సమాచార వ్యవస్థను మరింత విస్తరిస్తాం: మంత్రి ఏ. రాజా

దేశంలో సమాచార వ్యవస్థను మరింత పటిష్టవంతంగా తీర్చిదిద్ది విస్తరిస్తామని కేంద్ర కమ్యునికేషన్ల శాఖ మంత్రి ఏ.రాజా అన్నారు. అంతర్జాతీయ టెలికమ్యునికేషన్ యూనియన్ ఐదవ సదస్సును ఆయన సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు.
Source: Yahoo! Telugu: News | 24 May 2010 | 9:16 am

బ్యాంకింగ్ రంగంలో అగ్రస్థానానికి చేరుకుంటాం: ఐసీఐసీఐ

పశ్చిమ భారతంలోనున్న బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్‌ను చేజిక్కించుకోవడంతోపాటు తాజాగా తమ లక్ష్యం దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు కృషి చేస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రధాన కార్యనిర్వహణాధికారి చందా కోచ్చర్ సోమవారం మీడియాకు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 24 May 2010 | 8:57 am

విదేశీ స్టాక్ మార్కెట్ల ప్రభావం: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి!

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగా ర్యాలీని కొనసాగించడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 178 పాయింట్లు లాభపడి, 16,624 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 48 పాయింట్లు వృద్ధి చెందినా, ఐదువేల మార్కు (4,980) దిగువ స్థాయికి పడిపోయింది.
Source: Yahoo! Telugu: News | 24 May 2010 | 8:50 am

ఉత్తర కొరియా దుశ్చర్యలను ఇక సహించలేం: ద.కొరియా

ఉత్తర కొరియా దుశ్చర్యలను ఇకేమాత్రం సహించజాలమని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ ముంగ్ బాక్ అన్నారు. ఉభయ కొరియాల మధ్య శాంతి నెలకొనాలని ఇప్పటి వరకు తాము ఎంతో ఓపిక పట్టామని ఇక తమ వల్ల కాదని ఆయన అన్నారు. దీనిపై ఆయన సియోల్‌లో మాట్లాడుతూ ఉత్తర కొరియా పాల్పడే ఎలాంటి దుశ్చర్యనైనా ఇకపై తిప్పికొడుతామన్నారు. తమ దేశ రక్షణ నిమిత్తం ఈ తరహా చర్యలు చేపట్టక తప్పదన్నారు.
Source: Yahoo! Telugu: News | 24 May 2010 | 8:48 am

భారీ లాభాల దిశగా స్టాక్ మార్కెట్ పయనం

అంబానీ సోదరుల మైత్రి ఒప్పందంతో బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాల వైపు ఉరకలేస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు పయనిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 281 పాయింట్ల మేర లాభపడి, 16,727 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 94 పాయింట్లు పుంజుకుని, 5,025 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 24 May 2010 | 8:43 am

నా భాష అంతేనండీ బాబూ..!: తమ్మారెడ్డి భరద్వాజ

"గతంలో మన హీరోలు మగాళ్లు కారు.. హీరోలకు దమ్ములేదంటూ.." ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. ఛాలెంజింగ్ పాత్రలు చేయడంలో తెలుగు హీరోలు ముందడుగు వేయడం లేదని తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై.. హీరోలు గుర్రుగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఈ నేపథ్యంలో.. హీరోలపై తాను చేసిన వ్యాఖ్యలకు తమ్మారెడ్డి సోమవారం వివరణ ఇచ్చారు. చరిత చిత్ర ఫిలిమ్ ప్రొడక్షన్స్ 42 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా తమ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. హీరోలపై తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినీ నిందించాలనే ఉద్దేశంతో కాదన్నారు. ఇంకా తమ్మారెడ్డి మాట్లాడుతూ.. "భాషపై నాకు పరిజ్ఞానం లేదు. నేను పామరుణ్ణి. ఇంట్లో ఎలా మాట్లాడుతానో అలాగే అందరి దగ్గర మాట్లాడుతాను. ఎప్పుడూ ఒకేలా మాట్లాడుతాను. మొత్తానికి నా భాష అంతే..!" అని తేల్చి చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 May 2010 | 8:02 am

జార్ఖండ్‌లో రాజకీయ చందరంగానికి తెరదించిన భాజపా!

జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ చదరంగానికి భారతీయ జనతా పార్టీ సోమవారం తెరదించింది. ఆ రాష్ట్రంలోని జేఎంఎం ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంది. ఈ మేరకు మద్దతు ఉపసంహరణ లేఖను జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ ఎంఓహెచ్.ఫరూక్‌కు భాజపా జార్ఖండ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి రఘువీర్ దాస్ అందజేశారు. దీంతో ముఖ్యమంత్రి శిబూ సొరేన్ భవితవ్యం ప్రశ్నార్థకంలో పడింది.
Source: Yahoo! Telugu: News | 24 May 2010 | 7:35 am

డిసెంబరు నాటికి తగ్గనున్న ధరలుః ప్రధాని మన్మోహన్

ప్రస్తుత ఏడాది డిసెంబరు నాటికి నిత్యావసర సరుకుల ధరలు తగ్గుముఖంపట్టనున్నాయని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం మరింత తగ్గి 5-6 శాతానికి చేకుంటుందని ఆయన అన్నారు.
Source: Yahoo! Telugu: News | 24 May 2010 | 7:30 am

ముఖ్యమంత్రి రేసులో జగనే కాదు నేనూ ఉన్నా: డీఎల్

ముఖ్యమంత్రి పదవి రేసులో వైఎస్.జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాకుండా తాను కూడా ఉన్నట్టు ఆ పార్టీకి చెందిన శాసనసభ్యుడు, మాజీ మంత్రి డీఎల్.రవీంధ్రా రెడ్డి అన్నారు. ఆయన తాజాగా జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రి పదవికి జగన్‌కు మాత్రమే అర్హత ఉందా, నాకు లేదా అని ఆయన ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని తాను సంతకం పెట్టలేదని స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 24 May 2010 | 7:20 am

ఇక సహించలేం.. వేరు కుంపటి పెట్టండి: వైఎస్ వర్గం

కొన్ని దుష్ట శక్తులు చేస్తున్న కుట్రలు కుతంత్రాలను ఇంకేమాత్రం సహించలేమని అందువల్ల వేరు కుంపటి పెట్టాలని వైఎస్ వర్గం గట్టిగా కోరుతోంది. తమ ప్రియతమ నేత సాధించి పెట్టిన అధికారాన్ని అనుభవిస్తూనే తమపైనే అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తారా అంటూ వారు మండిపడుతున్నారు. వైఎస్ వర్గమంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తే రోశయ్య ఇంటికి వెళ్లి భగవద్గీ పఠనం చేసుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 24 May 2010 | 7:03 am

ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తాం: మన్మోహన్

తమ ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించేందుకు మరింతగా కృషి చేస్తోందని ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం న్యూ ఢిల్లీలో తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 24 May 2010 | 7:01 am

మహేష్-అనుష్కల చిత్రమా..? అయితే.. సూపర్‌హిట్టే..!

టాలీవుడ్ యువరాజ్ మహేష్ బాబు, అందాల తార అనుష్క జంటగా నటిస్తున్న కొత్త చిత్రం తప్పకుండా బంపర్ హిట్ అవుతుందని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు. కాగా.. ప్రిన్స్ మహేష్ బాబు, బిల్లా సుందరి అనుష్క జంటగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ పూణేలో జరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ పూణే, మహారాష్ట్ర గ్రామ ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 24 May 2010 | 5:25 am

జార్ఖండ్‌లో రాజకీయ చందరంగానికి తెరదించిన భాజపా!

జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ చదరంగానికి భారతీయ జనతా పార్టీ సోమవారం తెరదించింది. ఆ రాష్ట్రంలోని జేఎంఎం ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంది. ఈ మేరకు మద్దతు ఉపసంహరణ లేఖను జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ ఎంఓహెచ్.ఫరూక్‌కు భాజపా జార్ఖండ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి రఘువీర్ దాస్ అందజేశారు. దీంతో ముఖ్యమంత్రి శిబూ సొరేన్ భవితవ్యం ప్రశ్నార్థకంలో పడింది.
Source: జాతీయ | 24 May 2010 | 2:06 am

