ఆస్ట్రేలియాలో ప్రతి రోజు 1,100 మందికి ఉద్యోగాలు

ఆస్ట్రేలియాలో ప్రతి రోజు 1,100 మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఆ దేశ కార్మిక శాఖ ప్రకటించింది. కార్మిక శాఖ ప్రకటించిన వివరాల మేరకు వివిధ రంగాల్లో ఉద్యోగులను నియమిస్తున్నారు. ఏప్రిల్ నెలలో 37,500 మందిని నియమించారు. మార్చి నెలలో 37,400 ఉద్యోగులను నియమించడం జరిగింది.
Source: Yahoo! Telugu: News | 14 May 2010 | 9:40 am

ఏటీఎంలలో డబ్బుల్నే కాదు.. బంగారాన్ని కూడా తీసుకోవచ్చు

యూఏఈలోని అబుదాబీలోనున్న ఓ హోటల్లో ఇలాంటి గోల్డ్ డిస్పెన్సరీ మెషీన్‌ను ఏర్పాటు చేశారు. చూడ్డానికి ఇది ఎటిఎం మిషన్‌లాంటి తరహాలోనే ఉంది. కాని ఇందులో డబ్బులు లేదా కార్డును వేస్తే అంతే విలవ కలిగిన బంగారు బిస్కెట్లు బయటకు వస్తాయి.
Source: Yahoo! Telugu: News | 14 May 2010 | 9:26 am

ఒబామా హత్యకు ఇండోనేషియా తీవ్రవాదుల కుట్ర..!

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హత్యకు ఇండోనేషియా తీవ్రవాదులు కుట్ర పన్నారని వార్తలు వస్తున్నాయి. అగ్రరాజ్య నాయకుడిగా అమెరికాను సమర్థవంతంగా పాలిస్తున్న నల్లజాతీయుడు బరాక్ ఒబామాను కాల్చి చంపేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇండోనేషియా తీవ్రవాదుల వద్ద లభించిన ముఖ్య ఆధారాల ద్వారా ఈ విషయం బయటపడినట్లు తెలుస్తోంది.
Source: Yahoo! Telugu: News | 14 May 2010 | 9:18 am

తెలంగాణా ప్రజలు తమ "పవర్" చూపించాలి: కేసీఆర్

తెలంగాణా సాధనకుగాను తెలంగాణా ప్రాంత నాయకులు తమ పదవులను త్యాగం చేసిన స్థానాల్లో తెలంగాణా ఐకాస సూచించిన అభ్యర్థుల తప్ప వేరెవరైనా పోటీకి నిలబడితే డిపాజిట్లు గల్లంతవుతాయని తెరాస చీఫ్ కేసీఆర్ అన్నారు.
Source: Yahoo! Telugu: News | 14 May 2010 | 9:14 am

నష్టాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్

వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలతో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో 175 పాయింట్ల మేర క్షీణించింది. దీంతో సెన్సెక్స్ సూచి 17,090 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 65 పాయింట్లు పడిపోయి, 5,113 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 14 May 2010 | 9:05 am

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దీపక్ మిశ్రా!

దేశ రాజధాని న్యూఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ దీపక్ మిశ్రా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన దీపక్ మిశ్రాకు 56 సంవత్సరాలు. పాట్నా హైకోర్టు చీఫ్ జస్టీస్‌గా కొనసాగిన దీపక్ మిశ్రా మే 28వ తేదీ నుంచి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారని తెలిసింది.
Source: Yahoo! Telugu: News | 14 May 2010 | 8:59 am

ఆఫ్గన్‌లో సైన్యాన్ని ఉపసంహరించేది లేదుః బ్రిటన్

ఆఫ్గనిస్థాన్‌లో తమ లక్ష్యాన్ని పూర్తి చేసేంత వరకు సైన్యాన్ని వెనక్కు పిలిపించేది లేదని బ్రిటీష్ విదేశాంగ శాఖ కార్యదర్శి విలియమ్ హాగ్యూ లండన్‌లో తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 14 May 2010 | 8:51 am

బస్సుపై తెగిపడ్డ హైటెన్సన్ వైరు: 28మంది దుర్మరణం

మధ్యప్రదేశ్‌లోని మాండ్లలో శుక్రవారం ఓ బస్సుపై హైటెన్సన్ వైరు తెగిపడిన దుర్ఘనటలో 28మంది దుర్మరణం పాలయ్యారు. ఓ పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సుపై విద్యుత్ వైరు తెగిపడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 14 May 2010 | 8:33 am

