలుత తనకు జోడీగా నటించాల్సిన హీరోయిన్ తన ముందు మరుగుజ్జులా కనిపించడంతో సదరు నిర్మాత మరో హీరోయిన్‌‍ను బుక్ చేసినట్లు చెప్పారు. అదేవిధంగా విలన్ కూడా తన హైట్ ముందు తేలిపోవడంతో తన ఎత్తుక తగ్గ విలన్‌ను ఎంపిక చేసుకోవాల్సి వచ్చిందన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 May 2010 | 6:51 am

జగన్ యాత్రపై నిరసనలు విచారకరం: మంత్రి దానం

వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర పేరుతో తలపెట్టిన యాత్రను అడ్డుకోవాలనుకోవడం బాధాకరమని రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ అన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జీవించి ఉన్న సమయంలో ఆయన చుట్టూ తిరిగి భజన చేసిన వారే ఇపుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఇది ఎంతో విచారకరమన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల వైఎస్ ఆత్మ క్షోభిస్తుందని ఆయన చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 25 May 2010 | 3:52 am

ఇది వ్యక్తిగత పర్యటనే.. అడ్డుకోవద్దు: వైఎస్.జగన్మోహన్

తాను చేపట్టబోయే ఓదార్పు యాత్ర కేవలం వ్యక్తిగత పర్యటన మాత్రమేనని, దీన్ని రాజకీయం చేసి అడ్డుకోవద్దని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఓదార్పు యాత్ర బాధితకుటుంబాలకు ధైర్యానిచ్చేందుకేనని చేపట్టనున్నట్టు తెలిపారు. ఇది రాజకీయ యాత్ర కాదన్నారు. సభలు, సమావేశాలు, రాజకీయ ఉపన్యాసాలు చేయడం తన అభిమతం కాదని ఆయన తేల్చి చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 25 May 2010 | 3:33 am

మావోలపై దాడి చేయడం సైన్యం విధి కాదు: మాలిక్

మావోయిస్టులపై దాడి చేయడం సైన్యం ప్రాథమిక విధి కాదని భారత ఆర్మీ మాజీ చీఫ్ వీపీ.మాలిక్ అభిప్రాయపడ్డారు. అదేసమయంలో మావోల ఏరివేతకు సైన్యాన్ని ఉపయోగించరాదన్నారు. సైన్యం వినియోగం అనేది చిట్టచివరి అంశంగా మాత్రమే ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 25 May 2010 | 3:05 am

నిరసనలు బేఖాతర్: యధావిధిగా ఓదార్పు యాత్ర!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్ర ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఈ పర్యటన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని జగన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. వచ్చే శుక్రవారం వరంగల్ జిల్లా మహబూబాబాద్‌ నుంచి జగన్ యాత్ర ప్రారంభమవుతుందని వారు తెలిపారు. ఈ యాత్రను అడ్డుకునేందుకు తెలంగాణవాదులంతా ఐక్యమైనా.. తమ పని తాము చేసుకుని వెళతామన్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 May 2010 | 1:56 am

జగన్ వస్తే... తెలంగాణా రగులుతుంది: తెలంగాణా కాంగ్రెస్

కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణాలో ఈ నెల 28 నుంచి చేపట్టనున్న ఓదార్పు యాత్రను వాయిదా వేసేవిధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు సోనియాగాంధీతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల చీఫ్ వీరప్ప మొయిలీకి మొరపెట్టుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 May 2010 | 1:36 am

బీహార్ వద్ద పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్‌ప్రెస్!

