ఈ రోజు ఆదివారం సెలవు రోజని అంటారు: చంద్రబాబు

రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ముఖ్యమంత్రి కె.రోశయ్యను కోరితే ఈ రోజు ఆదివారం సెలవు రోజు కదా అని సీఎ సమాధానం ఇచ్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రైతుల సమస్యలపై ఆయన ఆదివారం ముఖ్యమంత్రి రోశయ్యతో బాబు భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అసమర్థతవల్లే రాష్ట్రంలో రైతులు రోడ్డున పడ్డారన్నారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని సీఎంను కోరినట్టు చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 16 May 2010 | 9:21 am

వైఎస్ రాముడు.. పొన్నాల లక్ష్మణుడు: ఎంపీ ఉండవల్లి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి రాముడు లాంటివాడని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాముడు లేకపోయినా.. ఆయన సోదరుడు లక్ష్ముణుడులాంటి పొన్నాల లక్ష్మయ్య మన వెంటే ఉన్నారన్నారు. ఈయన మంత్రిగా ఉన్న సమయంలోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Source: Yahoo! Telugu: News | 16 May 2010 | 8:07 am

జగన్ యాత్రను అడ్డుకుంటే పుట్టగతులుండవ్: పొన్నాల

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టే ఓదార్పు యాత్రను అడ్డుకుంటే పుట్టగతులుండవని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక అశువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్న జగన్‌ను అడ్డుకోవడం సరైన చర్య కాదని ఆయన అన్నారు.
Source: Yahoo! Telugu: News | 16 May 2010 | 7:41 am

ఆప్ఘన్‌లోని భారతీయ సంస్థలపై దాడులకు ఐఎస్ఐ కుట్ర

ఆప్ఘనిస్థాన్‌లోని భారతీయ సంస్థలపై దాడులు జరిపేందుకు పాకిస్థాన్‌కు ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని భారత్‌కు చెందిన ఒక ఆంగ్ల పత్రికతో పాటు ఆప్ఘన్ భద్రతా ఏజెన్సీలు వెల్లడించాయి. దీంతో ఐఎస్ఐ కార్యకలాపాలపై మరో మారు ప్రశ్న తలెత్తింది. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్‌ పాకిస్థాన్‌లోని కోహాట్ అనే ప్రాంతంలో ఐఎస్ఐ భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా, ఆప్ఘన్‌లోని భారత్ సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ పథకం రూపకల్పన చేస్తున్నట్టు పేర్కొన్నాయి.
Source: Yahoo! Telugu: News | 16 May 2010 | 7:28 am

నటి ఖుష్బూపై జయ టీవీ ఆగ్రహం: యాంకర్‌కు స్వస్తి

సినీ నటి ఖుష్పూపై అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు చెందిన జయా టీవీ యాజమాన్యం కన్నెర్రజేసింది. జయా టీవీలో గత తొమ్మిది సంవత్సరాలుగా పాపులర్ అయిన రియాలటీ గే షో యాంకర్‌ నుంచి ఖుష్బూకు ఉద్వాసన పలికింది. జయా టీవీ పరిపాలనను జయలలిత ప్రియ నెచ్చలి శశికళ బంధువులు చూస్తున్న విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 16 May 2010 | 7:17 am

షెకావత్‌కు అద్వానీ-సుష్మా-గడ్కారీ ఘన నివాళులు

ఉపరాష్ట్రపతి, భారతీయ జనతా పార్టీ సీనియర్ భైరాన్ సింగ్ షెకావత్‌‌కు భాజపా అగ్రనేత ఎల్కే.అద్వానీతో పాటు ఆ పార్టీ లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, అధ్యక్షుడు నితిన్ గడ్కారీలు ఘనంగా నివాళులు అర్పించారు. భాజపా సీనియర్ నేతగా ఉన్న షెకావత్‌ రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పని చేసి రికార్డు సృష్టించారు.
Source: Yahoo! Telugu: News | 16 May 2010 | 7:03 am

బ్యాంకాక్‌లో ఆగని ఆందోళనలు: కర్ఫ్యూ దిశగా యోచన!