సింగపూర్ మాజీ ఉప ప్రధాని గో కెంగ్ స్వీ కన్నుమూత

సింగపూర్ మాజీ ఉప ప్రధానమంత్రి గో కెంగ్ స్వీ శుక్రవారం తెల్లవారు జామున కన్ను మూశారు. ఆయన వయసు 91. గో కెంగ్ స్వీకి భార్య, కొడుకు-కోడలు, ఇద్దరు మనవళ్ళతోపాటు మరో ముగ్గురు మునిమనవళ్ళున్నట్లు న్యూస్ ఆసియా ఛానెల్ ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 14 May 2010 | 8:32 am

నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ పతనం

శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్‌కు కలిసిరాలేదు. ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభనష్టాలతో పయనిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 85 పాయింట్లు పడిపోయి, 17,180 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 43 పాయింట్లు క్షీణించి, 5,135 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 14 May 2010 | 7:45 am

సెక్స్ సీన్లలో నటించేందుకు నేను రెడీ: "అవతార్" సల్దానా

హాలీవుడ్ హాట్ నటి జోయ్ సల్దానా తన కెరీర్‌లో ఇప్పటివరకూ ఒక్క సెక్స్ సన్నివేశంలోనూ నటించకపోవడంపై చాలా బాధగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేసింది. హాలీవుడ్ నటి అన్నాక ఖచ్చితంగా రెచ్చగొట్టే సెక్స్ సన్నివేశంలో నటించి తీరాలనీ, అప్పుడే తగిన గుర్తింపు వస్తుందని ఈ బ్లాక్ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఇప్పటికిప్పుడు తనతో ఎవరైనా సెక్స్ చిత్రాన్ని చేయాలని సంకల్పిస్తే అందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించింది. సల్దానా కోరికను తెలుసుకున్న హాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెతో ఏ తరహా సెక్స్ చిత్రం చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.ఇదిలావుంటే సెక్స్ చిత్రం చేయాలని ఎందుకు కోరుకుంటున్నావని సల్దానాను ప్రశ్నిస్తే... తను ఇప్పటివరకూ హింసాత్మక చిత్రాల్లో నటించాననీ, ఆ చిత్రాల్లో తుపాకుల మోతలు, గుఱ్ఱపు డెక్కల చప్పుళ్లతో విసిగి పోయానని అంటోంది. అందుకే కాస్త డైవర్షన్ తీసుకుని సెక్స్ చిత్రం చేయాలనుకుంటున్నట్లు ప్రకటించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2010 | 7:37 am

సంసార రుచులు చూశాకే ఏదైనా...: సింధుమీనన్

ఎంబీఎ పూర్తి చేసిన నటి సింధుమీనన్ "చందమామ" చిత్రంలో చలాకీగా నటించింది. తాజాగా ఆమె నటించిన చిత్రాలు "ప్రేమ పిలుస్తోంది", "సుభద్ర" విడుదల కావాల్సి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ భామ వివాహ ప్రయత్నాల్లో జోరుగా ఉంది. దీని గురించి ఆమెను అడిగితే.. ఆయన లండన్‌లో స్థిరపడ్డారు. అందుకే నేను కూడా అక్కడికి వెళ్లాలి. సంసార రుచులు చూశాక ఎప్పుడైనా బోర్ కొడితే నటిస్తానేమో. అంతవరకూ నటనకు బ్రేక్ పడినట్లేనని స్పష్టం చేసింది. పెళ్లి త్వరలో చేసుకుంటాననీ, వివరాలు అతిత్వరలో వెల్లడిస్తానని అంది.
Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2010 | 5:44 am

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దీపక్ మిశ్రా!

