శ్రీ లంకలో ఐదువేలమందికి ఉద్యోగావకాశాలుః యూఎస్

అమెరికా అభివృద్ధి ఏజెన్సీ సంస్థ శ్రీ లంకకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ శ్రీ లంకలోని తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో దాదాపు ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అమెరికా ఏజెన్సీ సోమవారం ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 26 Apr 2010 | 9:25 am

లాభాల్లో బాంబే స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ వృద్ధి

సోమవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 72 పాయింట్లు వృద్ధి చెందింది. ఫలితంగా సెన్సెక్స్ 17,766 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 26 పాయింట్లు బలపడి, 5,330 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 26 Apr 2010 | 9:19 am

గుండెపోటుతో రాజస్థాన్ గవర్నర్ ప్రభారావు మృతి

రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్ ప్రభారావు సోమవారం కన్నుమూశారు. ఆమెకు గుండెపోటు రావడంతో న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య వైజ్ఞాన సంస్థలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 26 Apr 2010 | 9:17 am

మేలో బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలు: ఏర్పాట్లు షురూ!

ప్రతిష్టాత్మకంగా భావించే బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే నెలలో జరుగనున్నాయి. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఎన్నికల పట్ల అటు పాలకులే కాకుండా.. ప్రజలు, ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 26 Apr 2010 | 8:59 am

కేసీఆర్ వైఖరి తెరాస నేతలకే అంతుచిక్కడం లేదు: డీఎస్

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అనుసరిస్తున్న వైఖరితో ఆ పార్టీకి చెందిన నేతలు విసిగివేసారి పోతున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 26 Apr 2010 | 8:49 am

ఆసియా స్టాక్ మార్కెట్ ప్రభావం: లాభాల్లో సెన్సెక్స్

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధి చెందింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి పురోగమనం వైపు పయనిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో, 76 పాయింట్లు పుంజుకుంది. దీంతో సెన్సెక్స్ సూచీ, 17,771 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా లాభాలతో 5,342 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.
Source: Yahoo! Telugu: News | 26 Apr 2010 | 8:45 am

అమెరికాలో ఈ ఏడాది మూతపడ్డ 57 బ్యాంకులు

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా అమెరికాలో బ్యాంకులు ఇప్పటికీ దివాళా తీస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 57 బ్యాంకులు దివాళా తీసినట్లు ఫెడరల్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ సంస్థ తెలిపింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే ఇప్పటి వరకు 16 బ్యాంకులు మూతపడ్డట్టు ఆ సంస్థ పేర్కొంది
Source: Yahoo! Telugu: News | 26 Apr 2010 | 8:35 am

ఉప ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్న ధర్మపురి

తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెరాసతో పాటు భాజపా సభ్యుడు రాజీనామా చేసిన అసెంబ్లీ స్థానాలకు మరో రెండు మూడు నెలల్లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో భాగంగా తన సొంతూరైన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, తన మనస్సులోని మాటను ఆయన నేరుగా బహిరంగ పరచడం లేదు. అధిష్టానం ఆదేశిస్తే.. కార్యకర్తలు కోరుకుంటేనే పోటీ చేస్తానని చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 26 Apr 2010 | 8:03 am

పురోగమనం వైపు బాంబే స్టాక్ మార్కెట్

బాంబే స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్ 68 పాయింట్లు లాభపడింది. ఫలితంగా సెన్సెక్స్ సూచి 17,762 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 28 పాయింట్లు పుంజుకుని, 5,332 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 26 Apr 2010 | 7:42 am

నాడు హీరో.. నేడు జీరో.. ఇదీ చిరు కథ: విద్యాసాగర్

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చిత్రసీమలో ఉండగా హీరోగా వెలుగొందారని, ప్రస్తుతం జీరోగా మారారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యక్తి మాటలు పట్టించుకోవాల్సిన పని లేదన్నారు.
Source: Yahoo! Telugu: News | 26 Apr 2010 | 7:40 am

