|
మానవతా దృక్పథంతోనే జగన్ "ఓదార్పు" యాత్ర..!మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణానంతరం మానవతా దృక్పథంతోనే కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహనరెడ్డి "ఓదార్పు" యాత్ర తలపెట్టారని కార్మికశాఖ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన అభిమానులను పరామర్శించేందుకే జగన్మోహన రెడ్డి ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారని దామోదర్ రెడ్డి పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 23 May 2010 | 9:42 am చైనాలో రోడ్డు-రైలు ప్రమాదాలు: 42 మంది దుర్మరణం!చైనాలో రోడ్డు, రైలు ప్రమాదాల్లో 42 మంది దుర్మరణం పాలయ్యారు. నార్త్‌ఈస్ట్రన్ చైనాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 32 మంది మృత్యువాత పడ్డారు. అలాగే, ఒక రైలు పట్టాలు తప్పడంతో పది మంది మరణించారు.Source: Yahoo! Telugu: News | 23 May 2010 | 9:34 am అధ్యక్షుడు అవినీతి కేసులను తిరగదోడం: పాకిస్థాన్పాకిస్థాన్ అధ్యక్షుడి అవినీతి కేసులను తిరగదోడబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ దేశ కేబినెట్‌లో ఒక తీర్మానం చేసింది. పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఉన్న అసిఫ్ అలీ జర్దారీ.. అధ్యక్షుడు కాకముందు పలు అవినీతి కేసులను ఎదుర్కొన్న విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 23 May 2010 | 9:21 am సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి ఢోకా లేదు: సీఎంరాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి ఢోకా లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య ఉద్ఘాటించారు. సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో వెనుకడుగు వేసేది లేదని సీఎం స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 23 May 2010 | 9:19 am అధిష్టానం నుంచి పిలుపు: ఢిల్లీకి సీఏం, డీఎస్‌ల పయనం!ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌కు అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై హైకమాండ్‌తో చర్చలు జరిపేందుకుగాను డీఎస్‌కు హస్తిన నుంచి ఆహ్వానం అందినట్లు పార్టీ శ్రేణుల సమాచారం. దీంతో డీఎస్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారని తెలిసింది.Source: Yahoo! Telugu: News | 23 May 2010 | 8:13 am ఆకర్షణీయమైన ఆఫర్లతో అంతర్జాతీయ విమాన సంస్థలు!ప్రయాణికులను ఆకర్షించేందుకు అంతర్జాతీయ విమానాయాన సంస్థలు వివిధ రకాల ఆఫర్లతో కూడిన ప్రకటనలను గుప్పిస్తున్నాయి. ఈ వేసవిని క్యాచ్ చేసుకుని ఆదాయాన్ని అర్జించేందుకు వీలుగా ఇవి ఉంటున్నాయి. ఇందులోభాగంగా మలేసియా బడ్జెట్ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఆసియా 10 లక్షల ఉచిత సీట్లను ఆఫర్ చేసింది. అలాగే, మలేసియా ఎయిర్ లైన్స్ ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ఐదు నక్షత్రాల హోటళ్లలో బస సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపింది.Source: Yahoo! Telugu: News | 23 May 2010 | 8:07 am దేశ వ్యాప్తంగా యూనినార్ సేవల విస్తరణ: దుష్యన్యూనినార్ మొబైల్ సేవలను దేశ వ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించినట్టు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దుష్యన్ వైద్యనాథన్ వెల్లడించారు. అదేసమయంలో యువతరానికి అవసరమైన వాయిస్ మెయిల్, డేటా సర్వీసుల విస్తరణకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. యువత అభిరుచులకు అనుగుణంగా మరింత వేగవంతమైన, విలువ ఆధారిత సేవలను యువతరం కోరుకుంటున్నదని అన్నారు.Source: Yahoo! Telugu: News | 23 May 2010 | 7:49 am మంగుళూరు ప్రమాదం: 104 మృతదేహాల గుర్తింపు!మంగుళూరు విమాన ప్రమాద మృతుల్లో 104 మృతదేహాలను గుర్తించారు. వీటిని వారివారి బంధువుల అప్పగించారు. మిగిలిన మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. దీంతో డీఎన్ఏ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్టు ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు. మంగుళూరు విమానాశ్రయం వద్ద శనివారం ఉదయం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 23 May 2010 | 7:05 am టెన్త్ ఫలితాలు విడుదల: బాలికలదే పైచేయి!