పనీపాటలేని ఎంఓఎస్‌లు ఎందుకు: రాయపాటి ప్రశ్న

కాంగ్రెస్ అధిష్టానంపై గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు మండిపడ్డారు. పార్టీలో సీనియర్లుగా ఉన్న తమకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఈ దఫా జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ పదవికి కేటాయించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పరిస్థితి మరోలా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
Source: Yahoo! Telugu: News | 7 May 2010 | 9:31 am

10 గ్రాముల బంగారం ధర 18 వేల రూపాయలు

దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు శుక్రవారం పైపైకి ఎగబాకాయి. దీంతో ప్రతి పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 563ల మేరకు పెరిగి రూ. 18,000లకు చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 7 May 2010 | 9:22 am

వీలైనంత త్వరగా కసబ్‌ను ఉరి తీయాలి: వెంకయ్య

ముంబై దాడుల కేసుల్లో దోషిగా తేలిన పాకిస్థాన్ తీవ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్షను వీలైనంత త్వరగా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌ దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురు కేసులో కసబ్ కేసును మార్చొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Source: Yahoo! Telugu: News | 7 May 2010 | 9:10 am

నంబర్ టెన్ డౌనింగ్ స్ట్రీట్ వైపు కామెరాన్ అడుగులు

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు ఏమాత్రం తీసిపోలేదు. ఈ సర్వేలు వెల్లడించినట్టుగానే బ్రిటన్‌లో హంగ్ పార్లమెంట్ ఆవిష్కృతమైంది. ప్రత్యర్థి కన్జర్వేటివ్ నేత డేవిడ్ కామెరాన్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని నంబర్ టెన్ డౌనింగ్ స్ట్రీట్ వైపు అడుగులు వేస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 7 May 2010 | 8:56 am

ముంబై స్టాక్ మార్కెట్: కొనసాగుతున్న నష్టాలు

ముంబై స్టాక్ మార్కెట్‌లో నష్టాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన ట్రేడింగ్ మధ్యాహ్నం తర్వాత కూడా వృద్ధిబాటలో పయనించలేదు. ఫలితంగా.. మధ్యాహ్నం రెండు గటల సమయంలో సెన్సెక్స్ సూచీ 203 పాయింట్ల నష్టంతో 16784 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. అలాగే, నిఫ్టీ సైతం 72 పాయింట్లు తగ్గుదలతో 5019 వద్ద ముందుకు సాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 7 May 2010 | 8:55 am

3జీ వేలం ద్వారా ప్రభుత్వానికి యాభైవేల కోట్ల ఆదాయం

మూడవ తరం(3జీ) స్పెక్ట్రమ్ ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 50,000 కోట్ల ఆదాయం సమకూరనుందని టెలికాం రంగానికి చెందిన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 7 May 2010 | 8:50 am

నిర్హేతుకంగా గవర్నర్లను మార్చొద్దు: సుప్రీం ధర్మాసనం

కేంద్రంలో ప్రభుత్వాలు మారినపుడల్లా గవర్నర్లను నిర్హేతుకంగా మార్చవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వాలు మారినపుడల్లా గవర్నర్లను మార్చాలని భావిస్తే అందుకు సంబంధించి సహేతుకమైన కారణాలు చూపించాలని చీఫ్ జస్టీస్ కేజీ.బాలకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో ఏర్పడిన ధర్మాసనం తీర్పు నిచ్చింది.
Source: Yahoo! Telugu: News | 7 May 2010 | 8:32 am

నా మీసం నుంచే "సింహా" కథ పుట్టింది: బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ "సింహా" సక్సెస్ ఊపులో చాలా హుషారుగా కనిపిస్తున్నారు. గురువారం రాత్రి సింహా సక్సెస్ మీట్ సినీమ్యాక్స్‌లో జరిగింది. సంగీత దర్శకుడు చక్రిని ఆహ్వానించేటపుడు కుర్చీలోంచి లేచి ఎగిరి గంతేసి.. "మా చక్రి అంటూ ఆప్యాయంగా ఆహ్వానం పలికారు. ఈ సినిమా ఆడియోలోనే చెప్పాను. మంచి సక్సెస్ చిత్రం అవుతుందనీ. ఒకటి కాదు.. రెండు కాదు.. అన్ని పాటలు హిట్ చేశాడు చక్రి" అంటూ బాలయ్య అభినందించారు. అయితే ఈసారి తన ఉపన్యాసంలో ఆచితూచి స్పందిస్తూ... ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా మాట్లాడటం విశేషం. హీరోయిన్ల గురించి పాజిటివ్‌గానే మాట్లాడుతూ... "హొయలు ఒలకబోసే నయనతారను దర్శకుడు తెలుగమ్మాయిలా చూడగానే నమస్కరించేట్లుగా తీర్చి దిద్దాడు. ఇక నమిత.. అలాగే స్నేహా ఉల్లాల్ పాత్రలు కూడా బాగానే ఉన్నాయి. సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా సరిపోయారు" అని పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 May 2010 | 7:17 am