ప్రభాస్ - కాజల్ అగర్వాల్ "డార్లింగ్" ట్రెయిలర్

ప్రభాస్ కథానాయకుడిగా కరుణాకరన్ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న డార్లింగ్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదలైంది. ఇటీవల ప్రభాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నన్ను చాలా అందంగా చూపించారు. బాడీ లాంగ్వేజ్ కూడా వెరైటీగా ఉంటుందని అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...
Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2010 | 6:26 am

రీరికార్డింగ్‌లో "బ్రహ్మలోకం టు యమలోకం (వయా భూలోకం)"

రాజేంద్రప్రసాద్ బ్రహ్మగా నటిస్తోన్న "బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం" చిత్రం ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటోందని చిత్ర నిర్మాత బెక్కెమ్ వేణుగోపాల్ తెలియజేశారు. ఇంకా వేణుగోపాల్ మాట్లాడుతూ.. "సెప్టెంబరులో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు జెమినీ గ్రాఫిక్స్ బాల గ్రాఫిక్ వర్క్ చేస్తున్నారు. సోమవారం నుంచి రీరికార్డింగ్ శ్రీలేఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. మామూలు చిత్రాలకంటే సోషియోఫాంటసీ చిత్రాలకు తగినట్లుగా ఆమె రీరికార్డింగ్ ఇవ్వగలదని ఆశిస్తున్నాం. మే నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం" అని తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2010 | 6:01 am

అర్థశతదినోత్సవానికి చేరువలో శరత్, నమితల "1977"

తమిళ దర్శక నిర్మాత దినేష్ కుమార్ నిర్మించిన "1977" జరిగింది ఏమిటి? చిత్రం ఇటీవలే తెలుగులో విడుదలైంది. పక్కా మసాలా చిత్రమిది. శరత్‌కుమార్, నమిత తదితరులు నటించిన ఈ చిత్రం 70 సెంటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, దర్శకుడు దినేష్‌కుమార్ మాట్లాడుతూ.. తెలుగులో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించడం ఎంతో ఆనందంగా ఉంది. 70 సెంటర్లలలో 50 రోజుల వైపు పరుగులు తీస్తోంది. తెలుగులో ఈ చిత్రం విడుదలకావడానికి సహకరించిన మధుర ఆడియో అధినేత శ్రీధర్, విఎన్ఆర్ ఫిలింస్ డిస్ట్రిబ్యూటర్ నాగేశ్వరరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే స్ఫూర్తితో త్వరలో తెలుగులో చిత్రాన్ని తీస్తాను. ఈ చిత్రానికి తన భార్య మణిమౌళి కాస్ట్యూమ్స్ అందించారు" అని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2010 | 5:59 am

ఇ.వి.వి. సత్యనారాయణ "బురిడి" ట్రెయిలర్

ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో 23మంది కమెడియన్స్‌తో చేస్తున్న సినిమా బురిడి. ఈ చిత్రం గురించి ఇ.వి.వి మాట్లాడుతూ... అప్పుల అప్పారావు నుంచి బెండు అప్పారావు వరకూ తనను ప్రేక్షకులు ఆదరించారనీ, కామెడీ చిత్రాలు తీయాలనే ధైర్యాన్ని ప్రేక్షకులే కల్పించారని అన్నారు. ఈ చిత్రం స్క్రిప్ట్ కోసం 18 వర్షన్‌లు రాశాననీ, అంతా పక్కా అయ్యాకే సెట్‌పైకి వెళ్లానని చెప్పారు. ఇందులో ఓ పాటను 12 సెట్లు వేసి తీశామని అత్యంత ఖరీదైన సాంగ్ ఇదనీ, 10 నిమిషాలపాటు సాగే పేరడీ పాట చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...
Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2010 | 5:31 am

గుండెపోటుతో రాజస్థాన్ గవర్నర్ ప్రభారావు మృతి

రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్ ప్రభారావు సోమవారం కన్నుమూశారు. ఆమెకు గుండెపోటు రావడంతో న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య వైజ్ఞాన సంస్థలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు.
Source: జాతీయ | 26 Apr 2010 | 3:47 am

కేసీఆర్ వైఖరి తెరాస నేతలకే అంతుచిక్కడం లేదు: డీఎస్

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అనుసరిస్తున్న వైఖరితో ఆ పార్టీకి చెందిన నేతలు విసిగివేసారి పోతున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 26 Apr 2010 | 3:19 am

