|
రామ్ చరణ్ కళ్లలో ఏదో తెలియని శక్తి ఉంది: కాజల్మగధీర చిత్రం తర్వాత మెరుపు చిత్రంతో మరోసారి రామ్ చరణ్ తేజతో జోడి కడుతున్న కాజల్ అగర్వాల్ రామ్ చరణ్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. రామ్ చరణ్ కళ్లలో ఏదో తెలియని శక్తి ఉన్నదనీ చెపుతోంది. సెట్స్‌లో చాలా చురుకుగా ఉండే చరణ్, అనుకున్నవిధంగా సీన్ వచ్చేవరకూ మహా పట్టుదలగా చేస్తారని అన్నది. అంతేకాదు మానసిక వైకల్యంతో బాధపడుతున్న 100 మంది అనాధ బాలలకు అన్నీ తానై వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని చెప్పింది. మగధీర చిత్రం సమయంలో చెప్పని సంగతులు మెరుపు చిత్రం ప్రారంభమైన సందర్భంలో చెప్పడానికి గల కారణాలు ఏమిటి మిస్... అని ఓ తుంటరి కుర్ర జర్నలిస్టు ప్రశ్నిస్తే... ఏది ఎప్పుడు చెప్పాలో తనకు తెలుసని చెపుతూ రెండు కళ్లను పెద్దవి చేసి గుడ్లురిమి చూసింది. అలా చూస్తే ఎవరు మాత్రం ఏం మాట్లాడుతారూ..?Source: Yahoo! Telugu: Entertainment | 8 May 2010 | 9:14 am రెండు బాలిస్టిక్ మిస్సైల్స్‌ను పరీక్షించిన పాకిస్థాన్శత్రుదేశం పాకిస్థాన్ మరోమారు బాలిస్టిక్ మిస్సైల్స్‌ను విజయవంతంగా ప్రయోగించింది. అణ్వాయుధాలను మోసుకెళ్ళగలిగే సామర్థ్యం కలిగిన షహీనా-1, ఘజ్నవి అనే క్షిపణులను ఆ దేశ రక్షణ శాఖ శనివారం పరీక్షించింది.Source: Yahoo! Telugu: News | 8 May 2010 | 9:13 am ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాకు మద్దతు: హేమంత్జార్ఖండ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్టు జార్ఖండ్ ముక్తి మోర్ఛా (జేఎంఎం) చీఫ్ శిబూ సొరేన్ తనయుడు హేమంత్ సొరేన్ శనివారం వెల్లడించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీతో శనివారం సమావేశం నిర్వహించిన తర్వాత ఆయన ఈ విషయం వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 8 May 2010 | 9:06 am "సాక్షి" రాతలు కాంగ్రస్‌కు వెన్నుపోటు లాంటివి: వీహెచ్కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్ హనుమంతరావు సాక్షి పత్రిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలను రాస్తోందంటూ ధ్వజమెత్తారు. ఒకప్రక్క పత్రికపై వైఎస్సార్ బొమ్మ వేస్తూ దానికింద కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ రాయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఏదైనా వాస్తవ పరిస్థితులను తెలుసుకుని రాయాలని అన్నారు.Source: Yahoo! Telugu: News | 8 May 2010 | 7:18 am కేసీఆర్.. తెలంగాణా ప్రజలు నీకు బుద్ధి చెప్పే రోజు వస్తుందితెలుగుతెరపై హిట్ హీరో అనిపించుకున్న మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఫ్లాప్‌స్టార్ అయ్యారని అటు తెలుగుదేశం ఇటు కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. మరోవైపు తెలంగాణా ప్రాంత నాయకుడు తెరాస అధినేత కేసీఆర్ సైతం చిరంజీవి మాటలు తెలివితక్కువ మాటలంటూ ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు.Source: Yahoo! Telugu: News | 8 May 2010 | 6:52 am కేసీఆర్ అంటే ఎంతో గౌరవం ఉంది: ఎంపీ లగడపాటితెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అంటే తనకు ఎంతో గౌరవమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. అయితే, ఆయన వాడే భాషపైనే తాను ఆగ్రహిస్తానని చెప్పారు.Source: Yahoo! Telugu: News | 8 May 2010 | 6:27 am 2009-10లో ఎరువుల సబ్సీడీ రూ.64,032 కోట్లు: కేంద్రం2009-10 ఆర్థిక సంవత్సరంలో ఎరువులకు 64,032.30 కోట్ల రూపాయల మేరకు సబ్సీడీ ఇచ్చినట్టు కేంద్ర ఎరువులు, రసాయన శాఖ సహాయమంత్రి శ్రీకాంత్ కుమార్ జానా తెలిపారు. పార్లమెంట్ ముగింపు సమావేశాల రోజైన శుక్రవారం రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.Source: Yahoo! Telugu: News | 8 May 2010 | 6:16 am వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముషారఫ్ సంసిద్ధత!పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. పాకిస్థాన్‌లో తదుపరి జరిగే ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ విషయాన్ని ప్రవాసంలో ఉన్న ముషారఫ్ సూచన ప్రాయంగా వెల్లడించారు. ఇందుకోసం ఆయన స్వదేశీయాగమనం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.Source: Yahoo! Telugu: News | 8 May 2010 | 5:44 am ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ ఫోన్ బెదిరింపు: భద్రత పెంపుఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రాణాలకు ముప్పు పొంచివుంది గుర్తు తెలియని అగంతకుల నుంచి ఫోన్ కాల్ బెదిరింపు వచ్చింది. ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఈ ఫోన్ కాల్ రావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌కు కల్పించే భద్రతను మరింత పటిష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 8 May 2010 | 5:28 am రూ. 2, 500 కోట్లతో వాల్ట్‌డిస్నీ "ప్రిన్స్ ఆఫ్ పర్షియా"2,500 కోట్ల రూపాయలతో వాల్ట్ డిస్నీ సంస్థ "ప్రిన్స్ ఆఫ్ పర్షియ" చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగులో రత్న సెల్యులాయిడ్స్ అధినేత జక్కం జవహర్ బాబు, మల్టి డైమన్షన్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వాసు అందిస్తున్నారు. 150 థియేటర్లలో ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లు వాసు తెలిపారు. కథ గురించి చెపుతూ... ఇండియాలో కథ ప్రారంభమై పర్షియాలో ముగిసే కథాంశంతో... పర్షియా దేశానికి దేవుడిచ్చిన కానుకల వల్ల దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆ కానుకను చేజిక్కించుకుని ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకోవాలని ప్రతినాయకుడు నవాబ్ భావిస్తాడు. అయితే పర్షియా యువరాజు, అతని ప్రియురాలు, పొరుగు దేశపు యువరాణి కలిసి నవాబు దుష్ట పన్నాగానికి అడ్డుకట్టవేసి ప్రజలకు ఏరకంగా మేలు చేశారన్నది కథ.Source: Yahoo! Telugu: Entertainment | 8 May 2010 | 5:18 am 432 కోట్ల డాలర్ల రుణాలు పొందిన భారత సంస్థలుదేశంలోని వివిధ పారిశ్రామిక సంస్థలు మార్చి 31వ తేదీతో ముగిసిన 2009-10 ఆర్థిక సంవత్సరంలో 432 కోట్ల డాలర్ల విదేశీ రుణాలు సేకరించాయి. ఈ మొత్తం క్రితం ఆర్థిక సంవత్సరం కంటే మూడు రెట్లు అధికం. 208-09 ఆర్థిక సంవత్సరంలో ఈ రుణాల మొత్తం 111 కోట్ల డాలర్లుగా ఉంది. ఈ యేడాది ఒక్క ఫిబ్రవరి నెలలోనే విదేశాల నుంచి 219 కోట్ల డాలర్ల రుణాలు పొందడం గమనార్హం.Source: Yahoo! Telugu: News | 8 May 2010 | 4:56 am 12న రామరామ కృష్ణకృష్ణ... 20న చలాకీరామ్, ప్రియానంద్, బిందుమాధవి హీరోహీరోయిన్లుగా దిల్ రాజు నిర్మించిన చిత్రం రామరామ కృష్ణకృష్ణ. ఈ చిత్రాన్ని ఈనెల 12న విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలియజేశారు. ఈ చిత్ర వైబ్‌సైట్‌ను శుక్రవారం హీరో రామ్ ఆవిష్కరించారు. ఇందులో సినిమాకు సంబంధించిన వివరాలుంటాయని చెప్పారు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం రూపొందిందనీ, అందరూ ఆదరించేటట్లుగా ఉంటుందన్నారు. కొందరు రాముడిగా, కొందరికి కృష్ణుడిగా కన్పించే పాత్ర తనదనీ, శ్రీవాసు తీర్చిదిద్దిన విధానం చాలా బాగుందన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఎం. రత్నంSource: Yahoo! Telugu: Entertainment | 8 May 2010 | 4:53 am చిదంబరం తాజా వ్యాఖ్యలతో తెలంగాణకు