కేసీఆర్ త్వరలో సమైక్యాంధ్రకు "జై" అంటారు: లగడపాటి

విజయవాడలో జరుగనున్న జై ఆంధ్ర సభకు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు హాజరు కావడం శుభ పరిణామమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు.
Source: Yahoo! Telugu: News | 19 May 2010 | 9:27 am

నానోకన్నా తక్కువ ధరకే కారు అందిస్తాం: చైనా

చైనా కార్ల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న గీలీ సంస్థ నానో కారు ధరకన్నా తక్కువ ధరకే కారును అందించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోంది.
Source: Yahoo! Telugu: News | 19 May 2010 | 9:10 am

ఆప్ఘనిస్థాన్‌లోని నాటో ఎయిర్‌బేస్‌పై తాలిబన్ల దాడి!

ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ తీవ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ దేశంలో నాటో దళాల ఆధీనంలో ఉన్న అతిపెద్ద ఎయిర్‌బేస్ కేంద్రంపై తాలిబన్ సాయుధ మిలిటెంట్లు రాకెట్లు, తుపాకీలు, గ్రెనైడ్లతో భీకర దాడి చేశారు. దీంతో తేరుకున్న నాటో దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగుకు మిలిటెంట్లు హతం కాగా, మరో ఏడుగురు నాటో సైనికులు గాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 19 May 2010 | 9:04 am

మావోయిస్టులే కరడుగట్టిన తీవ్రవాదులు: రమణ్ సింగ్

దేశ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా పరిణమించి, దేశాభివృద్ధికి అడ్డుకట్టగా ఉన్న మావోయిస్టులే కరుడుగట్టిన తీవ్రవాదులు అని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన బుధవారం మాట్లాడుతూ తీవ్రవాదుల కంటే నక్సలైట్లు తక్కువేం కాదన్నారు. వీరివల్ల దేశ అంతర్గత భద్రతకు ముప్పు పొంచివుందన్నారు.
Source: Yahoo! Telugu: News | 19 May 2010 | 8:54 am

యూరో బెంగతో తగ్గిన ముడి చమురు ధరలు

యూరో బలహీనపడుతుండటంతో ఆసియా మార్కెట్‌లో ముడి చమురు ధరలు పడిపోయాయి. దీంతో బుధవారం నాడు ప్రతి బ్యారెల్ ముడి చమురు ధర 69 డాలర్లకు చేరుకుంది. ఇది ఎనిమిది నెలల కనిష్ట స్థాయికి చేరుకుందని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 19 May 2010 | 8:43 am

ఈనెల 28వ తేదీ నుంచి జగన్ వరంగల్ పర్యటన ఖరారు!

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న రెండో దశ ఓదార్పు యాత్రలో భాగంగా ఈనెల 28వ తేదీ నుంచి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన షెఢ్యూల్‌ను ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నాల లక్ష్మయ్యలు ఖరారు చేశారు. 28వ తేదీన శుక్రవారం నుంచి సాగే పర్యటన జిల్లాలో ఐదు రోజుల పాటు సాగుతుంది.
Source: Yahoo! Telugu: News | 19 May 2010 | 8:35 am

ప్రభాస్‌తో కూడా కెమిస్ట్రీ ఉందంటారా...?!!: కాజల్ ప్రశ్న

మగధీర రాణిగా టాలీవుడ్‌లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ తమిళ, తెలుగు చిత్రాలతో మహా బిజీగా ఉంది. మగధీర చిత్రం తర్వాత తిరిగి రామ్ చరణ్ కాంబినేషన్‌లో మెరుపు చిత్రం చేస్తోంది. దీంతో కాజల్ అగర్వాల్ - రామ్ చరణ్‌ల మధ్య ఏదో కెమిస్ట్రీ నడుస్తోందని టాలీవుడ్‌లో గుసగుసలు బయలుదేరాయి. ఆమె ఎటు వెళ్లినా రామ్‌చరణ్‌తో స్నేహం ఎలా సాగుతోందని కాజల్‌ను అడగటం ఎక్కువైంది. ఇటీవల ఓ పిల్ల జర్నలిస్టు ఇదే ప్రశ్నను ఆమె ముందు ఉంచాడట. అంతే..!! అతడిపై ఇంతెత్తున లేచి... రామ్ చరణ్ సరసన రెండో చిత్రం చేస్తున్నందుకు మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నడుస్తోందని చెపుతున్నారు. మరి ప్రభాస్‌తో డార్లింగ్ చిత్రం చేశాను. మళ్లీ అతనితో మరో సినిమాలో నటిస్తున్నాను. అంతమాత్రాన ప్రభాస్‌తో నాకు కెమిస్ట్రీ ఉన్నట్లా...? అని అతడిపై చిందులు వేసిందట.
Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2010 | 7:25 am

