|
నిఠారీ హత్య కేసులో సురేందర్ కోలీకి మరణశిక్షనిఠారీ హత్య కేసులో ఎంఎస్.పాంథెర్ సహచరుడు సురీందర్ కోలీకి మరణశిక్ష విధిస్తూ ఘజియాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. నోయిడాలోని నిఠారీ గ్రామంలో ఏడేళ్ళ బాలిక ఆర్తీపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో ఈ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.Source: Yahoo! Telugu: News | 12 May 2010 | 9:36 am ప్రమాదం నుంచి బయటపడిన ఎనిమిదేళ్ళ బాలుడుట్రిపోలీలో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి ఎనిమిది సంవత్సరాల బాలుడు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఇతనిని డచ్ దేశానికి చెందిన బాలుడిగా గుర్తించారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్ నుంచి లిబియాకు బయలుదేరిన విమానం ట్రిపోలీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వేపై కూలిపోయిన విషయం తెల్సిందే. ఈ ప్రమాదంలో 105 మంది మృత్యువాత పడ్డారు. అయితే, సహాయక సిబ్బంది గాలింపు చర్యల్లో ఎనిమిది సంవత్సరాల బాలుడు ప్రాణాలతో ఉన్నట్టు గుర్తించి, తక్షణం ఆస్పత్రికి తరలించారు.Source: Yahoo! Telugu: News | 12 May 2010 | 9:25 am గ్రామీణ ప్రాంతాల్లోను సేవలందిస్తాం : ఎస్‌బీఐ నివేదికదేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) దేశంలోనున్న గ్రామాల్లో బ్యాంకుల సేవలు లేని 11.943 గ్రామాల్లో తన సేవలనందించేందుకు ప్రణాళికలు రూపొందించుకుందని ఆ బ్యాంక్ భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ)కు ఇటీవలే నివేదికను సమర్పించిందిSource: Yahoo! Telugu: News | 12 May 2010 | 9:20 am అవసరమైతే రైతుల చెంతకు పాదయాత్ర: చిరంజీవిరైతులెదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తీసుకెళ్లేందుకు అవసరమైతే పాదయాత్ర చేస్తానని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ ఆయన బస్సు యాత్ర చేస్తున్న విషయం తెల్సిందే. ఈ యాత్రంలో భాగంగా బుధవారం ఉదయం రాజమండ్రి, సామర్లకోటలో విలేకరులతో మాట్లాడారు.Source: Yahoo! Telugu: News | 12 May 2010 | 8:59 am దళితుల హత్య కేసులో ముగ్గురికి మరణదండనబీహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ జిల్లాలో 1996 సంవత్సరంలో 21 మంది దళితులను హత్య చేసిన కేసులో ముగ్గురి మరణశిక్ష విధిస్తూ స్థానిక కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. అలాగే, మరో 20 మందికి జీవిత కారాగారశిక్షలను విధించింది.Source: Yahoo! Telugu: News | 12 May 2010 | 8:27 am హాలీవుడ్‌కు వర్మ... బాలీవుడ్‌కు పూరీనాగార్జున "శివ"తో తెలుగు వెండితెరపై తన చైన్ దెబ్బ సత్తా ఏమిటో చూపించి ఆ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీసులను బద్ధలు కొడుతున్న క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన దృష్టిని హాలీవుడ్‌పై మరల్చినట్లు సమాచారం. ప్రేక్షకుల మెదళ్లకు బాగా పనిచెప్పే "దెయ్యం", "రణ్", "రక్త చరిత్ర" వంటి చిత్రాలను తీస్తూ పోతున్న వర్మకు హాలీవుడ్ నుంచి కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి పిలుపులు వచ్చినట్లు బాలీవుడ్ భోగట్టా.