|
ట్రేడింగ్ క్షీణత: నష్టాల్లో స్టాక్ మార్కెట్దేశీయ వాటాల ట్రేడింగ్ క్షీణించడంతో బాంబే స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నష్టాలతో 17,540 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా నష్టంతో 5,255 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 28 Apr 2010 | 9:32 am ఐపీఎల్ నుంచి తొలగనున్న ప్రకటనకర్తలు: గోద్రేజ్, శ్యామ్సంగ్ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)మ్యాచ్ కారణంగా దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఐటీ దాడుల నేపథ్యంలో పలు కంపెనీలు ఐపీఎల్‌తో తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధపడుతున్నాయి. వీటిలో ప్రధానంగా గోద్రేజ్, శ్యామ్‌సంగ్ లాంటి ప్రముఖ కంపెనీలున్నట్లు గోద్రేజ్ గ్రూప్ కార్యనిర్వాహక డైరెక్టర్ తాన్యా దుభాశ్ న్యూ ఢిల్లీలో బుధవారం తెలిపారు.Source: Yahoo! Telugu: News | 28 Apr 2010 | 9:07 am నష్టాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 163 పాయింట్లు పతనమైంది. ఇదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 51 పాయింట్లు క్షీణించి, 5,256 పాయింట్ల మార్కును తాకింది.Source: Yahoo! Telugu: News | 28 Apr 2010 | 9:04 am జస్టీస్ శ్రీకృష్ణ బృందానిదీ తెలంగాణనమే: జయశంకర్జస్టీస్ శ్రీకృష్ణ బృందం కూడా తెలంగాణ నినాదమే ఆలపించబోతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జోస్యం చెప్పారు. అంతేకాకుండా, తుది నివేదిక ఇచ్చే అంశంపై ఆ కమిటీపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.Source: Yahoo! Telugu: News | 28 Apr 2010 | 9:00 am తిరోగమనం వైపు బాంబే స్టాక్ మార్కెట్బుధవారం బాంబే స్టాక్ మార్కెట్‌కు ఏ మాత్రం కలిసిరాలేదు. ఫలితంగా బుధవారం 11.30 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, 147 పాయింట్లు పతనమై, 17,543 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 46 పాయింట్లు పడిపోయి, 5,262 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 28 Apr 2010 | 8:59 am 3జీ వేలం ద్వారా ఖజానా లోటును పూడ్చుకోవచ్చుప్రస్తుతం దేశంలో కేంద్ర ప్రభుత్వం మూడవ తరం(3జీ)స్పెక్ట్రమ్‌ను వేలం వేస్తోంది. దీనికి దేశీయ టెలికాం దిగ్గజాలు గట్టిపోటీనిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వానికి దాదాపు రూ. 50,000 నుంచి రూ. 55,000 కోట్ల ఆదాయం రానుంది. దీంతో ప్రభుత్వ ఖజానా లోటును పూడ్చుకోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారుSource: Yahoo! Telugu: News | 28 Apr 2010 | 8:52 am జేఎంఎం ప్రభుతకు భాజపా మద్దతు కట్: సంక్షోభంలో జార్ఖండ్!జార్ఖండ్ రాష్ట్రంలో మరోమారు రాజకీయ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి శిబూసొరేన్‌కు భారతీయ జనతా పార్టీ తగిన గుణపాఠం నేర్పింది. ఆయన నేతృత్వంలోని జేఎంఎం ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఆ పార్టీ ఉపసంహరించుకుంది. మద్దతు ఉపసంహరణ లేఖతో భాజపా ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్‌కు అందజేసేందుకు సమాయత్తమవుతున్నారు.Source: Yahoo! Telugu: News | 28 Apr 2010 | 8:50 am ఇక చాలు "డాలర్" శేషాద్రి.. పదవి నుంచి తప్పుకో..!: హైకోర్టుతిరుమల తిరుపతి దేవస్థానంలో వయోపరిమితి ముగిసినా విధులు నిర్వర్తిస్తున్న డాలర్ శేషాద్రికి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. 