భారీ నష్టాలవైపు బాంబే స్టాక్ మార్కెట్ పయనం

బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ భారీ నష్టాల దిశగా ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి తిరోగమనం వైపు పయనిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 213 పాయింట్లు పడిపోయి 16,662 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 63 పాయింట్లు క్షీణించి, 5,002 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 19 May 2010 | 7:17 am

బంగారం ఉత్పత్తిని మరింత పెంచనున్నాం : వెనిజులా

తమ దేశం వచ్చే సంవత్సరం బంగారం ఉత్పత్తిలో రెండింతలు చేయనున్నట్లు వెనిజులా గనుల శాఖామంత్రి జోస్ ఖాన్ కారాకస్‌లో మీడియాకు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 19 May 2010 | 7:17 am

పెను తుఫాను లైలా వస్తోంది.. తస్మాత్ జాగ్రత్త: కేంద్రం

పెను తుఫాను లైలా ముప్పు ముంచుకొస్తోందని కేంద్రం హెచ్చరించింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, తమిళనాడు రాష్ట్రంలోని కోస్తాతీర ప్రాంతం అరక్కోణం నుంచి రాష్ట్రంలోని కోస్తా తీర ప్రాంతాలకు విపత్తు నివారణ ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో విశాఖకు ఆరు, విజయవాడకు మూడు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, తమిళనాడుకు ఒక్కొక్కటి చొప్పున బృందాలను పంపాలని ఆదేశాలు జారీ చేసింది.
Source: Yahoo! Telugu: News | 19 May 2010 | 7:13 am

పాకిస్థాన్ త్రివిధ దళాల అధిపతిగా అష్ఫాక్ ఖయానీ?

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న అష్పాక్ పర్వేజ్ ఖయానీని ఆ దేశ త్రివిధ దళాల అధిపతిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ పదవిని కొత్తగా సృష్టించి, ఆ బాధ్యతలను ఖయానీకి అప్పగించాలని పాకిస్థాన్ పాలకులు భావిస్తున్నట్టు పేర్కొన్నాయి. ఈ అంశంపై అమెరికా ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
Source: Yahoo! Telugu: News | 19 May 2010 | 6:55 am

అబ్బాయి 6 అడుగులైనా ఫర్వాలేదు.. చేసుకుంటా: భానుశ్రీ

వరుడు చిత్రంలో మాదిరిగా ఫోటో చూడకుండా తను ఏకంగా పెళ్లి పీటలపై అబ్బాయిని చూసి చేసుకునే బాపతు కానని హీరోయిన్ భానుశ్రీ మెహ్రా తేల్చి చెప్పింది. ఆ చిత్రంలో కథ వెరైటీగా ఉందని నటించాననీ, అది నటన వరకే పరిమితమని నొక్కి వక్కాణిస్తోంది. వరుడు చిత్రం విడుదలయ్యాక ఆఫర్లు వస్తాయని ఆశించిన భానుశ్రీకి పాపం... నిరాశే మిగిలింది. ప్రస్తుతం హైదరాబాదులోనే తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పెళ్లికి ఇంకా వయస్సు రాలేదనీ, పెద్దలు మెచ్చిన సంబంధమే చేసుకుంటానని చెపుతూ... వరుడు ఇలా ఉండాలంటూ... మంచి బ్యాక్‌గ్రౌండ్, ఆస్తి, మంచి లక్షణాలు, ఎత్తు 6 అడుగులైనా ఫర్వాలేదని అంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2010 | 6:23 am

