ప్రజారాజ్యమే మా కొంప ముంచింది: మురళీమోహన్

రాష్ట్ర రాజకీయాల్లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీసిందని సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత కె.మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రరాపాయే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 23 Apr 2010 | 9:20 am

పురోగమనం వైపు స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ వృద్ధి

శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ పురోగమనం దిశగా ర్యాలీని కొనసాగిస్తోంది. విప్రో నికరలాభం పెరగడంతో లాభాలను ఆర్జిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో లాభాలతో 17,620 మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా వృద్ధితో 5,280 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 23 Apr 2010 | 9:08 am

ప్రపంచ జనాధారణ నేతలుగా దలైలామా-ఒబామా

ప్రపంచంలో అత్యంత జనాధారణ కలిగిన నేతలుగా ఆధ్యాత్మిక గురువు దలైలామా, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలు ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేను ఆరు దేశాల్లో నిర్వహించగా, ఫలితాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. గత నవంబరు కంటే.. ఒక శాతం అధికంగా ఓట్లు పొందిన ఒబామా 77 శాతంతో అగ్రస్థానంలో ఉన్నారు.
Source: Yahoo! Telugu: News | 23 Apr 2010 | 9:07 am

నక్సల్స్ కారణంగా నిరుడు రైల్వేలకు కోట్లలో నష్టం: మమత

గత సంవత్సరం(2009)లో నక్సలైట్లు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడంతో దాదాపు రూ. 500 కోట్ల మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందని కేంద్ర రైల్వే శాఖామంత్రి మమత బెనర్జీ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 23 Apr 2010 | 8:51 am

లాభాల్లో కొనసాగుతున్న బాంబే స్టాక్ మార్కెట్

వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 59 పాయింట్లు లాభపడింది. దీంతో సెన్సెక్స్ సూచీ 17,633 మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 14 పాయింట్లు వృద్ధి చెంది, 5,284 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 23 Apr 2010 | 8:46 am

పెరిగిన దాడులు-రైల్వేకు రు.500 కోట్లు నష్టం: మమతా

దేశ వ్యాప్తంగా గత యేడాది నక్సల్ దాడులు రెట్టింపయ్యాయని కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ అన్నారు. దీని వల్ల రైల్వే శాఖకు 500 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్టు ఆమె శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. మావోయిస్టులకు రైల్వే ఆస్తులు లక్ష్యంగా మారాయన్నారు.
Source: Yahoo! Telugu: News | 23 Apr 2010 | 8:40 am

"సత్యం" రాజు కేసు విచారణను వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

సత్యం కంప్యూటర్స్ మాజీ వ్యవస్థాపకుడు రామలింగరాజు కేసును నాంపల్లి కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 23 Apr 2010 | 8:27 am

చైనాతో మానవహక్కులపై మాట్లాడుతాం: అమెరికా

దాదాపు రెండేళ్ల తర్వాత చైనా - అమెరికాల మధ్య మానవ హక్కులకు సంబంధించిన అంశంపై చర్చలు జరుగనున్నాయి. మే నెలలో జరుగనున్న ఈ చర్చల్లో టిబెట్‌ సమస్యతో పాటు చైనాలో ఇంటర్నెట్ స్వేచ్ఛ తదితర అంశాలపై ఇరు దేశాలు చర్చించుకుంటాయని అమెరికా పరిపాలనా కార్యాలయానికి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 23 Apr 2010 | 8:19 am

విదేశీ మార్కెట్ల ప్రభావం: లాభాల్లో సెన్సెక్స్

వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జించింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 93 పాయింట్లు పుంజుకుని, 17,667 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 20 పాయింట్లు బలపడి, 5,290 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 23 Apr 2010 | 7:59 am

ఐపీఎల్ నిగ్గు తేల్చేందుకు కమిటీనా...? ఆలోచిస్తాం: ప్రణబ్

ఐపీఎల్ క్రీడలో కోట్లకొద్దీ నల్లధనం ప్రవహించిందనీ, ఈ క్రీడలో చోటుచేసుకున్న అవకతవకలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం తక్షణం జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని విపక్షాల ప్రతిపాదించాయి. ప్రతిపక్షాల విన్నపాన్ని కేంద్రం ప్రభుత్వం తోసిపుచ్చలేదు.
Source: Yahoo! Telugu: News | 23 Apr 2010 | 7:38 am

