భారత బిల్‌ ‍గేట్స్ అజీమ్ ప్రేమ్ జీః ఫోర్బ్స్

భారతదేశంలో సాఫ్ట్‌వేర్ రంగంలో అగ్రగామిగానున్న విప్రో సంస్థ అధినేత అజీమ్ ప్రేమ్‌ జీ భారత బిల్‌ గేట్స్ అని ఫోర్బ్స్ పత్రిక వాషింగ్టన్‌లో వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 1 May 2010 | 9:45 am

తెలంగాణలో పర్యటించేందుకు భయమేల: చిరంజీవి

తెలంగాణ ప్రాంతంలో పర్యటించేందుకు భయపడాల్సిన పని లేదని, తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తానని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్పష్టం చేశారు. సమైక్యవాదాన్ని బలపరిచిన చిరంజీవిని తెలంగాణ ప్రాంతంలో తిరగనివ్వమని తెలంగాణ వాదులు హెచ్చరించిడంతో ఆయన పైవిధంగా స్పందించారు.
Source: Yahoo! Telugu: News | 1 May 2010 | 9:16 am

పాకిస్థాన్‌లో బాంబు పేలుళ్ళుః ఇద్దరి మృతి

పాక్‌లోని స్వాత్ లోయలో రద్దీగానున్న బజారులో శనివారం బాంబు పేలడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా మరో 12 మంది తీవ్ర గాయాలపాలైనారు.
Source: Yahoo! Telugu: News | 1 May 2010 | 8:55 am

గుజరాత్ స్వర్ణజయంతి ఉత్సవాలు నేటి నుంచే

గుజరాత్ స్వర్ణ జయంతి ఉత్సవాలు సంవత్సరంపాటు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను పటిష్టమైన భద్రత నడుమ నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేసింది. స్వర్ణ జయంతి ఉత్సవాలను ఆ రాష్ట్ర గవర్నర్ డాక్టర్. కమలా, ముఖ్యమంత్రి నరేంద్ర మోడీలు కలిసి జాతిపిత మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమౌతాయి.
Source: Yahoo! Telugu: News | 1 May 2010 | 8:40 am

పదవిని కాపాడు దేవుడా...!! యజ్ఞంలో పాల్గొన్న సిఎం

తన ముఖ్యమంత్రి పదవికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకుగాను ముఖ్యమంత్రి రోశయ్య మల్కాజ్‌గిరిలోని సాయినాథపురంలో నిర్వహించిన అతిరుద్ర మహాయాగంలో పాల్గొన్నారు.
Source: Yahoo! Telugu: News | 1 May 2010 | 8:19 am

ఆత్మహత్య చేసుకున్న మైఖేల్ మాజీ న్యాయవాది పీటర్

పాప్ సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొందిన మైఖేల్ జాక్సన్ మాజీ న్యాయవాది పీటర్ లోపేజ్ ఎన్సినోలోనున్న తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.
Source: Yahoo! Telugu: News | 1 May 2010 | 7:22 am

రాములమ్మకు చెక్ పెట్టనున్న కేసీఆర్ అండ్ కో!

తల్లి తెలంగాణ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసి తెరాస మహిళా నేతగా, ఎంపీగా గుర్తింపు పొందిన సినీ నటి విజయశాంతి అలియాస్ రాములమ్మ ఇపుడు కష్టాలు కొని తెచ్చుకుంది. ప్రత్యర్థి రాజకీయ నేతలపై ముఖ్యంగా ప్రరాపా అధినేత చిరంజీవి, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వంటి వారిపై ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం ఆమె నైజం. తద్వారా మంచి పబ్లిసిటీ కొట్టేస్తుంటారు. ఈ అలవాటే.. ఇపుడు ఆమె పుట్టె ముంచనుంది.
Source: Yahoo! Telugu: News | 1 May 2010 | 7:05 am