అల్లు అర్జున్ - మనోజ్ - అనుష్కల వేదం ట్రెయిలర్

వరుడు చిత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో కాస్తంత నీరసించిన అల్లు అర్జున్ లేటెస్ట్‌గా వేదం చిత్రంతో కొత్త ఉత్సాహాన్ని ప్రోది చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్‌తో కలిసి నటించిన వేదం చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.అల్లు అర్జున్, మనోజ్, అనుష్క ప్రధాన పాత్రల్లో క్రిష్ రూపొందించిన 'వేదం' చిత్రాన్ని ఈ నెలలో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్లమ్ కుర్రాడుగా మాస్ క్యారెక్టరైజేషన్‌తో సాగే పాత్రను చేస్తున్నాడు. అనుష్క వేశ్యగానూ, మంచు మనోజ్ రాక్‌స్టార్‌గానూ నటిస్తున్నారు. 'బిందాస్'తో ఓకే అనిపించుకున్న మనోజ్, ఇప్పటికే స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్, 'అరుంధతి ' చిత్రంతో ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్న అనుష్కల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...
Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2010 | 5:53 am

కేసీఆర్ త్వరలో సమైక్యాంధ్రకు "జై" అంటారు: లగడపాటి

విజయవాడలో జరుగనున్న జై ఆంధ్ర సభకు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు హాజరు కావడం శుభ పరిణామమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 19 May 2010 | 3:58 am

మావోయిస్టులే కరడుగట్టిన తీవ్రవాదులు: రమణ్ సింగ్

దేశ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా పరిణమించి, దేశాభివృద్ధికి అడ్డుకట్టగా ఉన్న మావోయిస్టులే కరుడుగట్టిన తీవ్రవాదులు అని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన బుధవారం మాట్లాడుతూ తీవ్రవాదుల కంటే నక్సలైట్లు తక్కువేం కాదన్నారు. వీరివల్ల దేశ అంతర్గత భద్రతకు ముప్పు పొంచివుందన్నారు.
Source: జాతీయ | 19 May 2010 | 3:40 am

ఈనెల 28వ తేదీ నుంచి జగన్ వరంగల్ పర్యటన ఖరారు!

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న రెండో దశ ఓదార్పు యాత్రలో భాగంగా ఈనెల 28వ తేదీ నుంచి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన షెఢ్యూల్‌ను ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నాల లక్ష్మయ్యలు ఖరారు చేశారు. 28వ తేదీన శుక్రవారం నుంచి సాగే పర్యటన జిల్లాలో ఐదు రోజుల పాటు సాగుతుంది.
Source: ఏపీ న్యూస్ | 19 May 2010 | 3:06 am

పెను తుఫాను లైలా వస్తోంది.. తస్మాత్ జాగ్రత్త: కేంద్రం

పెను తుఫాను లైలా ముప్పు ముంచుకొస్తోందని కేంద్రం హెచ్చరించింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, తమిళనాడు రాష్ట్రంలోని కోస్తాతీర ప్రాంతం అరక్కోణం నుంచి రాష్ట్రంలోని కోస్తా తీర ప్రాంతాలకు విపత్తు నివారణ ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో విశాఖకు ఆరు, విజయవాడకు మూడు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, తమిళనాడుకు ఒక్కొక్కటి చొప్పున బృందాలను పంపాలని ఆదేశాలు జారీ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 19 May 2010 | 1:43 am

బెంగాల్‌లో రైల్వే ట్రాక్‌ను పేల్చివేసిన మావోయిస్టులు

మావోయిస్టులు ఆగడాలు ఏమాత్రం తగ్గడం లేదు. రెండు రోజుల క్రితం నరమేథానికి పాల్పడిన మావోలు బుధవారం ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రైల్వే ట్రాక్‌ను పేల్చి వేశారు. వెస్ట్ మిడ్నాపూర్‌ జిల్లాలోని జార్గామ్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందులో ఇద్దరు గూడ్సు రైళ్ల డ్రైవర్లు గాయపడగా, రైలు ఇంజిన్ దెబ్బతింది.
Source: జాతీయ | 19 May 2010 | 1:09 am

