విమాన కొనుగోళ్ళకు అనుమతినిచ్చిన ప్రభుత్వం

దేశంలో బడ్జెట్ విమానయాన సేవలను అందిస్తున్న ఇండిగో కంపెనీ నూతన విమానాలను కొనుగోలుచేసేందుకు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది.
Source: Yahoo! Telugu: News | 4 May 2010 | 7:48 am

నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ మార్కెట్

మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభనష్టాలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు పయనించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్ హెచ్చు తగ్గులతో ర్యాలీని కొనసాగిస్తోంది. దీంతో మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్, 42 పాయింట్ల నష్టంతో, 17,344 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 8 పాయింట్లు స్వల్పంగా క్షీణించి, 5,213 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 4 May 2010 | 7:36 am

విదేశీ పెట్టుబడులను స్వాగతించిన కేంద్ర ప్రభుత్వం

భారతదేశం విదేశీ పెట్టుబడులను స్వాగతిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం న్యూ ఢిల్లీలో తెలిపారు. విదేశీ పెట్టుబడులు దేశంలో పెరగడంతో జ్ఞానాభివృద్ధికి అవసరమయ్యే విద్య, అంతర్జాతీయ స్థాయి నిపుణులను తయారు చేసేందుకు దోహదపడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 4 May 2010 | 7:29 am

ఫోన్సెకాపై సైనిక కోర్టు మార్షల్ రద్దు చేసిన శ్రీలంక

శ్రీలంక ఆర్మీ మాజీ చీఫ్ శరత్ ఫోన్సెకాపై ఆ దేశ సైనిక కోర్టు విచారణ (మార్షల్)ను శ్రీలంక ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే, ఆయనపై దాఖలైన మరో కేసులో మాత్రం విచారణ కొనసాగుతుందని సైనిక కోర్టు స్పష్టం చేసింది. ఆర్మీ చీఫ్‌గా ఉన్న సమయంలో దేశాధ్యక్షుడు మహీందా రాజపక్సేతో పాటు ఆయన కుటుంబ సభ్యులను హత్యచేసేందుకు కుట్ర పన్నినట్టు శరత్ ఫోన్సెకాపై కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 4 May 2010 | 7:20 am

పైకి రావాలంటే తొడలు బాగా చూపిస్తే సరి..!!

టాలీవుడ్ సినీపరిశ్రమలోకి అప్పుడే అడుగు పెట్టిన హీరోయిన్లు ఉన్నఫళంగా ఉవ్వెత్తున తారాపథానికి దూసుక వెళ్లాలంటే ఏం చేయాలి..? అందమైన తొడల అందాలను చూపిస్తే సరి... గుర్తింపు దానంతట అదే తన్నుక వస్తుంది. ఈ సూత్రాన్ని ఇపుడు చాలామంది కొత్త తారలు పాటిస్తున్నట్లు కనబడుతున్నారు. సోమవారం హైదరాబాదులోని తాజ్ బంజారాలో "వేదం" ఆడియో విడుదల కార్యక్రమానికి ఆ చిత్రానికి సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్లు అందరూ విచ్చేశారు. అయితే ఆ చిత్రంలో నటించిన సెకండ్ హీరోయిన్ దీక్షపైనే అందరి చూపులు నిలిచాయి మరి."భిల్లా" బికినీ భామ అనుష్క ఈ కార్యక్రమానికి వచ్చినా ఆమెను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. దీక్షవైపే అందరూ తీక్షణంగా చూడటం కనిపించింది. అమ్మడు ఈ కార్యక్రమానికి చిట్టిపొట్టి డ్రెస్సు వేసుకుని కుర్చీలో తొడలను చూపిస్తూ గంటలకొద్దీ ఆశీనులరాలయ్యింది. దీంతో అక్కడివారంతా ఆడియో విడుదల కార్యక్రమాన్ని చూడటానికి బదులు దీక్షనే చూస్తూ కాలం గడిపారు. మొత్తానికి ఆమె అనుకున్న గుర్తింపు వచ్చినట్లే కదా.. కనకు ఇమేజ్ తెచ్చుకోవాలంటే హీరోయిన్లు తొడలు చూపించాలన్నమాట.
Source: Yahoo! Telugu: Entertainment | 4 May 2010 | 7:12 am

