తుఫాను బాధితులకు జూనియర్ ఎన్టీఆర్ సాయం!

28వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ లైలా తుఫాను బాధితులకు తన వంతు సాయంగా 3.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల్లో చిక్కుకుని సర్వం కోల్పోయిన వారిని తమకు తోచిన రీతిలో ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చాడు.
Source: Yahoo! Telugu: News | 20 May 2010 | 9:37 am

దేవాలయాల చుట్టూ "సింహా": పార్టీలలో "ఉల్లాల్"

సింహా చిత్రం హిట్‌తో నందమూరి బాలకృష్ణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన దేవాలయాలన్నిటినీ సందర్శించి ఆయా దేవదేవుళ్లకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ చిత్రంలో నటించిన టీనేజ్ హీరోయిన్ స్నేహా ఉల్లాల్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందట. పొద్దుపోతే చాలు... తన మిత్ర బృందాన్ని వెంటేసుకుని భాగ్యనగరంలోని ప్రధాన పబ్‌ల్లోకి వెళ్లి ఎంజాయ్ చేస్తోందట. ఈ పార్టీలకు తన చిన్ననాటి స్నేహితులను మరీ గుర్తుకు తెచ్చుకుని ఫోన్ చేసి రమ్మంటోందట. అక్కడ వారికిష్టమైన మెనూను ఆర్డర్ చేసి మజా చేస్తోందట.అన్నట్లు స్నేహా ఉల్లాల్‌కు కొంతమంది బీర్ కొట్టే స్నేహితులు కూడా ఉన్నారట. వారు ఇష్టపడే ప్రత్యేకమైన బీర్ బ్రాండ్‌లను తనే ఆర్డర్ చేసి తెప్పించి మరీ ఇస్తోందట ఉల్లాల్. స్నేహశీలి స్నేహా ఉల్లాల్ ఆప్యాయతను చూసి స్నేహితుల కళ్లు సంతోషంతో మూతలు పడుతున్నాయట. స్నేహతో స్నేహమంటే అంత "మత్త"న్నమాట.
Source: Yahoo! Telugu: Entertainment | 20 May 2010 | 9:28 am

ఆర్య- త్రిషల "సర్వం" ట్రెయిలర్

తమిళ నటుడు ఆర్యతో చిత్రాలు తీసే దర్శకుడు విష్ణువర్థన్ తాజాగా రూపొందించిన "సర్వం" చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సింహపురి టాకీస్‌పై ఎం.రఘునాథ్, ఎం.నరేంద్రలు నిర్మించారు. నరేంద్ర మాట్లాడుతూ... విష్ణువర్థన్ ఈ చిత్రాన్ని చక్కగా తీశాడు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. చిత్రానికి విజయం అందించిన చిత్ర యూనిట్‌కు నా ధన్యవాదాలు అన్నారు. అదేవిధంగా త్రిష కెరీర్‌లో సర్వం ఓ మంచి సినిమాగా నిలిచిపోతుందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...
Source: Yahoo! Telugu: Entertainment | 20 May 2010 | 9:12 am

పెరగనున్న విద్యుత్ ఛార్జీలుః సుషీల్ కుమార్ షిండే

రానున్న రోజుల్లో ప్రతి కిలోవాట్ విద్యుత్‌పై రూ. 1 చొప్పున ధరలు పెరగనున్నాయని కేంద్ర విద్యుత్ శాఖామంత్రి సుషీల్ కుమార్ షిండే గురువారం న్యూ ఢిల్లీలో తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 20 May 2010 | 8:32 am

మావోల అణిచివేత.. కేంద్రంతో విభేదాలు లేవు: రమణ్

దేశ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా మారిని నక్సలైట్లను అణిచి వేసే విషయంలో కేంద్ర హోంశాఖామంత్రి చిదంబరంతో విభేదాలు ఏర్పడినట్టు మీడియాలో వచ్చిన వార్తలను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తోసిపుచ్చారు. దీనిపై ఆయన గురువారం మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మావోయిస్టులు ప్రమాదకరశక్తులుగా మారారని ఆయన ఆరోపించారు. ఇలాంటి కార్యకలాపాలను పూర్తిగా అణిచి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Source: Yahoo! Telugu: News | 20 May 2010 | 7:51 am