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో చెలరేగిన అల్లర్లు సద్దుమణగలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెడ్ షర్ట్ ఆందోళనకారులు చేపట్టిన నిరసన ఆందోళనకరంగా మారడంతో థాయ్ ఆర్మీ కాల్పులు జరుపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో 25 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఆందోళనను అణిచి వేసేందుకు మిలిటరీ ఆపరేషన్ చేపట్టాలని థాయ్ ప్రధాని అభిజిత్ వెజ్జాజివా భావిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 16 May 2010 | 6:49 am

భారత్‌లో పర్యటించనున్న కెనడా ఆర్థిక మంత్రి జిమ్

కెనడా ఆర్థిక మంత్రి జిమ్ ప్లహెర్టీ ఈ వారంలో భారత్‌ పర్యటనకు రానున్నారు. భారత్-కెనడా దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు ఆయన కృషి చేయనున్నారు. మూడు రోజుల పాటు న్యూఢిల్లీలో పర్యటించే ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా, ఇతర రాజకీయ, వాణిజ్య నేతలతో సమావేశం కానున్నారు. అలాగే, ఆయన ముంబై, ఢిల్లీలలో పర్యటించనున్నారు.
Source: Yahoo! Telugu: News | 16 May 2010 | 6:31 am

గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్న రతన్ టాటా

భారత అగ్రశ్రేణి పారిశ్రామికవేత్త, టాటా గ్రూపు ఛైర్మన్ రతన్ టాటా గ్లోబల్ ఇండియన్ అవార్డును స్వీకరించారు. అంతర్జాతీయ పారిశ్రామిక రంగంలో అద్భుత ప్రతిభ కనపరిచినందుకు గాను ఈ అవార్డు దక్కింది. టొరంటోలో జరిగిన ఒక కార్యక్రమంలో 2010 సంవత్సరానికి గాను సీఐఎఫ్ చెంచ్లాని గ్లోబల్ ఇండియన్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు కింద 225,000 అమెరికా డాలర్ల (రూ.కోటి) నగదు బహుమతిని అందజేశారు. దీన్ని కెనడా ఇండియా ఫౌండేషన్ వార్షిక అవార్డుల కార్యక్రమంలో అందజేసినట్టు కెనడా ఇండియా ఫౌండేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 16 May 2010 | 6:02 am

లేబర్ పార్టీలో చిచ్చు పెట్టిన బ్రిటన్ ఎన్నికల ఫలితాలు

బ్రిటన్‌ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు లేబర్ పార్టీలో చిచ్చుపెట్టాయి. ఈ పార్టీ నేతగా గోర్డాన్ బ్రౌన్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే. దీంతో పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు ప్రస్తుతం తీవ్ర పోటీ నెలకొంది. ఈ పార్టీలోని మిలిబాండ్ బ్రదర్స్‌గా పేరొందిన డేవిడ్ మిలిబాండ్, ఎడ్ మిలిబాండ్‌లు పోటీ పడుతున్నారు. పార్టీ అధ్యక్ష పగ్గాలు తమకు కావాలంటే తమకు కావాలని పట్టుబడుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 16 May 2010 | 5:39 am

ఈ రోజు ఆదివారం సెలవు రోజని అంటారు: చంద్రబాబు

రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ముఖ్యమంత్రి కె.రోశయ్యను కోరితే ఈ రోజు ఆదివారం సెలవు రోజు కదా అని సీఎ సమాధానం ఇచ్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రైతుల సమస్యలపై ఆయన ఆదివారం ముఖ్యమంత్రి రోశయ్యతో బాబు భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అసమర్థతవల్లే రాష్ట్రంలో రైతులు రోడ్డున పడ్డారన్నారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని సీఎంను కోరినట్టు చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 16 May 2010 | 3:52 am

వైఎస్ రాముడు.. పొన్నాల లక్ష్మణుడు: ఎంపీ ఉండవల్లి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి రాముడు లాంటివాడని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాముడు లేకపోయినా.. ఆయన సోదరుడు లక్ష్ముణుడులాంటి పొన్నాల లక్ష్మయ్య మన వెంటే ఉన్నారన్నారు. ఈయన మంత్రిగా ఉన్న సమయంలోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 16 May 2010 | 2:37 am

జగన్ యాత్రను అడ్డుకుంటే పుట్టగతులుండవ్: పొన్నాల

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టే ఓదార్పు యాత్రను అడ్డుకుంటే పుట్టగతులుండవని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక అశువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్న జగన్‌ను అడ్డుకోవడం సరైన చర్య కాదని ఆయన అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 May 2010 | 2:12 am

