|
పిరమల్ హెల్త్‌కేర్‌ను కైవసం చేసుకోనున్న అబ్బోట్భారతదేశానికి చెందిన ఔషధ నిర్మాణ కంపెనీ పిరమల్ హెల్త్‌కేర్ సంస్థను అమెరికాకు చెందిన అబ్బోట్ ఔషధ కంపెనీ 3.72 వందల కోట్ల డాలర్ల(దాదాపు రూ. 17,500 కోట్లు)కు కొనుగోలు చేసేందుకు శుక్రవారం న్యూఢిల్లీలో ఒప్పందం కుదిరినట్లు అబ్బోట్ సంస్థ అధ్యక్షుడు, ప్రధాన కార్యనిర్వహణాధికారి మైల్స్ డీ వైట్ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 21 May 2010 | 9:18 am మొన్న ఫేస్‌బుక్.. నిన్న యూట్యూబ్.. నేడు ట్విట్టర్మహ్మద్ ప్రవక్తపై అభ్యంతకరమైన క్యారీకేచర్‌లు ప్రచురించినందుకు మొన్న.. ఫేస్‌బుక్, నిన్న.. యూ ట్యూబ్‌లపై నిషేధం విధించిన పాకిస్థాన్ సర్కారు నేడు (శుక్రవారం) ట్విట్టర్‌పై నిషేధిం విధించింది. ఈ విషయాన్ని ఆ దేశ సమాచార శాఖ వెల్లడించింది. ఈ శాఖ ఆదేశాల మేరకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ సంస్థలు ట్విట్టర్ సైట్‌ను బ్లాక్ చేశాయి. దీంతో పాకిస్థాన్ నెటిజన్లు యాక్సెస్ చేయలేక పోతున్నారు. ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లిన నెటిజన్లు ట్విట్టర్ బ్లాగును ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా, ఈ 'సైటు నిషేధించబడింది' అనే సమాచారాన్ని వారు పొందుతున్నారు.Source: Yahoo! Telugu: News | 21 May 2010 | 9:09 am ఐటీ శాఖలో వేలల్లో ఉద్యోగాలుః ఆర్థిక మంత్రిత్వ శాఖదేశీయ ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ)లో వెంటనే 30,000 మంది అదనపు సిబ్బంది కావాల్సివుందని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం న్యూ ఢిల్లీలో తెలిపారు.Source: Yahoo! Telugu: News | 21 May 2010 | 9:00 am ఆఫ్జల్ భవితవ్యాన్ని హోంశాఖ తేల్చుతుంది: షీలా దీక్షిత్పార్లమెంట్పై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురు భవితవ్యాన్ని కేంద్ర హోంశాఖ తేల్చుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ స్పష్టం చేశారు. దీనిపై ఆమె శుక్రవారం మాట్లాడుతూ అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేసే అంశంపై నెలకొన్న వివాదానికి కేంద్రం తెరదించుతుందన్నారు.Source: Yahoo! Telugu: News | 21 May 2010 | 8:55 am జీ-20 సమావేశంలో పాల్గొన్న ఆర్థికశాఖ కార్యదర్శిజీ-20 దేశాలకు చెందిన ఆర్థిక మంత్రిత్వశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యదర్శి అశోక్ చావ్లా, సంయుక్త కార్యదర్శి అలోక్ షీల్‌లు భారతదేశం తరపును ప్రాతనిధ్యం వహించారు.Source: Yahoo! Telugu: News | 21 May 2010 | 8:39 am నష్టాల్లో కొనసాగుతున్న బాంబే స్టాక్ మార్కెట్శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాల వైపు ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 184 పాయింట్ల నష్టంతో, 16,334 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 49 పాయింట్ల పతనంతో, 4,897 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 21 May 2010 | 7:45 am తొలిసారిగా నగ్నంగా సెక్స్ సీన్‌లో ఫ్రిదా పింటోస్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ ఫ్రిదా పింటో మొట్టమొదటిసారిగా సెక్స్ సన్నివేశంలో నటించింది. గ్రీకు పురాణ గాథను అనుసరించి తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు "ఇమ్మోర్టల్". ఈ చిత్రంలో పూర్తి నగ్నంగా నటించాల్సిన సన్నివేశంతోపాటు హీరోతో సెక్స్‌లో పాల్గొన్నట్లు నటించాల్సిన సన్నివేశాలు రెండు మూడు ఉన్నట్లు దర్శకుడు తర్సెమ్ సింగ్ వెల్లడించారు. ఫ్రిదాకు సెక్స్ సీన్‌లో నటించడం తొలిసారి కావడంతో ఆమె తెగ సిగ్గుపడి పోయినట్లు దర్శకుడు చెప్పుకొచ్చాడు. దీంతో సెక్స్ సీన్ చిత్రీకరిస్తున్న గదిలో ఉన్న లైట్లను స్విచాఫ్ చేసి కేవలం ఒకే ఒక్క లైటు వెలుతురులో ఫ్రిదాపై సెక్స్ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు వెల్లడించాడు. తొలుత సెక్స్ సన్నివేశంలో నటించేందుకు సిగ్గుపడినా ఆ తర్వాత పలు రిహార్సిల్స్ తర్వాత ఫ్రిదా అద్భుతంగా నటించిందని చెప్పుకొచ్చాడు.Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2010 | 7:33 am గ్యాస్ ధరలు పెరగడంతో పెరగనున్న విద్యుత్ ఛార్జీలుసహజ వాయువు ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడంతో ప్రజలు వాడుతున్న ప్రతి యూనిట్ విద్యుత్‌పై రూ. 1.50ల మేరకు పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర విద్యుత్ శాఖాధికారులు అభిప్రాయపడుతున్నాయి.Source: Yahoo! Telugu: News | 21 May 2010 | 6:56 am విదేశీ స్టాక్ మార్కెట్ల ప్రభావం: నష్టాల్లో సెన్సెక్స్!అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి తిరోగమనం వైపు పయనిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 154 పాయింట్లు క్షీణించి, 16,365 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 13 పాయింట్ల స్వల్ప నష్టంతో, 4,934 పాయింట్ల మార్కును తాకింది.Source: Yahoo! Telugu: News | 21 May 2010 | 6:45 am త్వరలో రానున్న " గూగుల్ టీవీ "ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్‌లో అగ్రగామిగానున్న గూగుల్ సంస్థ త్వరలో " గూగుల్ టీవీ " ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.Source: Yahoo! Telugu: News | 21 May 2010 | 6:32 am మధ్యప్రదేశ్‌లో భాజపా ఎమ్మెల్యేను అరెస్టు చేసిన సీబీఐమధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేను సీబీఐ అరెస్టు చేసింది. ఒక హత్య కేసులో తన కుమారు నిందితుడుగా ఉన్నాడు. దీంతో ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను మాఫీ చేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించినట్టు గుర్తించిన సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేసింది.Source: Yahoo! Telugu: News | 21 May 2010 | 6:18 am రాక్షసిలానే కాదు.. ఎలాగైనా నటిస్తా: ప్రియమణి"ఇండస్ట్రీలో నేను నటినే. నెంబర్ల గేమ్ లేదు. వన్... టూ... అని చెప్పుకోవడానికి ఇష్టపడను. నటిగానే సంతృప్తిగా ఫీలవుతాన"ని ప్రియమణి చెపుతోంది. తెలుగులో గోలీమార్‌లో నటించింది. హిందీలో రావణ్‌లో నటించింది. రావణ్‌లో శూర్పణఖ పాత్ర చేస్తున్నారా అని అడిగితే... అది నన్ను అడగవద్దు. దర్శకులే చెప్పాలి.. అని తప్పించుకుంది. ఏ భాషలో చేసినా ప్రియమణి ఎటువంటి పాత్రనైనా చేయగలదు అనిపించుకోవాలనేది తన ప్రయత్నం అంటోంది. దర్శకులు కూడా అలానే నమ్ముతున్నారనీ, వారి నమ్మకాన్ని నిలబెడతాను అంది.Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2010 | 5:33 am కరుణానిధి కథ: ఉదయ్‌కిరణ్ - మీరా జంటగా అల్లాడిస్తాతమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అందించిన కథతో రూపొందుతోన్న చిత్రం అల్లాడిస్తా. ఉదయ్ కిరణ్, మీరా జాస్మిన్ జంటగా తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో రూపొందుతూ విడుదలకు సిద్ధమవుతోంది. బాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగునాట మానస్ ప్రొడక్షన్స్ అధినేత రోహిత్ విడుదల చేస్తున్నారు. కె.సాగర్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ చిత్రం అనుక్షణం ఆసక్తికరంగా సాగుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అందించిన కథ - స్క్రీన్ ప్లే ఈ చిత్రాన్ని చూస్తున్న ప్రేక్షకులు కొత్త అనుభూతికి గురయ్యేలా వుంటాయని నిర్మాత తెలిపారు. యాక్షన్ సన్నివేశాలు, నాయకానాయికల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు, న్యూజీలాండ్‌లో చిత్రీకరించిన గీతాలు, వెంకట్ మల్లూరి సంభాషణలు, బాలి దర్శకత్వ ప్రతిభ, వెన్నెలకంటి సాహిత్యం ఈ చిత్రాన్ని విజయపథంలో నడిపిస్తాయన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2010 | 5:18 am ఆఫ్జల్ భవితవ్యాన్ని