ప్లీజ్ మేగన్... సెక్స్ టేప్‌లో నటించవూ: అభిమాని

హాలీవుడ్ నటీమణులపై అభిమానుల అభిమానం హద్దులు మీరుతోంది. తమ కలల రాణి అని ముద్దులు గబుక్కున సదరు నటీమణుల పెదవులను అందుకునే కుర్రకారు కొందరైతే... తమ కెరీర్ ఎదుగుదలకూ ఆయా నటీమణులను సహకరించమని కోరే అభిమానులు మరికొందరు.ఇందుకు ఉదాహరణగా హాలీవుడ్ నటీమణి మేగన్ ఫాక్స్ ఉందంతాన్ని చెప్పుకోవచ్చు. మేగన్ అభిమానుల్లో ఒకరు తను తీసే సెక్స్ వీడియో టేప్‌లో నటించాలని కోరాడు. పైపెచ్చు అది తన కెరీర్ ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుందని బతిమాలాడటం గమనార్హం. ఇటీవల మేగన్ ఫాక్స్ నిర్వహించిన కామికన్ కన్వెన్షన్‌లో అభిమానుల ప్రశ్నలు - సమాధానాలు కార్యక్రమంలో సదరు అభిమాని మేగన్‌ను పూర్తి నగ్నంగా తన వీడియో షూట్‌లో నటించాలని కోరాడు. తనవద్ద సోనీ వీడియో కెమేరా ఉన్నదనీ, దానికి నగ్న శరీరాలు ఉన్నవిఉన్నట్లుగా తీయగల సామర్థ్యం ఉన్నదనీ చెప్పాడు. తన విన్నపాన్ని అంగీకరిస్తే సెక్స్ వీడియో టేప్ తీసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2010 | 6:54 am

నేడు అమృతవర్షిణి ఎస్. జానకి పుట్టిన రోజు

కోకిల స్వరంతో దక్షిణాది శ్రోతలను ఆకట్టుకున్న లెజండ్రీ నేపథ్య గాయని ఎస్.జానకి. తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలతో పాటు అనేక భారతీయ భాషలలో తన కమ్మని స్వరంతో గేయాలను ఆలపించిన ఎస్. జానకికి నేడే పుట్టిన రోజు. గాయనిగా, సంగీత దర్శకురాలిగా 30వేల పాటలకు పైగా ఆలపించి సరికొత్త రికార్డు సృష్టించారు. శ్రీకృష్ణుడు, సాయిబాబా భక్తులారైన జానకి.. మీరాపై అనేక భక్తిగీతాల క్యాసెట్లను విడుదల చేసింది. అలనాటి గాయకుడు ఘంటసాల పాటలకు గాయనిగా స్వరాన్నిచ్చి.. నేటి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వరకు మధురమైన స్వరంతో సంగీత సముద్రంలో కడిగిన ముత్యంలా మెరుస్తున్న జానకి.. గుంటూరు జిల్లాల్లో పుట్టారు. గాయనిగా పేరుగాంచిన జానకి వి. రామ్‌ప్రసాద్‌ను వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. ఈమెకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. ఆరు జాతీయ అవార్డులు, వివిధ రాష్ట్రాలకు చెందిన 25కి మించిన అవార్డులను జానకి సొంతం చేసుకున్నారు. అరుదైన స్వరంతో సంగీత అభిమానుల మదిలో నాటుకుపోయిన ఎస్. జానకి జన్మదినం సందర్భంగా ఆమె పర్సనల్ టచ్ మీ కోసం.. పూర్తి పేరు.. ఎస్. జానకి,జన్మస్థలం: గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2010 | 5:33 am

30న వస్తోన్న తెలంగాణ బతుకు చిత్రం "ధూం ధాం"

డైలీ ఫోర్ షోస్ పతాకంపై శివానంద్ యాలాల దర్శకత్వంలో జోగన్నగారి అరుణారెడ్డి సమర్పణలో వై.వి.వి.మను నిర్మించిన తెలంగాణ బతుకు చిత్రం "ధూం ధాం" ఆడియో సక్సెస్ మీట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ కోదండరామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. వర్తమాన తెలంగాణ పోరాటం ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలంగాణ ప్రజలతో పాటు ఆంధ్ర ప్రజలు, సినిమా పరిశ్రమ ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ పోరాట కథాంశంతో చిత్రాన్ని రూపొందించిన దర్శక నిర్మాతలను కోదండరామ్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ నెల 30 ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2010 | 4:38 am

