|
పాక్ జైలు వద్ద ఆత్మాహుతి దాడి: పోలీసుల పరిస్థితి విషమం!పాకిస్థాన్‌లో రోజు రోజుకి ఆత్మాహుతి దాడులు పెచ్చరిల్లిపోతున్నాయి. గత శనివారం (ఏప్రిల్-17)వ తేదీన సంభవించిన ఆత్మాహుతి దాడుల్లో 38 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. శనివారం మరో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. వాయువ్య పాకిస్థాన్‌లో ఓ మోటార్ సైకిల్‌పై వచ్చిన ఓ వ్యక్తి ఈ పేలుడుకు ఒడిగట్టాడు. పాకిస్థాన్, తిమెర్గరా ప్రాంతంలోని జైలుకు సమీపంలో జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో పది మంది పోలీసులు గాయాలకు గురైనట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.Source: Yahoo! Telugu: News | 24 Apr 2010 | 9:31 am మాంద్యం నుంచి త్వరగానే బయటపడ్డాం: జి-20ప్రపంచాన్ని గడగడ వణికించిన ఆర్థిక మాంద్యం కోరల నుంచి అనుకున్నదానికంటే ముందే బయటపడ్డామని జి- 20 ఆర్థికమంత్రులు అభిప్రాయపడ్డారు. వాషింగ్టన్‌లో ఏర్పాటైన సదస్సులో ఆర్థికమాంద్యంపై మంత్రులు మాట్లాడుతూ... మాంద్యం నుంచి ప్రపంచం బయటపడినప్పటికీ నిరుద్యోగం మాత్రం ఇంకా పీడిస్తూనే ఉన్నదన్నారు.Source: Yahoo! Telugu: News | 24 Apr 2010 | 8:54 am పంచాయతీ రాజ్ ద్వారా మావోల భరతం పట్టొచ్చు..!: ప్రధానిపంచాయతీ రాజ్ సంస్థల ద్వారా మావోయిస్టుల ఆగడాలను అంతమొందించేందుకు వీలవుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. దేశానికి సవాలుగా పరిణమించిన మావోయిస్టుల దుశ్చర్యలను అదుపుచేసేందుకు పంచాయతీ రాజ్ సంస్థల కార్యకలాపాలు ఎంతగానో ఉపయోగపడుతాయని ప్రధాని వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 24 Apr 2010 | 8:50 am అల్లరి నరేష్ "బెట్టింగ్ బంగార్రాజు" ట్రెయిలర్"బెట్టింగ్ బంగార్రాజు" అనే పేరు వినగానే ఇది పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని అర్థమవుతుంది. సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆద్యంతం నవ్వులు చిందించే ఈ చిత్రంలో అల్లరి నరేష్ నటన సూపర్బ్ అంటున్నారు. ఈ చిత్రంలో నరేష్‌తోపాటు కోట శ్రీనివాసరావు, చలపతిరావు, గిరిబాబు, జయప్రకాష్ రెడ్డి ఎల్.బి. శ్రీరాం, కృష్ణభగవాన్, రఘుబాబు, దువ్వాసి మోహన్, అమిత్ పిళ్ళా ప్రసాద్, మేల్కొటి, సన, ప్రగతి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ చూడండి.Source: Yahoo! Telugu: Entertainment | 24 Apr 2010 | 8:39 am అల్లు అర్జున్ "వరుడు" ట్రెయిలర్ మీకోసంస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మించిన భారీ చిత్రం వరుడు విడుదలై విజయవంతంగా ప్రదర్శంపబడుతోంది. ఈ చిత్రం గురించి నిర్మాత దానయ్య మాట్లాడుతూ... అల్లు అర్జున్ పెర్‌ఫార్మెన్స్ హైలెట్‌గా గుణశేఖర్‌గారి ఎక్స్‌లెంట్ టేకింగ్‌తో వరుడు చిత్రం సక్సెస్ సాధించిదన్నారు. ఈ చిత్రంలో నటీనటులందరూ పోటీపడి నటించారన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ట్రెయిలర్ మీకోసం...Source: Yahoo! Telugu: Entertainment | 24 Apr 2010 | 8:07 am ఐపీఎల్‌తో దేశ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నారు: బాబుఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో దేశ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన మాట్లాడుతూ... ఐపీఎల్ క్రీడ "డబ్బు - మహిళ - నైట్ పార్టీల"న్నట్లుగా మారిపోయి దేశానికి ఎంత చెడ్డ పేరు తీసుకు రావాలో అంత చెడ్డపేరు తీసుక వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 24 Apr 2010 | 7:41 am 30న ప్రేక్షకుల ముందుకు కరిష్మా కొటాక్ "గ్లామర్"'సర్దార్ చిన్నపరెడ్డి', 'రంగుల కల' వంటి చిత్రాలను నిర్మించి పి. సత్యారెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "గ్లామర్". 'శంకర్‌దాదా జిందాబాద్' ఫేమ్ కరిష్మా కొటాక్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు సత్యారెడ్డి చెప్పారు. సరైన అవగాహనలేకుండా సినీరంగంలోకి వచ్చే నూతన నటీనటులు ఎలాంటి ఒడిదుడుకులకు లోనవుతున్నారనే అంశంతో పాటు గ్లామర్, వినోదం సమపాళ్ళలో రంగరించి ఈ చిత్రాన్ని మలిచామని సత్యారెడ్డి తెలిపారు. చిత్రరంగంలోకి అడుగుపెట్టేవారికి ఈ చిత్రం డిక్షనరీలా ఉంటుందన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 24 Apr 2010 | 7:31 am ఇద్దరు గాళ్ ఫ్రెండ్స్ నుంచి ఇద్దరు మంత్రుల కుమార్తెల దాకా...ఐపీఎల్ వివాదం శశి థరూర్ గాళ్ ఫ్రెండ్ సునంద పుష్కర్, మోడీ మాజీ ప్రియురాలు దగ్గర్నుంచీ ఇప్పుడు మరో ఇద్దరు మహిళల దగ్గరకు వచ్చి వారి చుట్టూ తిరుగుతోంది. చిత్రంగా ఈ ఇద్దరు మహిళలు కేంద్ర మంత్రివర్గంలో కీలక శాఖలకు సారథ్యం వహిస్తున్న మంత్రుల కుమార్తెలు కావడం గమనార్హం.Source: Yahoo! Telugu: News | 24 Apr 2010 | 6:58 am భారత్, ఆఫ్గన్, పాక్ దేశాలకు లష్కరేతో ప్రమాదం : అమెరికాప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తొయిబా సంస్థతో భారత్, ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ దేశాలకు ప్రమాదం పొంచివుందని అమెరికా విదేశాంగమంత్రిత్వ శాఖ ప్రతనిధి పీజే క్రౌలీ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 24 Apr 2010 | 6:26 am ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి.!ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. శనివారం విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షాల్లో 48.56 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. శనివారం ఉదయం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి బలరామయ్య ఫలితాలను విడుదల చేశారు. గ్రేడ్ ఫలితాలను మాత్రమే ప్రకటించామని, ఈ నెల 28వ తేదీన ఆయా కళాశాలల్లో విద్యార్థులు మార్కుల జాబితాను పొందవచ్చునని బలరామయ్య తెలియజేశారు.Source: Yahoo! Telugu: News | 24 Apr 2010 | 6:17 am బీహార్‌లోని హెల్త్ సెంటర్‌ను పేల్చేసిన మావోలుబీహార్లోని ముంగేర్ జిల్లాలోనున్న పాంగాల్వా గ్రామంలోని ఆరోగ్య కేంద్రంతోపాటు ఓ ట్రైనింగ్ సెంటర్‌ను మావోయిస్టులు శనివారం ఉదయం మందుపాతరలతో పేల్చేసినట్లు ఎస్‌పీ శ్రీధర్ మండల్ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 24 Apr 2010 | 6:05 am గ్రీన్ హంట్ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా మావోయిస్టుల బంద్!