మోటార్‌మెన్ల మెరుపు సమ్మె: ముంబైలో రైళ్లు బంద్

తమ దీర్ఘకాలిక డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని కోరుతూ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మోటార్‌మెన్లు మెరుపు సమ్మెకు దిగారు. మధ్య, పశ్చిమ రైల్వేలకు చెందిన మోటార్‌మెన్లు ఒక్కసారిగా ఈ సమ్మెకు దిగడంతో ముంబైలో లోకల్ రైలు సేవలు పూర్తిగా స్తంభించి పోయాయి. దీంతో ముంబై వాసులు తీవ్ర ఇబ్పందులను ఎదుర్కొంటున్నారు.
Source: Yahoo! Telugu: News | 4 May 2010 | 7:06 am

"చిరు" యాత్రపై తెరాస నేతలకు అంత గుబులెందుకో?

ప్రజారాజ్యం పార్టీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి చేపట్టనున్న తెలంగాణ జిల్లాల పర్యటనపై తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు తెగ గాబరా పడిపోవడానికి కారణాలేమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. తెలంగాణ జిల్లాల్లో అడుగుపెడితే చిరంజీవి అంతుచూస్తాం.. అంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రగల్భాలు వారికే చెల్లుతాయని చెప్పొచ్చు. అంతేకాకుండా, తమ హెచ్చరికలకు కాదని పర్యటన చేపడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, తమ తఢాకా చూపుతామని అంటున్నారు.
Source: Yahoo! Telugu: News | 4 May 2010 | 6:51 am

మిశ్రమ ఫలితాల్లో బాంబే స్టాక్ మార్కెట్

మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.40 గంటల ప్రాంతంలో 18 పాయింట్లు స్వల్పంగా క్షీణించింది. దీంతో సెన్సెక్స్ సూచి 17,367 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. కానీ నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ మాత్రం కేవలం మూడు పాయింట్ల లాభంతో 5,226 పాయింట్ల మార్కును తాకింది.
Source: Yahoo! Telugu: News | 4 May 2010 | 6:48 am

ఉప ఎన్నికల్లో తెరాసకు ఓటేస్తే మళ్లీ ఉప ఎన్నికలు!

తెలంగాణ ప్రాంతంలో ఖాళీగా ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపిస్తే మళ్లీ ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భావన స్థానిక ఓటర్లలో నెలకొంది. ఈ తెరాస నేతలు రాజీనామాలు చేయడం మినహా మరొకటి చేయడం చేతరాదని వారు అంటున్నారు. రాజీనామాలు చేయడంలో వీరికి గౌరవ డాక్టరేట్ డిగ్రీలు అందజేయవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 4 May 2010 | 6:47 am

సబ్సిడీ బియ్యం అందరికీ ఇవ్వలేముః శరద్ పవార్

దేశంలోని ప్రజలందరికీ సబ్సిడీ కింద బియ్యం పంపిణీ చేయాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండుకు కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ స్పందిస్తూ సబ్సిడీపై నిత్యావసరసరుకులు ప్రజలందరికీ ఇవ్వడం కుదరదని రాజ్యసభలో వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 4 May 2010 | 6:42 am

అంతా దిగుమతి నటీనటులే: దాసరి నారాయణరావు

దర్శకరత్న దాసరి నారాయణరావు మరోసారి తెలుగు సినీ పరిశ్రమ పోకడపై విరుచుక పడ్డారు. పరభాషలకు చెందిన నటీనటులను దిగుమతి చేసుకోవడం మన దర్శక నిర్మాతలకు అలవాటుగా మారిపోయిందని అన్నారు. ఒక ప్రైవేటు టెలివిజన్ ఛానల్‌తో మాట్లాడుతూ ఆయన... "మనవాళ్లకంటే మిగిలిన భాషా చిత్రాలకు సంబంధించిన హీరోహీరోయిన్లనే మనం సూపర్ హీరోహీరోయిన్లుగా చూపెడుతున్నాం. ఇది ఇలాగే కొనసాగితే కొంతకాలానికి తెలుగు హీరోహీరోయిన్లే కనబడకుండా పోతారు. అందుకే నా వంతుగా అంతా కొత్తవారిని, అదీ తెలుగువారిని నటీనటులుగా యంగ్ ఇండియా ద్వారా పరిచయం చేస్తున్నాను" అన్నారు.నేటి సినిమాలను డొల్ల కథలను ఆధారంగా చేసుకుని రూపొందించటం వల్ల బాక్సాఫీసుల వద్ద బోల్తా పడుతున్నాయన్నారు. ఎక్కువగా కమర్షియల్ డెకరేషన్, యూత్ వీక్నెస్‌ను క్యాష్ చేసుకునే విధంగా స్టోరీలకు ప్రాధాన్యతనిస్తూ జీవితాలను ఆవిష్కరించే కథలకు చోటివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 May 2010 | 5:57 am

