అమ్మకాల ఒత్తిడి : నష్టాల్లో స్టాక్ మార్కెట్

దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ గురువారం తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే క్షీణించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సెన్సెక్స్, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 82 పాయింట్లు పడిపోయింది. దీంతో సెన్సెక్స్ సూచి మెల్లగా కోలుకుని 17,005 మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 20 పాయింట్ల స్వల్ప నష్టంతో 5,104 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 6 May 2010 | 9:04 am

నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల పతనం

బాంబే స్టాక్ మార్కెట్ గురువారం తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, 125 పాయింట్లు పతనమై, 16,962 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 44 పాయింట్లు పడిపోయి, 5,080 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 6 May 2010 | 8:49 am

తీర్పు సమయంలో బోనులో కుప్పకూలిన కసబ్

ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంఎల్.తహల్యాని తుది తీర్పు ప్రతులను చదువుతున్న సమయంలో పాక్ తీవ్రవాది అజ్మల్ల అమిర్ కసబ్ బోనులోనే కుప్పకూలిపోయాడు. ఒకసమయంలో మంచినీరు కావాలని సిబ్బందిని కోరాడు. ఆ తర్వాత మరణ శిక్షను ఖరారు చేస్తున్నట్టు మేజిస్ట్రేట్ ప్రకటించిన వెంటనే తీవ్రవాది షాక్‌కు లోనయ్యాడు.
Source: Yahoo! Telugu: News | 6 May 2010 | 8:33 am

ఈ-బుక్ అమ్మనున్న గూగుల్

అమెరికాకు చెందిన ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ సాఫ్ట్‌వేర్ గూగుల్ డిజిటల్ పుస్తకాలను అమ్మేందుకు గూగుల్ సంస్థ ప్రణాళికలు రూపొందించుకుందని గూగుల్ సంస్థకు చెందిన అఁధికారి ఒకరు వాషింగ్టన్‌లో వెల్లడించారు. ఈ అమ్మకాలను వచ్చే జూన్ చివరి నాటికి లేదా జులైలో అమ్మనున్నట్లు ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 6 May 2010 | 8:29 am

భారీగా క్షీణంచిన బాంబే స్టాక్ మార్కెట్

గురువారం ట్రేడింగ్ ప్రారంభంలోనే నష్టాలను చవిచూసిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 251 పాయింట్ల మేర భారీగా పడిపోయింది. దీంతో సెన్సెక్స్ సూచి 16,836 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 82 పాయింట్లు పతనమై, 5,042 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 6 May 2010 | 8:23 am

తీవ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరే సరి: ప్రత్యేక కోర్టు

ముంబై మారణహోమంలో సజీవంగా పట్టుబడి, దోషిగా తేలిన పాకిస్థాన్ జాతీయుడు, లష్కర్ తోయిబా తీవ్రవాది అజ్మల్ కసబ్‌కు ప్రత్యేక కోర్టు ఉరిశిక్షను విధించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.ఎల్.తహిల్యాని గురువారం మధ్యాహ్నం తీర్పును ఇచ్చారు. 82 అభియోగాల్లో దోషిగా తేలిన కసబ్‌కు ఉరిశిక్ష విధించడమే సరైన శిక్ష అని మేజిస్ట్రేట్ తన తుదితీర్పు ప్రసంగ పఠనంలో పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 6 May 2010 | 8:03 am