షహజాద్‌కు శిక్షణనిచ్చింది మేమేః లష్కర్

పాక్ సంతతికి చెందిన అమెరికా పౌరుడు న్యూయార్క్‌లోని టైం స్క్వేర్ కారు బాంబు ఘటనలో పట్టుబడ్డ ఫైజల్ షహజాద్ కాశ్మీర్‌లో పోరాడేందుకు లష్కర్-ఏ-తొయిబా శిక్షణనిచ్చిందని ఆ సంస్థకు చెందిన సీనియర్ కమాండర్ వాషింగ్టన్‌లో గురువారం వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 20 May 2010 | 7:50 am

పుంజుకున్న స్టాక్ మార్కెట్: 177 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనైనప్పటికీ తిరిగి లాభాల బాట పట్టింది. ఫలితంగా సెన్సెక్స్ 178 పాయింట్ల మేర లాభపడి 16,586 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 4,967 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 20 May 2010 | 7:38 am

ఏటీఎం జన్మదాత స్కాటిష్ జాన్ షెఫర్డ్ కన్నుమూత

ప్రపంచంలోనే తొలిసారిగా ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ (ఏటీఎం)ను కనుగొన్న స్కాటిష్ జాన్ షెఫర్డ్ శనివారం తుదిశ్వాస విడిచారని అంతిమ సంస్కారసేవా డైరెక్టర్ అలాసదీర్ రేంద్ బుధవారం వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 20 May 2010 | 7:24 am

ద్వైపాక్షిక సంబంధాలకు పెద్దపీట: రాష్ట్రపతి చైనా పర్యటన

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈనెల 26వ తేదీ నుంచి చైనాలో పర్యటించనున్నారు. ఐదు రోజుల పాటు సాగే ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు పెద్దపీట వేయనున్నారు. అలాగే, రాజకీయ, సాంస్కృతిక దౌత్య, ఆర్థిక, వాణిజ్య తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు.
Source: Yahoo! Telugu: News | 20 May 2010 | 7:14 am

కరాచీలో ఫ్యాక్షన్ గొడవలుః 17 మంది మృతి

పాకిస్థాన్‌లోని కరాచీలో రాజకీయ ఫ్యాక్షన్ గొడవలతో గత ఇరవై నాలుగు గంటలుగా జరుగుతున్న దాడుల కారణంగా 17 మంది మృతి చెందినట్లు కరాచీ పోలీసు ఉన్నతాధికారి వసీన్ అహ్మద్ గురువారం తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 20 May 2010 | 6:49 am

కేసీఆర్‌కు లగడపాటి ఇంటి విందు ఆహ్వానమా?

ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో బద్ధశత్రువులు ఎవరు అని ఎవరినైనా వారి నోటి వెంట వచ్చే సమాధానం ఒక్కటే. తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అని చెపుతారు. అలాంటి వీరిద్దరు ఒకరి ఇంటికి మరొకరు వెళ్లే సమయం సందర్భం ఉంటుందా. మనస్సుంటే మార్గం ఉంటున్న చందంగా.. ఇదీ కూడా ఉంటుందనే అంటున్నారు... వారి సన్నిహితులు.
Source: Yahoo! Telugu: News | 20 May 2010 | 6:46 am

బాపట్ల వద్ద తీరాన్ని దాటిన "లైలా": ఒంగోలులో కుంభవృష్టి

లైలా తుఫాను బాపట్ల సూర్యలంక తీరాన్ని దాటింది. దీంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటిన లైలా తుఫాను క్రమంగా బలహీన పడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల కోస్తా జిల్లాల్లో రాబోయే 36 గంటల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 20 May 2010 | 6:43 am

తుఫాను బాధితులకు జూనియర్ ఎన్టీఆర్ సాయం!

28వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ లైలా తుఫాను బాధితులకు తన వంతు సాయంగా 3.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల్లో చిక్కుకుని సర్వం కోల్పోయిన వారిని తమకు తోచిన రీతిలో ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చాడు.
Source: ఏపీ న్యూస్ | 20 May 2010 | 4:07 am

మావోల అణిచివేత.. కేంద్రంతో విభేదాలు లేవు: రమణ్

దేశ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా మారిని నక్సలైట్లను అణిచి వేసే విషయంలో కేంద్ర హోంశాఖామంత్రి చిదంబరంతో విభేదాలు ఏర్పడినట్టు మీడియాలో వచ్చిన వార్తలను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తోసిపుచ్చారు. దీనిపై ఆయన గురువారం మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మావోయిస్టులు ప్రమాదకరశక్తులుగా మారారని ఆయన ఆరోపించారు. ఇలాంటి కార్యకలాపాలను పూర్తిగా అణిచి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Source: జాతీయ | 20 May 2010 | 2:21 am