హోంశాఖ తేల్చుతుంది: షీలా దీక్షిత్పార్లమెంట్పై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురు భవితవ్యాన్ని కేంద్ర హోంశాఖ తేల్చుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ స్పష్టం చేశారు. దీనిపై ఆమె శుక్రవారం మాట్లాడుతూ అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేసే అంశంపై నెలకొన్న వివాదానికి కేంద్రం తెరదించుతుందన్నారు.Source: జాతీయ | 21 May 2010 | 3:25 am మధ్యప్రదేశ్‌లో భాజపా ఎమ్మెల్యేను అరెస్టు చేసిన సీబీఐమధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేను సీబీఐ అరెస్టు చేసింది. ఒక హత్య కేసులో తన కుమారు నిందితుడుగా ఉన్నాడు. దీంతో ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను మాఫీ చేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించినట్టు గుర్తించిన సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేసింది.Source: జాతీయ | 21 May 2010 | 12:49 am బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర నుంచి అద్వానీకి విముక్తి!భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీకి పెద్ద ఊరట లభించింది. బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర నుంచి ఆయనతో పాటు మరో 20 మందికి అలహాబాద్ హైకోర్టు ఊరట కల్పించింది. వీరిపై గతంలో నమోదైన నేరపూరిత కుట్ర, ఇతర ఆరోపణలపై విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.Source: జాతీయ | 21 May 2010 | 12:08 am ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా ఏరియల్ సర్వే రద్దు!ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి కె.రోశయ్య చేపట్టాలని భావించిన ఏరియల్ సర్వేను రద్దు చేశారు. వాతావరణం అనుకూలించక పోవడంతో ఈ పర్యటనను రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. అయితే, మధ్యాహ్నంపైగా వాతావరణం అనుకూలిస్తే మాత్రం ఏరియల్ సర్వేకు ఆయన బయలుదేరుతారని అధికారులు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 20 May 2010 | 11:47 pm వర్ష బాధితులకు చిరంజీవి ట్రస్టు ద్వారా సాయం: చిరులైలా తుఫాను బాధితులకు చిరంజీవి ట్రస్టు ద్వారా వివిధ రకాల సాయం అందజేయనున్నట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వెల్లడించారు. ఇందుకోసం అవసరమైన మందులు, వైద్య బృందాలతో పాటు ఇతర ఆహార పదార్థాలను సిద్ధం చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 20 May 2010 | 11:38 pm వీడని లైలా తుఫాను గండం.. 24 గంటల పాటు వర్షాలు!లైలా తుఫాను గండం ఇంకా వీడలేదు. గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలో తీరం దాటినట్టే దాటిన లైలా.. మచిలీపట్నం సమీపంలో కేంద్రీకృతమైవుంది. దీని ప్రభావం కారణంగా కోస్తా, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 20 May 2010 | 11:24 pm లైలా తుఫాను బీభత్సం: ఆరు జిల్లాల జలమయం!లైలా తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ప్రభావం కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల ఆరు జిల్లాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నెల్లూరు, ఒంగోలు, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు జలమయమయ్యాయి. ఈ జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తం కావడమే కాకుండా, విద్యుత్, టెలిఫోన్, రవణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయాయి. నడుం లోతు నీటిలో ఈ జిల్లాలోని కోస్తా తీరవాసులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 20 May 2010 | 11:14 pm ఈనెల 23వ తేదీన పదో తరగతి పరీక్షా ఫలితాలు!