కాంగ్రెస్ పునరంకిత సభ వాయిదా: డీఎస్ వెల్లడి

ఈనెల 20వ తేదీ (గురువారం)న జరగాల్సిన పునరంకిత సభను వాయిదా వేస్తున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ వెల్లడించారు. లైలా తుఫాను కారణంగా ఈ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత తేదీని ఖరారు చేస్తామన్నారు.
Source: ఏపీ న్యూస్ | 19 May 2010 | 12:51 am

రైల్వే శాఖను మమత నిర్లక్ష్యం చేయడం లేదు: కాంగ్రెస్

కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆ శాఖను నిర్లక్ష్యం చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. పార్లమెంట్ సమావేశాలు లేక పోవడంతో ఆమె ఢిల్లీలో అందుబాటులో లేకుండా పోతున్నారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించగా, వీటిపై మమతా బెనర్జీ స్వయంగా వివరణ ఇచ్చారు. తన సొంత ఊరు ఢిల్లీ కాదని, అందువల్ల అక్కడ నేనెందుకు ఉండాలన్నారు. కోల్‌కతా మా సొంత ఊరు. అదీకాకుండా పార్లమెంట్ సమావేశాలు లేని సమయంలో ఢిల్లీలో ఉండాల్సిన పని లేదన్నారు. మమత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. మమతా బెనర్జీ రైల్వేశాఖను నిర్లక్ష్యం చేయడం లేదన్నారు.
Source: జాతీయ | 19 May 2010 | 12:17 am

కేసీఆర్‌కు ఆహ్వానం వెనుక సమైక్యాంధ్ర వ్యూహం!

విజయవాడలో జరిగే జై ఆంధ్రా బహిరంగ సభలో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుకు ఘన స్వాగతం పలకాలని సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు నిర్ణయించారు. ఆయన పర్యటనకు ఎలాంటి అంతరాయం కలిగించకుండా సాఫీగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయితే, కేసీఆర్‌ ఒక్క విజయవాడలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించవచ్చని సమైక్యాంధ్ర నేతలు ముక్తకంఠంతో ప్రకటనలు గుప్పించడం పట్ల పెద్ద మాస్టర్ ప్లాన్ ఉన్నట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 18 May 2010 | 11:33 pm

పెను తుఫానుగా మారిన లైలా: కోస్తాతీరం అప్రమత్తం!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పెను తుఫానుగా మారింది. లైలాగా నామకరణం చేసిన ఈ తుఫాను బుధవారం అర్థరాత్రి ఒంగోలు-విశాఖపట్నంల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం కారణంగా.. కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, పెను గాలులు వీస్తున్నాయి. ఒక్క కృష్ణాపట్నం (ఐదో నంబరు ప్రమాద సూచిక) మినహా మిగిలిన అన్ని ఓడరేవుల్లో ఏడో నంబరు ప్రమాద హెచ్చరిక సూచికను ఎగురవేశారు.
Source: ఏపీ న్యూస్ | 18 May 2010 | 11:13 pm

అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటీషన్‌కు ఎట్టకేలకు చలనం!

పార్లమెంట్ దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురు దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటీషన్‌కు ఎట్టకేలకు చలనం వచ్చింది. ముంబై దాడుల కేసులో ఉరిశిక్ష పడిన కసబ్‌ పుణ్యమాని అఫ్జల్ గురుకు కూడా శిక్షను అమలు చేసే అవకాశం లభించింది.
Source: జాతీయ | 18 May 2010 | 10:07 pm

హోం మంత్రి ప్రతిపాదనను తోసిపుచ్చిన మావోయిస్టులు

72 గంటల పాటు హింసకు స్వస్తి చెప్పి చర్చలకు రావాలని కేంద్ర హోం మంత్రి చిదంబరం ఇచ్చిన పిలుపును మావోయిస్టులు తిరస్కరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయుధాలను వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాము చర్చలకు మొగ్గు చూపినపుడు మిన్నకుండిన కేంద్రం.. ఇపుడు ఆయుధాలు వీడి, హింసకు దూరంగా ఉండి చర్చలకు రావాలని ఆహ్వానించడం విడ్డూరంగా ఉందని మావోయిస్టు అగ్రనేతలు అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 18 May 2010 | 9:57 pm

హీరోయిన్‌కి ముద్దు పెడితే అల్లు అర్జున్ "బాక్స్" బద్ధలేనా..?!!

