తరుణ్ - ఆర్తీల పాత పరిచయం పురి విప్పి ఆడుతోందట

లవర్ బాయ్ తరుణ్ ప్రస్తుతం అంత బిజీగా ఏం లేడు. అదేవిధంగా తరుణ్ మాజీ ప్రియురాలుగా చెప్పబడే ఆర్తీ అగర్వాల్ సైతం భర్తకు విడాకులిచ్చి టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌తో ఓ ఊపు ఊపుదామంటే ఆమెకు అంతా విలన్లు, క్యామెడీ ఆర్టిస్టులే జత కుదురుతున్నారు. ఇలా అటు తరుణ్, ఇటు ఆర్తీ ఇద్దరూ గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో ఖాళీగా కూచుని ఉన్నారట. ఇలా చేతులు ముందు పెట్టుకుని ఎంతకాలం కూచుంటారూ...? అందుకనేనేమో ఇద్దరూ కలిసి ఎండిపోయిన తమ పాతపరిచయ మోడుకు తిరిగి చిగుర్లు తొడిగించాలని నిశ్చయించుకున్నట్లు టాలీవుడ్ గుసగుసలు పోతోంది. సాయంత్రమైతే సరి... ఇద్దరి ఫోన్లు అదే పనిగా ఎంగేజ్‌గా ఉంటున్నాయట. ఒకరి బాధను ఒకరు వెళ్లగక్కుకుంటూ, ఓదార్చుకుంటూ... కాలం గడుపుతున్నారట. అయితే ఎటొచ్చీ ఈ సంగతి మళ్లీ తమ తమ పేరెంట్స్‌కు తెలిస్తే ఎక్కడ గొడవైపోతుందోనని ఇద్దరూ రహస్యంగా ఫోన్ సంభాషణలు సాగిస్తున్నట్లు భోగట్టా. మళ్లీ పురివిప్పిన ఈ పాత పరిచయం వీళ్లద్దరినీ ఎక్కడి వరకు తీసుకెళుతుందో చూడాలి మరి...!!
Source: Yahoo! Telugu: Entertainment | 18 May 2010 | 9:35 am

బ్రాడ్‌బ్యాండ్‌ను విస్తరించేందుకు 3జీ సరిపోదుః ఎయిర్‌టెల్

ప్రస్తుతం దేశంలో మూడవ తరానికి చెందిన(3జీ) స్పెక్ట్రమ్ వేలం పాటలు పూర్తి కావస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రాడ్‌‍బ్యాండ్‌‌ను మరింతగా విస్తరించి రేడియో తరంగాలు సరిపోవని భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 18 May 2010 | 9:14 am

బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లిన ఆఫ్గనిస్థాన్-పాకిస్థాన్

ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లు బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లాయి. ఆప్ఘన్ రాజధాని కాబూల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 20 మంది మృత్యువాత పడగా, పాక్‌లో జరిగిన పేలుడులో మరో 12 మంది చనిపోయారు. ఈ ఆత్మాహుతి దాడులు సైనిక బలగాలను లక్ష్యంగా చేసుకుని జరగడం గమనార్హం.
Source: Yahoo! Telugu: News | 18 May 2010 | 8:50 am

స్టాక్ మార్కెట్: వృద్ధి బాటలో సెన్సెక్స్, నిఫ్టీ!

బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 82 పాయింట్లు బలపడి, 16,918 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 24 పాయింట్లు పుంజుకుని, 5,084 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 18 May 2010 | 8:36 am

లాభాలతో పుంజుకున్న బాంబే స్టాక్ మార్కెట్

మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభనష్టాలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 98 పాయింట్లు పుంజుకుని, 16,933 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 20 పాయింట్లు లాభపడి, 5,080 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 18 May 2010 | 8:07 am

ఆకాశంలో బూడిదః రద్దయిన యూఏఈ విమానాలు

ఐస్‌ల్యాండ్‌లోని అగ్నిపర్వతం బద్ధలై ఆకాశంలో బూడిద కమ్ముకోవడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ సంస్థ మంగళవారం నాలుగు విమానాలను రద్దుచేసినట్లు ఆ సంస్థ దుబాయ్‌లో ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 18 May 2010 | 7:58 am

మావోయిస్టుల దాడులు: నేడు ఉన్నతస్థాయి సమీక్ష!