నటి ఖుష్బూపై జయ టీవీ ఆగ్రహం: యాంకర్‌కు స్వస్తి

సినీ నటి ఖుష్పూపై అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు చెందిన జయా టీవీ యాజమాన్యం కన్నెర్రజేసింది. జయా టీవీలో గత తొమ్మిది సంవత్సరాలుగా పాపులర్ అయిన రియాలటీ గే షో యాంకర్‌ నుంచి ఖుష్బూకు ఉద్వాసన పలికింది. జయా టీవీ పరిపాలనను జయలలిత ప్రియ నెచ్చలి శశికళ బంధువులు చూస్తున్న విషయం తెల్సిందే.
Source: జాతీయ | 16 May 2010 | 1:48 am

షెకావత్‌కు అద్వానీ-సుష్మా-గడ్కారీ ఘన నివాళులు

ఉపరాష్ట్రపతి, భారతీయ జనతా పార్టీ సీనియర్ భైరాన్ సింగ్ షెకావత్‌‌కు భాజపా అగ్రనేత ఎల్కే.అద్వానీతో పాటు ఆ పార్టీ లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, అధ్యక్షుడు నితిన్ గడ్కారీలు ఘనంగా నివాళులు అర్పించారు. భాజపా సీనియర్ నేతగా ఉన్న షెకావత్‌ రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పని చేసి రికార్డు సృష్టించారు.
Source: జాతీయ | 16 May 2010 | 1:33 am

బోఫోర్సు కేసులో సీబీఐ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కోర్టు

బోఫోర్సు కేసును ఉపసంహరించుకున్నట్టు సీబీఐ కోర్టుకు విన్నవించడాన్ని ఢిల్లీ కోర్టు వ్యతిరేకించింది. రెండు దశాబ్దాల పాటు కొనసాగిన బోఫోర్స్‌ కేసులో ఇటాలియన్‌ పారిశ్రామికవేత్త ఒట్టావియో ఖత్రోచికి ముడుపులు ముట్టాయని ఆరోపణలున్న విషయం తెల్సిందే. ఈ కేసును ఉపసంహరించుకుంటున్నట్టు సీబీఐ చేసిన విన్నపాన్ని తోసిపుచ్చిన మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ తదుపరి కేసు విచారణను జులై ఐదో తేదీకి వాయిదా వేసింది.
Source: జాతీయ | 16 May 2010 | 12:00 am

18 నుంచి ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టుల బంద్: కిషన్

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా ఈనెల 18వ తేదీ నుంచి 48 గంటల పాటు బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ బంద్ పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, బీహార్ రాష్ట్రాల్లో కొనసాగుతుందని మావోయిస్టు అగ్రనేత కిషన్ జీ వెల్లడించారు.
Source: జాతీయ | 15 May 2010 | 11:37 pm

తిరుపతిలో ప్రధాని మన్మోహన్, సోనియా గాంధీల పర్యటన!

దేశ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు యూపీఏ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం తిరుపతికి వచ్చే ప్రధాని, సోనియా గాంధీలు అంతర్జాతీయ విమానాశ్రయం, మన్నవరంలో బీహెచ్‌ఈఎల్-ఎన్‌టీపీసీ మెగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వ వర్గాల సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 15 May 2010 | 10:23 pm

కిమ్ శర్మ - కుక్కపిల్ల తోక.. అసలు సంగతి ఏంటంటే...?

ట్వంటీ-20 ప్రపంచకప్ పోటీల్లో పరాజయం పాలై భారత్‌కు బేల ముఖాలతో వచ్చిన టీం ఇండియాలో ఎడమచేతి బ్యాట్స్‌మన్ యువరాజ్ ప్రియురాలు కిమ్ శర్మ ఇటీవల ఓ హోటల్ ప్రధాన ద్వారం వద్ద హోటల్ సిబ్బందితో గొడవపడుతూ కనిపించింది. అసలు విషయం ఏంటంటే... ప్రముఖ పత్రిక ఫోటో షూట్‌కోసం ఎప్పటిలానే కిమ్ శర్మ తన విశాలమైన కారులో నుంచి హంసలా నడుచుకుంటూ నడుమును నాలుగు దిక్కులా తిప్పుతూ సదరు హోటల్ వద్దకు వెళ్లింది. కిమ్ శర్మను మాత్రమే లోపలికి అనుమతించి ఆమె వెనుకవైపు తోకూపుతూ వచ్చిన బుజ్జి కుక్కపిల్లను మాత్రం అనుమతించలేదు. అంతే కిమ్‌కు చిర్రెత్తింది. వెంటనే సిబ్బందిపై చడామడా అరిచి నానా యాగీ చేసింది. తన కుక్కపిల్లకు అనుమతిని నిరాకరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనీ, అయినా ఆ కుక్కపిల్ల కూడా తనతోపాటు ఫోటో షూట్‌లో పాల్గొనబోతోందని చెప్పింది.
Source: Yahoo! Telugu: Entertainment | 15 May 2010 | 10:56 am