మావోయిస్టుల దుశ్చర్యలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. గ్రీన్‌హంట్ కార్యక్రమాన్ని వెంటనే ఆపివేయాలని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు.Source: Yahoo! Telugu: News | 24 Apr 2010 | 6:00 am విడుదలైన ఇంటర్ తొలి సంవత్సరపు పరీక్షా ఫలితాలురాష్ట్రంలో ఇంటర్ తొలి సంవత్సరపు పరీక్షా ఫలితాలను శనివారం ఉదయం 11.30 గంటలకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి బలరామయ్య విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో మొత్తం ఉత్తీర్ణతా శాతం 48.56గా నమోదైందని ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 24 Apr 2010 | 5:53 am ఐపీఎల్‌తో దేశ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నారు: బాబుఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో దేశ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన మాట్లాడుతూ... ఐపీఎల్ క్రీడ "డబ్బు - మహిళ - నైట్ పార్టీల"న్నట్లుగా మారిపోయి దేశానికి ఎంత చెడ్డ పేరు తీసుకు రావాలో అంత చెడ్డపేరు తీసుక వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 24 Apr 2010 | 3:46 am పంచాయతీ రాజ్ ద్వారా మావోల భరతం పట్టొచ్చు..!: ప్రధానిపంచాయతీ రాజ్ సంస్థల ద్వారా మావోయిస్టుల ఆగడాలను అంతమొందించేందుకు వీలవుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. దేశానికి సవాలుగా పరిణమించిన మావోయిస్టుల దుశ్చర్యలను అదుపుచేసేందుకు పంచాయతీ రాజ్ సంస్థల కార్యకలాపాలు ఎంతగానో ఉపయోగపడుతాయని ప్రధాని వెల్లడించారు.Source: జాతీయ | 24 Apr 2010 | 3:21 am 30న ప్రేక్షకుల ముందుకు కరిష్మా కొటాక్ "గ్లామర్"'సర్దార్ చిన్నపరెడ్డి', 'రంగుల కల' వంటి చిత్రాలను నిర్మించి పి. సత్యారెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "గ్లామర్". 'శంకర్‌దాదా జిందాబాద్' ఫేమ్ కరిష్మా కొటాక్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు సత్యారెడ్డి చెప్పారు. సరైన అవగాహనలేకుండా సినీరంగంలోకి వచ్చే నూతన నటీనటులు...Source: వినోదం | 24 Apr 2010 | 2:03 am ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి.!ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. శనివారం విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షాల్లో 48.56 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. శనివారం ఉదయం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి బలరామయ్య ఫలితాలను విడుదల చేశారు. గ్రేడ్ ఫలితాలను మాత్రమే ప్రకటించామని, ఈ నెల 28వ తేదీన ఆయా కళాశాలల్లో విద్యార్థులు మార్కుల జాబితాను పొందవచ్చునని బలరామయ్య తెలియజేశారు.Source: ఏపీ న్యూస్ | 24 Apr 2010 | 12:48 am బీహార్‌లోని హెల్త్ సెంటర్‌ను పేల్చేసిన మావోలుబీహార్లోని ముంగేర్ జిల్లాలోనున్న పాంగాల్వా గ్రామంలోని ఆరోగ్య కేంద్రంతోపాటు ఓ ట్రైనింగ్ సెంటర్‌ను మావోయిస్టులు శనివారం ఉదయం మందుపాతరలతో పేల్చేసినట్లు ఎస్‌పీ శ్రీధర్ మండల్ తెలిపారు.Source: జాతీయ | 24 Apr 2010 | 12:36 am గ్రీన్ హంట్ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా మావోయిస్టుల బంద్!