పదో తరగతి పరీక్షా ఫలితాలను రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖా మంత్రి మాణిక్య వరప్రసాదరావు ఆదివారం విడుదల చేశారు. ఈ పరీక్షా ఫలితాల్లో 81.63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత యేడాది కంటే ఈ దఫా మూడు శాతం పెరిగింది. ఈ యేడాది ఫలితాలను తొలిసారి గ్రేడింగ్ విధానంలో ప్రకటించడం గమనార్హం.Source: Yahoo! Telugu: News | 23 May 2010 | 6:04 am రేపటి నుంచి హైదరాబాద్‌లో టెలికాం దిగ్గజాల భేటీరాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. సోమవారం నుంచి ప్రపంచ టెలికాం అభివృద్ధి సదస్సు భాగ్యనగరిలో జరుగనుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ (ఐటియు) నిర్వహిస్తున్న ఐదో ప్రపంచ టెలికాం సదస్సు కావడం గమనార్హం. వచ్చే నాలుగేళ్ళలో ప్రపంచ టెలికాం రంగం దిశను నిర్దేశించే కార్యాచరణ ప్రణాళికను ఈ వేదికపై ఖరారు చేస్తారు.Source: Yahoo! Telugu: News | 23 May 2010 | 5:49 am మానవతా దృక్పథంతోనే జగన్ "ఓదార్పు" యాత్ర..!మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణానంతరం మానవతా దృక్పథంతోనే కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహనరెడ్డి "ఓదార్పు" యాత్ర తలపెట్టారని కార్మికశాఖ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన అభిమానులను పరామర్శించేందుకే జగన్మోహన రెడ్డి ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారని దామోదర్ రెడ్డి పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 23 May 2010 | 4:13 am సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి ఢోకా లేదు: సీఎంరాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి ఢోకా లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య ఉద్ఘాటించారు. సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో వెనుకడుగు వేసేది లేదని సీఎం స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 23 May 2010 | 3:50 am పాటల రచయిత వేటూరి సుందర రామ్మూర్తి ఇకలేరు!ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందర రామ్మూర్తి తుది శ్వాస విడిచారు. శనివారం రాత్రి తొమ్మిది గంటలకు ఆయన తిరిగిరాని లోకాలకు చేరుకున్నట్టు వైద్యులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన.. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు.Source: ఏపీ న్యూస్ | 23 May 2010 | 3:36 am అధిష్టానం నుంచి పిలుపు: ఢిల్లీకి సీఏం, డీఎస్‌ల పయనం!ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌కు అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై హైకమాండ్‌తో చర్చలు జరిపేందుకుగాను డీఎస్‌కు హస్తిన నుంచి ఆహ్వానం అందినట్లు పార్టీ శ్రేణుల సమాచారం. దీంతో డీఎస్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారని తెలిసింది.Source: ఏపీ న్యూస్ | 23 May 2010 | 2:43 am మంగుళూరు ప్రమాదం: 104 మృతదేహాల గుర్తింపు!మంగుళూరు విమాన ప్రమాద మృతుల్లో 104 మృతదేహాలను గుర్తించారు. వీటిని వారివారి బంధువుల అప్పగించారు. మిగిలిన మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. దీంతో డీఎన్ఏ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్టు ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు. మంగుళూరు విమానాశ్రయం వద్ద శనివారం ఉదయం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 23 May 2010 | 1:35 am ధరల పెరుగుదలపై ఈనెల 24న ఢిల్లీలో బ్లాక్‌డే: భాజపానిత్యావసర వస్తు ధరల పెరుగుదలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ రాష్ట్ర శాఖ ఈనెల 24వ తేదీన బ్లాక్‌డేను పాటించాలని నిర్ణయించింది. ఈ నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, రాజ్యసభ విపక్ష నేత అరుణ్ జైట్లీని నాయకత్వం వహిస్తారని భాజపా ఢిల్లీ శాఖ అధ్యక్షుడు విజయేంద్ర గుప్తా వెల్లడించారు.Source: జాతీయ | 23 May 2010 | 12:14 am ఇరు పార్టీలకు తలుపులు తెరిచే ఉంచాం: శిబూ సొరేన్జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు జార్ఖండ్ ముక్తి మోర్ఛా అధినేత, ముఖ్యమంత్రి శిబూ సొరేన్ వెల్లడించారు.Source: జాతీయ | 23 May 2010 | 12:05 am నేడు పదో తరగతి పరీక్షా ఫలితాలు!