న్యూయార్క్‌లో కారు బాంబు అమర్చిన వ్యక్తి అరెస్టు

న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో కారు బాంబు అమర్చిన వ్యక్తిని అమెరికా పోలీసులు మంగళవారం అరెస్టు చేసినట్టు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలో స్థిరపడిన పాకిస్థానీ పౌరుడు ఈ బాంబును అమర్చినట్టు గుర్తించారు.
Source: Yahoo! Telugu: News | 4 May 2010 | 5:53 am

మోటార్‌మెన్ల మెరుపు సమ్మె: ముంబైలో రైళ్లు బంద్

తమ దీర్ఘకాలిక డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని కోరుతూ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మోటార్‌మెన్లు మెరుపు సమ్మెకు దిగారు. మధ్య, పశ్చిమ రైల్వేలకు చెందిన మోటార్‌మెన్లు ఒక్కసారిగా ఈ సమ్మెకు దిగడంతో ముంబైలో లోకల్ రైలు సేవలు పూర్తిగా స్తంభించి పోయాయి. దీంతో ముంబై వాసులు తీవ్ర ఇబ్పందులను ఎదుర్కొంటున్నారు.
Source: జాతీయ | 4 May 2010 | 1:36 am

ఉప ఎన్నికల్లో తెరాసకు ఓటేస్తే మళ్లీ ఉప ఎన్నికలు!

తెలంగాణ ప్రాంతంలో ఖాళీగా ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపిస్తే మళ్లీ ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భావన స్థానిక ఓటర్లలో నెలకొంది. ఈ తెరాస నేతలు రాజీనామాలు చేయడం మినహా మరొకటి చేయడం చేతరాదని వారు అంటున్నారు. రాజీనామాలు చేయడంలో వీరికి గౌరవ డాక్టరేట్ డిగ్రీలు అందజేయవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 May 2010 | 1:18 am

ఈనెల 27వ తేదీ నుంచి తెదేపా గండిపేట మహానాడు

తెలుగుదేశం పార్టీ ఈనెల 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు మహానాడును నిర్వహించనుంది. గండిపేట తెలుగు విజయంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ మహానాడులో 13 కీలక అంశాలపై తీర్మానాలు చేయనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 May 2010 | 12:07 am

దేశంలోకి చొరబడిన 35 మంది అల్‌ఖైదా ముష్కరులు

అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ అల్‌ఖైదాకు చెందిన 35 మంది ముష్కర మూకలు దేశంలోకి చొరబడినట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. వీరంతా పశ్చిమ తీరం మీదుగా భారత్‌లోకి చొరబడినట్టు సమాచారం. దీంతో దేశ వ్యాప్తంగా రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
Source: జాతీయ | 3 May 2010 | 11:52 pm

తెదేపా టిక్కెట్ ఇచ్చినా.. పోటీ చేయను: చెన్నమనేని

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తెలంగాణ అంశంలో చరిత్రలో చెరగిపోని తప్పు చేస్తోందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఇకపై ఆ పార్టీ ఎన్నికల గుర్తుపై పోటీ చేసే ప్రసక్తే లేదని ఆయన కుండబద్ధలుకొట్టినట్టు చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 3 May 2010 | 11:36 pm

చిరంజీవి పోలవరం బస్సు యాత్రా షెడ్యూల్‌ ఖరారు

ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి ఐదో తేదీ నుంచి చేపట్టనున్న పోలవరం బస్సు యాత్రా షెడ్యూల్‌ను ఆ పార్టీ ప్రధాన కార్యాలయం సోమవారం విడుదల చేసింది. ఈనెల 17వ తేదీ వరకు సాగే యాత్రలో ఉదయం వేళల్లో సభలు, సమావేశాలు ఉంటాయి. సాయంత్రం వేళల్లో పోలవరం బాధిత ప్రాంతాల్లో యాత్ర సాగుతుందని ప్రరాపా పేర్కొంది.
Source: ఏపీ న్యూస్ | 3 May 2010 | 11:27 pm