స్టాక్ మార్కెట్: కుదుటపడుతున్న సెన్సెక్స్ సూచీ

ముంబై స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ మెల్లగా కుదుటపడుతోంది. రిలయన్స్ గ్యాస్ వివాదంలో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడిన అనంతరం సెన్సెక్స్ సూచీలో ఎదుగుదల కనిపించింది. శుక్రవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో 270 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ మధ్యాహ్నానికి 165 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్ కొనసాగుతోంది. అలాగే, నిఫ్టీ సైతం 77 పాయింట్ల నష్టంలో 5014 వద్ద వ్యాపారం జరుగుతోంది.
Source: Yahoo! Telugu: News | 7 May 2010 | 7:15 am

అధికారుల కస్టడీలో పాక్ ఎయిర్ మాజీ చీఫ్ హక్

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌ కారు బాంబు కేసులో అమెరికా పోలీసులు అరెస్టు చేసిన ఫైసల్ షహజాద్ తండ్రి, పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ మార్షల్ బహారుల్ హక్‌ను పాకిస్థాన్ భద్రతా వర్గాలు తమ కష్టడీలోకి తీసుకున్నాయి. టైమ్స్ స్వ్కేర్ వద్ద బాంబు అమర్చిన కేసులో విచారణ జరుపుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 7 May 2010 | 7:02 am

పెరగనున్న సెమీ కండక్టర్ అమ్మకాలు

గ్లోబల్ సెమీ కండక్టర్ అమ్మకాలు ఈ ఏడాది పెరిగి 16-18 శాతానికి చేరుకోగలదని ఇండస్ట్రీ పరిశోధనా సంస్థ ఐడీసీ రీసెర్చ్ మేనేజర్ మలి వెంకటేశన్ శుక్రవారం సింగపూర్‌లో తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 7 May 2010 | 6:56 am

ప్రజాసేవ చేసేవారు "దేహీ" అని అడుక్కోవడమెందుకు..?: వర్మ

అనంతపురం ఫ్యాక్షన్ గొడవలను ఇతివృత్తంగా తీసుకుని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం "రక్త చరిత్ర-1" ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలావుంటే రక్తచరిత్ర తర్వాత తాను "పొలిటికల్ ఇండస్ట్రీ" పేరుతో ఓ సినిమాను రూపొందించబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ఈ చిత్రం కుళ్లు రాజకీయాలను ఎండగడుతుందా... లేదంటే రాజకీయాల్లో అవినీతిపై బాణం ఎక్కుపెడుతుందా అని అడిగిన ప్రశ్నకు వర్మ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.అసలు ప్రజలకు సేవ చేయాలనే నాయకులు ఓట్లకోసం దేహీ అని ప్రజలను అడుక్కోవడం ఎందుకో తనకు అర్థం కాని ప్రశ్న అని అన్నారు. ఈ ప్రశ్నను ఆధారం చేసుకుని తన పొలిటికల్ ఇండస్ట్రీ ఉంటుందని చెప్పారు. ప్రజాసేవ చేయదలుచుకున్నవారు తన ప్రొఫైల్‌ను ప్రజల ముందు ఉంచి సేవ చేయదలచుకున్నానని ఓ ప్రకటన ఇస్తే సరిపోతుందనీ, అలా కాకుండా అనేకమైన పద్ధతుల ద్వారా ప్రజలను బుట్టలో వేసుకునేందుకు నాయకులు ప్రయత్నించడాన్ని చూసినప్పుడు చిత్రంగా ఉంటుందన్నారు వర్మ.
Source: Yahoo! Telugu: Entertainment | 7 May 2010 | 6:03 am

