అమెరికన్లకన్నా అధిక సంపాదనాపరులు హెచ్-1బీ వారే!!

అమెరికా ఐటీ ఉద్యోగస్తులకన్నా హెచ్-1బీ వీసా కలిగిన భారత ఐటీ నిపుణులే అమెరికాలో ఎక్కువగా సంపాదిస్తున్నారని సర్వే చెబుతోంది.
Source: Yahoo! Telugu: News | 22 May 2010 | 8:35 am

మంగుళూరు విమాన ప్రమాదం: హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!

మంగుళూరు విమాన ప్రమాదానికి సంబంధించి విమానయానశాఖ అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించారు. మృతులు, క్షతగాత్రుల వివరాలను తెలుసుకునేందుకు వీలుగా ఈ సౌకర్యం ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇవి ఢిల్లీ, మంగుళూరు, బెంగుళూరులలో పని చేస్తాయి.
Source: Yahoo! Telugu: News | 22 May 2010 | 8:21 am

నేను "దేవదాసు" రామ్ ఫ్యాన్‌ను: అర్జున్

రామ్ నటించిన "రామరామ కృష్ణకృష్ణ" చిత్రంలో అర్జున్ నటించాడు. అంతకుముందు రామ్ చిత్రాలు చూసి తన ఫ్యాన్‌ను అయ్యానని అర్జున్ తెలిపారు. ఈ చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాదులో జరిగింది. అంతకుముందే రామ్ మాట్లాడుతూ... అర్జున్ గారి మేనల్లుడు కథలు వస్తే అవి తనకు వినిపించేవారనీ, చాలా మంచి మనిషని కితాబిచ్చారు. ఈ చిత్రం శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించారు.ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ...మా చిత్రం సక్సెస్ అయింది. చాలా ఆనందంగా ఉంది. కానీ ఇటువంటి సమయంలో ఆంధ్రాలో తుఫాన్ రావడంతో అక్కడి ప్రజలు కకావికలులయ్యారు. వారికి మా సానుభూతి తెలియజేస్తున్నాం. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 May 2010 | 7:17 am

సత్యంబాబు పరారీ: 12 మంది కానిస్టేబుల్స్ సస్పెండ్!

విజయవాడకు చెందిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా హత్య కేసులో ప్రధాన నిందితుడైన సత్యంబాబు పరారైన సంఘటనకు సంబంధించి ఒక ఆర్ఎస్ఐ‌తో సహా 12 మంది కానిస్టేబుల్స్‌ సస్పెండ్‌కు గురయ్యారు. నిందితుడు అనారోగ్యంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో పోలీసులు చికిత్స చేయించారు.
Source: Yahoo! Telugu: News | 22 May 2010 | 7:06 am

చైనాలో అదనపు పెట్టుబడులు పెడుతున్నాం: పెప్సికో

రానున్న మూడు సంవత్సరాల్లో చైనాలో తమ సంస్థ అదనంగా 2.5 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టనుందని పెప్సికో ఛైర్మెన్, సీఈఓ ఇంద్రా నూయీ శనివారం బీజింగ్‌లో వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 22 May 2010 | 7:00 am

జూన్‌లో గద్దె సింధూర "కిల్లర్"

లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో కిల్లర్ చిత్రం రూపొందుతోంది. నగేష్ నారదాశి దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్ నిర్మాత. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... సస్పెన్స్‌తో కూడిన చిత్రమిది. హీరోయిన్ నేపథ్యంలో సాగే కథ. గద్దె సింధూర తన పాత్రకు న్యాయం చేసింది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెలాఖరులో ఆడియోను, జూన్ మొదటి వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఈ చిత్రంలో రవిప్రకాష్, జీవా, రామిరెడ్డి, సుమన్ శెట్టి తదితరులు నటించారు. సంగీతం: సాయి కార్తీక్, ఆర్ట్: జేపి, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: నగేష్ నారదాశి
Source: Yahoo! Telugu: Entertainment | 22 May 2010 | 6:55 am

మా సత్ సంబంధాలతో భారత్-పాక్‌లకు మేలు: అమెరికా

భారత్-పాకిస్థాన్ దేశాలతో మెరుగైన సంబంధాలు కొనసాగించేందుకు అమెరికా కృషి చేస్తున్నట్టు ఆ దేశ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జిమ్ స్టెయిన్‌బర్గ్ వెల్లడించారు. ఇది భారత్-పాకిస్థాన్ దేశాల సంబంధాల మెరుగుకు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 22 May 2010 | 6:44 am

