త్వరలో కాంగ్రెస్ తెలంగాణ ఆత్మవిశ్వాస యాత్ర

త్వరలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు ఆత్మ విశ్వాస యాత్రను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సికింద్రాబాద్ ఎంపీ సర్వే సర్వే సత్యనారాయణ వెల్లడించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు శనివారం హైదరాబాద్‌లోని సర్వే సత్యనారాయణ ఇంటిలో భేటీ అయ్యారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఆధ్వర్యంలో తెలంగాణ ఆత్మ విశ్వాస యాత్ర పేరుతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు.
Source: Yahoo! Telugu: News | 15 May 2010 | 9:37 am

జగన్ యాత్రను రాజకీయం చేయరాదు: కొండా సురేఖ

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను రాజకీయం చేయరాదని మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ హితవు పలికారు. వైఎస్ హఠాన్మరణంతో అశువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించి, ఆదుకునేందుకే జగన్ పర్యటిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అందువల్ల ఈ యాత్రలను అడ్డుకోరాదని కోరారు.
Source: Yahoo! Telugu: News | 15 May 2010 | 9:24 am

వ్యంగ్యాస్త్రాలు మాని సమస్యలు పరిష్కరించండి: బాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వచ్చింది. తనపై ముఖ్యమంత్రి రోశయ్య సంధించిన వ్యంగ్యాస్త్రాలపై ఆయన ఘాటుగా స్పందించారు. తనపై అనుచితల వ్యాఖ్యలు మాని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని బాబు హితవు పలికారు.
Source: Yahoo! Telugu: News | 15 May 2010 | 9:17 am

యుద్ధనౌక మునకలో మా ప్రమేయం లేదు: ఉ కొరియా

దక్షిణ కొరియాకు చెందిన యుద్ధ నౌక సముద్ర జలాల్లో మునిగి పోయిన సంఘటనతో తమకు ఎలాంటి ప్రమేయం లేదని ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ II ఆ దేశ రాజధానిలో స్పష్టం చేశారు. ఈ అంశంలో దక్షిణ కొరియా తమను అపార్థం చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Source: Yahoo! Telugu: News | 15 May 2010 | 9:02 am

యూపీఏ సర్కారుకు అంశాలవారీ మద్దతు: ములాయం

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సంకీర్ణ సర్కారుకు అంశాలవారీ మద్దతును ఇవ్వనున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన కోత తీర్మానాల సమయంలో ఎస్పీ పార్టీ పరోక్షంగా మద్దతు తెలిపిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన శనివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాలియాలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి అంశాల వారీ మద్దతును కొనసాగించనున్నట్టు చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 15 May 2010 | 8:47 am

పట్టణాభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: మంత్రి సెల్జా

నగరాలు, పట్టణాలలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పట్టణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించిందని కేంద్ర పర్యాటక, పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కుమారి సెల్జా వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 15 May 2010 | 8:40 am

బాలయ్యా.. నీవేంటో నాకు తెలియదా: చంద్రబాబు

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చేపట్టిన పోలవరం యాత్రకు వస్తున్న అనూహ్య ప్రజాధారణకు చెక్ పెట్టేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వేసిన 'సింహా'స్త్రం (బాలకృష్ణ) చివరకు తన మెడకే చుట్టుకుంటుందని ఊహించలేక పోయాడు. ఫలితంగా.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సామెతగా.. చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో బాబు మునిగి పోయారు.
Source: Yahoo! Telugu: News | 15 May 2010 | 7:35 am

మిస్టరీ మేన్‌తో స్నేహా ఉల్లాల్ పెళ్లయి పోయిందట..?!!