పనీపాటలేని ఎంఓఎస్‌లు ఎందుకు: రాయపాటి ప్రశ్న

కాంగ్రెస్ అధిష్టానంపై గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు మండిపడ్డారు. పార్టీలో సీనియర్లుగా ఉన్న తమకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఈ దఫా జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ పదవికి కేటాయించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పరిస్థితి మరోలా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
Source: ఏపీ న్యూస్ | 7 May 2010 | 4:02 am

వీలైనంత త్వరగా కసబ్‌ను ఉరి తీయాలి: వెంకయ్య

ముంబై దాడుల కేసుల్లో దోషిగా తేలిన పాకిస్థాన్ తీవ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్షను వీలైనంత త్వరగా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌ దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురు కేసులో కసబ్ కేసును మార్చొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 7 May 2010 | 3:40 am

నిర్హేతుకంగా గవర్నర్లను మార్చొద్దు: సుప్రీం ధర్మాసనం

కేంద్రంలో ప్రభుత్వాలు మారినపుడల్లా గవర్నర్లను నిర్హేతుకంగా మార్చవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వాలు మారినపుడల్లా గవర్నర్లను మార్చాలని భావిస్తే అందుకు సంబంధించి సహేతుకమైన కారణాలు చూపించాలని చీఫ్ జస్టీస్ కేజీ.బాలకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో ఏర్పడిన ధర్మాసనం తీర్పు నిచ్చింది.
Source: జాతీయ | 7 May 2010 | 3:02 am

కొనసాగుతున్న చర్చలు: కొలిక్కిరాని జార్ఖండ్ అనిశ్చితి!

జార్ఖండ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. ఈ సమస్య పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్ఛా నేతలు నిరంతరాయంగా చర్చలు జరుపుతున్నారు. అయినప్పటికీ సమస్యకు ఓ పరిష్కారమార్గం కనుగొనలేక పోతున్నారు.
Source: జాతీయ | 7 May 2010 | 1:23 am

మనోవేదనకు లోనవుతున్న ముఖ్యమంత్రి: దానం

ముఖ్యమంత్రి కె.రోశయ్య మనోవేదనకు లోనవుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ అన్నారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరించడం లేదన్నారు. మంత్రివర్గంలో మంత్రులందరం కలిసే సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 7 May 2010 | 12:52 am

ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటేసిన రోశయ్య

స్థానిక సంస్థల కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం ఉదయం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కె.రోశయ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ఏర్పాట్లలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిఫల్ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో కొన్ని రకాల నిషేధాజ్ఞలు విధించారు.
Source: ఏపీ న్యూస్ | 7 May 2010 | 12:45 am

దోషి కసబ్‌కు ఇకపై.. సకల సదుపాయాలు-భద్రత!

ముంబై మారణహోమంలో ఉరిశిక్ష పడిన పాకిస్థాన్ తీవ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌కు ఇకపై.. సకల సదుపాయాలతో కూడిన భద్రతను కల్పించనున్నారు. కసబ్ కోరే భోజనంతో పాటు.. ఇతర తినుబండరాలను సైతం జైలు అధికారులు సమకూర్చనున్నారు. దేశ న్యాయవ్యవస్థ ప్రకారం ఉరిశిక్ష పడిన దోషికి.. సాధారణ వ్యక్తులకు అందుబాటులో ఉండే సౌకర్యాలను కల్పిస్తారు.
Source: జాతీయ | 7 May 2010 | 12:14 am

కోత తీర్మానాలతో మేలుకున్న కాంగ్రెస్: మైసూరా రెడ్డి

ఇటీవల పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలన్ని కలిసి ప్రవేశపెట్టిన కోత తీర్మానాలతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు మేలుకుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఎంవీ.మైసూరా రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా అడ్డదిడ్డంగా నిర్ణయాలు తీసుకుంటే వాత తప్పదనే నిజాన్ని గ్రహించిందన్నారు. అందుకే తెలంగాణ సమస్య పరిష్కారం తమ చేతుల్లో లేదని కేంద్ర హోం మంత్రి చిదంబరం తాపీగా సెలవిచ్చారని మైసూరా రెడ్డి ఎద్దేవా చేశారు.
Source: ఏపీ న్యూస్ | 6 May 2010 | 11:45 pm

