|
కబ్జా గొడవల్లో "జయం" తేజ గుట్టు రట్టయిందికెమేరామెన్ నుంచి దర్శకుడిగా మారి ఆ తర్వాత పలు రకాలుగా వార్తల్లోకి ఎక్కిన తేజ ఇటీవలే నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఇంటిని కబ్జా చేసినట్లు పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ కేసు కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ గొడవల్లో ఆయన వ్యక్తిగత విషయాలు బయటకు వచ్చాయి. సినిమా షూటింగ్‌లో ప్రొడక్షన్ వ్యవహారాలలో కూడా ఆయన తన తలను దూర్చేవాడట. కాస్ట్యూమ్స్ విషయంలో... ఇతర దేశాల నుంచి, ముంబై నుంచి తెప్పించినట్లు బిల్లులు రాసి హైదరాబాదులోని కోఠిలో ఫ్లాట్‌ఫాంపై తెచ్చి వేసినట్లు ఆమధ్య నితిన్ బయటపెట్టాడు. ఇదిలావుంటే, ప్రస్తుతం మరో నిర్మాత ఈయన బండారాన్ని వేలెత్తి చూపినట్లు విశ్వసనీయ సమాచారం. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ కాక్‌టైల్ సంస్థ యూనిట్‌కు మందు బాటిళ్లు సప్లయ్ చేస్తే... వాటిని వారికి అందజేయకుండా తన ఆఫీసులో కొద్దికాలం పెట్టుకుని అమ్మే ప్రయత్నం చేశాడట. దీంతో ఈ విషయం తెలిసిన ఆ కంపెనీ తేజ చీప్ మెంటాలిటీ తెలుసుకుని ఆయనతో సంబంధాలను రద్దు చేసుకుంది.Source: Yahoo! Telugu: Entertainment | 13 May 2010 | 9:47 am రోశయ్య సర్కారు ... రోతల ప్రభుత్వం: చంద్రబాబురాష్ట్రంలోని ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వం రోతల సర్కారుగా మారిందని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని మార్కెటింగ్ యార్డును ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని రోశయ్య ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంగా మారిందన్నారు. ఫలితంగా రోతల సర్కారుగా అవతరించిందన్నారు.Source: Yahoo! Telugu: News | 13 May 2010 | 9:39 am 5,200 పాయింట్ల వద్ద నిఫ్టీ: రియాల్టీ, ఆటో, ఐటీ పైపైకిగురువారం స్టాక్ మార్కెట్ రియాల్టీ ఇండస్ట్రీకి పంట పండించింది. రియాల్టీ, ఆటో, ఐటీ సెక్టార్లకు చెందిన షేర్లు గణనీయమైన లాభాలను గడించాయి. మధ్యాహ్నం 3 గంటలకు నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 5,193 పాయింట్లకు చేరుకుంది. సుమారు 36 పాయింట్ల మేర వృద్ధి సాధించింది.Source: Yahoo! Telugu: News | 13 May 2010 | 9:38 am గడ్కారీ క్షమాపణలు తిరస్కరించిన ఆర్జేడీ అధినేత లాలుభారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ చెప్పిన క్షమాపణలను ఆర్జేడీ అధినేత, మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తిరస్కరించారు. తన వద్దకు వస్తే సభ్యత, సంస్కారాల గురించి శిక్షణ ఇస్తానని హితవు పలికారు. ప్రస్తుత కాలంలో క్షమాపణలు చెప్పడం ఓ ఫ్యాషన్‌గా మారిందన్నారు. ఇలాంటి వాటిని తాను విశ్వసించబోనని లాలూ ప్రసాద్ అన్నారు.Source: Yahoo! Telugu: News | 13 May 2010 | 9:11 am ప్రజాసమస్యలపై తెరాస ఒక్క ఆందోళన చేసిందా: బాబురాష్ట్రంలోని ప్రజానీకం వివిధ సమస్యలతో అల్లాడుతుంటే ఏనాడైనా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. తాము కష్టాల్లో ఉన్న రైతులను ఓదార్చేందుకు జిల్లాల్లో పర్యటిస్తుంటే తమను అడ్డుకోవడం ఎంతవరకు న్యాయమని ఆయన అడిగారు.Source: Yahoo! Telugu: News | 13 May 2010 | 8:41 am స్టాక్ మార్కెట్: స్వల్పంగా తగ్గిన లాభాలుఉదయం