|
విదేశీ మార్కెట్ల ప్రభావం: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి!అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జిస్తోంది. గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వృద్ధిని నమోదు చేసుకుని, 17,440 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా లాభాలతో, 5,235 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 29 Apr 2010 | 9:29 am పెరగనున్న చక్కెర ఉత్పత్తులు: అమెరికా వ్యవసాయ విభాగంగత రెండు సంవత్సరాలుగా భారతదేశంలో పంచదార ఉత్పత్తులు తగ్గాయి. అదే వచ్చే చక్కెర ఉత్పత్తి సంవత్సరం(అక్టోబరు 2010- సెప్టెంబరు 2011)లో పంచదార ఉత్పత్తుల్లో 28 శాతం వృద్ధి జరిగి 2.27 కోట్ల టన్నులకు చేరుకునే సూచనలున్నాయని అమెరికా వ్యవసాయ విభాగం న్యూ ఢిల్లీలో ఓ ప్రకటన జారీ చేసింది.Source: Yahoo! Telugu: News | 29 Apr 2010 | 9:12 am భారత సరిహద్దుల నుంచి పాకిస్థాన్ బలగాల తరలింపుముంబై దాడుల అనంతరం నెలకొన్న యుద్ధవాతావరణం నేపథ్యంలో భారత సరిహద్దుల వెంబడి మొహరించిన లక్ష మంది సైనిక బలగాలను పాకిస్థాన్ తరలించినట్టు అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. అమెరికా సైన్యంతో కలిసి తాలిబాన్, ఇతర తీవ్రవాదులపై జరుగుతున్న దాడుల్లో భాగంగా ఆప్ఘన్ సరిహద్దుల్లోకి ఈ బలగాలను తరలించినట్టు ఆ కార్యాలయం పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 29 Apr 2010 | 9:11 am భారత నౌకాదళంలో ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌకభారత నావికాదళంలోకి సరికొత్త యుద్ధనౌక వచ్చి చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద నౌకగా గుర్తింపు పొందిన ఐఎన్ఎస్ శివాలిక్‌ను గురువారం జలప్రవేశం చేశారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని నావల్ డక్ యార్డులో జరిగిన కార్యక్రమలో రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ ఈ నౌకను జలప్రవేశం చేయించారు. ఆరు వేల టన్నుల బరువు కలిగి, ఉక్కుతో తయారు చేసిన ఈ యుద్ధనౌక కోసం రూ.2800 కోట్లను వెచ్చించారు. దేశ నౌకాదళం ఆధునికీకరణలో భాగంగా దీన్ని సమకూర్చారు.Source: Yahoo! Telugu: News | 29 Apr 2010 | 8:43 am తొలి త్రైమాసికంలో లాభాలు పొందిన ఆర్సెలార్ మిట్టల్ఈయేడాది మార్చి 31వ తేదీతో ముగిసిన తొలి త్రైమాసికంలో తమ సంస్థ సుమారు 679 మిలియన్ డాలర్ల నికర ఆదాయాన్ని అర్జించినట్టు ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ సంస్థ ఛైర్మెన్, సీఈఓ లక్ష్మీ ఎన్.మిట్టల్ గురువారం లండన్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 29 Apr 2010 | 8:36 am ఊపందుకున్న ట్రేడింగ్: లాభాల్లో స్టాక్ మార్కెట్గురువారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి పురోగమనం దిశగా ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 95 పాయింట్లు వృద్ధి చెందింది. దీంతో సెన్సెక్స్ సూచి 17,475 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 28 పాయింట్లు బలపడి, 5,243 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 29 Apr 2010 | 8:17 am "వైఎస్ కాంగ్రెస్" ఏర్పాటు దిశగా జగన్ వర్గం వ్యూహాలు!దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి పేరు మీద ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు ఆయన వర్గీయులు వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తున్నారు. వైఎస్ హఠాన్మరణంతో ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి సీఎం పగ్గాలు అప్పగిస్తారని అందరూ ఊహించారు.Source: Yahoo! Telugu: News | 29 Apr 2010 | 8:09 am వృద్ధి బాటలో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్గురువారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, ఉదయం 11.30 గంటల ప్రాంతంలో 43 పాయింట్లు వృద్ధి చెంది, 17,423 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 14 పాయింట్లు స్వల్పంగా లాభపడి, 5,230 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 29 Apr 2010 | 7:32 am పార్టీ ఆవిర్భావ వేదికపై కేసీఆర్ వర్సెస్ విజయశాంతితెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేదికపై ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు, మెదక్ ఎంపీ విజయశాంతిలు ఒకరిపై ఒకరు నర్మగర్భంగా విమర్శలు గుప్పించుకున్నారు. ఇది.. మిగిలిన పార్టీ నేతలకు ఒకింత ఆశ్చర్యం కలిగించింది. పక్కపక్కనే కూర్చొన్న కేసీఆర్, విజయశాంతిలు, తమ వంతు ప్రసంగాల సమయంలో ఒకరినొకరు దెప్పిపొడుచుకున్నారు. ఇది పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది.Source: Yahoo! Telugu: News | 29 Apr 2010 | 7:16 am ధరలు తగ్గి 16.61 శాతానికి చేరుకున్న ఆహార ద్రవ్యోల్బణంఏప్రిల్ 17తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం వంద బేసిస్ పాయింట్ల నుండి 16.61 శాతానికి తగ్గింది. దీనికి ప్రధాన కారణం పండ్లు, కూరగాయల ధరల్లో తగ్గుదల నమోదుచేసుకోవడమేనని కేంద్ర వాణిజ్య శాఖ గురువారం ప్రకటించింది. అదే ఏప్రిల్ 10తో ముగిసిన మునుపటి వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం 17.65 శాతంగా ఉండింది.Source: Yahoo! Telugu: News | 29 Apr 2010 | 6:56 am స్నేహాన్ని.. ప్రేమతో ముడిపెడతారా..? ప్లీజ్ ఆ పాపం చేయకండి!!"ఆకలేస్తే అన్నం పెడతా.." అంటూ గాయనిగా, నటీమణిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి మమతా మోహన్‌దాస్ "పాపం, పుణ్యమంటూ.." క్లాస్ పీకుతోంది. తనపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మమతా అంటోంది. నిజం ఏమిటో? తనకు బాగా తెలుసునని, అందుకే చప్పుడు చేయకుండా ఉన్నానంటోంది. కానీ వాటిని అవసరమైతేనే బయటపెడతానని ఈ పొడవు కాళ్ల సుందరి చెబుతోంది. ఇంకా మమతామోహన్‌దాస్ తనపై వస్తోన్న వదంతులపై మాట్లాడుతూ.. " నా దగ్గర ఎన్నో నిజాలున్నాయి. కానీ వాటిని అవసరమైతేనే బయటపెడతాను" అని చెబుతోంది. "ఇంకా సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌తో నాకు మంచి స్నేహం ఉంది. అంతకుమించి మా మాధ్య ఏమీ లేదు. మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ప్రేమకీ ముడిపెట్టడం మంచిది కాదు. ఆ పాపం చేయకండి. ప్రేమ అనేది ఏడాదికి మారేది కాదు. అందుకే పెళ్లి విషయాన్ని అమ్మానాన్నలకే వదిలేశాను. ప్రస్తుతం మూడు భాషల్లో బిజీగా ఉన్నాను" అని అంటోంది.Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2010 | 6:30 am షూటింగ్ ముగింపు దశలో "నువ్వెక్కడుంటే.. నేనక్కడుంటా.."ఉదయ్‌కిరణ్ సమర్పణలో ఆయనే హీరోగా నటిస్తోన్న చిత్రం "నువ్వెక్కడుంటే.. నేనక్కడుంటా..". శ్వేతబసు ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయ్యిందని నిర్మాతలు డి. కుమార్, ఈశ్వరప్రసాద్ తెలియజేశారు.