అయ్యా.. చిరంజీవి అంతగా మిడిసిపడకూ: తెరాస

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపై తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు మండిపడ్డారు. తెలంగాణ జిల్లాల పర్యటనపై చిరంజీవి చేస్తున్న ప్రకటనలు తెరాస నేతలు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో కరుడుగట్టిన సమైక్యాంధ్రవాదులు ఒక్కొక్కరుగా స్వేచ్ఛగా వచ్చి పర్యటన చేసి వెళ్లడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 3 May 2010 | 10:59 pm

ఓటు బ్యాంకు రాజకీయాలతో దేశానికి ముప్పు: గడ్కారీ

దేశంలో హెచ్చుమీరిపోతున్న ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల దేశ భద్రతకు ముప్పు ఏర్పడటంతో పాటు.. ఉగ్రవాదం పెరిగిపోతోందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఉగ్రవాదం దేశంలో పెరిగిపోతోందన్నారు.
Source: జాతీయ | 3 May 2010 | 10:31 pm

రాష్ట్ర రాజధానిలో లష్కర్ తోయిబా ఉగ్రవాది అరెస్టు

రాష్ట్ర రాజధాని పోలీసుల గాలింపు చర్యలకు ఫలితం దక్కింది. హైదరాబాద్ నగరంలో భారీ విధ్వంసం సృష్టించేందుకు పన్ని లష్కర్ తోయిబా ఉగ్రవాది జియా ఉల్ హక్‌ను నగర పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. అదేసమయంలో గత కొంతకాలంగా పోలీసులకు సవాల్‌ విసురుతున్న సిమీ కార్యకర్త... గజ ఉగ్రవాది వికార్‌ అహ్మద్‌ కర్ణాటకలోని గుల్బర్గా పోలీసులకు చిక్కినట్టు సమాచారం. దీంతో గత వారం రోజులుగా రాజధానిలో పోలీసులు చేసిన కృషికి ఫలితం దక్కింది.
Source: జాతీయ | 3 May 2010 | 10:22 pm

బాలయ్య సినిమా - చిరంజీవి యాక్టింగ్...?!!

త్వరలో చిరంజీవి వెండితెరపై కన్పించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక సందేశాత్మక చిత్రంలో చిరంజీవి నటించనున్నారనే వార్తలు ఇటీవల ఫిలిమ్ నగర్‌లో ఊపందుకున్నాయి. ఈ చిత్రానికి వాసు దర్శకత్వం వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సామాజిక చైతన్యం కోసమే చిరంజీవి మళ్లీ ఈ చిత్రంలో నటించనున్నారని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఈ సినిమాకోసం ఇప్పటికే పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే కోడి రామకృష్ణ ఇటీవల చిరంజీవిని కలిసి చాలాసేపు చర్చించినట్లు టాలీవుడ్ టాక్. చిరంజీవి కోసమే తాను ఓ కథను సిద్ధం చేశాననీ, చిరు తన మనసు మార్చుకుంటే ఆయనతో సినిమా చేయాలని "కోడి" అనుకుంటున్నట్లు భోగట్టా. ఇదిలావుంటే మొదట్లో చిరంజీవితో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తీయాలని అనుకున్నారు. అయితే నరసింహనాయుడు సమరసింహారెడ్డి వంటి చిత్రాలలో నటించి సక్సెస్‌లు సాధించిన బాలయ్య అయితే ఈ చిత్రానికి సరిపోతాడని మరికొందరు ఆయన చెవిన వేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 May 2010 | 1:46 pm

హైదరాబాద్‌ పాతబస్తీలో ఇద్దరు సిమి కార్యకర్తల అరెస్టు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఇద్దరు సిమి కార్యకర్తలను కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. అలాగే, పలు పేలుళ్లు, హత్య కేసులతో సంబంధం ఉన్న వికారుద్దీన్‌ను కూడా గుల్బర్గా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 3 May 2010 | 9:40 am

ముంబై దాడుల కేసులో కసబ్‌ను దోషిగా తేల్చిన కోర్టు

ముంబయి ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్న పదిమంది ఉగ్రవాదుల్లో ప్రాణాలతో పట్టుబడ్డ అజ్మల్ కసబ్‌ను ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. ముంబై దాడుల కేసును విచారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.ఎల్.తహల్యాని ఈ మేరకు సోమవారం తుదితీర్పు వెలువరించారు. శిక్షను మాత్రం బుధవారం ఖరారు చేయనున్నారు.
Source: జాతీయ | 3 May 2010 | 8:57 am

