|
ఇరాన్‌లో మహిళతో పాటు నలుగురికి ఉరిశిక్ష అమలుబాంబు పేలుడు కేసులో దోషిలుగు తేలిన యాంటీ రెవల్యూషనరీ గ్రూపునకు చెందిన ఐదుగురికి ఇరాన్ ప్రభుత్వం ఉరిశిక్షను ఆదివారం అమలు చేసింది. ఉరిశిక్ష అమలు చేసిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఐఆర్ఎన్ఏ న్యూస్ ఏజెన్సీ వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 9 May 2010 | 9:42 am జర్మన్ బేకరీ పేలుడులో ఇండియన్ ముజాహిద్దీన్ హస్తం!పూణెలోని జర్మన్ బేకరీ వద్ద జరగిన బాంబు పేలుడులో ఇండియన్ ముజాహిద్దీన్ హస్తం ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఈ పేలుళ్ళకు సంబంధించి అరెస్టు చేసిన ఒక నిందితుడి వద్ద జరిపిన విచారణలో వెల్లడైనట్టు మహారాష్ట్ర ఏటీఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ పేలుళ్ళకు సంబంధించి సల్మాన్ అలియాస్ చోటును మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 9 May 2010 | 8:15 am అవినీతి ఆరోపణలను నిగ్గు తేల్చండి: మంత్రి ధర్మానతనతో పాటు.. మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలను నిగ్గు తేల్చాలని రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్యమంత్రి రోశయ్యకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు.Source: Yahoo! Telugu: News | 9 May 2010 | 7:23 am చిదంబరం ప్రకటన 'సమైక్యాంధ్ర' తొలి విజయం: చిరుప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యకు పరిష్కారం ఢిల్లీలో లేదని రాష్ట్రం చేతుల్లోనే ఉందని కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటన సమైక్యాంధ్రకు లభించిన విజయంగా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. తాను చేపట్టిన పోలవరం యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.Source: Yahoo! Telugu: News | 9 May 2010 | 7:17 am ఇండోనేషియాలో భారీ భూకంపం: 7.4గా నమోదుఇండోనేషియాలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. ఈ భూకంపం ప్రభావంతో ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. అయితే, ఈ భూకంపం సముద్రంలో సంభవించిందని అందువల్ల భూకంపం వచ్చే అవకాశాలు లేవని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 9 May 2010 | 7:05 am రేపటి నుంచి 'రైతు యాత్ర'కు చంద్రబాబు శ్రీకారంతెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు యాత్ర పేరుతో రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం ఉదయం పది గంటలకు ప్రకాశం జిల్లా నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర సీమాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో సాగనుంది.Source: Yahoo! Telugu: News | 9 May 2010 | 6:14 am విజయ బ్యాంకు వ్యాపార లక్ష్యం రూ.1.26 లక్షల కోట్లుప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో బ్యాంకుల్లో ఒకటైన విజయ బ్యాంకు 2010-11 ఆర్థిక సంవత్సరంలో 1.26 లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. 2009-10 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 21 శాతం అధికమని ఆ బ్యాంకు వర్గాలు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 9 May 2010 | 6:07 am రాష్ట్రంలో మరిన్ని విద్యుత్ ప్రాజెక్టులు: మంత్రి సోలంకిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పనున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి భరత్ సింహ సొలంకి వెల్లడించారు. భాగ్యనగరంలో శనివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్ వజ్రోత్సవ వేడుకలల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.Source: Yahoo! Telugu: News | 9 May 2010 | 5:52 am