కోల్‌కతాలో స్పైస్ జెట్ విమానం హైజాక్ యత్నం!?

కోల్‌కతాలో స్పైస్ జెట్ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్పైస్ జెట్ విమానంలో ప్రయాణం చేసిన ఇద్దరు ప్రయాణీకులు విమానాన్ని హైజాక్ చేసేందుకు కుట్ర పన్నారని భద్రతా వర్గాల సమాచారం.
Source: Yahoo! Telugu: News | 5 May 2010 | 9:14 am

బాలకృష్ణ - పూరి కాంబినేషన్లో బెల్లంకొండ చిత్రం

"సింహా"తో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న యువరత్న బాలకృష్ణ హీరోగా "పోకిరి"తో సెన్సేషనల్ రికార్డులు సృష్టించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అగ్రనిర్మాత, సాయిగణేష్ ప్రొడక్షన్స్ అధినేత బెల్లంకొండ సురేష్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా వస్తోందన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ చిత్రం గురించి బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... బాలయ్య బాబు, పూరి జగన్నాథ్‌ల ఫస్ట్ కాంబినేషన్‌లో ఓ సెన్సేషనల్ మూవీని మా బ్యానర్లో నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బాలయ్య కెరీర్లో ఇది ఓ అద్భుతమైన చిత్రంగా చాలా హై రేంజ్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.
Source: Yahoo! Telugu: Entertainment | 5 May 2010 | 9:03 am

దుబాయ్‌లో అత్యంత పెద్ద కార్గో విమానాశ్రయం: పాల్

ప్రపంచంలోనే అత్యంత పెద్ద కార్గో విమనాశ్రయాన్ని దుబాయ్‌లో జూన్ 27న ప్రారంభించనున్నట్లు దుబాయ్ విమానాశ్రయ ప్రధాన కార్యనిర్వహణాధికారి పాల్ గ్రిఫ్ఫిత్స్ బుధవారం దుబాయ్‌లో మీడియాకు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 5 May 2010 | 9:03 am

స్టాక్ మార్కెట్: నష్టాల బాటలో సెన్సెక్స్, నిఫ్టీల ర్యాలీ!

దేశీయ వాటాల ట్రేడింగ్ క్షీణించడంతో బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు పయనిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 148 పాయింట్లు పడిపోయింది. దీంతో సెన్సెక్స్ సూచి 16,988 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 50 పాయింట్లు పతనమై, 5,097 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 5 May 2010 | 9:00 am

స్నేహితుని భార్యపై అత్యాచారం: పరారీలో హర్తాల్ హాలప్ప!

స్నేహితుని భార్యపై అత్యాచారం చేయడానికి యత్నించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హర్తాల్ హాలప్ప పరారైనట్లు వార్తలు వస్తున్నాయి. గత మూడు రోజులుగా హాలప్ప కనిపించడం లేదని తెలుస్తోంది. అయితే ఆయన తరపు న్యాయవాది మాత్రం తమ క్లయింట్ అదృశ్యం కాలేదంటున్నారు.
Source: Yahoo! Telugu: News | 5 May 2010 | 8:24 am

తిరోగమనం వైపు బాంబే స్టాక్ మార్కెట్ పయనం

దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు పయనిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 134 పాయింట్లు పడిపోయి, 17,003 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 47 పాయింట్లు క్షీణించి, 5,100 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 5 May 2010 | 8:08 am

2జి స్పెక్ట్రమ్ కేటాయింపుపై ఏఐఏడీఎంకే గర్జన

2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల విషయంలో కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి ఎ.రాజా భారీ కుంభకోణానికి పాల్పడ్డారనీ, తక్షణమే ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని అన్నాడీఎంకె సభ్యులు లోక్‌సభలో గర్జించారు.
Source: Yahoo! Telugu: News | 5 May 2010 | 8:06 am

ప్రపంచబ్యాంక్ బ్లాక్ లిస్ట్‌లో వీడియోకాన్ ఇండియా

గృహోపకరణాల నిర్మాణంలో అగ్రగామిగానున్న వీడియోకాన్ సంస్థను ప్రపంచబ్యాంక్ బ్లాక్ లిస్ట్‌లో వుంచినట్లు తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 5 May 2010 | 7:34 am

