|
స్టీల్ ధరలు తగ్గనున్నాయి : ఉక్కు మంత్రిత్వ శాఖరానున్న కొద్ది నెలల్లో స్టీల్ ధరలు తగ్గనున్నాయని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక నిపుణులు, జాయింట్ ప్లాంట్ కమిటీ సభ్యులు ఏఎస్ ఫైరోజ్ న్యూ ఢిల్లీలో మీడియాకు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 30 Apr 2010 | 9:02 am సీఎం చేతుల మీదుగా "శ్రీశ్రీ ప్రస్థానత్రయం" ఆవిష్కరణ!విప్లవకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) శత జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మహాకవి శ్రీశ్రీ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య "శ్రీశ్రీ ప్రస్థానత్రయం" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తక తొలి ప్రతిని రోశయ్య ఆవిష్కరించగా, శ్రీశ్రీ సతీమణి సరోజా శ్రీశ్రీ స్వీకరించారు.Source: Yahoo! Telugu: News | 30 Apr 2010 | 8:50 am సీనియర్ ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖామంత్రి మాణిక్య వరప్రసాదరావు శుక్రవారం విడుదల చేసిన సీనియర్ ఇంటర్ ఫలితాలు వెబ్‌దునియా తెలుగులో చూసుకోవచ్చు. ఇందుకోసం http://results.webdunia.comను క్లిక్ చేయాల్సి ఉంటుంది.Source: Yahoo! Telugu: News | 30 Apr 2010 | 8:38 am చౌక ధరలకే గృహాలను అందించనున్న టాటా హౌసింగ్ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మరో మూడు-నాలుగు నగరాల్లో నివసించే ప్రజలకు చౌక ధరలకే గృహాలను "శుభ గృహ" పేరుతో వినియోగదారులకు అందించేందుకు తమ సంస్థ ప్రణాళికలు చేపట్టిందని, టాటా హౌసింగ్ డెవలప్‌మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బ్రోటిన్ బెనర్జీ మీడియాకు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 30 Apr 2010 | 8:36 am పుంజుకున్న రియాల్టీ ట్రేడింగ్: సెన్సెక్స్ వృద్ధిబాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల బాటలో కొనసాగుతోంది. దేశీయ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 80 పాయింట్లు లాభపడి, 17,584 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 20 పాయింట్లు స్వల్పంగా వృద్ధి చెంది, 5,274 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 30 Apr 2010 | 8:27 am షార్జాలో ఐటీఈసీ ప్రదర్శన నిర్వహించనున్నాం : సుదేశ్భారతదేశానికి చెందిన ఉత్పత్తుల వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తాము వచ్చే నవంబర్ నెల షార్జాలో ఐటీఈసీ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు ఇండియన్ ట్రేడ్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్(ఐటీఈసీ) ఛైర్మెన్ సుదేశ్ అగర్వాల్ శుక్రవారం దుబాయ్‌లో తెలిపారు.Source: Yahoo! Telugu: News | 30 Apr 2010 | 8:12 am తెలంగాణ ఇస్తామంటే.. పోటీకి దూరం: హరీష్ రావుప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఒక్క మాట చెప్పిస్తే తాము ఉప ఎన్నికల పోటీకి దూరంగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత హరీష్ రావు స్పష్టం చేశారు. ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు అనుకూలంగా సోనియాతో ఒక్క మాట చెప్పిస్తే తమ పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేసిన స్థానాలను కాంగ్రెస్‌కు వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 30 Apr 2010 | 7:57 am అందంరం బాగుండాలనే సమైక్య నినాదం: చిరంజీవిరాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలనే సమైక్య నినాదం అందుకున్నట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. తనకు సీమాంధ్ర మాత్రమే కాకుండా, తెలంగాణ ప్రాంతం కూడా ముఖ్యమేనన్నారు.Source: Yahoo! Telugu: News | 30 Apr 2010 | 7:49 am జార్ఖండ్ సీఎంగా సొరేన్ కొనసాగుతారు: కమలనాథులుజార్ఖండ్ రాష్ట్రంలోని అధికార జార్ఖండ్ ముక్తిమోర్చా పార్టీకి ఇస్తున్న మద్దతు ఉపసంహరణపై భారతీయ జనతా పార్టీ నేతలు వెనక్కి తగ్గారు. ప్రస్తుతానికి జేఎంఎం చీఫ్ శిబూ సొరేన్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మేరకు.. ఆ పార్టీ మహిళా సీనియర్ నేత సుష్మా స్వరాజ్ నివాసంలో జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.Source: Yahoo! Telugu: News | 30 Apr 2010 | 7:38 am ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన ఉభయ సభలుప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2010-11)లో ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయ సభలు గురువారం ఆమోదం తెలిపాయి. సంచిత నిధి నుంచి ప్రభుత్వం చెల్లింపులు చేసేందుకు అధికారం కల్పించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి నమో నారాయణ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 30 Apr 2010 | 7:10 am "మగధీర"తో మళ్లీ జతకట్టిన పంచదార బొమ్మ!టాలీవుడ్‌లో సెన్సేషనల్ హిట్ అయిన "మగధీర" సినిమా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న రామ్‌చరణ్ తేజ- కాజల్ అగర్వాల్ జంట మళ్లీ తెరపై కనిపించబోతోంది. అత్యున్నత ప్రమాణాలతో హాలీవుడ్ స్థాయిలో రాజమౌళి దర్శకత్వాన విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ "మగధీర"లో తన అందచందాలతో పంచదార బొమ్మగా పిలువబడిన కాజల్ అగర్వాల్, తిరిగి "చిరుత"నయుడు రామ్ చరణ్ తేజతో కలిసి నటించబోతోంది.రామ్‌చరణ్ తేజ- కాజల్ అగర్వాల్ జంటగా నటించే కొత్త సినిమాను ఎన్.వి. ప్రసాద్ నిర్మిస్తున్నారు. మెగా సూపర్‌గుడ్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం షూటింగ్ రామానాయుడు స్టూడియోలో ఏప్రిల్ 30వతేదీ (శుక్రవారం) ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ధరణి దర్శకత్వం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Apr 2010 | 5:53 am సీఎం చేతుల మీదుగా "శ్రీశ్రీ ప్రస్థానత్రయం" ఆవిష్కరణ!విప్లవకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) శత జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మహాకవి శ్రీశ్రీ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య "శ్రీశ్రీ ప్రస్థానత్రయం" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తక తొలి ప్రతిని రోశయ్య ఆవిష్కరించగా, శ్రీశ్రీ సతీమణి సరోజా శ్రీశ్రీ స్వీకరించారు.Source: ఏపీ న్యూస్ | 30 Apr 2010 | 3:20 am సీనియర్ ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖామంత్రి మాణిక్య వరప్రసాదరావు శుక్రవారం విడుదల చేసిన సీనియర్ ఇంటర్ ఫలితాలు వెబ్‌దునియా తెలుగులో చూసుకోవచ్చు. ఇందుకోసం http://results.webdunia.comను క్లిక్ చేయాల్సి ఉంటుంది.Source: ఏపీ న్యూస్ | 30 Apr 2010 | 3:12 am సీనియర్ ఇంటర్ ఫలితాల వెల్లడి: బాలికలదే హవాసీనియర్ ఇంటర్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖామంత్రి మాణిక్య వరప్రసాదరావు ఈ ఫలితాలను మీడియా ముందు వెల్లడించారు. ఈ పరీక్షల్లో 64.69 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు ఆయన వివరించారు. వీరిలో బాలికలు 67 శాతం మంది, బాలురు 63 శాతం మంది పాసైనట్టు తెలిపారు. ఎప్పటిలా ఈ యేడాది కూడా బాలికలే పై చేయి సాధించారు.Source: ఏపీ న్యూస్ | 30 Apr 2010 | 3:02 am తెలంగాణ ఇస్తామంటే.. పోటీకి దూరం: హరీష్ రావుప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఒక్క మాట చెప్పిస్తే తాము ఉప ఎన్నికల పోటీకి దూరంగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత హరీష్ రావు స్పష్టం చేశారు. ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు అనుకూలంగా సోనియాతో ఒక్క మాట చెప్పిస్తే తమ పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేసిన స్థానాలను కాంగ్రెస్‌కు వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 30 Apr 2010 | 2:27 am అందంరం బాగుండాలనే సమైక్య నినాదం: చిరంజీవిరాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలనే సమైక్య నినాదం అందుకున్నట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. తనకు సీమాంధ్ర మాత్రమే కాకుండా, తెలంగాణ ప్రాంతం కూడా ముఖ్యమేనన్నారు.Source: ఏపీ న్యూస్ | 30 Apr 2010 | 2:20 am జార్ఖండ్ సీఎంగా సొరేన్ కొనసాగుతారు: కమలనాథులుజార్ఖండ్ రాష్ట్రంలోని అధికార జార్ఖండ్ ముక్తిమోర్చా పార్టీకి ఇస్తున్న మద్దతు ఉపసంహరణపై భారతీయ జనతా పార్టీ నేతలు వెనక్కి తగ్గారు. ప్రస్తుతానికి జేఎంఎం చీఫ్ శిబూ సొరేన్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మేరకు.. ఆ పార్టీ మహిళా సీనియర్ నేత సుష్మా స్వరాజ్ నివాసంలో జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.Source: జాతీయ | 30 Apr 2010 | 2:08 am మే రెండో వారంలో హస్తినకు వెళ్లనున్న రోశయ్య!ముఖ్యమంత్రి కె.రోశయ్య మే రెండో వారంలో హస్తినకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆయనకు పిలుపు వస్తేనే ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వచ్చే నెల ఆరో తేదీన జరుగనుంది.Source: ఏపీ న్యూస్ | 29 Apr 2010 | 11:49 pm మావోయిస్టుల సమస్యపై ఎంపీలతో హోంమంత్రి భేటీ!మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాల్లోని 33 జిల్లాలకు చెందిన లోక్‌సభ సభ్యులతో కేంద్ర హోం మంత్రి చిదంబరం భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో శుక్రవారం జరుగుతున్న ఈ సమావేశంలో మావోయిస్టుల ఏరివేత, అంతర్గత భద్రత అంశాలపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.Source: జాతీయ | 29 Apr 2010 | 11:28 pm మరికొద్ది సేపట్లో సీనియర్ ఇంటర్ ఫలితాల వెల్లడిఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షా ఫలితాలు శుక్రవారం ఉదయం 11.30 నిమిషాలకు విడుదల కానున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి జి.