నుంచి లాభాల దిశగా పరుగులు పెడుతున్న స్టాక్ మార్కెట్ మధ్యాహ్నానికి కాస్త మందగించింది. దీంతో సెన్సెక్స్ 17, 300 పాయింట్ల వద్ద, నిఫ్టీ 5,186 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి.Source: Yahoo! Telugu: News | 13 May 2010 | 8:34 am నిస్సాన్ నుంచి భారీ ఆర్డరు దక్కించుకున్న మహీంద్రా సత్యందేశీయ ఐటీ సేవల రంగంలో తనకుంటూ ఓ స్థాన్నాన్ని దక్కించుకున్న మహీంద్రా సత్యం సంస్థ నిస్సాన్ మోటార్స్ సంస్థ నుంచి పెద్ద మొత్తంలో ఆర్డరును దక్కించుకుందని మహీంద్రా సత్యం (మాజీ సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్) సంస్థ ప్రతినిధి తెలిపారు.Source: Yahoo! Telugu: News | 13 May 2010 | 8:14 am ఇంద్రకీలాద్రికి "సింహా"... మల్లన్నవద్దకు "గోలీమార్" గోపీచంద్సినిమా సక్సెస్ కావాలని షూటింగ్ తొలి షాట్‌కు ముందు పూజా కార్యక్రమాలు నిర్వహించి సరిపెట్టుకునేవారు. కానీ నేడు పరిస్థితి మారింది. సినిమా విడుదలకు ముందు సక్సెస్ కావాలనీ, విడుదలైన తర్వాత సక్సెస్ అయినందుకు దేవదేవుళ్లకు మొక్కే నటీనటులు ఎక్కువవుతున్నారు.తాజాగా "సింహా" బాలకృష్ణ తన చిత్రం సూపర్ డూపర్ హిట్ అయినందుకు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని పూజాది కార్యక్రమాలు చేశారు. గురువారం సింహా యూనిట్ ఇంద్రకీలాద్రికి చేరుకుని కనకదుర్గ తల్లిని దర్శించుకున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 13 May 2010 | 7:48 am క్యాన్సర్ లాంటి తీవ్రవాదంతో పాక్‌కు ముప్పు: ఒబామాక్యాన్సర్ లాంటి తీవ్రవాదంతో పాకిస్థాన్‌కు తీవ్ర ముప్పు పొంచివుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. దీన్ని గమనించక పోతే ఆ దేశ సార్వభౌమత్వానికే ప్రమాదం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 13 May 2010 | 7:39 am ఆఫీస్ 2010ను మార్కెట్లో ప్రవేశపెట్టిన మైక్రోసాఫ్ట్ప్రపంచవ్యాప్తంగానున్న తన వినియోగదారులకు అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌కు చెందిన కొత్త వెర్షన్ ఆఫీస్ 2010ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు సాఫ్ట్‌వేర్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ సంస్థ అధ్యక్షుడు (బిజినెస్ డివిజన్) స్టీఫెన్ ఎలాప్ శాన్‌ఫ్రాన్సిస్కోలో తెలిపారు.Source: Yahoo! Telugu: News | 13 May 2010 | 7:38 am చిరు పోలవరం యాత్రతో బాబుకు "యాత్ర" జ్వరంప్రజాసమస్యలపై పోరాటం సాగించాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వెనకబడిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు హుటాహుటిన రైతు సమస్యలపై గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో యాత్రను మొదలుపెట్టారు. హైటెక్ ముఖ్యమంత్రిగా కీర్తి గడించిన బాబు, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులను చిన్నచూపు చూశారన్న అపవాదును మూటగట్టుకున్నారు.Source: Yahoo! Telugu: News | 13 May 2010 | 7:28 am 'ఓదార్పు యాత్ర' వెనుక రహస్య అజెండా: జి.వినోద్దివంగత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర వెనుక రహస్య అజెండా ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ జి.