60 ఏళ్లు దాటినా తితిదేలో విధులు నిర్వర్తించడం నిబంధనలను ఉల్లంఘించడమవుతుందని హైకోర్టు సూచించింది. ఇంకా డాలర్ శేషాద్రి విధులకు దూరం కావాలని హైకోర్టు ఆదేశించింది. ఇంకా నిబంధనలను విరుద్ధంగా విధులు నిర్వర్తిస్తున్న డాలర్ శేషాద్రి పదవీకాలంపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.Source: Yahoo! Telugu: News | 28 Apr 2010 | 7:42 am గోధుమల అధిక దిగుబడితో ద్రవ్యోల్బణం తగ్గుతుందిః మాంటెక్ప్రస్తుత సీజన్‌లో గోధుమల పంట అధిక దిగుబడి కాగలదని, దీంతో దేశంలో రెండంకెల స్థాయికి చేరుకున్న ద్రవ్యోల్బణం మరో రెండు-మూడు నెలల్లో తగ్గనుందని కేంద్ర ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మెన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా బుధవారం తెలిపారుSource: Yahoo! Telugu: News | 28 Apr 2010 | 7:41 am స్కూల్ విద్యార్థులకు సైకిళ్ళు, యూనిఫాం: బీహార్ ప్రభుత్వంతమ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు అవసరమైన యూనిఫాం దుస్తులు, సైకిళ్ళ కొనుగోలుకు ప్రభుత్వం రూ. 797 కోట్లను విడుదల చేసిందని బీహార్ ప్రభుత్వాధికారులు పాట్నాలో బుధవారం ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 28 Apr 2010 | 7:12 am విక్టరీ వెంకటేష్ హీరోగా "ఆప్త రక్షక" షూటింగ్ ప్రారంభం!విక్టరీ వెంకటేష్ హీరోగా "ఆప్త రక్షక" సినిమా షూటింగ్ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. "చంద్రముఖి" దర్శకుడు పి. వాసు దర్శకత్వంలో, బెల్లంకొండ నిర్మిస్తున్న "ఆప్త రక్షక" సినిమా షూటింగ్ బుధవారం ఉదయం ఏడు గంటలకు రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. విక్టరీ వెంకటేష్‌పై తీసిన ముహూర్తపు షాట్‌కు పూరీ జగన్నాథ్ క్లాప్ కొట్టగా, రామానాయుడు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అలాగే వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు."చంద్రముఖి" సీక్వెల్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. వీరిలో అరుంధతి ఫేమ్ అనుష్క, లీడర్ ఫేమ్ రిచా గంగోపాధ్యాయ్ పేర్లు ఇప్పటికే ఖరారు కాగా, మిగిలిన ముగ్గురు హీరోయిన్లుగా ప్రియమణి, లక్ష్మీరాయ్, కమలిని ముఖర్జీ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2010 | 6:18 am జస్టీస్ శ్రీకృష్ణ బృందానిదీ తెలంగాణనమే: జయశంకర్జస్టీస్ శ్రీకృష్ణ బృందం కూడా తెలంగాణ నినాదమే ఆలపించబోతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జోస్యం చెప్పారు. అంతేకాకుండా, తుది నివేదిక ఇచ్చే అంశంపై ఆ కమిటీపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 28 Apr 2010 | 3:31 am జేఎంఎం ప్రభుతకు భాజపా మద్దతు కట్: సంక్షోభంలో జార్ఖండ్!జార్ఖండ్ రాష్ట్రంలో మరోమారు రాజకీయ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి శిబూసొరేన్‌కు భారతీయ జనతా పార్టీ తగిన గుణపాఠం నేర్పింది. ఆయన నేతృత్వంలోని జేఎంఎం ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఆ పార్టీ ఉపసంహరించుకుంది. మద్దతు ఉపసంహరణ లేఖతో భాజపా ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్‌కు అందజేసేందుకు సమాయత్తమవుతున్నారు.Source: జాతీయ | 28 Apr 2010 | 3:21 am ఇక చాలు "డాలర్" శేషాద్రి.. పదవి నుంచి తప్పుకో..!: హైకోర్టుతిరుమల తిరుపతి దేవస్థానంలో వయోపరిమితి ముగిసినా విధులు నిర్వర్తిస్తున్న డాలర్ శేషాద్రికి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. 60 ఏళ్లు దాటినా తితిదేలో విధులు నిర్వర్తించడం నిబంధనలను ఉల్లంఘించడమవుతుందని హైకోర్టు సూచించింది. ఇంకా డాలర్ శేషాద్రి విధులకు దూరం కావాలని హైకోర్టు ఆదేశించింది. ఇంకా నిబంధనలను విరుద్ధంగా విధులు నిర్వర్తిస్తున్న డాలర్ శేషాద్రి పదవీకాలంపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.Source: ఏపీ న్యూస్ | 28 Apr 2010 | 2:17 am స్కూల్ విద్యార్థులకు సైకిళ్ళు, యూనిఫాం: బీహార్ ప్రభుత్వంతమ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు అవసరమైన యూనిఫాం దుస్తులు, సైకిళ్ళ కొనుగోలుకు ప్రభుత్వం రూ. 