|
భారత్‌లో పెరుగుతున్న అద్దె అమ్మల వ్యాపారం!!ఉత్తర భారతదేశంలో అద్దెల అమ్మల వ్యాపారం నానాటికీ పెరుగుతోంది. దీంతో విదేశీ దంపతుల జంటలు వీరిని ఆశ్రయిస్తూ తమ సంతానలేమి కొరతను తీర్చుకుంటున్నారు. కరవుతో పాటు.. ఆర్థిక పరిస్థితులు, పేదరికం కారణంగా అనేక మంది మహిళలు ఈ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.Source: Yahoo! Telugu: News | 10 May 2010 | 9:11 am ఏప్రిల్‌లో 9.69 శాతం మేరకు పెరిగిన ఆదాయం: రైల్వే శాఖప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో భారతీయ రైల్వే శాఖ రూ. 7,292.25 కోట్ల ఆదాయాన్ని పొందింది. అదే నిరుడు ఇదే కాలానికి తమ శాఖకు రూ. 6,648.08 కోట్లుగా ఉండిందని, దీంతో పోలిస్తే దాదాపు 9.69 శాతం మేరకు ఆదాయంలో వృద్ధి సాధించినట్లు ఆ శాఖ న్యూ ఢిల్లీలో సోమవారం ప్రకటించింది.Source: Yahoo! Telugu: News | 10 May 2010 | 8:35 am నేనే నెంబర్ వన్ అండ్ నెంబర్ జీరో"సింహా" హిట్ తర్వాత బాలకృష్ణ స్పందనకోసం మీడియా ఎగబడుతోంది. బాలయ్య ఎక్కడ కనబడినా సింహా చిత్రానికి సంబంధించిన ప్రశ్నలను ఆయనపై సంధిస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణను ఓ జర్నలిస్టు... సింహా టాలీవుడ్ బాక్సాఫీసులను షేక్ చేస్తోంది. ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మీరే నెంబర్ వన్ అని భావిస్తున్నారా...? అని ప్రశ్నించాడు. దాంతో బాలకృష్ణ కాస్త గొంతు సవరించుకుని ఇలా సమాధానిమిచ్చారు.గత 25 ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి హీరోల చిత్రాలతో తన చిత్రాలను పోల్చుకుని చూసినప్పుడు ఓ విషయం బోధపడుతుందన్నారు. అదేమంటే ఇండస్ట్రీలో ఏ ఒక్కరూ నెంబర్ వన్ కాదన్న సంగతి.Source: Yahoo! Telugu: Entertainment | 10 May 2010 | 8:27 am స్టాక్ మార్కెట్: 500 పాయింట్ల చేరువలో సెన్సెక్స్ ర్యాలీ!సోమవారం బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాల దిశగా ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 2.10 గంటల ప్రాంతంలో 488 పాయింట్లు భారీగా లాభపడింది. దీంతో సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లకు చేరువలో ర్యాలీని కొనసాగిస్తోంది. ఫలితంగా సెన్సెక్స్ సూచి 17,257 పాయింట్ల మార్కును తాకింది. ఇదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 147 పాయింట్లు భారీగా పుంజుకుని, 5,165 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 10 May 2010 | 8:20 am విద్యా రుణాలపై మరింతగా తగ్గనున్న వడ్డీః హెచ్ఆర్డీదేశంలోని విద్యార్థులకు అందజేస్తున్న విద్యా రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీని మరింతగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుంటోందని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ(హెచ్ఆర్‌డీ) తెలిపింది.Source: Yahoo! Telugu: News | 10 May 2010 | 8:00 am విదేశీ స్టాక్ మార్కెట్ల ప్రభావం: సెన్సెక్స్ భారీ వృద్ధి!అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే భారీగా పుంజుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో 475 పాయింట్లు భారీగా లాభపడింది. దీంతో సెన్సెక్స్ సూచి 17,245 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 153 పాయింట్లు భారీగా వృద్ధి చెంది, 5,171 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 10 May 2010 | 7:57 am పాకిస్థాన్‌లో షూ బాంబర్‌ను అరెస్టు చేసిన పోలీసులు!పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో షూ బాంబర్‌ను విమానాశ్రయ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. ఆ బాంబర్ బూటు (షూ) నుంచి ఎలక్ట్రికల్ సర్క్యూట్, బ్యాటరీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రొవిన్స్ ఖైబెర్ ఫక్తుంక్వా అనే ప్రాంతం నుంచి వచ్చినట్టు 30 సంవత్సరాల సివిల్ ఇంజనీర్ అధికారులకు చెప్పాడు. ఈ ప్రాంతంలో తాలిబన్లతో పాట ఇతర ఇస్లామిక్ మిలిటెంట్లు ప్రాబల్యం అధికంగా ఉంది. కరాచీ ఎయిర్‌పోర్టు నుంచి థాయ్ ఎయిర్‌వేస్‌లో మస్కట్‌కు వెళ్ళాల్సి ఉందని వివరించాడు.Source: Yahoo! Telugu: News | 10 May 2010 | 7:50 am చిదంబరంతో కేసీఆర్ లాలూచీ: అందుకే గప్‌చిప్!ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్య తమ చేతుల్లో లేదని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం (పీసీ) చేసిన ప్రకటనపై రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీసీ ప్రకటనను సీమాంధ్ర నేతలే కాకుండా కొంతమంది తెలంగాణ నేతలు సైతం స్వాగతిస్తున్నారు. అయితే, కరుడుగట్టిన తెలంగాణ వాదిగా ముద్రపడిన తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్ కె.చంద్రశేఖరరావు మాత్రం నోరుమెదపడం లేదు. ఇదే తరహాలో మరో రాజకీయ నేత వ్యాఖ్యలు చేసివుంటే.. ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యేవారు. కానీ, ప్రస్తుతం ఆయన మౌనం వహించడానికి కారణాలు మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు.Source: Yahoo! Telugu: News | 10 May 2010 | 7:21 am పుంజుకున్న ట్రేడింగ్: సెన్సెక్స్ 437 పాయింట్లు వృద్ధి!దేశీయ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 437 పాయింట్లు భారీగా వృద్ధి చెందింది. దీంతో సెన్సెక్స్ సూచి 437 పాయింట్లు లాభపడి, 17,206 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 139 పాయింట్లు భారీగా పుంజుకుని, 5,157 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 10 May 2010 | 7:08 am మందుకొట్టిన నవదీప్ అరెస్ట్: పవన్ కల్యాణ్ సేఫ్యువహీరో నవదీప్ అర్థరాత్రి మందుకొట్టి కారును అతివేగంగా నడుపుతుండగా బంజారాహిల్స్ పోలీసులు అతడి కారును అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో అగ్గిమీద గుగ్గిలం అయిన నవదీప్ వారిపై రెచ్చిపోయి మాట్లాడాడు. తన పవర్ గురించి వారి ముందు ఏకరవు పెట్టినట్లు సమాచారం. ఎంతచెప్పినా పోలీసులు నవదీప్ మాటలను లెక్క చేయక అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదిలావుండగా పవన్ కల్యాణ్ కూడా అదే దారిలో వస్తుడటంతో పోలీసులు ఆయన కారును కూడా ఆపారు. రాత్రివేళ ఇంత పొద్దుపోయి ఎక్కడికి వెళ్లి వస్తున్నావంటూ పవన్ కల్యాణ్ ను పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. కారుకు సంబంధించిన పత్రాలను పోలీసులు అడుగగా... పవన్ కల్యాణ్ తన కారుకు సంబంధించిన పేపర్లతోపాటు తను అంత పొద్దుపోయి రావడానికి గల కారణాలను, అందుకు తగిన ఆధారాలను కూడా చూపించారు. పవన్ కల్యాణ్ సమాధానాలకు సంతృప్తి చెందిన పోలీసులు ఆయనను విడిచిపెట్టారు. కానీ నవదీప్‌ను మాత్రం పట్టుకున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 May 2010 | 7:04 am గోద్రా అల్లర్లు: సిట్ ఎదుట హాజరైన ప్రవీణ్ తొగాడియా2002 అల్లర్ల కేసుకు సంబంధించి విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా సోమవారం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ఎదుట హాజరయ్యారు. పాత సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయ బ్లాక్ నెంబరు 11కు ఆయన ఉదయం 11 గంటల సమయంలో వచ్చారు. ఆయన వెంట పలువురు వీహెచ్‌పీ కార్యకర్తలు కూడా ఉన్నారు.Source: Yahoo! Telugu: News | 10 May 2010 | 6:59 am భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి!ఆసియా మార్కెట్ ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాలను ఆర్జిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 348 పాయింట్లు లాభపడి, 17,117 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 116 పాయింట్లు పుంజుకుని, 5,135 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.Source: Yahoo! Telugu: News | 10 May 2010 | 6:46 am గ్లామర్ తగ్గిందన్నారు.. అందుకే పెంచుకుంటున్నా: త్రిషసినిమా నటీనటులకు గ్లామర్ పోయిందంటే సినిమా ఛాన్సులు కూడా పోయినట్లే. వయసు మీద పడ్డా అది ముఖంలో తెలియకుండా జాగ్రత్త పడాలని బక్కపలచని భామ త్రిష చెపుతోంది. రోజువారీ క్రమం తప్పకుండా వ్యాయామం, ఈత లేదా యోగా చేస్తే కొంతమేర కప్పిపుచ్చుకోవచ్చని నిజాన్ని చెపుతోంది. ఇది తాను స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాననీ, అందుకే ఈమధ్య ఒంటికి శ్రమ కల్పిస్తున్నానని అంటోంది. మొదట్లో వీటిపై పెద్దగా శ్రద్ధ పెట్టేదాన్ని కాదని చెపుతోంది. కాకపోతే రానురాను గ్లామర్ తగ్గుతుందని స్నేహితులు అనడంతో వీటిపై దృష్టి పెట్టానని నిజాన్ని ఒప్పేసుకుంది.Source: Yahoo! Telugu: Entertainment | 10 May 2010 | 6:02 am నితిన్ హీరోగా జేడీ దర్శకత్వంలో కొత్త చిత్రంఇటీవలే హిందీ, తెలుగు, తమిళ భాషల్లో "ఆవహం" చిత్రం నిర్మించిన ప్రశాంత్ బుర్రా మరో భారీ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. నితిన్ హీరోగా జేడీ చక్రవర్తి దర్శకత్వంలో సార్థక్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఓ భారీ చిత్రం చేయబోతున్నారు.నిర్మాత ప్రశాంత్ బుర్రా మాట్లాడుతూ... యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న నితిన్‌తో చాలా వైవిధ్యంగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాం. హోమం, సిద్ధం చిత్రాలతో స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న జేడీ చక్రవర్తి కొత్త ట్రీట్‌మెంట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఆయన చెప్పిన కథ విని చాలా ఉద్వేగపడ్డాం. ఈ తరహా కథ ఇప్పటివరకూ తెలుగు తెరపై రాలేదు. నితిన్ ఇంతవరకూ ఈ తరహా సినిమా చేయలేదు. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాం అని తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 May 2010 | 5:52 am కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే తెలంగాణ: పొన్నంరాష్ట్రంలో జరుగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తీరుతామని కాంగ్రెస్ పార్టీ ఎంపీల కన్వీనర్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశాడు. ఆయన కరీంనగర్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని తెరాస నేతలు చేస్తున్న డిమాండ్ అర్థరహితమన్నారు.Source: ఏపీ న్యూస్ | 10 May 2010 | 4:18 am రాజ్యసభ ఎన్నికల్లో మేమూ పోటీ చేస్తాం: చిరంజీవిరాజ్యసభ ఎన్నికల్లో తాము కూడా పోటీ చేయనున్నట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రకటించారు. అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన సోమవారం విశాఖపట్నంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 10 May 2010 | 4:09 am మాజీ మంత్రి హలప్ప అరెస్టు: ఆస్పత్రిలో చేరికస్నేహితుని భార్యపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హాలప్పను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అంతలోనే ఆయనకు గుండె నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్చారు.Source: జాతీయ | 10 May 2010 | 3:54 am చిదంబరంతో కేసీఆర్ లాలూచీ: అందుకే గప్‌చిప్!ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్య తమ చేతుల్లో లేదని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం (పీసీ) చేసిన ప్రకటనపై రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీసీ ప్రకటనను సీమాంధ్ర నేతలే కాకుండా కొంతమంది తెలంగాణ నేతలు సైతం స్వాగతిస్తున్నారు. అయితే, కరుడుగట్టిన తెలంగాణ వాదిగా ముద్రపడిన తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్ కె.