ఐపీఎల్‌‌లో ప్రఫుల్ పటేల్ హస్తం: వివరాలు కోరిన ప్రధాని

బిలియన్ డాలర్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తలెత్తిన వివాదం రోజుకో రకంగా మలుపులు తిరుగుతోంది. ఈ రగడలో చిక్కుకుని ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. తాజాగా మరో కేంద్ర మంత్రికి కూడా సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దృష్టిసారించారు. ఈ వ్యవహారానికి సంబంధించి వివరాలను ఆయన గురువారం కోరారు.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2010 | 9:14 am

భారీ లాభాల దిశగా స్టాక్ మార్కెట్ పయనం

గురువారం బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాల దిశగా కొనసాగుతోంది. జీడీపీ వృద్ధిరేటు పెరగనుందనే అంచనాలతో గురువారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, 204 పాయింట్లు భారీగా వృద్ధి చెంది, 17,676 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 57 పాయింట్లు బలపడి, 5,302 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2010 | 9:05 am

లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి

అమెరికా స్టాక్ మార్కెట్ ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలతో మందకొడిగా సాగిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో, 154 పాయింట్ల వృద్ధితో, 17,627 మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 40 పాయింట్లు బలపడి, 5,285 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2010 | 8:25 am

ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నఫోర్డ్ ఇండియా

బుల్లి కారు నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న ఫోర్డ్ ఇండియా సంస్థకు చెందిన ఫిగో ఉత్పత్తిని మరింతగా పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకుంది. ఇందులో భాగంగా తమ సంస్థలో మరో 700 మందికి ఉద్యోగావకాశాలను కల్పించనున్నామని ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు, ఎమ్‌డీ మైకేల్ బోన్హేమ్ ఢిల్లీలో గురువారం వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2010 | 7:53 am

ఊపందుకున్న ట్రేడింగ్ : లాభాల్లో స్టాక్ మార్కెట్

గురువారం బాంబే స్టాక్ మార్కెట్‌ లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 132 పాయింట్ల వృద్ధితో 17,605 మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 37 పాయింట్ల లాభంతో, 5,281 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2010 | 7:14 am

తెదేపా నుంచి ప్రరాపాకు రాజకీయ పెనుసవాల్!

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీకి రాజకీయంగా పెనుసవాల్ ఎదురుకానుంది. ప్రజారాజ్యం ఉన్నంత వరకు తాము అధికారంలోకి రాలేమనే భయం తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును పట్టిపీడిస్తోంది. దీంతో ప్రరాపాను నిర్వీర్యం చేసేందుకు అవసరమైన అన్ని అడ్డగోలు చర్యలను ఆయన స్వయంగా చేస్తున్నట్టు సమాచారం.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2010 | 7:08 am

సిద్ధార్థతో ప్రేమా..? అవన్నీ వదంతులే..!: శృతిహాసన్

పద్మభూషణ్, దశావతారం హీరో కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్‌ కథానాయికగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తెలుగులో ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో "బాయ్స్" బాయ్, ఎనర్జిటిక్ హీరో సిద్ధార్థ కథానాయకుడిగా నటిస్తున్నాడు.ఈ నేపథ్యంలో కమల్ కుమార్తె శ్రుతి హాసన్ సిద్ధార్థను ప్రేమిస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే తనపై వచ్చిన ప్రేమ వార్తలను శృతిహాసన్ కొట్టిపారేసింది. సోహా అలీఖాన్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి హీరో సిద్ధార్థ శృతితో చాలా చనువుగా ఉంటున్నాడని వార్తలు వచ్చాయి. ఈ విషయమై శృతిహాసన్ మాట్లాడుతూ.. "మేమిద్దరం ప్రేమించుకున్నామనేది ఆధారం లేని మాట" అని కోపంతో చిందులేసింది. "ఇద్దరం కలిసి తెలుగు సినిమాలో నటిస్తున్నాం. ఓ సహనటుడితో ఓ నటి ఎలా ఉండాలో..? అలాగే ఉన్నాను. అంతేగానీ సిద్ధార్థతో ఇంకేమీలేదని.." శృతి స్పష్టం చేసింది. ఇకపోతే.. సిద్ధార్థ-శృతిహాసన్ జంటగా నటిస్తోన్న చిత్రానికి "యోధ" అనే పేరు పరిశీలనలో ఉంది.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Apr 2010 | 7:08 am