ఢిల్లీ నుంచి గౌహతికి వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. బీహార్ వద్ద రాజధాని ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో రైల్వే రాకపోకలకు అంతరాయం కలిగింది. బీహార్ రాష్ట్రం, గౌహతి జిల్లాలోని హతిక్ ప్రాంతంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 14 భోగీలు విడిపోయాయి.
Source: జాతీయ | 25 May 2010 | 12:59 am

మంగళూర్ విమాన ప్రమాదం: బ్లాక్ బాక్స్ లభ్యం

మంగళూర్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఘోర విమాన ప్రమాద దుర్ఘనటలో కనబడకుండా పోయిన బ్లాక్‌బాక్స్‌ను దర్యాప్తు బృందం మంగళవారం కనుగొన్నది. 158 మంది ప్రయాణికుల ప్రాణాలను బలిగొన్న ఈ దుర్ఘనటకు కారణాలేమిటన్న విషయాన్ని ఈ డిజిటల్ ఫ్లైట్ రికార్డర్‌లో రికార్డ్ అయిన సంభాషణలను బట్టి తెలుసుకోవచ్చు.
Source: జాతీయ | 25 May 2010 | 12:37 am

హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి కె. రోశయ్య!

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య హస్తిన పర్యటనను ముగించుకుని సోమవారం రాష్ట్రానికి చేరుకున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, లైలా తుఫానుతో రాష్ట్రానికి ఏర్పడిన నష్టం వంటి అంశాలపై దేశ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చర్చలు జరిపేందుకు రోశయ్య ఆదివారం ఢిల్లీకి ప్రయాణమయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 24 May 2010 | 11:48 pm

ప్రధాని-సోనియాల మధ్య సంబంధాలు భేష్: కాంగ్రెస్

ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీల మధ్య మంచి సంబంధాలు ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ మరోమారు పునరుద్ఘాటించింది. ప్రధాని మన్మోహన్ సోమవారం నిర్వహించిన జాతీయ పత్రికా విలేకరుల సమావేశంలో తన మనస్సులోని మాటను ముక్కుసూటిగా వెల్లడించారు.
Source: జాతీయ | 24 May 2010 | 10:11 pm

31వ తేదీ లోపు బలాన్ని నిరూపించుకోండి: గవర్నర్

ఈనెల 31వ తేదీ లోపు బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా జార్ఖండ్ ముక్తిమోర్ఛా అధినేత శిబూ సోరేన్‌కు జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ ఫరూక్ కోరారు. ముఖ్యమంత్రి శిబూ సోరెన్ నాయకత్వంలోని జేఎంఎం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించకుంటున్నట్టు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత గవర్నర్‌కు మద్దతు ఉపసంహరణ లేఖను అందజేసింది. దీంతో సోరెన్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.
Source: జాతీయ | 24 May 2010 | 10:02 pm

పోలవరంకు జాతీయ హోదా కావాలి: సీఎం విన్నపం

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేసినట్టు ముఖ్యమంత్రి కె.రోశయ్య విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సోమవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ప్రధానికి విన్నవించినట్లు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 24 May 2010 | 9:00 am

నా వారసుడు మర్రి శశిధర్ రెడ్డి: అధిష్టానంకు సీఎం వినతి

అనివార్య కారణాల రీత్యా తనను ముఖ్యమంత్రి పీఠం నుంచి తొలగిస్తే తన వారసునిగా మర్రి శిశిధర్ రెడ్డిని ఎంపిక చేయాలని సీఎం రోశయ్య పార్టీ అధిష్టానానికి సూచించినట్టు సమాచారం. సౌమ్యుడు, వివాద రహితుడుగా పేరొందిన మర్రి శిశిధర్ రెడ్డిని మూడు ప్రాంతాల నేతలు అభిమానిస్తారని ఆయన చెప్పినట్టు వినికిడి.
Source: ఏపీ న్యూస్ | 24 May 2010 | 8:25 am