వినోద్ ఆరోపించారు. ఆయన గురువారం వరంగల్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఓదార్పు యాత్ర పేరుతో తెలంగాణ జిల్లాల్లో జగన్ పర్యటిస్తే అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. ఈ మేరకు తామంతా తీర్మానం చేసినట్టు చెప్పారు.Source: Yahoo! Telugu: News | 13 May 2010 | 7:16 am రేపిస్టు హీరోతోనా...?!! బాబోయ్ మేం నటించం: హీరోయిన్లుపనిమనిషినిపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో బాలీవుడ్ నటుడు షీనె బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని తాజాగా ఓ చిత్రంలో నటించేందుకు అంగీకరించాడు. అయితే అతడితో కలిసి నటించేందుకు ఓ కథానాయిక ముందుకు రావడం లేదు. షీనె పేరు చెబితేనే భయపడిపోతున్నారట. ఇంతకుముందు "ఏన్ యాక్సిడెంట్" చిత్రంలో కొన్ని సన్నివేశాలలో షీనెతో సోహా ఆలీఖాన్ నటించింది. ఆ తర్వాత షీనె అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. దీంతో ఆ ప్రాజెక్టులో నటించేందుకు అంగీకరించిన ప్రీతి జింతా సైతం పరుగు లంకించుకుని బయటపడింది. ఇక ప్రస్తుతం మరో హీరోయిన్ వేటకోసం హీరో షీనె నానా తంటాలు పడుతున్నాడట.Source: Yahoo! Telugu: Entertainment | 13 May 2010 | 6:15 am విదేశాలకు వెళుతున్న "ఝుమ్మంది నాదం"మంచు మనోజ్ హీరోగా ఉత్తరాది నటి తాప్సి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం "ఝుమ్మంది నాదం". ఈ చిత్రానికి నిర్మాత లక్ష్మీ ప్రసన్న. రాఘవేంద్రరావు దర్శకుడు. కీరవాణి సంగీతం. పెళ్లిసందడిలో సౌందర్య లహరి స్వప్నసుందరి అంటూ శ్రీకాంత్ పాడిన పాట హృదయాన్ని తాకక మానదు. ఈ చిత్రాన్ని పాటలు నిలబెట్టాయి. ప్రస్తుతం అదే తరహాలో రాఘవేంద్రరావు కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ... యువతరాన్ని మాత్రమే కాకుండా అన్ని వయసులవారినీ అలరిస్తుందీ సినిమా. కీరవాణి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.Source: Yahoo! Telugu: Entertainment | 13 May 2010 | 5:22 am రోశయ్య సర్కారు ... రోతల ప్రభుత్వం: చంద్రబాబురాష్ట్రంలోని ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వం రోతల సర్కారుగా మారిందని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని మార్కెటింగ్ యార్డును ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని రోశయ్య ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంగా మారిందన్నారు. ఫలితంగా రోతల సర్కారుగా అవతరించిందన్నారు.Source: ఏపీ న్యూస్ | 13 May 2010 | 4:10 am గడ్కారీ క్షమాపణలు తిరస్కరించిన ఆర్జేడీ అధినేత లాలుభారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ చెప్పిన క్షమాపణలను ఆర్జేడీ అధినేత, మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తిరస్కరించారు. తన వద్దకు వస్తే సభ్యత, సంస్కారాల గురించి శిక్షణ ఇస్తానని హితవు పలికారు. ప్రస్తుత కాలంలో క్షమాపణలు చెప్పడం ఓ ఫ్యాషన్‌గా మారిందన్నారు. ఇలాంటి వాటిని తాను విశ్వసించబోనని లాలూ ప్రసాద్ అన్నారు.Source: జాతీయ | 13 May 2010 | 3:42 am ప్రజాసమస్యలపై తెరాస ఒక్క ఆందోళన చేసిందా: బాబురాష్ట్రంలోని ప్రజానీకం వివిధ సమస్యలతో అల్లాడుతుంటే ఏనాడైనా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. తాము కష్టాల్లో ఉన్న రైతులను ఓదార్చేందుకు జిల్లాల్లో పర్యటిస్తుంటే తమను అడ్డుకోవడం ఎంతవరకు న్యాయమని ఆయన అడిగారు.Source: ఏపీ న్యూస్ | 13 May 2010 | 3:13 am 'ఓదార్పు యాత్ర' వెనుక రహస్య అజెండా: జి.