చంద్రశేఖరరావు మాత్రం నోరుమెదపడం లేదు. ఇదే తరహాలో మరో రాజకీయ నేత వ్యాఖ్యలు చేసివుంటే.. ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యేవారు. కానీ, ప్రస్తుతం ఆయన మౌనం వహించడానికి కారణాలు మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు.Source: ఏపీ న్యూస్ | 10 May 2010 | 3:02 am గోద్రా అల్లర్లు: సిట్ ఎదుట హాజరైన ప్రవీణ్ తొగాడియా2002 అల్లర్ల కేసుకు సంబంధించి విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా సోమవారం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ఎదుట హాజరయ్యారు. పాత సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయ బ్లాక్ నెంబరు 11కు ఆయన ఉదయం 11 గంటల సమయంలో వచ్చారు. ఆయన వెంట పలువురు వీహెచ్‌పీ కార్యకర్తలు కూడా ఉన్నారు.Source: జాతీయ | 10 May 2010 | 1:30 am రాష్ట్ర రాజధానికి చేరుకున్న జస్టీస్ శ్రీకృష్ణ కమిటీరాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సోమవారం చేరుకుంది. కమిటీ ఛైర్మన్ జస్టీస్ శ్రీకృష్ణతో పాటు కమిటీ సభ్యులు కూడా హైదరాబాద్‌కు వచ్చారు. స్థానిక లేక్‌వ్యూ అతిథి గృంహంలో వారు రెండు రోజుల పాటు సభలు, సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేపడుతారు. అలాగే, ఎంపిక చేసిన పలు ప్రాంతాల్లో కమిటీ సభ్యులు పర్యటించి అభిప్రాయాలు తెలుసుకుంటారు.Source: ఏపీ న్యూస్ | 10 May 2010 | 1:12 am అవినీతే కాంగ్రెస్ మంత్రుల పరమావధి: చంద్రబాబుచేతికి చిక్కినంత వరకు దోచుకోవడమే దినచర్యగా అధికార కాంగ్రెస్ మంత్రులు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గత ఆరు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగాయని ఆయన జోస్యం చెప్పారు. ప్రజలకు అండగా నిలవాల్సిన అధికారులే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని బాబు ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 10 May 2010 | 1:00 am గాలి సోదరులకు ఊరట: మైనింగ్‌కు పచ్చజెండాకర్ణాటక రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న గాలి సోదరులకు తాత్కాలిక ఊరట లభించింది. వివాద రహిత బూముల్లో భూముల్లో మైనింగ్ చేసుకునేందుకు సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.Source: జాతీయ | 10 May 2010 | 12:05 am సర్కస్‌లో తీగపై నడుస్తున్న చందంగా ఉంది: రోశయ్యప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి సర్కస్‌లో తీగపై నడుస్తున్న చందంగా ఉందని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. ఆదివారం గుంటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ ప్రభుత్వ పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అలాగే, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు.Source: ఏపీ న్యూస్ | 9 May 2010 | 11:41 pm భాగ్యనగరిలో కాంగ్రెస్ కూటమి: రంగారెడ్డిలో తెదేపారాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని రెండు స్థానాల్లో ఒకటి కాంగ్రెస్, మరొకటి మజ్లిస్ పార్టీలు వశం చేసుకున్నాయి. అలాగే, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాన్ని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.Source: ఏపీ న్యూస్ | 9 May 2010 | 11:30 pm మన ఎంపీలు చవటదద్దమ్మలు: చిరంజీవి మండిపాటుమన రాష్ట్రానికి చెందిన 42 మంది ఎంపీలు చవటదద్దమ్మలుగా తయారయ్యారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో పోల్చితే ఎందుకు పనికిరారన్నారు. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఆ ప్రాంత మంచినీరు, సాగునీటిపై కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తమకు కావాల్సిన పనులు చేయించుకుంటున్నారని గుర్తు చేశారు.Source: ఏపీ న్యూస్ | 9 May 2010 | 11:21 pm జార్ఖండ్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో త్రిముఖ పోటీ!జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో భారతీయ జనతా పార్టీకి చెందిన ముగ్గురు నేతల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హాతో పాటు మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి రఘువర్ దాస్‌లు సీఎం పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. కానీ, భాజపా అధిష్టానం మాత్రం గిరిజనేతర అభ్యర్థిని ఎంపిక చేయాని భావిస్తోంది. ఇదే నిజమైతే.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఎన్నిక లాంఛనప్రాయం కానుంది.Source: జాతీయ | 9 May 2010 | 10:11 pm కసబ్ ఉరి కంబం ఎక్కే అవకాశాలు లేవు: అరుణ్ జైట్లీపాకిస్థాన్ పౌరుడు, లష్కర్ తోయిబా తీవ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరికంబం ఎక్కే అవకాశాలు లేవని ప్రముఖ న్యాయవాది, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. ఆయన ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కసబ్‌కు ఇప్పట్లో ఉరిశిక్షను అమలు చేయబోరన్నారు.Source: జాతీయ | 9 May 2010 | 10:02 pm సెక్స్ ఆరోపణలు: ఎస్పీ ఎదుట లొంగిపోయిన హాలప్పసెక్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే హాలప్ప ఆదివారం లొంగిపోయారు. గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన.. షిమోగా జిల్లా ఎస్పీ ఎదుట ఆయన లొంగిపోయినట్టు ఆ జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.Source: జాతీయ | 9 May 2010 | 6:37 am మా యాత్రతో ఉలిక్కిపడుతున్న కాంగ్రెస్ నేతలు: చిరుపోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని తాను చేపట్టిన యాత్రతో అధికార కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావడం లేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. ఈ యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరానికి జాతీయహోదా కల్పించాలని, త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ పోలవరం బస్సు యాత్రను చేపట్టినట్టు చెప్పారు. ఈ యాత్ర ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారుSource: ఏపీ న్యూస్ | 9 May 2010 | 6:18 am రేపు జార్ఖండ్ సీఎం అభ్యర్థి ఎంపిక: వెంకయ్య నాయుడుజార్ఖండ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆ పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన హైదరాబాద్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. సోమవారం ఢిల్లీలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగనుందని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 9 May 2010 | 6:09 am గోవా పేలుళ్లపై ఈనెల 17న ఛార్జిషీటు దాఖలు: ఎన్ఐఏగోవా బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈనెల 17వ తేదీన ఛార్జిషీటును దాఖలు చేయనునుంది. మార్గవో, వాస్కోలలోని కోర్టుల్లో వేర్వేరుగా ఛార్జిషీటు దాఖలు చేయనున్నట్టు ఎన్ఐఏకు చెందిన సీనియర్ అధికారి ఆదివారం వెల్లడించారు.Source: జాతీయ | 9 May 2010 | 4:50 am జర్మన్ బేకరీ పేలుడులో ఇండియన్ ముజాహిద్దీన్ హస్తం!పూణెలోని జర్మన్ బేకరీ వద్ద జరగిన బాంబు పేలుడులో ఇండియన్ ముజాహిద్దీన్ హస్తం ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఈ పేలుళ్ళకు సంబంధించి అరెస్టు చేసిన ఒక నిందితుడి వద్ద జరిపిన విచారణలో వెల్లడైనట్టు మహారాష్ట్ర ఏటీఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ పేలుళ్ళకు సంబంధించి సల్మాన్ అలియాస్ చోటును మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 9 May 2010 | 2:45 am
|