బ్రేక్: చిరుకేంద్ర హోం మంత్రి చిదంబరం రాజ్యసభలో చేసిన తాజా ప్రకటనతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బ్రేక్ పడినట్టేనని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. పోలవరం బస్సు యాత్రలో ఉన్న ఆయన.. హోమంత్రి ప్రకటనపై స్పందించారు. రాష్ట్రం పచ్చగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటూ చిదంబరం చేసిన వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నట్టు చెప్పారు.Source: Yahoo! Telugu: News | 8 May 2010 | 4:41 am ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాకు మద్దతు: హేమంత్జార్ఖండ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్టు జార్ఖండ్ ముక్తి మోర్ఛా (జేఎంఎం) చీఫ్ శిబూ సొరేన్ తనయుడు హేమంత్ సొరేన్ శనివారం వెల్లడించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీతో శనివారం సమావేశం నిర్వహించిన తర్వాత ఆయన ఈ విషయం వెల్లడించారు.Source: జాతీయ | 8 May 2010 | 3:36 am "సాక్షి" రాతలు కాంగ్రస్‌కు వెన్నుపోటు లాంటివి: వీహెచ్కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్ హనుమంతరావు సాక్షి పత్రిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలను రాస్తోందంటూ ధ్వజమెత్తారు. ఒకప్రక్క పత్రికపై వైఎస్సార్ బొమ్మ వేస్తూ దానికింద కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ రాయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఏదైనా వాస్తవ పరిస్థితులను తెలుసుకుని రాయాలని అన్నారు.Source: ఏపీ న్యూస్ | 8 May 2010 | 1:50 am కేసీఆర్ అంటే ఎంతో గౌరవం ఉంది: ఎంపీ లగడపాటితెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అంటే తనకు ఎంతో గౌరవమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. అయితే, ఆయన వాడే భాషపైనే తాను ఆగ్రహిస్తానని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 8 May 2010 | 1:27 am కేసీఆర్.. తెలంగాణా ప్రజలు నీకు బుద్ధి చెప్పే రోజు వస్తుందితెలుగుతెరపై హిట్ హీరో అనిపించుకున్న మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఫ్లాప్‌స్టార్ అయ్యారని అటు తెలుగుదేశం ఇటు కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. మరోవైపు తెలంగాణా ప్రాంత నాయకుడు తెరాస అధినేత కేసీఆర్ సైతం చిరంజీవి మాటలు తెలివితక్కువ మాటలంటూ ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు.Source: ఏపీ న్యూస్ | 8 May 2010 | 1:23 am ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ ఫోన్ బెదిరింపు: భద్రత పెంపుఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రాణాలకు ముప్పు పొంచివుంది గుర్తు తెలియని అగంతకుల నుంచి ఫోన్ కాల్ బెదిరింపు వచ్చింది. ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఈ ఫోన్ కాల్ రావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌కు కల్పించే భద్రతను మరింత పటిష్టం చేశారు.Source: జాతీయ | 7 May 2010 | 11:58 pm చిదంబరం తాజా వ్యాఖ్యలతో తెలంగాణకు బ్రేక్: చిరుకేంద్ర హోం మంత్రి చిదంబరం రాజ్యసభలో చేసిన తాజా ప్రకటనతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బ్రేక్ పడినట్టేనని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. పోలవరం బస్సు యాత్రలో ఉన్న ఆయన.. హోమంత్రి ప్రకటనపై స్పందించారు. రాష్ట్రం పచ్చగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటూ చిదంబరం చేసిన వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నట్టు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 7 May 2010 | 11:11 pm