బలరామయ్య వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు వీటిని విడుదల ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఫలితాలు http://results.webdunia.comలో చూసుకోవచ్చు.Source: ఏపీ న్యూస్ | 29 Apr 2010 | 10:51 pm హర్యానాలో ఆకస్మిక పర్యటన చేసిన రాహుల్ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీకి చెందిన యువనేత రాహుల్‌గాంధీ హర్యానాలో గురువారం ఆకస్మిక పర్యటన చేశారు. హర్యానాలోని హిస్సార్‌కు సమీపంలోని దళిత గ్రామంలో పర్యటించి సంచలనం సృష్టించారు. ఏప్రిల్ 21వ తేదీన మిర్చీపూర్ గ్రామంలో కులవిద్వేషానికి బలైపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.Source: జాతీయ | 29 Apr 2010 | 10:27 pm జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న భాజపాలోక్సభలో కోత తీర్మానంపై యూపీఏ సర్కారుకు మద్దతు తెలిపిన జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబూ సోరెన్‌పై కినుక వహించిన భారతీయ జనతాపార్టీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు సముఖత వహించింది. దీంతో జార్ఖండ్ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టేందుకు భాజపా సిద్ధమౌతున్నట్లు సమాచారం.Source: జాతీయ | 29 Apr 2010 | 10:16 pm హీరోలతో డేటింగ్ చేయడం అస్సలు నచ్చదు..!: సమీరారెడ్డిబాలీవుడ్లో తన అందచందాలతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసిన అందాల ముద్దుగుమ్మ సమీరారెడ్డికి సినీ ఫీల్డ్‌లో ఉన్న మగాళ్లంటే బొత్తిగా నచ్చదట. హీరోలు, మోడల్స్ అంటే అంతగా ఆసక్తి చూపనని, ముఖ్యంగా సినిమా నాయకులతో డేటింగ్ చేయడం అస్సలు నచ్చదని సమీరారెడ్డి ఓపెన్‌గా చెప్పేసింది. ఎందుకంటే..? తను కూడా సినిమావాడే కదా..? అందుకే బోర్ కొడుతుందని సమీరా మనసులోని మాటను బయటపెట్టేసింది. ఇంకా చెప్పాలంటే..? తనకు ఎవరితోనూ ఎలాంటి సంబంధాలు లేవని అంటోంది. ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతానంటే..? అందమైన మనసున్న అబ్బాయిలంటే తనకు చాలా ఇష్టమని చెబుతోంది. ఆత్మవిశ్వాసంతో బతికే మగాడంటే చాలా ఇష్టమని తన వరుడికి ఉండాల్సిన లక్షణాలను ఏకరువు పెట్టింది.పనిలో పనిగా ముసాఫిర్‌లో ముద్దు సీన్ గురించి మాట్లాడుతూ.. దేశంలో ఎన్నో సమస్యలున్నాయి. అవేవీ పట్టించుకోకుండా ముద్దు గురించి ఎందుకింత శ్రద్ధ తీసుకుంటారంది. మనదేశంలోనే ఇలా అన్ని విషయాలను పట్టించుకుంటారని, విదేశాల్లో అసలు పట్టించుకోరని సమీరా కొట్టిపారేసింది. మరి.. సమీరారెడ్డి తగిన ఆ "ఒక్కమగాడు" ఎవరో వేచి చూడాల్సిందే..!?Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2010 | 12:42 pm ప్రకాష్ రాజ్, భూమికల "కలెక్టర్ గారి భార్య" ఆడియో విడుదలప్రకాష్రాజ్, భూమిక జంటగా నటించిన "కలెక్టర్ గారి భార్య" చిత్ర ఆడియో విడుదల హైదరాబాద్‌లో జరిగింది. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీడీని ఆవిష్కరించగా, మరో మంత్రి డి.కె. అరుణ ఆమోద్ ఆడియో లోగోను ఆవిష్కరించారు. ఆడియో విడుదల సందర్భంగా హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. "ఈ సినిమా టైటిల్ వినగానే తప్పకుండా చూడాలనేట్లుంది. మహిళా కథాంశాన్ని ఎంపిక చేసుకున్న దర్శకుడు కమిట్‌మెంట్, కసితో రూపొందించినట్లు తెలుస్తుంది. ఈ సినిమా వంద రోజుల ఫంక్షన్‌లో కూడా నేను నా సహమంత్రి అరుణ పాల్గొనాలని కోరుకుంటున్నాను. చిత్రపరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది" అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2010 | 12:27 pm వేసవి కానుకగా వస్తోన్న "లారెన్స్" (వీడి స్టైలే వేరు)నృత్య దర్శకుడు లారెన్స్ కథానాయకుడిగా నటించిన "లారెన్స్" (వీడి స్టైలే వేరు) చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త కోరుకొండవరహల రావు కొంతకాలం గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కె.వి.ఆర్. ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత కోరుకొంవరహల రావు "లారెన్స్" సినిమా గురించి చెబుతూ.. ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు అన్ని పూర్తయ్యాయి. తొలికాపీ ఇప్పటికే సిద్ధమైంది. సెన్సార్ పూర్తి గావించి మే నెవలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2010 | 12:08 pm పోలీసు తనిఖీలపై బెంగవద్దు: హోంమంత్రి సబితారాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పోలీసులు చేస్తున్న తనిఖీలతో నగర వాసులు భయాందోళనలు చెందాల్సిన పని లేదని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ఆమె గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ మే 18వ తేదీన బ్లాక్ డేతో పాటు నిఘావర్గాల హెచ్చరికల కారణంగానే పోలీసులు ముందస్తు తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు.Source: ఏపీ న్యూస్ | 29 Apr 2010 | 8:28 am సొరేన్‌తో సంధికి బీజేపీ ససేమిరా: చీలిక దిశగా జేఎంఎంజార్ఖండ్ ముఖ్యమంత్రి శిబూ సొరేన్‌తో సంధి చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ససేమిరా అన్నారు. సొరేన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకోవాలని తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఆమె తెగేసి చెప్పారు. అందువల్ల జేఎంఎం ప్రభుత్వానికి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.Source: జాతీయ | 29 Apr 2010 | 7:08 am స్నేహాన్ని.. ప్రేమతో ముడిపెడతారా..? ప్లీజ్ ఆ పాపం చేయకండి!!"ఆకలేస్తే అన్నం పెడతా.." అంటూ గాయనిగా, నటీమణిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి మమతా మోహన్‌దాస్ "పాపం, పుణ్యమంటూ.." క్లాస్ పీకుతోంది. తనపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మమతా అంటోంది. నిజం ఏమిటో? తనకు బాగా తెలుసునని, అందుకే చప్పుడు చేయకుండా ఉన్నానంటోంది. కానీ వాటిని అవసరమైతేనే బయటపెడతానని ఈ పొడవు కాళ్ల సుందరి చెబుతోంది. ఇంకా మమతామోహన్‌దాస్ తనపై వస్తోన్న వదంతులపై మాట్లాడుతూ.. " నా దగ్గర ఎన్నో నిజాలున్నాయి. కానీ వాటిని అవసరమైతేనే బయటపెడతాను" అని చెబుతోంది. "ఇంకా సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌తో నాకు మంచి స్నేహం ఉంది. అంతకుమించి మా మాధ్య ఏమీ లేదు. మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ప్రేమకీ ముడిపెట్టడం మంచిది కాదు. ఆ పాపం చేయకండి. ప్రేమ అనేది ఏడాదికి మారేది కాదు. అందుకే పెళ్లి విషయాన్ని అమ్మానాన్నలకే వదిలేశాను. ప్రస్తుతం మూడు భాషల్లో బిజీగా ఉన్నాను" అని అంటోంది.Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2010 | 6:30 am అణు విద్యుత్ ప్రాజెక్టులపై దృష్టిసారిస్తాం: సీఎం రోశయ్యభవిష్యత్లో ఎదురయ్యే విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అణు విద్యుత్ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి కె.రోశయ్య తెలిపారు. ఎంటీఏఆర్ రూపొందించిన ఫ్యూయలింగ్ మిషన్‌ను బాబా ఆటామిక్ రీసెర్స్ సెంటర్‌కు ఆయన గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ కొరతను నివారించేందుకు అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు చేయక తప్పదన్నారు.Source: ఏపీ న్యూస్ | 29 Apr 2010 | 6:26 am కేసీఆర్‌కు మతిభ్రమించింది : మంత్రి దానం నాగేందర్తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుకు మతి భ్రమించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు.. పీసీసీ అధ్యక్షుడు దానం నాగేందర్‌పై అవాకులు చెవాకులు పేలడాన్ని దానం తప్పుబట్టారు.Source: ఏపీ న్యూస్ | 29 Apr 2010 | 6:20 am షూటింగ్ ముగింపు దశలో "నువ్వెక్కడుంటే.. నేనక్కడుంటా.."