పదో తరగతి పరీక్షా ఫలితాలు నేడు (ఆదివారం) విడుదల కానున్నాయి. ఆదివారం (23వతేదీ) ఉదయం 11.30 గంటల ప్రాంతంలో మాథ్యమిక విద్యామంత్రి మాణిక్యవరప్రసాద్ టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈసారి సీబీఎస్‌ఈ, ఇంటర్ ఫలితాలకు భిన్నంగా విద్యార్థులు సాధించిన మార్కులు ప్రాతిపదికన తొమ్మిది గ్రేడ్లుగా విభజించి ఫలితాలను ప్రకటిస్తారు.Source: ఏపీ న్యూస్ | 22 May 2010 | 9:36 pm అతివేగమే విమాన ప్రమాదానికి కారణం: ప్రఫుల్ పటేల్మంగుళూరు ప్రమాదానికి విమాన అతి వేగమే కారణంగా భావిస్తున్నట్టు కేంద్ర పౌర విమానయానశాఖామంత్రి ప్రఫుల్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాదానికి గల కారణాలను కనుగొనేందుకు ఉన్నతస్థాయి కమిటీని డీజీసీఏ ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.Source: జాతీయ | 22 May 2010 | 9:02 am నేను "దేవదాసు" రామ్ ఫ్యాన్‌ను: అర్జున్‌రామ్ నటించిన "రామరామ కృష్ణకృష్ణ" చిత్రంలో అర్జున్ నటించాడు. అంతకుముందు రామ్ చిత్రాలు చూసి తన ఫ్యాన్‌ను అయ్యానని అర్జున్ తెలిపారు. ఈ చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాదులో జరిగింది. అంతకుముందే రామ్ మాట్లాడుతూ... అర్జున్ గారి మేనల్లుడు కథలు వస్తే అవి తనకు వినిపించేవారనీ, చాలా మంచి మనిషని కితాబిచ్చారు. ఈ చిత్రం శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించారు.ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ...మా చిత్రం సక్సెస్ అయింది. చాలా ఆనందంగా ఉంది. కానీ ఇటువంటి సమయంలో ఆంధ్రాలో తుఫాన్ రావడంతో అక్కడి ప్రజలు కకావికలులయ్యారు. వారికి మా సానుభూతి తెలియజేస్తున్నాం. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 May 2010 | 7:17 am జూన్‌లో గద్దె సింధూర "కిల్లర్"లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో కిల్లర్ చిత్రం రూపొందుతోంది. నగేష్ నారదాశి దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్ నిర్మాత. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... సస్పెన్స్‌తో కూడిన చిత్రమిది. హీరోయిన్ నేపథ్యంలో సాగే కథ. గద్దె సింధూర తన పాత్రకు న్యాయం చేసింది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెలాఖరులో ఆడియోను, జూన్ మొదటి వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఈ చిత్రంలో రవిప్రకాష్, జీవా, రామిరెడ్డి, సుమన్ శెట్టి తదితరులు నటించారు. సంగీతం: సాయి కార్తీక్, ఆర్ట్: జేపి, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: నగేష్ నారదాశిSource: Yahoo! Telugu: Entertainment | 22 May 2010 | 6:55 am రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి: బాబులైలా తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే తుఫాను కారణంగా ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 22 May 2010 | 6:33 am సత్యంబాబు అమాయకుడు: అయేషా తల్లి శంషాద్తన కుమార్తె హత్యకేసులో పోలీసులు అరెస్టు చేసిన సత్యంబాబు అమాయకుడని హతురాలు అయేషా బేగం తల్లి శంషాద్ బేగం అభిప్రాయపడ్డారు. పోలీసు ఎస్కార్ట్ నుంచి సత్యంబాబు తప్పించుకుని పోయినట్టు మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు.Source: ఏపీ న్యూస్ | 22 May 2010 | 5:54 am ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణం: వర్గాలుమంగుళూరులో చోటు చేసుకున్న విమాన ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే ప్రధాన కారణమని తెలుస్తోంది. లైలా తుఫాను ప్రభావం కారణంగా కురిసిన భారీ వర్షంతో రన్ బాగా తడిసిముద్దయింది. దీంతో రన్‌వే పటుత్వం లేకుండా పోయింది. ఫలితంగా ల్యాండ్ అవుతున్న విమానం అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడి పేలిపోయినట్టు ప్రాథమిక సమాచారం.Source: జాతీయ | 22 May 2010 | 5:46 am విమాన ప్రమాదం: మృతుల్లో కేరళవాసులే అధికంకర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది కేరళవాసులే ఉన్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 160 మంది మృత్యువాత పడగా, వీరిలో 14 పిల్లలు, నలుగురు శిశువులు ఉన్నట్టు ఎయిర్ ఇండియా డైరక్టర్ అనూప్ శ్రీవాస్తవ వెల్లడించారు.Source: జాతీయ | 22 May 2010 | 5:28 am మంగుళూరు విమాన ప్రమాదం: హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!మంగుళూరు విమాన ప్రమాదానికి సంబంధించి విమానయానశాఖ అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించారు. మృతులు, క్షతగాత్రుల వివరాలను తెలుసుకునేందుకు వీలుగా ఈ సౌకర్యం ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇవి ఢిల్లీ, మంగుళూరు, బెంగుళూరులలో పని చేస్తాయి.Source: జాతీయ | 22 May 2010 | 2:51 am
|