|
ఎమిరేట్స్ ఫ్లైట్‌కు తప్పిన ముప్పు: 12 మందికి గాయాలుయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి చెందిన ఎమిరేట్స్ విమానానికి ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. పైలట్ చాకచక్యం వల్ల అందులో ప్రయాణిస్తున్న 361 మంది ప్రయాణికులు ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. అయితే, విమానం అత్యవసర ల్యాండింగ్ సమయంలో 12 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వారికి ప్రాథమిక పరీక్షలు చేయాల్సి వచ్చింది.Source: Yahoo! Telugu: News | 25 Apr 2010 | 9:32 am మార్చి నెలలో 27.8 టన్నుల బంగారం దిగుమతిదేశంలో బంగారం వినియోగం జోరుగా సాగుతోంది. ఓ వైపు పసిడి ధరలు భగ్గుమంటున్నా... బంగారు నగలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు అధిక ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా బంగారం దిగుమతి రికార్డు స్థాయిలో సాగుతోంది. గత మార్చి నెలలో 27.8 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది.Source: Yahoo! Telugu: News | 25 Apr 2010 | 9:21 am ముంబైలో పునఃప్రారంభమైన ఒబెరాయ్ హోటల్ముంబై దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఒబెరాయ్ హోటల్‌ను తిరిగి ప్రారంభించారు. దక్షిణ ముంబైలోని మరీనా డ్రైవ్ ప్రాంతంలోని ఈ లగ్జరీ హోటల్‌ను శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ప్రారంభించారు. గత 2008 సంవత్సరం నబంవరు 26వ తేదీన పాక్ ప్రేరేపిత లష్కర్ తోయిబా తీవ్రవాదులు చేసిన దాడిలో ఈ హోటల్ బాగా దెబ్బతిన్న విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 25 Apr 2010 | 8:31 am అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్ధం: ధర్మపురి శ్రీనివాస్నిజామాబాద్ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ప్రకటించారు. పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించబోనన్నారు.Source: Yahoo! Telugu: News | 25 Apr 2010 | 8:09 am ముఖ్యమంత్రుల్లో కెల్లా అత్యుత్తమ సీఎం: కె.రోశయ్యదేశంలోని ముఖ్యమంత్రుల్లోకెల్లా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అత్యుత్తమ సీఎం అని, ఈయన ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా ఉన్నారని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. ప్రజాపథంలో భాగంగా ఆయన ఆదివారం అనంతపురం జిల్లాలో పర్యటించారు.Source: Yahoo! Telugu: News | 25 Apr 2010 | 7:44 am కసబ్‌ను విచారించే అవకాశం కల్పించాలి: పాకిస్థాన్ముంబై దాడుల కేసులో సజీవంగా పట్టుబడిన లష్కర్ తోయిబా తీవ్రవాది అజ్మల్ కసబ్‌ను విచారించేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని పాకిస్థాన్ విజ్ఞప్తి చేసింది. ఈ అవకాశం కల్పించడం వల్ల పాకిస్థాన్‌కు చెందిన ఆరుగురు అనుమానితుల పాత్రపై దర్యాప్తు చేసేందుకు దోహదపడుతుందని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖామంత్రి రెహ్మాన్ మాలిక్ అభిప్రాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 25 Apr 2010 | 7:34 am మార్కెట్‌లోకి 'వ్యాగన్ ఆర్' సరికొత్త మోడల్ కారురాష్ట్ర మార్కెట్‌లోకి మారుతీ సుజుకి సంస్థ సరికొత్త మోడల్ కారును ప్రవేశపెట్టింది. వ్యాగన్ ఆర్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ కారుకు బ్లూ ఐడ్ బాయ్ పేరుతో ఆవిష్కరించింది. చెన్నయ్, హైదరాబాద్ మార్కెట్‌లలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. పర్యావరణానికి అనుకూలంగా ఉండే 'కె' సిరీస్ ఇంజన్‌ను కారుకు అమర్చినట్టు చెప్పారు.Source: Yahoo! Telugu: News | 25 Apr 2010 | 7:21 am కరుణాకరన్ రాజకీయ వారసురాలిగా కుమార్తె పద్మజకేరళ రాజకీయ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి కె.