దేశంలో మావోయిస్టుల ఆగడాలు మరింత ఎక్కువ కావడం పట్ల కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా, సోమవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు కొంతమంది ప్రయాణికులు, జవాన్లతో వెళుతున్న బస్సును పేల్చి వేసిన ఘటనను సీరియస్‌గా తీసుకుంది.
Source: Yahoo! Telugu: News | 18 May 2010 | 7:48 am

రేపు కడప జిల్లాలో పర్యటించనున్న నటుడు బాలకృష్ణ

సినీ నటుడు బాలకృష్ణ 19వ తేదీ నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప పట్టణంలో ఉన్న అమీన్‌పీర్ దర్గాను ఆయన సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అలాగే జిల్లాలోని పేరొందిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలను సందర్శించారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 18 May 2010 | 7:37 am

ఊపందుకున్న జౌళి ఉత్పత్తుల ఎగుమతులు: ఏఈపీసీ

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం తగ్గుముఖం పడుతుండటంతో దేశీయ జౌళి ఉత్పత్తులు ఎగుమతులు గడచిన ఫిబ్రవరి, మార్చి నెలల్లో అమెరికాకు రికార్డు స్థాయిలో ఎగుమతులు జరిగాయని అప్పారెల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఏఈపీసీ) ఛైర్మెన్ ప్రేమల్ ఉదానీ మంగళవారం కోయంబత్తూరులో తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 18 May 2010 | 7:15 am

బావి నిండా నీళ్లున్నాయ్.. తోడేందుకు చేదలేదు: చిరు

బావి ఉంది. బావి నిండా నీళ్లు ఉన్నాయి. అయితే, తోడేందుకు చేదలేదనే చందంగా ప్రజారాజ్యం పార్టీ ఉందని ఆ పార్టీ అధినేత చిరంజీవి వాపోయారు. ప్రజారాజ్యం పార్టీకి పుష్కలంగా ప్రజల అండదండలు ఉన్నాయి. పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఓట్లు వేసేందుకు ఓటర్లూ ఉన్నారు. కానీ.. వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి ఓట్లు వేయించుకునే స్థానిక యంత్రాంగం లేదన్నారు. ఈ విషయం గత ఎన్నికల్లో తేటతెల్లమైందన్నారు. దీన్ని సవరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చిరంజీవి పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు.
Source: Yahoo! Telugu: News | 18 May 2010 | 7:08 am

యుద్ధానికి వెళ్లే సైనికుల వెంట కండోమ్స్ తీసుకెళ్లాలి!

ఆప్ఘన్, ఇరాక్ వంటి ప్రాంతాల్లో సాగుతున్న పోరులో పాల్గొనేందుకు వెళ్లే సైనికులు తమ వెంట కండోమ్ ప్యాకెట్లను తీసుకెళ్లాలని సైనిక ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. యుద్ధంలో పాల్గొనే సైనికులు శారీరక సంబంధాలు పెట్టుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. అయితే, నెలలు లేదా సంవత్సరాల తరబడి పోరుగళంలో ఉండే సైనికుల మధ్య ఇలాంటి వ్యవహారాలు సాధారణమని పలువురు సీనియర్ అధికారులు అంటున్నారు. అందువల్ల ఇలాంటి వారు తమకు సరిపడ కండోమ్ ప్యాకెట్లను వెంట తీసుకుని వెళ్లాలని కోరారు.
Source: Yahoo! Telugu: News | 18 May 2010 | 6:55 am

ఏఎన్నార్ - ఎన్టీఆర్‌ల 100 రోజుల "మాయాబజార్"