దేశ రాజధాని న్యూఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ దీపక్ మిశ్రా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన దీపక్ మిశ్రాకు 56 సంవత్సరాలు. పాట్నా హైకోర్టు చీఫ్ జస్టీస్‌గా కొనసాగిన దీపక్ మిశ్రా మే 28వ తేదీ నుంచి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారని తెలిసింది.
Source: జాతీయ | 14 May 2010 | 3:59 am

తెలంగాణా ప్రజలు తమ "పవర్" చూపించాలి: కేసీఆర్

తెలంగాణా సాధనకుగాను తెలంగాణా ప్రాంత నాయకులు తమ పదవులను త్యాగం చేసిన స్థానాల్లో తెలంగాణా ఐకాస సూచించిన అభ్యర్థుల తప్ప వేరెవరైనా పోటీకి నిలబడితే డిపాజిట్లు గల్లంతవుతాయని తెరాస చీఫ్ కేసీఆర్ అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 14 May 2010 | 3:44 am

కాంగ్రెస్‌కు ఉద్యమాలను నీరుగార్చే అలవాటుంది: చిరు

కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉద్యమాలను నీరుగార్చే అలవాటుందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి విమర్శించారు. ఉద్యమాలకు అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలే ముందున్నాయని చిరంజీవి వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని విధాలా అనుమతులు ఉన్నాయని, ఈ అంశంపై తెలంగాణ రాష్ట్రసమితి చేస్తున్న విమర్శలు వాస్తవం కాదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 14 May 2010 | 3:18 am

బస్సుపై తెగిపడ్డ హైటెన్సన్ వైరు: 28మంది దుర్మరణం

మధ్యప్రదేశ్‌లోని మాండ్లలో శుక్రవారం ఓ బస్సుపై హైటెన్సన్ వైరు తెగిపడిన దుర్ఘనటలో 28మంది దుర్మరణం పాలయ్యారు. ఓ పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సుపై విద్యుత్ వైరు తెగిపడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Source: జాతీయ | 14 May 2010 | 3:04 am

సెక్స్ సీన్లలో నటించేందుకు నేను రెడీ: "అవతార్" సల్దానా

హాలీవుడ్ హాట్ నటి జోయ్ సల్దానా తన కెరీర్‌లో ఇప్పటివరకూ ఒక్క సెక్స్ సన్నివేశంలోనూ నటించకపోవడంపై చాలా బాధగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేసింది. హాలీవుడ్ నటి అన్నాక ఖచ్చితంగా రెచ్చగొట్టే సెక్స్ సన్నివేశంలో నటించి తీరాలనీ, అప్పుడే తగిన గుర్తింపు వస్తుందని ఈ బ్లాక్ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఇప్పటికిప్పుడు తనతో ఎవరైనా సెక్స్ చిత్రాన్ని చేయాలని సంకల్పిస్తే అందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించింది. సల్దానా కోరికను తెలుసుకున్న హాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెతో ఏ తరహా సెక్స్ చిత్రం చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.ఇదిలావుంటే సెక్స్ చిత్రం చేయాలని ఎందుకు కోరుకుంటున్నావని సల్దానాను ప్రశ్నిస్తే... తను ఇప్పటివరకూ హింసాత్మక చిత్రాల్లో నటించాననీ, ఆ చిత్రాల్లో తుపాకుల మోతలు, గుఱ్ఱపు డెక్కల చప్పుళ్లతో విసిగి పోయానని అంటోంది. అందుకే కాస్త డైవర్షన్ తీసుకుని సెక్స్ చిత్రం చేయాలనుకుంటున్నట్లు ప్రకటించింది.
Source: వినోదం | 14 May 2010 | 2:08 am

బాబును నేనెప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదు: సీఎం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తానెప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. చంద్రబాబు నాయుడుకి మతి భ్రమించిందని సీఎం ధ్వజమెత్తారు. కానీ ఆయన పరిస్థితి చూస్తే చాలా జాలేస్తోందని రోశయ్య చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 14 May 2010 | 1:59 am

రేపటిలోగా ఏజెన్సీ నేతలు రాజీనామా చేయాలి: మావోలు

విశాఖపట్నం ఏజెన్సీ నేతలకు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ సరిహద్దుల్లో మావోయిస్టుల దుశ్చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇందులో భాగంగా ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ.. రేపటిలోగా విశాఖ ఏజెన్సీలోని ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలని మావోయిస్టులు హెచ్చరించారు.
Source: ఏపీ న్యూస్ | 14 May 2010 | 12:47 am

కరుణానిధి సమక్షంలో డీఎంకేలో చేరనున్న సినీనటి ఖుష్భూ

పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదని సంచలన వ్యాఖ్యలు చేసి, ఆ తర్వాత ఆ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సమర్థించడంతో విజయంతో తలెత్తుక తిరుగుతున్న ఖుష్భూ డీఎంకే తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైంది.
Source: జాతీయ | 14 May 2010 | 12:35 am