ఈనెల 23వ తేదీన పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. తొలుత ఈ ఫలితాలను 25వ తేదీ మంగళవారం విడుదల చేయాలని రాష్ట్ర విద్యాశాఖ భావించింది. అయితే, లైలా తుఫాను కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రెండు రోజులు ముందుగానే విడదల చేయాలని నిర్ణయించారు.Source: ఏపీ న్యూస్ | 20 May 2010 | 10:42 pm అవినీతి మంత్రి రాజాను తొలగించాల్సిందే: ప్రతిపక్షాలు3జి స్పెక్ట్రమ్ వేలం పాటల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రెట్టింపు ఆదాయాన్ని సంపాదించి పెట్టిన కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖామంత్రి ఏ.రాజాను మన్మోహన్ మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందేనని ప్రధాన ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా 2జి వేలం పాటలపై వివరణ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీతో సహా వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.Source: జాతీయ | 20 May 2010 | 9:59 pm డామిట్.. అడ్డం తిరిగిన సొరేన్: కుర్చీ దిగనంటే దిగను!భారతీ జనతా పార్టీకి జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు శిబూ సొరేన్ గట్టి షాక్ ఇచ్చారు. జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో ఈనెల 25వ తేదీన జేఎంఎం మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న కమలనాథుల ఆశలకు గండిపడింది.Source: జాతీయ | 20 May 2010 | 9:48 pm అన్నీ తాత పోలికలే.. సిన్మాలు.. రాజకీయాలు.. ఆపై సీఎం"రాష్ట్రంలో నేడు అనుకోకుండా తుఫాన్ వచ్చింది. తుఫాను బాధితులను ఆదుకోవడం కోసం అభిమానులు మూడు లక్షల రూపాయలు ఇచ్చారు. అందుకే నేను వారి తరఫున ప్రకటిస్తున్నా. అలాగే సేవా కార్యక్రమాల్లో నందమూరి అభిమానులు ముందుండాలని కోరుకుంటున్నా" అని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. గురువారం ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన ఫంక్షన్లో మాదాపూర్ సైబర్ గార్డెన్‌లో పాల్గొన్నారు. భారీ ఏర్పాట్లు చేసిన ఈ కార్యక్రమానికి తుఫాను ప్రభావం కారణంగా అనుకున్నంత భారీగా అభిమానులు రాలేకపోయారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ కేక్ కట్ చేసి అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 May 2010 | 11:23 am దేవాలయాల చుట్టూ "సింహా": పార్టీలలో "ఉల్లాల్"సింహా చిత్రం హిట్‌తో నందమూరి బాలకృష్ణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన దేవాలయాలన్నిటినీ సందర్శించి ఆయా దేవదేవుళ్లకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ చిత్రంలో నటించిన టీనేజ్ హీరోయిన్ స్నేహా ఉల్లాల్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందట. పొద్దుపోతే చాలు... తన మిత్ర బృందాన్ని వెంటేసుకుని భాగ్యనగరంలోని ప్రధాన పబ్‌ల్లోకి వెళ్లి ఎంజాయ్ చేస్తోందట. ఈ పార్టీలకు తన చిన్ననాటి స్నేహితులను మరీ గుర్తుకు తెచ్చుకుని ఫోన్ చేసి రమ్మంటోందట. అక్కడ వారికిష్టమైన మెనూను ఆర్డర్ చేసి మజా చేస్తోందట.అన్నట్లు స్నేహా ఉల్లాల్‌కు కొంతమంది బీర్ కొట్టే స్నేహితులు కూడా ఉన్నారట. వారు ఇష్టపడే ప్రత్యేకమైన బీర్ బ్రాండ్‌లను తనే ఆర్డర్ చేసి తెప్పించి మరీ ఇస్తోందట ఉల్లాల్. స్నేహశీలి స్నేహా ఉల్లాల్ ఆప్యాయతను చూసి స్నేహితుల కళ్లు సంతోషంతో మూతలు పడుతున్నాయట. స్నేహతో స్నేహమంటే అంత "మత్త"న్నమాట.Source: Yahoo! Telugu: Entertainment | 20 May 2010 | 9:28 am ఆర్య- త్రిషల "సర్వం" ట్రెయిలర్తమిళ నటుడు ఆర్యతో చిత్రాలు తీసే దర్శకుడు విష్ణువర్థన్ తాజాగా రూపొందించిన "సర్వం" చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సింహపురి టాకీస్‌పై ఎం.రఘునాథ్, ఎం.