వినోద్దివంగత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర వెనుక రహస్య అజెండా ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ జి.వినోద్ ఆరోపించారు. ఆయన గురువారం వరంగల్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఓదార్పు యాత్ర పేరుతో తెలంగాణ జిల్లాల్లో జగన్ పర్యటిస్తే అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. ఈ మేరకు తామంతా తీర్మానం చేసినట్టు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 13 May 2010 | 1:47 am పాదాలు నాకే కుక్కలతో వారిని పోల్చలేదు: నితిన్ గడ్కారీబీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌లను కాంగ్రెస్ పాదాలు నాకే కుక్కలతో పోల్చలేదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితన్ గడ్కారీ వివరణ ఇచ్చారు. తాను ఒక సామెతను మాత్రమే ఉటంకించానన్నారు. ఒక వేళ తన మాటలు వారిని బాధించి ఉంటే వారికి హృదయపూర్వక క్షమాపణలు చెపుతున్నట్టు నితిన్ గడ్కారీ చెప్పారు.Source: జాతీయ | 13 May 2010 | 1:34 am ఉప ఎన్నికల్లో పోటీ చేసి తీరుతాం: ధర్మపురి స్పష్టీకరణతెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల్లో జరుగనున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ చేసి తీరుతుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ వెల్లడించారు. అందువల్ల ఈ అంశంపై పార్టీ నేతలెవ్వరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని ఆయన హితవు పలికారు.Source: ఏపీ న్యూస్ | 13 May 2010 | 12:41 am ఆ సంచాలకుని అక్రమ ఆస్తి విలువ రూ.20 కోట్లు!రాష్ట్రంలో మరో అవినీతి చేప బయటపడింది. పేరుకు ప్రభుత్వ కొలువులో ఉంటూ.. రెండు చేతులా కోట్లాది రూపాయలను అక్రమంగా సంపాదించిన అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఈ అధికారి పేరు వెంకటేశ్వర రావు. రంగారెడ్డి జిల్లా సహకార శాఖ సబ్ డివిజనల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఈయన ఇళ్లలో ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 20 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.Source: ఏపీ న్యూస్ | 13 May 2010 | 12:33 am మంత్రి పదవికి జైరామ్ గుడ్‌బై: తిరస్కరించిన ప్రధానికేంద్ర మంత్రిపదవికి జైరామ్ రమేష్ రాజీనామా చేశారు. చైనాలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రాయశ్చిత్తంగా మంత్రిపదవి నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు పంపారు. అయితే, జైరామ్ రాజీనామాను ప్రధాని తిరస్కరించారు.Source: జాతీయ | 13 May 2010 | 12:16 am కేసీఆర్.. మాటలు మంచిగా రానియ్... లేదంటే: ఓయూతెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుపై ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (ఓయూ టీఎస్‌జాక్) నేతలు నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఏదైనా మాట్లాడేటపుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. లేదంటే.. తస్మాత్ జాగ్రత్త అంటూ కడిగి పారేశారు.Source: ఏపీ న్యూస్ | 12 May 2010 | 11:37 pm