సోమవారం నుంచి ప్రారంభం కానున్న బీడబ్ల్యూఏ వేలం పాట

బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్ యాక్షన్ (బీడబ్ల్యూఏ) సేవల వేలంపాట సోమవారం నుంచి ప్రారంభం కానుందని టెలికాం శాఖ ప్రకటించింది. తొలుత శనివారం వేలంపాట నిర్వహించాలని ప్రభుత్వం భావించింది.
Source: Yahoo! Telugu: News | 22 May 2010 | 6:26 am

వైఎస్ పథకాలకు పాతర: కాంగ్రెస్‌లో మాటల యుద్ధం!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తన హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రస్తుత రోశయ్య సర్కారు స్వస్తి చెప్పే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నారు. రాష్ట్ర ఖజానాలో నిధులు లేమిని సాకుగా చూపి ఈ పథకాలకు పాతర వేసేందుకు నిర్ణయించుకునట్టు తెలుస్తోంది. ఇదేవిషయాన్ని ముఖ్యమంత్రి రోశయ్య తన మంత్రి వర్గ చరులకు పదేపదే చెపుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 22 May 2010 | 6:23 am

అమెరికా ఆర్థిక వ్యవస్థపై యూరప్ ప్రభావం : డేనియల్

యూరప్‌లో నెలకొన్న ఆర్థిక అసమానతల ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడనుందని, దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరోమారు ప్రభావం చూపనుందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ డేనియల్ కే తారు వాషింగ్టన్‌లో తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 22 May 2010 | 6:16 am

ఆ మూడు జిల్లాల్లో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే!

లైలా తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ముఖ్యమంత్రి కె.రోశయ్య ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయన శనివారం ఉదయం పది గటంలకు హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయంలో నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు.
Source: Yahoo! Telugu: News | 22 May 2010 | 6:07 am

దశాబ్ద కాలంలో భరత గడ్డపై ఘోర విమాన ప్రమాదం!

భరత గడ్డపై ఘోరకలి జరిగిపోయింది. గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని ఘోర ప్రమాదం శనివారం ఉదయం చోటు చేసుకుంది. గత పది సంవత్సరాల్లో ఇలాంటి ఘోర విమాన ప్రమాదం జరగడం ఇదే తొలిసారని ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 22 May 2010 | 5:57 am

మంగుళూరు విమాన ప్రమాదం: హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!

మంగుళూరు విమాన ప్రమాదానికి సంబంధించి విమానయానశాఖ అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించారు. మృతులు, క్షతగాత్రుల వివరాలను తెలుసుకునేందుకు వీలుగా ఈ సౌకర్యం ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇవి ఢిల్లీ, మంగుళూరు, బెంగుళూరులలో పని చేస్తాయి.
Source: జాతీయ | 22 May 2010 | 2:51 am

సత్యంబాబు పరారీ: 12 మంది కానిస్టేబుల్స్ సస్పెండ్!

విజయవాడకు చెందిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా హత్య కేసులో ప్రధాన నిందితుడైన సత్యంబాబు పరారైన సంఘటనకు సంబంధించి ఒక ఆర్ఎస్ఐ‌తో సహా 12 మంది కానిస్టేబుల్స్‌ సస్పెండ్‌కు గురయ్యారు. నిందితుడు అనారోగ్యంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో పోలీసులు చికిత్స చేయించారు.
Source: ఏపీ న్యూస్ | 22 May 2010 | 1:36 am

వైఎస్ పథకాలకు పాతర: కాంగ్రెస్‌లో మాటల యుద్ధం!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తన హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రస్తుత రోశయ్య సర్కారు స్వస్తి చెప్పే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నారు. రాష్ట్ర ఖజానాలో నిధులు లేమిని సాకుగా చూపి ఈ పథకాలకు పాతర వేసేందుకు నిర్ణయించుకునట్టు తెలుస్తోంది. ఇదేవిషయాన్ని ముఖ్యమంత్రి రోశయ్య తన మంత్రి వర్గ చరులకు పదేపదే చెపుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 22 May 2010 | 12:54 am

ఆయేషా హత్య కేసు: ప్రధాన నిందితుడు పరారీ!

ఆయేషా హత్యకేసులో ప్రధాన నిందితుడు సత్యంబాబు పరారీ అయ్యాడు. అనారోగ్యంగా ఉన్న సత్యంబాబును వైద్య చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పూర్తయిన తర్వాత విజయవాడ తిరుగు ప్రయాణంలో సత్యంబాబు పోలీసుల కళ్లుగప్పి పారిపోయినట్లు వార్తలొస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 22 May 2010 | 12:38 am

ఆ మూడు జిల్లాల్లో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే!

