|
అదిలాబాద్ నుంచి చిరంజీవి తెలంగాణ ప్రాంత పర్యటనప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలంగాణ ప్రాంత పర్యటనను అదిలాబాద్ జిల్లా నుంచి చేపట్టనున్నారు. ఈ జిల్లాలో చిరంజీవితో పాటు.. ప్రజారాజ్యం పార్టీకి మంచి క్యాడర్ ఉంది. ఈ జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కూడా ప్రరాపా కైవసం చేసుకుంది. అందువల్ల ఇక్కడ నుంచి తన సమైక్యాంధ్ర యాత్రను చేపట్టనున్నట్టు చిరంజీవి వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 3 May 2010 | 9:25 am హైదరాబాద్ పాతబస్తీలో ఇద్దరు సమి కార్యకర్తల అరెస్టురాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఇద్దరు సిమి కార్యకర్తలను కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. అలాగే, పలు పేలుళ్లు, హత్య కేసులతో సంబంధం ఉన్న వికారుద్దీన్‌ను కూడా గుల్బర్గా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.Source: Yahoo! Telugu: News | 3 May 2010 | 9:08 am భారీ నష్టాల దిశగా స్టాక్ మార్కెట్ పయనంసోమవారం బాంబే స్టాక్ మార్కెట్ భారీ నష్టాల దిశగా ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి తిరోగమనం వైపు పయనిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో 198 పాయింట్లు క్షీణించింది. దీంతో సెన్సెక్స్ సూచి 17,359 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 63 పాయింట్లు పడిపోయి, 5,214 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 3 May 2010 | 9:03 am ముంబై దాడుల కేసులో కసబ్‌ను దోషిగా తేల్చిన కోర్టుముంబై మారణహోమానికి పాల్పడిన పాకిస్థాన్ ప్రేరేపిత లష్కర్ తోయిబా ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. ముంబై దాడుల కేసును విచారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.ఎల్.తహల్యాని ఈ మేరకు సోమవారం తుదితీర్పు వెలువరించారు. శిక్షను మాత్రం బుధవారం ఖరారు చేయనున్నారు.Source: Yahoo! Telugu: News | 3 May 2010 | 8:50 am ఉద్యోగులను నియమించనున్న ఐసీఐసీఐ బ్యాంకుదేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న ఐసీఐసీఐ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి దాదాపు ఏడువేల మంది ఉద్యోగులను నియమించనున్నట్లు ఆ బ్యాంకు ఎండీ, ప్రధాన కార్యనిర్వహణాధికారి(సీఈఓ) చందా కోచ్చర్ సోమవారం ముంబైలో మీడియాకు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 3 May 2010 | 8:45 am ఎన్.పి.టి సమీక్షా సమావేశానికి భారత్ గైర్హాజరు!అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక అంశంపై సమీక్షా సమావేశం ఐక్యరాజ్య సమితిలోని ప్రధాన కార్యాలయంలో సోమవారం జరుగనుంది. ఈ సమావేశానికి భారత్ గైర్హాజరు కావాలని నిర్ణయించింది. ఎన్.పి.టిపై సంతకం చేయాలని భారత్‌తో పాటు పాకిస్థాన్ దేశాలను అగ్రరాజ్యం అమెరికా ఎప్పటి నుంచి డిమాండ్ చేయడమేకాకుండా, పలు రకాలుగా ఒత్తిడి తెస్తోంది. అయితే, దీనికి భారత్-పాక్, ఇజ్రాయేల్ దేశాలు ససేమిరా అంటున్నాయి.Source: Yahoo! Telugu: News | 3 May 2010 | 8:43 am విదేశీ స్టాక్ మార్కెట్ల ప్రభావం: నష్టాల్లో సెన్సెక్స్!సోమవారం బాంబే స్టాక్ మార్కెట్‌కు ఏ మాత్రం కలిసిరాలేదు. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు పయనిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటలకు 151 పాయింట్లు క్షీణించి, 17,406 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 56 పాయింట్లు పడిపోయి, 5,221 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 3 May 2010 | 8:32 am వచ్చేస్తానంటున్న "సమైక్య"పులి... కుయ్యోమంటున్న " కొమరం పులి""కొమరం పులి" చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అదేవిధంగా సమైక్యాంధ్ర లక్ష్యంగా సాగుతున్న పీఆర్పీ నేత చిరంజీవి కూడా తెలంగాణాలో పర్యటించడానికి రెడీ అవుతున్నారు. అటు పులి సినిమా.. ఇటు పీఆర్పీ నేత పర్యటన రెండూ ఒకేసారి తెలంగాణా