కొన్ని రోజుల క్రితం ఓ మిస్టరీ మేన్‌తో స్నేహా ఉల్లాల్ కనబడింది. అతడెవరో చెప్పమంటే చెప్పకుండా దాచేసింది. ఆ తర్వాత సదరు మగాడిని చూద్దామన్నా ఉల్లాల్ ప్రక్కన ఎప్పుడూ కనిపించలేదు. అయితే అతగాడు స్నేహా ఉల్లాల్ భర్తని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలింతకీ ఆ మిస్టరీ మేన్ ఎవరై ఉంటారా... అని కొందరు కుర్ర జర్నలిస్టులు వెతికే పనిలో పడ్డారట. చివరికి వారు తేల్చిందేటయా... అంటే.. కొందరేమో అతగాడు జీవీకె ఇండస్ట్రీస్‌కు చెందినవాడని, మరికొందరేమో "మంచు" ఫ్యామిలీకి చెందినవాడని ఇలా రకరకాల వార్తలను మోసుకొచ్చారు. అయితే అసలు నిజం మాత్రం కనిపెట్టలేకపోయారు.స్నేహా ఉల్లాల్ మాత్రం ఇవన్నీ గాలి కబుర్లని తేలిగ్గా కొట్టి పారేసింది. సెలబ్రిటీలపై ఇటువంటి పనికిమాలిన వార్తలు పుట్టించడం కొంతమందికి వెన్నతో పెట్టిన విద్య అని రోజా పెదాలను అందంగా సాగదీసి మరీ చెప్పింది. ప్రస్తుతానికి ఉల్లాల్ చెప్పిందే నిజమని నమ్మేద్దాం.
Source: Yahoo! Telugu: Entertainment | 15 May 2010 | 7:28 am

అమెరికాపై దాడికి పాక్‌లో జీహాదీల కుట్ర: బ్రూస్ రీడల్

అమెరికాపై మరోమారు దాడి జరిపేందుకు పాకిస్థాన్ కేంద్రంగా కుట్ర జరుగుతోందని బ్రూకింగ్ సంస్థ పరిశోధకుడు బ్రూస్ రీడల్ హెచ్చరించారు. ఈ కుట్రలో అల్‌ఖైదా, తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్ సంస్థలతో పాటు ముస్లిం జీహాదీ సంస్థలన్నీ ఏకమైన అమెరికాను బద్ధ శత్రువుగా చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ కలిసి అమెరికాలో మారణహోమం సృష్టించే పనిలో నిమగ్నమై ఉన్నట్టు చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 15 May 2010 | 7:10 am

అక్షయతృతీయ ఫెస్టివల్ స్పెషల్: గోల్డ్ కాయిన్స్ ఫర్ సేల్

అక్షయతృతీయ పండుగనాడు పసిడిని కొనుగోలు చేస్తే వారి ఇంట సిరులు కురుస్తాయన్న నమ్మకం హిందువులలో ఉన్నది. ఈ పండుగ రేపు.. అంటే 16వ తేదీ ఆదివారం. ఈ పండుగ సందర్భంగా బంగారు కొనుగోళ్ల డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి.
Source: Yahoo! Telugu: News | 15 May 2010 | 6:34 am

అపరచాణక్యుడు.. సమస్య పరిష్కారంలో దిట్ట షెకావత్

దేశ రాజకీయాల్లో మరో ధృవతార రాలిపోయింది. అపరచాణుక్యుడిగా, రాజనీతిజ్ఞుడిగా, సమస్యల పరిష్కారంలో పేరుమోసిన దిట్టగా ఖ్యాతిగడించిన మాజీ ఉపరాష్ట్రపతి, భారతీయ జనతా పార్టీ దిగ్గజం భైరాన్ సింగ్ షెకావత్ శనివారం తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రానికి సుదీర్ఘ కాలంగా ముఖ్యమంత్రిగా పని చేసిన ఘనతను సంపాదించుకున్న ఈయన... గత ఎన్డీయే హయాంలో దేశ ఉప రాష్ట్రపతిగా నియమితులయ్యారు.
Source: Yahoo! Telugu: News | 15 May 2010 | 6:33 am

"ఆవారా"లో తమన్నా వాన పాట "అదుర్స్"