లైలా తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ముఖ్యమంత్రి కె.రోశయ్య ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయన శనివారం ఉదయం పది గటంలకు హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయంలో నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు.
Source: ఏపీ న్యూస్ | 22 May 2010 | 12:38 am

దశాబ్ద కాలంలో భరత గడ్డపై ఘోర విమాన ప్రమాదం!

భరత గడ్డపై ఘోరకలి జరిగిపోయింది. గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని ఘోర ప్రమాదం శనివారం ఉదయం చోటు చేసుకుంది. గత పది సంవత్సరాల్లో ఇలాంటి ఘోర విమాన ప్రమాదం జరగడం ఇదే తొలిసారని ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు.
Source: జాతీయ | 22 May 2010 | 12:27 am

బీహార్‌లో నలుగురిని హతమార్చిన మావోయిస్టులు

బీహార్‌లోని శివహర్ జిల్లాలోనున్న రాంబన్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని మావోయిస్టులు హతమార్చారు.
Source: జాతీయ | 21 May 2010 | 11:11 pm

రైల్‌ భవన్‌ను పేల్చేస్తామంటూ సిఆర్‌బికి బెదిరింపు లేఖ

దేశ రాజధానిలో ఢిల్లీలోవున్న రైల్‌ భవన్‌‌తోపాటు మరికొన్ని కీలకమైన రైల్వే నిర్వహణా వ్యవస్థలను పేల్చేస్తామని బెదిరిస్తూ రైల్వే కేంద్ర కార్యాలయానికి ఒక లేఖ అందింది. దాంతో అధికారులు అప్రమత్తమై భద్రతా చర్యల్ని కట్టుదిట్టం చేశారు.
Source: జాతీయ | 21 May 2010 | 10:54 pm

పొగమంచు కారణంగానే ప్రమాదం: కర్నాటక హోం శాఖ

మంగళూరు వద్ద జరిగిన విమాన ప్రమాదం పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని కర్నాటక హోం శాఖ ప్రకటించింది.
Source: జాతీయ | 21 May 2010 | 10:52 pm

మంగళూరులో కూలిన ఎఐ విమానం: 160 మంది మృతి

దుబాయ్ నుంచి మంగుళూరు వస్తున్న ఎయిర్ ఇండియా విమానం మంగళూరు విమానాశ్రయం ముందున్న లోయలో పడి ప్రమాదానికి గురైంది. అనుకోని ఈ సంఘటనతో అందులో ప్రయాణిస్తున్న 169 మంది ప్రయాణీకుల్లో 160 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
Source: జాతీయ | 21 May 2010 | 10:45 pm

అమాయకపు పిల్లతో "ఆవారా" జర్నీ

గతంలో రన్, పందెంకోడి వంటి చిత్రాలను రూపొందించిన లింగుస్వామి తెలుగులో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నాడు. తాజాగా తమిళ పయ్యా చిత్రాన్ని తెలుగులో ఆవారాగా అనువదించారు. ఈ చిత్రం ఓ జర్నీ నేపధ్యంలో సాగుతుంది. కథ పాతదే అయినా ట్రీట్‌మెంట్‌లో కొత్తదనం చొప్పించి మాయచేసి ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేయడంలో లింగుస్వామి కృతకృత్యుడయ్యారు.కథలోకి వెళితే... విద్యనభ్యసించి ఉద్యోగాన్వేషణలో బెంగళూరుకు ఇంటర్య్వూ కోసం వెళతాడు శివ(కార్తీ). కారులో టూర్‌లు తిరగడం అతనికి సరదా. ఒక రకంగా ఆవారాగా తిరుగుతుంటాడు. అటువంటి సమయంలో బస్‌స్టాప్‌లో చారులత(తమన్నా)ను చూసి తొలిచూపులోనే లవ్‌లో పడతాడు. దాంతో ఆమె వివరాలు సేకరించాలని ప్రయత్నిస్తాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2010 | 1:02 pm

తెరకెక్కుతున్న "తేరా బిన్ లాడెన్"