సహజంగా హాలీవుడ్ చిత్రాలంటే ఎంతో రిచ్‌గానూ, రోమాలు నిక్కబొడుచుకునేంత సస్పెన్స్‌తోనూ సాగుతుంటాయి. ఎలాగూ రామ్ గోపాల్ వర్మ అటువంటి సినిమాలను అందించండంలో అందెవేసిన చేయి గనుక ఆయన టేకింగ్‌ను చూసిన కొన్ని హాలీవుడ్ సంస్థలు వర్మపై దృష్టి సారించినట్లు భోగట్టా. ఇదిలావుంటే "ఇడియట్" ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అదరహో అనిపించుకున్న పూరీ జగన్నాథ్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. తమిళ నటుడు సూర్య హీరోగా రామ్ గోపాల్ వర్మ నిర్మించే చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 12 May 2010 | 8:24 am నాడు పనికి రాని రైతులు ఇప్పుడు గుర్తొచ్చారా: బొత్సతొమ్మిదేళ్ళ పాటు అధికారంలో ఉన్న సమయంలో పనికిరాని రైతులు ఇపుడు గుర్తొచ్చారా అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాజకీయ లబ్దికోసం ఏ ఎండకు ఆ గొడుగు పట్టే చంద్రబాబు.. రైతుల కష్టాల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉన్నాయని మంత్రి బొత్స ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 12 May 2010 | 8:15 am ట్రిపోలీలో కూలిన విమానం: 105 మంది దుర్మరణంలిబియా దేశానికి చెందిన విమాన మొకటి బుధవారం ట్రిపోలీ విమానాశ్రయంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 105 మంది మృత్యువాత పడినట్టు భద్రతా అధికారులు వెల్లడించారు. ఈ విమానం దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్ నుంచి లిబియాకు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.Source: Yahoo! Telugu: News | 12 May 2010 | 8:08 am ఆహార ఉత్పత్తులు ఏడు శాతం మేరకు తగ్గవచ్చుః నివేదికగత ఆర్థిక సంవత్సరం(2009-10)లో దేశంలో ఆహార ఉత్పత్తులు 6.95 శాతం మేరకు తగ్గి 218.19 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని ప్రభుత్వం బుధవారం నివేదికను విడుదల చేసింది.Source: Yahoo! Telugu: News | 12 May 2010 | 8:04 am నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల పతనం!బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో -73 పాయింట్లు పడిపోయింది.దీంతో సెన్సెక్స్ సూచి 17,067 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా కేవలం తొమ్మిది పాయింట్ల నష్టంతో, 5,127 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 12 May 2010 | 8:00 am జెనీలియాకు సరైన "మగాడు" దొరకడం లేదటపెళ్లికి తొందరపడుతున్న సెక్సీ నటి జెనీలియాకు ఎంత వెతికినా సరైన మగాడు దొరకడం లేదట. ఎక్కడ చూసినా పాశ్చాత్య పోకడలను విపరీతంగా ప్రదర్శిస్తూ కనబడే మగాళ్లే దర్శనమిస్తున్నారట. లూజుగా ఉండే బ్యాగీ ప్యాంట్లు, మోకాళ్ల దాకా వేలాడే చొక్కాలతో మగాళ్లు అడ్డదిడ్డంగా కనిపిస్తున్నారట. అందమైన చిరునవ్వును కలిగి, సంప్రదాయ దుస్తుల్లో ఓ అందమైన మగాడు తన కంటికి ఇప్పటివరకూ కనబడలేదని వాపోతోందట జెనీలియా. మరి ఎంతగానో ప్రేమించిన రితేష్ దేశ్‌ముఖ్ సంగతో... అని అడిగితే, అతడా.... అతడి గురించి నేనేమీ చెప్పలేనని సమాధానాన్ని దాట వేసిందట.అదిసరే నీకు నచ్చే మగాడికి ఇంకా ఎటువంటి లక్షణాలుండాలని కోరుకుంటున్నావ్ అని అడిగితే... పళ్లు బిగించి ఎప్పుడూ కొంప మునిగిపోయేలా కూచుని ఉండేవారంటే నాకు నచ్చదు. అతడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. అలాగని వెకిలి చేష్టలు చేస్తే మండుతుంది.Source: Yahoo! Telugu: Entertainment | 12 May 2010 | 7:29 am ధరల సెగ ఈ ఏడాది కూడా ఉంటుందిః గోల్డ్మ్యాన్భారతదేశంలో నిత్యావసర సరుకుల ధరలు తగ్గినా ఈ ఏడాది మొత్తం ద్రవ్యోల్బణంపై తీవ్రమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, దీంతో ధరల సెగ ఈ సంవత్సరంలోను ఉంటుందని అంతర్జాతీయ బ్యాంక్ అయిన గోల్డ్‌మ్యాన్ సాక్స్ తెలిపింది.Source: Yahoo! Telugu: News | 12 May 2010 | 7:25 am రామ్ "టామ్ అండ్ జెర్రీ" కాదు "ఊసరవెల్లి"రామ్ కథానాయకుడిగా "ఊసరవెల్లి" చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం తాను నటించిన "రామరామ కృష్ణకృష్ణ" రిలీజ్ టెన్షన్లో ఉన్నాననీ, ఇలా ప్రతి సినిమాకు ఉంటుందనీ అన్నారు. ఏడాదికి ఒకటి రెండు చిత్రాలు మినహా ఎక్కువ చేయాలంటే ఎక్కువ టెన్షన్ పడాల్సి వస్తుందని చెపుతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో త్వరలో "ఊసరవెల్లి" ప్రారంభం కాబోతుందన్నారు. ఇలియానాతో దేవదాసు తర్వాత టామ్ అండ్ జెర్రీ అనుకున్నాం. కానీ స్క్రిప్ట్‌లో కొంత క్లారిటీ లేక ఆ ప్రాజెక్ట్ విరమించుకున్నాం. త్వరలో మంచి స్క్రిప్ట్ దొరికితే ఇలియానాతో మళ్లీ నటిస్తానని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 May 2010 | 6:36 am "అది నువ్వే" లోగో ఆవిష్కరణచైతన్య, అక్ష హీరోహీరోయిన్లుగా నటించిన అది నువ్వే చిత్ర లోగోను మంగళవారం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాగర్ ఆవిష్కరించారు. ఫిలిమ్ నగర్ కల్చరల్ క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చిత్ర దర్శకుడు వీరప్రసాద్ అడుగు ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసి మరో అడుగుతో ముందుకు వస్తున్నారన్నారు. నటుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ.. తాను రొటీన్‌గానే హీరో ఫాదర్‌గా నటించినా , ఎంటర్‌టైన్మెంట్‌గా సాగే పాత్ర తనదని చెప్పారు. నటుడు పృథ్వీ మాట్లాడుతూ, చాలాకాలం తర్వాత మళ్లీ తెలుగులో ఈ సినిమా చేస్తున్నాననీ, కామెడీకి ఆస్కారమున్న పాత్ర తనదని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 May 2010 | 6:33 am నిఠారీ హత్య కేసులో సురేందర్ కోలీకి మరణశిక్షనిఠారీ హత్య కేసులో ఎంఎస్.పాంథెర్ సహచరుడు సురీందర్ కోలీకి మరణశిక్ష విధిస్తూ ఘజియాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. నోయిడాలోని నిఠారీ గ్రామంలో ఏడేళ్ళ బాలిక ఆర్తీపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో ఈ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.Source: జాతీయ | 12 May 2010 | 4:06 am అవసరమైతే రైతుల చెంతకు పాదయాత్ర: చిరంజీవిరైతులెదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తీసుకెళ్లేందుకు అవసరమైతే పాదయాత్ర చేస్తానని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ ఆయన బస్సు యాత్ర చేస్తున్న విషయం తెల్సిందే. ఈ యాత్రంలో భాగంగా బుధవారం ఉదయం రాజమండ్రి, సామర్లకోటలో విలేకరులతో మాట్లాడారు.Source: ఏపీ న్యూస్ | 12 May 2010 | 3:30 am దళితుల హత్య కేసులో ముగ్గురికి మరణదండనబీహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ జిల్లాలో 1996 సంవత్సరంలో 21 మంది దళితులను హత్య చేసిన కేసులో ముగ్గురి మరణశిక్ష విధిస్తూ స్థానిక కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. అలాగే, మరో 20 మందికి జీవిత కారాగారశిక్షలను విధించింది.Source: జాతీయ | 12 May 2010 | 2:58 am నాడు పనికి రాని రైతులు ఇప్పుడు గుర్తొచ్చారా: బొత్సతొమ్మిదేళ్ళ పాటు అధికారంలో ఉన్న సమయంలో పనికిరాని రైతులు ఇపుడు గుర్తొచ్చారా అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాజకీయ లబ్దికోసం ఏ ఎండకు ఆ గొడుగు పట్టే చంద్రబాబు.. రైతుల కష్టాల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉన్నాయని మంత్రి బొత్స ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 12 May 2010 | 2:45 am రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే: పయ్యావుల కేశవ్రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని తెలుగుదేశం