టాప్‌లెస్‌‌గా "కైట్స్" బార్బరా... ఎగబడుతున్న జనం

బాలీవుడ్ వెరైటీ హీరో హృతిక్ రోషన్ నటించిన "కైట్స్" మే 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్‌ను హిందీ, ఇంగ్లీషు భాషల్లో విడుదల చేశారు. కైట్స్ చిత్రానికి సంబంధించిన రీమిక్స్ ట్రెయిలర్లలో హృతిక్ రోషన్ సరసన కనిపించిన హీట్ హీరోయిన్ బార్బరా టాప్‌లెస్‌గా దర్శనమిస్తూ కుర్రకారు గుండెల్లో అపరిమితమైన హీట్‌ను రేకిత్తిస్తోందట. హిందీలో విడుదల చేసిన ట్రెయిలర్‌లో హృతిక్ రోషన్ పెదవులను బార్బరా గట్టిగా చుంబించే సన్నివేశంతోపాటు వీపు భాగం నగ్నంగా చూపిస్తూ, ఎద భాగాన్ని హృతిక్‌ను హత్తుకుంటున్నట్లు కనబడుతుందట. మొత్తమ్మీద ఈ సీన్లో బార్బరా టాప్‌లెస్‌గా కనబడుతుంది. ఇక ఇంగ్లీషు ట్రెయిలర్ విషయానికి వస్తే... బార్బరా డైరెక్టుగా తన ఎద సౌందర్యాలను స్వేచ్ఛగా ప్రదర్శించినట్లు సమాచారం. టాప్‌లెస్‌గా బార్బరా ఎద భాగాన్ని ట్రెయిలర్‌లో చూపించడంతో అక్కడి అభిమానులు ఆ ప్రోమో చూసేందుకు ఎగబడుతున్నారట. హాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఆ స్థాయిలో "నగ్నత్వం" తప్పనిసరి అంటున్నారు "కైట్" దర్శకనిర్మాతలు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 May 2010 | 7:55 am

పాక్‌కు రహస్య సమాచారం చేరవేసిన ఆర్మీ అధికారి!

దేశ భద్రతకు రక్షణగా ఉండాల్సిన ఆర్మీ అధికారులే పాకిస్థాన్ ముష్కర మూకలకు బానిసలుగా మారుతున్నారు. ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో ద్వితీయ స్థాయి కార్యదర్శిగా పనిచేస్తూ వచ్చిన మాధూరీ గుప్తాను నిఘా వర్గాలు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ సంఘటన నుంచి తేరుకోక ముందే మరో ఆర్మీ అధికారి పాక్ గూఢచారిగా వ్యవహరిస్తూ నిఘా వర్గాలకు చిక్కాడు.
Source: Yahoo! Telugu: News | 6 May 2010 | 7:26 am

ధరలు తగ్గి 16.04 శాతానికి చేరుకున్న ఆహార ద్రవ్యోల్బణం

ఏప్రిల్ 24తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం 0.57 శాతం తగ్గి 16.04 శాతానికి చేరుకుంది. రబీ పంటలు చేతికి అంది వస్తుండటంతో నిత్యావసర సరుకుల ధరల్లో తగ్గుదల కనపడిందని కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 6 May 2010 | 7:21 am

3జీ వేలం పదకొండువేల కోట్ల పైమాటే!!

కేంద్ర టెలికాం విభాగం 3జీ స్పెక్ట్రమ్ వేలం 11 వేల కోట్ల రూపాయలకుపైగానే చేరుకుందని కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 44,500 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 6 May 2010 | 7:02 am

టి వాదులు నాపై కిరోసిన్ చల్లారు: ఎమ్మెల్యే సారయ్య

కాంగ్రెస్ పార్టీకి చెందిన వరంగ్ పశ్చిమ ఎమ్మెల్యే బస్వరాజు సారయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను తెలంగాణవాదులు ప్రతిఘటించారు. అంతటితో ఆగని తెలంగాణవాదుల్లో ఒక ఆందోళనకారుడు తన శరీరంపై కిరోసిన్ పోసుకున్నాడు. ఆ తర్వాత అదే కిరోసిన్‌ను ఎమ్మెల్యేపై చల్లాడు. ఈ చర్య ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
Source: Yahoo! Telugu: News | 6 May 2010 | 6:57 am

పెళ్లయిన మగాడితో సదా ప్రేమకలాపాలు...?!