మాయాబజార్ బ్లాక్ అండ్ వైట్‌లోనే కాదు కలర్‌లో కూడా శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుని తన సత్తా ఏమిటో నిరూపించుకుంది. నేటి చిత్రాలు కనీసం 50 రోజులు ఆడటమే గగనంగా ఉన్నది. అటువంటిది అలనాటి చిత్రాల స్టామినాను మరోసారి నిరూపించుకున్నది మాయాబజార్. కలర్ ట్రేడింగ్ చేసిన గోల్డ్ స్టోన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో శతదినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ ప్రసాద్, జగన్ మోహన్ రావు, శ్రీనివాస్‌లు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా కోడి రామకృష్ణ, ఐమాక్స్ అధినేత రమేష్ ప్రసాద్ హాజరయ్యారు.కోడి రామకృష్ణ మాట్లాడుతూ.... మాయాబజార్ గురించి చెప్పాలంటే ఒక్కరోజు చాలదు. రోజులు పడుతుంది. అటువంటి చిత్రానికి సంబంధించిన శతదినోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. కలర్ టెక్నికల్ హెడ్ జగన్ మోహన్ రావు మాట్లాడుతూ... ఈ చిత్రం కలర్ చేయాలంటే చాలా రిస్క్‌తో కూడిన పని. మొదట్లో చాలామంది ఎలా ఉంటుందో... పేరు చెడగొడతారేమోనని.. అసలు వద్దని రకరకాల సూచనలు చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 18 May 2010 | 6:02 am

సంధ్య హాసిని ట్రెయిలర్

కమల్‌ పిక్చర్స్‌ పతాకంపై బి.వి. రమణారెడ్డి దర్శకత్వంలో కమాలాకర్‌ కథానాయకుడిగా కమలాకర్‌ రెడ్డి నిర్మించిన 'హాసిని చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకులు రమణారెడ్డి మాట్లాడుతూ 'ఈ చిత్రానికి అన్ని కేంద్రాల్లో చక్కటి ప్రేక్షకాదరణ లభిస్తోంది. చిత్ర హీరో కమలాకర్‌ రెడ్డి మాట్లాడుతూ... ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా మంచి గుర్తింపు లభించింది. కథానాయిక సంధ్య హాసిని పాత్రలో చక్కటి అభినయాన్ని కనబర్చిందనీ, ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ట్రెయిలర్ చూడండి.
Source: Yahoo! Telugu: Entertainment | 18 May 2010 | 5:43 am

నాలుగో షెడ్యూల్లో సిద్ధార్థ్ "బావ"

సిద్దార్థ్ కథానాయకునిగా నటిస్తున్న చిత్రం బావ. డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ప్రణీత ఇందులో కథానాయిక. రాంబాబుని దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీకీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ... స్వచ్ఛమైన పల్లె వాతావరణంలో బావామరదళ్ల మధ్య జరిగే క్యూట్ లవ్ స్టోరీ ఇది. సిద్ధార్థ్ నుంచి యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. చక్రి సంగీతం, అరవింద్ కృష్ణ ఛాయాగ్రహణం, చింతపల్లి రమణ సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 18 May 2010 | 5:29 am

మావోయిస్టుల దాడులు: నేడు ఉన్నతస్థాయి సమీక్ష!

దేశంలో మావోయిస్టుల ఆగడాలు మరింత ఎక్కువ కావడం పట్ల కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా, సోమవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు కొంతమంది ప్రయాణికులు, జవాన్లతో వెళుతున్న బస్సును పేల్చి వేసిన ఘటనను సీరియస్‌గా తీసుకుంది.
Source: జాతీయ | 18 May 2010 | 2:18 am

రేపు కడప జిల్లాలో పర్యటించనున్న నటుడు బాలకృష్ణ

సినీ నటుడు బాలకృష్ణ 19వ తేదీ నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప పట్టణంలో ఉన్న అమీన్‌పీర్ దర్గాను ఆయన సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అలాగే జిల్లాలోని పేరొందిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలను సందర్శించారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 18 May 2010 | 2:09 am

బావి నిండా నీళ్లున్నాయ్.. తోడేందుకు చేదలేదు: చిరు

బావి ఉంది. బావి నిండా నీళ్లు ఉన్నాయి. అయితే, తోడేందుకు చేదలేదనే చందంగా ప్రజారాజ్యం పార్టీ ఉందని ఆ పార్టీ అధినేత చిరంజీవి వాపోయారు. ప్రజారాజ్యం పార్టీకి పుష్కలంగా ప్రజల అండదండలు ఉన్నాయి. పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఓట్లు వేసేందుకు ఓటర్లూ ఉన్నారు. కానీ.. వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి ఓట్లు వేయించుకునే స్థానిక యంత్రాంగం లేదన్నారు. ఈ విషయం గత ఎన్నికల్లో తేటతెల్లమైందన్నారు. దీన్ని సవరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చిరంజీవి పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 18 May 2010 | 1:39 am