ముఖ్యమంత్రి రేసులో జగనే కాదు నేనూ ఉన్నా: డీఎల్

ముఖ్యమంత్రి పదవి రేసులో వైఎస్.జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాకుండా తాను కూడా ఉన్నట్టు ఆ పార్టీకి చెందిన శాసనసభ్యుడు, మాజీ మంత్రి డీఎల్.రవీంధ్రా రెడ్డి అన్నారు. ఆయన తాజాగా జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రి పదవికి జగన్‌కు మాత్రమే అర్హత ఉందా, నాకు లేదా అని ఆయన ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని తాను సంతకం పెట్టలేదని స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 24 May 2010 | 1:50 am

అతిపెద్ద సమస్యగా మావోయిస్టులు: ప్రధాని మన్మోహన్

దేశ అంతర్గత భద్రతకు మావోయిస్టులు అతిపెద్ద సమస్యగా మారారని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. యూపీఏ-2 ప్రభుత్వం తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన సోమవారం ఉదయం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. నానాటికీ పెట్రేగిపోతున్న నక్సల్స్ సమస్యను అణిచి వేసేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి పని చేయనున్నట్టు ప్రకటించారు. ఉగ్రవాదం దేశాన్ని పట్టిపీడిస్తోందని. నక్సల్/మావోయిస్టుల సమస్య దేశ అంతర్గత భద్రతకు పెను సవాల్‌గా మారిందన్నారు.
Source: జాతీయ | 24 May 2010 | 12:41 am

సొరేన్ ప్రభుత్వానికి భాజపా మద్దతు రాంరాం!

జార్ఖండ్‌లోని జేఎంఎం చీఫ్ శిబూ సొరేన్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఉప సంహరించుకునేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. మద్దతు ఉప సంహరణ లేఖను ఆ రాష్ట్ర గవర్నర్ ఎంఓహెచ్.ఫరూక్‌కు భాజపా రాష్ట్ర నేతలు సోమవారం అందజేయనున్నారు.
Source: జాతీయ | 23 May 2010 | 11:49 pm

నేటి నుంచి రాష్ట్రంలో జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ పర్యటన

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సోమవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ సమయంలో 12 సంఘాల నేతలో వారు సమావేశం కానున్నారు. ఈనెల 24, 25 తేదీల్లో జూబ్లీ హాలులో వివిధ సంఘాలను కలువనున్న కమిటీ, చివరి రోజు 26వ తేదీన లేక్‌ప్యూ అతిథి గృహంలో మరికొన్ని సంఘాలతో సమావేశం కానుంది.
Source: ఏపీ న్యూస్ | 23 May 2010 | 11:21 pm

రాష్ట్ర ప్రభుత్వ పనితీరు భేష్: గవర్నర్ నరసింహన్

రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కె.రోశయ్య పనితీరు భేషుగ్గా ఉందని గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ కితాబిచ్చారు. ఆయన రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం సాయంత్రం హస్తినకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను విలేకరులు అడిగిన ప్రశ్నలకు గవర్నర్ సమాధానం ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 23 May 2010 | 11:12 pm

కలిసికట్టుగా లక్ష్యాన్ని సాధిస్తాం: వరుణ్ గాంధీ

దేశంలో ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీలో అకుంఠిత దీక్షతో పని చేసే కార్యకర్తలున్నారని, తామందరం కలిసికట్టుగా తమ లక్ష్యాన్ని సాధించి తీరుతామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి వరుణ్ గాంధీ నొయిడాలో తెలిపారు.
Source: జాతీయ | 23 May 2010 | 10:15 pm

కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్ లభ్యం‌: నిపుణుల ఆరా!

మంగుళూరు విమాన ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దోహదపడేదిగా భావిస్తున్న కాక్‌పిట్ వాయిస్‌ రికార్డర్‌ (సివిఆర్)ను విమాన శిధిలాల నుంచి అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. పైలెట్‌కూ, వైమానిక ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఎటిసి) కి మధ్య జరిగిన సంభాషణలను ఇందులో నమోదై ఉంటాయి. అయితే, బ్లాక్‌ బాక్స్‌గా వ్వవహరించే కీలకమైన ఫ్లయిట్‌ డేటా రికార్డర్‌ (ఎఫ్‌డిఆర్‌) ఇంకా లభ్యంకాలేదు.
Source: జాతీయ | 23 May 2010 | 10:13 pm

అనుకున్నదొక్కటీ.. అయినదొక్కటీ.. బుల్‌బుల్ పిట్టా!