కరుణాకరన్ రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె పద్మజా వేణుగోపాలన్‌ను ప్రకటించారు. ఈ విషయాన్ని కరుణాకరన్ శనివారం స్వయంగా ఒక ప్రకటనలో వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 25 Apr 2010 | 7:17 am విదేశీ కరెన్సీ రేట్లువిదేశీ కరెన్సీ రేట్లు ఈ విధంగా ఉన్నాయిఅమెరికా డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) 41.90 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 46.80యూరో కరెన్సీ కొనుగోలు రేటు (థామస్ కుక్) 55.90 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 62.35జపాన్ యెన్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 44.20 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 49.25బ్రిటన్ పౌండ్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 64.65 అమ్మకపు రేటు రూ. 71.75.Source: Yahoo! Telugu: News | 25 Apr 2010 | 7:16 am నేటి బులియన్ మార్కెట్ ధరలునేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 16,840. అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 16,770గా ఉంది. కిలో వెండి ధర 28,305 రూపాయలుగా ఉంది. విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) 17,020 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,590 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 28,200 రూపాయలుగా ఉంది.చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 16,825 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర 1,565 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 28,560 రూపాయలుగా పలుకుతోంది.Source: Yahoo! Telugu: News | 25 Apr 2010 | 7:14 am ఎమిరేట్స్ ఫ్లైట్‌కు తప్పిన ముప్పు: 12 మందికి గాయాలుయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి చెందిన ఎమిరేట్స్ విమానానికి ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. పైలట్ చాకచక్యం వల్ల అందులో ప్రయాణిస్తున్న 361 మంది ప్రయాణికులు ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. అయితే, విమానం అత్యవసర ల్యాండింగ్ సమయంలో 12 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వారికి ప్రాథమిక పరీక్షలు చేయాల్సి వచ్చింది.Source: జాతీయ | 25 Apr 2010 | 4:02 am అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్ధం: ధర్మపురి శ్రీనివాస్నిజామాబాద్ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ప్రకటించారు. పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించబోనన్నారు.Source: ఏపీ న్యూస్ | 25 Apr 2010 | 2:40 am ముఖ్యమంత్రుల్లో కెల్లా అత్యుత్తమ సీఎం: కె.రోశయ్యదేశంలోని ముఖ్యమంత్రుల్లోకెల్లా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అత్యుత్తమ సీఎం అని, ఈయన ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా ఉన్నారని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. ప్రజాపథంలో భాగంగా ఆయన ఆదివారం అనంతపురం జిల్లాలో పర్యటించారు.Source: ఏపీ న్యూస్ | 25 Apr 2010 | 2:14 am కరుణాకరన్ రాజకీయ వారసురాలిగా కుమార్తె పద్మజకేరళ రాజకీయ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి కె.