ముద్దు సీన్లు కావాలని పెట్టించుకునే హీరోలు మన టాలీవుడ్‌లో చాలామంది ఉన్నారు. కానీ అల్లు అర్జున్‌కు మాత్రం ముద్దు పెట్టుకున్నప్పుడు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే ప్రేక్షకులు తనను ఓ రకంగా చూస్తున్నారని అర్థమయిపోయింది. గతంలో ఆర్య-2లో కాజల్‌తో ముద్దు సీను పెట్టుకున్నాడు. కానీ అది అనుకున్నంత విజయవంతం కాలేదు. ఆ తర్వాత ఏడాదిపాటు మనసుపెట్టి వరుడు చేశాడు. అందులోనూ హీరోయిన్ భానుశ్రీ మెహ్రాను లిప్ టు లిప్ కిస్ చాలాసేపు పెట్టుకున్నాడు. ఈ చిత్రమూ పెద్దగా ఆదరణ పొందలేదు. పైగా ఆ సీన్ ఎందుకు పెట్టారు..? అది అవసరమా...? అని అడిగితే... కథ డిమాండ్ మేరకే అని అప్పట్లో చెప్పాడు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం తాను నటిస్తున్న బద్రీనాథ్ చిత్రంలో ముద్దు సీన్ లేకుండా చూడండి... అని దర్శకుడిని కోరాడట. ఏది ఏమైనా ముద్దు పెట్టుకున్నా... ముచ్చటగా ఉండాలంటారు. మరి అలాంటి ముచ్చట అందరికీ రాదని అర్జున్ గుర్తు చేసుకున్నట్లున్నాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 18 May 2010 | 12:20 pm

తరుణ్ - ఆర్తీల పాత పరిచయం పురి విప్పి ఆడుతోందట

లవర్ బాయ్ తరుణ్ ప్రస్తుతం అంత బిజీగా ఏం లేడు. అదేవిధంగా తరుణ్ మాజీ ప్రియురాలుగా చెప్పబడే ఆర్తీ అగర్వాల్ సైతం భర్తకు విడాకులిచ్చి టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌తో ఓ ఊపు ఊపుదామంటే ఆమెకు అంతా విలన్లు, క్యామెడీ ఆర్టిస్టులే జత కుదురుతున్నారు. ఇలా అటు తరుణ్, ఇటు ఆర్తీ ఇద్దరూ గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో ఖాళీగా కూచుని ఉన్నారట. ఇలా చేతులు ముందు పెట్టుకుని ఎంతకాలం కూచుంటారూ...? అందుకనేనేమో ఇద్దరూ కలిసి ఎండిపోయిన తమ పాతపరిచయ మోడుకు తిరిగి చిగుర్లు తొడిగించాలని నిశ్చయించుకున్నట్లు టాలీవుడ్ గుసగుసలు పోతోంది. సాయంత్రమైతే సరి... ఇద్దరి ఫోన్లు అదే పనిగా ఎంగేజ్‌గా ఉంటున్నాయట. ఒకరి బాధను ఒకరు వెళ్లగక్కుకుంటూ, ఓదార్చుకుంటూ... కాలం గడుపుతున్నారట. అయితే ఎటొచ్చీ ఈ సంగతి మళ్లీ తమ తమ పేరెంట్స్‌కు తెలిస్తే ఎక్కడ గొడవైపోతుందోనని ఇద్దరూ రహస్యంగా ఫోన్ సంభాషణలు సాగిస్తున్నట్లు భోగట్టా. మళ్లీ పురివిప్పిన ఈ పాత పరిచయం వీళ్లద్దరినీ ఎక్కడి వరకు తీసుకెళుతుందో చూడాలి మరి...!!
Source: Yahoo! Telugu: Entertainment | 18 May 2010 | 9:35 am

కోస్తా జిల్లాలకు "లైలా" గండం: అప్రమత్తమైన ప్రభుత్వం

నిన్నటి వరకూ బండలు పగిలే ఎండ దెబ్బకు రాష్ట్రంలో అతలాకుతలమవుతుండగానే లైలా రూపంలో కోస్తా జిల్లాలపై విరుచుక పడేందుకు తుఫాను పొంచి చూస్తోంది. వాతావరణ శాఖ అందించిన సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Source: ఏపీ న్యూస్ | 18 May 2010 | 8:45 am

