|
ఆర్మీ చీఫ్ ఖియానీకి పదవీకాలం పొడగింపు లేపు: పాక్పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అష్పాఖ్ పర్వేజ్ ఖియానీ పదవీకాలం పొడగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి చౌదరీ అహ్మద్ ముక్తర్ స్పష్టం చేశారు. అలాగే, తన పదవీ కాలాన్ని పొడగించాలని ఖియానీ ఎపుడూ కోరలేదన్నారు. పాక్ అధ్యక్షుడిగా ముషారఫ్ ఉన్న సమయంలో (2007) ఖియానీని ఆర్మీ చీఫ్‌గా నియమించారు.Source: Yahoo! Telugu: News | 17 May 2010 | 9:17 am ఆర్థిక వృద్ధి 8.5 శాతానికి చేరుకుంటుందిః సీఐఐప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2009-10)లో దేశీయ ఆర్థిక వృద్ధి 8.5 శాతానికి చేరుకుంటుందని సీఐఐ నూతన అధ్యక్షుడు హరి ఎస్ భరతియా సోమవారం న్యూ ఢిల్లీలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 7.2 శాతంగా ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 17 May 2010 | 9:05 am ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ టిక్కెట్ల విక్రయం నిలిపివేతఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చెందిన ఉన్నతాధికారులు కళ్లు తెరిచారు. నిన్నామొన్నిటివరకు స్టేషన్‌లో విపరీతమైన రద్దీ నెలకొన్నా పట్టించుకోని అధికారులు.. ఆదివారం జరిగిన తొక్కిసలాటతో నిద్రమత్తును వీడారు. ప్రయాణికుల రద్దీని నివారించేందుకు స్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం టిక్కెట్ల విక్రయాన్ని నిలిపి వేశారు.Source: Yahoo! Telugu: News | 17 May 2010 | 9:02 am డిమాండ్ పెరగడంతో పెరిగిన వెండి ధరలుదేశీయ బులియన్ మార్కెట్‌లో సోమవారం వెండి ధరలు ప్రతి కిలోకు 0.74 శాతం మేరకు పెరిగాయి. దీంతో ప్రతి కిలో వెండి ధర రూ. 29,877లకు చేరుకుందని మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్ వర్గాలు తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 17 May 2010 | 8:52 am బూడిద మేఘాల కారణంగా రద్దయిన విమానాలుఐస్ల్యాండ్ పరిసర ప్రాంతాల్లో అగ్నిపర్వతం బద్ధలైన కారణంగా మళ్ళీ ఆకాశంలో బూడిద మేఘాలు కమ్ముకోవడంతో దేశానికి చెందిన పలు విమాన సర్వీసులను లండన్‌కు పంపకుండా నిలిపివేసినట్లు విమానయాన కేంద్ర వర్గాలు తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 17 May 2010 | 7:55 am స్టాక్ మార్కెట్: ఐదువేల మార్కును తాకిన నిఫ్టీ!అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 349 పాయింట్లు భారీగా క్షీణించింది. దీంతో సెన్సెక్స్ సూచి 16,644 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 92 పాయింట్లు పతనమై, 5,000 పాయింట్ల మార్కును తాకింది.Source: Yahoo! Telugu: News | 17 May 2010 | 7:42 am ప్రపంచ కంపెనీల్లో చోటు దక్కించుకున్న టీసీఎస్ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీల్లో దేశీయ ఐటీ సేవారంగంలో అగ్రగామిగానున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ చోటు దక్కించుకుందని స్విట్జర్‌ల్యాండ్‌కు చెందిన సారాసీన్ బ్యాంక్ తన నివేదికలో తెలిపింది.Source: Yahoo! Telugu: News | 17 May 2010 | 7:33 am ఏంటి పాడూ...? "పాము"తో లిప్ టు లిప్ కిస్సింగులా...?!హాలీవుడ్ అరంగేట్రం చేసిన మల్లికా శరావత్ తన తాజా చిత్రం "హిస్‌స్" ప్రమోషన్‌కోసం విభిన్నమైన పద్ధతిని అనుసరిస్తోంది. "హిస్‌స్"లో నాగకన్యగా కనిపించే శరావత్ ఒక సీన్‌లో పూర్తి నగ్నంగా కనిపించిందంటున్నారు. ఈ సంగతి ప్రక్కనపెడితే హిస్‌స్ ప్రమోషన్లో భాగంగా మల్లికా శరావత్ తన వెంట రెండు పాములను తీసుకుని వెళుతోందట. ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా పాముతో సహా ప్రత్యక్షమవుతోందట. అంతేకాదు ఆ పాముతో తన పెదవులపై ముద్దులు పెట్టించుకోవడం, ఇంకా తన అందమైన శరీరావయాలపై పాకించుకోవడం వంటి వింత చేష్టలు చేస్తోందట. ఇటువంటి "పిచ్చి" చేష్టలు ఓ కార్యక్రమంలో చేస్తుండగా ఆ దృశ్యాన్ని చూసిన ఓ టీనేజ్ గాళ్ వాంతి చేసుకుని దబ్బున కింద పడిపోయిందట.Source: Yahoo! Telugu: Entertainment | 17 May 2010 | 7:12 am అణు ఒప్పందంపై బ్రెజిల్-ఇరాన్ దేశాధినేతల చర్చలు!