ఉదయ్‌కిరణ్ సమర్పణలో ఆయనే హీరోగా నటిస్తోన్న చిత్రం "నువ్వెక్కడుంటే.. నేనక్కడుంటా..". శ్వేతబసు ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయ్యిందని నిర్మాతలు డి. కుమార్, ఈశ్వరప్రసాద్ తెలియజేశారు.ఇంకా చిత్రం విశేషాలను నిర్మాతలు ఫిలింఛాంబర్‌లో తెలియజేస్తూ.. "ఉదయ్‌కిరణ్ చిత్రాల్లో ఇది మంచి చిత్రమవుతుంది. లవ్‌స్టోరీ అయినా కొత్తదనంగా ఉంటుంది. మంచి ఫీల్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇందులో ఆరు పాటలున్నాయి. అవే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. మేలో మరో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని జూన్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2010 | 6:12 am డబ్బు.. ప్రేమ కోసమే గూఢచర్యం: మాధురి గుప్తా వెల్లడి?గూఢచర్య ఆరోపణలతో అరెస్టయిన దౌత్య కార్యదర్శి మాధురి గుప్తా వద్ద అధికారులు జరిపిన విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. శత్రుదేశ అధికారులు ఎర చూపిన డబ్బుతో పాటు తన పాకిస్థాన్ ప్రేమికుడి కోసం మాతృదేశ రక్షణ రహస్యాలను చేరవేసేందుకు సమ్మతించినట్టు ఆమె వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. అయితే, ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగిస్తున్నట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ప్రణీత్ కౌర్ గురువారం లోక్‌సభకు తెలియజేశారు.Source: జాతీయ | 29 Apr 2010 | 6:12 am పాట చిత్రీకరణలో బ్రహ్మానందం తనయుడి "వారెవా"ప్రముఖ హాస్యనటులు డాక్టర్ బ్రహ్మానందం గౌతమ్ కథానాయకునిగా నటిస్తున్న చిత్రం "వారెవా". శాంభవి కథానాయికగా పరిచయమవుతున్న ఈ చిత్రం.. కళ్యాణ్ మంతెన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. మూవీ మిరాకిల్స్ పతాకంపై మహేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత మహేశ్వరరావు మాట్లాడుతూ.. "ఈ నెల 24న చిత్రీకరణ మొదలు పెట్టాం. తొలుత హీరోహీరోయిన్లపై మాస్టర్ నిక్సన్ నేతృత్వంలో కెదార్‌నాథ్ రాసిన పాటను చిత్రీకరిస్తున్నాం. మే 3 నుంచి టాకీ పార్ట్ చిత్రీకరణ మొదలవుతుంది. 20 రోజులు ఏకధాటిగా జరిగే షెడ్యూల్‌తో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. జూన్‌లో వైజాగ్‌లో రెండో షెడ్యూలు చేస్తాం.." అని తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2010 | 5:59 am భారత నౌకాదళంలో ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌకభారత నావికాదళంలోకి సరికొత్త యుద్ధనౌక వచ్చి చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద నౌకగా గుర్తింపు పొందిన ఐఎన్ఎస్ శివాలిక్‌ను గురువారం జలప్రవేశం చేశారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని నావల్ డక్ యార్డులో జరిగిన కార్యక్రమలో రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ ఈ నౌకను జలప్రవేశం చేయించారు. ఆరు వేల టన్నుల బరువు కలిగి, ఉక్కుతో తయారు చేసిన ఈ యుద్ధనౌక కోసం రూ.2800 కోట్లను వెచ్చించారు. దేశ నౌకాదళం ఆధునికీకరణలో భాగంగా దీన్ని సమకూర్చారు.Source: జాతీయ | 29 Apr 2010 | 3:13 am
|