మావోయిస్టుల దుశ్చర్యలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. గ్రీన్‌హంట్ కార్యక్రమాన్ని వెంటనే ఆపివేయాలని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 24 Apr 2010 | 12:31 am కేతన్ దేశాయ్ గృహంలో రూ.212 కోట్లు స్వాధీనం..!పంజాబ్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కళాశాలకు అనుమతి ఇచ్చేందుకు రెండు కోట్ల రూపాయల లంచం పుచ్చుకుంటూ సీబీఐకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన భారత వైద్య విధాన మండలి ఛైర్మన్ కేతన్ దేశాయ్ గృహంలో రూ.212 కోట్ల నగదును కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సీబీఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.Source: జాతీయ | 23 Apr 2010 | 11:38 pm తెదేపా, వామపక్షాల "సైకిల్ యాత్ర"ను అడ్డుకున్న పోలీసులు!తెలుగుదేశం, వామపక్షాలు చేపట్టిన సైకిల్ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ధరల పెరుగుదలపై ప్రజల్లో చైతన్యం కలిగించే దిశగా తెదేపా, వామపక్షాలు సంయుక్తంగా తలపెట్టిన సైకిల్ యాత్రకు పోలీసులు బ్రేక్ వేశారు. ఈ యాత్రలో తెలుగేదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు వామపక్ష పార్టీకి చెందిన అగ్ర నాయకులు పాల్గొన్నారు.Source: ఏపీ న్యూస్ | 23 Apr 2010 | 11:23 pm విదేశాలకు ఫోన్ చేసిన రాజీవ్ హంతకురాలు నళిని!!రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నళినికి సంబంధించి నిర్ఘాంతపరిచే నిజాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తొలుత ఆమెవద్ద సెల్‌ఫోన్ ఉన్నట్లు జైలు అధికారులు కనుగొన్నారు. దీంతో ఆ సెల్‌ఫోన్‌ను అధికార వర్గాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. జైలులోనే ఉన్న నళిని, సెల్‌ఫోన్ ద్వారా విదేశాలకు ఫోన్ చేసినట్లు నిఘా విభాగం నిర్థారించింది.Source: జాతీయ | 23 Apr 2010 | 10:58 pm చిక్కడపల్లి వంటనూనె కర్మాగారంలో అగ్నిప్రమాదం!హైదరాబాద్, చిక్కడపల్లి విజయ వంటనూనె కర్మాగారంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నూనె కర్మాగారంలో ఉన్నట్టుండి మంటలు వ్యాపించడంతో భారీ ఆస్తి నష్టం జరిగిందని కర్మాగార యజమానులు వాపోతున్నారు. శనివారం జరిగిన ఈ భారీ అగ్నిప్రమాదంలో సుమారు రూ.30లక్షల వంటనూనె అగ్నికి ఆహుతి అయ్యిందని పోలీసులు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 23 Apr 2010 | 10:58 pm వంటా వార్పూ పుస్తకాన్ని..."ఎప్పుడు చూసినా ఆ వంటా వార్పూ పుస్తకాన్ని ముందేసుకుని చదువుతున్నావ్... ఏంట్రా సంగతి?" అడిగాడు సంతోష్"ఓస్ అదా... వంటలొచ్చిన మగాళ్లకయితే, అరవైవేల కట్నాన్ని అదనంగా...Source: వినోదం | 23 Apr 2010 | 10:42 pm పావుకిలో హల్వా పార్శిల్ చేయమంటే...?"పావుకిలో హల్వా పార్శిల్ చేయమంటే... ఐదువందల రూపాయలకు బిల్లు వేశావేమిటి...?" కోపంగా అడిగాడు గిరీశం "త్రాసులోంచి హల్వా రాలేదు సార్...! కాబట్టి త్రాసును కూడా కలిపి...Source: వినోదం | 23 Apr 2010 | 10:38 pm అగ్రనేతల ఫోన్లను ట్యాప్ చేసిన యూపీఏ ప్రభుత్వం!ఐపీఎల్ కమీషనర్ లలిత్ కుమార్ మోడీతో కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ జరిపిన ఫోన్ సంభాషణలను యూపీఏ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఢిల్లీకి చెందిన మ్యాగజైన్ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది.Source: జాతీయ | 23 Apr 2010 | 10:04 pm కేంద్ర మంత్రి వర్గంలో వైఎస్.