గుజరాత్‌లోని ముస్లింలకు సమాన అవకాశాలు: అద్వానీ

గుజరాత్ రాష్ట్రంలో నివశిస్తున్న ముస్లింలకు ఇతర వర్గాలతో పాటుగా సమాన అవకాశాలు పొందుతున్నారని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ అన్నారు. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ సచార్ కమిటీ పేర్కొన్న అంశాలను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన రాష్ట్రంలోని ముస్లింలకు అందిస్తున్నారన్నారు. విద్య, ఉపాధి రంగాల్లో వారు ఇతర వర్గాలతో సమానంగా ఈ అవకాశాలు పొందుతున్నట్టు అద్వానీ గుర్తు చేశారు.
Source: జాతీయ | 18 May 2010 | 12:35 am

మరిన్ని అధికారాలు ఇవ్వండి: ప్రధానికి పీసీ విన్నపం

దేశంలో పెట్రేగి పోతున్న మావోయిస్టుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు మరిన్ని అధికారాలు కావాలని కేంద్ర హోం మంత్రి చిదంబరం అన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌‍కు విజ్ఞప్తి చేసినట్టు ఆయన తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు సోమవారం సాయంత్రం మరోమారు పెట్రేగి పోయిన విషయం తెల్సిందే. ఒక బస్సును పేల్చి వేయడంతో అందులో ప్రయాణిస్తున్న 36 మంది మృత్యువాత పడ్డారు.
Source: జాతీయ | 17 May 2010 | 11:45 pm

ప్రరాపా ఆధ్వర్యంలో ఛలో పోలవరం: చిరంజీవి వెల్లడి

ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన "ఛలో పోలవరం"ను చేపట్టనున్నట్టు ఆ పార్టీ అధినేత చిరంజీవి ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు సాధనలో భాగంగా తాను నిర్వహిస్తున్న బస్సుయాత్రకు ముగింపుగా ఛలో పోలవరం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 17 May 2010 | 11:23 pm

తెదేపాకు సమగ్ర విధానమంటూ లేదు: మందకృష్ణ

తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన విధానమంటూ లేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ ఆరోపించారు. దీనికి నిదర్శనమే ఆపార్టీ నేతలైన హరికృష్ణ, ఎర్రబెల్లి దయాకర్ రావుల మధ్యల నెలకొన్న మాటల యుద్ధమన్నారు.
Source: ఏపీ న్యూస్ | 17 May 2010 | 11:12 pm

రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి: ఆంటోనీ

దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ అభిప్రాయపడ్డారు. చైనాకు చెందిన హ్యాకర్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్న తరుణంలో త్రివిధ దళాలు తమ సైబర్ వ్యవస్థను మరింత భద్రంగా ఉండేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Source: జాతీయ | 17 May 2010 | 11:02 pm

దేశ ప్రధానమంత్రిగా రాహులైతే చాలా బాగుండు: సర్వే

కాంగ్రెస్ యువరాజు గాంధీకి దేశ ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే భవిష్యత్ ప్రధానిగా నీరాజనాలు అందుకుంటున్నారు. తాజాగా, ఒక ప్రైవేట్ ఆంగ్ల టీవీ నిర్వహించిన సర్వేలో రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయితే చాలా బాగుంటుందని మెజారిటీ ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. ఆయన స్థానాన్ని రాహుల్ భర్తీ చేస్తే ఇంకా బాగుంటుందని పేర్కొన్నారు.
Source: జాతీయ | 17 May 2010 | 10:01 pm

"యంగ్ ఇండియన్స్‌"తో "ఓల్డ్ ఇండియన్" సినిమా

దేశంకోసం జీవించు లేదా దేశంకోసం చావు అంటూ రకరకాల క్యాప్షన్లను గుప్పిస్తూ... ఇదో దేశభక్తి చిత్రమని చెబుతూ వచ్చిన దర్శకుడు దాసరి నారాయణరావు తీసిన 149వ చిత్రమిది. మొదటనుంచీ ఈ చిత్రం పబ్లిసిటీలో నటీనటుల పేర్లు, వాళ్ల మొహాలు ఎలా ఉంటాయన్నది చూపించకుండా కొత్త పబ్లిసిటీకి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. కానీ అంతకుముందే తన ఐడియాలజీతో మిగతావారు కొట్టేశారనీ "వరుడు" హీరోయిన్ పబ్లిసిటీకి గురించి అన్యాపదేశంగా చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 17 May 2010 | 12:51 pm

నమితా...! అయితే ఏంటటా..!! ఆమేమన్నా లావా...?!!