స్వల్పంగా పెరిగి 17.65 శాతానికి చేరుకున్న ఆహార ద్రవ్యోల్బణం

ఏప్రిల్ 10తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 17.65 శాతానికి చేరుకుంది. అదే అంతకు మునుపటి వారం ఏప్రిల్ 3తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం 17.22 శాతంగా ఉండిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ వర్గాలు గురువారం వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2010 | 7:05 am

"చండీ" నుంచి కాజల్‌ను గెంటేసిన ఎమ్మెస్ రాజు..?!!

సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు క్రమశిక్షణకు మారుపేరు అని సినీ ఇండస్ట్రీలో పేరు. సినీ నిర్మాతలు ఖర్చులను తగ్గించుకోవాలని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసిన నేపధ్యంలో తొలిసారిగా దానిని ఆచరణలో పెట్టారు రాజు. తను నిర్మిస్తున్న తదుపరి చిత్రం చండీకి గాను కాజల్ అగర్వాల్ పారితోషికం చుక్కలను చూస్తూ ఉండటంతో ఆమెను సదరు చిత్రం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ స్థానంలో మరో కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల భారీ పారితోషికాలను ఆశిస్తున్న హీరోహీరోయిన్లు క్రమంగా తమ రేట్లను తగ్గించుకోక తప్పదు. లేదంటే వారి స్థానాలను కొత్తవాళ్లు ఆక్రమించుకోవడం ఖాయం.నిర్మాతలు అనుకుంటే ఇండస్ట్రీని గాడిలో పెట్టవచ్చని, మిగిలిన నిర్మాతలు కూడా ఎమ్మెస్ రాజుగారి బాటలో పయనిస్తే నిర్మాతలకు కష్టాలు చాలా వరకూ తగ్గిపోతాయంటున్నారు సినీ విశ్లేషకులు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Apr 2010 | 6:57 am

రండి.. రండి.. వినిపించండి మీ వాదనలు: శ్రీకృష్ణ కమిటీ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రజలు, పార్టీలతో సంప్రదింపులు జరిపేందుకు ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ గురువారం ఉదయం రాజధాని భాగ్యనగరానికి చేరుకుంది. హైదరాబాద్‌కు చేరుకున్న వారిలో కమిటీ ఛైర్మన్ జస్టీస్ శ్రీకృష్ణతో పాటు.. ఇతర సభ్యులైన వీకే.దుగ్గల్, రణబీర్‌లు ఉన్నారు. వీరంతా ఇక్కడే రెండు రోజుల పాటు మకాం వేయనున్నారు.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2010 | 6:52 am

ఆయిల్ ఇండియాకు నవరత్న స్థాయి కల్పించిన ప్రభుత్వం

దేశీయ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్) సంస్థకు కేంద్రప్రభుత్వం నవరత్న స్థాయిని కల్పించింది. దీంతో కంపెనీ వెయ్యి కోట్ల రూపాయల వరకు లావాదేవీలు చేసే అధికారాన్ని పొందిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2010 | 6:39 am

పుంజుకున్న ట్రేడింగ్: లాభాల్లో స్టాక్ మార్కెట్

దేశీయ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభంలో తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, ఉదయం 11.45 గంటల ప్రాంతంలో 115 పాయింట్లు వృద్ధి చెంది, 17,588 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 37 పాయింట్లు పుంజుకుని, 5,282 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2010 | 6:35 am