బాపట్ల వద్ద తీరాన్ని దాటిన "లైలా": ఒంగోలులో కుంభవృష్టి

లైలా తుఫాను బాపట్ల సూర్యలంక తీరాన్ని దాటింది. దీంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటిన లైలా తుఫాను క్రమంగా బలహీన పడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల కోస్తా జిల్లాల్లో రాబోయే 36 గంటల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Source: ఏపీ న్యూస్ | 20 May 2010 | 2:19 am

ద్వైపాక్షిక సంబంధాలకు పెద్దపీట: రాష్ట్రపతి చైనా పర్యటన

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈనెల 26వ తేదీ నుంచి చైనాలో పర్యటించనున్నారు. ఐదు రోజుల పాటు సాగే ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు పెద్దపీట వేయనున్నారు. అలాగే, రాజకీయ, సాంస్కృతిక దౌత్య, ఆర్థిక, వాణిజ్య తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు.
Source: జాతీయ | 20 May 2010 | 1:44 am

అమ్మా సోనియమ్మా..! వైఎస్ జగన్ దేవుడమ్మా..!!

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బలేరీలో మూడు రోజులపాటు పర్యటించారు. ఆమె పర్యటించే సమయంలో ఆమెనే వెంబడిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ మహిళా కార్యకర్త వెళ్లింది.
Source: ఏపీ న్యూస్ | 20 May 2010 | 12:52 am

మావోయిస్టుల ఘాతుకం: బీహార్‌లో రైలుపట్టాల పేల్చివేత

నలభై ఎనిమిది గంటలపాటు బంద్ నిర్వహించనున్నట్లు ప్రకటించిన నక్సల్స్ తూర్పు-మధ్య రైల్వే‌కు చెందిన ముజఫర్‌పుర్-నరకటియాగంజ్ రైలు మార్గంలో రైలు పట్టాలను బుధవారం రాత్రి పేల్చేశారు. దీంతో ఆ మార్గంలో పెట్రోలియం పదార్థాలను తీసుకు వెళుతున్న గూడ్సు బండి ప్రమాదానికి లోనైంది.
Source: జాతీయ | 20 May 2010 | 12:19 am

26/11 గుణపాఠం: ముంబై పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక దళాలు

26/11 ఉగ్రవాద దాడుల నుంచి పాఠాలు నేర్చుకున్న ముంబయి పోలీసులు నగరం పరిధిలో ఉన్న 90 పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక దళాలుగాఏర్పడ్డారు. నగరంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో అక్కడ ప్రత్యక్షమయ్యే విధంగా ఈ దళాలకు రూపకల్పన ఇస్తున్నారు.
Source: జాతీయ | 20 May 2010 | 12:10 am

బలహీనపడిన "లైలా": కోస్తాంధ్రకు తప్పిన ముప్పు..?

బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న లైలా పెనుతుఫాను క్రమేణా బలహీనపడుతోంది. బలహీనపడిన "లైలా" వాయుగుండంగా మారి గురువారం మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి మచిలీపట్నం - కాకినాడ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. లైలా బలహీనపడటంతో కోస్తాంధ్ర జిల్లాలకు పెనుముప్పు తప్పినట్లయింది.
Source: ఏపీ న్యూస్ | 19 May 2010 | 11:41 pm

మాయావతి విగ్రహాల స్థానంలో రాముని విగ్రహాలు: వరుణ్

ఉత్తరప్రదేశ్‌లో ప్రతిష్టించిన బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి విగ్రహాల స్థానంలో శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్టించనున్నట్టు భారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్ గాంధీ ప్రకటించారు.
Source: జాతీయ | 19 May 2010 | 10:50 pm

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20

స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 గురువారం. ఒకవైపు బాబాయ్ బాలకృష్ణ "సింహా" విజయోత్సవంలో వీరవిహారం చేస్తుంటే... అబ్బాయి తన పుట్టినరోజును మాదాపూర్‌లో హైటెక్ సమీపానగల సైబర్ గార్డెన్స్‌లో ఘనంగా చేసుకోనున్నాడు. ఎన్టీఆర్ అభిమానులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ముందుగా ట్యాంక్‌బండ్ వద్ద తాత సమాధిని దర్శించుకుని తన కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలిసింది. ఈ పుట్టినరోజును అటు కుటుంబ సభ్యులు, అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాదే జూనియర్ ఎన్టీఆర్ ఒకింటివాడు కాబోతున్నాడు. రామోజీరావు బ్యానర్‌లో "నిన్ను చూశాక" చిత్రం నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ... ప్రస్తుతం "బృందావనం" సినిమా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్‌కు అడ్వాన్స్ బర్త్ డే విషెస్ చెప్పేద్దాం...
Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2010 | 1:27 pm