ప్రజలపైకి దూసుక రానున్నాయి. ఇప్పటికే కొమరం పులి చిత్రాన్ని తెలంగాణాలో అడ్డుకుంటామని తెలంగాణా జేఏసి నాయకులు హెచ్చరించారు. దీంతో చిత్ర నిర్మాత సింగమల రమేష్ విపరీతమైన ఒత్తిడికి లోనై ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు సమాచారం. కోట్లు ఖర్చుపెట్టి కొమరం పులిని తెరకెక్కించాననీ, ఒకవేళ తెలంగాణాలో ఆ చిత్రాన్ని అడ్డుకుంటే పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో రమేష్ ఉన్నట్లు సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 3 May 2010 | 7:26 am తెరాస నేతలతో మధుయాష్కీ మ్యాచ్ ఫిక్సింగ్: గోనేకాంగ్రెస్ పార్టీకి చెందిన నిజామాబాద్ ఎంపీ మధు యాష్కీ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆర్టీసీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు ఆరోపించారు. యాష్కీకి తెరాస నుంచి భారీగా ముడుపులు ముట్టడం వల్లే తెరాస మరింత బలపడేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.Source: Yahoo! Telugu: News | 3 May 2010 | 7:25 am భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టనున్న ఇంటెల్నెట్దేశీయ బీపీఓ రంగంలో అగ్రగామిగానున్న ఇంటెల్‌నెట్ గ్లోబెల్ సర్వీసెస్ సంస్థ తన సేవలను విదేశాల్లో మరింతగా విస్తరించే నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2010-11) చివరి నాటికి దాదాపు ఏడువేల మందిని నియమించనున్నట్లు ఆ సంస్థ ప్రధాన కార్యనిర్వహణాధికారి ఎస్.కుమార్ సోమవారం ముంబైలో తెలిపారు.Source: Yahoo! Telugu: News | 3 May 2010 | 7:16 am లగడపాటి టూర్ ముగిసింది.. చిరు పర్యటనే తరువాయి!విజయవాడ ఎంపీ, సమైక్యాంధ్ర హీరో లగడపాటి రాజగోపాల్ అనుకున్నట్టుగానే తెలంగాణ జిల్లాలో అడుగుపెట్టారు. ఖమ్మం జిల్లా నాగుపల్లిలో జరిగిన రిటైర్డ్ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయనకు ఈ ప్రాంత వాసులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం ఆదివారం విజయవంతంగా ముగిసింది.Source: Yahoo! Telugu: News | 3 May 2010 | 7:15 am తాగుడుకు బానిసైన "ఆది" హీరోయిన్ కీర్తిచావ్లా..!?"ఆది" సినిమాలో కథానాయికగా నటించిన అందాల ముద్దుగుమ్మ కీర్తిచావ్లా. ఆది తర్వాత నాలుగైదు సినిమాల్లో చేసినా అమ్మడు ఏ మాత్రం రాణించలేదు. ఈ క్రమంలో కొన్నాళ్ల తర్వాత తెలుగు తెరకు కీర్తి చావ్లా దూరమైంది. అయితే తమిళ సినీపరిశ్రమలో మాత్రం కీర్తిచావ్లాకు మంచి ఛాన్సులు వస్తున్నాయని సినీజనం గుసగుసలాడుకుంటున్నారు. కానీ కీర్తిచావ్లా బాగా తాగుడికి అలవాడు పడిందని సమాచారం. డైరక్ట్‌గా షూటింగ్ సెట్స్‌కి వచ్చేటప్పుడే మందు కొచ్చి వచ్చేస్తుందని సినీ వర్గాలో టాక్. ఇంకా ఏ మాత్రం జంకు లేకుండా మందుకొట్టి డేర్‌గా వస్తున్న ఆమెను మిగతావారు చూసి ఖంఘుతింటున్నారట. ఇటీవలే "సాధ్యం" సినిమాలో ఒక పాత్ర పోషించిన కీర్తిచావ్లా.. అక్కడ కూడా మందు కొట్టి ఇదే సీన్ చేసిందట.!. షూటింగ్‌లకు లేటుగా రావడంతో ఆమెను బుక్ చేసుకున్న దర్శకులు, నిర్మాతలు తెగ ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. ఒక్క సినిమాతోనే హిట్ కొట్టిన తర్వాత అవకాశం రాకపోవడంతో..? కీర్తిచావ్లా తాగుడుకు బానిసయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాగుడుని కంట్రోల్ చేస్తేనే కీర్తిచావ్లా సినీ కెరీర్ బాగుంటుందని ఇండస్ట్రీ భావిస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 3 May 2010 | 7:15 am మే 7న "సూపర్ కౌబాయ్"గా వస్తోన్న లారెన్స్!నృత్యదర్శకుడు లారెన్స్ హీరోగా శింబుదేవన్ దర్శకత్వంలో రూపొందిన "సూపర్ కౌబాయ్" చిత్రాన్ని ఈ నెల ఏడోతేదీన విడుదల చేస్తున్నట్లు నైజాం, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ డి.ఎస్. రావ్ తెలియజేశారు. తెలుగు ఈ రెండు ప్రాంతాల్లో తామే విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఎస్‌జిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కల్పాత్తి ఎస్. అగోరమ్ నిర్మించారు. 