కరుణాకరన్ రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె పద్మజా వేణుగోపాలన్‌ను ప్రకటించారు. ఈ విషయాన్ని కరుణాకరన్ శనివారం స్వయంగా ఒక ప్రకటనలో వెల్లడించారు.Source: జాతీయ | 25 Apr 2010 | 1:47 am చిరంజీవితో కలిసి తెలంగాణ పర్యటన: లగపాడటి వెల్లడిప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చేపట్టే తెలంగాణ జిల్లాల పర్యటనలో తాను పాల్గొననున్నట్టు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. ఆయన ఆదివారం తిరుపతిలో జరిగిన సమైక్యాంధ్ర సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. చిరంజీవితో పాటు.. .తెలుగుదేశం పార్టీ నేతలు సమైక్యవాదానికి అండగా నిలవడం హర్షణీయమన్నారు.Source: ఏపీ న్యూస్ | 25 Apr 2010 | 1:27 am "కొమరం పులి"ని చూసి బెదిరిపోతున్న తెలంగాణ నేతలు!1970 సంవత్సరం నాటి విషయాలను ఓ సారి గుర్తుకు తెచ్చుకుందాం. మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడు సుప్రసిద్ధ హీరో ఎంజీఆర్ ఆ రాష్ట్ర ప్రజల ఆరాధ్యదైవం. నాటికీ.. నేటికీ.. ఆయనంటే ప్రాణాలు ఇచ్చే ప్రజలు లక్షల్లో ఉన్నారు. అయితే, అలాంటి వ్యక్తంటే గిట్టని వారు లేకపోలేదు. వారిలో అగ్రగణ్యుడు నేటి ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కరుణానిధి. 1970లో ఎంజీఆర్ చిత్రం విడుదలవుతుందంటే.. కరుణానిధి, ఆయన అనుచరులకు హడల్. ఆ చిత్ర విడుదలకు ఎలాగైనా ఆటంకం కలిగించేవారు.Source: ఏపీ న్యూస్ | 25 Apr 2010 | 1:08 am అవినీతిపై మీడియా అవగాహన కల్పించాలి: సీబీఐదేశంలో నానాటికీ పెరిగిపోతున్న అవినీతిపై పోరు చేసేందుకు మీడియా ప్రజలను చైతన్యవంతులను చేయాలని సీబీఐ డైరక్టర్ అశ్వనీ కుమార్ పిలుపునిచ్చారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లు సంయుక్తంగా నిర్వహించిన శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు.Source: జాతీయ | 24 Apr 2010 | 11:57 pm సీపీఎం అంటే కమ్యూనిస్టుల మూర్ఖుల పార్టీ: కేసీఆర్సీపీఎం అంటే కమ్యూనిస్టుల మూర్ఖుల పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు కొత్త వివరణ ఇచ్చారు. ఆ పార్టీ నేత బీవీ.రాఘవులు ఓ రాజకీయ అజ్ఞానిగా అభివర్ణించారు. అలాగే, ఆ పార్టీలోని నేతలంతా ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని దుయ్యబట్టారు.Source: ఏపీ న్యూస్ | 24 Apr 2010 | 11:43 pm ఐపీఎల్ వివాదంలోకి అనవసరంగా లాగారు: పవార్ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవహారంలోకి తనను, తన కుటుంబాన్ని అనవసరంగా లాగారని కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలోని రత్నగిరిలో శనివారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఐపీఎల్ వివాదంలో తనకు గానీ లేదా.. తన పార్టీకి చెందిన పౌర విమానయాన శాఖా మంత్రి ప్రఫుల్ పటేల్‌కు కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు.Source: జాతీయ | 24 Apr 2010 | 10:37 pm వాన పాట అయ్యింది... ఇక నెక్ట్స్ బికినేయేనా...?!హ్యాపిడేస్ చిత్రంతో ప్రేక్షకులకు ఖుషీ చేసిన తెల్లపిల్ల తమన్నా ఆవారా సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలుకరించేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ వచ్చిన తమన్నాతో మినీ ఇంటర్య్యూ...టాలీవుడ్ - కోలీవుడ్ దేనికి ప్రాధాన్యం...?నాకు రెండూ రెండు కళ్లు లాంటివి(నవ్వు)వానపాటలో తడుస్తూ నటించడం... అసలు వానపాటలో నటించనివారు హీరోయిన్‌గా ఎదగలేరుఅంటే ఖచ్చితంగా వాన పాట చేయాలనా మీ ఉద్దేశ్యం...?