పాటల చిత్రీకరణలో ఆదిత్య బాబు "చలాకి"

ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై ఆదిత్య బాబు కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రానికి "చలాకి" అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా మాదేష్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. రోమా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ చిత్రం ఆధారంగా రూపొందుతోంది. లేడీస్ కాలేజీలో ఓ కుర్రాడు ఎలా చేరాడు? దానికి కారణాలేమిటి? అన్న అంశంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Apr 2010 | 5:09 am

రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో జగపతిబాబు "గాయం-2"

జగపతిబాబు, విమలారామన్ కాంబినేషన్‌లో ప్రవీణ్ శ్రీ దర్శకత్వంలో కర్త క్రియేషన్స్ పతాకంపై డా. ధర్మకర్త.సి నిర్మిస్తున్న చిత్రం "గాయం-2". ఈ చిత్రానికి ప్రముఖ దర్శక-నిర్మాత రామ్ గోపాల్‌వర్మ సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు ప్రవీణ్ శ్రీ మాట్లాడుతూ.. "జగపతిబాబు సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన "గాయం" చిత్రానికి పర్‌ఫెక్ట్ సీక్వెల్ ఇది. ఇండియాలో ఈ తరహా సీక్వెల్ ఎవరూ చేయలేదు. మా గురువు రామ్‌గోపాల్‌వర్మ చిత్రానికి నేను సీక్వెల్ చేయడం, ఆ సీక్వెల్‌కు ఆయన సమర్పకునిగా వ్యవహరించడం నా అదృష్టం" అని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Apr 2010 | 4:51 am

ఐపీఎల్‌‌లో ప్రఫుల్ పటేల్ హస్తం: వివరాలు కోరిన ప్రధాని

బిలియన్ డాలర్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తలెత్తిన వివాదం రోజుకో రకంగా మలుపులు తిరుగుతోంది. ఈ రగడలో చిక్కుకుని ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. తాజాగా మరో కేంద్ర మంత్రికి కూడా సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దృష్టిసారించారు. ఈ వ్యవహారానికి సంబంధించి వివరాలను ఆయన గురువారం కోరారు.
Source: జాతీయ | 22 Apr 2010 | 3:44 am

తెదేపా నుంచి ప్రరాపాకు రాజకీయ పెనుసవాల్!

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీకి రాజకీయంగా పెనుసవాల్ ఎదురుకానుంది. ప్రజారాజ్యం ఉన్నంత వరకు తాము అధికారంలోకి రాలేమనే భయం తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును పట్టిపీడిస్తోంది. దీంతో ప్రరాపాను నిర్వీర్యం చేసేందుకు అవసరమైన అన్ని అడ్డగోలు చర్యలను ఆయన స్వయంగా చేస్తున్నట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2010 | 1:40 am

రండి.. రండి.. వినిపించండి మీ వాదనలు: శ్రీకృష్ణ కమిటీ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రజలు, పార్టీలతో సంప్రదింపులు జరిపేందుకు ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ గురువారం ఉదయం రాజధాని భాగ్యనగరానికి చేరుకుంది. హైదరాబాద్‌కు చేరుకున్న వారిలో కమిటీ ఛైర్మన్ జస్టీస్ శ్రీకృష్ణతో పాటు.. ఇతర సభ్యులైన వీకే.దుగ్గల్, రణబీర్‌లు ఉన్నారు. వీరంతా ఇక్కడే రెండు రోజుల పాటు మకాం వేయనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2010 | 1:23 am

మోడీ అంగరక్షకులపై ముంబైలో ఎఫ్ఐఆర్ నమోదు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కమిషనర్ లలిత్ మోడీకి భద్రత కల్పించే అంగరక్షకులపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముంబై శివారు ప్రాంతమైన అంథేరిలో ఉన్న ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మీడియా సిబ్బందిపై దాడి చేసినందుకు గాను కేసు నమోదు చేసినట్టు ముంబై నగర పోలీసులు వెల్లడించారు.
Source: జాతీయ | 22 Apr 2010 | 12:34 am

ప్రయాణికుల సేవల కోసం బోయింగ్ 747 విమానాలు!