హ్యాపిడేస్ చిత్రంతో ప్రేక్షకులకు ఖుషీ చేసిన తెల్లపిల్ల తమన్నా "ఆవారా" సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలుకరించేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ వచ్చిన తమన్నాతో మినీ ఇంటర్య్యూ...టాలీవుడ్ - కోలీవుడ్ దేనికి ప్రాధాన్యం...?నాకు రెండూ రెండు కళ్లు లాంటివి(నవ్వు)వానపాటలో తడుస్తూ నటించడం... అసలు వానపాటలో నటించనివారు హీరోయిన్‌గా ఎదగలేరు. నా చిన్నప్పుడు వేటగాడు చిత్రంలో శ్రీదేవి "ఆకుచాటు పిందె తడిసె.." వాన పాట చూసి ఎంతో ఇన్‌స్పైర్ అయ్యా. నటిగా అవకాశం వచ్చింది కనుక వానలో తడిసే సాంగ్‌ చేశానంతే.
Source: Yahoo! Telugu: Entertainment | 15 May 2010 | 5:48 am

ప్రభాస్ - కాజల్ అగర్వాల్ "డార్లింగ్" ట్రెయిలర్

ప్రభాస్ కథానాయకుడిగా కరుణాకరన్ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న డార్లింగ్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదలైంది. ఇటీవల ప్రభాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నన్ను చాలా అందంగా చూపించారు. బాడీ లాంగ్వేజ్ కూడా వెరైటీగా ఉంటుందని అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...
Source: Yahoo! Telugu: Entertainment | 15 May 2010 | 5:36 am

త్వరలో కాంగ్రెస్ తెలంగాణ ఆత్మవిశ్వాస యాత్ర

త్వరలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు ఆత్మ విశ్వాస యాత్రను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సికింద్రాబాద్ ఎంపీ సర్వే సర్వే సత్యనారాయణ వెల్లడించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు శనివారం హైదరాబాద్‌లోని సర్వే సత్యనారాయణ ఇంటిలో భేటీ అయ్యారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఆధ్వర్యంలో తెలంగాణ ఆత్మ విశ్వాస యాత్ర పేరుతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు.
Source: ఏపీ న్యూస్ | 15 May 2010 | 4:07 am

జగన్ యాత్రను రాజకీయం చేయరాదు: కొండా సురేఖ

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను రాజకీయం చేయరాదని మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ హితవు పలికారు. వైఎస్ హఠాన్మరణంతో అశువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించి, ఆదుకునేందుకే జగన్ పర్యటిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అందువల్ల ఈ యాత్రలను అడ్డుకోరాదని కోరారు.
Source: ఏపీ న్యూస్ | 15 May 2010 | 4:07 am

వ్యంగ్యాస్త్రాలు మాని సమస్యలు పరిష్కరించండి: బాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వచ్చింది. తనపై ముఖ్యమంత్రి రోశయ్య సంధించిన వ్యంగ్యాస్త్రాలపై ఆయన ఘాటుగా స్పందించారు. తనపై అనుచితల వ్యాఖ్యలు మాని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని బాబు హితవు పలికారు.
Source: ఏపీ న్యూస్ | 15 May 2010 | 3:48 am

యూపీఏ సర్కారుకు అంశాలవారీ మద్దతు: ములాయం

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సంకీర్ణ సర్కారుకు అంశాలవారీ మద్దతును ఇవ్వనున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన కోత తీర్మానాల సమయంలో ఎస్పీ పార్టీ పరోక్షంగా మద్దతు తెలిపిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన శనివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాలియాలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి అంశాల వారీ మద్దతును కొనసాగించనున్నట్టు చెప్పారు.
Source: జాతీయ | 15 May 2010 | 3:17 am

బాలయ్యా.. నీవేంటో నాకు తెలియదా: చంద్రబాబు

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చేపట్టిన పోలవరం యాత్రకు వస్తున్న అనూహ్య ప్రజాధారణకు చెక్ పెట్టేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వేసిన 'సింహా'స్త్రం (బాలకృష్ణ) చివరకు తన మెడకే చుట్టుకుంటుందని ఊహించలేక పోయాడు. ఫలితంగా.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సామెతగా.. చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో బాబు మునిగి పోయారు.
Source: ఏపీ న్యూస్ | 15 May 2010 | 2:10 am