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ కౌబాయ్ చిత్రాన్ని నిర్మించారు. 18వ శతాబ్దానికి చెందిన కథతో ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించారు.Source: Yahoo! Telugu: Entertainment | 3 May 2010 | 6:49 am గ్రామీణ నేపథ్యంలో బ్రహ్మాజీ చిత్రం "అబ్బో వాడా!"పల్లెటూళ్ళలో ఉండే బంధాలు, అనుబంధాలు ఇంకా అక్కడ స్థానికంగా ఉండే రాజకీయాలు, మధ్యలో అందమైన ప్రేమకథ. వీటినన్నింటిని మిళితం చేస్తూ గ్రామీణ నేపథ్యంలో శ్రీశ్రీ కుమారస్వామి ఫిలింస్ నిర్మిస్తున్న చిత్రం "అబ్బో వాడా!". బ్రహ్మాజీ, రేఖాశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఎస్. బసవపున్నయ్య నిర్మించగా, రత్నం కె.వి. దర్శకత్వం వహించారు.ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ.. "హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ చేశారు. కొంతభాగాన్ని అడవిలో చిత్రీకరించారు. కమర్షియల్ అంశాలు జోడించి తీసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదే మే నెలలో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. మంచి క్వాలిటీ ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో మేకింగ్‌లో ఎక్కడా రాజీ పడలేదు. కొత్తదనం ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది." అని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 3 May 2010 | 6:41 am జూన్‌లో "మా అన్నయ్య బంగారం" విడుదలడాక్టర్. రాజశేఖర్, కమలిని ముఖర్జీ జంటగా నటిస్తోన్న "మా అన్నయ్య బంగారం" చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. బంజారాహిల్స్ రాక్‌కాజిల్ సమీపంలోని ఓ హోటల్‌లో హీరోహీరోయిన్లపై సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం సందర్భంగా చిత్ర నిర్మాత నట్టికుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. "ఏడుగురు అన్నదమ్ముల కథతో ఈ చిత్రం రూపొందుతోంది. చంద్రబోస్ ఐదు చక్కటి పాటలు రాశారు. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 3 May 2010 | 6:23 am అదిలాబాద్ నుంచి చిరంజీవి తెలంగాణ ప్రాంత పర్యటనప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలంగాణ ప్రాంత పర్యటనను అదిలాబాద్ జిల్లా నుంచి చేపట్టనున్నారు. ఈ జిల్లాలో చిరంజీవితో పాటు.. ప్రజారాజ్యం పార్టీకి మంచి క్యాడర్ ఉంది. ఈ జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కూడా ప్రరాపా కైవసం చేసుకుంది. అందువల్ల ఇక్కడ నుంచి తన సమైక్యాంధ్ర యాత్రను చేపట్టనున్నట్టు చిరంజీవి వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 3 May 2010 | 3:56 am హైదరాబాద్ పాతబస్తీలో ఇద్దరు సమి కార్యకర్తల అరెస్టురాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఇద్దరు సిమి కార్యకర్తలను కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. అలాగే, పలు పేలుళ్లు, హత్య కేసులతో సంబంధం ఉన్న వికారుద్దీన్‌ను కూడా గుల్బర్గా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.Source: ఏపీ న్యూస్ | 3 May 2010 | 3:39 am ముంబై దాడుల కేసులో కసబ్‌ను దోషిగా తేల్చిన కోర్టుముంబై మారణహోమానికి పాల్పడిన పాకిస్థాన్ ప్రేరేపిత లష్కర్ తోయిబా ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. ముంబై దాడుల కేసును విచారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.ఎల్.తహల్యాని ఈ మేరకు సోమవారం తుదితీర్పు వెలువరించారు. శిక్షను మాత్రం బుధవారం ఖరారు చేయనున్నారు.Source: జాతీయ | 3 May 2010 | 3:21 am తెరాస నేతలతో మధుయాష్కీ మ్యాచ్ ఫిక్సింగ్: గోనేకాంగ్రెస్ పార్టీకి చెందిన నిజామాబాద్ ఎంపీ మధు యాష్కీ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆర్టీసీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు ఆరోపించారు. యాష్కీకి తెరాస నుంచి భారీగా ముడుపులు ముట్టడం వల్లే తెరాస మరింత బలపడేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 3 May 2010 | 1:56 am లగడపాటి టూర్ ముగిసింది.. చిరు పర్యటనే తరువాయి!