బ్రెజిల్-ఇరాన్ దేశాల మధ్య అణు ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. ఇదే అంశంపై ఆ రెండు దేశాలకు చెందిన అధినేతలు ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డిసిల్వా, ఇరాన్ అధినేత అహ్మదినేజాద్‌లు ఇదే అంశంపై ఆదివారం టెహ్రాన్‌లో సమావేశమైనట్టు ఇరాన్ ప్రబుత్వ వార్తా సంస్థ వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 17 May 2010 | 7:07 am వైఎస్ కోసం ఏ ఒక్కరూ మృతి చెందలేదు: ఎర్రబెల్లిదివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కోసం తమ జిల్లాలో ఏ ఒక్కరూ చనిపోలేదని తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అందువల్ల వైఎస్ తనయుడు వైఎస్.జగన్ తమ జిల్లాలో చేపట్టనున్న ఓదార్పు యాత్రను విరమించుకోవాలని ఆయన హితవు పలికారు. లేనిపక్షంలో తాము ఓదార్పు యాత్రను అడ్డుకుని తీరుతామని ఆయన సోమవారం స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 17 May 2010 | 6:58 am ఐదో దఫా సంప్రదింపులు: నేడు రాష్ట్రానికి శ్రీకృష్ణ బృందంరాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సంప్రదింపులు జరిపేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సోమవారం మరోమారు రాష్ట్రానికి రానుంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ కమిటీ హైదరాబాద్‌లో బస చేస్తుంది. ఇప్పటికే నాలుగు పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించిన కమిటీ ఈసారి పలు ఉద్యోగులు, ప్రజాసంఘాల వాదనలు విననుంది.Source: Yahoo! Telugu: News | 17 May 2010 | 6:42 am ఐష్ "ఎద" అందాల ప్రదర్శనలపై వ్యాఖ్యానించను: దీపికపాశ్చాత్య పోకడలంటే ఆట్టే తనకు కిట్టదని బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ దీపికా పదుకునే చెపుతోంది. అందువల్లనే కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో సంప్రదాయ చీర కట్టులో కన్పించానని చెప్పుకొచ్చింది. అంటే ఐశ్వర్యారాయ్ భారతీయ సంప్రదాయాలను పట్టించుకోవడం లేదనా...? అని ప్రశ్నిస్తే... ఒకరి పోకడలను గురించి తానెప్పుడూ వ్యాఖ్యానించనని చెప్పింది. 63వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్యారాయ్ తన ఎద సోయగాలను అలవోకగా ప్రదర్శిస్తూ గౌన్ ధరించి అభిమానులకు ఫ్లైయింగ్ కిస్‌లను ఇచ్చింది. ఇందుకు భిన్నంగా దీపికా పదుకునే నాజూకైన నడుము ఒంపులను ప్రదర్శిస్తూ చీర కట్టులో దర్శనమిచ్చింది. పరస్పర విరుద్ధంగా ఈ ఇద్దరూ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో కనిపించడంపై అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్ సినీ పరిశ్రమలు చర్చించుకోవడం మొదలు పెట్టాయి.Source: Yahoo! Telugu: Entertainment | 17 May 2010 | 5:23 am ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ టిక్కెట్ల విక్రయం నిలిపివేతఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చెందిన ఉన్నతాధికారులు కళ్లు తెరిచారు. నిన్నామొన్నిటివరకు స్టేషన్‌లో విపరీతమైన రద్దీ నెలకొన్నా పట్టించుకోని అధికారులు.. ఆదివారం జరిగిన తొక్కిసలాటతో నిద్రమత్తును వీడారు. ప్రయాణికుల రద్దీని నివారించేందుకు స్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం టిక్కెట్ల విక్రయాన్ని నిలిపి వేశారు.Source: జాతీయ | 17 May 2010 | 3:32 am వైఎస్ కోసం ఏ ఒక్కరూ మృతి చెందలేదు: ఎర్రబెల్లిదివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కోసం తమ జిల్లాలో ఏ ఒక్కరూ చనిపోలేదని తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అందువల్ల వైఎస్ తనయుడు వైఎస్.