బాంబే పిల్ల సదా "జయం" చిత్రంతో టాలీవుడ్‌లో జయకేతనం ఎగురవేసింది. ఆ తర్వాత శంకర్ అపరిచితుడుతో టాప్ పొజిషన్‌కు చేరుకున్నానని తెగ సంబరపడి పోయింది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలువ లేదు. తుస్సుమంది. అవకాశాలు అనుకున్నంతగా దొరక్కపోవడంతో మూటాముల్లే సర్దుకుని సొంతూరికి వెళ్లిపోయింది. అయినా ఒక్కసారి సినిమా పురుగు కుడితే దాని నుంచి తప్పించుకుని వెళ్లడం సాధ్యం కాదు గనుక సినిమాలకు దూరంగా ఉండలేని సదా అడపాదడపా కొన్ని చిత్రాల్లో నటిస్తూనే ఉంది. ముఖ్యంగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమను సదా వదల్లేకుండా ఉంది. దీని వెనుక వేరే కారణం కూడా ఉందని అంటున్నారు. పెళ్లయిన హీరో మాధవన్ కోసమే సదా కోలీవుడ్ చూరు పట్టుక వేళాడుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మాధవన్ సరసన మూడు రొమాంటిక్ చిత్రాల్లో నటించిన సదా అదే రొమాన్స్‌ను నిజజీవితంలోనూ కొనసాగిస్తున్నట్లు భోగట్టా.
Source: Yahoo! Telugu: Entertainment | 6 May 2010 | 5:49 am

"రాజ్‌కపూరే" ఆ మాటన్నారు.. మరి నేనెంత..?: కరుణాకరన్

తొలిప్రేమ, యువకుడు, వాసు, బాలు, ఉల్లాసంగా ఉత్సాహంగా.. వంటి చిత్రాల దర్శకుడు కరుణాకరన్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం "డార్లింగ్". ఈ చిత్రం విడుదలై పదిరోజులు పూర్తయిన సందర్భంగా దర్శకుడు సంతోషం వ్యక్తం చేశారు. "డార్లింగ్" సినిమాకి ప్రతిచోటా మంచి స్పందన వస్తుందని ఆయన అన్నారు. బుధవారం సంస్థ కార్యాలయంలో కరుణాకరన్‌తో జరిగిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..ప్రశ్న: "డార్లింగ్"కి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది?జ : ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో చూశాను. ముఖ్యంగా మహిళలు బాగా ఆదరిస్తున్నారు. ఈ చిత్ర కథ విన్నప్పుడు కూడా ప్రభాస్ కూడా అదే రెస్పాన్స్ ఇచ్చారు. ప్రశ్న: మీరు కథలు రాసి హీరోలను ఎంపికచేస్తారా..?జ : ముందుగా పలానా హీరోని దృష్టిలో పెట్టుకుని కథ రాసుకుంటాను. అలా రాసుకున్నదే నా తొలిప్రేమ. అది పవన్ కళ్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. అప్పటి నుంచి డార్లింగ్ వరకు హీరో‌ను బేస్‌చేసుకునే కథ రాశాను. ప్రశ్న: "డార్లింగ్"కి ప్రభాస్ సూటయ్యాడని అనుకుంటున్నారా..?జ : సూటవుతారనే కథ రాసుకున్నాను.
Source: Yahoo! Telugu: Entertainment | 6 May 2010 | 5:13 am

తీర్పు సమయంలో బోనులో కుప్పకూలిన కసబ్

ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంఎల్.తహల్యాని తుది తీర్పు ప్రతులను చదువుతున్న సమయంలో పాక్ తీవ్రవాది అజ్మల్ల అమిర్ కసబ్ బోనులోనే కుప్పకూలిపోయాడు. ఒకసమయంలో మంచినీరు కావాలని సిబ్బందిని కోరాడు. ఆ తర్వాత మరణ శిక్షను ఖరారు చేస్తున్నట్టు మేజిస్ట్రేట్ ప్రకటించిన వెంటనే తీవ్రవాది షాక్‌కు లోనయ్యాడు.
Source: జాతీయ | 6 May 2010 | 3:04 am

తీవ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరే సరి: ప్రత్యేక కోర్టు

ముంబై మారణహోమంలో సజీవంగా పట్టుబడి, దోషిగా తేలిన పాకిస్థాన్ జాతీయుడు, లష్కర్ తోయిబా తీవ్రవాది అజ్మల్ కసబ్‌కు ప్రత్యేక కోర్టు ఉరిశిక్షను విధించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.ఎల్.తహిల్యాని గురువారం మధ్యాహ్నం తీర్పును ఇచ్చారు. 82 అభియోగాల్లో దోషిగా తేలిన కసబ్‌కు ఉరిశిక్ష విధించడమే సరైన శిక్ష అని మేజిస్ట్రేట్ తన తుదితీర్పు ప్రసంగ పఠనంలో పేర్కొన్నారు.
Source: జాతీయ | 6 May 2010 | 2:36 am

పాక్‌కు రహస్య సమాచారం చేరవేసిన ఆర్మీ అధికారి!