పాత చింతకాయ పచ్చడి కాదు... కొత్త రుచులు కావాలి: సాయి అచ్యుత్

బుల్లితెర సీరియళ్లంటేనే కష్టాలు, కన్నీళ్లు, ఇద్దరు భార్యలు, లేడీ విలన్లు... ఇలా ఫ్యామిలీ టైపు సీరియళ్లుగా సాగిపోతుంటాయి. వీటిలో ఎక్కువగా కన్నీళ్ల పర్యంతమయ్యే సెంటిమెంట్ సన్నివేశాలను జోడిస్తూ మహిళలను ఆకట్టుకునే ప్రయత్నాలనే ఎక్కువగా చూస్తుంటాం. అయితే ఈ తరహా రొటీన్ సీరియళ్లతో బుల్లితెర వీక్షకులు బోర్ ఫీలయ్యారనే చెప్పవచ్చు. ఇపుడు ఎక్కువగా కడుపారా నవ్వించే మినీ సీరియళ్లు, ఆసక్తిని రేకిత్తించే గేమ్ షోలంటేనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో బుల్లితెర సీరియల్ డైరక్టర్లు కూడా తమ పంథాను మార్చుకోవలసి వస్తోంది. పాతచింతకాయ పచ్చడి టైపు సీరియళ్లకు వీక్షకులు నో చెప్పేస్తూ టీవీని కట్ చేసి పారేస్తున్నారన్నది సత్యం.
Source: Yahoo! Telugu: Entertainment | 5 May 2010 | 7:25 am

స్ట్రాబెర్రీని అంతరిక్షంలోను పండించవచ్చుః శాస్త్రవేత్తలు

అంతరిక్షంలో పరిశోధనలు నిర్వహిస్తున్న శాస్త్రజ్ఞులు, అంతరిక్ష పరిశోధనకర్తలు స్ట్రాబెర్రీని తమ వెంట తీసుకెళ్ళాల్సిన పనిలేదని, ఇకపై స్ట్రాబెర్రీని అంతరిక్షంలోను పండించవచ్చంటున్నారు అమెరికాకు చెందిన పుర్డ్యూ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయవిభాగం తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 5 May 2010 | 7:13 am

నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల పతనం

బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీగా క్షీణించి, 16వేల కనిష్ఠ స్థాయికి పడిపోయిన సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 134 పాయింట్లు క్షీణించింది. దీంతో సెన్సెక్స్ 17,003 పాయింట్ల మార్కును తాకింది. ఇదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 47 పాయింట్లు పతనమై, 5,100 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 5 May 2010 | 7:07 am

భారత్-పాక్‌ల మధ్య త్వరలో చర్చలు: గిలానీ ఆశాభావం!

భారత్-పాకిస్థాన్‌ల మధ్య త్వరలో చర్చలు జరుగుతాయని పాకిస్థాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసే దిశగా చర్చలకు రంగం సిద్ధమవుతోందని గిలానీ ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ పార్లమెంట్‌లో విపక్షాలు లేవనెత్తిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. సార్క్ సదస్సులో భాగంగా భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపినట్లు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 5 May 2010 | 6:58 am