జగన్ తమ జిల్లాలో చేపట్టనున్న ఓదార్పు యాత్రను విరమించుకోవాలని ఆయన హితవు పలికారు. లేనిపక్షంలో తాము ఓదార్పు యాత్రను అడ్డుకుని తీరుతామని ఆయన సోమవారం స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 17 May 2010 | 1:29 am ఐదో దఫా సంప్రదింపులు: నేడు రాష్ట్రానికి శ్రీకృష్ణ బృందంరాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సంప్రదింపులు జరిపేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సోమవారం మరోమారు రాష్ట్రానికి రానుంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ కమిటీ హైదరాబాద్‌లో బస చేస్తుంది. ఇప్పటికే నాలుగు పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించిన కమిటీ ఈసారి పలు ఉద్యోగులు, ప్రజాసంఘాల వాదనలు విననుంది.Source: ఏపీ న్యూస్ | 17 May 2010 | 1:13 am గవర్నర్‌కు అధికారాలు ఉన్నాయి: మంత్రి మొయిలీరాష్ట్రాధినేతగా వ్యవహరించే గవర్నర్ తనకు కావాల్సిన సమాచారం కోసం మంత్రుల వద్ద వివరణ కోరే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందని కేంద్ర న్యాయశాఖామంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. ఈ చర్యలు తప్పుగా చూడాల్సిన అవసరం లేదన్నారు.Source: జాతీయ | 17 May 2010 | 12:55 am తెలంగాణను అడ్డుకునేందుకు 'చిరు'తో యాత్ర: యాష్కీప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు పెద్ద కుట్ర పన్నారని నిజామాబాద్ ఎంపీ మధు యాష్కీ ఆరోపించారు. ఇందుకోసం ఆ ప్రాంత నేతలంతా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో సమైక్యాంధ్ర ఉద్యమం చేయిస్తున్నారని సందేహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారందరికీ.. తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి, గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఆసన్నమైందని ఆయన జోస్యం చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 17 May 2010 | 12:25 am అగ్ని-2 క్షిపణి పరీక్ష విజయవంతం: రక్షణ ప్రతినిధిఅణ్వాయుధాలను మోసుకెళ్ళగలిగే మధ్యతరహాశ్రేణి క్షిపణి అగ్ని-2 ప్రయోగం విజయవంతమైంది. ఒడిషా రాష్ట్రంలోని బాలాసోర్ వీలర్ ద్వీపం నుంచి ఈ క్షిపణిని సోమవారం ఉదయం ప్రయోగించినట్టు రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు.Source: జాతీయ | 16 May 2010 | 11:50 pm శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న జయలలితతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సోమవారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చారు. ఇక్కడ కొలువుదీరివున్న నయనలింగేశ్వర స్వామికి ఆమె ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేసుకున్నారు. జయలలిత రాకను పురస్కరించుకుని ఆలయం పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బాంబు స్క్వాడ్ బృందాలతో అణువణువూ తనిఖీ చేశారు. ఆలయం వద్ద ఒక అదనపు ఎస్పీతో పాటు.. నలుగురు సీఐలు, ఎనిమిదిమంది ఎస్ఐలతో కలిపి వంద మంది పోలీసులతో భద్రతను కల్పించారు.Source: ఏపీ న్యూస్ | 16 May 2010 | 11:22 pm ఎర్రబెల్లి.. ఓ రాజకీయ వ్యభిచారి: కొండా సురేఖతెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక రాజకీయ వ్యభిచారి లాంటి వారని కాంగ్రెస్ మహిళా నేత, ఎమ్మెల్యే కొండా సురేఖ ఆరోపించారు. తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు, పరామర్శించేందుకు వైఎస్.జగన్ చేపట్టిన పర్యటనను అడ్డుకోవాలని ఎర్రబల్లి పిలుపునివ్వడం ఆయన స్వార్థపూరిత రాజకీయాలకు నిదర్శనమన్నారు.Source: ఏపీ న్యూస్ | 16 May 2010 | 11:08 pm ఎర్రబెల్లి దయాకర్... స్వరం తగ్గించుకో: హరికృష్ణతెలుగుదేశం పార్టీలో ప్రకటనల చిచ్చు ఆరంభమైంది. ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత నేతలు సీమాంధ్ర నేతల పర్యటలను అడ్డుకుంటామని ప్రకటనలు చేయడాన్ని స్వర్గీయ ఎన్టీఆర్ పెద్దకుమారుడు నందమూరి హరికృష్ణ తప్పుబట్టారు. పార్టీలో ఉంటూ ఇలాంటి విరుద్ధ ప్రకటనలు చేయరాదని తమ సొంత పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు హితవు పలికారు. అలా కాదనీ, పర్యటనలు అడ్డుకుంటే అది పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలను ధిక్కరించడమేనని హరికృష్ణ అన్నారు.Source: ఏపీ న్యూస్ | 16 May 2010 | 11:03 pm ఆగస్టు నుంచి మళ్లీ రామ మందిర ఉద్యమం: తొగాడియావచ్చే ఆగస్టు నుంచి మళ్లీ రామ మందిర ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా ప్రకటించారు. ఆయన ఆదివారం తిరువనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేయాలనే గట్టి సంకల్పం వీహెచ్‌పీకి ఉందన్నారు. దీన్ని నెరవేర్చేందుకు వచ్చే ఆగస్టు నుంచి తమ సంస్థ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టనున్నట్టు తెలిపారు.Source: జాతీయ | 16 May 2010 | 10:13 pm అల్‌ఖైదా తీవ్రవాద అనుబంధ సంస్థలపై కేంద్రం నిషేధంఅంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా సంస్థకు చెందిన అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టంలో సవరణలను ఆయుధంగా చేసుకుని ప్రపంచ తీవ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సంబంధం ఉన్న వంద ఉగ్రవాద సంస్థలపై కేంద్ర నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.Source: జాతీయ | 16 May 2010 | 10:06 pm ఈ రోజు ఆదివారం.. సెలవు రోజని అంటారు: చంద్రబాబురైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ముఖ్యమంత్రి కె.రోశయ్యను కోరితే ఈ రోజు ఆదివారం సెలవు రోజు కదా అని సీఎ సమాధానం ఇచ్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రైతుల సమస్యలపై ఆయన ఆదివారం ముఖ్యమంత్రి రోశయ్యతో బాబు భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అసమర్థతవల్లే రాష్ట్రంలో రైతులు రోడ్డున పడ్డారన్నారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని సీఎంను కోరినట్టు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 16 May 2010 | 6:06 am నీచాతి నీచుడు ఈ తెదేపా అధినేత : గాలి జనార్ధన్ రెడ్డిప్రస్తుత రాజకీయాల్లో నీచాతి నీచుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అని కర్ణాటక పర్యాటక శాఖామంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అన్నారు. ఓబుళాపురంలో బ్రహ్మణీ స్టీల్స్ ఆధ్వర్యంలో ఆదివారం 416 జంటలకు సామూహిక వివాహాలు జరిగాయి. ఈ శుభ కార్యక్రమంలో గాలి జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్దాలకు పుట్టినిల్లు, నీచాతి నీచుడు ఈ చంద్రబాబు నాయుడు అన్నారు. ఓబుళాపురం పేరు దేశ వ్యాప్తంగా మారు మ్రోగుతుందంటే అది చంద్రబాబు చలువేనన్నారు.Source: ఏపీ న్యూస్ | 16 May 2010 | 5:03 am ఛత్తీస్‌గఢ్‌లో ఆరుగురు గ్రామస్థులను హతమార్చిన మావోలుఛత్తీస్గఢ్లో మావోయిస్టులు నరమేథానికి పాల్పడ్డారు. పోలీసులకు ఇన్ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై గ్రామ పెద్దతో సహా ఆరుగురు గ్రామస్తులను ఊచకోత కోచారు. అలాగే, ఒడిషా రాష్ట్రంలో ఒక పోలీసు కానిస్టేబుల్‌ను మావోలు కాల్చి చంపారు. ఆ రాష్ట్ర రాజధాని 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్‌నందగాన్ జిల్లాలోని మన్పూర్ ఏరియాలోని ఉచ్చాపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు ఆ రాష్ట్ర డీజీపీ విశ్వరాజన్ వెల్లడించారు.Source: జాతీయ | 16 May 2010 | 4:24 am వైఎస్ రాముడు.. పొన్నాల లక్ష్మణుడు: ఎంపీ ఉండవల్లిదివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి రాముడు లాంటివాడని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాముడు లేకపోయినా.. ఆయన సోదరుడు లక్ష్ముణుడులాంటి పొన్నాల లక్ష్మయ్య మన వెంటే ఉన్నారన్నారు. ఈయన మంత్రిగా ఉన్న సమయంలోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.Source: ఏపీ న్యూస్ | 16 May 2010 | 2:37 am
|