నిజమే.. నేను కరుడుగట్టిన సమైక్యావాదిని: చిరంజీవి

తాను కరుడుగట్టిన సమైక్యవాదినని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పునరుద్ఘాటించారు. ఆరంభంలో తప్పటడుగులు వేసినప్పటికీ.. మెజారిటీ ప్రజల మనోభీష్టానికి తలవంచాల్సి వచ్చిందన్నారు. అందుకే సమైక్యవాదాన్ని తన భుజాలపైకి ఎత్తుకున్నట్టు చెప్పారు. ఈ పోరులో అంతిమ విజయం సమైక్యవాదానికే దక్కుతుందన్నారు. కోట్లాది మంది ప్రజల కలిసి కట్టు ముందు.. అతికొద్దిమంది వేర్పాటువాదుల ఆగడాలు ఎందుకూ పనికిరాకుండా పోతాయని ఆయన జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 6 May 2010 | 11:11 pm

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఇదో సందేశం: మొయిలీ

పాక్ పౌరుడు, లష్కర్ తోయిబా తీవ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌కు ఉరిశిక్ష పడటం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు భారత్ ఇచ్చే గొప్ప సందేశమని కేంద్ర న్యాయశాఖామంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. ముంబై మారణహోమం కేసులో సజీవంగా పట్టుబడిన కసబ్‌కు ప్రత్యేక కోర్టు గురువారం ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 6 May 2010 | 10:00 pm

ఏవీఎస్ - సీఎం రోశయ్య "నీది తెనాలి.. నాది తెనాలి"

దళారీ వ్యవస్థ అంటే ఏమిటని రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాగర్‌ను ప్రశ్నించారు. ఈ సంఘటన బుధవారం రాత్రి తాజ్ డెక్కన్‌లో కోతిమూక ఆడియో వేడుక జరిగింది. ఏవీఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా మురళీమోహన్ మాట్లాడుతూ... సినిమా ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉందనీ, నిర్మాతకు పైరసీ పెనుభూతంగా మారిందనీ చెప్పారు. దీనికి రాష్ట్రప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే సాగర్ మాట్లాడుతూ.. దళారీ వ్యవస్థ వల్ల చిత్ర పరిశ్రమ ఇంటెన్సివ్ కేర్‌లో ఉందనీ, అందుకే వాటిని తొలగించాలని ముఖ్యమంత్రిని కోరారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 May 2010 | 2:00 pm

"పూరీ"ని ఓ గడ్డం వ్యక్తి ముంచాడు... అందుకే "భీష్మ" - "బుడ్డా"

యువరత్న బాలకృష్ణ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నారు. అయితే బెల్లంకొండపై బాలయ్య కాల్పుల ఉదంతం తర్వాత వీరిద్దరి మధ్య గొడవలున్నాయన్న వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ ఉత్తిత్తి పుకార్లే అని తేలిపోయింది. పూరీజగన్నాథ్‌తో సినిమా చేయడం అనేది ఓ ట్రెండ్‌గా ఇండస్ట్రీ భావిస్తోంది. "పోకిరి" తర్వాత పూరీ తన ఆర్థిక లావేదేవీలన్నీ ఓ గడ్డం వ్యక్తికి అప్పజెబితే.. ఆయన నిలువునా ముంచేసి పూరీని అప్పులపాలు చేశాడనేది ఇండస్ట్రీ టాక్. వాటిని అధిగమించడానికి పూరీ జగన్నాథ్ అప్పట్లో హడావుడిగా పలు సినిమాలు చేస్తున్నట్లు ఎనౌన్స్ చేశాడు. ఆదిత్యరామ్ అనే నిర్మాతతో ఏకంగా పది సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించాడు. అంతకుముందు అమితాబ్‌తో హిందీలో "బుడ్డా" చిత్రాన్ని తీస్తానని ప్రకటించాడు. జూనియర్ ఎన్టీఆర్‌‌తో ఒకటుంటుందని చెప్పాడు. లేటెస్ట్‌గా వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తున్నట్లు హడావుడి చేసి ప్రెస్‌మీట్ కూడా ఏర్పాటు చేశాడు. అయితే వైఎస్ జగన్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో అది కాస్తా వెనక్కి వెళ్లినట్లు సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 6 May 2010 | 10:47 am