వచ్చేస్తానంటున్న "సమైక్య"పులి... కుయ్యోమంటున్న " కొమరం పులి"

"కొమరం పులి" చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అదేవిధంగా సమైక్యాంధ్ర లక్ష్యంగా సాగుతున్న పీఆర్పీ నేత చిరంజీవి కూడా తెలంగాణాలో పర్యటించడానికి రెడీ అవుతున్నారు. అటు పులి సినిమా.. ఇటు పీఆర్పీ నేత పర్యటన రెండూ ఒకేసారి తెలంగాణా ప్రజలపైకి దూసుక రానున్నాయి. ఇప్పటికే కొమరం పులి చిత్రాన్ని తెలంగాణాలో అడ్డుకుంటామని తెలంగాణా జేఏసి నాయకులు హెచ్చరించారు. దీంతో చిత్ర నిర్మాత సింగమల రమేష్ విపరీతమైన ఒత్తిడికి లోనై ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు సమాచారం. కోట్లు ఖర్చుపెట్టి కొమరం పులిని తెరకెక్కించాననీ, ఒకవేళ తెలంగాణాలో ఆ చిత్రాన్ని అడ్డుకుంటే పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో రమేష్ ఉన్నట్లు సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 3 May 2010 | 7:26 am

తాగుడుకు బానిసైన "ఆది" హీరోయిన్ కీర్తిచావ్లా..!?

"ఆది" సినిమాలో కథానాయికగా నటించిన అందాల ముద్దుగుమ్మ కీర్తిచావ్లా. ఆది తర్వాత నాలుగైదు సినిమాల్లో చేసినా అమ్మడు ఏ మాత్రం రాణించలేదు. ఈ క్రమంలో కొన్నాళ్ల తర్వాత తెలుగు తెరకు కీర్తి చావ్లా దూరమైంది. అయితే తమిళ సినీపరిశ్రమలో మాత్రం కీర్తిచావ్లాకు మంచి ఛాన్సులు వస్తున్నాయని సినీజనం గుసగుసలాడుకుంటున్నారు. కానీ కీర్తిచావ్లా బాగా తాగుడికి అలవాడు పడిందని సమాచారం. డైరక్ట్‌గా షూటింగ్ సెట్స్‌కి వచ్చేటప్పుడే మందు కొచ్చి వచ్చేస్తుందని సినీ వర్గాలో టాక్. ఇంకా ఏ మాత్రం జంకు లేకుండా మందుకొట్టి డేర్‌గా వస్తున్న ఆమెను మిగతావారు చూసి ఖంఘుతింటున్నారట. ఇటీవలే "సాధ్యం" సినిమాలో ఒక పాత్ర పోషించిన కీర్తిచావ్లా.. అక్కడ కూడా మందు కొట్టి ఇదే సీన్ చేసిందట.!. షూటింగ్‌లకు లేటుగా రావడంతో ఆమెను బుక్ చేసుకున్న దర్శకులు, నిర్మాతలు తెగ ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. ఒక్క సినిమాతోనే హిట్ కొట్టిన తర్వాత అవకాశం రాకపోవడంతో..? కీర్తిచావ్లా తాగుడుకు బానిసయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాగుడుని కంట్రోల్ చేస్తేనే కీర్తిచావ్లా సినీ కెరీర్ బాగుంటుందని ఇండస్ట్రీ భావిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 3 May 2010 | 7:15 am

26/11 దాడి కేసుల తుది తీర్పే పాక్‌కు సందేశం: పీసీ

26/11 దాడుల కేసుల్లో ప్రత్యేక కోర్టు వెలువడిన తుది తీర్పే పాకిస్థాన్‌కు పంపే గట్టి సందేశమని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం అన్నారు. ఇప్పటికైనా భారత్‌కు వ్యతిరేక ఉగ్రవాద చర్యలను పాకిస్థాన్ మానుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Source: జాతీయ | 3 May 2010 | 7:10 am

మే 7న "సూపర్ కౌబాయ్"గా వస్తోన్న లారెన్స్!