అపరచాణక్యుడు.. సమస్య పరిష్కారంలో దిట్ట షెకావత్

దేశ రాజకీయాల్లో మరో ధృవతార రాలిపోయింది. అపరచాణుక్యుడిగా, రాజనీతిజ్ఞుడిగా, సమస్యల పరిష్కారంలో పేరుమోసిన దిట్టగా ఖ్యాతిగడించిన మాజీ ఉపరాష్ట్రపతి, భారతీయ జనతా పార్టీ దిగ్గజం భైరాన్ సింగ్ షెకావత్ శనివారం తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రానికి సుదీర్ఘ కాలంగా ముఖ్యమంత్రిగా పని చేసిన ఘనతను సంపాదించుకున్న ఈయన... గత ఎన్డీయే హయాంలో దేశ ఉప రాష్ట్రపతిగా నియమితులయ్యారు.
Source: జాతీయ | 15 May 2010 | 1:07 am

శాలిబండ కేసు దర్యాప్తు సిట్‌కు బదిలీ: ఏకే.ఖాన్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పాతబస్తీ, శాలిబండ వద్ద శుక్రవారం జరిగిన కాల్పుల కేసును ప్రత్యేక దర్యాప్తు (సిట్)కు అప్పగించినట్టు నగర కమిషనర్ ఏకే.ఖాన్ వెల్లడించారు. దీనిపై ఆయన శనివారం మాట్లాడుతూ కేసులో త్వరితగతిన పురోగతి సాధించేందుకు సిట్‌కు అప్పగించినట్టు ఆయన తెలిపారు. అలాగే, ఈ కాల్పుల్లో పోలీసుల చేతికి కీలక ఆధారాలు లభ్యమైనట్టు వెల్లడించారు. కాల్పులకు ముందు ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
Source: ఏపీ న్యూస్ | 15 May 2010 | 12:40 am

వాడికి అంత సీను లేదని చెపితే వినరే: చిరంజీవి

తన కుమారుడు, జూనియర్ మెగాస్టార్ రామ్ చరణ్ తేజ్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో పెట్టుబడులు పెట్టే సీన్ (స్థాయి) లేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత, హీరో తండ్రి చిరంజీవి స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలు ఓ అభూత కల్పనలుగా ఆయన కొట్టిపారేశారు.
Source: ఏపీ న్యూస్ | 15 May 2010 | 12:28 am

మాజీ ఉప రాష్ట్రపతి భైరాన్ సింగ్ షెకావత్ కన్నుమూత

మాజీ ఉపరాష్ట్రపతి భైరాన్ సింగ్ షెకావత్ జైపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన శ్వాస సంబంధ, ఇతర అనారోగ్య కారణాలతో జైపూర్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే.
Source: జాతీయ | 14 May 2010 | 11:56 pm

చిరు యాత్రలకు జడుస్తున్న కాంగ్రెస్-తెదేపాలు

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చేపట్టిన పోలవరం బస్సు యాత్ర రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీల నేతల్లో గుబులు పుట్టిస్తోంది. యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలను సైతం లెక్క చేయకుండా చిరంజీవి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సకల సదుపాయాలతో ఏసీ గదుల్లో సేదతీరే చిరంజీవి.. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఒక సామాన్యుడిలా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు, వారితో మమేకమయ్యేందుకు అహర్నిశలు పరితపిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 14 May 2010 | 11:10 pm

గోద్రా అల్లర్లు: సుప్రీంకు నివేదిక సమర్పించిన సిట్

గోద్రా అల్లర్ల వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుప్రీంకోర్టుకు శుక్రవారం తన నివేదికను సమర్పించింది. గోద్రా సంఘటన తర్వాత చెలరేగిన అల్లర్లలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రి హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ హత్య కేసుతో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హస్తం ఉన్నట్టు జాఫ్రి భార్య సుప్రంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
Source: జాతీయ | 14 May 2010 | 10:18 pm

నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే బెంగాల్ ఎన్నికలు: బోస్

పశ్చిమబెంగాల్‌లో నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆ రాష్ట్ర అధికార లెఫ్ట్ ఫ్రంట్ ఛైర్మన్ బిమన్ బోస్ స్పష్టం చేశారు. 2011 సంవత్సరం కంటే ముందుగా ఎన్నికలకు వెళ్లే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని ఆయన తేల్చి చెప్పారు.
Source: జాతీయ | 14 May 2010 | 10:08 pm

ఇప్పటివరకూ ప్రేమికుడు తారస పడలేదు: కాజల్

ఇప్పటివరకూ తనకు ఎదురపడ్డ వాళ్లందరిలోనూ స్నేహితుడ్నే చూశాననీ, ప్రేమికుడు, లైఫ్ పార్టనర్‌గా చూడలేదని నటి కాజల్ అగర్వాల్ నొక్కి వక్కాణిస్తోంది. అలా చూసిన రోజు సదరు వ్యక్తితో తప్పకుండా తలవంచుకుని తాళికట్టించుకుంటానంటోంది. సినిమాల్లో చూపిన విధంగా లైఫ్‌లో జరుగదనీ, సినిమాల్లో చూపినంతగా ఫీలయ్యే వ్యక్తి దొరకడం అదృష్టమనీ చెపుతోంది. అయితే ఇప్పుడప్పుడే తాను ఆ విషయంపై ఆలోచించలేననీ, కెరీర్‌పైనే తన ధ్యాసంతా అని చెప్పింది. లేటెస్ట్‌గా సూపర్‌గుడ్ బ్యానర్‌లో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ప్రభాస్ తాజా చిత్రంలోనూ బుక్ అయింది. ప్రస్తుతం సినిమాల బిజీలో ఉన్నానని చెప్పింది.
Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2010 | 11:53 am

కరుణానిధి సమక్షంలో డీఎంకేలో చేరిన సినీనటి ఖుష్భూ

పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదని సంచలన వ్యాఖ్యలు చేసి, ఆ తర్వాత ఆ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సమర్థించడంతో విజయంతో తలెత్తుక తిరుగుతున్న ఖుష్భూ డీఎంకే తీర్థం పుచ్చుకున్నది.
Source: జాతీయ | 14 May 2010 | 8:59 am

తెలంగాణా ప్రజలు తమ "పవర్" చూపించాలి: కేసీఆర్

తెలంగాణా సాధనకుగాను తెలంగాణా ప్రాంత నాయకులు తమ పదవులను త్యాగం చేసిన స్థానాల్లో తెలంగాణా ఐకాస సూచించిన అభ్యర్థుల తప్ప వేరెవరైనా పోటీకి నిలబడితే డిపాజిట్లు గల్లంతవుతాయని తెరాస చీఫ్ కేసీఆర్ అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 14 May 2010 | 8:56 am

బస్సుపై తెగిపడ్డ హైటెన్సన్ తీగ: 28మంది దుర్మరణం

మధ్యప్రదేశ్‌లోని మాండ్లలో శుక్రవారం ఓ బస్సుపై హైటెన్సన్ వైరు తెగిపడిన దుర్ఘనటలో 28మంది దుర్మరణం పాలయ్యారు. ఓ పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సుపై విద్యుత్ వైరు తెగిపడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Source: జాతీయ | 14 May 2010 | 8:38 am

వికారుద్ధీన్ పనేనని అనుమానిస్తున్నాం..!: ఏకే ఖాన్

శాలిబండ ఓల్గాకేఫ్ వద్ద కానిస్టేబుళ్లపై కాల్పులు జరిపింది వికారుద్ధీన్ పనేనని అనుమానిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఏకేఖాన్ మీడియాతో అన్నారు. నెలరోజులుగా పాతబస్తీలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఓల్గా కేఫ్ కాల్పులకు ఒడిగట్టిన దుండగుల కోసం గాలిస్తున్నామని, విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏకేఖాన్ స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 14 May 2010 | 7:50 am