ఎంత పెట్టినా ఇంకా కావాలంటున్న తిండిబోతు త్రిష

త్రిష పెద్ద తిండిబోతట. షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లిన దగ్గర్నుంచి నోటిని ఆడిస్తూనే ఉంటుందట. అంతేకాదు... ఈ బక్కపలచని భామకు రోజుకో వెరైటీ ఫుడ్ ఐటమ్ కావాలట. ఈ వెరైటీలను తెచ్చి పెట్టలేక త్రిష మామ్ ఉమ ఒకింత ఇబ్బంది పడుతోందట. కానీ త్రిష మాత్రం తన తిండిని ఏమాత్రం తగ్గించుకోవడం లేదట. తనకు ఇష్టమైన ఆహారపదార్థాలను గొంతుకాన తినేసి ఆ తర్వాత బరువు పెరుగుతానేమోనని తెగ బాధపడిపోతుందట. తిన్నందుకు కొవ్వు పెరుగుతుంది కనుక ఆ కొవ్వును కరిగించుకునేందుకు తగిన వ్యాయామం చేయకపోతే బండలా మారిపోతానేమోనని భయపడి, ట్రెడ్ మిల్‌పై గంటలకొద్దీ పరుగులు తీస్తుందట. తిన్నదంతా అరిగిపోయి నీరసం వచ్చేవరకూ అదే పనిగా వ్యాయామం చేస్తుందట. అయితే ఇటీవల కాలంలో సినిమా ఛాన్సులు కాస్త తగ్గడంతో ఇంట్లో కూచుని నోటికి పని చెప్పడమే పెద్దపనిగా పెట్టుకున్నదట. కడుపారా తిన్న తర్వాత హ్యాపీగా మంచి నిద్ర లాగించేస్తుందట. వ్యాయామాన్ని మరిచి కొంచెం బొద్దుగా కూడా మారిందట. ఒక్కసారి "బండ"లా మారితే ఇక స్లిమ్‌గా మారడం చాలా కష్టమని త్రిషకు తెలుసో లేదో మరి..!!
Source: Yahoo! Telugu: Entertainment | 5 May 2010 | 5:40 am

కోల్‌కతాలో స్పైస్ జెట్ విమానం హైజాక్ యత్నం!?

కోల్‌కతాలో స్పైస్ జెట్ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్పైస్ జెట్ విమానంలో ప్రయాణం చేసిన ఇద్దరు ప్రయాణీకులు విమానాన్ని హైజాక్ చేసేందుకు కుట్ర పన్నారని భద్రతా వర్గాల సమాచారం.
Source: జాతీయ | 5 May 2010 | 3:45 am

స్నేహితుని భార్యపై అత్యాచారం: పరారీలో హర్తాల్ హాలప్ప!

స్నేహితుని భార్యపై అత్యాచారం చేయడానికి యత్నించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హర్తాల్ హాలప్ప పరారైనట్లు వార్తలు వస్తున్నాయి. గత మూడు రోజులుగా హాలప్ప కనిపించడం లేదని తెలుస్తోంది. అయితే ఆయన తరపు న్యాయవాది మాత్రం తమ క్లయింట్ అదృశ్యం కాలేదంటున్నారు.
Source: జాతీయ | 5 May 2010 | 2:54 am

2జి స్పెక్ట్రమ్ కేటాయింపుపై ఏఐఏడీఎంకే గర్జన

2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల విషయంలో కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి ఎ.రాజా భారీ కుంభకోణానికి పాల్పడ్డారనీ, తక్షణమే ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని అన్నాడీఎంకె సభ్యులు లోక్‌సభలో గర్జించారు.
Source: జాతీయ | 5 May 2010 | 2:36 am

చిరంజీవిది పనీ పాటా లేని యాత్ర: మంత్రి పొన్నాల

రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజారాజ్యం అధినేత చిరంజీవి బస్సు యాత్ర చేపట్టారని రాష్ట్ర భారీ నీటిపారుదల, విద్యుత్ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. చిరంజీవి చేపట్టిన బస్సు యాత్రను తప్పుబట్టడం లేదని, ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా యాత్రలు చేపట్టవచ్చునని పొన్నాల చురక అంటించారు.
Source: ఏపీ న్యూస్ | 5 May 2010 | 2:15 am

ఆ సెక్స్ వీడియోలో నాతో ఉన్నదెవరో తెలీదు: నిత్యానంద

"సెక్సానంద" నిత్యానంద స్వామి దర్యాప్తు అధికారులను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. సీఐడీ అధికారులు చేస్తున్న విచారణకు సహకరిస్తున్నట్లే సహకరిస్తూ కీలకమైన దొరికిపోతామనుకున్న ప్రశ్నలకు బదులివ్వకుండా హఠాత్తుగా కొంగ జపం చేస్తున్నాడు.
Source: జాతీయ | 5 May 2010 | 1:28 am