దేశ ప్రధానమంత్రి విదేశీ పర్యటనల కోసం ఉపయోగించే ప్రత్యేక బోయింగ్ విమానాలను ప్రయాణికుల సేవల కోసం వినియోగించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ఐస్‌లాండ్ అగ్నిపర్వతం నుంచి విడుదలవుతున్న బూడిద కణాల కారణంగా అంతర్జాతీయంగా విమాన సర్వీసులు స్తంభించిపోయిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 22 Apr 2010 | 12:10 am

30 నుంచి ప్రజాపథానికి ధీటుగా కేసీఆర్ పల్లెబాట

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు పల్లెబాట పట్టనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ప్రజాపథం కార్యక్రమానికి ధీటుగా ఈ యాత్రను చేపట్టాలని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రజాసమస్యల పరిష్కారానికి అధికారులపై ఒత్తిడి తేవడంతో పాటు.. తెలంగాణ వాదాన్ని గ్రామీణ ప్రాంత వాసుల్లో మరింతగా పటిష్టం చేసేందుకు వీలుగా ఈ యాత్ర సాగనుంది.
Source: ఏపీ న్యూస్ | 21 Apr 2010 | 11:53 pm

ఈ పదేళ్ళలో కేసీఆర్ సాధించింది శూన్యం: టి నేతలు

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రిపదవి దక్కక పోవడంతో అలిగిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో వేరు కుంపటి పెట్టి రాష్ట్ర రాజకీయాల్లో చెలామణి అవుతున్నారు. ఈయన స్థాపించిన తెరాసకు ఈనెల 28వ తేదీతో పదేళ్లు పూర్తికానున్నాయి. ఈ పదేళ్ళలో ఆయన ఏమి సాధించారన్న అంశంపై ప్రస్తుతం తెలంగాణ నేతల్లో చర్చ సాగుతోంది.
Source: ఏపీ న్యూస్ | 21 Apr 2010 | 11:53 pm

రోశయ్య కూడా పక్కా తెలంగాణ వాదే: శంకర్ రావు

ముఖ్యమంత్రి కె.రోశయ్య కూడా పక్కా తెలంగాణావాదేనని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ రావు అన్నారు. ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అధిక ఆసక్తి చూపుతున్నారంటూ చెప్పుకొచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 21 Apr 2010 | 11:17 pm

ప్రతిపక్షాల కోత తీర్మానాలు: విప్ జారీ చేసిన కాంగ్రెస్

కీలక అంశాలపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టనున్న కోత తీర్మానాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ఇందులోభాగంగా.. పార్టీ సభ్యులంతాగ విధిగా సభలో ఉండేలా విప్ జారీ చేసింది.
Source: జాతీయ | 21 Apr 2010 | 10:22 pm

ఐపీఎల్ వ్యవహారం: జీపీసీ దర్యాప్తుకు సీపీఎం డిమాండ్

ఇండియన్ పొలిటికల్ లీగ్‌గా మారిన ఇండియన్ క్రికెట్ లీగ్‌ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ డిమాండ్ చేశారు. దీనిపై ఆయన కొచ్చిలో విలేకరులతో మాట్లాడుతూ.. ఐపీఎల్‌ను క్రికెట్‌ పేరుతో లాభదాయకమైన వ్యాపారం చేసే పెద్ద వ్యాపార సంస్థగా అభివర్ణించారు.
Source: జాతీయ | 21 Apr 2010 | 10:05 pm