కేతన్ దేశాయ్‌ను రిమాండుకు పంపిన పాటియాలా కోర్టు

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ భారత వైద్య విధాన మండలి ఛైర్మన్ కేతన్ దేశాయ్‌‌ను పాటియాలా కోర్టు శనివారం 14 రోజులపాటు రిమాండుకు పంపింది. దేశాయ్‌తోపాటు మరో ఇద్దరు పంజాబ్ మెడికల్ కళాశాలకు అనుమతినిచ్చే నేపథ్యంలో రెండు కోట్ల రూపాయల మేరకు లంచం తీసుకుంటుండగా గత నెల 23న వీరిని సిబిఐ అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.
Source: Yahoo! Telugu: News | 1 May 2010 | 7:02 am

డబ్బుల్లేకుండానే కిరాణా కొట్లో సరుకులు కొనొచ్చు!!

దేశంలోని ప్రజలు డబ్బుల్లేకుండానే కిరాణా కొట్టు, తదితర చోట్ల నిత్యావస సరుకులు కొనేందుకు విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (యూఐడీఐ) ప్రజల బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ)తో సంప్రదింపులు జరుపుతోంది.
Source: Yahoo! Telugu: News | 1 May 2010 | 6:44 am

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, ఇబ్బందుల్లో భక్తులు!!

అడుగడుగు దండాల స్వామి శ్రీ వేంకటేశ్వరుని సన్నిధి తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వరుసగా రెండు రోజులపాటు సెలవులు రాపడంతో శుక్రవారం రాత్రికే భక్తులు తిరుమల చేరుకున్నారు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో భక్తులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Source: Yahoo! Telugu: News | 1 May 2010 | 6:20 am

పదవిని కాపాడు దేవుడా...!! యజ్ఞంలో పాల్గొన్న సిఎం

తన ముఖ్యమంత్రి పదవికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకుగాను ముఖ్యమంత్రి రోశయ్య మల్కాజ్‌గిరిలోని సాయినాథపురంలో నిర్వహించిన అతిరుద్ర మహాయాగంలో పాల్గొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 1 May 2010 | 3:48 am

తెలంగాణలో పర్యటించేందుకు భయమేల: చిరంజీవి

తెలంగాణ ప్రాంతంలో పర్యటించేందుకు భయపడాల్సిన పని లేదని, తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తానని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్పష్టం చేశారు. సమైక్యవాదాన్ని బలపరిచిన చిరంజీవిని తెలంగాణ ప్రాంతంలో తిరగనివ్వమని తెలంగాణ వాదులు హెచ్చరించిడంతో ఆయన పైవిధంగా స్పందించారు.
Source: ఏపీ న్యూస్ | 1 May 2010 | 3:47 am

గుజరాత్ స్వర్ణజయంతి ఉత్సవాలు నేటి నుంచే

గుజరాత్ స్వర్ణ జయంతి ఉత్సవాలు సంవత్సరంపాటు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను పటిష్టమైన భద్రత నడుమ నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేసింది. స్వర్ణ జయంతి ఉత్సవాలను ఆ రాష్ట్ర గవర్నర్ డాక్టర్. కమలా, ముఖ్యమంత్రి నరేంద్ర మోడీలు కలిసి జాతిపిత మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమౌతాయి.
Source: జాతీయ | 1 May 2010 | 3:10 am

కేతన్ దేశాయ్‌ను రిమాండుకు పంపిన పాటియాలా కోర్టు

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ భారత వైద్య విధాన మండలి ఛైర్మన్ కేతన్ దేశాయ్‌‌ను పాటియాలా కోర్టు శనివారం 14 రోజులపాటు రిమాండుకు పంపింది. దేశాయ్‌తోపాటు మరో ఇద్దరు పంజాబ్ మెడికల్ కళాశాలకు అనుమతినిచ్చే నేపథ్యంలో రెండు కోట్ల రూపాయల మేరకు లంచం తీసుకుంటుండగా గత నెల 23న వీరిని సిబిఐ అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.
Source: జాతీయ | 1 May 2010 | 1:37 am

రాములమ్మకు చెక్ పెట్టనున్న కేసీఆర్ అండ్ కో!