ఇంకా చిత్రం విశేషాలను నిర్మాతలు ఫిలింఛాంబర్‌లో తెలియజేస్తూ.. "ఉదయ్‌కిరణ్ చిత్రాల్లో ఇది మంచి చిత్రమవుతుంది. లవ్‌స్టోరీ అయినా కొత్తదనంగా ఉంటుంది. మంచి ఫీల్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇందులో ఆరు పాటలున్నాయి. అవే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. మేలో మరో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని జూన్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2010 | 6:12 am పాట చిత్రీకరణలో బ్రహ్మానందం తనయుడి "వారెవా"ప్రముఖ హాస్యనటులు డాక్టర్ బ్రహ్మానందం గౌతమ్ కథానాయకునిగా నటిస్తున్న చిత్రం "వారెవా". శాంభవి కథానాయికగా పరిచయమవుతున్న ఈ చిత్రం.. కళ్యాణ్ మంతెన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. మూవీ మిరాకిల్స్ పతాకంపై మహేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత మహేశ్వరరావు మాట్లాడుతూ.. "ఈ నెల 24న చిత్రీకరణ మొదలు పెట్టాం. తొలుత హీరోహీరోయిన్లపై మాస్టర్ నిక్సన్ నేతృత్వంలో కెదార్‌నాథ్ రాసిన పాటను చిత్రీకరిస్తున్నాం. మే 3 నుంచి టాకీ పార్ట్ చిత్రీకరణ మొదలవుతుంది. 20 రోజులు ఏకధాటిగా జరిగే షెడ్యూల్‌తో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. జూన్‌లో వైజాగ్‌లో రెండో షెడ్యూలు చేస్తాం.." అని తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2010 | 5:59 am భారత నౌకాదళంలో ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌకభారత నావికాదళంలోకి సరికొత్త యుద్ధనౌక వచ్చి చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద నౌకగా గుర్తింపు పొందిన ఐఎన్ఎస్ శివాలిక్‌ను గురువారం జలప్రవేశం చేశారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని నావల్ డక్ యార్డులో జరిగిన కార్యక్రమలో రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ ఈ నౌకను జలప్రవేశం చేయించారు. ఆరు వేల టన్నుల బరువు కలిగి, ఉక్కుతో తయారు చేసిన ఈ యుద్ధనౌక కోసం రూ.2800 కోట్లను వెచ్చించారు. దేశ నౌకాదళం ఆధునికీకరణలో భాగంగా దీన్ని సమకూర్చారు.Source: జాతీయ | 29 Apr 2010 | 3:13 am "వైఎస్ కాంగ్రెస్" ఏర్పాటు దిశగా జగన్ వర్గం వ్యూహాలు!దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి పేరు మీద ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు ఆయన వర్గీయులు వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తున్నారు. వైఎస్ హఠాన్మరణంతో ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి సీఎం పగ్గాలు అప్పగిస్తారని అందరూ ఊహించారు.Source: ఏపీ న్యూస్ | 29 Apr 2010 | 2:40 am పార్టీ ఆవిర్భావ వేదికపై కేసీఆర్ వర్సెస్ విజయశాంతితెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేదికపై ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు, మెదక్ ఎంపీ విజయశాంతిలు ఒకరిపై ఒకరు నర్మగర్భంగా విమర్శలు గుప్పించుకున్నారు. ఇది.. మిగిలిన పార్టీ నేతలకు ఒకింత ఆశ్చర్యం కలిగించింది. పక్కపక్కనే కూర్చొన్న కేసీఆర్, విజయశాంతిలు, తమ వంతు ప్రసంగాల సమయంలో ఒకరినొకరు దెప్పిపొడుచుకున్నారు. ఇది పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది.Source: ఏపీ న్యూస్ | 29 Apr 2010 | 1:46 am కోల్‌కతాలో హై అలెర్టు: బలగాల అదుపులో కాళీ మందిరంకోల్కతాలో హై అలెర్ట్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు.. పశ్చిమబెంగాల్ క్యాపిటల్ కోల్‌కతాల్లో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించవచ్చని నిఘా వర్గాలతో పాటు.. కేంద్ర హోంశాఖ వర్గాలు హెచ్చరించాయి. దీంతో కోల్‌కతాలో భద్రతను ఆ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టం చేసింది. కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు.. ప్రసిద్ధ కాళికామందిరం, నక్షత్ర హోటల్, హౌరా వంతెన తదితర ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు.Source: జాతీయ | 29 Apr 2010 | 1:02 am తెరాస గుర్తింపు రద్దుపై నవీన్ చావ్లాతో లగడపాటి భేటి!తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గుర్తింపును తక్షణం రద్దు చేయాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నవీన్ చావ్లాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సంప్రదింపులు జరిపేందుకు కేంద్రం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ పట్ల తెరాస చీఫ్ కె.చంద్రశేఖర రావు కనీస గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 29 Apr 2010 | 12:53 am కోట్లు దండుకుని టీవీ ఛానల్ పెట్టిన కేసీఆర్: లగడపాటితెలంగాణ ఉద్యమం పేరుతో తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు కోట్లాది రూపాయలు దండుకుని టీవీ ఛానల్‌ను పెట్టారని విజయవాడ ఎంపీ, సమైక్యాంధ్ర హీరో లగడపాటి రాజగోపాల్ ఆరోపించారు. హైదరాబాద్‌లో పోటీ చేసే సత్తా లేని కేసీఆర్.. దాడులు దందాలతో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.Source: ఏపీ న్యూస్ | 29 Apr 2010 | 12:20 am భాజపాకు దక్కనున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి పీఠం!!జార్ఖండ్ రాష్ట్రంలో భారతీయజనతా పార్టీకి చెందిన అగ్రనేతలు, ఎమ్మెల్యేలు, శిబూ సోరెన్‌కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వర్గాలతో చర్చిస్తున్నారు. దీంతో శిబూ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ పదవిని భాజపాకు ఇవ్వనున్నట్లు సమాచారం.Source: జాతీయ | 28 Apr 2010 | 11:58 pm హైదరాబాద్‌కు ఉగ్రవాదుల ముప్పు: సీఎంను కలిసిన ఖాన్!రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌పై తీవ్రవాదులు కన్నేశారంటూ కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) హెచ్చరించిన నేపథ్యంలో.. నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ గురువారం ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. భాగ్యనగరానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అప్రమత్త చర్యలపై చర్చలు జరిపేందుకే ఏకే ఖాన్.. సీఎంతో భేటీ అయ్యారని సమాచారం. ఈ సందర్భంగా ఏకే ఖాన్ తీసుకుంటున్న అప్రమత్త చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది.Source: ఏపీ న్యూస్ | 28 Apr 2010 | 11:23 pm ఈ-వేస్ట్ వ్యర్ధపదార్ధాల నియంత్రణకు కొత్త చట్టాలు: జై రాందేశ రాజధాని ఢిల్లీలోని మాయాపురిలో ఇటీవల స్క్రాప్ మార్కెట్‌లో రేడియేషన్‌కు మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో పర్యావరణ శాఖామంత్రి జైరాం రమేశ్ మాట్లాడుతూ, ప్రమాదకర ఈ-వేస్ట్ వ్యర్థపదార్థాల అదుపునకు ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువస్తుందని చెప్పారు.Source: జాతీయ | 28 Apr 2010 | 10:26 pm ఐపీఎల్ కుంభకోణంలో సోనియా అల్లునికి సంబంధం: భాజపాఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడైన రాబర్డ్ వధేరాకు సంబంధం ఉందని భారతీయ జనతాపార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి ఆరోపించారు.Source: జాతీయ | 28 Apr 2010 | 10:14 pm "చందమామ" బొమ్మ 'సింధుమీనన్'కు పెళ్లంట..!?"చందమామ" చిత్రంలో కాజల్ అగర్వాల్ సరసన హోమ్లీ అందాలతో ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార "సింధుమీనన్" త్వరలో పెళ్లి కూతురు కాబోతుందట..!. ఇప్పటికే యూకేకు చెందిన వాణిజ్య వేత్త ప్రభుతో సింధుమీనన్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. దక్షిణాది సినిమాల్లో నటించిన సింధుమీనన్.. తాజాగా తెలుగులో "సుభద్ర" అనే చిత్రంలో లేడి ఓరియెంటెడ్ రోల్ చేస్తోంది. త్రినేత్రం, శ్రీరామ చంద్రులు, ఆడు అంతే.. అదో టైపు వంటి పలు చిత్రాల్లో సింధుమీనన్ నటించినా.. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న "చందమామ" చిత్రం మంచి గుర్తింపును సంపాదించిపెట్టింది. క్లాసికల్ డ్యాన్సర్ అయిన సింధు మీనన్ "రష్మీ" అనే కన్నడ సినిమాలో అతి చిన్న వయస్సులోనే నటించింది. హోమ్లీ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న కేరళ అమ్మాయి సింధుమీనన్-ప్రభుల నిశ్చితార్థం త్రిశూర్‌లో జరిగిందని ఫిలిమ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2010 | 1:08 pm వైభవంగా "నమో వెంకటేశ" శతదినోత్సవ వేడుకలువిక్టరీ వెంకటేష్, త్రిష హీరోహీరోయిన్లుగా సురేష్ ప్రొడక్షన్స్ డి. సురేష్ బాబు సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై హ్యాట్రిక్ డైరక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ "నమో వెంకటేశ" ఈ చిత్రం శతదినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించి, వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏప్రిల్ 26న "నమో వెంకటేశ" శతదినోత్సవం హైదరాబాద్‌లోని జయభేరి క్లబ్‌లో యూనిట్ సభ్యుల సమక్షంలో గెట్ టు గెదర్‌లా ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లా జరిగింది.Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2010 | 12:22 pm "ఆ ఇంట్లో ఒక రోజు ఏం జరిగింది..!?రఘుబాబు హీరోగా, సింగం సుధాకరరెడ్డి దర్శకత్వంలో గాయత్రి మూవీస్ రమణ గుడిపాటి సమర్పణలో బి.ఎస్. విజువల్స్ పతాకంపై తెలుగు, తమిళ భాషలలో నిర్మాణమవుతున్న చిత్రం "ఆ ఇంట్లో ఒక రోజు". ఈ చిత్రం గురించి సమర్పకుడు గుడిపాటి మాట్లాడుతూ.. "ఇప్పటి వరకు ఒక పాట మినహా చిత్రం పూర్తయింది. ఇది క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మేలో చిత్రం విడుదల చేస్తాం" అని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2010 | 11:24 am అమెరికా-ఇరాక్ యుద్ధ నేపథ్యంలో "ది హర్ట్ లాకర్"అమెరికా-ఇరాక్ యుద్ధ నేపథ్యంలో "ది హర్ట్ లాకర్" అనే చిత్రం రూపొందించారు. కాత్రిన్ బైగెలో దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మార్క్‌బోలె స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ఈ చిత్రం "అవతార్"కు ధీటుగా ఆస్కార్‌లో నిలబడి ఆరు అవార్డులు పొందింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన "ది హర్ట్ లాకర్" (ఇంగ్లీష్) చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు రత్న సెల్యులాయిడ్ బేనర్ అధినేత వాసు తెలియజేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2010 | 11:14 am రాష్ట్ర రాజధాని భాగ్యనగరిలో హై అలెర్ట్: ఏకే ఖాన్రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరోమారు హై అలెర్ట్ ప్రకటించారు. నగరంపై ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించడంతో నగర పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. గత కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న ఉగ్రవాది వికారుద్దీన్ హైదరాబాద్‌లోనే ఉన్నట్టు నిఘా వర్గాలు పక్కా సమాచారం అందించారు. దీంతో అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 28 Apr 2010 | 9:01 am రూ.25 లక్షల లంచం డిమాండ్: ఐపీఎస్ అధికారి అరెస్టుఅవినీతి ఆరోపణల కేసులో 25 లక్షల రూపాయల లంచాన్ని డిమాండ్ చేసినందుకు ఐపీఎస్ అధికారిని కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బుధవారం అరెస్టు చేసింది. అలాగే, ఇదే కేసులో రైల్వే శాఖకు చెందిన మరో సీనియర్ ఉన్నతాధికారిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.Source: జాతీయ | 28 Apr 2010 | 8:24 am తెరాసను చూసి బెంబేలెత్తిపోతున్న తెదేపా: కేసీఆర్తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని చూసి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ బెంబేలెత్తి పోతోందని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు అభిప్రాయపడ్డారు. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి నివేదిక సమర్పించే విషయంలోనే తెదేపా వైఖరేంటో తేలిపోయిందన్నారు. ఆ పార్టీకి అధికార దాహం తప్ప ప్రజాక్షేమం ఏమాత్రం లేదని ఆయన ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 28 Apr 2010 | 8:14 am విక్టరీ వెంకటేష్ హీరోగా "ఆప్త రక్షక" షూటింగ్ ప్రారంభం!విక్టరీ వెంకటేష్ హీరోగా "ఆప్త రక్షక" సినిమా షూటింగ్ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. "చంద్రముఖి" దర్శకుడు పి. వాసు దర్శకత్వంలో, బెల్లంకొండ నిర్మిస్తున్న "ఆప్త రక్షక" సినిమా షూటింగ్ బుధవారం ఉదయం ఏడు గంటలకు రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. విక్టరీ వెంకటేష్‌పై తీసిన ముహూర్తపు షాట్‌కు పూరీ జగన్నాథ్ క్లాప్ కొట్టగా, రామానాయుడు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అలాగే వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు."చంద్రముఖి" సీక్వెల్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. వీరిలో అరుంధతి ఫేమ్ అనుష్క, లీడర్ ఫేమ్ రిచా గంగోపాధ్యాయ్ పేర్లు ఇప్పటికే ఖరారు కాగా, మిగిలిన ముగ్గురు హీరోయిన్లుగా ప్రియమణి, లక్ష్మీరాయ్, కమలిని ముఖర్జీ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2010 | 6:18 am అటవీశాఖలో 4500 పోస్టుల భర్తీకి సీఎం పచ్చజెండా!అటవీశాఖలో ఉన్న కొత్తగా 4500 పోస్టులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కె.రోశయ్య పచ్చజెండా ఊపారు. ఈ విషయాన్ని రాష్ట్ర అటవీ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 28 Apr 2010 | 6:07 am కేసీఆర్.. భాష.. యాస ఎవరికీ అర్థంకావు: ధర్మపురితెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు వాడే భాష, యాస ఎవరికీ అర్థం కాదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తన గురించి కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించినా తాను మాత్రం ప్రశాంతవదనంతోనే సమాధానం ఇస్తానన్నారు. తనపై కేసీఆర్ ఎన్ని విమర్శలు చేసినా తాను మాత్రం ఆయన విమర్శలపై పెద్దగా స్పందిచనన్నారు.Source: ఏపీ న్యూస్ | 28 Apr 2010 | 5:47 am తెలంగాణ ఉత్తరకుమారుడు కేసీఆర్ : గోనె ప్రకాశరావుతెలంగాణ ప్రాంత ఉత్తరకుమారుడిగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు మారారని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనే ప్రకాశరావు ఆరోపించారు. ఆయన మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన లేదని ఆయన దుయ్యబట్టారు. అదిగో వస్తుంది.. ఇదిగో వస్తుంది తెలంగాణ అంటూ.. ఉత్తర కుమారిడిలా మాట్లాడుతున్నారన్నారు.Source: ఏపీ న్యూస్ | 28 Apr 2010 | 5:36 am జేఎంఎం ప్రభుతకు భాజపా మద్దతు కట్: సంక్షోభంలో జార్ఖండ్!జార్ఖండ్ రాష్ట్రంలో మరోమారు రాజకీయ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి శిబూసొరేన్‌కు భారతీయ జనతా పార్టీ తగిన గుణపాఠం నేర్పింది. ఆయన నేతృత్వంలోని జేఎంఎం ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఆ పార్టీ ఉపసంహరించుకుంది. మద్దతు ఉపసంహరణ లేఖతో భాజపా ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్‌కు అందజేసేందుకు సమాయత్తమవుతున్నారు.Source: జాతీయ | 28 Apr 2010 | 3:21 am
|