797 కోట్లను విడుదల చేసిందని బీహార్ ప్రభుత్వాధికారులు పాట్నాలో బుధవారం ప్రకటించారు.Source: జాతీయ | 28 Apr 2010 | 1:43 am సినీ నటి ఖుష్బూపై 22 కేసులు: కొట్టివేసిన సుప్రీం కోర్టు!సినీ నటి ఖుష్బూపై ఉన్న 22 కేసులను అత్యున్నత న్యాయ స్థానం బుధవారం కొట్టివేసింది. వివాహానికి ముందు శృంగారం తప్పు కాదని ఖుష్బూ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడులో మొత్తం 22 క్రిమినల్, సివిల్ కేసులు దాఖలు అయ్యాయి. దీంతో తనపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలంటూ తమిళనాడు హైకోర్టును ఖుష్బూ ఆశ్రయించింది. అయితే ఖుష్బూ చేసిన విజ్ఞప్తిని 2008 ఏప్రిల్‌లో హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తిరస్కరణతో ఖుష్బూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయమై విచారణ జరిపిన సుప్రీం కోర్టు బుధవారం ఖుష్బూపై దాఖలు అయిన కేసులన్నింటిని కొట్టివేసింది.Source: జాతీయ | 28 Apr 2010 | 1:01 am కౌకుంట్ల కాంగ్రెస్ నేత ఇంట్లో బాంబు పేలుళ్ళుఅనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్లలో నివాసముంటున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కుళ్ళాయప్ప ఇంట్లో బుధవారం ఉదయం బాంబులు పేలడంతో ఆ ప్రాంతంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది.Source: ఏపీ న్యూస్ | 27 Apr 2010 | 11:21 pm కేతన్ అవినీతి సామ్రాజ్యంలో లభ్యమైన వజ్రాలు, బంగారందేశంలోని పలు వైద్య కళాశాలల యజమానుల నుంచి ఇబ్బడిముబ్బడిగా లంచాలు పుచ్చుకుంటూ పట్టుబడ్డ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అధ్యక్షుడు కేతన్ దేశాయ్‌కు సంబంధించిన ఆస్తులపై సీబీఐ మంగళవారం కూడా దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో కేతన్‌కు చెందిన అహ్మదాబాద్ బ్యాంకు లాకర్లలో దాదాపు రూ. 38 లక్షల విలువ చేసే వజ్రాలు, బంగారు నగలు బయటపడ్డట్టు అధికారులు తెలిపారు.Source: జాతీయ | 27 Apr 2010 | 10:29 pm నేడే తెరాస ఆవిర్భావ దినోత్సవంతెలంగాణ రాష్ట్ర సమితి తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాలు బుధవారం వైభవంగా జరుగనున్నాయి. తెరాసను స్థాపించి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో ప్రతినిధుల సభను ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రస్థానం, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యచరణలపై ఈ సభలో చర్చలు జరుగుతాయి.Source: ఏపీ న్యూస్ | 27 Apr 2010 | 10:02 pm పాక్‌కు సమాచారం అందిస్తున్న మహిళా దౌత్యవేత్త అరెస్టుమన దేశానికి చెందిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థలకు అందజేశారన్న ఆరోపణపై ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో సీనియర్ దౌత్యవేత్తగా పని చేస్తున్న మాధురి గుప్తా(53)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి విష్ణు ప్రకాశ్ తెలిపారు.Source: జాతీయ | 27 Apr 2010 | 9:50 pm "పంచాక్షరి" పాటల విడుదలఅనుష్క ప్రధాన పాత్రతో "పంచాక్షరి" చిత్రం రూపొందుతోంది. సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై వి. సముద్ర దర్శకత్వంలో బొమ్మదేవర రామచంద్రరావు (చంద్ర) నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర ఆడియో లాంఛనంగా విడుదలైంది. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున, మోహన్‌బాబు, రాఘవేంద్రరావు, సుమంత్, సుశాంత్, నాగచైతన్య, నాగసుశీల, సి. కళ్యాణ్, ఎం.