మే 7న పదవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు

పదవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు కేరళ రాజధాని తిరువనంతపురంలో మే 7న ప్రారంభం కానుందని ఫిల్మ్ లవర్స్ కల్చరల్ అసోసియేషన్(ఎఫ్ఐఎల్‌సిఎ) ప్రధాన కార్యదర్శి ఎమ్‌కేపీ నాయర్ బుధవారం తిరువనంతపురంలో మీడియాకు తెలిపారు.
Source: జాతీయ | 5 May 2010 | 12:42 am

నార్కో పరీక్షలు, బ్రెయిన్ మ్యాపింగ్ న్యాయవిరుద్ధం

దర్యాప్తు సంస్థలకు దేశ సర్వోన్నత న్యాయస్థానం పెద్ద షాక్ ఇచ్చింది. నిందితులపై జరిపే నార్కో పరీక్షలు, బ్రెయిన్ మ్యాపింగ్‌తో పాటు పాలిగ్రాఫ్ పరీక్షలన్నీ చట్టవిరుద్ధమైనవని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
Source: జాతీయ | 5 May 2010 | 12:35 am

కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక: నిఘా నీడలో భాగ్య నగరం!

రాష్ట్ర రాజధాని భాగ్యనగరం పోలీసుల నిఘా నీడలో ఉంది. హైదరాబాదుకు తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో.. నగర పోలీసులు అప్రమత్తమై భద్రతా చర్యలను ముమ్మరం చేస్తున్నారు. మక్కా మసీదు పేలుడు సంఘటన జరిగి మూడేళ్లు పూర్తయిన పరిస్థితుల్లో అలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.
Source: ఏపీ న్యూస్ | 5 May 2010 | 12:14 am

ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు: ఏపీపీఎస్సీ సభ్యులు

2008కి ముందు జరిగిన ఏపీపీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని ఏపీపీఎస్సీ సభ్యులు బుధవారం మీడియాతో అన్నారు. ఏపీపీఎస్సీ నియామకాల్లో వస్తున్న ఆరోపణలు అవాస్తవమని వారు స్పష్టం చేశారు. ఏపీపీఎస్సీని పూర్తి పారదర్శకతతో నడిపిస్తున్నామని, నియామకాల ఆరోపణలతో తమకెలాంటి సంబంధం లేదని ఏపీపీఎస్సీ సభ్యులు తేల్చి చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 4 May 2010 | 11:46 pm

ప్రచారం కోసమే రాములమ్మ విమర్శలు..!: చిరంజీవి

తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ విజయశాంతి ప్రచారం కోసమే తనపై విమర్శలు గుప్పిస్తున్నారని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తెలిపారు. తెరాస ఎంపీగా రాములమ్మకు గుర్తింపు లభించకపోవడంతోనే.. ప్రచారం కోసం విజయశాంతి తనపై విమర్శలు చేస్తుందని చిరంజీవి ఆరోపించారు. అలాగే రాష్ట్ర విభజన అనేది ఊహాజనితమని ఓ టీవీ ఛానెల్‌తో చిరంజీవి తెలిపారు. కలిసుంటేనే భారీ ప్రాజెక్టులు నిర్మించుకోగలమని, చిన్న రాష్ట్రాల్లో భారీ ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యమని చిరంజీవి పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 May 2010 | 11:37 pm

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్ : కెప్టెన్, జవాన్ మృతి

ఉత్తర కాశ్మీర్‌లోని బందీపుర్ అటవీ ప్రాంతంలో మిలిటెంట్లకు, భద్రతాదళాలకు మధ్య జరుగుతున్న భీకర పోరాటంలో ఆర్మీ కెప్టెన్‌తోపాటు మరో జవాన్ బుధవారం ఉదయం ఎదురుకాల్పుల్లో మృతి చెందారు.
Source: జాతీయ | 4 May 2010 | 10:24 pm

యూపీలో పట్టాలు తప్పిన సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

హజరత్ నిజాముద్దీన్-తిరుపతి మార్గాలమధ్య నడిచే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఉత్తరప్రదేశ్‌లోని సఫేదాబాద్ రైల్వే స్టేషన్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు రైల్వే అధికార వర్గాలు తెలిపాయి.
Source: జాతీయ | 4 May 2010 | 10:14 pm