నక్సలైట్‌కు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడటిన వీరజవాన్ప్రాణాపాయ స్థితిలోనున్న నక్సలైట్‌కు ఓ జవాను రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగింది. నక్సల్స్, ఆర్మీకి మధ్య యుద్ధం జరుగుతున్న ఛత్తీస్‌గఢ్‌లోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.Source: జాతీయ | 12 May 2010 | 10:27 pm హేమంత్ మృతిపై విచారణ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం26/11న ముంబైలో జరిగిన ముష్కరుల దాడి సందర్భంగా ముంబై పోలీసు విభాగం టెర్రరిస్టు వ్యతిరేక స్క్వాడ్ (ఏటీఎస్) అధిపతి హేమంత్ కర్కరే మృతి చెందిన పరిస్థితులపై విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది.Source: జాతీయ | 12 May 2010 | 10:00 pm "రామరామ కృష్ణకృష్ణ" రామరామ కృష్ణకృష్ణలానే ఉంది..!!రామ్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథతో రెడీ సినిమా వచ్చింది. అంతకుముందు హీరో విష్ణు ఢీ అనే సినిమా కూడా వచ్చింది. ఈ రెండింటిలో తను ప్రేమించిన ప్రియురాలు దగ్గరే ఉంటూ వాళ్లవాళ్ల ఇంటిలో ఎవరికీ తెలీకుండా కథ నడుపుతాడు హీరో. రామరామ కృష్ణకృష్ణలో కూడా అదే తరహాలో సాగుతూ... తన సోదరుని ప్రేమ వ్యవహారాన్ని చక్కబెడుతూ... పనిలోపనిగా ప్రేమను పొందుతాడు ఈ హీరో.కథ గురించి చెప్పాలంటే... రామకృష్ణ(రామ్) ఆ ఊరిలో డేరింగ్ పనులు చేస్తుంటాడు. తండ్రి చక్రపాణి( నాజర్) ఊరికి పెద్ద. కట్టుబాట్లకు పెద్దపీట వేసే చక్రపాణికి ప్రేమ వివాహాలు గిట్టవు. ఇందుకు సొంత సోదరుడు బ్రహ్మానందాన్ని కూడా దూరం చేసుకుంటాడు. అలాంటి ఊరిలో శివరాజ్( అర్జున్) తన ఇద్దరు చెల్లెళ్లతో కాలంగడుపుతుంటాడు. అందులో పెద్ద చెల్లెల్ని రామ్ సోదరుడు ప్రేమిస్తాడు. ఇద్దరూ సిటీలో డాక్టర్ కోర్సు చదువుతుంటారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 May 2010 | 12:20 pm చూడూ.. ఒకవైపే చూడూ.. రెండోవైపు చూడాలనుకోకూ... మాడిపోతావ్..!!ఈ డైలాగ్ ఇపుడు టాలీవుడ్‌లో మారుమోగుతోంది. తెలుగు ప్రేక్షకులు బాలయ్య చిత్రం సింహాను సూపర్ సక్సెస్ చేశారు. నిజానికి సింహా టైటిల్ వినగానే నరసింహనాయుడు, లక్ష్మీనరసింహా, సమరసింహారెడ్డి- ఇలా సింహా సెంటిమెంట్‌తో మళ్ళీ బాలకృష్ణ విజృంభిస్తాడని ముందుగానే చెప్పిన దర్శకుడు బోయపాటి శ్రీను, పక్కా బాలయ్య మార్క్ సినిమా తీశాడు. ఇన్నాళ్ళు ఎలాంటి కథాశంతో అభిమానుల్ని సంపాదించుకున్నాడో అలాంటి అభిమానులు మెచ్చేలా, వారి అంచనాలకు అనుగుణంగా బాలయ్య కథాంశాన్ని ఎంచుకున్నాడు. దీనికితోడు నాలుగు పాటలుకూడా బాగుండడంతో సింహా ఫ్యాన్స్‌కు ఫుల్‌మీల్స్ అయ్యింది.అయితే భద్ర, తులసిలో ఉన్నట్లే... దర్శకుడు బాలయ్య రేంజ్‌కు తగినట్లుగా బాంబు పేలుళ్లు, కత్తులతో నరకడాలు మామూలుగా ఉన్నాయి. కొన్ని చోట్ల డైలాగ్స్‌లు ఆవేశంగా బూతులు ఉన్నా సన్నివేశపరంగా కొట్టకుపోయాయి. మొత్తమ్మీద ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య మెప్పించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...Source: Yahoo! Telugu: Entertainment | 12 May 2010 | 9:57 am హాలీవుడ్‌కు వర్మ... బాలీవుడ్‌కు పూరీనాగార్జున "శివ"తో తెలుగు వెండితెరపై తన చైన్ దెబ్బ సత్తా ఏమిటో చూపించి ఆ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీసులను బద్ధలు కొడుతున్న క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన దృష్టిని హాలీవుడ్‌పై మరల్చినట్లు సమాచారం. ప్రేక్షకుల మెదళ్లకు బాగా పనిచెప్పే "దెయ్యం", "రణ్", "రక్త చరిత్ర" వంటి చిత్రాలను తీస్తూ పోతున్న వర్మకు హాలీవుడ్ నుంచి కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి పిలుపులు వచ్చినట్లు బాలీవుడ్ భోగట్టా.