'అనుకున్నదొక్కటీ.. అయినదొక్కటీ.. బుల్‌బుల్ పిట్టా'.. ఇది ఓ సినీ కవి రాసిన పాట. ప్రస్తుతం వైఎస్ జగన్ వర్గానికి బాగా అతికి పోయింది. తమ ప్రియతమ నేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు రోశయ్య సర్కారు పాతర వేయాలని నిర్ణయించడంతో ఆగ్రహం చెందిన జగన్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బహిరంగ విమర్శలు చేశారు. తప్పు చేస్తే ప్రధానమంత్రి, చివరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని సైతం ఎదిరిస్తామని ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 23 May 2010 | 10:06 pm

ప్రముఖ గేయ రచయిత "వేటూరి"కి అంతిమ వీడ్కోలు!

సాహితీ సుగంధాలు గుబాళించే సినీ గీతాలను కళామతల్లికి అర్పించిన ప్రముఖ గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి (74)కి సినీ ప్రపంచం, ప్రజలు, అభిమానులు కన్నీటి ధారతో అంతిమ వీడ్కోలు పలికారు. అమీర్‌పేట నుండి ప్రారంభమైన ఆయన అంతిమ యాత్ర పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కవాడిగూడ మీదుగా బన్సీలాల్‌ పేట స్మశానవాటికకు చేరుకుంది.
Source: ఏపీ న్యూస్ | 23 May 2010 | 6:33 am

వేరొక రన్‌వేను ఎంచుకోవడం వల్లే ప్రమాదం: ఐఏఏ

సరైన రన్‌వేను అంచనా వేయలేక, మరో రన్‌వేను ఎంపిక చేసుకోవడం వల్లే మంగుళూరు విమాన ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్టు ఇండియన్ ఎయిర్‌‍పోర్టు అథారిటీకి చెందిన సీనియర్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు ఆదివారం విమానం కూలి పోయిన ప్రదేశాన్ని సందర్శించి, విమాన ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.
Source: జాతీయ | 23 May 2010 | 5:37 am

రేపటి నుంచి ముంబై వరుస రైళ్ళ పేలుళ్ల విచారణ

ముంబై మహా నగర రైళ్ళలో చోటు చేసుకున్న వరుస పేలుళ్ళ కేసు విచారణ సోమవారం నుంచి మళ్లీ ప్రారంభంకానుంది. ముంబైలో ప్రత్యేక మోకా కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ వరుస పేలుళ్ళకు సంబంధించి 13 మంది స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్స్ ఆఫ్ ఇండియా (సిమి) కార్యకర్తలను అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 23 May 2010 | 5:04 am

మానవతా దృక్పథంతోనే జగన్ "ఓదార్పు" యాత్ర..!

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణానంతరం మానవతా దృక్పథంతోనే కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహనరెడ్డి "ఓదార్పు" యాత్ర తలపెట్టారని కార్మికశాఖ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన అభిమానులను పరామర్శించేందుకే జగన్మోహన రెడ్డి ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారని దామోదర్ రెడ్డి పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 23 May 2010 | 4:13 am

సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి ఢోకా లేదు: సీఎం

రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి ఢోకా లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య ఉద్ఘాటించారు. సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో వెనుకడుగు వేసేది లేదని సీఎం స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 23 May 2010 | 3:50 am

పాటల రచయిత వేటూరి సుందర రామ్మూర్తి ఇకలేరు!

ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందర రామ్మూర్తి తుది శ్వాస విడిచారు. శనివారం రాత్రి తొమ్మిది గంటలకు ఆయన తిరిగిరాని లోకాలకు చేరుకున్నట్టు వైద్యులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన.. హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు.
Source: ఏపీ న్యూస్ | 23 May 2010 | 3:36 am

అధిష్టానం నుంచి పిలుపు: ఢిల్లీకి సీఏం, డీఎస్‌ల పయనం!

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌కు అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై హైకమాండ్‌తో చర్చలు జరిపేందుకుగాను డీఎస్‌కు హస్తిన నుంచి ఆహ్వానం అందినట్లు పార్టీ శ్రేణుల సమాచారం. దీంతో డీఎస్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారని తెలిసింది.
Source: ఏపీ న్యూస్ | 23 May 2010 | 2:43 am