"రాజనీతి" కోసం అన్నిటినీ త్యాగం చేస్తున్న కత్రినా

బాలీవుడ్ అందాల నటి కత్రినా కైఫ్ మహా పట్టుదలతో తనే డబ్బింగ్ చెప్పుకుంటూ నటిస్తున్న చిత్రం "రాజనీతి". ఇటీవల తన కుటుంబానికి సంబంధించిన వేడుక ఒకటి లండన్‌లో జరుగుతున్నప్పటికీ సినిమాకోసం ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టింది. ఈ సంగతి తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారట. అంతేకాదు... చిత్ర దర్శకనిర్మాత ప్రకాష్ ఝా సైతం సంభ్రమానికి గురయ్యారట. కత్రినా అంకిత భావాన్ని చూసి ఎంతో మెచ్చుకున్నారట.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Apr 2010 | 10:53 am

తెలంగాణా జిల్లాల్లో పర్యటిస్తా.. ఏం చేస్తారో చూస్తా: చిరు

తెలంగాణ జిల్లాల్లో తాను ఒంటరిగానే పర్యటిస్తానని.. ఏం చేస్తారో చూస్తానని ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి సవాల్ విసిరారు. ఒక్కరి స్వార్థం కోసమే తెలంగాణ వాదం పుట్టుకొచ్చిందన్నారు. వీరికి తగిన సమయంలో ప్రజలు గుణపాఠం చెపుతారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Apr 2010 | 9:19 am

యూపీఎ పాలనంటే ధరలు పెరుగుతున్నట్లే: గడ్కరి

నిత్యావసర వస్తు ధరలు ఆకాశన్నంటడంపై భారతీయ జనతా పార్టీ యూపీఎ ప్రభుత్వాన్ని ఎండగట్టింది. దేశ రాజధానిలో నిర్వహించిన భారీ సభను ఉద్దేశించి భాజపా అధ్యక్షుడు మాట్లాడుతూ... యూపీఎ పాలన వచ్చిందంటే నిత్యావసర ధరలు అమాంతం దూసుక పోతాయని ఎద్దేవా చేశారు.
Source: జాతీయ | 21 Apr 2010 | 8:29 am

హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో నిత్యానంద స్వామి అరెస్టు

ఎట్టకేలకు నిత్యానంద స్వామి పోలీసులకు చిక్కారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈయన గత కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆర్కిలో ఉన్నట్టు సమాచారం అందుకున్న బెంగుళూరు పోలీసులు అక్కడకు చేరుకుని స్థానిక పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు. భక్తి ముసుగులో మహిళలు లోబరుచుకున్నారనే ఆరోపణల కింద ఆయనను అరెస్టు చేసినట్టు బెంగుళూరు పోలీసులు వెల్లడించారు.
Source: జాతీయ | 21 Apr 2010 | 8:10 am

ఢిల్లీలో ధరల పెరుగుదలపై భాజపా సమర భేరీ

నిత్యావసర వస్తు ధరల పెరుగుదలపై ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ దేశ రాజధానిలో సమరభేరీ మోగించింది. ఇక్కడి రామ్‌లీలా మైదానంలో ఆ పార్టీకి చెందిన లక్షలాది మంది కార్యకర్తలు చేరుకుని ధర్నా చేస్తున్నారు. సుమారు మూడు లక్షల మంది కార్యకర్తలు ఇందులో పాల్గొంటారని అంచా వేస్తున్నారు. ఇక్కడ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు.
Source: జాతీయ | 21 Apr 2010 | 8:00 am