బొద్దందాల నమితకు చెన్నై విమానాశ్రయంలో ఓ చేదు అనుభవం ఎదురైంది. అమ్మడు టైట్ ప్యాంటుతో అంతకంటే టైట్ టాప్‌ను ధరించి అందాలన్నిటినీ ఊపుకుంటూ చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. తను ఎక్కవలసిన విమానం తాలూకు సెక్యూరిటీ చెక్‌ పాయింట్ వద్ద పరిస్థితిని చూసి జావగారి పోయింది. ఆమె ఎక్కవలసిన విమానం తాలూకు ప్రయాణికులు సెక్యూరిటీ చెక్ కోసం క్యూ కట్టి నిలుచుని ఉన్నారు.వారి వెనుక తిన్నగా నిలబడలేని నమిత, నేరుగా సెక్యూరిటీ సిబ్బంది వద్దకెళ్లి తను నటిననీ, తనను ముందుగా చెక్ చేసి వెంటనే లోపలికి పంపించాలని కోరింది. దీంతో సదరు ఉద్యోగి చకాచకా నమిత పని పూర్తి చేసి ఆమెను లోపలికి పంపించాడు. ఇదంతా క్యూలో నిలబడి చూస్తున్న ప్రయాణికులు, తమకన్నా వెనుక వచ్చిన నమితను ముందుగా లోపలికి ఎందుకు పంపిచారంటూ సిబ్బందిపై చిందులేశారు. ఈ పరిణామంతో ఖంగు తిన్న సిబ్బంది, ప్రయాణికులకు నచ్చజెప్పి మరోసారి ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 17 May 2010 | 10:12 am

బస్సును పేల్చివేసిన మావోయిస్టులు: 50 మంది మృతి!

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు సోమవారం సాయంత్రం మరోమారు మారణహోమం సృష్టించారు. దంతెవాడ జిల్లాలో కొంతమంది జవాన్లు, యాత్రికులతో వెళుతున్న బస్సును మందుపాతరతో పేల్చి వేశారు. ఈ ప్రమాదంలో 50 మంది పౌరులు మరణించినట్టు ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదంపై కేంద్ర హోంశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పేలుడులో జవాన్ల కంటే యాత్రికులే ఎక్కువ మంది మృతి చెందినట్టు వెల్లడించింది. సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఎవరూ మరణించలేదని ప్రకటించింది.
Source: జాతీయ | 17 May 2010 | 7:33 am

"యంగ్ ఇండియన్స్‌"తో "ఓల్డ్ ఇండియన్" సినిమా

దేశంకోసం జీవించు లేదా దేశంకోసం చావు అంటూ రకరకాల క్యాప్షన్లను గుప్పిస్తూ... ఇదో దేశభక్తి చిత్రమని చెబుతూ వచ్చిన దర్శకుడు దాసరి నారాయణరావు తీసిన 149వ చిత్రమిది. మొదటనుంచీ ఈ చిత్రం పబ్లిసిటీలో నటీనటుల పేర్లు, వాళ్ల మొహాలు ఎలా ఉంటాయన్నది చూపించకుండా కొత్త పబ్లిసిటీకి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. కానీ అంతకుముందే తన ఐడియాలజీతో మిగతావారు కొట్టేశారనీ "వరుడు" హీరోయిన్ పబ్లిసిటీకి గురించి అన్యాపదేశంగా చెప్పారు.
Source: వినోదం | 17 May 2010 | 7:23 am

ఏంటి పాడూ...? "పాము"తో లిప్ టు లిప్ కిస్సింగులా...?!