నా భాష అంతేనండీ బాబూ..!: తమ్మారెడ్డి భరద్వాజ

"గతంలో మన హీరోలు మగాళ్లు కారు.. హీరోలకు దమ్ములేదంటూ.." ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. ఛాలెంజింగ్ పాత్రలు చేయడంలో తెలుగు హీరోలు ముందడుగు వేయడం లేదని తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై.. హీరోలు గుర్రుగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఈ నేపథ్యంలో.. హీరోలపై తాను చేసిన వ్యాఖ్యలకు తమ్మారెడ్డి సోమవారం వివరణ ఇచ్చారు. చరిత చిత్ర ఫిలిమ్ ప్రొడక్షన్స్ 42 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా తమ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. హీరోలపై తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినీ నిందించాలనే ఉద్దేశంతో కాదన్నారు. ఇంకా తమ్మారెడ్డి మాట్లాడుతూ.. "భాషపై నాకు పరిజ్ఞానం లేదు. నేను పామరుణ్ణి. ఇంట్లో ఎలా మాట్లాడుతానో అలాగే అందరి దగ్గర మాట్లాడుతాను. ఎప్పుడూ ఒకేలా మాట్లాడుతాను. మొత్తానికి నా భాష అంతే..!" అని తేల్చి చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 May 2010 | 8:02 am

దంతెవాడ మారణహోమం: ఆరుగురు నక్సల్స్ అరెస్టు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాల్లో జరిగిన మారణహోమానికి సంబంధించి ఆ రాష్ట్ర పోలీసులు ఆరుగురు నక్సలైట్లను అరెస్టు చేసినట్టు సోమవారం వెల్లడించారు. వీరిలో ఒక మావోయిస్టు కమాండర్ కూడా ఉన్నాడు. గత నెలలో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను హతమార్చిన ఘటనలో వీరి పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Source: జాతీయ | 24 May 2010 | 6:12 am

మహేష్-అనుష్కల చిత్రమా..? అయితే.. సూపర్‌హిట్టే..!

టాలీవుడ్ యువరాజ్ మహేష్ బాబు, అందాల తార అనుష్క జంటగా నటిస్తున్న కొత్త చిత్రం తప్పకుండా బంపర్ హిట్ అవుతుందని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు. కాగా.. ప్రిన్స్ మహేష్ బాబు, బిల్లా సుందరి అనుష్క జంటగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ పూణేలో జరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ పూణే, మహారాష్ట్ర గ్రామ ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 24 May 2010 | 5:25 am

ప్రరాపాకు సీనియర్ నేత కళా వెంకట్రావు రాజీనామా!

ప్రజారాజ్యం పార్టీకి మరో సీనియర్ నేత గుడ్‌బై చెప్పారు. ప్రజా సమస్యల పోరాటంలో ప్రజారాజ్యం అనుసరిస్తున్న విధానాలు నచ్చకనే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు వెల్లడించారు. తాను మళ్లీ సొంత పార్టీ తెలుగుదేశంలోనే చేరనున్నట్టు ఆయన ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 24 May 2010 | 5:23 am

విజయవాడ పర్యటనను రద్దు చేసుకున్న కేసీఆర్!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు చేపట్టాలని భావించిన విజయవాడ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈనెల 27 లేదా 28వ తేదీల్లో విజయవాడ కేంద్రంగా జై ఆంధ్రా సదస్సు జరుగనుంది. ఇందులో పాల్గొనాల్సిందిగా కేసీఅర్‌ను జై ఆంధ్రా ఉద్యమ నేత కత్తి పద్మారావు ఆహ్వానించారు. దీనికి తొలుత కేసీఆర్ సమ్మతించారు.
Source: ఏపీ న్యూస్ | 24 May 2010 | 4:14 am

ప్రత్యేక రాష్ట్రాలు ఇవ్వాలనే ఒప్పందాలు లేవు: పీఎం

దేశంలో ప్రత్యేక రాష్ట్రాలు ఇవ్వాలనే ఒప్పందాలేవీ లేవని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు. అందువల్లే సమస్యపై అధ్యయనం చేసేందుకు జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 24 May 2010 | 4:07 am

నా భాష అంతేనండీ బాబూ..!: తమ్మారెడ్డి భరద్వాజ

"గతంలో మన హీరోలు మగాళ్లు కారు.. హీరోలకు దమ్ములేదంటూ.." ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. ఛాలెంజింగ్ పాత్రలు చేయడంలో తెలుగు హీరోలు ముందడుగు వేయడం లేదని తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై.. హీరోలు గుర్రుగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.
Source: వినోదం | 24 May 2010 | 2:33 am