ఆ సీన్‌లో నగ్నంగా స్నానం చేయలేదు: నీతూ చంద్రా

"అపార్ట్‌మెంట్" చిత్రంకోసం హాటెస్ట్ బేబీ నీతూ చంద్రా ఓ బాతింగ్ సన్నివేశంలో నటించింది. ఆ సన్నివేశంలో నీతూ షవర్ కింద తడుస్తూ స్నానం చేస్తున్నట్లుగా నటించాలి. దర్శకుడు తాను అనుకున్నట్లు సన్నివేశాన్ని చిత్రీకరించాడు. అయితే ఆ సీన్‌లో నీతూ శరీరంపై నూలుపోగు లేనట్లుగా ఓ అద్దం చాటు నుంచి కనబడుతుంది. ఆ సీన్ చూసినవారంతా నీతూ నిజంగానే నగ్నంగా నటించిందేమోనని అనుకోవడం ఖాయం. కానీ తను బట్టల్లేకుండా ఆ సన్నివేశంలో నటించినట్లు కొంతమంది చెప్పడంపై నీతూ చంద్రా చిందులేస్తోందట. బాతింగ్ సన్నివేశం కనుక దుస్తులను పొదుపుగా ధరించాలని దర్శకుడు చెప్పినప్పటికీ శరీరానికి అతుక్కుపోయే డ్రెస్ వేసుకుని అందులో నటించానని మరీ చెపుతోందట. కెమేరా ట్రిక్‌తో స్నానం చేసేటపుడు శరీరం ఎలా ఉంటుందో అలా చూపించారని అంటోందట. అంతేతప్ప తాను నగ్నంగా స్నానం చేయలేదని వాపోతోందట.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Apr 2010 | 6:59 am

హిందీలో రీమేక్ కానున్న శర్వానంద్ "ప్రస్థానం"!

శర్వానంద్ దర్శకత్వంలో దేవకట్టా దర్శకత్వంలో రూపొందిన "ప్రస్థానం" చిత్రానికి సక్సెస్ టాక్ వచ్చింది. ఈ చిత్రాన్ని ముంబైకి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రీమేక్ చేయడానికి హక్కులు అడిగారని, అలాగే తమిళంలో కూడా రీమేక్ చేయమని ఆఫర్లు వచ్చాయని చిత్ర దర్శకుడు దేవకట్టా మంగళవారం తెలియజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Apr 2010 | 6:30 am

ప్రజాస్వామ్యమంటే కేసీఆర్ ఫ్యామిలీకి అలెర్జీ: సోమిరెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు, ఆయన కుటుంబానికి ప్రజాస్వామ్యం అంటేనే అలెర్జీగా ఉన్నట్టు తెలుస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన బుధవారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ.. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ కాలగడువు డిసెంబరు 31వ తేదీతో ముగుస్తుందని గుర్తు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 21 Apr 2010 | 6:15 am

అభిలాష్‌కు ఆర్.ఆర్ మూవీ మేకర్స్ అధినేత వెంకట్ చేయూత!

ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అభిలాష్‌ వైద్య చికిత్సల కోసం ఆర్.ఆర్. మూవీ మేకర్స్ అధినేత వెంకట్ ఐదు లక్షల రూపాయలను అందజేశారు. సమర్పకులు కె. అచ్చిరెడ్డి ద్వారా హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అభిలాష్‌కు ఐదు లక్షల రూపాయల డీడీని పంపించారు. కె.అచ్చిరెడ్డి అభిలాష్‌ను పరామర్శించి ఐదులక్షల రూపాయల డీడీని అందజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Apr 2010 | 6:10 am

ప్రభాస్ "డార్లింగ్"కు క్లీన్ "యు" సర్టిఫికేట్: 23న విడుదల

యంగ్‌రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై "తొలిప్రేమ" కరుణాకరన్ దర్శకత్వంలో "ఛత్రపతి" ప్రసాద్ నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఫిలిమ్ "డార్లింగ్" సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ "యు" సర్టిఫికేట్ పొందింది. ఈ సందర్భంగా నిర్మాత ఛత్రపతి ప్రసాద్ మాట్లాడుతూ.. ఇటీవల సెన్సార్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ "యు" సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మంచి ఫీల్‌గుడ్ మూవీగా అందరి ప్రశంసలు పొందుతుంది. ఇది లవ్‌స్టోరీ అయినప్పటికీ యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటుంది. ప్రభాస్ కెరీర్‌లోనే "డార్లింగ్" బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఇటీవల విడుదలైన ఆడియోకు అద్భుతమైన స్పందన వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని "డార్లింగ్" చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నాం" అని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Apr 2010 | 6:01 am