ఏమయ్యా చంద్రబోసూ.. "సాక్షి" చూడలేదా..?!: రోశయ్య

ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరోసారి మంత్రులపై విరుచుకపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెందిన "సాక్షి" పత్రికలో ప్రభుత్వాన్ని ఎండగడుతూ వస్తున్న వార్తలపై రోశయ్య సంబంధిత మంత్రులకు క్లాసు పీకినట్లు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 6 May 2010 | 10:00 am

టాప్‌లెస్‌‌గా "కైట్స్" బార్బరా... ఎగబడుతున్న జనం

బాలీవుడ్ వెరైటీ హీరో హృతిక్ రోషన్ నటించిన "కైట్స్" మే 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్‌ను హిందీ, ఇంగ్లీషు భాషల్లో విడుదల చేశారు. కైట్స్ చిత్రానికి సంబంధించిన రీమిక్స్ ట్రెయిలర్లలో హృతిక్ రోషన్ సరసన కనిపించిన హీట్ హీరోయిన్ బార్బరా టాప్‌లెస్‌గా దర్శనమిస్తూ కుర్రకారు గుండెల్లో అపరిమితమైన హీట్‌ను రేకిత్తిస్తోందట. హిందీలో విడుదల చేసిన ట్రెయిలర్‌లో హృతిక్ రోషన్ పెదవులను బార్బరా గట్టిగా చుంబించే సన్నివేశంతోపాటు వీపు భాగం నగ్నంగా చూపిస్తూ, ఎద భాగాన్ని హృతిక్‌ను హత్తుకుంటున్నట్లు కనబడుతుందట. మొత్తమ్మీద ఈ సీన్లో బార్బరా టాప్‌లెస్‌గా కనబడుతుంది. ఇక ఇంగ్లీషు ట్రెయిలర్ విషయానికి వస్తే... బార్బరా డైరెక్టుగా తన ఎద సౌందర్యాలను స్వేచ్ఛగా ప్రదర్శించినట్లు సమాచారం. టాప్‌లెస్‌గా బార్బరా ఎద భాగాన్ని ట్రెయిలర్‌లో చూపించడంతో అక్కడి అభిమానులు ఆ ప్రోమో చూసేందుకు ఎగబడుతున్నారట. హాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఆ స్థాయిలో "నగ్నత్వం" తప్పనిసరి అంటున్నారు "కైట్" దర్శకనిర్మాతలు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 May 2010 | 7:55 am

తెలంగాణ ఏర్పాటు మా చేతుల్లో లేదు: చిదంబరం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తమ చేతుల్లో లేదని కేంద్ర హోం మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నిర్ణయం మేరకే గత యేడాది డిసెంబరు తొమ్మిదో తేదీన కేంద్రం ప్రకటన చేసిందని ఆయన మరోమారు పునరుద్ఘాటించారు.
Source: ఏపీ న్యూస్ | 6 May 2010 | 7:12 am

ఏమిటీ అన్యాయం.. దేవుడ్ని చూసేందుకు వస్తే తోసేస్తారా..?!

కలియుగ వైకుంఠంలో నరకం కనిపిస్తోందని భక్తులు వాపోతున్నారు. కనులారా ఆ తిరుమలేశుడిని దర్శించుకునేందుకు వస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది గర్భగుడిలో ఆ తిరుమలేశుని సాక్షిగా తమను బయటకు గెంటి వేస్తున్నారని బాధపడుతున్నారు. భక్తులకు ఇటువంటి అవమానాలు ఇటీవల కాలంలో మరీ ఎక్కువైనట్లు భక్తులే చెపుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 6 May 2010 | 6:54 am

పెళ్లయిన మగాడితో సదా ప్రేమకలాపాలు...?!

బాంబే పిల్ల సదా "జయం" చిత్రంతో టాలీవుడ్‌లో జయకేతనం ఎగురవేసింది. ఆ తర్వాత శంకర్ అపరిచితుడుతో టాప్ పొజిషన్‌కు చేరుకున్నానని తెగ సంబరపడి పోయింది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలువ లేదు. తుస్సుమంది. అవకాశాలు అనుకున్నంతగా దొరక్కపోవడంతో మూటాముల్లే సర్దుకుని సొంతూరికి వెళ్లిపోయింది. అయినా ఒక్కసారి సినిమా పురుగు కుడితే దాని నుంచి తప్పించుకుని వెళ్లడం సాధ్యం కాదు గనుక సినిమాలకు దూరంగా ఉండలేని సదా అడపాదడపా కొన్ని చిత్రాల్లో నటిస్తూనే ఉంది. ముఖ్యంగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమను సదా వదల్లేకుండా ఉంది. దీని వెనుక వేరే కారణం కూడా ఉందని అంటున్నారు. పెళ్లయిన హీరో మాధవన్ కోసమే సదా కోలీవుడ్ చూరు పట్టుక వేళాడుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మాధవన్ సరసన మూడు రొమాంటిక్ చిత్రాల్లో నటించిన సదా అదే రొమాన్స్‌ను నిజజీవితంలోనూ కొనసాగిస్తున్నట్లు భోగట్టా.
Source: Yahoo! Telugu: Entertainment | 6 May 2010 | 5:49 am