తల్లి తెలంగాణ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసి తెరాస మహిళా నేతగా, ఎంపీగా గుర్తింపు పొందిన సినీ నటి విజయశాంతి అలియాస్ రాములమ్మ ఇపుడు కష్టాలు కొని తెచ్చుకుంది. ప్రత్యర్థి రాజకీయ నేతలపై ముఖ్యంగా ప్రరాపా అధినేత చిరంజీవి, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వంటి వారిపై ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం ఆమె నైజం. తద్వారా మంచి పబ్లిసిటీ కొట్టేస్తుంటారు. ఈ అలవాటే.. ఇపుడు ఆమె పుట్టె ముంచనుంది.
Source: ఏపీ న్యూస్ | 1 May 2010 | 1:35 am

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, ఇబ్బందుల్లో భక్తులు!!

అడుగడుగు దండాల స్వామి శ్రీ వేంకటేశ్వరుని సన్నిధి తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వరుసగా రెండు రోజులపాటు సెలవులు రాపడంతో శుక్రవారం రాత్రికే భక్తులు తిరుమల చేరుకున్నారు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో భక్తులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Source: ఏపీ న్యూస్ | 1 May 2010 | 12:51 am

ఉద్యమాల్లోనే కాదు.. చదువుల్లోనూ అగ్రస్థానమే: కేసీఆర్

తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం జరిపే ఉద్యమాల్లోనే కాకుండా.. చదువుల్లోనూ అగ్రస్థానంలో ఉంటారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అన్నారు. ఈ విషయం శుక్రవారం విడుదలైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాలు మరోమారు నిరూపించాయని ఆయన చెప్పుకొచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 1 May 2010 | 12:48 am

మాధురీ గుప్తాను రిమాండుకు ఆదేశించిన తీస్‌హజారీ కోర్టు

పాక్ దేశంలో భారత తరపున గూఢచారిగా వ్యవహరిస్తున్న మహిళ మాధురీ గుప్తాను తీస్‌హజారీ కోర్టు శనివారం 14 రోజులపాటు రిమాండుకు తరలించాలని ఆదేశించింది. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన భారత దౌత్యాధికారిణి గుప్తాను పోలీసులు శనివారం కోర్టులో హాజరుపరిచారు.
Source: జాతీయ | 1 May 2010 | 12:04 am

కార్మికులకు మేడే శుభాకాంక్షలుః ముఖ్యమంత్రి రోశయ్య

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే రోజు కార్మికులకు ముఖ్యమంత్రి రోశయ్య శుభాకాంక్షలు తెలిపారు. మేడే నాడు కార్మికుల దినోత్సవంగా జరుపుకునేందుకు వారి అకుంఠిత దీక్షతో హ్కకులను సాధించుకున్నందుకు వారికి తన శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Apr 2010 | 11:34 pm

నేను మగాడ్నికాను, పరీక్షించుకోండి : స్వామి నిత్యానంద

సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్న స్వామి నిత్యానంద కొత్త నిజాన్ని వెల్లడించాడు. గత కొద్ది రోజులుగా బెంగుళూరులో సిఐడి పోలీసుల విచారణలోనున్న ఆయన తనలో మగతనం లేదని, దీంతో తమిళ నటీమణి రంజితతో కామకేళీల్లో ఎలా పాల్గొంటానని ఆయన తెలిపినట్లు సమాచారం.
Source: జాతీయ | 30 Apr 2010 | 10:26 pm

దుష్ట శిక్షణకు వైద్యుడే.. నర "సింహా"వతారం ఎత్తితే..!?