పార్టీ యువ నేత పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యేకవాదం నానాటికీ బలహీన పడిపోతోందన్నారు. అందువల్ల రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని కోరినట్టు ఆయన బుధవారం మీడియాకు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 12 May 2010 | 1:33 am ఉగ్రవాదంపై పోరుకు పాక్ ఇంకా సహకరించాలి: రోమర్ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిసి పెట్టేందుకు పాకిస్థాన్ ఇంకా సహకారం అందించాలని అమెరికా స్పష్టం చేసింది. ఆప్ఘన్, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా చేస్తున్న పోరులో పాక్ సహకారం ఉందని, అయితే దీన్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.Source: జాతీయ | 12 May 2010 | 12:33 am సీడబ్ల్యూసీ సమావేశానికి డుమ్మా కొట్టిన మహారాష్ట్రఅంతర్రాష్ట్ర నదీ జలాల వివాదంపై కేంద్ర జల సంఘం ఛైర్మన్ అధ్యక్షతన బుధవారం న్యూఢిల్లీలో జరగాల్సిన సీడబ్ల్యూసీ సమావేశానికి మహారాష్ట్ర డుమ్మా కొట్టింది. గోదావరి జలాల వినియోగంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని అందువల్ల ఈ సమావేశానికి హాజరుకాలేమని మహారాష్ట్ర సీడబ్ల్యూసీకి వెల్లడించింది. ఫలితంగా ఈ సమావేశాన్ని రద్దు చేసినట్టు కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ ఎస్.కె.శ్రీవాస్తవ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి అత్యవసర లేఖను పంపించారు.Source: జాతీయ | 12 May 2010 | 12:20 am అధిష్టానం ఆదేశిస్తే పార్టీ అధ్యక్ష పగ్గాలు: బాలకృష్ణతెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఆ క్షణమే పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు సినీ నటుడు బాలకృష్ణ స్పష్టం చేశారు. ఆయన నటించిన తాజా చిత్రం 'సింహా' విజయాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోన్ని అన్ని శ్రీ నరసింహస్వామి ఆలయాలను సందర్శిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఆయన బుధవారం కృష్ణా జిల్లా వేదాద్రిలో యోగానంద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.Source: ఏపీ న్యూస్ | 12 May 2010 | 12:00 am ప్రాంతీయ సమస్యకు పరిష్కారం ఢిల్లీలోనే: రోశయ్యరాష్ట్రంలో నెలకొన్న ప్రాంతీయ సమస్యకు పరిష్కారం తమ వద్ద లేదని ముఖ్యమంత్రి కె.రోశయ్య స్పష్టం చేశారు. అప్పటి వరకు రాష్ట్ర ప్రజలంతా కలిసి మెలసి ఉండాలన్నదే తన అభిమతమని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాను అందరివాడినని, తనకు ప్రాంతీయ విభేదాలు లేవన్నారు. చేయి చేయి కలిపి ఓపికగా ఉందామని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర సమస్యలు, పేదల బాధలు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి బాగా తెలుసన్నారు.Source: ఏపీ న్యూస్ | 11 May 2010 | 11:39 pm వచ్చే 2011 నాటికి ఫోటో గుర్తింపు కార్డుల జారీ: చావ్లావచ్చే 2011 నాటికి అర్హులైన 76 కోట్ల మంది ఓటర్లకు ఫోటో గుర్తింపు కార్డులను అందజేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నవీన్ చావ్లా తెలిపారు. ఎన్నికల కమిషన్ ఏర్పడి 60 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవాల ఫొటో ఎగ్జిబిషన్‌ను చావ్లా మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల యంత్రాలు ఓటరుకు మరింత సన్నిహితంగా ఉండేందుకు వివిధ చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.Source: జాతీయ | 11 May 2010 | 10:17 pm సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎస్‌హెచ్ కపాడియాదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సరోష్ హోమీ కాపాడియా నియమితులయ్యారు. ఆయన సుప్రీంకోర్టుకు 38వ చీఫ్ జస్టీగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్రమాణం చేయించారు. చీఫ్ జస్టీస్‌గా ఆయన రెండున్నర సంవత్సరాల పాటు కపాడియా కొనసాగుతారు.Source: జాతీయ | 11 May 2010 | 10:05 pm విడుదలకు సిద్ధమైన "కొమరమ్ భీమ్"తెలంగాణా ప్రాంతంలోని ఆదిలాబాద్ జిల్లాలో 1935-40 మధ్య జరిగిన హక్కుల పోరాటం "కొమరం భీమ్" సినిమా ఇతివృత్తం. గోండు గిరిజనులను చైతన్యవంతులను చేసి ఆనాటి నిరంకుశ ప్రభుత్వాన్ని గడగడలాడించిన పోరాటవీరుడు భీమ్. స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు రగిలించిన స్ఫూర్తి కొమరమ్ భీమ్ జీవితంలో అడుగడుగునా కనిపిస్తుంది. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి అడవి బిడ్డల కష్టాలను అనుభవించిన అమాయక గిరిజనుడు సహజ పరిణామక్రమంలో మహానాయకుడిగా ఎదిగిన ఆదర్శప్రాయుడి జీవితాన్ని సినిమాగా తీయడం, దానికి నంది అవార్డుతోపాటు అంతర్జాతీయ ఆసియా చలనచిత్రోత్సవంలో ప్రశంసలు రావడం ఆనందించదగ్గ విషయమని చిత్ర దర్శకుడు అల్లాణి శ్రీధర్ తెలియజేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 11 May 2010 | 11:16 am నావి నేను చూసుకోవడానికే తీరిక లేదు: నమితటాప్ హీరోయిన్లకు తీరిక ఉండదనేది తెలిసిందే. గ్లామర్ డాళ్ నమితకు కూడా అస్సలు తీరికే దొరకడం లేదట. తను నటించిన సినిమాలను తాను చూడాలంటేనే తగిన సమయం దొరకడం లేదని వాపోతోంది. షూటింగ్ సమయాల్లోనే ఏ సీన్ ఎలా చేశామో, ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకున్నామోనని చూసుకుంటానని చెపుతోంది. సినిమా షూటింగ్ అయిపోయాక రోజువారి బిజీల్లో పడిపోయి తర్వాత ఏం చేయాలనేదానిపై ఆలోచన చేస్తామని అంటోంది. రోజూ షూటింగ్ హడావుడిలో ఏ సినిమాలో ఎలా చేశామో కూడా ఒక్కోసారి గుర్తుండదు. అభిమానులే వచ్చి.." అడవిలాంటి అందాలే ఆక్రమించాడే... సింహా సింహా" అంటూ సినిమా గురించి చెపితే నవ్వి ఊరుకుంటాం అని అసలు విషయాన్ని బయటపెట్టింది బొద్దందాల నమిత.Source: Yahoo! Telugu: Entertainment | 11 May 2010 | 9:05 am ఆల్వాల్ సత్యం పెట్రోలు బంకు వద్ద భారీ అగ్నిప్రమాదంసికింద్రాబాద్లోనున్న ఆల్వాల్‌లోని సత్య పెట్రోలు బంకులో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెట్రోలు అన్‌లోడ్ చేసేందుకు వచ్చిన ట్యాంకరు గోడను ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 11 May 2010 | 8:16 am ప్రభుత్వ తీరుతో సిగ్గుతో తలదించుకుంటున్నాం: జగన్రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కె.రోశయ్య సర్కారు అనుసరిస్తున్న వైఖరి ప్రజా ప్రతినిధులను ప్రజల మధ్య తిరగలేని పరిస్థితి నెలకొందని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా, మహిళలకు పావలా వడ్డీ రుణాలు అందక పోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాను సిగ్గుతో తలదించుకుంటున్నట్టు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 11 May 2010 | 7:11 am బహిరంగ విమర్శలు చేస్తే కఠిన చర్యలు: ధర్మపురిమంత్రుల అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ శ్రేణులు ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ హితవు పలికారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.Source: ఏపీ న్యూస్ | 11 May 2010 | 6:57 am మీకు నాదీ.. విజయశాంతిదీ.. రెండూ ఇస్తాం: కేసీఆర్తెలంగాణా ఉపఎన్నికల్లో పోటీకి దిగుతామని చెపుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో తెలంగాణా బిల్లును ప్రవేశపెట్టేలా చూడాలన్నారు.