కేసీఆర్ గారూ.. మీ ఇష్టమొచ్చినచోట ప్రసంగించండి: చిరు

జై ఆంధ్ర లక్ష్యంగా విజయవాడలో దళిత నాయకుడు కత్తి పద్మారావు నిర్వహించే సభకు తాను హాజరు కాబోతున్నట్లు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 18 May 2010 | 7:51 am

జార్ఖండ్‌లో వంతులవారీ ప్రభుత్వ ఏర్పాటు: భాజపా

జార్ఖండ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరదించేందుకు భారతీయ జనతా పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలు అంగీకరించాయి. జేఎంఎం డిమాండ్ మేరకు వంతులవారీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా సమ్మతించింది. అయితే, తొలి రెండున్నర సంవత్సరాల కాలం భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆతర్వాత జేఎంఎం అందలమెక్కుతుంది.
Source: జాతీయ | 18 May 2010 | 7:05 am

మావోలపై వైమానికి దాడులు తప్పవేమో: చిదంబరం

నరమేథానికి పాల్పడుతున్న మావోయిస్టులపై వైమానికి దాడులు తప్పేలా లేవని కేంద్ర హోం మంత్రి చిదంబరం అభిప్రాయపడ్డారు. మానవత్వం మరచిన మావోయిస్టులు అమాయక ప్రజల ప్రాణాలను తీయడాన్ని ఏ ఒక్కరూ సహించజాలరన్నారు. అందువల్ల వారి స్థావరాలపై వైమానికి దాడులు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నయ్యే సూచనలు కనిపిస్తున్నాయన్నారు.
Source: జాతీయ | 18 May 2010 | 6:11 am

సిద్ధిపేటలో సమైక్యాంధ్ర బహిరంగ సభ: ఎంపీ లగడపాటి

సిద్ధిపేటలో సమైక్యాంధ్ర బహిరంగ సభను నిర్వహించనున్నట్టు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు కంచుకోటగా ఉన్న సిద్ధిపేటలో సమైక్య వాణిని వినిపించి తీరుతానని లగడపాటి శపథం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 18 May 2010 | 6:04 am

ఏఎన్నార్ - ఎన్టీఆర్‌ల 100 రోజుల "మాయాబజార్"

మాయాబజార్ బ్లాక్ అండ్ వైట్‌లోనే కాదు కలర్‌లో కూడా శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుని తన సత్తా ఏమిటో నిరూపించుకుంది. నేటి చిత్రాలు కనీసం 50 రోజులు ఆడటమే గగనంగా ఉన్నది. అటువంటిది అలనాటి చిత్రాల స్టామినాను మరోసారి నిరూపించుకున్నది మాయాబజార్. కలర్ ట్రేడింగ్ చేసిన గోల్డ్ స్టోన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో శతదినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ ప్రసాద్, జగన్ మోహన్ రావు, శ్రీనివాస్‌లు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా కోడి రామకృష్ణ, ఐమాక్స్ అధినేత రమేష్ ప్రసాద్ హాజరయ్యారు.కోడి రామకృష్ణ మాట్లాడుతూ.... మాయాబజార్ గురించి చెప్పాలంటే ఒక్కరోజు చాలదు. రోజులు పడుతుంది. అటువంటి చిత్రానికి సంబంధించిన శతదినోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. కలర్ టెక్నికల్ హెడ్ జగన్ మోహన్ రావు మాట్లాడుతూ... ఈ చిత్రం కలర్ చేయాలంటే చాలా రిస్క్‌తో కూడిన పని. మొదట్లో చాలామంది ఎలా ఉంటుందో... పేరు చెడగొడతారేమోనని.. అసలు వద్దని రకరకాల సూచనలు చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 18 May 2010 | 6:02 am