దేశ భద్రతకు రక్షణగా ఉండాల్సిన ఆర్మీ అధికారులే పాకిస్థాన్ ముష్కర మూకలకు బానిసలుగా మారుతున్నారు. ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో ద్వితీయ స్థాయి కార్యదర్శిగా పనిచేస్తూ వచ్చిన మాధూరీ గుప్తాను నిఘా వర్గాలు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ సంఘటన నుంచి తేరుకోక ముందే మరో ఆర్మీ అధికారి పాక్ గూఢచారిగా వ్యవహరిస్తూ నిఘా వర్గాలకు చిక్కాడు.
Source: జాతీయ | 6 May 2010 | 1:58 am

టి వాదులు నాపై కిరోసిన్ చల్లారు: ఎమ్మెల్యే సారయ్య

కాంగ్రెస్ పార్టీకి చెందిన వరంగ్ పశ్చిమ ఎమ్మెల్యే బస్వరాజు సారయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను తెలంగాణవాదులు ప్రతిఘటించారు. అంతటితో ఆగని తెలంగాణవాదుల్లో ఒక ఆందోళనకారుడు తన శరీరంపై కిరోసిన్ పోసుకున్నాడు. ఆ తర్వాత అదే కిరోసిన్‌ను ఎమ్మెల్యేపై చల్లాడు. ఈ చర్య ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
Source: ఏపీ న్యూస్ | 6 May 2010 | 1:27 am

ఎంపీ లాడ్స్ పథకం రాజ్యాంగ విరుద్ధం కాదు: సుప్రీంకోర్టు

నియోజకవర్గాల అభివృద్ధి కోసం లోక్‌‍సభ సభ్యులకు నిధులు కేటాయించే ఎంపీ లాడ్స్ పథకం రాజ్యాంగ విరుద్ధం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎంపీ లాడ్స్ కింద కేటాయించే నిధుల్లో ఒకరిద్దరు ఎంపీలు దుర్వినియోగం చేసినంత మాత్రాన దీన్ని పూర్తిగా రద్దు చేయలేమని గురువారం తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి కేజీ.బాలకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
Source: జాతీయ | 6 May 2010 | 12:25 am

కేసీఆరూ.. రెచ్చగొట్టొద్దు.. వళ్లు దగ్గర పెట్టుకో: చిరంజీవి

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుపై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఎదురుదాడికి దిగారు. ఎంతరెచ్చగొట్టినా.. ప్రశాంతవదనంతో ఉండటాన్ని ఓ అలుసుగా తీసుకోవద్దని ఆయన హితవు పలికారు. కేసీఆర్ తరహాలో తాము రెచ్చిపోతే.. పరిస్థితి మరోలా ఉంటుందన్నారు. అందువల్ల కేసీఆర్ మాట్లాడేటపుడు వళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని సూచించారు.
Source: ఏపీ న్యూస్ | 6 May 2010 | 12:12 am

తెలంగాణ ప్రజలారా.. మమ్ములను విశ్వసించండి: కేసీఆర్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాయశక్తులా కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చీఫ్ కె.చంద్రశేఖర రావు ప్రజలకు ఓ విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో ఆయన ఏర్పాటు చేసే ప్రతి మీడియా సమావేశంలో సీమాంధ్ర నేతలను కించ పరిచేలా సంచలన వ్యాఖ్యలు చేస్తూ పత్రికల్లో పతాక శీర్షికల్లో కనిపించేవారు. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన తన మాటల పంథాను మార్చుకున్నట్టు తెలుస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 5 May 2010 | 11:53 pm

'సింహ' డైలాగుల్లోని పొలిటికల్‌ పంచ్‌ల పరమార్థమేంటి?