హాలీవుడ్ అరంగేట్రం చేసిన మల్లికా శరావత్ తన తాజా చిత్రం "హిస్‌స్" ప్రమోషన్‌కోసం విభిన్నమైన పద్ధతిని అనుసరిస్తోంది. "హిస్‌స్‌"లో నాగకన్యగా కనిపించే శరావత్ ఒక సీన్‌లో పూర్తి నగ్నంగా కనిపించిందంటున్నారు. ఈ సంగతి ప్రక్కనపెడితే హిస్‌స్ ప్రమోషన్లో భాగంగా మల్లికా శరావత్ తన వెంట రెండు పాములను తీసుకుని వెళుతోందట. ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా పాముతో సహా ప్రత్యక్షమవుతోందట. అంతేకాదు ఆ పాముతో తన పెదవులపై ముద్దులు పెట్టించుకోవడం, ఇంకా తన అందమైన శరీరావయాలపై పాకించుకోవడం వంటి వింత చేష్టలు చేస్తోందట. ఇటువంటి "పిచ్చి" చేష్టలు ఓ కార్యక్రమంలో చేస్తుండగా ఆ దృశ్యాన్ని చూసిన ఓ టీనేజ్ గాళ్ వాంతి చేసుకుని దబ్బున కింద పడిపోయిందట.
Source: Yahoo! Telugu: Entertainment | 17 May 2010 | 7:12 am

కసబ్-అఫ్జల్‌లను సంయుక్తంగా ఉరితీయాలి: ఎంఎస్.బిట్టా

ముంబై దాడుల కేసులో ఉరిశిక్ష పడిన అజ్మల్ అమీర్ కసబ్, పార్లమెంట్ దాడి కేసులో ఇదే తరహా శిక్ష పడిన అఫ్జల్ గురులను సంయుక్తంగా ఉరి తీయాలని పార్లమెంట్ దాడి నష్టబాధిత కుటుంబాల తీవ్రవాద వ్యతిరేక కూటమి ఛైర్మన్ ఎం.ఎస్.బిట్టా డిమాండ్ చేశారు. ఐదేళ్ళ క్రితం ఉరిశిక్ష పడిన అఫ్జల్‌ను ఉరి తీయకుండా, కసబ్‌కు శిక్ష అమలు చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడాన్ని ఆయన తప్పుబట్టారు.
Source: జాతీయ | 17 May 2010 | 5:45 am

'ఓదార్పు యాత్ర'పై తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కలవరం!

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఈనెల 27వ తేదీ నుంచి వరంగల్‌ జిల్లాలో చేపట్టనున్న ఓదార్పు యాత్ర పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలవరపాటుకు గురవుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడి హోదాలో ఆయనకు గౌరవం ఇవ్వాల్సి ఉందన్నారు. అదేసమయంలో స్థానిక ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నడుచుకోలేమని వారు అంటున్నారు.
Source: ఏపీ న్యూస్ | 17 May 2010 | 5:25 am

ఐష్ "ఎద" అందాల ప్రదర్శనలపై వ్యాఖ్యానించను: దీపిక

పాశ్చాత్య పోకడలంటే ఆట్టే తనకు కిట్టదని బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ దీపికా పదుకునే చెపుతోంది. అందువల్లనే కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో సంప్రదాయ చీర కట్టులో కన్పించానని చెప్పుకొచ్చింది. అంటే ఐశ్వర్యారాయ్ భారతీయ సంప్రదాయాలను పట్టించుకోవడం లేదనా...? అని ప్రశ్నిస్తే... ఒకరి పోకడలను గురించి తానెప్పుడూ వ్యాఖ్యానించనని చెప్పింది. 63వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్యారాయ్ తన ఎద సోయగాలను అలవోకగా ప్రదర్శిస్తూ గౌన్ ధరించి అభిమానులకు ఫ్లైయింగ్ కిస్‌లను ఇచ్చింది. ఇందుకు భిన్నంగా దీపికా పదుకునే నాజూకైన నడుము ఒంపులను ప్రదర్శిస్తూ చీర కట్టులో దర్శనమిచ్చింది. పరస్పర విరుద్ధంగా ఈ ఇద్దరూ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో కనిపించడంపై అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్ సినీ పరిశ్రమలు చర్చించుకోవడం మొదలు పెట్టాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 17 May 2010 | 5:23 am

ఓ వైపు మండే ఎండలు.. మరోవైపు తుఫాను గండం!