నృత్యదర్శకుడు లారెన్స్ హీరోగా శింబుదేవన్ దర్శకత్వంలో రూపొందిన "సూపర్ కౌబాయ్" చిత్రాన్ని ఈ నెల ఏడోతేదీన విడుదల చేస్తున్నట్లు నైజాం, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ డి.ఎస్. రావ్ తెలియజేశారు. తెలుగు ఈ రెండు ప్రాంతాల్లో తామే విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఎస్‌జిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కల్పాత్తి ఎస్. అగోరమ్ నిర్మించారు. 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ కౌబాయ్ చిత్రాన్ని నిర్మించారు. 18వ శతాబ్దానికి చెందిన కథతో ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 May 2010 | 6:49 am

ఆదిలాబాద్‌ నుంచి చిరంజీవి తెలంగాణ ప్రాంత పర్యటన

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలంగాణ ప్రాంత పర్యటనను ఆదిలాబాద్ జిల్లా నుంచి చేపట్టనున్నారు. ఈ జిల్లాలో ప్రజారాజ్యం పార్టీకి మంచి క్యాడర్ ఉంది. ఈ జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కూడా ప్రరాపా కైవసం చేసుకుంది. అందువల్ల ఇక్కడ నుంచి తన సమైక్యాంధ్ర యాత్రను చేపట్టనున్నట్టు చిరంజీవి వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 3 May 2010 | 6:47 am

గ్రామీణ నేపథ్యంలో బ్రహ్మాజీ చిత్రం "అబ్బో వాడా!"

పల్లెటూళ్ళలో ఉండే బంధాలు, అనుబంధాలు ఇంకా అక్కడ స్థానికంగా ఉండే రాజకీయాలు, మధ్యలో అందమైన ప్రేమకథ. వీటినన్నింటిని మిళితం చేస్తూ గ్రామీణ నేపథ్యంలో శ్రీశ్రీ కుమారస్వామి ఫిలింస్ నిర్మిస్తున్న చిత్రం "అబ్బో వాడా!". బ్రహ్మాజీ, రేఖాశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఎస్. బసవపున్నయ్య నిర్మించగా, రత్నం కె.వి. దర్శకత్వం వహించారు.ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ.. "హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ చేశారు. కొంతభాగాన్ని అడవిలో చిత్రీకరించారు. కమర్షియల్ అంశాలు జోడించి తీసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదే మే నెలలో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. మంచి క్వాలిటీ ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో మేకింగ్‌లో ఎక్కడా రాజీ పడలేదు. కొత్తదనం ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది." అని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 May 2010 | 6:41 am

పేదల ఊటీ "ఏర్కాడు"లో హ్యాపీ సమ్మర్ ట్రిప్..!!

తమిళనాడు రాష్ట్రంలో సేలం పట్టణానికి దగ్గర్లోగల "ఏర్కాడు" దేశంలోని హిల్‌స్టేషన్లలో ఒకటిగా పేరుగాంచింది. చెన్నై నగరానికి 370 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏర్కాడును "పేదల ఊటీ" అని ముద్దుగా పిలుస్తుంటారు. సెర్వరాయన్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,500 మీటర్ల (4,920 అడుగులు) ఎత్తులో ఉండే ఏర్కాడులో.. వేసవికాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల...
Source: వినోదం | 3 May 2010 | 6:27 am

జూన్‌లో "మా అన్నయ్య బంగారం" విడుదల

డాక్టర్. రాజశేఖర్, కమలిని ముఖర్జీ జంటగా నటిస్తోన్న "మా అన్నయ్య బంగారం" చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. బంజారాహిల్స్ రాక్‌కాజిల్ సమీపంలోని ఓ హోటల్‌లో హీరోహీరోయిన్లపై సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం సందర్భంగా చిత్ర నిర్మాత నట్టికుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. "ఏడుగురు అన్నదమ్ముల కథతో ఈ చిత్రం రూపొందుతోంది. చంద్రబోస్ ఐదు చక్కటి పాటలు రాశారు. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 May 2010 | 6:23 am

ముంబై దాడుల కుట్ర పాక్‌లో జరిగింది: ప్రత్యేక కోర్టు

ముంబై దాడులకు పాకిస్థాన్‌లోనే కుట్ర జరిగినట్టు ఈ దాడుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. 26/11 దాడుల కేసులో సోమవారం తుది తీర్పు వెలువడిన విషయం తెల్సిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను దోషిగా ఖరారు చేసింది.
Source: జాతీయ | 3 May 2010 | 4:12 am