ఉప ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్న ధర్మపురి

తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెరాసతో పాటు భాజపా సభ్యుడు రాజీనామా చేసిన అసెంబ్లీ స్థానాలకు మరో రెండు మూడు నెలల్లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో భాగంగా తన సొంతూరైన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, తన మనస్సులోని మాటను ఆయన నేరుగా బహిరంగ పరచడం లేదు. అధిష్టానం ఆదేశిస్తే.. కార్యకర్తలు కోరుకుంటేనే పోటీ చేస్తానని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 26 Apr 2010 | 2:34 am

నాడు హీరో.. నేడు జీరో.. ఇదీ చిరు కథ: విద్యాసాగర్

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చిత్రసీమలో ఉండగా హీరోగా వెలుగొందారని, ప్రస్తుతం జీరోగా మారారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యక్తి మాటలు పట్టించుకోవాల్సిన పని లేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 Apr 2010 | 2:11 am

అమరీందర్ సింగ్‌పై బహిష్కరణ వేటు చెల్లదు: సుప్రీం

అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ప్రస్తుత అసెంబ్లీ నుంచి బహిష్కరించడం చెల్లదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఆయనను సభ నుంచి వెళ్లగొట్టడా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
Source: జాతీయ | 26 Apr 2010 | 1:39 am

సౌకర్యాల లేమితోనే ట్రిపుల్ ఐఐటీ సీట్ల తగ్గింపు: రోశయ్య

రాష్ట్రంలోని ట్రిపుల్ ఐఐటీలలో సీట్ల తగ్గింపుపై ముఖ్యమంత్రి కె.రోశయ్య వివరణ ఇచ్చారు. ప్రజాపథం పర్యటనలో భాగంగా ఆయన రెండో రోజున అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ట్రిపుల్ ఐఐటీలలో సౌకర్యాలు అరకొరగా ఉన్నాయన్నారు. వీటికి తోడు నిధుల కొరత వేధిస్తోందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 Apr 2010 | 12:58 am

ఫోన్ ట్యాపింగ్‌పై చిదంబరం ప్రకటన: శాంతించని ప్రతిపక్షాలు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సోమవారం పార్లమెంట్‌ను కుదిపేసింది. ఈ వ్యవహారంపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సభకు వచ్చి వివరణ ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ డిమాండ్ చేశారు. ఇదేతరహాలో ములాయం సింగ్‌ (ఎస్పీ)తో పాటు.. లాలూ ప్రసాద్ (ఆర్జేడీ), వామపక్షాలకు చెందిన సభ్యులు పట్టుబట్టారు.
Source: జాతీయ | 26 Apr 2010 | 12:47 am

గుజరాత్‌లో మహాత్మాగాంధీకి స్మారక మందిరం: మోడీ

జాతిపిత మహాత్మా గాంధీకి వివిధ దేశాల నుంచి తీసుకొని వచ్చే నీరు, మట్టి, ఇటుకలతో బ్రహ్మాండమైన స్మారకమందిరాన్ని నిర్మించనున్నట్టు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఆయన అహ్మదాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్మారక మందిరం నిర్మాణం కోసం ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి మట్టి, నీటిని సేకరించి, వాటితో నిర్మించనున్నట్టు చెప్పారు.
Source: జాతీయ | 26 Apr 2010 | 12:24 am

పోలవరం తర్వాత తెలంగాణ యాత్ర: ప్రరాపా కసరత్తు

బహుళార్ధసార్థక ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజారాజ్యం డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం అంతర్వేది నుంచి పోలవరం వరకు బస్సు యాత్రను నిర్వహించనుంది. ఇందులో భాగంగానే మే 5వ తేదీ నుంచి పార్టీ అధినేత చిరంజీవి నేతృత్వంలో బస్సుయాత్ర చేపట్టేందుకు రూట్‌మ్యాప్‌ను ఖరారు చేసింది.
Source: ఏపీ న్యూస్ | 26 Apr 2010 | 12:23 am