సెక్స్ సీన్లలో నటించేందుకు నేను రెడీ: "అవతార్" సల్దానా

హాలీవుడ్ హాట్ నటి జోయ్ సల్దానా తన కెరీర్‌లో ఇప్పటివరకూ ఒక్క సెక్స్ సన్నివేశంలోనూ నటించకపోవడంపై చాలా బాధగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేసింది. హాలీవుడ్ నటి అన్నాక ఖచ్చితంగా రెచ్చగొట్టే సెక్స్ సన్నివేశంలో నటించి తీరాలనీ, అప్పుడే తగిన గుర్తింపు వస్తుందని ఈ బ్లాక్ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఇప్పటికిప్పుడు తనతో ఎవరైనా సెక్స్ చిత్రాన్ని చేయాలని సంకల్పిస్తే అందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించింది. సల్దానా కోరికను తెలుసుకున్న హాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెతో ఏ తరహా సెక్స్ చిత్రం చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.ఇదిలావుంటే సెక్స్ చిత్రం చేయాలని ఎందుకు కోరుకుంటున్నావని సల్దానాను ప్రశ్నిస్తే... తను ఇప్పటివరకూ హింసాత్మక చిత్రాల్లో నటించాననీ, ఆ చిత్రాల్లో తుపాకుల మోతలు, గుఱ్ఱపు డెక్కల చప్పుళ్లతో విసిగి పోయానని అంటోంది. అందుకే కాస్త డైవర్షన్ తీసుకుని సెక్స్ చిత్రం చేయాలనుకుంటున్నట్లు ప్రకటించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2010 | 7:37 am

జార్ఖండ్ మాజీముఖ్యమంత్రి మధుకొడా బెయిల్ తిరస్కృతి

అక్రమ ఆస్తులు కలిగి ఉన్న కేసులో అరెస్టు కాబడిన జార్ఖండ్ మాజీముఖ్యమంత్రి మధుకొడా బెయిల్ పిటిషన్‌ను స్పెషల్ విజిలెన్స్ కోర్టు తిరస్కరించింది. మధుకొడాకు ఈ ఏడాది నవంబరు 30 వరకూ జ్యుడిషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 14 May 2010 | 7:18 am

ఓల్గా హోటల్ వద్ద కాల్పులు: ఓ కానిస్టేబుల్ మృతి!

రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌కు తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో.. ఐఎస్ఐ ఏజెంట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. శాలిబండ ఓల్గా హోటల్ దగ్గర స్కూటర్‌పై వచ్చిన ఆచూకీ తెలియని దుండగులు బందోబస్తులో ఉన్నఏపీఎస్పీ కానిస్టేబుళ్లపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రంగా గాయాలయ్యారు. వీరిలో ఓ కానిస్టేబుల్ రమేష్ మరణించగా., మరో కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 14 May 2010 | 6:40 am

సంసార రుచులు చూశాకే ఏదైనా...: సింధుమీనన్

ఎంబీఎ పూర్తి చేసిన నటి సింధుమీనన్ "చందమామ" చిత్రంలో చలాకీగా నటించింది. తాజాగా ఆమె నటించిన చిత్రాలు "ప్రేమ పిలుస్తోంది", "సుభద్ర" విడుదల కావాల్సి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ భామ వివాహ ప్రయత్నాల్లో జోరుగా ఉంది. దీని గురించి ఆమెను అడిగితే.. ఆయన లండన్‌లో స్థిరపడ్డారు. అందుకే నేను కూడా అక్కడికి వెళ్లాలి. సంసార రుచులు చూశాక ఎప్పుడైనా బోర్ కొడితే నటిస్తానేమో. అంతవరకూ నటనకు బ్రేక్ పడినట్లేనని స్పష్టం చేసింది. పెళ్లి త్వరలో చేసుకుంటాననీ, వివరాలు అతిత్వరలో వెల్లడిస్తానని అంది.
Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2010 | 5:44 am

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దీపక్ మిశ్రా!

దేశ రాజధాని న్యూఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ దీపక్ మిశ్రా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన దీపక్ మిశ్రాకు 56 సంవత్సరాలు. పాట్నా హైకోర్టు చీఫ్ జస్టీస్‌గా కొనసాగిన దీపక్ మిశ్రా మే 28వ తేదీ నుంచి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారని తెలిసింది.
Source: జాతీయ | 14 May 2010 | 3:59 am