విజయవాడ ఎంపీ, సమైక్యాంధ్ర హీరో లగడపాటి రాజగోపాల్ అనుకున్నట్టుగానే తెలంగాణ జిల్లాలో అడుగుపెట్టారు. ఖమ్మం జిల్లా నాగుపల్లిలో జరిగిన రిటైర్డ్ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయనకు ఈ ప్రాంత వాసులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం ఆదివారం విజయవంతంగా ముగిసింది.Source: ఏపీ న్యూస్ | 3 May 2010 | 1:46 am జేఎంఎం ఎమ్మెల్యేల మద్దతు లేఖలు కోరుతున్న భాజపాజార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే జార్ఖండ్ ముక్తి మోర్ఛాకు చెందిన 18 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు తమకు అందజేయాలని భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు కోరారు. జార్ఖండ్‌లో ప్రభుత్వం ప్రభుత్వ ఏర్పాటుకు తాము ఏమాత్రం ఉత్సాహం చూపడం లేదని, అంతకుంటే ముందు ఆకలితో లేమని ఆ పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ అన్నారు.Source: జాతీయ | 3 May 2010 | 12:47 am విశాఖలో రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి పర్యటన!విశాఖపట్నం జిల్లాలో ముఖ్యమంత్రి కె.రోశయ్య సోమవారం నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన ఉదయాన్నే జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలోని అచ్యుతాపురం వద్ద శ్రీలంకకు చెందిన బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ (బీఐఏసీ)ని ఆయన ప్రారంభిస్తారు. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు.Source: ఏపీ న్యూస్ | 3 May 2010 | 12:09 am నేడు కేసీఆర్ అధ్యక్షతన తెరాస పొలిట్‌బ్యూరో భేటీతెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పొలిట్‌బ్యూరో సమావేశం ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన సోమవారం జరుగనుంది. పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో జరిగే ఈ భేటీకి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.Source: ఏపీ న్యూస్ | 2 May 2010 | 11:59 pm కడుపు సంబంధిత రుగ్మతతో బాధపడుతున్న కసబ్ముంబై దాడుల్లో సజీవంగా పట్టుబడిన ఏకైక తీవ్రవాది అజ్మల్ కసబ్ కడుపు సంబంధింత వ్యాధితో బాధపడుతున్నట్టు జైలు అధికారులు వెల్లడించారు. కసబ్ కేసులో సోమవారం తుది తీర్పు వెలువడిన తర్వాత ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనుమతితో కసబ్‌ను ఆస్పత్రికి తరలించి ఆపరేషన్ చేసే అవకాశాలు ఉన్నాయని జైలు అధికారులు వెల్లడించారు.Source: జాతీయ | 2 May 2010 | 11:24 pm అభిమానులూ.. వచ్చేస్తున్నా... సిద్ధంగా ఉండండి: చిరుతెలంగాణ ప్రాంతంలోని తన అభిమానులకు, పార్టీ శ్రేణులకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పిలుపునిచ్చారు. ఈనెల ఐదో తేదీ నుంచి చేపట్టే పోలవరం యాత్ర తర్వాత తెలంగాణ ప్రాంతాల్లో పర్యటించేందుకు వస్తున్నానని చెప్పారు. తన పర్యటనను విజయవంతం చేసేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు సమాయాత్తమై సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 2 May 2010 | 10:58 pm బెంగాల్ స్థానికంలో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరి పోరు!పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయనుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటి చేసి లాభపడిన టీసీ స్థానిక ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న పొత్తు తెగతెంపులైంది.Source: జాతీయ | 2 May 2010 | 10:04 pm ముంబై దాడుల మారణకాండపై నేడు తుది తీర్పుదేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో మారణకాండ సృష్టించిన కేసులో తుది తీర్పు సోమవారం వెలువడనుంది. దీంతో తీర్పు వెలువడే మూంబైలోని ఆర్థూర్ రోడ్డులో ఉన్న ప్రత్యేక కోర్టు జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కాగా, ఈ కేసులో సజీవంగా పట్టుబడిన పాక్ ప్రేరేపిత లష్కర్ తోయిబా