రాష్ట్రానికి తుఫాను గండం పొంచివున్నట్టు భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం ఉదయం 11.30 నిమిషాలకు వాయుగుండంగా రూపాంతరం చెందినట్టు ఆ విభాగం అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా ఈనెల 19వ తేదీ తుఫాను ముప్పు పొంచివున్నట్టు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 17 May 2010 | 4:59 am

నమితా...! అయితే ఏంటటా..!! ఆమేమన్నా లావా...?!!

బొద్దందాల నమితకు చెన్నై విమానాశ్రయంలో ఓ చేదు అనుభవం ఎదురైంది. అమ్మడు టైట్ ప్యాంటుతో అంతకంటే టైట్ టాప్‌ను ధరించి అందాలన్నిటినీ ఊపుకుంటూ చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. తను ఎక్కవలసిన విమానం తాలూకు సెక్యూరిటీ చెక్‌ పాయింట్ వద్ద పరిస్థితిని చూసి జావగారి పోయింది. ఆమె ఎక్కవలసిన విమానం తాలూకు ప్రయాణికులు...
Source: వినోదం | 17 May 2010 | 4:43 am

తెలంగాణవాదులూ.. కాస్త ఓపిక పట్టండి: రోశయ్య

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సంప్రదింపులు జరిపేందుకు కేంద్ర జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి రోశయ్య గుర్తు చేశారు. అందువల్ల తెలంగాణ వాదులంతా కాస్త ఓపిక పట్టి ప్రశాంతంగా ఉండాలని ఆయన హితవు పలికారు. ఆందోళన చేయడం వల్లనో లేక తన ప్రసంగానికి అడ్డు తగలడం వల్లనో తెలంగాణ రాబోదని ఆయన గుర్తు చేశారు. కేంద్రం తీసుకునే అంతిమ నిర్ణయానికి ప్రతి ఒక్కరం కట్టుబడి ఉందామని, అంతవరకు ఓపికతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు చైతన్య యాత్రలో పాల్గొన్న రోశయ్యకు కొంతమంది తెలంగాణ వాదులు అడ్డుతగలగా ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 17 May 2010 | 4:17 am

ఏంటి పాడూ...? "పాము"తో లిప్ టు లిప్ కిస్సింగులా...?!

హాలీవుడ్ అరంగేట్రం చేసిన మల్లికా శరావత్ తన తాజా చిత్రం "హిస్‌స్" ప్రమోషన్‌కోసం విభిన్నమైన పద్ధతిని అనుసరిస్తోంది. "హిస్‌స్‌"లో నాగకన్యగా కనిపించే శరావత్ ఒక సీన్‌లో పూర్తి నగ్నంగా కనిపించిందంటున్నారు. ఈ సంగతి ప్రక్కనపెడితే హిస్‌స్ ప్రమోషన్లో భాగంగా మల్లికా శరావత్ తన వెంట రెండు పాములను తీసుకుని వెళుతోందట. ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా పాముతో సహా ప్రత్యక్షమవుతోందట. అంతేకాదు ఆ పాముతో తన పెదవులపై ముద్దులు పెట్టించుకోవడం, ఇంకా తన అందమైన శరీరావయాలపై పాకించుకోవడం వంటి వింత చేష్టలు చేస్తోందట. ఇటువంటి "పిచ్చి" చేష్టలు ఓ కార్యక్రమంలో చేస్తుండగా ఆ దృశ్యాన్ని చూసిన ఓ టీనేజ్ గాళ్ వాంతి చేసుకుని దబ్బున కింద పడిపోయిందట.
Source: వినోదం | 17 May 2010 | 3:51 am

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ టిక్కెట్ల విక్రయం నిలిపివేత

ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చెందిన ఉన్నతాధికారులు కళ్లు తెరిచారు. నిన్నామొన్నిటివరకు స్టేషన్‌లో విపరీతమైన రద్దీ నెలకొన్నా పట్టించుకోని అధికారులు.. ఆదివారం జరిగిన తొక్కిసలాటతో నిద్రమత్తును వీడారు. ప్రయాణికుల రద్దీని నివారించేందుకు స్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం టిక్కెట్ల విక్రయాన్ని నిలిపి వేశారు.
Source: జాతీయ | 17 May 2010 | 3:32 am