ఒసామా బిన్ లాడెన్ పేరు చెబితే ప్రపంచం గడగడా వణుకుతుంది. ఈ పేరునే సినిమాకు ఉపయోగిస్తూ వాక్‌వాటర్ మీడియా బ్యానర్‌పై అభిషేక్ శర్మ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. "తేరే బిన్ లాడెన్" పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో పాకిస్తాన్‌కు చెందిన అలీ జాఫర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం జూలై 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఇక చిత్ర విశేషాలను చూస్తే... ఇది పూర్తి హాస్యప్రధానమైన చిత్రం. అమెరికాకు వెళ్లాలన్న కలను నిజం చేసుకోవలనుకునే ఓ పాకిస్తాన్ యువ పాత్రికేయుడు పడే పాట్లను అత్యంత హాస్యభరితంగా తెరకెక్కిస్తున్నారు. సదరు జర్నలిస్టు ఎన్నిసార్లు వీసాకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ నిరాకరణకు గురవుతుంటుంది. దీంతో విసిగి వేసారిన ఆ రిపోర్టర్ ఒసామా బిన్ లాడెన్ అవతారంలోకి మారతాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది మిగిలిన సినిమా.
Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2010 | 11:19 am

తొలిసారిగా నగ్నంగా సెక్స్ సీన్‌లో ఫ్రిదా పింటో

స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ ఫ్రిదా పింటో మొట్టమొదటిసారిగా సెక్స్ సన్నివేశంలో నటించింది. గ్రీకు పురాణ గాథను అనుసరించి తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు "ఇమ్మోర్టల్". ఈ చిత్రంలో పూర్తి నగ్నంగా నటించాల్సిన సన్నివేశంతోపాటు హీరోతో సెక్స్‌లో పాల్గొన్నట్లు నటించాల్సిన సన్నివేశాలు రెండు మూడు ఉన్నట్లు దర్శకుడు తర్సెమ్ సింగ్ వెల్లడించారు. ఫ్రిదాకు సెక్స్ సీన్‌లో నటించడం తొలిసారి కావడంతో ఆమె తెగ సిగ్గుపడి పోయినట్లు దర్శకుడు చెప్పుకొచ్చాడు. దీంతో సెక్స్ సీన్ చిత్రీకరిస్తున్న గదిలో ఉన్న లైట్లను స్విచాఫ్ చేసి కేవలం ఒకే ఒక్క లైటు వెలుతురులో ఫ్రిదాపై సెక్స్ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు వెల్లడించాడు. తొలుత సెక్స్ సన్నివేశంలో నటించేందుకు సిగ్గుపడినా ఆ తర్వాత పలు రిహార్సిల్స్ తర్వాత ఫ్రిదా అద్భుతంగా నటించిందని చెప్పుకొచ్చాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2010 | 7:33 am

లైలా తుఫాను ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది మృతి!

లైలా తుఫాను సృష్టించిన బీభత్సానికి రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది మృత్యువాత పడ్డారు. ఒక రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. కాకినాడ సమీపంలోని కాజలూరు మండలం దుగ్గుదురులో వెంకన్న అనే రైతు తన పొలం వద్ద పోసిన ధాన్యం రాశులు భారీ వర్షానికి నీట మునిగిపోవడంతో అది భరించలేక పొలంలోనే పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు.
Source: ఏపీ న్యూస్ | 21 May 2010 | 7:02 am

కాంగ్రెస్ నేతల పర్యటన.. ఆత్మవంచన యాత్ర: కేటీఆర్

తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ నేతలు చేపట్టనున్న యాత్రను ఆత్మ విశ్వాస యాత్ర కాదని, ఆత్మ వంచన యాత్ర అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే కె.టి.రామారావు ఆరోపించారు. దీనిపై ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఆత్మవిశ్వాస యాత్ర పేరుతో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు తెలంగాణలో ఆత్మవంచన యాత్ర తలపెట్టారని దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 21 May 2010 | 6:04 am

తీవ్రవాది కసబ్ గుర్తింపు సంఖ్య: ఖైదీ నంబరు సి-7096

ముంబై దాడుల కేసుల్లో ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించిన పాకిస్థాన్ పౌరుడు, లష్కర్ తోయిబా తీవ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌కు ముంబై జైలు అధికారులు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించారు. ఈ నంబరు సి-7096గా ఉంది. దీంతో ఇకపై కసబ్‌ను ఖైదీ నంబరు సి-7096గా పిలుస్తారు.
Source: జాతీయ | 21 May 2010 | 5:53 am