దేశ వ్యాప్త సమ్మెను విరమించుకున్న నేపాల్ మావోలుఅధికార బదలాయింపు చేసేలా ప్రధానమంత్రి మాధవ్ కుమార్ నేపాల్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఆ దేశ మావోయిస్టులు చేపట్టిన సమ్మెను నేపాల్ మావోయిస్టులు నిలిపి వేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపాల్‌లో సాధారణ సమ్మెవల్ల జనజీవనం అస్తవ్యస్తమై పోయిందనే విమర్శలు వచ్చాయి. ప్రజా క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సమ్మెను విరమించుకున్నట్టు తిరుగుబాటుదారులు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 9 May 2010 | 5:46 am రేపు జమ్మూకాశ్మీర్‌లో న్యాయవాదుల రాష్ట్రవ్యాప్త సమ్మెరాష్ట్రంలో న్యాయవ్యవస్థ పతనం, జైళ్ళలో, బయట రాజకీయ ఖైదీలను చిన్నచూపు చూడటాన్ని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్ రాష్ట్ర న్యాయవాదులు ఆందోళన చేయనున్నారు. ఇందుకోసం సోమవారం రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఇదే రోజున ఆ రాష్ట్ర సచివాలయం జమ్మూ నుంచి శ్రీనగర్‌కు మారనుంది. ఇక్కడ సోమవారం నుంచే సచివాలయ కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి.Source: Yahoo! Telugu: News | 9 May 2010 | 5:17 am జర్మన్ బేకరీ పేలుడులో ఇండియన్ ముజాహిద్దీన్ హస్తం!పూణెలోని జర్మన్ బేకరీ వద్ద జరగిన బాంబు పేలుడులో ఇండియన్ ముజాహిద్దీన్ హస్తం ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఈ పేలుళ్ళకు సంబంధించి అరెస్టు చేసిన ఒక నిందితుడి వద్ద జరిపిన విచారణలో వెల్లడైనట్టు మహారాష్ట్ర ఏటీఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ పేలుళ్ళకు సంబంధించి సల్మాన్ అలియాస్ చోటును మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 9 May 2010 | 2:45 am అవినీతి ఆరోపణలను నిగ్గు తేల్చండి: మంత్రి ధర్మానతనతో పాటు.. మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలను నిగ్గు తేల్చాలని రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్యమంత్రి రోశయ్యకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు.Source: ఏపీ న్యూస్ | 9 May 2010 | 1:53 am చిదంబరం ప్రకటన 'సమైక్యాంధ్ర' తొలి విజయం: చిరుప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యకు పరిష్కారం ఢిల్లీలో లేదని రాష్ట్రం చేతుల్లోనే ఉందని కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటన సమైక్యాంధ్రకు లభించిన విజయంగా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. తాను చేపట్టిన పోలవరం యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 9 May 2010 | 1:47 am రేపటి నుంచి 'రైతు యాత్ర'కు చంద్రబాబు శ్రీకారంతెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు యాత్ర పేరుతో రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం ఉదయం పది గంటలకు ప్రకాశం జిల్లా నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర సీమాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో సాగనుంది.Source: ఏపీ న్యూస్ | 9 May 2010 | 12:45 am రేపు జమ్మూకాశ్మీర్‌లో న్యాయవాదుల రాష్ట్రవ్యాప్త సమ్మెరాష్ట్రంలో న్యాయవ్యవస్థ పతనం, జైళ్ళలో, బయట రాజకీయ ఖైదీలను చిన్నచూపు చూడటాన్ని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్ రాష్ట్ర న్యాయవాదులు ఆందోళన చేయనున్నారు. ఇందుకోసం సోమవారం రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఇదే రోజున ఆ రాష్ట్ర సచివాలయం జమ్మూ నుంచి శ్రీనగర్‌కు మారనుంది. ఇక్కడ సోమవారం నుంచే సచివాలయ కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి.Source: జాతీయ | 8 May 2010 | 11:48 pm "కసబ్"ను నా చేతులారా ఉరితీయాలి..!: యూపీ తలారీదేశ వాణిజ్య నగరం ముంబై దాడుల్లో కీలక సూత్రధారి, ఉరిశిక్ష పడిన అజ్మల్ కసబ్‌ను తన చేతులారా ఉరితీసే అవకాశం కల్పించాలని ఉత్తరప్రదేశ్‌కు చెందిన తలారి మిరాట్ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు ఓ లేఖలో విజ్ఞప్తి చేశాడు.Source: జాతీయ | 8 May 2010 | 11:09 pm ఇండస్ట్రీ నన్ను బాగా చూసుకుంటోది: బిందు మాధవిఇండస్ట్రీలోకి రాకమునుపు దాని గురించి చాలా విన్నాను. కానీ వచ్చాక... తెలిసింది అసలు నిజం ఏమిటో అని అంటోంది దబ్బముక్కు చిన్నది బిందు మాధవి. కొంతమంది తనను... " తెలుగమ్మాయివి కదా... ఇండస్ట్రీలో నిన్ను ఎలా చూస్తున్నారూ..?" అని ప్రశ్నిస్తుంటారని చెప్పుకొచ్చింది.దీనికి తను సమాధానం చెపుతూ... తెలుగు ఇండస్ట్రీ తనను బాలీవుడ్ తారలకంటే బాగానే చూసుకుంటోందని చెప్పింది. తనను ఎప్పుడూ చిన్నచూపు చూడలేదని అంటోంది. ఆవకాయ్ బిర్యానీ, బంపర్ ఆఫర్ చిత్రాల్లో నటించినా పెద్దగా పేరు రాకపోయినా రామ్ సరసన "రామరామ కృష్ణకృష్ణ"లో మాత్రం మంచి పాత్ర వేశానని పొంగి పోతోంది. ఈ పాత్ర ద్వారా తనకు మంచి గుర్తింపు వస్తుందని చెపుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 8 May 2010 | 11:32 am రామ్ చరణ్ కళ్లలో ఏదో తెలియని శక్తి ఉంది: కాజల్మగధీర చిత్రం తర్వాత మెరుపు చిత్రంతో మరోసారి రామ్ చరణ్ తేజతో జోడి కడుతున్న కాజల్ అగర్వాల్ రామ్ చరణ్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. రామ్ చరణ్ కళ్లలో ఏదో తెలియని శక్తి ఉన్నదనీ చెపుతోంది. సెట్స్‌లో చాలా చురుకుగా ఉండే చరణ్, అనుకున్నవిధంగా సీన్ వచ్చేవరకూ మహా పట్టుదలగా చేస్తారని అన్నది. అంతేకాదు మానసిక వైకల్యంతో బాధపడుతున్న 100 మంది అనాధ బాలలకు అన్నీ తానై వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని చెప్పింది. మగధీర చిత్రం సమయంలో చెప్పని సంగతులు మెరుపు చిత్రం ప్రారంభమైన సందర్భంలో చెప్పడానికి గల కారణాలు ఏమిటి మిస్... అని ఓ తుంటరి కుర్ర జర్నలిస్టు ప్రశ్నిస్తే... ఏది ఎప్పుడు చెప్పాలో తనకు తెలుసని చెపుతూ రెండు కళ్లను పెద్దవి చేసి గుడ్లురిమి చూసింది. అలా చూస్తే ఎవరు మాత్రం ఏం మాట్లాడుతారూ..?Source: Yahoo! Telugu: Entertainment | 8 May 2010 | 9:14 am మందుపాతర పేల్చిన మావోలు: ఆరుగురి జవాన్లు మృతిఛత్తీస్‌గఢ్ జిల్లాలో మావోయిస్టులు మరోమారు పెట్రేగి పోయారు. సీఆర్‌పీఎఫ్ బలగాలను లక్ష్యంగా చేసుకుని బీజాపూర్ జిల్లాలోని ఆవాపూర్‌లో శనివారం సాయంత్రం మందురపాతర పేల్చారు. ఈ పేలుడు ధాటికి బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్ తునాతునకలైంది. దీంతో ఆరుగురు జవాన్లు మృత్యువాత పడగా, మరో 13 మంది గాయపడ్డారు.Source: జాతీయ | 8 May 2010 | 8:54 am ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు గాక గెలవదు: యాష్కీతెలంగాణ ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే ఒక్క సీటులో కూడా గెలువదు గాక గెలవదని ఆ పార్టీకి చెందిన లోక్‌సభ (నిజామాబాద్) సభ్యుడు మధు యాష్కీ జోస్యం చెప్పారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేయనున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన శనివారం స్పందించారు.Source: ఏపీ న్యూస్ | 8 May 2010 | 6:15 am జగన్ సక్సెస్ సీక్రెట్ తెలుసుకునేందుకు యువత ఆసక్తి!దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి సక్సెస్ సీక్రెట్‌ను తెలుసుకునేందుకు రాష్ట్ర యువత అమితాసక్తి చూపుతోంది. కేవలం ఐదారేళ్ళ కాలంలో జగన్ ఏవిధంగా కోట్లాది రూపాయలు వెనుకేసుకున్నారనే అంశంపై ఎప్పటి నుంచో చర్చ సాగుతోంది. అయితే, మన రాష్ట్రానికి చెందిన యువకులు మాత్రం ఈ చర్చపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు గానీ... ఆయన సక్సెస్ సీక్రెట్‌ను తెలుసుకునేందుకు ఆతురతగా ఉన్నారు.Source: ఏపీ న్యూస్ | 8 May 2010 | 5:53 am రెండో దశ ఓదార్పు యాత్రపై జగన్ మల్లగుల్లాలు!కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న రెండో దశ ఓదార్పు యాత్రపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ యాత్రను వరంగల్ నుంచి ప్రారంభిస్తానని గతంలో జగన్ ప్రకటించారు. అయితే, తాను చేపట్టే రెండో దశ యాత్రకు తెలంగాణావాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదరుకావొచ్చని భావిస్తున్నారు. ఫలితంగా వరంగల్ నుంచి యాత్రను ప్రారంభించే అంశంపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 8 May 2010 | 5:25 am రూ. 2, 500 కోట్లతో వాల్ట్‌డిస్నీ "ప్రిన్స్ ఆఫ్ పర్షియా"2,500 కోట్ల రూపాయలతో వాల్ట్ డిస్నీ సంస్థ "ప్రిన్స్ ఆఫ్ పర్షియ" చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగులో రత్న సెల్యులాయిడ్స్ అధినేత జక్కం జవహర్ బాబు, మల్టి డైమన్షన్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వాసు అందిస్తున్నారు. 150 థియేటర్లలో ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లు వాసు తెలిపారు. కథ గురించి చెపుతూ... ఇండియాలో కథ ప్రారంభమై పర్షియాలో ముగిసే కథాంశంతో... పర్షియా దేశానికి దేవుడిచ్చిన కానుకల వల్ల దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆ కానుకను చేజిక్కించుకుని ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకోవాలని ప్రతినాయకుడు నవాబ్ భావిస్తాడు. అయితే పర్షియా యువరాజు, అతని ప్రియురాలు, పొరుగు దేశపు యువరాణి కలిసి నవాబు దుష్ట పన్నాగానికి అడ్డుకట్టవేసి ప్రజలకు ఏరకంగా మేలు చేశారన్నది కథ.Source: Yahoo! Telugu: Entertainment | 8 May 2010 | 5:18 am 2011 జనాభా లెక్కల్లో దలైలామా వివరాలు చేర్పుకేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2011 జనాభా లెక్కల్లో భాగంగా టిబెట్ ప్రజల బౌద్ధ మత ఆధ్యాత్మిక గురువు దలైలామా వివరాలను జనగణన అధికారులు పొందుపరిచారు. తన వ్యక్తిగత వివరాలు ఇచ్చేందుకు ఈ వృద్ధనేత ఎంతో ఉత్సాహం ఊపించారు. గత ఐదు దశాబ్దాలుగా భారతమాత గడ్డపై ఆశ్రయం పొందుతున్నానని, ఈ సందర్భంగా తన పేరును 2011 జనాభా లెక్కల్లో చేర్చడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.Source: జాతీయ | 8 May 2010 | 5:01 am 12న రామరామ కృష్ణకృష్ణ... 20న చలాకీరామ్, ప్రియానంద్, బిందుమాధవి హీరోహీరోయిన్లుగా దిల్ రాజు నిర్మించిన చిత్రం రామరామ కృష్ణకృష్ణ. ఈ చిత్రాన్ని ఈనెల 12న విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలియజేశారు. ఈ చిత్ర వైబ్‌సైట్‌ను శుక్రవారం హీరో రామ్ ఆవిష్కరించారు. ఇందులో సినిమాకు సంబంధించిన వివరాలుంటాయని చెప్పారు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం రూపొందిందనీ, అందరూ ఆదరించేటట్లుగా ఉంటుందన్నారు. కొందరు రాముడిగా, కొందరికి కృష్ణుడిగా కన్పించే పాత్ర తనదనీ, శ్రీవాసు తీర్చిదిద్దిన విధానం చాలా బాగుందన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఎం. రత్నంSource: Yahoo! Telugu: Entertainment | 8 May 2010 | 4:53 am ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాకు మద్దతు: హేమంత్జార్ఖండ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్టు జార్ఖండ్ ముక్తి మోర్ఛా (జేఎంఎం) చీఫ్ శిబూ సొరేన్ తనయుడు హేమంత్ సొరేన్ శనివారం వెల్లడించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీతో శనివారం సమావేశం నిర్వహించిన తర్వాత ఆయన ఈ విషయం వెల్లడించారు.Source: జాతీయ | 8 May 2010 | 3:36 am
|