మనిషికి వ్యాధి సోకితే వైద్యం చేసే వైద్యుడు సమాజాన్ని పాడుచేసే వైరస్‌కు (దుష్టులను) ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇచ్చాడనేదే పాయింట్.టైటిల్‌ వినగానే నరసింహనాయుడు, లక్ష్మీనరసింహా, సమరసింహారెడ్డి- ఇలా సింహా సెంటిమెంట్‌తో మళ్ళీ బాలకృష్ణ విజృంభిస్తాడని ముందుగానే చెప్పిన దర్శకుడు బోయపాటి శ్రీను అటువంటి తరహా కథతో ముందుకువచ్చాడు. ఇది పక్కా బాలయ్య మార్క్‌ సినిమా. ఇన్నాళ్ళు ఎలాంటి కథాశంతో అభిమానుల్ని సంపాదించుకున్నాడో అలాంటి అభిమానులు మెచ్చేలా, వారి అంచనాలకు అనుగుణంగా బాలయ్య కథాంశాన్ని ఎంచుకున్నాడు. దీనికితోడు నాలుగు పాటలుకూడా బాగుండడంతో సింహా ఫ్యాన్స్‌కు ఫుల్‌మీల్స్‌‌ అయ్యింది.అయితే భద్ర, తులసిలో ఉన్నట్లే... దర్శకుడు బాలయ్య రేంజ్‌కు తగినట్లుగా బాంబు పేలుళ్లు, కత్తులతో నరకడాలు మామూలుగా ఉన్నాయి. కొన్ని చోట్ల డైలాగ్స్‌లు ఆవేశంగా 'లంజకొడకా..' అంటూ ఉన్నా సన్నివేశపరంగా కొట్టకుపోయాయి. కాకపోతే వయొలెన్స్‌ ఎక్కువగా ఉన్న ఈ చిత్రాన్ని హ్యుమన్‌రైట్స్‌ సంస్థలు వేలెత్తిచూపుతాయోనని చిన్నపాటి సందేహంకూడా ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇక.. ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య మెప్పించాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Apr 2010 | 10:00 am

వైఎస్.జగన్ - కాంగ్రెస్‌ హైకమాండ్‌ల మధ్య కోల్డ్‌వార్!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానంల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. తన తండ్రి కష్టపడి అందించిన ప్రభుత్వ ఫలాలు ఆయన హఠాన్మరణం అనంతరం తనకు దక్కకుండా పోయాయనే బాధ ఆయనను వేధిస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 30 Apr 2010 | 9:18 am

10న శ్రీకృష్ణ కమిటీతో భేటీకానున్న తెదేపా గ్రూపులు

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యుల ఎదుట తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రత్యేక, సమైక్యాంధ్ర గ్రూపుల సభ్యులు భేటీ కానున్నారు. ఈ భేటీ మే నెల పదో తేదీన హైదరాబాద్‌లో జరుగనుంది. తెలంగాణ, సమైక్యాంధ్ర గ్రూపులకు చెందిన సభ్యులు తమ వాదనలు వినిపించేందుకు ఒకేరోజు సమయాన్ని కేటాయించడం గమనార్హం.
Source: ఏపీ న్యూస్ | 30 Apr 2010 | 8:39 am

సీఎం రోశయ్యతో సమావేశమైన నన్నపనేని రాజకుమారి

ముఖ్యమంత్రి కె.రోశయ్యతో తెలుగుదేశం పార్టీ మహిళా సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి శుక్రవారం భేటీ అయ్యారు. దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో పెద్ద చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన ఆమె.. తాజాగా రోశయ్యతోభేటీ కావడం అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.
Source: ఏపీ న్యూస్ | 30 Apr 2010 | 8:26 am

మావోలకు ఆయుధాలు విక్రయించిన సీఆర్‌పీఎఫ్ జవాన్లు!

అంతర్గత భద్రతకు పెనుముప్పుగా పరిణమించిన మావోయిస్టులను పూర్తిగా ఏరివేసేందుకు కేంద్రం గ్రీన్ హంట్ ఆపరేషన్‌ను చేపట్టింది. అయితే, దేశ భద్రతను కాపాడాల్సిన సెంట్రల్ రిజర్వుడ్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)కు చెందిన కొంతమంది జవాన్లు ఆయుధాలను మావోయిస్టులకు అమ్ముకున్న సంఘటన శుక్రవారం వెలుగు చూసింది.
Source: జాతీయ | 30 Apr 2010 | 6:23 am

"మగధీర"తో మళ్లీ జతకట్టిన పంచదార బొమ్మ!