సంసార రుచులు చూశాకే ఏదైనా...: సింధుమీనన్

ఎంబీఎ పూర్తి చేసిన నటి సింధుమీనన్ "చందమామ" చిత్రంలో చలాకీగా నటించింది. తాజాగా ఆమె నటించిన చిత్రాలు "ప్రేమ పిలుస్తోంది", "సుభద్ర" విడుదల కావాల్సి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ భామ వివాహ ప్రయత్నాల్లో జోరుగా ఉంది. దీని గురించి ఆమెను అడిగితే.. ఆయన లండన్‌లో స్థిరపడ్డారు. అందుకే నేను కూడా అక్కడికి వెళ్లాలి.
Source: వినోదం | 14 May 2010 | 12:15 am

కేంద్రంపై "మాయావతి" ధ్వజం: తిప్పికొట్టిన కాంగ్రెస్..!

కేంద్రం తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. తన మీదున్న తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై మాయావతి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది.
Source: జాతీయ | 14 May 2010 | 12:06 am

కేసీఆర్ విరోధిని "లేడీ అమితాబ్" తెగ పొగడతాంది

ప్రత్యేక తెలంగాణా లక్ష్యంగా తల్లితెలంగాణా పార్టీని స్థాపించి అటు పిమ్మట వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోని కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యేందుకు చూసిన ప్రస్తుత తెరాస ఎంపీ విజయశాంతి కేసీఆర్ బద్ధశత్రువుగా పరగణించే వైఎస్సార్‌ను పొగడ్తలతో ముంచెత్తుతోంది.
Source: ఏపీ న్యూస్ | 14 May 2010 | 12:05 am

ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యం: సర్వే నివాసంలో టీ.ఎంపీల భేటీ!

తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కాపాడుకుంటూ.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడమే లక్ష్యంగా మల్కజ్‌గిరి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు సర్వే సత్యనారాయణ నివాసంలో శుక్రవారం తెలంగాణ ఎంపీలందరూ భేటీ కానున్నారు. తెలంగాణ ఎంపీల ఫోరం భవిష్యత్తు కార్యచరణ రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చలు జరుపనున్నట్లు తెలిసింది.
Source: ఏపీ న్యూస్ | 13 May 2010 | 10:58 pm

తగిన సమయంలో గడ్కరీకి గుణపాఠం చెబుతాం : లాలూ

నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి సారీ చెప్పడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందనీ, తమను కుక్కలతో పోల్చినందుకు తాము బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ తగిన సమయంలో గుణపాఠం చెబుతామని రాష్ట్రీయ జనతాదళ్ ‌(ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 13 May 2010 | 9:58 pm

పశ్చిమబెంగాల్‌లో మరో ఘాతుకానికి పాల్పడ్డ మావోలు

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సిల్దియాలో గత రాత్రి 5గురు సిపిఎం కార్యకర్తలను మావోయిస్టులు అపహరించి వారిలో నలుగురిని హతమార్చారు.
Source: జాతీయ | 13 May 2010 | 9:41 pm

మగ స్నేహితుడితో ఛార్మి చెట్టాపట్టాల్: "టప్"మన్న కెరీర్

నటి ఛార్మి కెరీర్ చాలా నెమ్మదించింది. దీనికి ప్రధాన కారణం ఆమె స్నేహితుడు దేవీశ్రీప్రసాద్ అని ఇండస్ట్రీ భావిస్తోంది. తన కెరీర్‌కంటే నిజజీవితంలో కెరీర్‌నే ఛార్మి చూసుకుంటోందని ఫిలింనగర్ వాసుల కథనం. ఇటీవల దాదాపుగా ఆమె కనుమరుగయిపోయింది. సక్సెస్‌లు లేకపోవడం ఒక ఎత్తయితే మరోవైపు షంషాబాద్ శివార్లలో ఆమె రిసార్ట్స్ ఒకటి ఉన్నది. దానిలో ఇండస్ట్రీలోని ప్రముఖుల పుత్ర రత్నాలు గలాటా చేయడంతో అది కాస్తా కోర్టు గడప దాకా వెళ్లి అక్కడే తిష్టవేసి కూచుంది. అయితే సినిమాలు తగ్గడానికి ప్రధాన కారణం ఆమె ప్రేమలో పీకల్లోతు కూరుకుపోవడమేనన్న వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 13 May 2010 | 12:24 pm