మాఫియాకే లొంగలేదు... మీరెంత..?!!: రామ్ గోపాల్ వర్మ

పరిటాల రవి - మద్దెలచెరువు సూరి కుటుంబాల మధ్య రగిలిన ఫ్యాక్షన్ గొడవలను ఇతివృత్తంగా చేసుకుని క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రూపొందించిన చిత్రం "రక్త చరిత్ర". ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల పట్ల అనంతపురం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మండిపడుతున్నట్లు భోగట్టా. వీరి ఆవేశానికి కారణాలేమిటా అని చూస్తే... మద్దెలచెరువు సూరి మినహా ఆయన కుటుంబంలోని మగవాళ్లంతా పక్కా రేపిస్టులుగా "రక్త చరిత్ర" చిత్రంలో వర్మ చిత్రీకరించినట్లు భోగట్టా. ఈ సంగతి తెలుసుకున్న సూరి మద్దతుదారులు వర్మపై కారాలు మిరియాలు నూరుతున్నట్లు సమాచారం. ఇదిలావుంటే మద్దెలచెరువు సోదరుడు ఓబుల్ రెడ్డిపై పలు అత్యాచారం కేసులున్నట్లు ఆరోపణలున్నాయి. అంతేకాదు ఆయన ఓ పెళ్లయిన యువతిని బలవంతంగా రెండు వారాలపాటు తన అధీనంలో ఉంచుకోవడమేకాక ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత ఆమెను భర్త వద్ద విడిచి పెట్టినట్లు ఆరోపణలున్నాయి. వీటిని ఆధారం చేసుకుని వర్మ తన "రక్త చరిత్ర"లో సూరి కుటుంబ సభ్యులు అత్యాచారాలకు పాల్పడినట్లు సన్నివేశాల చిత్రీకరణ చేసినట్లు సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 4 May 2010 | 10:49 am

అల్లు అర్జున్ - మనోజ్ - అనుష్కల "వేదం" ట్రెయిలర్

వరుడు చిత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో కాస్తంత నీరసించిన అల్లు అర్జున్ లేటెస్ట్‌గా వేదం చిత్రంతో కొత్త ఉత్సాహాన్ని ప్రోది చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అబ్బాయ్ అర్జున్‌కోసం బాబాయ్ "పులి" తన సినిమా కొమరం పులి విడుదలను కూడా వెనక్కి వేసుకున్నాడు. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్‌తో కలిసి నటించిన వేదం చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.అల్లు అర్జున్, మనోజ్, అనుష్క ప్రధాన పాత్రల్లో క్రిష్ రూపొందించిన 'వేదం' చిత్రాన్ని ఈ నెల 20న రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్లమ్ కుర్రాడుగా మాస్ క్యారెక్టరైజేషన్‌తో సాగే పాత్రను చేస్తున్నాడు. అనుష్క వేశ్యగానూ, మంచు మనోజ్ రాక్‌స్టార్‌గానూ నటిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 May 2010 | 10:46 am

6న మధ్యాహ్నం 12.30 నిమిషాలకు కసబ్ శిక్ష ఖరారు

పాకిస్థాన్ పౌరుడు, లష్కర్ తోయిబా తీవ్రవాది అజ్మల్ కసబ్‌కు శిక్ష ఖరారు తేదీ, సమయాన్ని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంఎల్.తహల్యానీ నిర్ణయించారు. వచ్చే ఆరో తేదీన మధ్యాహ్నం 12.30 నిమిషాలకు తుది తీర్పును వెలువరించనున్నట్టు మంగళవారం ప్రకటించారు.
Source: జాతీయ | 4 May 2010 | 8:23 am

హైటెక్ సిటీపై కన్నేసిన లష్కర్-ఏ-తొయిబాః ఒకరి అరెస్టు

పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-ఏ-తొయిబా ఉగ్రవాద సంస్థ హైదరాబాద్ నగరంలోని హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ(హైటెక్ సిటీ)ని బాంబులతో పేల్చేసేందుకు కుట్రపన్నినట్లు ముహమ్మద్ జియా- ఉల్- హక్ వెల్లడించినట్లు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.
Source: ఏపీ న్యూస్ | 4 May 2010 | 8:18 am

పైకి రావాలంటే తొడలు బాగా చూపిస్తే సరి..!!