ప్రజారాజ్యమే మా కొంప ముంచింది: మురళీమోహన్

రాష్ట్ర రాజకీయాల్లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీసిందని సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత కె.మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రరాపాయే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 23 Apr 2010 | 3:51 am

పెరిగిన దాడులు-రైల్వేకు రు.500 కోట్లు నష్టం: మమతా

దేశ వ్యాప్తంగా గత యేడాది నక్సల్ దాడులు రెట్టింపయ్యాయని కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ అన్నారు. దీని వల్ల రైల్వే శాఖకు 500 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్టు ఆమె శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. మావోయిస్టులకు రైల్వే ఆస్తులు లక్ష్యంగా మారాయన్నారు.
Source: జాతీయ | 23 Apr 2010 | 3:10 am

ఐపీఎల్ నిగ్గు తేల్చేందుకు కమిటీనా...? ఆలోచిస్తాం: ప్రణబ్

ఐపీఎల్ క్రీడలో కోట్లకొద్దీ నల్లధనం ప్రవహించిందనీ, ఈ క్రీడలో చోటుచేసుకున్న అవకతవకలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం తక్షణం జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని విపక్షాల ప్రతిపాదించాయి. ప్రతిపక్షాల విన్నపాన్ని కేంద్రం ప్రభుత్వం తోసిపుచ్చలేదు.
Source: జాతీయ | 23 Apr 2010 | 2:09 am

శ్రీకృష్ణ కమిటీకి సమైక్య వాదాన్ని వినిపించిన సీపీఎం!

ప్రత్యేక తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీ కృష్ణ కమిటీకి సీపీఎం బృందం నివేదికను సమర్పించింది. తెలంగాణ ఏర్పాటు విషయంలో రాష్ట్రంలోని పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీతో శుక్రవారం ఉదయం సీపీఎం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు తెలంగాణ వద్దంటూ.. సమైక్యవాదాన్ని వినిపించారు.
Source: ఏపీ న్యూస్ | 23 Apr 2010 | 1:15 am

భారత వైద్య విధాన మండలి ఛైర్మన్ దేశాయ్ అరెస్టు

భారత వైద్య విధాన మండలి ఛైర్మన్ కేతన్ దేశాయ్‌ను కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సీబీఐ) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. పంజాబ్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కళాశాలకు అనుమతి ఇచ్చేందుకు రెండు కోట్ల రూపాయల లంచం పుచ్చుకుంటూ సీబీఐకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఫలితంగా కేతన్ దేశాయ్‌తో పాటు.. మరో ఇద్దరు అనుచరులను కూడా అరెస్టు చేశారు.
Source: జాతీయ | 22 Apr 2010 | 11:51 pm

చైనా డ్యామ్ నిర్మాణం వల్ల మనకు నష్టం లేదు: కృష్ణ

త్సంగ్‌పో నదిపై చైనా నిర్మిస్తున్న డ్యామ్ వల్ల మనకు వచ్చిన ముప్పేమీ లేదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ఎం.కృష్ణ స్పష్టం చేశారు. ఈ డ్యామ్‌ను విద్యుత్ ఉత్పత్తి కోసమే చైనా నిర్మిస్తోందని ఆయన లోక్‌సభలో వివరించారు. అయితే, దీనిపై కేంద్రం స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
Source: జాతీయ | 22 Apr 2010 | 11:23 pm

శ్రీకృష్ణ కమిటీపై మైనారిటీ అస్త్రాన్ని ప్రయోగించిన ప్రరాపా

రాష్ట్ర పరిస్థితులపై సంప్రదింపులు జరిపేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెల్సిదే. ఈ కమిటీ రాజధాని హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో బసచేసి వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరిస్తోంది. గురువారం ప్రజారాజ్యం, సీపీఐ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంది.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2010 | 11:22 pm

ఉప ఎన్నికలు: నిజామాబాద్ స్థానం అభ్యర్థిగా ధర్మపురి

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పది మంది సభ్యుల రాజీనామాలతో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది. ప్రధానంగా నిజామాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌ను బరిలోకి దించాలని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2010 | 10:58 pm