కబ్జా గొడవల్లో "జయం" తేజ గుట్టు రట్టయింది

కెమేరామెన్ నుంచి దర్శకుడిగా మారి ఆ తర్వాత పలు రకాలుగా వార్తల్లోకి ఎక్కిన తేజ ఇటీవలే నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఇంటిని కబ్జా చేసినట్లు పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ కేసు కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ గొడవల్లో ఆయన వ్యక్తిగత విషయాలు బయటకు వచ్చాయి. సినిమా షూటింగ్‌లో ప్రొడక్షన్ వ్యవహారాలలో కూడా ఆయన తన తలను దూర్చేవాడట. కాస్ట్యూమ్స్ విషయంలో... ఇతర దేశాల నుంచి, ముంబై నుంచి తెప్పించినట్లు బిల్లులు రాసి హైదరాబాదులోని కోఠిలో ఫ్లాట్‌ఫాంపై తెచ్చి వేసినట్లు ఆమధ్య నితిన్ బయటపెట్టాడు. ఇదిలావుంటే, ప్రస్తుతం మరో నిర్మాత ఈయన బండారాన్ని వేలెత్తి చూపినట్లు విశ్వసనీయ సమాచారం. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ కాక్‌టైల్ సంస్థ యూనిట్‌కు మందు బాటిళ్లు సప్లయ్ చేస్తే... వాటిని వారికి అందజేయకుండా తన ఆఫీసులో కొద్దికాలం పెట్టుకుని అమ్మే ప్రయత్నం చేశాడట. దీంతో ఈ విషయం తెలిసిన ఆ కంపెనీ తేజ చీప్ మెంటాలిటీ తెలుసుకుని ఆయనతో సంబంధాలను రద్దు చేసుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 13 May 2010 | 9:47 am

ప్రజారాజ్యం పార్టీలో రాజుకున్న 'బామ్మర్థి చిచ్చు'

ప్రజారాజ్యం పార్టీలో మళ్లీ చిచ్చు రాజుకుంది. ఈ దఫా బామ్మర్థి అల్లు అరవింద్ రూపంలో పుట్టుకొచ్చింది. రాజ్యసభ టిక్కెట్‌ను బామ్మర్థికి ఇవ్వాలని స్వయంగా ప్రతిపాదన చేయడంతో దీనికి బీజం పడింది. దీంతో ఖంగుతున్న ఇతర నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 13 May 2010 | 8:32 am

ఇంద్రకీలాద్రికి "సింహా"... మల్లన్నవద్దకు "గోలీమార్" గోపీచంద్

సినిమా సక్సెస్ కావాలని షూటింగ్ తొలి షాట్‌కు ముందు పూజా కార్యక్రమాలు నిర్వహించి సరిపెట్టుకునేవారు. కానీ నేడు పరిస్థితి మారింది. సినిమా విడుదలకు ముందు సక్సెస్ కావాలనీ, విడుదలైన తర్వాత సక్సెస్ అయినందుకు దేవదేవుళ్లకు మొక్కే నటీనటులు ఎక్కువవుతున్నారు.తాజాగా "సింహా" బాలకృష్ణ తన చిత్రం సూపర్ డూపర్ హిట్ అయినందుకు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని పూజాది కార్యక్రమాలు చేశారు. గురువారం సింహా యూనిట్ ఇంద్రకీలాద్రికి చేరుకుని కనకదుర్గ తల్లిని దర్శించుకున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 May 2010 | 7:48 am

26 యేళ్ళ తర్వాత భోపాల్‌ గ్యాస్ ప్రమాదంపై తీర్పు

భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన కేసుపై జూన్ ఏడో తేదీన తుది తీర్పు వెలువడనుంది. 26 సంవత్సరాల తర్వాత ఈ కేసులో తుది తీర్పు వెలువడనుండటం గమనార్హం. దీనిపై భోపాల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ మోహన్ పి.తివారీ గురువారం మాట్లాడుతూ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్)లో విష వాయువు లీకేజీ దుర్ఘటన కేసులో వచ్చే నెల ఏడో తేదీన తుది తీర్పు వెలువరిస్తానని చెప్పారు.
Source: జాతీయ | 13 May 2010 | 7:06 am