అవును. ఖచ్చితంగా చేయాల్సిందే. నా చిన్నప్పుడు వేటగాడు చిత్రంలో శ్రీదేవి "ఆకుచాటు పిందె తడిసె.." వాన పాట చూసి ఎంతో ఇన్‌స్పైర్ అయ్యా. నటిగా అవకాశం వచ్చింది కనుక వానలో తడిసే సాంగ్ చేశానంతే.Source: Yahoo! Telugu: Entertainment | 24 Apr 2010 | 2:46 pm మే నెలాఖరుకి "పప్పు - మిస్టర్ ఇంటెలిజెంట్"కృష్ణుడు, దీపిక, సుబ్బరాజు ముఖ్య పాత్రల్లో ఆర్సీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిర్మాత నల్ల ప్రవీణ్ రెడ్డి, నగేష్ యాదవ్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పప్పు- మిస్టర్ ఇంటెలిజెంట్. అష్టా - చమ్మా చిత్రంతో దర్శకత్వ శాఖలో చక్కని అనుభవం పొంది పప్పు చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు యంగ్ డైరెక్టర్ సపన్ పసుపర్తి. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నిర్మాతల్లో ఒకరైన నల్ల ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమకు కొత్తవారైనప్పటికీ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం. దర్శకుడు సపన్ ఆలోచనలకు తగ్గట్లు కథను అద్భుతంగా ఆవిష్కరించాం. రామోజీ ఫిలిమ్ సిటీ, వైజాగ్, అరకు, వికారాబాద్ ఫారెస్టు, హైదరాబాదులోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం.Source: Yahoo! Telugu: Entertainment | 24 Apr 2010 | 11:15 am "కొమరం పులి"ని బోను నుంచి బయటికి రానివ్వం: కోదండరాంతెలంగాణాకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్న చిరంజీవి కుటుంబానికి చెందిన సినిమాలను ఎట్టి పరిస్థితుల్లో విడుదల కానివ్వబోమని తెలంగాణా జేఏసీ కన్వీనర్ కోదండరామ్ ప్రకటించారు. దీంతో వచ్చే నెలాఖరులో విడుదల కానున్న "కొమరం పులి"పై నీలినీడలు కమ్ముకుంటున్నాయిSource: ఏపీ న్యూస్ | 24 Apr 2010 | 9:21 am అల్లరి నరేష్ "బెట్టింగ్ బంగార్రాజు" ట్రెయిలర్"బెట్టింగ్ బంగార్రాజు" అనే పేరు వినగానే ఇది పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని అర్థమవుతుంది. సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆద్యంతం నవ్వులు చిందించే ఈ చిత్రంలో అల్లరి నరేష్ నటన సూపర్బ్ అంటున్నారు. ఈ చిత్రంలో నరేష్‌తోపాటు కోట శ్రీనివాసరావు, చలపతిరావు, గిరిబాబు, జయప్రకాష్ రెడ్డి ఎల్.బి. శ్రీరాం, కృష్ణభగవాన్, రఘుబాబు, దువ్వాసి మోహన్, అమిత్ పిళ్ళా ప్రసాద్, మేల్కొటి, సన, ప్రగతి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ చూడండి.Source: Yahoo! Telugu: Entertainment | 24 Apr 2010 | 8:39 am "చిరు"ను అడ్డుకునే హక్కు తెరాసకు లేదు: లగడపాటిప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలంగాణలో పర్యటిస్తే ఆ పర్యటనను అడ్డుకునే హక్కు తెలంగాణ రాష్ట్ర సమితికి లేదని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. రాష్ట్రంలో ఎవరైనా ఏ ప్రాంతంలోనైనా పర్యటించే హక్కుందని లగడపాటి గుర్తు చేశారు.Source: ఏపీ న్యూస్ | 24 Apr 2010 | 8:14 am అల్లు అర్జున్ "వరుడు" ట్రెయిలర్ మీకోసంస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మించిన భారీ చిత్రం వరుడు విడుదలై విజయవంతంగా ప్రదర్శంపబడుతోంది. ఈ చిత్రం గురించి నిర్మాత దానయ్య మాట్లాడుతూ... అల్లు అర్జున్ పెర్‌ఫార్మెన్స్ హైలెట్‌గా గుణశేఖర్‌గారి ఎక్స్‌లెంట్ టేకింగ్‌తో వరుడు చిత్రం సక్సెస్ సాధించిదన్నారు. ఈ చిత్రంలో నటీనటులందరూ పోటీపడి నటించారన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ట్రెయిలర్ మీకోసం...Source: Yahoo! Telugu: Entertainment | 24 Apr 2010 | 8:07 am 30న ప్రేక్షకుల ముందుకు కరిష్మా కొటాక్ "గ్లామర్"'సర్దార్ చిన్నపరెడ్డి', 'రంగుల కల' వంటి చిత్రాలను నిర్మించి పి. సత్యారెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "గ్లామర్". 