యువరత్న బాలకృష్ణ నటించి తాజాగా విడుదలైన చిత్రం "సింహ". ఈ చిత్రంలోని డైలాగులన్నీ రాజకీయ కోణంలోనే ఉన్నాయి. ఎన్టీఆర్ వంశమంటే జనం కోసం జీవించే వంశమని ఈ చిత్రంలో బాలయ్య ఒకానొక సందర్భంగా చెపుతారు. అంతేకాకుడా, ప్రత్యర్థి వర్గాన్ని ఆయన బురదజాతితో పోల్చుతారు. ఇలాగే.. అనేక రాజకీయ అంశాల మిళితంతో కూడిన డైలాగులు ఉన్నాయి.
Source: ఏపీ న్యూస్ | 5 May 2010 | 10:53 pm

నేడు సొరేన్ భవితవ్యంపై కమలనాథులు తుది నిర్ణయం!

జార్ఖండ్ ముక్తిమోర్ఛానేత శిబూ సొరేన్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగించాలా వద్దా అనే విషయంపై భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు గురువారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. సొరేన్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటే.. కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా ప్రయత్నిస్తోంది. అదేసమయంలో సొరేన్ మద్దతు ఇస్తామని చెపుతున్నా మాటలను కమలనాథులు నమ్మడం లేదు. దీంతో తమ భవిష్యత్ వ్యూహంతో పాటు సొరేన్ భవితవ్యంతో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Source: జాతీయ | 5 May 2010 | 10:32 pm

పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు నేడు శిక్ష ఖరారు!

పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ముంబై ఆర్థర్ రోడ్డులో ఉన్న ప్రత్యేక కోర్టు గురువారం శిక్షను ఖరారు చేయనుంది. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు న్యాయమూర్తి ఎం.ఎల్.తహల్యాని శిక్షను ఖరారు చేయనున్నారు. కాగా, ముంబై మారణహోమం కేసులో సజీవంగా పట్టుబడిన కసబ్‌కు ఉరిశిక్ష పడే అవకాశం ఉన్నట్టు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Source: జాతీయ | 5 May 2010 | 10:22 pm

దర్శకరత్న - యువరత్న కాంబినేషన్‌లో "పరమవీరచక్ర"

"సింహా" హిట్‌తో ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా బాలకృష్ణ కాల్షీట్స్ కోసం ఎగబడుతోంది. ఇలా ఎగబడుతున్నవారిలో పేరుమోసిన దర్శకనిర్మాతలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సంగతి ప్రక్కనపెడితే బుధవారం దర్శకరత్న దాసరి నారాయణరావు బాలయ్యతో సినిమా తీస్తున్నట్లు చెప్పారు. ఆయన పుట్టినరోజు కూడా కావడంతో ఈ కార్యక్రమానికి యువరత్న బాలకృష్ణ కూడా వచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... గత రెండేళ్లుగా దాసరిగారితో సినిమా చేద్దామని అనుకుంటున్నాననీ, కానీ ఏమిటో అలా కాలం దొర్లుతూ పోయిందని అన్నారు. ఆ తర్వాత దాసరి మాట్లాడుతూ... "బాలయ్య బాబు చెప్పినట్లే రెండేళ్ల నుంచి బాలయ్యతో సినిమా తీయాలను అనుకుంటూనే ఉన్నా. బాలయ్య బాబుకు తగిన స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నా. టైటిల్ 'పరమవీరచక్ర' అని కూడా అనుకున్నాను.
Source: Yahoo! Telugu: Entertainment | 5 May 2010 | 1:43 pm