కేంద్ర మంత్రి వర్గంలో వైఎస్‌.జగన్‌కు స్థానం ఖాయం!?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి కేంద్ర కేబినెట్‌లో సహాయ మంత్రి పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది. వచ్చే మే నెలలో చేపట్టే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు కల్పించాలని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలు కృతనిశ్చయంతో ఉన్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. అలాగే, మంత్రివర్గం నుంచి పలువురికి ఉద్వాసన తప్పేలా కనిపించడం లేదు.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2010 | 10:46 pm

మే 9వ తేదీన పీఎస్‌ఎల్వీ సి-14 రాకెట్ ప్రయోగం: ఇస్రో

పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ సీ - 14 రాకెట్ ప్రయోగం మే తొమ్మిదో తేదీన జరుగనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ థావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం షార్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఏర్పాట్లు చేస్తోంది. షార్‌ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్వీ సి 14 రాకెట్‌ను రోదశీలోకి పంపనున్నారు.
Source: జాతీయ | 22 Apr 2010 | 10:06 pm

అన్ని సమస్యలకు పరిష్కారం మార్గం చర్చలే: నిరుపమా

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గమని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిరుపమారావు వెల్లడించారు. ఈ చర్చలు కేవలం సమస్యల పరిష్కారం కోసమే కాకుండా.. ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనేందుకు దోహదపడుతుందన్నారు.
Source: జాతీయ | 22 Apr 2010 | 9:53 pm

పైసా పుచ్చుకోని "ఏం పిల్లో... ఏం పిల్లడో" హీరోయిన్

ఈమధ్య హీరోయిన్లకోసం దర్శకులు ఇతర రాష్ట్రాలలో వేట సాగించడం తెలిసిందే. తాజాగా పోకూరి బాబూరావు నిర్మిస్తున్న "ఏం పిల్లో ఏం పిల్లడో" చిత్ర హీరోయిన్ ప్రణీతను ఢిల్లీ నుంచి తీసుకువచ్చారు. ఈమె అచ్చు నయనతారలా ఉంటుందని అందరూ అంటున్నారు. అయితే చిత్రం రన్నింగ్‌లో ఉండగానే ఆమెకు పలు ఆఫర్లు రావడంపై ఆనందం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు తన రెమ్యునరేషన్ బాబూరావుగారు చూసుకుంటారని మరీ చెపుతోందట. దీంతో ఆమె పారితోషికం ఎంతనే విషయాన్ని పోకూరి బాబూరావు డిసైడ్ చేస్తున్నాడట. తన సినిమాకు ఆమెకు డబ్బులు ఇంకా ఇవ్వలేదని చెపుతున్న పోకూరి బాబూరావు ఆమె డేట్స్‌ను చూసే వ్యక్తిగా మారిపోయాడు. గతంలో ఇలియానాకు దేవదాసు దర్శకుడు చౌదరి కూడా ఇలాగే చేశాడు. సినిమా ఛాన్సులిస్తూ వారితో బిజినెస్ చేయడమంటే ఇదేనని పలువురు అంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Apr 2010 | 11:06 am

హిమాచల్‌ప్రదేశ్ నుంచి బెంగళూరుకు నిత్యానంద

సెక్స్ స్కాండల్‌లో చిక్కుకుని తప్పించుక తిరుగుతూ హిమాచల్‌ప్రదేశ్‌లో పట్టుబడ్డ నిత్యానంద స్వామితో సహా నలుగురు అనుచరులను బెంగళూరుకు తీసుక వచ్చారు. అనంతరం నిత్యానందను బెంగళూరులోని రామనగరం సెషన్స్ కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
Source: జాతీయ | 22 Apr 2010 | 9:58 am

పదవి పోగొట్టుకున్నా మోడీతో చిట్‌చాట్ చేస్తున్న థరూర్

ట్విట్టర్ మంత్రిగా ప్రసిద్ధికెక్కిన ప్రముఖ కేంద్ర మాజీ విదేశాంగశాఖ సహాయమంత్రి శశి థరూర్ తన మంత్రి పదవిని త్యాగం చేసినా అతని బద్ధ విరోధి అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కమీషనర్ లలిత్ మోడీతో సామాజిక నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ ద్వారా మంతనాలు సాగిస్తూనే ఉన్నారు.
Source: జాతీయ | 22 Apr 2010 | 7:35 am