అలా చేస్తే నా పార్లమెంటు సీటుతోపాటు విజయశాంతి సీటును కూడా కాంగ్రెస్ పార్టీవారికే అప్పజెపుతామని అన్నారు.Source: ఏపీ న్యూస్ | 11 May 2010 | 6:43 am జుడాల సమ్మెతో దిగిన ప్రభుత్వం: రూ.55 లక్షలు విడుదలవరంగంలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన రెండు రోజుల సమ్మెతో ప్రభుత్వం దిగివచ్చింది. ఆగమేఘాలపై 55 లక్షల రూపాయల ఉపకార వేతనాలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి దానం నాగేందర్ వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 11 May 2010 | 5:58 am డార్లింగ్ ప్రభాస్ "నలుగురితో నారాయణ"ఇండస్ట్రీలో నలుగురితోపాటు తాను నడుస్తానని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సెలవిస్తున్నారు. ఆయన నటించిన డార్లింగ్ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. సినిమా విడుదలరోజు విదేశాలలో ఉన్నానని చెప్పారు. రిలీజ్ అంటే ఉండే టెన్షన్‌కు తాను గురయ్యాననీ, అయితే నూన్ షోకే అభిమానులు స్వీట్లు పంచుకోవడం తెలిశాక ఆనందించానని చెప్పారు. పెరిగిన నిర్మాణ వ్యయాన్ని అదుపు చేసే పనిలో భాగంగా హీరోలు కూడా తమ పారితోషికాలను తగ్గించుకుంటారా... అని అడిగితే... నలుగురితోపాటే నేను నడుస్తాను.Source: Yahoo! Telugu: Entertainment | 11 May 2010 | 5:33 am చలాకీ ట్రెయిలర్ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై ఆదిత్య బాబు కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రానికి "చలాకి" అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా మాదేష్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. రోమా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ చిత్రం ఆధారంగా రూపొందుతోంది. లేడీస్ కాలేజీలో ఓ కుర్రాడు ఎలా చేరాడు? దానికి కారణాలేమిటి? అన్న అంశంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.Source: Yahoo! Telugu: Entertainment | 11 May 2010 | 5:15 am జులై 15న పాక్ పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రివచ్చే జులై నెల 15వ తేదీన పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పాక్ విదేశాంగ మంత్రి షా మొహ్మద్ ఖురేషీతో ఆయన టెలిఫోన్ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కృష్ణ తెలిపారు.Source: జాతీయ | 11 May 2010 | 4:59 am నావి నేను చూసుకోవడానికే తీరిక లేదు: నమితటాప్ హీరోయిన్లకు తీరిక ఉండదనేది తెలిసిందే. గ్లామర్ డాళ్ నమితకు కూడా అస్సలు తీరికే దొరకడం లేదట. తను నటించిన సినిమాలను తాను చూడాలంటేనే తగిన సమయం దొరకడం లేదని వాపోతోంది. షూటింగ్ సమయాల్లోనే ఏ సీన్ ఎలా చేశామో, ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకున్నామోనని చూసుకుంటానని చెపుతోంది.Source: వినోదం | 11 May 2010 | 3:37 am యేడాది ఆఖరులో కసబ్‌కు ఉరిశిక్ష: జీకే.పిళ్లై వెల్లడిముంబై దాడుల కేసుల్లో ఉరిశిక్ష పడిన పాక్ జాతీయుడు అజ్మల్ అమీర్ కసబ్‌కు ఈ యేడాది ఆఖరులో శిక్షను అమలు చేసే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర హోంశాఖ కార్యదర్శి జీకే పిళ్లై తెలిపారు. దీనిపై ఆయన ఒక ప్రైవేట్ ఆంగ్ల టీవీ ఛానల్‌తో మంగళవారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును పైకోర్టులో సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేయకపోతే కసబ్‌ను ఈ యేడాది ఆఖరుకు ఉరితీసే అవకాశం ఉన్నట్టు చెప్పారు.Source: జాతీయ | 11 May 2010 | 3:35 am
|