కసబ్ శిక్షపై సర్వత్రా హర్షం: శిక్ష అమలు చేసేదెన్నటికో!

పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌కు ఉరిశిక్ష పడటం పట్ల దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అదేసమయంలో శిక్ష అమలుపై లేనిపోని సందేహాలు దేశ ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి.
Source: జాతీయ | 6 May 2010 | 5:40 am

33 మంది ఎంపీలు ఉన్నా.. ప్రయోజనం శూన్యం: బాబు

రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి 33 మంది ఎంపీలు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నా రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలు మాత్రం శూన్యమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆయన గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. 33 మంది ఎంపీలు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 6 May 2010 | 5:22 am

"పూరీ"ని ఓ గడ్డం వ్యక్తి ముంచాడు... అందుకే "భీష్మ" - "బుడ్డా"

యువరత్న బాలకృష్ణ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నారు. అయితే బెల్లంకొండపై బాలయ్య కాల్పుల ఉదంతం తర్వాత వీరిద్దరి మధ్య గొడవలున్నాయన్న వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ ఉత్తిత్తి పుకార్లే అని తేలిపోయింది. పూరీజగన్నాథ్‌తో సినిమా చేయడం అనేది ఓ ట్రెండ్‌గా ఇండస్ట్రీ భావిస్తోంది. "పోకిరి" తర్వాత పూరీ తన ఆర్థిక లావేదేవీలన్నీ ఓ గడ్డం వ్యక్తికి అప్పజెబితే.. ఆయన నిలువునా ముంచేసి పూరీని అప్పులపాలు చేశాడనేది ఇండస్ట్రీ టాక్. వాటిని అధిగమించడానికి పూరీ జగన్నాథ్ అప్పట్లో హడావుడిగా పలు సినిమాలు చేస్తున్నట్లు ఎనౌన్స్ చేశాడు. ఆదిత్యరామ్ అనే నిర్మాతతో ఏకంగా పది సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించాడు. అంతకుముందు అమితాబ్‌తో హిందీలో "బుడ్డా" చిత్రాన్ని తీస్తానని ప్రకటించాడు. జూనియర్ ఎన్టీఆర్‌‌తో ఒకటుంటుందని చెప్పాడు. లేటెస్ట్‌గా వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తున్నట్లు హడావుడి చేసి ప్రెస్‌మీట్ కూడా ఏర్పాటు చేశాడు. అయితే వైఎస్ జగన్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో అది కాస్తా వెనక్కి వెళ్లినట్లు సమాచారం.
Source: వినోదం | 6 May 2010 | 5:18 am

"రాజ్‌కపూరే" ఆ మాటన్నారు.. మరి నేనెంత..?: కరుణాకరన్

తొలిప్రేమ, యువకుడు, వాసు, బాలు, ఉల్లాసంగా ఉత్సాహంగా.. వంటి చిత్రాల దర్శకుడు కరుణాకరన్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం "డార్లింగ్". ఈ చిత్రం విడుదలై పదిరోజులు పూర్తయిన సందర్భంగా దర్శకుడు సంతోషం వ్యక్తం చేశారు. "డార్లింగ్" సినిమాకి ప్రతిచోటా మంచి స్పందన వస్తుందని ఆయన అన్నారు. బుధవారం సంస్థ కార్యాలయంలో కరుణాకరన్‌తో జరిగిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..ప్రశ్న: "డార్లింగ్"కి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది?జ : ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో చూశాను. ముఖ్యంగా మహిళలు బాగా ఆదరిస్తున్నారు. ఈ చిత్ర కథ విన్నప్పుడు కూడా ప్రభాస్ కూడా అదే రెస్పాన్స్ ఇచ్చారు. ప్రశ్న: మీరు కథలు రాసి హీరోలను ఎంపికచేస్తారా..?జ : ముందుగా పలానా హీరోని దృష్టిలో పెట్టుకుని కథ రాసుకుంటాను. అలా రాసుకున్నదే నా తొలిప్రేమ. అది పవన్ కళ్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. అప్పటి నుంచి డార్లింగ్ వరకు హీరో‌ను బేస్‌చేసుకునే కథ రాశాను. ప్రశ్న: "డార్లింగ్"కి ప్రభాస్ సూటయ్యాడని అనుకుంటున్నారా..?జ : సూటవుతారనే కథ రాసుకున్నాను.
Source: Yahoo! Telugu: Entertainment | 6 May 2010 | 5:13 am