నరేంద్రలు నిర్మించారు. నరేంద్ర మాట్లాడుతూ... విష్ణువర్థన్ ఈ చిత్రాన్ని చక్కగా తీశాడు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. చిత్రానికి విజయం అందించిన చిత్ర యూనిట్‌కు నా ధన్యవాదాలు అన్నారు. అదేవిధంగా త్రిష కెరీర్‌లో సర్వం ఓ మంచి సినిమాగా నిలిచిపోతుందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...Source: Yahoo! Telugu: Entertainment | 20 May 2010 | 9:12 am "లైలా"తో కోట్ల ఆస్తి నష్టం - అంధకారంలో 856 గ్రామాలులైలా తుఫాను సృష్టించిన బీభత్సంతో కోస్తా జిల్లాలు వణికిపోయాయి. మొత్తం తొమ్మిది జిల్లాల్లో ఆస్తి నష్టం అపారంగా ఉన్నట్లు ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాగా ఇప్పటివరకూ నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తుఫాను కారణంగా మరణించినవారి సంఖ్య 10కి చేరింది.Source: ఏపీ న్యూస్ | 20 May 2010 | 9:06 am లైలా తుఫాను: కోస్తా జిల్లాల్లో స్తంభించిన రాకపోకలులైలా తుఫాను కారణంగా కోస్తా జిల్లాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించి పోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ముందు జాగ్రత్త చర్యగా పలు బస్సు సర్వీసులను రద్దు చేసింది. అలాగే, దక్షిణ, దక్షిణ మధ్య రైల్వేలు కూడా అర్థాంతరంగా పలు రైలు సర్వీసులను రద్దు చేశాయి.Source: ఏపీ న్యూస్ | 20 May 2010 | 8:18 am లైలా తుఫాను కారణంగా 9 జిల్లాలకు నష్టం: రోశయ్యకోస్తా జిల్లాల నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం మేరకు లైలా తుఫాను కారణంగా తొమ్మిది జిల్లాల్లో నష్టం వాటిల్లినట్టు ముఖ్యమంత్రి కె.రోశయ్య తెలిపారు. తుఫాను సహాయక చర్యలపై ఆయన గురువారం రాష్ట్ర మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటివరకు ఏ మేరకు నష్టం వాటల్లో పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. అయితే, అపార నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టు ఆయన చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 20 May 2010 | 8:16 am బంద్ సమయంలో 14 దాడులకు పాల్పడిన మావోలుకేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మావోయిస్టులు 48 గంటల పాటు బంద్‌ను పాటించారు. ఈ సమయంలో ఐదు రాష్ట్రాల్లో 14 దాడులకు పాల్పడినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నక్సల్స్ కేవలం భద్రతా బలగాలను మాత్రమే టార్గెట్ చేసుకోకుండా, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే ఆస్తులు, రైల్వే ట్రాక్‌లు, టెలిఫోన్ ఎక్చేంజ్‌లు, టెలిఫోన్ టవర్లు, గ్రామ పంచాయతీ భవన్‌లు తదితర వాటిపై దాడి చేశారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.Source: జాతీయ | 20 May 2010 | 6:50 am అవసరమైతే సంస్థాగత ఎన్నికలు వాయిదా: చంద్రబాబులైలా తుఫాను రాష్ట్రంలో అపార నష్టం కలిగించిందని, దీనివల్ల అనేక జిల్లాల ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వీరిని ఆదుకునేందుకు తమ పార్టీతో పాటు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ సిద్ధంగా ఉందన్నారు. తుఫాను సహాయక చర్యల కోసం అవసరమైతే పార్టీ సంస్థాగత ఎన్నికలను వాయిదా వేసుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు, నేతలకు సూచించారు.Source: ఏపీ న్యూస్ | 20 May 2010 | 6:42 am పేలుడు పదార్థాల లారీని హైజాక్ చేసిన నక్సల్స్ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో నక్సలైట్లు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్‌కు వెళుతున్న 16.5 టన్నుల బరువుగల అమ్మోనియం నైట్రేట్ లారీని హైజాక్ చేశారు. ఆ తర్వాత అందులోని పేలుడు పదార్థాన్ని లూటీ చేసి లారీని వదిలిపెట్టారు.Source: జాతీయ | 20 May 2010 | 4:54 am బాపట్ల వద్ద తీరాన్ని తాకిన "లైలా": ఒంగోలులో కుంభవృష్టిలైలా తుఫాను బాపట్ల సూర్యలంక తీరాన్ని తాకింది. ఇది తీరాన్ని పూర్తిగా దాటేందుకు మరో మూడు నాలుగు గంటలు పట్టవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. లైలా గుంటూరు, ప్రకాశం సముద్ర తీరాలకు చేరువు కావడంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.Source: ఏపీ న్యూస్ | 20 May 2010 | 4:12 am
|