జగన్‌కు స్థానం ఖాయం!?వైఎస్.జగన్మోహన్ రెడ్డికి కేంద్ర కేబినెట్‌లో సహాయ మంత్రి పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది. వచ్చే మే నెలలో చేపట్టే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు కల్పించాలని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలు కృతనిశ్చయంతో ఉన్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.Source: ఏపీ న్యూస్ | 23 Apr 2010 | 11:07 am ఒట్టు... అర్థ భాగం అబద్ధం "డార్లింగ్"మాస్ చిత్రాలు ప్రభాస్‌కు "డార్లింగ్" క్లాస్ తరహా మూవీ. ఎక్కువ కష్టపడకుండా స్ట్రెయిటిష్‌గా లాగించేశాడు. భిల్లా ఒక రకమైన క్లాస్ అయితే ప్రేమలో క్లాస్ ఎలా ఉంటుందో డార్లింగ్‌లో చూపాడు. మొదటి భాగం ప్రభాస్ కల్పిత కథతో ఇంటర్‌వెల్ పడుతుంది. రెండో భాగం ఆ కల్పితం నిజమయితే ఎలా ఉంటుంది..? అనేది కొన్ని ట్విస్టులతో కరుణాకరన్ చూపాడు.కథ ప్రారంభం... 1980లో బ్లాక్ అండ్ వైట్ ఎపిసోడ్.. అందులో ప్రభు, చంద్రమోహన్, ధర్మవరపు, ఆహుతి ప్రసాద్, ఎం.ఎస్.నారాయణ ఒకే కాలేజీలో స్నేహితులు. ఫేర్వెల్ అయ్యాక మళ్లీ కలుసుకోలేమని బాధపడుతూ విడిపోతారు. ఎవరెంత పొజిషన్లో ఉన్నా అంతా ఒక్కసారి కలవాలనేది వారి ఒప్పందం. అప్పుడే ఆహుతి ప్రసాద్ కుమార్తె నందిని( కాజల్ అగర్వాల్), ప్రభు కొడుకు ప్రభాస్( ప్రభాస్) డాన్స్ మెచ్చుకుని అతనికి ఫ్యాన్ అవుతుంది.Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2010 | 10:59 am చిరూ... తెలంగాణాలో అడుగుపెట్టి చూడు: కోదండరామ్ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చేసిన సవాల్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి అధికార ప్రతినిధి, తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ఆచార్య కోదండరామ్ తీవ్రంగా మండిపడ్డారు. చిరంజీవి ఒంటరిగా లేదా ఆయన అనుచరులతో కలిసి తెలంగాణ జిల్లాల్లో స్వేచ్ఛగా పర్యటించలేరని, ఒకవేళ వస్తే తెలంగాణా ప్రజలు తగిన బుద్ధి చెపుతారని హెచ్చరించారు.Source: ఏపీ న్యూస్ | 23 Apr 2010 | 10:57 am హైదరాబాద్‌పైనే తెలంగాణ పీటముడి: రవీందర్ కౌర్హైదరాబాద్ సమస్యకు పరిష్కార మార్గం కనుగొంటే తెలంగాణ పీటముడి వీడిపోతుందని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యురాలైన ప్రొఫెసర్ రవీందర్ కౌర్ ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఇదే విషయాన్ని కమిటీ ఛైర్మన్ జస్టీస్ శ్రీకృష్ణకు వెల్లడించినట్టు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 23 Apr 2010 | 10:55 am పేడలో పడ్డ సోనం కపూర్: జిల్లాయిలే.. జీడిపప్పులే..!!బాలీవుడ్ తార సోనంకపూర్ హీరో ఇమ్రాన్ జంటగా ఓ బాలీవుడ్ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో సోనం ఓ లవ్ సాంగ్ పాడుతూ, తన శరీరాన్నంతటినీ వయ్యారంగా హీరో చేతుల్లో పెట్టి పరవశించిపోయే సన్నివేశం ఒకటి తీయాల్సి ఉంది. ఎంతకీ సీన్ తను అనుకున్నట్లు రాకపోవడంతో దర్శకుడు ఇద్దరిపై కోపాన్ని ప్రదర్శించాడు. సోనంనైతే... ఏమ్మా... వాటేసుకుని సుతారంగా వెనక్కి ఒరగటం చేతకాదా... అని గదమాయించి, రెడీ... 