జూన్ ద్వితీయార్థంలో పవన్ కల్యాణ్ "కొమరం పులి"

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఖుషీ ఫేమ్ ఎస్.జె సూర్య దర్శకత్వంలో ఎస్.సత్యరామమూర్తి సమర్పణలో కనకరత్న మూవీస్ పతాకంపై ప్రముఖ ఫైనాన్షియర్, నిర్మాత శింగనమల రమేష్ బాబు నిర్మిస్తున్న భారీ చిత్రం కొమరం పులి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... పవర్‌ఫుల్ స్టోరీతో, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్‌కాంప్రమైజ్డ్ మేకింగ్‌తో రూపొందుతోన్న కొమరం పులి తెలుగు సినిమా స్టాండర్డ్స్‌ని పెంచేలా ఉంటుంది. అతి త్వరలోనే ఈ ఆడియోను సోనీ మ్యూజిక్ ద్వారా విడుదల చేసి జూన్ ద్వితీయార్థంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2010 | 12:35 pm

ప్రభాస్‌తో కూడా కెమిస్ట్రీ ఉందంటారా...?!!: కాజల్ ప్రశ్న

మగధీర రాణిగా టాలీవుడ్‌లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ తమిళ, తెలుగు చిత్రాలతో మహా బిజీగా ఉంది. మగధీర చిత్రం తర్వాత తిరిగి రామ్ చరణ్ కాంబినేషన్‌లో మెరుపు చిత్రం చేస్తోంది. దీంతో కాజల్ అగర్వాల్ - రామ్ చరణ్‌ల మధ్య ఏదో కెమిస్ట్రీ నడుస్తోందని టాలీవుడ్‌లో గుసగుసలు బయలుదేరాయి. ఆమె ఎటు వెళ్లినా రామ్‌చరణ్‌తో స్నేహం ఎలా సాగుతోందని కాజల్‌ను అడగటం ఎక్కువైంది. ఇటీవల ఓ పిల్ల జర్నలిస్టు ఇదే ప్రశ్నను ఆమె ముందు ఉంచాడట. అంతే..!! అతడిపై ఇంతెత్తున లేచి... రామ్ చరణ్ సరసన రెండో చిత్రం చేస్తున్నందుకు మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నడుస్తోందని చెపుతున్నారు. మరి ప్రభాస్‌తో డార్లింగ్ చిత్రం చేశాను. మళ్లీ అతనితో మరో సినిమాలో నటిస్తున్నాను. అంతమాత్రాన ప్రభాస్‌తో నాకు కెమిస్ట్రీ ఉన్నట్లా...? అని అతడిపై చిందులు వేసిందట.
Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2010 | 7:25 am

తెలంగాణ అంశంపై ఇక కమిటీలు ఉండకపోవచ్చు: దుగ్గల్

తెలంగాణ అంశంపై ఇకపై ఎలాంటి కమిటీలు ఉండకపోవచ్చని, తమదే చివరి కమిటి కావొచ్చని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వీకే.దుగ్గల్ అభిప్రాయపడ్డారు. అందుకే తమ కమిటీ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల మనోభావాలను క్షణ్ణంగా తెలుసుకుని నివేదికను సమర్పిస్తామని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 19 May 2010 | 6:33 am

అబ్బాయి 6 అడుగులైనా ఫర్వాలేదు.. చేసుకుంటా: భానుశ్రీ

వరుడు చిత్రంలో మాదిరిగా ఫోటో చూడకుండా తను ఏకంగా పెళ్లి పీటలపై అబ్బాయిని చూసి చేసుకునే బాపతు కానని హీరోయిన్ భానుశ్రీ మెహ్రా తేల్చి చెప్పింది. ఆ చిత్రంలో కథ వెరైటీగా ఉందని నటించాననీ, అది నటన వరకే పరిమితమని నొక్కి వక్కాణిస్తోంది. వరుడు చిత్రం విడుదలయ్యాక ఆఫర్లు వస్తాయని ఆశించిన భానుశ్రీకి పాపం... నిరాశే మిగిలింది. ప్రస్తుతం హైదరాబాదులోనే తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పెళ్లికి ఇంకా వయస్సు రాలేదనీ, పెద్దలు మెచ్చిన సంబంధమే చేసుకుంటానని చెపుతూ... వరుడు ఇలా ఉండాలంటూ... మంచి బ్యాక్‌గ్రౌండ్, ఆస్తి, మంచి లక్షణాలు, ఎత్తు 6 అడుగులైనా ఫర్వాలేదని అంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2010 | 6:23 am