ఎల్. కుమార్‌చౌదరి తదితరులు హాజరయ్యారు. చంద్ర నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని అతిథులంతా వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Apr 2010 | 10:03 am షూటింగ్‌ను పూర్తి చేసుకున్న "తకిట తకిట"ఎనిమిదిమంది వ్యక్తుల భిన్న మనస్తత్వాలు, సంస్కృతుల కథతో "తకిట తకిట" చిత్రం రూపొందుతోందని చిత్ర నిర్మాత భరత్ ఠాగూర్ తెలిపారు. డౌన్‌టౌన్ ఫిలింస్ పతాకంపై భూమిక చావ్లా సమర్పణలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి శ్రీహరి నాను దర్శకుడు. హిమాలయాల్లో షూటింగ్ జరుపుకుని తిరిగి వచ్చిన సందర్భంగా చిత్ర విశేషాలను తెలియజేశారు.నిర్మాత, భూమిక భర్త భరత్ ఠాగూర్ మాట్లాడుతూ.. "విభిన్నమైన సంస్కృతులుగల ఎనిమిది మంది స్నేహితుల మధ్య జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్ర కథ. వారిలో నెలకొన్న అపోహలు కొన్ని తాత్కాలిక సంఘటనలు ఎలా జీవితాల్ని మార్చివేశాయనేది చక్కగా చూపించారు. కథ ప్రకారం కొత్త వారిని ఎంపికచేశారు. వారికి ఆరు నెలల పాటు నటనలో శిక్షణ ఇచ్చాం. అక్కినేని నాగార్జున, అనుష్క, భూమిక ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. భూమిక ఇంగ్లీషు లెక్చరర్‌గా నటిస్తోంది" అని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Apr 2010 | 9:48 am ఉదయభాను "లీడర్" ఐటెం దెబ్బకు కంపెనీలు "క్యూ"ఈమధ్య హీరోయిన్లే ఐటెంసాంగ్స్ చేస్తుండటంతో గతంలోలా ప్రత్యేకంగా ఐటెంగాళ్స్ వెతుక్కోనవసరం లేకుండా పోయింది. అయితే హీరోయిన్‌గా ఎంటర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి రెండు, మూడు సినిమాల్లో నటించిన ఉదయభానుకు "లీడర్" సినిమాలో ఐటెంసాంగ్‌కు మంచి క్రేజ్ వచ్చింది.మొదట్లో ఈ భామను వాంప్‌కు బాగా పనికొస్తావని ఆమె స్నేహితులు సలహా యిస్తే వారిని మందలించింది. ఆ పాత్రలు వేయడానికి ఇష్టపడని ఉదయభాను టీవీ మీడియాపై దృష్టి సారించి సక్సెస్ అయింది. ఆ బుల్లితెరలో ఆమె ఒలకబోసిన హావభావాలకు శేఖర్ కమ్ముల తన చిత్రంలో వినియోగించుకున్నాడు. దీంతో ఆమెకు డిమాండ్ పెరిగింది. ప్రముఖ నిర్మాతలు ఆమెను తమ తమ చిత్రాల్లో అటువంటి ఆఫర్లే ఇస్తే.. సున్నితంగా తిరస్కరించింది.Source: Yahoo! Telugu: Entertainment | 27 Apr 2010 | 9:36 am యూపీఏపై వీగిపోయిన ప్రతిపక్షాల కోత తీర్మానాలుకేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సంకీర్ణ సర్కారుపై ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో వామపక్షాలు, తెలుగుదేశం, ఇతర పార్టీలు కలిసి ప్రవేశపెట్టిన కోత తీర్మానాలు వీగిపోయాయి. కోత తీర్మానాలపై మంగళవారం సాయంత్రం లోక్‌సభలో ఓటింగ్ జరుగగా, కోత తీర్మానానికి అనుకూలంగా 162 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 246 ఓట్లు పోలయ్యాయి. ఎస్పీ, ఆర్జేడీ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 21 మంది సభ్యులు కలిగిన బీఎస్పీ కీలక సమయంలో యూపీఏ సర్కారుకు అండగా నిలిచింది.Source: జాతీయ | 27 Apr 2010 | 8:04 am డీఎస్ ఏ మొఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు: కేసీఆర్అధిష్టానం ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పదేపదే చెప్పడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన ఏ మొఖం పెట్టుకుని ఆ మాటలు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి డీఎస్ నివేదిక ఇవ్వాలన్నారు. అలా చేస్తే తాను తన ఎంపీ స్థానానికి రాజీనామా చేసి.. మహబూబ్ నగర్ స్థానం నుంచి డీఎస్‌ను గెలిపిస్తానని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 27 Apr 2010 | 7:31 am రీ-రికార్డింగ్‌లో కృష్ణుడి "పప్పు" (మిస్టర్ ఇంటలిజెంట్)కృష్ణుడు, దీపిక, సుబ్బరాజు ముఖ్యపాత్రల్లో ఆర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నల్లప్రవీణ్‌రెడ్డి, నగేష్ యాద సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "పప్పు" (మిస్టర్ ఇంటలిజెంట్). "అష్టాచెమ్మా" చిత్రానికి పనిచేసిన పవన్ పసుపర్తి దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం రీరికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నల్లప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ.. "పవన్ ఆలోచనలకు తగినట్లుగా కథను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీ, వైజాగ్, అరకు, వికారాబాద్ ఫారెస్ట్, హైదరాబాద్‌లలో షూటింగ్ చేశాం. డైలాగ్స్‌తో పాటు అమ్మ రాజశేఖర్ డాన్స్ ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటాయి. కృష్ణ చైతన్య సాహిత్యానికి రెహమాన్ శిష్యుడు ఫణి కళ్యాణ్ సమకూర్చిన బాణీలు అమరాయి. మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 2న ఆడియోను, నెలాఖరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Apr 2010 | 7:24 am వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు "లవ్‌చేస్తే"ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగవేటలో ఉన్న వ్యక్తుల కథతో "లవ్‌చేస్తే" అనే చిత్రం రూపొందింది. పేలూరి శంకర్‌రావు సమర్పణలో మీనాక్షి ప్రొడక్షన్స్ పతాకంపై రొట్టా (హిప్పీ) అప్పారావు, అనిమిరెడ్డి పెదదేముడు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధ్రువ నాగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. "ఇదొక ఫీల్‌గుడ్ సినిమా. యువత ప్రతినిధులుగా హీరోహీరోయిన్లుంటారు. తల్లిదండ్రుల్ని కాదని తమ ప్రేమకే ప్రాముఖ్యత ఇచ్చేవారికి ఈ సినిమాలో చక్కటి సందేశముంది. ఈ చిత్రంలో కొత్తవారికి అవకాశం కల్పించాం. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి" అని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Apr 2010 | 7:02 am జగన్‌కు వ్యతిరేకంగా చేతులు కలిపిన రెడ్డి త్రయం!దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు రెడ్డి త్రయం చేతులు కలిపింది. రాష్ట్ర రాజకీయాల్లో జగన్ కీలక శక్తిగా ఎదిగినట్టయితే రాజకీయ భవిష్యత్ ఉండదని వారు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమతో పాటు తమ వర్గానికి చెందిన ఇతర సభ్యులను కూడా కలుపుకుని పోయేలా వ్యూహ రచన చేస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 27 Apr 2010 | 5:11 am ఉదయభాను "లీడర్" ఐటెం దెబ్బకు కంపెనీలు "క్యూ"ఈమధ్య హీరోయిన్లే ఐటెంసాంగ్స్ చేస్తుండటంతో గతంలోలా ప్రత్యేకంగా ఐటెంగాళ్స్ వెతుక్కోనవసరం లేకుండా పోయింది. అయితే హీరోయిన్‌గా ఎంటర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి రెండు, మూడు సినిమాల్లో నటించిన ఉదయభానుకు "లీడర్" సినిమాలో ఐటెంసాంగ్‌కు మంచి క్రేజ్ వచ్చింది.మొదట్లో ఈ భామను వాంప్‌కు బాగా పనికొస్తావని ఆమె స్నేహితులు...Source: వినోదం | 27 Apr 2010 | 4:08 am ఆమె.. పార్టీనే అమ్ముకున్న ఓ ఊసరవెల్లి: ప్రజారాజ్యంతమ పార్టీ అధినేత చిరంజీవి పక్కన స్టెప్పులు వేసి మంచి పేరు సంపాదించుకున్న విజయశాంతి ఆయనను విమర్శించే అర్హత, స్థాయి లేదని ప్రజారాజ్యం పార్టీ నేత గంటా శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. సినీ జీవితం ముగిసిన వెంటనే భవిష్యత్ అగమ్య గోచరంగా మారడంతో విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు.Source: ఏపీ న్యూస్ | 27 Apr 2010 | 2:53 am పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి: బాబు డిమాండ్రాష్ట్రంలో పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అలాగే, దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే.. మన రాష్ట్రంలోనే ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 27 Apr 2010 | 2:33 am
|