మగ స్నేహితుడితో ఛార్మి చెట్టాపట్టాల్: "టప్"మన్న కెరీర్

నటి ఛార్మి కెరీర్ చాలా నెమ్మదించింది. దీనికి ప్రధాన కారణం ఆమె స్నేహితుడు దేవీశ్రీప్రసాద్ అని ఇండస్ట్రీ భావిస్తోంది. తన కెరీర్‌కంటే నిజజీవితంలో కెరీర్‌నే ఛార్మి చూసుకుంటోందని ఫిలింనగర్ వాసుల కథనం. ఇటీవల దాదాపుగా ఆమె కనుమరుగయిపోయింది. సక్సెస్‌లు లేకపోవడం ఒక ఎత్తయితే మరోవైపు షంషాబాద్ శివార్లలో ఆమె రిసార్ట్స్ ఒకటి ఉన్నది. దానిలో ఇండస్ట్రీలోని ప్రముఖుల పుత్ర రత్నాలు గలాటా చేయడంతో అది కాస్తా కోర్టు గడప దాకా వెళ్లి అక్కడే తిష్టవేసి కూచుంది. అయితే సినిమాలు తగ్గడానికి ప్రధాన కారణం ఆమె ప్రేమలో పీకల్లోతు కూరుకుపోవడమేనన్న వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి.
Source: వినోదం | 13 May 2010 | 6:55 am

రేపిస్టు హీరోతోనా...?!! బాబోయ్ మేం నటించం: హీరోయిన్లు

పనిమనిషినిపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో బాలీవుడ్ నటుడు షీనె బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని తాజాగా ఓ చిత్రంలో నటించేందుకు అంగీకరించాడు. అయితే అతడితో కలిసి నటించేందుకు ఓ కథానాయిక ముందుకు రావడం లేదు. షీనె పేరు చెబితేనే భయపడిపోతున్నారట. ఇంతకుముందు "ఏన్ యాక్సిడెంట్" చిత్రంలో కొన్ని సన్నివేశాలలో షీనెతో సోహా ఆలీఖాన్ నటించింది. ఆ తర్వాత షీనె అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. దీంతో ఆ ప్రాజెక్టులో నటించేందుకు అంగీకరించిన ప్రీతి జింతా సైతం పరుగు లంకించుకుని బయటపడింది. ఇక ప్రస్తుతం మరో హీరోయిన్ వేటకోసం హీరో షీనె నానా తంటాలు పడుతున్నాడట.
Source: Yahoo! Telugu: Entertainment | 13 May 2010 | 6:15 am

భానుడి ప్రతాపం: నిప్పులు కొలిమిని తలపిస్తున్న రాష్ట్రం

రాష్ట్ర వ్యాప్తంగా భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఫలితంగా రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. సూర్యతాపానికి ఇప్పటి వరకు 14 మంది మృత్యువాత పడ్డారు. గురువారం ఒక్కరోజే ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు. వీరిలో మహబూబ్ నగర్‌లో ఐదుగురు, కరీంనగర్‌లో ముగ్గురు ఉన్నారు.
Source: ఏపీ న్యూస్ | 13 May 2010 | 5:44 am

యధావిధిగా కార్పొరేట్ విద్యా పథకం అమలు: మంత్రులు

ప్రభుత్వం తొందరపడి తీసుకున్న నిర్ణయాన్ని తిరిగి ఉపసంహరించుకుంది. కార్పొరేట్ విద్యా పథకాన్ని రద్దు చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసిన 24 గంటలలోపే ఈ పథకాన్ని యధావిధిగా కొనసాగించనున్నట్టు ప్రకటించింది. పథకం రద్దు చేస్తున్నట్టు మీడియాలో వార్తలు రావడంతోనే ముప్పేట దాడి ఆరంభమైంది. దీంతో తొందరపాటుతో తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి కె.రోశయ్య గురువారం మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 13 May 2010 | 5:32 am

ఈల వేసిన కార్యకర్తకు చిరంజీవి మొట్టికాయలు

పోలవరం బస్సు యాత్రలో భాగంగా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సామర్లకోటకు చేరుకుని పార్టీ కార్యకర్తలతో ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ప్రసంగాన్ని మించిన స్థాయిలో అభిమానుల ఈల గోలే ఎక్కువైపోయింది.
Source: ఏపీ న్యూస్ | 13 May 2010 | 5:26 am

విదేశాలకు వెళుతున్న "ఝుమ్మంది నాదం"