అల్లు అర్జున్ - మనోజ్ - అనుష్కల వేదం ట్రెయిలర్

వరుడు చిత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో కాస్తంత నీరసించిన అల్లు అర్జున్ లేటెస్ట్‌గా వేదం చిత్రంతో కొత్త ఉత్సాహాన్ని ప్రోది చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్‌తో కలిసి నటించిన వేదం చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.అల్లు అర్జున్, మనోజ్, అనుష్క ప్రధాన పాత్రల్లో క్రిష్ రూపొందించిన 'వేదం' చిత్రాన్ని ఈ నెలలో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్లమ్ కుర్రాడుగా మాస్ క్యారెక్టరైజేషన్‌తో సాగే పాత్రను చేస్తున్నాడు. అనుష్క వేశ్యగానూ, మంచు మనోజ్ రాక్‌స్టార్‌గానూ నటిస్తున్నారు. 'బిందాస్'తో ఓకే అనిపించుకున్న మనోజ్, ఇప్పటికే స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్, 'అరుంధతి ' చిత్రంతో ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్న అనుష్కల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...
Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2010 | 5:53 am

చిరంజీవి కాస్త జోరు తగ్గించుకో: మావోయిస్టుల హెచ్చరిక

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మావోయిస్టులు తాజాగా హెచ్చరించినట్టు వార్తలు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ చిరంజీవి మండుటెండలో బస్సు యాత్రను చేపట్టగా, ఈ యాత్ర బుధవారంతో ముగియనుంది. ఈ యాత్రలో భాగంగా పోలవరం ప్రాజెక్టు ముంపు బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 19 May 2010 | 5:22 am

దుర్బల పాలన సాగిస్తున్న యూపీఏ-2 : కారత్

కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన యూపీఏ-2 సంకీర్ణ ప్రభుత్వం దుర్బల పాలన అందిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అభిప్రాయపడ్డారు. యూపీఏ-2 సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరి ఈనెల 22వ తేదీతో ఏడాది పూర్తికానుంది. ఈ సందర్భంగా ఆయన యూపీఏ పనితీరుపై మాట్లాడుతూ యూపీఏ-1 ప్రభుత్వ పాలన కంటే యూపీఏ-2 పాలన అధ్వాన్నంగా ఉందన్నారు.
Source: జాతీయ | 19 May 2010 | 5:01 am

కేసీఆర్ త్వరలో సమైక్యాంధ్రకు "జై" అంటారు: లగడపాటి

విజయవాడలో జరుగనున్న జై ఆంధ్ర సభకు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు హాజరు కావడం శుభ పరిణామమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 19 May 2010 | 3:58 am

మావోయిస్టులే కరడుగట్టిన తీవ్రవాదులు: రమణ్ సింగ్

దేశ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా పరిణమించి, దేశాభివృద్ధికి అడ్డుకట్టగా ఉన్న మావోయిస్టులే కరుడుగట్టిన తీవ్రవాదులు అని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన బుధవారం మాట్లాడుతూ తీవ్రవాదుల కంటే నక్సలైట్లు తక్కువేం కాదన్నారు. వీరివల్ల దేశ అంతర్గత భద్రతకు ముప్పు పొంచివుందన్నారు.
Source: జాతీయ | 19 May 2010 | 3:40 am

ఈనెల 28వ తేదీ నుంచి జగన్ వరంగల్ పర్యటన ఖరారు!

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న రెండో దశ ఓదార్పు యాత్రలో భాగంగా ఈనెల 28వ తేదీ నుంచి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన షెఢ్యూల్‌ను ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నాల లక్ష్మయ్యలు ఖరారు చేశారు. 28వ తేదీన శుక్రవారం నుంచి సాగే పర్యటన జిల్లాలో ఐదు రోజుల పాటు సాగుతుంది.
Source: ఏపీ న్యూస్ | 19 May 2010 | 3:06 am