వేర్పాటు వాదుల వాదనలన్నీ కాకి కథలు: చిరంజీవి

రాష్ట్ర విభజన అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితితో సహా వేర్పాటు వాదులు చెపుతున్న లెక్కలన్నీ కాకి కథలేనని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. ప్రరాపాకు చెందిన 22 మంది సభ్యుల బృందం గురువారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో జస్టీస్ శ్రీకృష్ణ కమిటీతో భేటీ అయింది. ఈ భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2010 | 7:22 am

సిద్ధార్థతో ప్రేమా..? అవన్నీ వదంతులే..!: శృతిహాసన్

పద్మభూషణ్, దశావతారం హీరో కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్‌ కథానాయికగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తెలుగులో ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో "బాయ్స్" బాయ్, ఎనర్జిటిక్ హీరో సిద్ధార్థ కథానాయకుడిగా నటిస్తున్నాడు.ఈ నేపథ్యంలో కమల్ కుమార్తె శ్రుతి హాసన్ సిద్ధార్థను ప్రేమిస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే తనపై వచ్చిన ప్రేమ వార్తలను శృతిహాసన్ కొట్టిపారేసింది. సోహా అలీఖాన్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి హీరో సిద్ధార్థ శృతితో చాలా చనువుగా ఉంటున్నాడని వార్తలు వచ్చాయి. ఈ విషయమై శృతిహాసన్ మాట్లాడుతూ.. "మేమిద్దరం ప్రేమించుకున్నామనేది ఆధారం లేని మాట" అని కోపంతో చిందులేసింది. "ఇద్దరం కలిసి తెలుగు సినిమాలో నటిస్తున్నాం. ఓ సహనటుడితో ఓ నటి ఎలా ఉండాలో..? అలాగే ఉన్నాను. అంతేగానీ సిద్ధార్థతో ఇంకేమీలేదని.." శృతి స్పష్టం చేసింది. ఇకపోతే.. సిద్ధార్థ-శృతిహాసన్ జంటగా నటిస్తోన్న చిత్రానికి "యోధ" అనే పేరు పరిశీలనలో ఉంది.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Apr 2010 | 7:08 am

"చండీ" నుంచి కాజల్‌ను గెంటేసిన ఎమ్మెస్ రాజు..?!!

సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు క్రమశిక్షణకు మారుపేరు అని సినీ ఇండస్ట్రీలో పేరు. సినీ నిర్మాతలు ఖర్చులను తగ్గించుకోవాలని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసిన నేపధ్యంలో తొలిసారిగా దానిని ఆచరణలో పెట్టారు రాజు. తను నిర్మిస్తున్న తదుపరి చిత్రం చండీకి గాను కాజల్ అగర్వాల్ పారితోషికం చుక్కలను చూస్తూ ఉండటంతో ఆమెను సదరు చిత్రం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ స్థానంలో మరో కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల భారీ పారితోషికాలను ఆశిస్తున్న హీరోహీరోయిన్లు క్రమంగా తమ రేట్లను తగ్గించుకోక తప్పదు. లేదంటే వారి స్థానాలను కొత్తవాళ్లు ఆక్రమించుకోవడం ఖాయం.నిర్మాతలు అనుకుంటే ఇండస్ట్రీని గాడిలో పెట్టవచ్చని, మిగిలిన నిర్మాతలు కూడా ఎమ్మెస్ రాజుగారి బాటలో పయనిస్తే నిర్మాతలకు కష్టాలు చాలా వరకూ తగ్గిపోతాయంటున్నారు సినీ విశ్లేషకులు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Apr 2010 | 6:57 am

ఐపీఎల్ మ్యాచ్‌లను నిషేధించాలి: మంత్రి కోమటిరెడ్డి

బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లను దేశంలో నిషేధించాలని రాష్ట్ర ఐటీ, యువజన క్రీడల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై కేంద్రానికి, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాయనున్నట్టు ఆయన గురువారం హైదరాబాద్‌లో తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2010 | 6:36 am

అల్మట్టి ఎత్తు పెంపుపై విచారణకు ఆంధ్రప్రదేశ్ పట్టు

కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అల్మట్టి ఎత్తు పెంపుపై విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా డిమాండ్ చేసింది. కృష్ణా జిలాలలకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం చెపుతున్న లెక్కలన్నీ కాకిలెక్కలతో పోల్చింది. కృష్ణా జలాల ట్రిబ్యునల్‌ ఎదుట గత రెండు రోజులుగా రాష్ట్రం తన వాదనలు వినిపించింది. ఇవి గురువారంతో ముగిశాయి.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2010 | 6:12 am