సహజంగా హాలీవుడ్ చిత్రాలంటే ఎంతో రిచ్‌గానూ, రోమాలు నిక్కబొడుచుకునేంత సస్పెన్స్‌తోనూ సాగుతుంటాయి. ఎలాగూ రామ్ గోపాల్ వర్మ అటువంటి సినిమాలను అందించండంలో అందెవేసిన చేయి గనుక ఆయన టేకింగ్‌ను చూసిన కొన్ని హాలీవుడ్ సంస్థలు వర్మపై దృష్టి సారించినట్లు భోగట్టా. ఇదిలావుంటే "ఇడియట్" ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అదరహో అనిపించుకున్న పూరీ జగన్నాథ్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. తమిళ నటుడు సూర్య హీరోగా రామ్ గోపాల్ వర్మ నిర్మించే చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 12 May 2010 | 8:24 am ఆంధ్ర వృక్షం నుంచి తెలంగాణా కొమ్మ నరకొద్దు: నన్నపనేనితెలుగుదేశం పార్టీకి చెందిన 19మంది సమైక్యాంధ్ర ఫోరం నాయకులు బుధవారం శ్రీకృష్ణ కమిటీ ముందు తమ వాదనలను వినిపించారు. కోస్తా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలను కొమ్మలుగా కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ వృక్షాన్ని తెలుగుదేశం నాయకురాలు నన్నపనేని రాజకుమారి కమిటీ ముందు ప్రదర్శించారు.Source: ఏపీ న్యూస్ | 12 May 2010 | 8:05 am నిప్పుల కొలిమిలో రాష్ట్రం: వడదెబ్బకు పదిమంది మృతిరాష్ట్రంలో గత 11 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా బుధవారం భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. ఫలితంగా రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో 10 మంది వడదెబ్బ కారణంగా మృతి చెందారు. రాయలసీమ, తెలంగాణా జిల్లాల్లోనే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.Source: ఏపీ న్యూస్ | 12 May 2010 | 7:39 am జెనీలియాకు సరైన "మగాడు" దొరకడం లేదటపెళ్లికి తొందరపడుతున్న సెక్సీ నటి జెనీలియాకు ఎంత వెతికినా సరైన మగాడు దొరకడం లేదట. ఎక్కడ చూసినా పాశ్చాత్య పోకడలను విపరీతంగా ప్రదర్శిస్తూ కనబడే మగాళ్లే దర్శనమిస్తున్నారట. లూజుగా ఉండే బ్యాగీ ప్యాంట్లు, మోకాళ్ల దాకా వేలాడే చొక్కాలతో మగాళ్లు అడ్డదిడ్డంగా కనిపిస్తున్నారట. అందమైన చిరునవ్వును కలిగి, సంప్రదాయ దుస్తుల్లో ఓ అందమైన మగాడు తన కంటికి ఇప్పటివరకూ కనబడలేదని వాపోతోందట జెనీలియా. మరి ఎంతగానో ప్రేమించిన రితేష్ దేశ్‌ముఖ్ సంగతో... అని అడిగితే, అతడా.... అతడి గురించి నేనేమీ చెప్పలేనని సమాధానాన్ని దాట వేసిందట.అదిసరే నీకు నచ్చే మగాడికి ఇంకా ఎటువంటి లక్షణాలుండాలని కోరుకుంటున్నావ్ అని అడిగితే... పళ్లు బిగించి ఎప్పుడూ కొంప మునిగిపోయేలా కూచుని ఉండేవారంటే నాకు నచ్చదు. అతడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. అలాగని వెకిలి చేష్టలు చేస్తే మండుతుంది.Source: Yahoo! Telugu: Entertainment | 12 May 2010 | 7:29 am రామ్ "టామ్ అండ్ జెర్రీ" కాదు "ఊసరవెల్లి"రామ్ కథానాయకుడిగా "ఊసరవెల్లి" చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం తాను నటించిన "రామరామ కృష్ణకృష్ణ" రిలీజ్ టెన్షన్లో ఉన్నాననీ, ఇలా ప్రతి సినిమాకు ఉంటుందనీ అన్నారు. ఏడాదికి ఒకటి రెండు చిత్రాలు మినహా ఎక్కువ చేయాలంటే ఎక్కువ టెన్షన్ పడాల్సి వస్తుందని చెపుతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో త్వరలో "ఊసరవెల్లి" ప్రారంభం కాబోతుందన్నారు. ఇలియానాతో దేవదాసు తర్వాత టామ్ అండ్ జెర్రీ అనుకున్నాం. కానీ స్క్రిప్ట్‌లో కొంత క్లారిటీ లేక ఆ ప్రాజెక్ట్ విరమించుకున్నాం. త్వరలో మంచి స్క్రిప్ట్ దొరికితే ఇలియానాతో మళ్లీ నటిస్తానని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 May 2010 | 6:36 am "అది నువ్వే" లోగో ఆవిష్కరణచైతన్య, అక్ష హీరోహీరోయిన్లుగా నటించిన అది నువ్వే చిత్ర లోగోను మంగళవారం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాగర్ ఆవిష్కరించారు. ఫిలిమ్ నగర్ కల్చరల్ క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చిత్ర దర్శకుడు వీరప్రసాద్ అడుగు ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసి మరో అడుగుతో ముందుకు వస్తున్నారన్నారు. నటుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ.. తాను రొటీన్‌గానే హీరో ఫాదర్‌గా నటించినా , ఎంటర్‌టైన్మెంట్‌గా సాగే పాత్ర తనదని చెప్పారు. నటుడు పృథ్వీ మాట్లాడుతూ, చాలాకాలం తర్వాత మళ్లీ తెలుగులో ఈ సినిమా చేస్తున్నాననీ, కామెడీకి ఆస్కారమున్న పాత్ర తనదని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 May 2010 | 6:33 am పూర్తికాలం అధికారం మాదే: వెంకయ్య నాయుడుజార్ఖండ్ రాష్ట్రంలో పూర్తి కాలం ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. దీనిపై ఆయన బుధవారం బెంగుళూరులో విలేకరులతో మాట్లాడుతూ జార్ఖండ్ కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం పూర్తికాలం మనుగడ సాగిస్తుందన్నారు. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు.Source: జాతీయ | 12 May 2010 | 5:48 am కార్పొరేట్ విద్యా పథకానికి మంగళం పాడిన ప్రభుత్వం!కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు అందించే ఉపకారవేతన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళంపాడింది. ఈ మేరకు ప్రభుత్వం విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలతో కూడిన ఉత్తర్వులను బుధవారం జారీ చేసింది. ఈ పథకం రద్దుతో లక్షలాది మంది పేద విద్యార్థులు నష్టపోనున్నారు.Source: ఏపీ న్యూస్ | 12 May 2010 | 5:16 am మెజారిటీ ప్రజల అభిప్రాయమే శిరోధార్యం: జస్టీస్ శ్రీకృష్ణరాష్ట్ర విభజనపై మెజారిటీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా తుది నిర్ణయం తీసుకుంటామని జస్టీస్ శ్రీకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రజల అభిప్రాయాలే మాకు శిరోధార్యమన్నారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ పార్టీలను చైతన్య పరచటం తమ పని కాదన్నారు. ప్రజల అభిప్రాయాలే తమకు ముఖ్యమని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈనెల పదో తేదీ నుంచి మూడు రోజుల పాటు వివిధ రాజకీయ పార్టీల నుంచి చేపట్టిన అభిప్రాయ సేకరణ బుధవారంతో ముగిసిందన్నారు.Source: ఏపీ న్యూస్ | 12 May 2010 | 5:05 am చూడూ.. ఒకవైపే చూడూ.. రెండోవైపు చూడాలనుకోకూ... మాడిపోతావ్..!!