తెలంగాణ ఇవ్వకుంటే మళ్లీ అగ్గిరాజేస్తాం : కేసీఆర్

శ్రీకృష్ణ కమిటీ నివేదికను సమర్పించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇవ్వక పోతే రాష్ట్రంలో మళ్లీ అగ్గి రాజేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. ఆయన శనివారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇవ్వకుంటే తీవ్ర పరిణాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు
Source: ఏపీ న్యూస్ | 15 May 2010 | 8:15 am

మిస్టరీ మేన్‌తో స్నేహా ఉల్లాల్ పెళ్లయి పోయిందట..?!!

కొన్ని రోజుల క్రితం ఓ మిస్టరీ మేన్‌తో స్నేహా ఉల్లాల్ కనబడింది. అతడెవరో చెప్పమంటే చెప్పకుండా దాచేసింది. ఆ తర్వాత సదరు మగాడిని చూద్దామన్నా ఉల్లాల్ ప్రక్కన ఎప్పుడూ కనిపించలేదు. అయితే అతగాడు స్నేహా ఉల్లాల్ భర్తని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలింతకీ ఆ మిస్టరీ మేన్ ఎవరై ఉంటారా... అని కొందరు కుర్ర జర్నలిస్టులు వెతికే పనిలో పడ్డారట. చివరికి వారు తేల్చిందేటయా... అంటే.. కొందరేమో అతగాడు జీవీకె ఇండస్ట్రీస్‌కు చెందినవాడని, మరికొందరేమో "మంచు" ఫ్యామిలీకి చెందినవాడని ఇలా రకరకాల వార్తలను మోసుకొచ్చారు. అయితే అసలు నిజం మాత్రం కనిపెట్టలేకపోయారు.స్నేహా ఉల్లాల్ మాత్రం ఇవన్నీ గాలి కబుర్లని తేలిగ్గా కొట్టి పారేసింది. సెలబ్రిటీలపై ఇటువంటి పనికిమాలిన వార్తలు పుట్టించడం కొంతమందికి వెన్నతో పెట్టిన విద్య అని రోజా పెదాలను అందంగా సాగదీసి మరీ చెప్పింది. ప్రస్తుతానికి ఉల్లాల్ చెప్పిందే నిజమని నమ్మేద్దాం.
Source: Yahoo! Telugu: Entertainment | 15 May 2010 | 7:28 am

"ఆవారా"లో తమన్నా వాన పాట "అదుర్స్"

హ్యాపిడేస్ చిత్రంతో ప్రేక్షకులకు ఖుషీ చేసిన తెల్లపిల్ల తమన్నా "ఆవారా" సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలుకరించేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ వచ్చిన తమన్నాతో మినీ ఇంటర్య్యూ...టాలీవుడ్ - కోలీవుడ్ దేనికి ప్రాధాన్యం...?నాకు రెండూ రెండు కళ్లు లాంటివి(నవ్వు)వానపాటలో తడుస్తూ నటించడం... అసలు వానపాటలో నటించనివారు హీరోయిన్‌గా ఎదగలేరు. నా చిన్నప్పుడు వేటగాడు చిత్రంలో శ్రీదేవి "ఆకుచాటు పిందె తడిసె.." వాన పాట చూసి ఎంతో ఇన్‌స్పైర్ అయ్యా. నటిగా అవకాశం వచ్చింది కనుక వానలో తడిసే సాంగ్‌ చేశానంతే.
Source: Yahoo! Telugu: Entertainment | 15 May 2010 | 5:48 am

ప్రభుత్వమంటే సింగిల్‌మేన్ షో కాదు: రోశయ్య

రాష్ట్ర ప్రభుత్వమంటే సింగిల్‌మేన్ షో కాదని ముఖ్యమంత్రి కె.రోశయ్య స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాల్లో శనివారం జరిగిన ప్రజాపథం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం, మంత్రివర్గం మంటే సింగిల్‌మెన్ షో కాదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 15 May 2010 | 5:48 am