1... 2.. 3.. యాక్షన్... అన్నాడట. అంతే హీరోహీరోయిన్లిద్దరూ ఒకరికొకరు వాటేసుకున్నారు. ఆ తర్వాత హీరో కౌగిలి నుంచి హీరోయిన్ సోనం మెల్లిగా వెనక్కి ఒంగుతూ ఒక దశలో ఆగిపోయింది. అయితే దర్శకుడు ఆమెను చూసి, "ఇంకా వంగాలమ్మా..." అన్నాడట.. దాంతో హీరోయిన్ తన శరీరాన్ని మరికాస్త వెనక్కి వంచిందట... దర్శకుడు.. ఇంకాస్తా.. ఇంకాస్తా... ఇంకాస్తా.. అంటూ ఆమె వెన్ను విల్లులా వెనక్కి వంగేవరకూ అంటూనే ఉన్నాడట. హీరోయిన్ అంతగా వంగేసరికి ఆమె బరువును ఆపలేని హీరో తన చేతులను వదలిపెట్టేశాడట. అంతే... అమ్మడు ధబేల్‌మని కింద పడిపోయిందట.Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2010 | 9:36 am ప్లీజ్ మేగన్... సెక్స్ టేప్‌లో నటించవూ: అభిమానిహాలీవుడ్ నటీమణులపై అభిమానుల అభిమానం హద్దులు మీరుతోంది. తమ కలల రాణి అని ముద్దులు గబుక్కున సదరు నటీమణుల పెదవులను అందుకునే కుర్రకారు కొందరైతే... తమ కెరీర్ ఎదుగుదలకూ ఆయా నటీమణులను సహకరించమని కోరే అభిమానులు మరికొందరు.ఇందుకు ఉదాహరణగా హాలీవుడ్ నటీమణి మేగన్ ఫాక్స్ ఉందంతాన్ని చెప్పుకోవచ్చు. మేగన్ అభిమానుల్లో ఒకరు తను తీసే సెక్స్ వీడియో టేప్‌లో నటించాలని కోరాడు. పైపెచ్చు అది తన కెరీర్ ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుందని బతిమాలాడటం గమనార్హం. ఇటీవల మేగన్ ఫాక్స్ నిర్వహించిన కామికన్ కన్వెన్షన్‌లో అభిమానుల ప్రశ్నలు - సమాధానాలు కార్యక్రమంలో సదరు అభిమాని మేగన్‌ను పూర్తి నగ్నంగా తన వీడియో షూట్‌లో నటించాలని కోరాడు. తనవద్ద సోనీ వీడియో కెమేరా ఉన్నదనీ, దానికి నగ్న శరీరాలు ఉన్నవిఉన్నట్లుగా తీయగల సామర్థ్యం ఉన్నదనీ చెప్పాడు. తన విన్నపాన్ని అంగీకరిస్తే సెక్స్ వీడియో టేప్ తీసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2010 | 6:54 am నేడు అమృతవర్షిణి ఎస్. జానకి పుట్టిన రోజుకోకిల స్వరంతో దక్షిణాది శ్రోతలను ఆకట్టుకున్న లెజండ్రీ నేపథ్య గాయని ఎస్.జానకి. తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలతో పాటు అనేక భారతీయ భాషలలో తన కమ్మని స్వరంతో గేయాలను ఆలపించిన ఎస్. జానకికి నేడే పుట్టిన రోజు. గాయనిగా, సంగీత దర్శకురాలిగా 30వేల పాటలకు పైగా ఆలపించి సరికొత్త రికార్డు సృష్టించారు. శ్రీకృష్ణుడు, సాయిబాబా భక్తులారైన జానకి.. మీరాపై అనేక భక్తిగీతాల క్యాసెట్లను విడుదల చేసింది. అలనాటి గాయకుడు ఘంటసాల పాటలకు గాయనిగా స్వరాన్నిచ్చి.. నేటి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వరకు మధురమైన స్వరంతో సంగీత సముద్రంలో కడిగిన ముత్యంలా మెరుస్తున్న జానకి.. గుంటూరు జిల్లాల్లో పుట్టారు. గాయనిగా పేరుగాంచిన జానకి వి. రామ్‌ప్రసాద్‌ను వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. ఈమెకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. ఆరు జాతీయ అవార్డులు, వివిధ రాష్ట్రాలకు చెందిన 25కి మించిన అవార్డులను జానకి సొంతం చేసుకున్నారు. అరుదైన స్వరంతో సంగీత అభిమానుల మదిలో నాటుకుపోయిన ఎస్. జానకి జన్మదినం సందర్భంగా ఆమె పర్సనల్ టచ్ మీ కోసం.. పూర్తి పేరు.. ఎస్. జానకి,జన్మస్థలం: గుంటూరు, ఆంధ్రప్రదేశ్.Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2010 | 5:33 am అస్సోంలో భారీ వరదలు: వంద గ్రామాలు మునకఈశాన్య రాష్ట్రమైన అస్సోంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. ఫలితంగా లక్ష మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వంద గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. లఖిమ్‌పూర్ జిల్లా పూర్తిగా వరద నీటిలో చిక్కుకుని పోయినట్టు అధికారులు శక్రవారం వెల్లడించారు. గురువారం రాత్రికి రాత్రి వచ్చిన వరద నీటి కారణంగా యాభై గ్రామాలను మునిగి పోయాయని, పరిస్థితి విషమంగా ఉందని జిల్లా అధికారులు వెల్లడించారు.Source: జాతీయ | 23 Apr 2010 | 5:33 am 30న వస్తోన్న తెలంగాణ బతుకు చిత్రం "ధూం ధాం"డైలీ ఫోర్ షోస్ పతాకంపై శివానంద్ యాలాల దర్శకత్వంలో జోగన్నగారి అరుణారెడ్డి సమర్పణలో వై.వి.వి.మను నిర్మించిన తెలంగాణ బతుకు చిత్రం "ధూం ధాం" ఆడియో సక్సెస్ మీట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ కోదండరామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. వర్తమాన తెలంగాణ పోరాటం ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలంగాణ ప్రజలతో పాటు ఆంధ్ర ప్రజలు, సినిమా పరిశ్రమ ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ పోరాట కథాంశంతో చిత్రాన్ని రూపొందించిన దర్శక నిర్మాతలను కోదండరామ్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ నెల 30 ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2010 | 4:38 am విద్యార్థులకు అన్యాయం చేస్తున్న సర్కారు: జయప్రకాష్రాష్ట్రంలోని రోశయ్య సర్కారు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థి లోకం తీవ్రంగా నష్టపోతోందని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. వృధా ఖర్చుల పేరుతో ట్రిపుల్ ఐఐటీ సీట్లలో ప్రభుత్వం కోత విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ రోశయ్య సర్కారు అనాలోచిత చర్యలకు పూనుకుంటుందన్నారు.Source: ఏపీ న్యూస్ | 23 Apr 2010 | 4:28 am రాష్ట్రంలో ముగిసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటి పర్యటనజస్టీస్ శ్రీకృష్ణ కమిటీ పర్యటన రాష్ట్రంలో ముగిసింది. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో బస చేసిన ఈ కమిటీ వివిధ పార్టీల అభిప్రాయాలను సేకరించిన విషయం తెల్సిందే. తొలి రోజున ప్రజారాజ్యం పార్టీ, సీపీఐ పార్టీ నేతలు వినిపించిన వాదనలు ఆలకించింది. రెండో రోజున సమైక్య వాదాన్ని వినిపిస్తున్న సీపీఎం పార్టీ అభిప్రాయాన్ని తెలుసుకుంది.Source: ఏపీ న్యూస్ | 23 Apr 2010 | 4:20 am పెరిగిన దాడులు-రైల్వేకు రు.500 కోట్లు నష్టం: మమతాదేశ వ్యాప్తంగా గత యేడాది నక్సల్ దాడులు రెట్టింపయ్యాయని కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ అన్నారు. దీని వల్ల రైల్వే శాఖకు 500 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్టు ఆమె శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. మావోయిస్టులకు రైల్వే ఆస్తులు లక్ష్యంగా మారాయన్నారు.Source: జాతీయ | 23 Apr 2010 | 3:10 am
|