ఫలించిన చర్చలు: రొటేషన్ పద్దతికి జేఎంఎం డిమాండ్జార్ఖండ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని పరిష్కరించేందుకు జరిపిన చర్చలు ఫలించినట్టుగా కనిపిస్తున్నాయి. అటు భారతీయ జనతా పార్టీ, ఇటు.. జేఎంఎం నేతలు పలు దఫాలుగా చర్చలు జరిపి పట్టువిడుపుల ధోరణి కనపరచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, ముఖ్యమంత్రి పదవిని రొటేషన్ విధానంలో చేపట్టాలని జేఎంఎం డిమాండ్ చేస్తుండగా, భాజపా మాత్రం కీలక మంత్రిపదవులు తమకు కేటాయించాలని పట్టుబడుతోంది.Source: జాతీయ | 7 May 2010 | 10:14 pm పార్లమెంట్ ముందుకు వచ్చిన "అణు" పరిహార బిల్లుకేంద్రంలోని యూపీఏ సంకీర్ణ సర్కారు ఎట్టకేలకు వివాదాస్పద అణు ప్రమాద పరిహార బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. శుక్రవారంతో ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును కేంద్ర మంత్రి పృథ్విరాజ్ చౌహాన్ ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నిరసనల మధ్య ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రాజ్యాంగంలోని వివిధ అధికరణాలకు వ్యతిరేకమని, ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఆరోపించారు.Source: జాతీయ | 7 May 2010 | 9:52 pm వెంకటేష్ చిత్రంలో పగతో రగిలిపోయే పాత్రలో అనుష్కవిక్టరీ వెంకటేష్ డాక్టర్‌గా నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. గత మూడు రోజులుగా అనుష్కపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. చంద్రముఖి తన పగ తీరిపోగానే పాము రూపంలో వెళ్లిపోవడం చూశాం. అక్కడ నుంచి కథ ప్రారంభమై మళ్లీ ప్రతీకారం తీర్చుకునే దిశగా కథ తయారు చేశారు దర్శకుడు వాసు. అనుష్క దెయ్యం రూపంలో పగ ప్రతీకారంతో రగిలిపోయే సన్నివేశాలను రామానాయుడు స్టూడియోలో చిత్రీకరించినట్లు తెలిసింది. దీక్షితులు పాత్రధారి అనుష్కను కంట్రోల్ చేసే సన్నివేశముంది. నేటితో ఈ సన్నివేశం పూర్తవుతుంది. ఈ నెల 12 నుంచి విజయనగరం కోరుకొండ సైనిక్ స్కూల్ దగ్గర 40 లక్షల రూపాయల ఖర్చుతో వేసిన ప్యాలెస్ సెట్‌లో షూటింగ్ జరుగుతుంది.Source: Yahoo! Telugu: Entertainment | 7 May 2010 | 12:41 pm రోశయ్యవి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు: గోనెముఖ్యమంత్రి రోశయ్య బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని గోనె ప్రకాశ్ ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం అండ చూసుకుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కొన్ని గ్రూపులను ఆయన ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు.Source: ఏపీ న్యూస్ | 7 May 2010 | 8:23 am నా మీసం నుంచే "సింహా" కథ పుట్టింది: బాలకృష్ణనందమూరి బాలకృష్ణ "సింహా" సక్సెస్ ఊపులో చాలా హుషారుగా కనిపిస్తున్నారు. గురువారం రాత్రి సింహా సక్సెస్ మీట్ సినీమ్యాక్స్‌లో జరిగింది. సంగీత దర్శకుడు చక్రిని ఆహ్వానించేటపుడు కుర్చీలోంచి లేచి ఎగిరి గంతేసి.. "మా చక్రి అంటూ ఆప్యాయంగా ఆహ్వానం పలికారు. ఈ సినిమా ఆడియోలోనే చెప్పాను. మంచి సక్సెస్ చిత్రం అవుతుందనీ. ఒకటి కాదు.. రెండు కాదు.. అన్ని పాటలు హిట్ చేశాడు చక్రి" అంటూ బాలయ్య అభినందించారు. అయితే ఈసారి తన ఉపన్యాసంలో ఆచితూచి స్పందిస్తూ... ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా మాట్లాడటం విశేషం. హీరోయిన్ల గురించి పాజిటివ్‌గానే మాట్లాడుతూ... "హొయలు ఒలకబోసే నయనతారను దర్శకుడు తెలుగమ్మాయిలా చూడగానే నమస్కరించేట్లుగా తీర్చి దిద్దాడు. ఇక నమిత.. అలాగే స్నేహా ఉల్లాల్ పాత్రలు కూడా బాగానే ఉన్నాయి. సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా సరిపోయారు" అని పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 7 May 2010 | 7:17 am సిబిఐని దుర్వినియోగం చేస్తున్న కాంగ్రెస్: భాజపాకేంద్రంలో అధికారంలోనున్న కాంగ్రెస్ పార్టీ తన స్వార్థం కోసం సిబిఐని రాజకీయ ఆయుధంలా దుర్వినియోపరుస్తోందని భారతీయ జనతాపార్టీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు శుక్రవారం ఫిర్యాదు చేసింది.Source: జాతీయ | 7 May 2010 | 6:18 am ప్రజాసేవ చేసేవారు "దేహీ" అని అడుక్కోవడమెందుకు..?: వర్మఅనంతపురం ఫ్యాక్షన్ గొడవలను ఇతివృత్తంగా తీసుకుని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం "రక్త చరిత్ర-1" విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలావుంటే రక్తచరిత్ర తర్వాత తాను "పొలిటికల్ ఇండస్ట్రీ" పేరుతో ఓ సినిమాను రూపొందించబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ఈ చిత్రం కుళ్లు రాజకీయాలను ఎండగడుతుందా... లేదంటే రాజకీయాల్లో అవినీతిపై బాణం ఎక్కుపెడుతుందా అని అడిగిన ప్రశ్నకు వర్మ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.అసలు ప్రజలకు సేవ చేయాలనే నాయకులు ఓట్లకోసం దేహీ అని ప్రజలను అడుక్కోవడం ఎందుకో తనకు అర్థం కాని ప్రశ్న అని అన్నారు. ఈ ప్రశ్నను ఆధారం చేసుకుని తన పొలిటికల్ ఇండస్ట్రీ ఉంటుందని చెప్పారు. ప్రజాసేవ చేయదలుచుకున్నవారు తన ప్రొఫైల్‌ను ప్రజల ముందు ఉంచి సేవ చేయదలచుకున్నానని ఓ ప్రకటన ఇస్తే సరిపోతుందనీ, అలా కాకుండా అనేకమైన పద్ధతుల ద్వారా ప్రజలను బుట్టలో వేసుకునేందుకు నాయకులు ప్రయత్నించడాన్ని చూసినప్పుడు చిత్రంగా ఉంటుందన్నారు వర్మ.Source: Yahoo! Telugu: Entertainment | 7 May 2010 | 6:03 am గత మూడేళ్లలో 3,450 మంది రైతుల ఆత్మహత్యలుమహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా గడచిన మూడేళ్ళ కాలంలో దేశ వ్యాప్తంగా 3,450 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ శుక్రవారం వెల్లడించారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే మహారాష్ట్రలోనే ఎక్కువ మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని చెప్పారు.Source: జాతీయ | 7 May 2010 | 4:43 am పనీపాటలేని ఎంఓఎస్‌లు ఎందుకు: రాయపాటి ప్రశ్నకాంగ్రెస్ అధిష్టానంపై గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు మండిపడ్డారు. పార్టీలో సీనియర్లుగా ఉన్న తమకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఈ దఫా జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ పదవికి కేటాయించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పరిస్థితి మరోలా ఉంటుందని ఆయన హెచ్చరించారు.Source: ఏపీ న్యూస్ | 7 May 2010 | 4:02 am వీలైనంత త్వరగా కసబ్‌ను ఉరి తీయాలి: వెంకయ్యముంబై దాడుల కేసుల్లో దోషిగా తేలిన పాకిస్థాన్ తీవ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్షను వీలైనంత త్వరగా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురు కేసులో కసబ్ కేసును మార్చొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.Source: ఏపీ న్యూస్ | 7 May 2010 | 3:40 am నిర్హేతుకంగా గవర్నర్లను మార్చొద్దు: సుప్రీం ధర్మాసనంకేంద్రంలో ప్రభుత్వాలు మారినపుడల్లా గవర్నర్లను నిర్హేతుకంగా మార్చవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వాలు మారినపుడల్లా గవర్నర్లను మార్చాలని భావిస్తే అందుకు సంబంధించి సహేతుకమైన కారణాలు చూపించాలని చీఫ్ జస్టీస్ కేజీ.బాలకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో ఏర్పడిన ధర్మాసనం తీర్పు నిచ్చింది.Source: జాతీయ | 7 May 2010 | 3:02 am
|