డబ్బింగ్‌లో ఈతరం ఫిలిమ్ "ఏం పిల్లో ఏం పిల్లడో"

ఈతరం ఫిలిమ్స్ పతాకంపై పోకూరి బాబూరావు నిర్మిస్తోన్న చిత్రం "ఏం పిల్లో ఏం పిల్లడో". ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమం జరుగుతోంది. మరోవైపు ఐదు పాటల్లో రెండు పాటలను పూర్తి చేశామనీ, మిగిలిన పాటలను మే నెలలో కేరళలో చిత్రీకరించనున్నామని నిర్మాత తెలియజేశారు. ఈ చిత్రంలో చరణ్ రాజ్, విజయ్ చంద్, ఆహుతి ప్రసాద్, చంద్రమోహన్ పోషించిన పాత్రలు వినోదాన్ని పండిస్తాయన్నారు. కాగా ఈ చిత్రంలో ఐదుగురిని కొత్తవారిని పరిచయం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. యజ్ఞం తర్వాత రవికుమార్ చౌదరి తమ చిత్రానికి పనిచేస్తున్నారని చెపుతూ... ప్రేమ కథ అయినా ఈతరం ఫ్లేవర్ ఎక్కడా చెదిరిపోకుండా ఉంటుందని చెప్పారు. ప్రతి పాత్ర ప్రాధాన్యతగలదిగా ఉంటుందన్నారు. దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ... హీరోహీరోయన్లు నువ్వా.. నేనా.. అని పోటీపడి నటించారన్నారు. ఈ చిత్రానికి కథ: ఈతరం యూనిట్, మాటలు: భాషశ్రీ, ఆర్ట్: వెంకటేశ్వరరావు, సమర్పణ: పోకూరి రామారావు
Source: Yahoo! Telugu: Entertainment | 21 Apr 2010 | 5:52 am

ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు అడ్డుకట్ట: మన్మోహన్

ప్రజాస్వామ్య వ్యవస్థకు హాని కలిగించే చర్యలకు అడ్డుకట్ట వేయాలని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగే నేరాలను మానవ సమాజం అనుమతించరాదని ఆయన పిలుపునిచ్చారు.
Source: జాతీయ | 21 Apr 2010 | 5:27 am

బాబుకు సారీ చెప్పా.. వివాదం సమసింది: నన్నపనేని

పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సారీ చెప్పానని, ఫలితంగా తన వల్ల చెలరేగిన వివాదం సమసి పోయిందని తెలుగుదేశం పార్టీ మహిళానేత, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి చెప్పారు. పార్టీ కోసం శ్రమించే వారికి తెదేపాలో సరైన గుర్తింపు లేదంటూ ఆమె తన మనస్సులోని అక్కసును ఇటీవల వెళ్లగక్కిన విషయం తెల్సిందే. దీనిపై ఆ పార్టీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకోసం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
Source: ఏపీ న్యూస్ | 21 Apr 2010 | 4:33 am

విదేశీ ప్రయాణికుల వీసా గడువు పొడగింపు: హోంశాఖ

ఐస్‌లాండ్ అగ్నిపర్వతం కారణంగా విమానసర్వీసులు రద్దు కావడంతో స్వదేశంలోనే చిక్కున్న విదేశీ ప్రయాణికుల విసా కాలపరిమితిని పొడగించనున్నట్టు కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు.. ఇతర ప్రాంతాలకు విమాన సర్వీసులు పునరుద్ధరించే వరకు వీసా కాలాన్ని పొడగిస్తామని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 21 Apr 2010 | 2:23 am