టాలీవుడ్ సినీపరిశ్రమలోకి అప్పుడే అడుగు పెట్టిన హీరోయిన్లు ఉన్నఫళంగా ఉవ్వెత్తున తారాపథానికి దూసుక వెళ్లాలంటే ఏం చేయాలి..? అందమైన తొడల అందాలను చూపిస్తే సరి... గుర్తింపు దానంతట అదే తన్నుక వస్తుంది. ఈ సూత్రాన్ని ఇపుడు చాలామంది కొత్త తారలు పాటిస్తున్నట్లు కనబడుతున్నారు. సోమవారం హైదరాబాదులోని తాజ్ బంజారాలో "వేదం" ఆడియో విడుదల కార్యక్రమానికి ఆ చిత్రానికి సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్లు అందరూ విచ్చేశారు. అయితే ఆ చిత్రంలో నటించిన సెకండ్ హీరోయిన్ దీక్షపైనే అందరి చూపులు నిలిచాయి మరి."భిల్లా" బికినీ భామ అనుష్క ఈ కార్యక్రమానికి వచ్చినా ఆమెను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. దీక్షవైపే అందరూ తీక్షణంగా చూడటం కనిపించింది. అమ్మడు ఈ కార్యక్రమానికి చిట్టిపొట్టి డ్రెస్సు వేసుకుని కుర్చీలో తొడలను చూపిస్తూ గంటలకొద్దీ ఆశీనులరాలయ్యింది. దీంతో అక్కడివారంతా ఆడియో విడుదల కార్యక్రమాన్ని చూడటానికి బదులు దీక్షనే చూస్తూ కాలం గడిపారు. మొత్తానికి ఆమె అనుకున్న గుర్తింపు వచ్చినట్లే కదా.. కనకు ఇమేజ్ తెచ్చుకోవాలంటే హీరోయిన్లు తొడలు చూపించాలన్నమాట.
Source: Yahoo! Telugu: Entertainment | 4 May 2010 | 7:12 am

మాఫియాకే లొంగలేదు... మీరెంత..?!!: రామ్ గోపాల్ వర్మ

పరిటాల రవి - మద్దెలచెరువు సూరి కుటుంబాల మధ్య రగిలిన ఫ్యాక్షన్ గొడవలను ఇతివృత్తంగా చేసుకుని క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రూపొందించిన చిత్రం "రక్త చరిత్ర". ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల పట్ల అనంతపురం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మండిపడుతున్నట్లు భోగట్టా. వీరి ఆవేశానికి కారణాలేమిటా అని చూస్తే... మద్దెలచెరువు...
Source: వినోదం | 4 May 2010 | 6:52 am

శివుడి ఆత్మలింగం భూమిపై వెలసిన "మురుడేశ్వర"..!!

రావణుడు పరమశివుడు ప్రసాదించిన ఆత్మలింగంపై నున్న వస్త్రాన్ని విసిరివేయగా, ఆ వస్త్రం పడిన ప్రాంతమే "మురుడేశ్వర"గా అవతరించింది. ఈ మురుడేశ్వర కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోగల భట్కల్ తాలూకాలో ఒక పట్టణం. శివుడి పుణ్యక్షేత్రమైన ఈ పట్టణం అరేబియా సముద్రం ఒడ్డున ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన శివుడి విగ్రహం కొలువైయున్న ఈ పట్టణంలో పరమశివుడు "మురుడేశ్వరుడు"గా నిత్యపూజలందుకుంటున్నాడు.
Source: వినోదం | 4 May 2010 | 6:10 am