ఢిల్లీ లజ్‌పత్ నగర్ పేలుళ్లు: ముగ్గురికి మరణశిక్ష

దేశ రాజధాని ఢిల్లీలోని లజ్‌పత్ నగర్‌‌లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ళ కేసులో ముగ్గురికి మరణశిక్ష విధిస్తూ ఢిల్లీ సెషన్సు కోర్టు తీర్పు ఇచ్చింది. 14 సంవత్సరాల క్రితం జరిగిన ఈ పేలుళ్ళలో 13 మంది మృత్యువాత పడగా, 39 మంది గాయపడ్డారు. ఈ కేసులో ఢిల్లీ సెషన్సు కోర్టు గురువారం తుదితీర్పు వెలువరించింది.
Source: జాతీయ | 22 Apr 2010 | 5:26 am

పాటల చిత్రీకరణలో ఆదిత్య బాబు "చలాకి"

ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై ఆదిత్య బాబు కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రానికి "చలాకి" అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా మాదేష్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. రోమా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ చిత్రం ఆధారంగా రూపొందుతోంది. లేడీస్ కాలేజీలో ఓ కుర్రాడు ఎలా చేరాడు? దానికి కారణాలేమిటి? అన్న అంశంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Apr 2010 | 5:09 am

రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో జగపతిబాబు "గాయం-2"

జగపతిబాబు, విమలారామన్ కాంబినేషన్‌లో ప్రవీణ్ శ్రీ దర్శకత్వంలో కర్త క్రియేషన్స్ పతాకంపై డా. ధర్మకర్త.సి నిర్మిస్తున్న చిత్రం "గాయం-2". ఈ చిత్రానికి ప్రముఖ దర్శక-నిర్మాత రామ్ గోపాల్‌వర్మ సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు ప్రవీణ్ శ్రీ మాట్లాడుతూ.. "జగపతిబాబు సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన "గాయం" చిత్రానికి పర్‌ఫెక్ట్ సీక్వెల్ ఇది. ఇండియాలో ఈ తరహా సీక్వెల్ ఎవరూ చేయలేదు. మా గురువు రామ్‌గోపాల్‌వర్మ చిత్రానికి నేను సీక్వెల్ చేయడం, ఆ సీక్వెల్‌కు ఆయన సమర్పకునిగా వ్యవహరించడం నా అదృష్టం" అని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Apr 2010 | 4:51 am

చిన్నరాష్ట్రాల ఏర్పాటుతో వేర్పాటువాదం హెచ్చు: ప్రరాపా

చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో దేశంలో వేర్పాటువాదం మరింతగా విస్తరిస్తుందని ప్రజారాజ్యం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా, రాష్ట్రాల విభజనకు జాతీయ స్థాయిలో ఓ సమగ్ర విధానముండాలని ఆ పార్టీకి చెందిన 22 మంది సభ్యుల బృందం ముక్తకంఠంతో అభిప్రాయపడింది. ఈ మేరకు జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ముందు ఆ పార్టీ సభ్యులు తమ వాదనలను బలంగా వినిపించారు.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2010 | 4:40 am

అన్ని సమస్యలు పరిష్కరిస్తాం.. అందుకే ఉన్నాం: శ్రీకృష్ణ

తెలంగాణ సమస్యతో పాటు రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలకు పరిష్కారం మార్గం కనుగొంటామని జస్టీస్ శ్రీకృష్ణ జోస్యం చెప్పారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నదే తమ ఆకాంక్ష, అభిమతమన్నారు. ఇందుకోసం అవసరమైన పరిష్కారం మార్గం తాము కనుగొంటామని ధీమా వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2010 | 4:18 am

ఐపీఎల్‌‌లో ప్రఫుల్ పటేల్ హస్తం: వివరాలు కోరిన ప్రధాని

బిలియన్ డాలర్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తలెత్తిన వివాదం రోజుకో రకంగా మలుపులు తిరుగుతోంది. ఈ రగడలో చిక్కుకుని ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. తాజాగా మరో కేంద్ర మంత్రికి కూడా సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దృష్టిసారించారు. ఈ వ్యవహారానికి సంబంధించి వివరాలను ఆయన గురువారం కోరారు.
Source: జాతీయ | 22 Apr 2010 | 3:44 am