పనికిమాలిన పాత్రలు చేయనంటే చేయను: శ్రేయ

ప్రాధాన్యం లేని పనికిమాలిన పాత్రలు ఎట్టి పరిస్థితుల్లో చేయబోనని సెక్సీ నడుము చిన్నది శ్రేయ చరణ్ అంటోంది. ప్రస్తుతం తెలుగులో "డాన్ శీను" చిత్రంలో నటిస్తున్న శ్రేయ తమళంలో కందసామి, కుట్టీ వంటి చిత్రాలు చేసింది. ఈ చిత్రాల తర్వాత ఆమెకు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు. పైగా టాలీవుడ్ - కోలీవుడ్ సినీ పరిశ్రమల్లో కొత్తగా వస్తున్న తారలంతా పొట్టి దుస్తులు ధరించి తొడల అందాలను ఆరబోస్తూ ఎట్రాక్ట్ చేసే విషయంలో చాలా ముందుంటున్నారు. ఈ రేసులో మాత్రం శ్రేయ వంటి తారలు కాస్తంత వెనకబడి పోయారనడంలో సందేహం లేదు. అయితే ఇటీవల త్రిష తొడల ఎక్స్ పోజింగ్‌లు చేస్తూ కొత్తవారికి సైతం గట్టి పోటీ ఇస్తోంది. అయితే శ్రేయ మాత్రం ప్రాధాన్యమున్న పాత్రలలోనే నటిస్తాననీ భీష్మించుకు కూచుంది. అంటే... ఎక్స్‌పోజింగ్‌కు అవకాశమున్న పాత్రలు చేయరా..? అని ప్రశ్నిస్తే, ప్రాధాన్యమున్న పాత్రల్లో ఎక్స్‌పోజింగ్ ఉండకూడదని మీరెందుకు అనుకుంటున్నారు అని ఎదుర ప్రశ్న వేసింది. సెక్సీ భాగాలను అత్యంత సెక్సీగా చూపించే అవకాశాన్ని తాను ఏమాత్రం చేజార్చుకోననీ, అయితే దాని ద్వారా తనకు తప్పనిసరిగా గుర్తింపు రావాలని అంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 5 May 2010 | 1:05 pm

బాలకృష్ణ - పూరి కాంబినేషన్లో బెల్లంకొండ చిత్రం

"సింహా"తో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న యువరత్న బాలకృష్ణ హీరోగా "పోకిరి"తో సెన్సేషనల్ రికార్డులు సృష్టించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అగ్రనిర్మాత, సాయిగణేష్ ప్రొడక్షన్స్ అధినేత బెల్లంకొండ సురేష్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా వస్తోందన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ చిత్రం గురించి బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... బాలయ్య బాబు, పూరి జగన్నాథ్‌ల ఫస్ట్ కాంబినేషన్‌లో ఓ సెన్సేషనల్ మూవీని మా బ్యానర్లో నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బాలయ్య కెరీర్లో ఇది ఓ అద్భుతమైన చిత్రంగా చాలా హై రేంజ్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.
Source: Yahoo! Telugu: Entertainment | 5 May 2010 | 9:03 am

చిరూ.. తెలంగాణా ప్రజలతో నాటకాలాడవద్దు: కేసీఆర్

పైకి సమైక్యాంధ్ర అంటూ లోలోపల ఆంధ్ర ప్రజల బాగుకోసమే సీమాంధ్ర నాయకులు పనిచేస్తారని చిరంజీవి పోలవరం బస్సు యాత్ర రుజువు చేస్తోందని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 5 May 2010 | 8:29 am

పాత చింతకాయ పచ్చడి కాదు... కొత్త రుచులు కావాలి: సాయి అచ్యుత్

బుల్లితెర సీరియళ్లంటేనే కష్టాలు, కన్నీళ్లు, ఇద్దరు భార్యలు, లేడీ విలన్లు... ఇలా ఫ్యామిలీ టైపు సీరియళ్లుగా సాగిపోతుంటాయి. వీటిలో ఎక్కువగా కన్నీళ్ల పర్యంతమయ్యే సెంటిమెంట్ సన్నివేశాలను జోడిస్తూ మహిళలను ఆకట్టుకునే ప్రయత్నాలనే ఎక్కువగా చూస్తుంటాం. అయితే ఈ తరహా రొటీన్ సీరియళ్లతో బుల్లితెర వీక్షకులు బోర్ ఫీలయ్యారనే చెప్పవచ్చు. ఇపుడు ఎక్కువగా కడుపారా నవ్వించే మినీ సీరియళ్లు, ఆసక్తిని రేకిత్తించే గేమ్ షోలంటేనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో బుల్లితెర సీరియల్ డైరక్టర్లు కూడా తమ పంథాను మార్చుకోవలసి వస్తోంది. పాతచింతకాయ పచ్చడి టైపు సీరియళ్లకు వీక్షకులు నో చెప్పేస్తూ టీవీని కట్ చేసి పారేస్తున్నారన్నది సత్యం.
Source: Yahoo! Telugu: Entertainment | 5 May 2010 | 7:25 am