అంతా దిగుమతి నటీనటులే: దాసరి నారాయణరావు

దర్శకరత్న దాసరి నారాయణరావు మరోసారి తెలుగు సినీ పరిశ్రమ పోకడపై విరుచుక పడ్డారు. పరభాషలకు చెందిన నటీనటులను దిగుమతి చేసుకోవడం మన దర్శక నిర్మాతలకు అలవాటుగా మారిపోయిందని అన్నారు. ఒక ప్రైవేటు టెలివిజన్ ఛానల్‌తో మాట్లాడుతూ ఆయన... "మనవాళ్లకంటే మిగిలిన భాషా చిత్రాలకు సంబంధించిన హీరోహీరోయిన్లనే మనం సూపర్ హీరోహీరోయిన్లుగా చూపెడుతున్నాం. ఇది ఇలాగే కొనసాగితే కొంతకాలానికి తెలుగు హీరోహీరోయిన్లే కనబడకుండా పోతారు. అందుకే నా వంతుగా అంతా కొత్తవారిని, అదీ తెలుగువారిని నటీనటులుగా యంగ్ ఇండియా ద్వారా పరిచయం చేస్తున్నాను" అన్నారు.నేటి సినిమాలను డొల్ల కథలను ఆధారంగా చేసుకుని రూపొందించటం వల్ల బాక్సాఫీసుల వద్ద బోల్తా పడుతున్నాయన్నారు. ఎక్కువగా కమర్షియల్ డెకరేషన్, యూత్ వీక్నెస్‌ను క్యాష్ చేసుకునే విధంగా స్టోరీలకు ప్రాధాన్యతనిస్తూ జీవితాలను ఆవిష్కరించే కథలకు చోటివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 May 2010 | 5:57 am

రేపు హైదరాబాద్‌కు రానున్న జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సంప్రదింపులు జరిపేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ బుధవారం మరోమారు రాష్ట్రానికి రానుంది. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండే ఈ కమిటీ.. తెలంగాణ జాగృతి సంస్థ, తెలంగాణ ఉద్యోగ ఐక్య కార్యచరణ సంఘాల అభిప్రాయాన్ని కమిటీ సేకరిస్తుంది. అనంతరం శుక్రవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరుతుంది.
Source: ఏపీ న్యూస్ | 4 May 2010 | 5:55 am

అల్లు అర్జున్ - మనోజ్ - అనుష్కల "వేదం" ట్రెయిలర్

వరుడు చిత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో కాస్తంత నీరసించిన అల్లు అర్జున్ లేటెస్ట్‌గా వేదం చిత్రంతో కొత్త ఉత్సాహాన్ని ప్రోది చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అబ్బాయ్ అర్జున్‌కోసం బాబాయ్ "పులి" తన సినిమా కొమరం పులి విడుదలను కూడా వెనక్కి వేసుకున్నాడు. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్‌తో కలిసి నటించిన వేదం చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.అల్లు అర్జున్, మనోజ్, అనుష్క ప్రధాన పాత్రల్లో క్రిష్ రూపొందించిన 'వేదం' చిత్రాన్ని ఈ నెల 20న రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్లమ్ కుర్రాడుగా మాస్ క్యారెక్టరైజేషన్‌తో సాగే పాత్రను చేస్తున్నాడు. అనుష్క వేశ్యగానూ, మంచు మనోజ్ రాక్‌స్టార్‌గానూ నటిస్తున్నారు.
Source: వినోదం | 4 May 2010 | 5:22 am

నిథారీ హత్య కేసు: రెండో కేసులో దోషిగా తేలిన కోలీ

నిథారీ వరుస హత్య కేసులకు సంబంధించి ఏడేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చిన కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త మోనీందర్ సింగ్ పాంథర్ అనుచరుడు సురేందర్ కోలీ దోషిగా తేలాడు. ఈ మేరకు సీబీఐ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో శిక్ష ఖరారును న్యాయమూర్తి బుధవారానికి వాయిదా వేశారు.
Source: జాతీయ | 4 May 2010 | 5:15 am

భాగ్యనగరి వాసులు నిశ్చింతగా ఉండొచ్చు: ఏకే.ఖాన్

హైదరాబాద్ నగర ప్రజలు ఎలాంటి భయం లేకుండా నిశ్చింతగా ఉండొచ్చని నగర పోలీసు కమిషనర్ ఏకే.ఖాన్ తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తీవ్రవాదులు హైదరాబాద్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు పాల్పడే అవకాశం ఉందని వార్తలు రావడంతో నగరమంతా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించినట్టు చెప్పారు. దీంతో ప్రజల్లో ఏం జరుగబోతుందనే భయం నెలకొనడం సహజమేనన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 May 2010 | 4:19 am