సంధ్య హాసిని ట్రెయిలర్

కమల్‌ పిక్చర్స్‌ పతాకంపై బి.వి. రమణారెడ్డి దర్శకత్వంలో కమాలాకర్‌ కథానాయకుడిగా కమలాకర్‌ రెడ్డి నిర్మించిన 'హాసిని చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకులు రమణారెడ్డి మాట్లాడుతూ 'ఈ చిత్రానికి అన్ని కేంద్రాల్లో చక్కటి ప్రేక్షకాదరణ లభిస్తోంది. చిత్ర హీరో కమలాకర్‌ రెడ్డి మాట్లాడుతూ... ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా మంచి గుర్తింపు లభించింది. కథానాయిక సంధ్య హాసిని పాత్రలో చక్కటి అభినయాన్ని కనబర్చిందనీ, ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ట్రెయిలర్ చూడండి.
Source: Yahoo! Telugu: Entertainment | 18 May 2010 | 5:43 am

నాలుగో షెడ్యూల్లో సిద్ధార్థ్ "బావ"

సిద్దార్థ్ కథానాయకునిగా నటిస్తున్న చిత్రం బావ. డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ప్రణీత ఇందులో కథానాయిక. రాంబాబుని దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీకీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ... స్వచ్ఛమైన పల్లె వాతావరణంలో బావామరదళ్ల మధ్య జరిగే క్యూట్ లవ్ స్టోరీ ఇది. సిద్ధార్థ్ నుంచి యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. చక్రి సంగీతం, అరవింద్ కృష్ణ ఛాయాగ్రహణం, చింతపల్లి రమణ సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 18 May 2010 | 5:29 am

తరుణ్ - ఆర్తీల పాత పరిచయం పురి విప్పి ఆడుతోందట

లవర్ బాయ్ తరుణ్ ప్రస్తుతం అంత బిజీగా ఏం లేడు. అదేవిధంగా తరుణ్ మాజీ ప్రియురాలుగా చెప్పబడే ఆర్తీ అగర్వాల్ సైతం భర్తకు విడాకులిచ్చి టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌తో ఓ ఊపు ఊపుదామంటే ఆమెకు అంతా విలన్లు, క్యామెడీ ఆర్టిస్టులే జత కుదురుతున్నారు. ఇలా అటు తరుణ్, ఇటు ఆర్తీ ఇద్దరూ గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో ఖాళీగా కూచుని ఉన్నారట. ఇలా చేతులు ముందు పెట్టుకుని ఎంతకాలం కూచుంటారూ...? అందుకనేనేమో ఇద్దరూ కలిసి ఎండిపోయిన తమ పాతపరిచయ మోడుకు తిరిగి చిగుర్లు తొడిగించాలని నిశ్చయించుకున్నట్లు టాలీవుడ్ గుసగుసలు పోతోంది. సాయంత్రమైతే సరి... ఇద్దరి ఫోన్లు అదే పనిగా ఎంగేజ్‌గా ఉంటున్నాయట. ఒకరి బాధను ఒకరు వెళ్లగక్కుకుంటూ, ఓదార్చుకుంటూ... కాలం గడుపుతున్నారట. అయితే ఎటొచ్చీ ఈ సంగతి మళ్లీ తమ తమ పేరెంట్స్‌కు తెలిస్తే ఎక్కడ గొడవైపోతుందోనని ఇద్దరూ రహస్యంగా ఫోన్ సంభాషణలు సాగిస్తున్నట్లు భోగట్టా. మళ్లీ పురివిప్పిన ఈ పాత పరిచయం వీళ్లద్దరినీ ఎక్కడి వరకు తీసుకెళుతుందో చూడాలి మరి...!!
Source: వినోదం | 18 May 2010 | 4:49 am

ఉష్ణతాపానికి చల్లని మందు.. 'లైలా' వర్షపు జల్లులు

నిన్నమొన్నటి వరకు ఉష్ణతాపంతో ఉడికి పోయిన రాష్ట్ర ప్రజలు చిరు జల్లుల్లో తడవనున్నారు. బంగాళాఖాతంలో చెన్నయ్‌కు ఆగ్నేయ దిక్కున వాయుగుండం ఏర్పడింది. ఇది తుఫానుగా మారి ఏ క్షణమైనా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Source: ఏపీ న్యూస్ | 18 May 2010 | 4:10 am