రాక్షసిలానే కాదు.. ఎలాగైనా నటిస్తా: ప్రియమణి

"ఇండస్ట్రీలో నేను నటినే. నెంబర్ల గేమ్ లేదు. వన్... టూ... అని చెప్పుకోవడానికి ఇష్టపడను. నటిగానే సంతృప్తిగా ఫీలవుతాన"ని ప్రియమణి చెపుతోంది. తెలుగులో గోలీమార్‌లో నటించింది. హిందీలో రావణ్‌లో నటించింది. రావణ్‌లో శూర్పణఖ పాత్ర చేస్తున్నారా అని అడిగితే... అది నన్ను అడగవద్దు. దర్శకులే చెప్పాలి.. అని తప్పించుకుంది. ఏ భాషలో చేసినా ప్రియమణి ఎటువంటి పాత్రనైనా చేయగలదు అనిపించుకోవాలనేది తన ప్రయత్నం అంటోంది. దర్శకులు కూడా అలానే నమ్ముతున్నారనీ, వారి నమ్మకాన్ని నిలబెడతాను అంది.
Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2010 | 5:33 am

కరుణానిధి కథ: ఉదయ్‌కిరణ్ - మీరా జంటగా అల్లాడిస్తా

తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అందించిన కథతో రూపొందుతోన్న చిత్రం అల్లాడిస్తా. ఉదయ్ కిరణ్, మీరా జాస్మిన్ జంటగా తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో రూపొందుతూ విడుదలకు సిద్ధమవుతోంది. బాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగునాట మానస్ ప్రొడక్షన్స్ అధినేత రోహిత్ విడుదల చేస్తున్నారు. కె.సాగర్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ చిత్రం అనుక్షణం ఆసక్తికరంగా సాగుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అందించిన కథ - స్క్రీన్ ప్లే ఈ చిత్రాన్ని చూస్తున్న ప్రేక్షకులు కొత్త అనుభూతికి గురయ్యేలా వుంటాయని నిర్మాత తెలిపారు. యాక్షన్ సన్నివేశాలు, నాయకానాయికల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు, న్యూజీలాండ్‌లో చిత్రీకరించిన గీతాలు, వెంకట్ మల్లూరి సంభాషణలు, బాలి దర్శకత్వ ప్రతిభ, వెన్నెలకంటి సాహిత్యం ఈ చిత్రాన్ని విజయపథంలో నడిపిస్తాయన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2010 | 5:18 am

డార్జిలింగ్‌లో గూర్ఖా నేత మదన్ తమాంగ్ దారుణ హత్య!

ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం పోరాడుతున్న అఖిల అఖిల్ భారతీయ గూర్ఖా లీగ్ (ఏబీజీఎల్) అధ్యక్షుడు, గూర్ఖా నేత మదన్ తమంగ్ శుక్రవారం డార్జిలింగ్‌లో దారుణ హత్యకు గురయ్యారు. తమ పార్టీ ఆధ్వర్యంలో జరగాల్సిన బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పర్యవేక్షిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి తెగించారు.
Source: జాతీయ | 21 May 2010 | 5:16 am

వైఎస్సార్ దయార్ద్ర హృదయుడు: జేసీ దివాకర్ రెడ్డి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి దయార్ద్ర హృదయుడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన అతి క్షమాగుణం వల్లే పరిపాలన గాడితప్పిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ పథకాలపై సమీక్ష చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 May 2010 | 4:24 am

సత్యం కుంభకోణ దర్యాప్తు: 90 శాతం మేరకు పూర్తి

కోట్లాది రూపాయల సత్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో దర్యాప్తు దాదాపు 90 శాతం మేరకు పూర్తయినట్టు కేంద్ర నేర పరిశోధక సంస్థ (సీబీఐ) అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సత్యం నిధుల దారి మళ్లింపుపై తాము దృష్టి కేంద్రీకరించి ఉన్నట్టు సీబీఐ డీఐజీ వీవీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఈ కుంభకోణానికి సంబంధించి అనేక అంశాల్లో దర్యాప్తు పూర్తయిందన్నారు. అందువల్లే 90 శాతం మేరకు పూర్తయిందని చెపుతున్నట్టు పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 May 2010 | 4:06 am

ఆఫ్జల్ భవితవ్యాన్ని హోంశాఖ తేల్చుతుంది: షీలా దీక్షిత్

పార్లమెంట్‌పై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురు భవితవ్యాన్ని కేంద్ర హోంశాఖ తేల్చుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ స్పష్టం చేశారు. దీనిపై ఆమె శుక్రవారం మాట్లాడుతూ అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేసే అంశంపై నెలకొన్న వివాదానికి కేంద్రం తెరదించుతుందన్నారు.
Source: జాతీయ | 21 May 2010 | 3:25 am