వీధి బాలల కోసం సంచార పాఠశాలలుః పురందేశ్వరి

దేశంలోని వీధి బాలల కోసం ప్రత్యేకంగా సంచార పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మానవ వనరులశాఖ సహాయమంత్రిణి దగ్గుబాటి పురందేశ్వరి బుధవారం లోక్‌సభలో వెల్లడించారు.
Source: జాతీయ | 5 May 2010 | 5:47 am

ఎంత పెట్టినా ఇంకా కావాలంటున్న తిండిబోతు త్రిష

త్రిష పెద్ద తిండిబోతట. షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లిన దగ్గర్నుంచి నోటిని ఆడిస్తూనే ఉంటుందట. అంతేకాదు... ఈ బక్కపలచని భామకు రోజుకో వెరైటీ ఫుడ్ ఐటమ్ కావాలట. ఈ వెరైటీలను తెచ్చి పెట్టలేక త్రిష మామ్ ఉమ ఒకింత ఇబ్బంది పడుతోందట. కానీ త్రిష మాత్రం తన తిండిని ఏమాత్రం తగ్గించుకోవడం లేదట. తనకు ఇష్టమైన ఆహారపదార్థాలను గొంతుకాన తినేసి ఆ తర్వాత బరువు పెరుగుతానేమోనని తెగ బాధపడిపోతుందట. తిన్నందుకు కొవ్వు పెరుగుతుంది కనుక ఆ కొవ్వును కరిగించుకునేందుకు తగిన వ్యాయామం చేయకపోతే బండలా మారిపోతానేమోనని భయపడి, ట్రెడ్ మిల్‌పై గంటలకొద్దీ పరుగులు తీస్తుందట. తిన్నదంతా అరిగిపోయి నీరసం వచ్చేవరకూ అదే పనిగా వ్యాయామం చేస్తుందట. అయితే ఇటీవల కాలంలో సినిమా ఛాన్సులు కాస్త తగ్గడంతో ఇంట్లో కూచుని నోటికి పని చెప్పడమే పెద్దపనిగా పెట్టుకున్నదట. కడుపారా తిన్న తర్వాత హ్యాపీగా మంచి నిద్ర లాగించేస్తుందట. వ్యాయామాన్ని మరిచి కొంచెం బొద్దుగా కూడా మారిందట. ఒక్కసారి "బండ"లా మారితే ఇక స్లిమ్‌గా మారడం చాలా కష్టమని త్రిషకు తెలుసో లేదో మరి..!!
Source: Yahoo! Telugu: Entertainment | 5 May 2010 | 5:40 am

మూడు సముద్రాల సంగమ క్షేత్రం "కన్యాకుమారి"

భారత దేశానికి దక్షిణ సరిహద్దుల్లోని "కన్యాకుమారి" పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నునులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్యభగవానుడు, అప్పుడే సముద్ర గర్భం నుంచి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్లు కనువిందు చేస్తుంటాడు.
Source: వినోదం | 5 May 2010 | 5:29 am

తెరాసలో మూడు గ్రూపులు: కొత్త గ్రూపు లీడర్ రాములమ్మ..?!!

ఇప్పటివరకూ గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకే పరిమితమయ్యాయి. కానీ తెలంగాణా ఉద్యమం అనంతరం ఈ గ్రూపు రాజకీయాలు తెలంగాణా రాష్ట్ర సమితిలోనూ బయలుదేరినట్లు సమాచారం. తెరాసలో ఉంటూనే ఎవరికివారు తమ స్వంత ఇమేజ్‌ను బిల్డప్ చేసుకునేందుకు ఎక్కడికక్కడ గ్రూపులు కడుతున్నట్లు భోగట్టా.
Source: ఏపీ న్యూస్ | 5 May 2010 | 4:42 am

కోల్‌కతాలో స్పైస్ జెట్ విమానం హైజాక్ యత్నం!?