తీర్పు సమయంలో బోనులో కుప్పకూలిన కసబ్

ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంఎల్.తహల్యాని తుది తీర్పు ప్రతులను చదువుతున్న సమయంలో పాక్ తీవ్రవాది అజ్మల్ల అమిర్ కసబ్ బోనులోనే కుప్పకూలిపోయాడు. ఒకసమయంలో మంచినీరు కావాలని సిబ్బందిని కోరాడు. ఆ తర్వాత మరణ శిక్షను ఖరారు చేస్తున్నట్టు మేజిస్ట్రేట్ ప్రకటించిన వెంటనే తీవ్రవాది షాక్‌కు లోనయ్యాడు.
Source: జాతీయ | 6 May 2010 | 3:04 am

తీవ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరే సరి: ప్రత్యేక కోర్టు

ముంబై మారణహోమంలో సజీవంగా పట్టుబడి, దోషిగా తేలిన పాకిస్థాన్ జాతీయుడు, లష్కర్ తోయిబా తీవ్రవాది అజ్మల్ కసబ్‌కు ప్రత్యేక కోర్టు ఉరిశిక్షను విధించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.ఎల్.తహిల్యాని గురువారం మధ్యాహ్నం తీర్పును ఇచ్చారు. 82 అభియోగాల్లో దోషిగా తేలిన కసబ్‌కు ఉరిశిక్ష విధించడమే సరైన శిక్ష అని మేజిస్ట్రేట్ తన తుదితీర్పు ప్రసంగ పఠనంలో పేర్కొన్నారు.
Source: జాతీయ | 6 May 2010 | 2:36 am

టాప్‌లెస్‌‌గా "కైట్స్" బార్బరా... ఎగబడుతున్న జనం

బాలీవుడ్ వెరైటీ హీరో హృతిక్ రోషన్ నటించిన "కైట్స్" మే 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్‌ను హిందీ, ఇంగ్లీషు భాషల్లో విడుదల చేశారు. కైట్స్ చిత్రానికి సంబంధించిన రీమిక్స్ ట్రెయిలర్లలో హృతిక్ రోషన్ సరసన కనిపించిన హీట్ హీరోయిన్ బార్బరా టాప్‌లెస్‌గా దర్శనమిస్తూ కుర్రకారు గుండెల్లో అపరిమితమైన హీట్‌ను రేకిత్తిస్తోందట. హిందీలో విడుదల చేసిన ట్రెయిలర్‌లో హృతిక్ రోషన్ పెదవులను బార్బరా గట్టిగా చుంబించే సన్నివేశంతోపాటు వీపు భాగం నగ్నంగా చూపిస్తూ, ఎద భాగాన్ని హృతిక్‌ను హత్తుకుంటున్నట్లు కనబడుతుందట. మొత్తమ్మీద ఈ సీన్లో బార్బరా టాప్‌లెస్‌గా కనబడుతుంది. ఇక ఇంగ్లీషు ట్రెయిలర్ విషయానికి వస్తే... బార్బరా డైరెక్టుగా తన ఎద సౌందర్యాలను స్వేచ్ఛగా ప్రదర్శించినట్లు సమాచారం. టాప్‌లెస్‌గా బార్బరా ఎద భాగాన్ని ట్రెయిలర్‌లో చూపించడంతో అక్కడి అభిమానులు ఆ ప్రోమో చూసేందుకు ఎగబడుతున్నారట. హాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఆ స్థాయిలో "నగ్నత్వం" తప్పనిసరి అంటున్నారు "కైట్" దర్శకనిర్మాతలు.
Source: వినోదం | 6 May 2010 | 2:26 am