ఈ డైలాగ్ ఇపుడు టాలీవుడ్‌లో మారుమోగుతోంది. తెలుగు ప్రేక్షకులు బాలయ్య చిత్రం సింహాను సూపర్ సక్సెస్ చేశారు. నిజానికి సింహా టైటిల్ వినగానే నరసింహనాయుడు, లక్ష్మీనరసింహా, సమరసింహారెడ్డి- ఇలా సింహా సెంటిమెంట్‌తో మళ్ళీ బాలకృష్ణ విజృంభిస్తాడని ముందుగానే చెప్పిన దర్శకుడు బోయపాటి శ్రీను, పక్కా బాలయ్య మార్క్ సినిమా తీశాడు. ఇన్నాళ్ళు ఎలాంటి కథాశంతో అభిమానుల్ని సంపాదించుకున్నాడో అలాంటి అభిమానులు మెచ్చేలా, వారి అంచనాలకు అనుగుణంగా బాలయ్య కథాంశాన్ని ఎంచుకున్నాడు. దీనికితోడు నాలుగు పాటలుకూడా బాగుండడంతో సింహా ఫ్యాన్స్‌కు ఫుల్‌మీల్స్ అయ్యింది.అయితే భద్ర, తులసిలో ఉన్నట్లే... దర్శకుడు బాలయ్య రేంజ్‌కు తగినట్లుగా బాంబు పేలుళ్లు, కత్తులతో నరకడాలు మామూలుగా ఉన్నాయి. కొన్ని చోట్ల డైలాగ్స్‌లు ఆవేశంగా బూతులు ఉన్నా సన్నివేశపరంగా కొట్టకుపోయాయి. మొత్తమ్మీద ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య మెప్పించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...Source: వినోదం | 12 May 2010 | 4:52 am నిఠారీ హత్య కేసులో సురేందర్ కోలీకి మరణశిక్షనిఠారీ హత్య కేసులో ఎంఎస్.పాంథెర్ సహచరుడు సురీందర్ కోలీకి మరణశిక్ష విధిస్తూ ఘజియాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. నోయిడాలోని నిఠారీ గ్రామంలో ఏడేళ్ళ బాలిక ఆర్తీపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో ఈ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.Source: జాతీయ | 12 May 2010 | 4:06 am దళితుల హత్య కేసులో ముగ్గురికి మరణదండనబీహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ జిల్లాలో 1996 సంవత్సరంలో 21 మంది దళితులను హత్య చేసిన కేసులో ముగ్గురి మరణశిక్ష విధిస్తూ స్థానిక కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. అలాగే, మరో 20 మందికి జీవిత కారాగారశిక్షలను విధించింది.Source: జాతీయ | 12 May 2010 | 2:58 am హాలీవుడ్‌కు వర్మ... బాలీవుడ్‌కు పూరీనాగార్జున "శివ"తో తెలుగు వెండితెరపై తన చైన్ దెబ్బ సత్తా ఏమిటో చూపించి ఆ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీసులను బద్ధలు కొడుతున్న క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన దృష్టిని హాలీవుడ్‌పై మరల్చినట్లు సమాచారం. ప్రేక్షకుల మెదళ్లకు బాగా పనిచెప్పే "దెయ్యం", "రణ్", "రక్త చరిత్ర" వంటి చిత్రాలను తీస్తూ పోతున్న వర్మకు హాలీవుడ్ నుంచి కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి పిలుపులు వచ్చినట్లు బాలీవుడ్ భోగట్టా.సహజంగా హాలీవుడ్ చిత్రాలంటే ఎంతో రిచ్‌గానూ, రోమాలు నిక్కబొడుచుకునేంత సస్పెన్స్‌తోనూ సాగుతుంటాయి. ఎలాగూ రామ్ గోపాల్ వర్మ అటువంటి సినిమాలను అందించండంలో అందెవేసిన చేయి గనుక ఆయన టేకింగ్‌ను చూసిన కొన్ని హాలీవుడ్ సంస్థలు వర్మపై దృష్టి సారించినట్లు భోగట్టా. ఇదిలావుంటే "ఇడియట్" ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అదరహో అనిపించుకున్న పూరీ జగన్నాథ్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. తమిళ నటుడు సూర్య హీరోగా రామ్ గోపాల్ వర్మ నిర్మించే చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.Source: వినోదం | 12 May 2010 | 2:56 am
|