కోల్‌కతాలో స్పైస్ జెట్ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్పైస్ జెట్ విమానంలో ప్రయాణం చేసిన ఇద్దరు ప్రయాణీకులు విమానాన్ని హైజాక్ చేసేందుకు కుట్ర పన్నారని భద్రతా వర్గాల సమాచారం.
Source: జాతీయ | 5 May 2010 | 4:22 am

మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలి: సీఎం పిలుపు

మహిళలకు పూర్తి రక్షణ, గౌరవం కల్పించే దిశగా మహిళా, బాలల రక్షణ సాధికార సొసైటీ పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య పిలుపునిచ్చారు. అన్ని శాఖల సమన్వయంతో మహిళ, శిశు రక్షణకు కృషి చేయాలన్నారు.
Source: ఏపీ న్యూస్ | 5 May 2010 | 4:08 am

బాలకృష్ణ - పూరి కాంబినేషన్లో బెల్లంకొండ చిత్రం

"సింహా"తో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న యువరత్న బాలకృష్ణ హీరోగా "పోకిరి"తో సెన్సేషనల్ రికార్డులు సృష్టించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అగ్రనిర్మాత, సాయిగణేష్ ప్రొడక్షన్స్ అధినేత బెల్లంకొండ సురేష్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా వస్తోందన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ చిత్రం గురించి బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... బాలయ్య బాబు, పూరి జగన్నాథ్‌ల ఫస్ట్ కాంబినేషన్‌లో ఓ సెన్సేషనల్ మూవీని మా బ్యానర్లో నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బాలయ్య కెరీర్లో ఇది ఓ అద్భుతమైన చిత్రంగా చాలా హై రేంజ్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.
Source: వినోదం | 5 May 2010 | 3:34 am

స్నేహితుని భార్యపై అత్యాచారం: పరారీలో హర్తాల్ హాలప్ప!

స్నేహితుని భార్యపై అత్యాచారం చేయడానికి యత్నించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హర్తాల్ హాలప్ప పరారైనట్లు వార్తలు వస్తున్నాయి. గత మూడు రోజులుగా హాలప్ప కనిపించడం లేదని తెలుస్తోంది. అయితే ఆయన తరపు న్యాయవాది మాత్రం తమ క్లయింట్ అదృశ్యం కాలేదంటున్నారు.
Source: జాతీయ | 5 May 2010 | 2:54 am

పాత చింతకాయ పచ్చడి కాదు... కొత్త రుచులు కావాలి

బుల్లితెర సీరియళ్లంటేనే కష్టాలు, కన్నీళ్లు, ఇద్దరు భార్యలు, లేడీ విలన్లు... ఇలా ఫ్యామిలీ టైపు సీరియళ్లుగా సాగిపోతుంటాయి. వీటిలో ఎక్కువగా కన్నీళ్ల పర్యంతమయ్యే సెంటిమెంట్ సన్నివేశాలను జోడిస్తూ మహిళలను ఆకట్టుకునే ప్రయత్నాలనే ఎక్కువగా చూస్తుంటాం. అయితే ఈ తరహా రొటీన్ సీరియళ్లతో బుల్లితెర వీక్షకులు బోర్ ఫీలయ్యారనే చెప్పవచ్చు. ఇపుడు ఎక్కువగా కడుపారా నవ్వించే మినీ సీరియళ్లు, ఆసక్తిని రేకిత్తించే గేమ్ షోలంటేనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో బుల్లితెర సీరియల్ డైరక్టర్లు కూడా తమ పంథాను మార్చుకోవలసి వస్తోంది. పాతచింతకాయ పచ్చడి టైపు సీరియళ్లకు వీక్షకులు నో చెప్పేస్తూ టీవీని కట్ చేసి పారేస్తున్నారన్నది సత్యం.
Source: వినోదం | 5 May 2010 | 2:49 am

2జి స్పెక్ట్రమ్ కేటాయింపుపై ఏఐఏడీఎంకే గర్జన

2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల విషయంలో కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి ఎ.రాజా భారీ కుంభకోణానికి పాల్పడ్డారనీ, తక్షణమే ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని అన్నాడీఎంకె సభ్యులు లోక్‌సభలో గర్జించారు.
Source: జాతీయ | 5 May 2010 | 2:36 am