'శంకర్‌దాదా జిందాబాద్' ఫేమ్ కరిష్మా కొటాక్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు సత్యారెడ్డి చెప్పారు. సరైన అవగాహనలేకుండా సినీరంగంలోకి వచ్చే నూతన నటీనటులు ఎలాంటి ఒడిదుడుకులకు లోనవుతున్నారనే అంశంతో పాటు గ్లామర్, వినోదం సమపాళ్ళలో రంగరించి ఈ చిత్రాన్ని మలిచామని సత్యారెడ్డి తెలిపారు. చిత్రరంగంలోకి అడుగుపెట్టేవారికి ఈ చిత్రం డిక్షనరీలా ఉంటుందన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 24 Apr 2010 | 7:31 am మే 14న సంస్థాగత ఎన్నికలు పూర్తి: నాచియప్పన్వచ్చే నెల మే 14న సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని రిటర్నింగ్ అధికారి నాచియప్పన్ తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని నాచియప్పన్ వెల్లడించారు. ఇందులో భాగంగా.. 14న ఎన్నికలను పూర్తి చేసి, మే 15వ తేదీన గాంధీ భవన్‌లో కొత్త డీసీసీ అధ్యక్షుల సమావేశానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు నాచియప్పన్ వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 24 Apr 2010 | 6:40 am మావోలను పిలిచి కూచోబెట్టి మాట్లాడండి: లాలూమావోయిస్టులతో ప్రత్యక్ష చర్చలతోనే సమస్యకు పరిష్కార మార్గం కనుగొనే వీలుంటుందని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే మావోయిస్టులతో ప్రత్యక్ష చర్చలకు చొరవ చూపాలన్నారు.Source: జాతీయ | 24 Apr 2010 | 6:12 am తెలంగాణాకు "చిరు" వస్తే అడ్డుకుంటాం..!: మధుయాష్కీప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలంగాణలో పర్యటిస్తే అడ్డుకుంటామని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ అన్నారు. అలాగే తెలంగాణాకు వ్యతిరేకంగా పనులు చేసే ఏ నేతైనా తెలంగాణలో పర్యటించడాన్ని అనుమతించబోమని మధుయాష్కీ స్పష్టం చేశారు. అలాగే ప్రత్యేక తెలంగాణా ఇస్తే అడ్డుకోమన్న సీపీఎం.. కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి సమైక్యవాదాన్ని వినిపిస్తూ.. నివేదిక ఎందుకు సమర్పించిందని యాష్కీ ప్రశ్నించారుSource: ఏపీ న్యూస్ | 24 Apr 2010 | 6:04 am ఫోన్ ట్యాప్‌పై ప్రధాని నివేదిక సమర్పించాలి..!: బీజేపీకేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, మార్కిస్టు కమ్యూనిస్టు నేత ప్రకాష్ కారత్‌లతో పాటు పలువురు రాజకీయ నాయకుల ఫోన్ సంభాషణలను యూపీఏ ప్రభుత్వం ట్యాప్ చేసిందనే ఆరోపణలపై మన్మోహన్ సింగ్ నివేదిక దాఖలు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.Source: జాతీయ | 24 Apr 2010 | 4:51 am ఐపీఎల్‌తో దేశ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నారు: బాబుఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో దేశ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన మాట్లాడుతూ... ఐపీఎల్ క్రీడ "డబ్బు - మహిళ - నైట్ పార్టీల"న్నట్లుగా మారిపోయి దేశానికి ఎంత చెడ్డ పేరు తీసుకు రావాలో అంత చెడ్డపేరు తీసుక వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 24 Apr 2010 | 3:46 am పంచాయతీ రాజ్ ద్వారా మావోల భరతం పట్టొచ్చు..!: ప్రధానిపంచాయతీ రాజ్ సంస్థల ద్వారా మావోయిస్టుల ఆగడాలను అంతమొందించేందుకు వీలవుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. దేశానికి సవాలుగా పరిణమించిన మావోయిస్టుల దుశ్చర్యలను అదుపుచేసేందుకు పంచాయతీ రాజ్ సంస్థల కార్యకలాపాలు ఎంతగానో ఉపయోగపడుతాయని ప్రధాని వెల్లడించారు.Source: జాతీయ | 24 Apr 2010 | 3:21 am
|