ప్రభాస్ - కాజల్ అగర్వాల్ "డార్లింగ్" ట్రెయిలర్

ప్రభాస్ కథానాయకుడిగా కరుణాకరన్ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న డార్లింగ్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదలైంది. ఇటీవల ప్రభాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నన్ను చాలా అందంగా చూపించారు. బాడీ లాంగ్వేజ్ కూడా వెరైటీగా ఉంటుందని అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...
Source: Yahoo! Telugu: Entertainment | 15 May 2010 | 5:36 am

అది ముమ్మాటికీ ఉగ్రవాది వికారుద్దీన్ పనే: ఏకే.ఖాన్

పాతబస్తీలోని శాలిబండలో శుక్రవారం చోటు చేసుకున్న తుపాకీ కాల్పుల ఘటన పరారీలో ఉన్న ఉగ్రవాది వికారుద్దీన్ పనేనని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఏకే.ఖాన్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించినంత వరకు కొంతమంది వ్యక్తులు, సంస్థలపై అనుమానాలు ఉన్నాయన్నారు. వీరిని గుర్తించి, కేసులో పురోగతి సాధిస్తామని ఆయన శపథం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 15 May 2010 | 4:57 am

ఇండియన్ మెడికల్ కౌన్సిల్‌ను రద్దు చేసిన రాష్ట్రపతి

భారత వైద్య మండలి (ఇండియన్ మెడికల్ కౌన్సిల్)ని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ శనివారం రద్దు చేశారు. ఐఎంసీ ఛైర్మన్‌గా ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చిన కేతన్ దేశాయ్ కోట్లాది రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారు. పంజాబ్‌లోని ఒక దంత వైద్య కళాశాలకు అనుమతి ఇచ్చేందుకు రెండు కోట్ల రూపాయలు లంచం పుచ్చుకుంటూ ఏసీబీ అధికారులు చిక్కిన విషయం తెల్సిందే. దీంతో ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపారు.
Source: జాతీయ | 15 May 2010 | 4:20 am

త్వరలో కాంగ్రెస్ తెలంగాణ ఆత్మవిశ్వాస యాత్ర

త్వరలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు ఆత్మ విశ్వాస యాత్రను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సికింద్రాబాద్ ఎంపీ సర్వే సర్వే సత్యనారాయణ వెల్లడించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు శనివారం హైదరాబాద్‌లోని సర్వే సత్యనారాయణ ఇంటిలో భేటీ అయ్యారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఆధ్వర్యంలో తెలంగాణ ఆత్మ విశ్వాస యాత్ర పేరుతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు.
Source: ఏపీ న్యూస్ | 15 May 2010 | 4:07 am

జగన్ యాత్రను రాజకీయం చేయరాదు: కొండా సురేఖ

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను రాజకీయం చేయరాదని మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ హితవు పలికారు. వైఎస్ హఠాన్మరణంతో అశువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించి, ఆదుకునేందుకే జగన్ పర్యటిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అందువల్ల ఈ యాత్రలను అడ్డుకోరాదని కోరారు.
Source: ఏపీ న్యూస్ | 15 May 2010 | 4:07 am

వ్యంగ్యాస్త్రాలు మాని సమస్యలు పరిష్కరించండి: బాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వచ్చింది. తనపై ముఖ్యమంత్రి రోశయ్య సంధించిన వ్యంగ్యాస్త్రాలపై ఆయన ఘాటుగా స్పందించారు. తనపై అనుచితల వ్యాఖ్యలు మాని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని బాబు హితవు పలికారు.
Source: ఏపీ న్యూస్ | 15 May 2010 | 3:48 am

యూపీఏ సర్కారుకు అంశాలవారీ మద్దతు: ములాయం

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సంకీర్ణ సర్కారుకు అంశాలవారీ మద్దతును ఇవ్వనున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన కోత తీర్మానాల సమయంలో ఎస్పీ పార్టీ పరోక్షంగా మద్దతు తెలిపిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన శనివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాలియాలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి అంశాల వారీ మద్దతును కొనసాగించనున్నట్టు చెప్పారు.
Source: జాతీయ | 15 May 2010 | 3:17 am