టాలీవుడ్‌లో సెన్సేషనల్ హిట్ అయిన "మగధీర" సినిమా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న రామ్‌చరణ్ తేజ- కాజల్ అగర్వాల్ జంట మళ్లీ తెరపై కనిపించబోతోంది. అత్యున్నత ప్రమాణాలతో హాలీవుడ్ స్థాయిలో రాజమౌళి దర్శకత్వాన విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ "మగధీర"లో తన అందచందాలతో పంచదార బొమ్మగా పిలువబడిన కాజల్ అగర్వాల్, తిరిగి "చిరుత"నయుడు రామ్ చరణ్ తేజతో కలిసి నటించబోతోంది.రామ్‌చరణ్ తేజ- కాజల్ అగర్వాల్ జంటగా నటించే కొత్త సినిమాను ఎన్.వి. ప్రసాద్ నిర్మిస్తున్నారు. మెగా సూపర్‌గుడ్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం షూటింగ్ రామానాయుడు స్టూడియోలో ఏప్రిల్ 30వతేదీ (శుక్రవారం) ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ధరణి దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Apr 2010 | 5:53 am

సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్‌గా ఎస్.హెచ్.కపాడియా ఎంపిక

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సురేష్ హోమీ కపాడియా నియమితులయ్యారు. ఈయన మే 12వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత చీఫ్ జస్టీస్ కేజీ.బాలకృష్ణన్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో కొత్త చీఫ్ జస్టీస్‌గా కపాడియాను కేంద్ర న్యాయశాఖ ఎంపిక చేసింది.
Source: జాతీయ | 30 Apr 2010 | 5:32 am

దుష్ట శిక్షణకు వైద్యుడే.. నర "సింహా"వతారం ఎత్తితే..!?

మనిషికి వ్యాధి సోకితే వైద్యం చేసే వైద్యుడు సమాజాన్ని పాడుచేసే వైరస్‌కు (దుష్టులను) ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇచ్చాడనేదే పాయింట్.టైటిల్‌ వినగానే నరసింహనాయుడు, లక్ష్మీనరసింహా, సమరసింహారెడ్డి- ఇలా సింహా సెంటిమెంట్‌తో మళ్ళీ బాలకృష్ణ విజృంభిస్తాడని ముందుగానే చెప్పిన దర్శకుడు బోయపాటి శ్రీను అటువంటి తరహా కథతో ముందుకువచ్చాడు. ఇది పక్కా బాలయ్య మార్క్‌ సినిమా. ఇన్నాళ్ళు ఎలాంటి కథాశంతో అభిమానుల్ని...
Source: వినోదం | 30 Apr 2010 | 4:33 am

అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులో హిందూ తీవ్రవాది అరెస్టు

గత 2007 సంవత్సరంలో అజ్మీర్ దర్గాలో జరిగిన బాంబు పేలుడు కేసులో ఒక హిందూ తీవ్రవాద సంస్థతో సంబంధాలు కలిగిన ఒక వ్యక్తిని రాజస్థాన్ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. ఈ తీవ్రవాదిని శుక్రవారం స్థానిక కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. కాగా, ఈ పేలుడులో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా గాయపడ్డారు.
Source: జాతీయ | 30 Apr 2010 | 4:26 am

సీఎం చేతుల మీదుగా "శ్రీశ్రీ ప్రస్థానత్రయం" ఆవిష్కరణ!

విప్లవకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) శత జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మహాకవి శ్రీశ్రీ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య "శ్రీశ్రీ ప్రస్థానత్రయం" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తక తొలి ప్రతిని రోశయ్య ఆవిష్కరించగా, శ్రీశ్రీ సతీమణి సరోజా శ్రీశ్రీ స్వీకరించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Apr 2010 | 3:20 am