ఆధునిక రాజకీయ మూర్ఖుడు కేసీఆరే : తెదేపా నేతలు

ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో వెకిలి చేష్టలతో రాజకీయ మూర్ఖుడిగా ప్రవర్తిస్తున్న నేత తెలంగాణ రాష్ట్ర సమితి నేత కె.చంద్రశేఖర రావేనని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. ఆది నుంచి సమైక్యవాదాన్ని వినిపిస్తున్న సీపీఎంను కమ్యూనిస్టు మూర్ఖుల పార్టీగా అభివర్ణించడాన్ని వారు మండిపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 25 Apr 2010 | 10:49 pm

ఫోన్ ట్యాపింగ్‌పై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు

ఫోన్ ట్యాపింగ్ దుమారం దేశ రాజకీయ పార్టీల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి. ఈ అంశంపై పార్లమెంట్ సోమవారం అట్టుడుకి పోయింది. దీనిపై తక్షణం చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. ఐపీఎల్ కుంభకోణం నుంచి మెల్లగా తేరుకుంటున్న యూపీఏ సంకీర్ణ సర్కారుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో తలనొప్పి తెచ్చిపెట్టింది.
Source: జాతీయ | 25 Apr 2010 | 10:36 pm

నేడు భారత్‌ పర్యటనకు రానున్న ఆప్ఘన్ అధ్యక్షుడు!

ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సోమవారం నుంచి న్యూఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ విదేశాంగ మంత్రి జల్మే రసూల్ ఒక రోజు ముందుగానే భారత్‌కు చేరుకున్నారు. కర్జాయ్ భారత పర్యటనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది.
Source: జాతీయ | 25 Apr 2010 | 10:01 pm

సందేశాత్మక చిత్రంగా "గల్లీ కుర్రాళ్లు"

అంతా కొత్తవారితో "గల్లీ కుర్రాళ్లు" (దేశానికి వెన్నెముకలు) చిత్రం రూపొందుతోంది. స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై సాయివెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత సాయివెంకట్ మాట్లాడుతూ.. "జనవరి 27 నుంచి సినిమాను ప్రారంభించాం. ఇప్పటికే పూర్తయిన రెండు షెడ్యూళ్లలో రెండు పాటలను చిత్రీకరించాం. దీంతో 50 శాతం షూటింగ్ పూర్తయ్యింది. 24 నుంచి మూడో షెడ్యూల్‌ను ప్రారంభించనున్నాం. ఈ చిత్రంలో కవిత పాత్ర కీలకం. ఆమె ఒక అనాధకుర్రాడిని పెంచుకుని సైంటిస్టుగా తీర్చిదిద్దుతుంది. ముప్పైశాతం పిల్లలపై తీసిన ఈ చిత్రాన్ని వాణిజ్యాంశాలతో తీర్చిదిద్దుతున్నామన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Apr 2010 | 11:12 am

కోత తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైన యూపీఏ

ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కోత తీర్మానాన్ని ఎదుర్కోనేందుకు అధికార యూపీఏ సంకీర్ణ సర్కారు సిద్ధమైంది. ఇందుకోసం అవసరమైన చర్యలను కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. కోత తీర్మానం ప్రవేశపెట్టే రోజున తమ పార్టీకి చెందిన సభ్యులంతా విధిగా హాజరుకావాలని ఇప్పటికే విప్ జారీ చేసింది. అలాగే, సర్కారులోని మిత్రపక్షాల పార్టీలు కూడా విప్ జారీ చేయాలని కోరింది.
Source: జాతీయ | 25 Apr 2010 | 4:32 am

ఎమిరేట్స్ ఫ్లైట్‌కు తప్పిన ముప్పు: 12 మందికి గాయాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ దేశానికి చెందిన ఎమిరేట్స్ విమానానికి ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. పైలట్ చాకచక్యం వల్ల అందులో ప్రయాణిస్తున్న 361 మంది ప్రయాణికులు ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. అయితే, విమానం అత్యవసర ల్యాండింగ్ సమయంలో 12 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వారికి ప్రాథమిక పరీక్షలు చేయాల్సి వచ్చింది.
Source: జాతీయ | 25 Apr 2010 | 4:02 am

అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్ధం: ధర్మపురి శ్రీనివాస్

నిజామాబాద్ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ప్రకటించారు. పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించబోనన్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Apr 2010 | 2:40 am