మంచు మనోజ్ హీరోగా ఉత్తరాది నటి తాప్సి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం "ఝుమ్మంది నాదం". ఈ చిత్రానికి నిర్మాత లక్ష్మీ ప్రసన్న. రాఘవేంద్రరావు దర్శకుడు. కీరవాణి సంగీతం. పెళ్లిసందడిలో సౌందర్య లహరి స్వప్నసుందరి అంటూ శ్రీకాంత్ పాడిన పాట హృదయాన్ని తాకక మానదు. ఈ చిత్రాన్ని పాటలు నిలబెట్టాయి. ప్రస్తుతం అదే తరహాలో రాఘవేంద్రరావు కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ... యువతరాన్ని మాత్రమే కాకుండా అన్ని వయసులవారినీ అలరిస్తుందీ సినిమా. కీరవాణి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 13 May 2010 | 5:22 am

నళిని భద్రతపై ప్రత్యేక కమిటీ: తమిళనాడు ప్రభుత్వం

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో యాజవజ్జీవ కారాగారశిక్షను అనుభవిస్తున్న ఎల్టీటీఈ మహిళా కార్యకర్త నళినికి కల్పిస్తున్న భద్రతపై సమీక్ష చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. జైళ్ళ శాఖ డీఐజీ (కోయంబత్తూరు) గోవిందరాజన్ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆ రాష్ట్ర న్యాయ శాఖామంత్రి దురైమురుగన్ గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించారు. ఈ కమిటీ జైలులో నళినికి కల్పిస్తున్న భద్రత, ఆమెకు ఉన్న ప్రాణహాని తదితర అంశాలను పరిశీలించి ప్రబుత్వానికి నివేదిక సమర్పిస్తుందని చెప్పారు.
Source: జాతీయ | 13 May 2010 | 4:25 am

కబ్జా గొడవల్లో "జయం" తేజ గుట్టు రట్టయింది

కెమేరామెన్ నుంచి దర్శకుడిగా మారి ఆ తర్వాత పలు రకాలుగా వార్తల్లోకి ఎక్కిన తేజ ఇటీవలే నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఇంటిని కబ్జా చేసినట్లు పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ కేసు కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ గొడవల్లో ఆయన వ్యక్తిగత విషయాలు బయటకు వచ్చాయి. సినిమా షూటింగ్‌లో ప్రొడక్షన్ వ్యవహారాలలో కూడా ఆయన తన తలను దూర్చేవాడట. కాస్ట్యూమ్స్ విషయంలో... ఇతర దేశాల నుంచి, ముంబై నుంచి తెప్పించినట్లు బిల్లులు రాసి హైదరాబాదులోని కోఠిలో ఫ్లాట్‌ఫాంపై తెచ్చి వేసినట్లు ఆమధ్య నితిన్ బయటపెట్టాడు. ఇదిలావుంటే, ప్రస్తుతం మరో నిర్మాత ఈయన బండారాన్ని వేలెత్తి చూపినట్లు విశ్వసనీయ సమాచారం. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ కాక్‌టైల్ సంస్థ యూనిట్‌కు మందు బాటిళ్లు సప్లయ్ చేస్తే... వాటిని వారికి అందజేయకుండా తన ఆఫీసులో కొద్దికాలం పెట్టుకుని అమ్మే ప్రయత్నం చేశాడట. దీంతో ఈ విషయం తెలిసిన ఆ కంపెనీ తేజ చీప్ మెంటాలిటీ తెలుసుకుని ఆయనతో సంబంధాలను రద్దు చేసుకుంది.
Source: వినోదం | 13 May 2010 | 4:18 am

గడ్కారీ క్షమాపణలు తిరస్కరించిన ఆర్జేడీ అధినేత లాలు

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ చెప్పిన క్షమాపణలను ఆర్జేడీ అధినేత, మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తిరస్కరించారు. తన వద్దకు వస్తే సభ్యత, సంస్కారాల గురించి శిక్షణ ఇస్తానని హితవు పలికారు. ప్రస్తుత కాలంలో క్షమాపణలు చెప్పడం ఓ ఫ్యాషన్‌గా మారిందన్నారు. ఇలాంటి వాటిని తాను విశ్వసించబోనని లాలూ ప్రసాద్ అన్నారు.
Source: జాతీయ | 13 May 2010 | 3:42 am