తీవ్రవాది అజ్మల్ కసబ్‌తో పాటు.. ఈ కుట్రకు సహకరించిన ఇద్దరు భారతీయులకు కూడా మరణశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.Source: జాతీయ | 2 May 2010 | 9:46 pm ఇక నా పేరు 'రామ్‌చరణ్' మాత్రమే: 'చిరుత'నయుడుతన పేరు రామ్‌చరణ్ మాత్రమే. తేజ కలిపి- రామ్‌చరణ్‌తేజ అంటుంటారు. ఇది ఎప్పటినుంచో నేను మీడియాకు చెప్పాలనుకున్నా. కానీ ఈ రోజు చెబుతున్నా.. అంటూ.. ఓ విలేకరి ప్రశ్నకు రామ్‌చరణ్ తేజ సమాధానమిచ్చాడు. "మగధీర" టైటిల్స్‌లో "రామ్‌చరణ్" అని వేసుకున్నాను. అదే కంటెన్యూ చేయమని కోరుకుంటున్నాను. మరో విశేషమేమిటంటే..? మగధీర హిట్ కావడంతో అదే సెంటిమెంట్‌తో.. తాజాగా నటిస్తున్న "మెరుపు" చిత్రానికి "ఎంఎఇఆర్‌యుపియు" అనే ఇంగ్లీష్ అక్షరాలు న్యూమరాలజీ ప్రకారం పెట్టించుకున్నట్లు రామ్‌చరణ్ తేజ తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 2 May 2010 | 12:22 pm ప్రజల్లో తెరాస అభ్యర్థుల పట్ల సానుభూతి ఉంది: చిన్నారెడ్డితెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుల పట్ల తెలంగాణ ప్రాంత ప్రజల్లో సానుభూతి ఉందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కన్వీనర్ కె.చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఆదివారం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌తో భేటీ అయ్యారు.Source: ఏపీ న్యూస్ | 2 May 2010 | 6:47 am రేషన్ కార్డుల ఏరివేతలో అర్హులకు న్యాయం: రోశయ్యరేషన్ కార్డుల ఏరివేతలో అర్హులకు అన్యాయం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. ప్రజాపథం కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల తొలగింపులో అర్హులకు అన్యాయం చేయమని భరోసా ఇచ్చారు. అదేసమయంలో బోగస్ కార్డులను విధిగా తొలగించాల్సిందేనని ఆయన అధికారులను ఆదేశించారు.Source: ఏపీ న్యూస్ | 2 May 2010 | 6:46 am జార్ఖండ్ సీఎంగా శిబూ సొరేన్ కొనసాగుతారు: హేమంత్జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ శిబూ సొరేన్ కొనసాగుతారని ఆయన కుమారుడు, జేఎంఎంఎల్పీ నేత హేమంత్ సొరేన్ వెల్లడించారు. ఆదివారం భారతీయ జనతా పార్టీ నేతలతో జేఎంఎం నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. భాజపా నేతలతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ భాజపా నేతలతో తాము జరిపిన చర్చలు నిర్మాణాత్మకంగా సాగినట్టు హేమంత్ తెలిపారు.Source: జాతీయ | 2 May 2010 | 5:48 am ప్రజారాజ్యం పార్టీకి భూమా దంపతులు గుడ్‌బై!?ప్రజారాజ్యం పార్టీకి మరో ఇద్దరు కీలక నేతలు గుడ్‌బై చెప్పనున్నారు. ప్రరాపా పార్టీకి కర్నూలు జిల్లాలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, ఆయన సతీమణి, ప్రరాపా ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డిలు పార్టీ మారో ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.Source: ఏపీ న్యూస్ | 2 May 2010 | 5:04 am విదేశాంగ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడుగా శశి థరూర్!ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త వేలం పాటల వివాదంలో చిక్కుకుని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పదవిని కోల్పోయిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కాస్త ఊరట లభించింది. ఐపీఎల్ పుణ్యమాని ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకున్నప్పటికీ.. ఆ శాఖ పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ ఆదేశాలు జారీ చేశారు.Source: జాతీయ | 2 May 2010 | 3:03 am లైంగిక ఆరోపణలు: మంత్రి పదవికి హాలప్ప రాజీనామా!పత్రికల్లో వచ్చిన వార్తలకు కర్ణాటక మంత్రి హరతాలు హాలప్ప స్పందించారు. తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖామంత్రిగా ఉన్న హెచ్.హాలప్పా తన స్నేహితుని భార్యపై అత్యాచారానికి పాల్పడినట్టు ఒక కన్నడ వార్తా పత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.Source: జాతీయ | 2 May 2010 | 2:30 am
|