బాబుకు సారీ చెప్పా.. వివాదం సమసింది: నన్నపనేని

పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సారీ చెప్పానని, ఫలితంగా తన వల్ల చెలరేగిన వివాదం సమసి పోయిందని తెలుగుదేశం పార్టీ మహిళానేత, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి చెప్పారు. పార్టీ కోసం శ్రమించే వారికి తెదేపాలో సరైన గుర్తింపు లేదంటూ ఆమె తన మనస్సులోని అక్కసును ఇటీవల వెళ్లగక్కిన విషయం తెల్సిందే. దీనిపై ఆ పార్టీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకోసం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
Source: Yahoo! Telugu: News | 21 Apr 2010 | 9:32 am

జూన్ 20వతేదీన పోలాండ్ అధ్యక్ష తొలిదశ ఎన్నికలు

పోలాండ్ అధ్యక్ష ఎన్నికలు జూన్ 20వ తేదీన జరుగనున్నాయి. అలాగే, పోలాండ్ చట్టాల మేరకు రెండో దశ ఎన్నికలు జూలై నాలుగో తేదీన జరిగే అవకాశాలు ఉన్నాయి. రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ దేశ అధ్యక్షుడు లీచ్ కజిన్‌స్కీ, ఆయన సతీమణితో సహా 94 మంది దుర్మరణం పాలైన విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 21 Apr 2010 | 9:15 am

స్టాక్ మార్కెట్: స్వల్ప లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభంలో ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో కేవలం తొమ్మిది పాయింట్లు మాత్రమే లాభపడింది. దీంతో సెన్సెక్స్ సూచీ, 17,470 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం నాలుగు పాయింట్లు బలపడి, 5,234 పాయింట్ల మార్కును తాకింది.
Source: Yahoo! Telugu: News | 21 Apr 2010 | 9:06 am

హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో నిత్యానంద స్వామి అరెస్టు

ఎట్టకేలకు నిత్యానంద స్వామి పోలీసులకు చిక్కారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈయన గత కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆర్కిలో ఉన్నట్టు సమాచారం అందుకున్న బెంగుళూరు పోలీసులు అక్కడకు చేరుకుని స్థానిక పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు. భక్తి ముసుగులో మహిళలు లోబరుచుకున్నారనే ఆరోపణల కింద ఆయనను అరెస్టు చేసినట్టు బెంగుళూరు పోలీసులు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 21 Apr 2010 | 8:44 am

సరైన ఆధారాలు లభిస్తే ముషారఫ్‌పై చర్య: పాకిస్థాన్

దివంగత మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ పాత్ర ఉన్నట్టు సరైన ఆధారాలు లభిస్తే ఆయనపై చర్య తీసుకుంటామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. అదేసమయంలో భుట్టో హత్యపై ఐక్యరాజ్య సమితి సమర్పించిన నివేదిక పట్ల ఆ దేశ పాలకులు హర్షం వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 21 Apr 2010 | 8:31 am

విదేశీ ప్రయాణికుల వీసా గడువు పొడగింపు: హోంశాఖ

ఐస్‌లాండ్ అగ్నిపర్వతం కారణంగా విమానసర్వీసులు రద్దు కావడంతో స్వదేశంలోనే చిక్కున్న విదేశీ ప్రయాణికుల విసా కాలపరిమితిని పొడగించనున్నట్టు కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు.. ఇతర ప్రాంతాలకు విమాన సర్వీసులు పునరుద్ధరించే వరకు వీసా కాలాన్ని పొడగిస్తామని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 21 Apr 2010 | 7:52 am

స్వల్ప లాభాల్లో బాంబే స్టాక్ మార్కెట్

బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధి బాటలో కొనసాగుతోంది. అయితే యూరప్, ఆసియా స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకోవడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్.. బుధవారం మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో స్వల్ప లాభాలను ఆర్జించింది. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, 11 పాయింట్లు స్వల్పంగా పుంజుకుని, 17,472 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా పది పాయింట్లు స్వల్పంగా లాభపడి, 5,240 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 21 Apr 2010 | 7:51 am

స్పెక్ట్రమ్ వేలంతో రూ. 45,000 కోట్ల ఆదాయం: మంత్రి రాజా

దేశంలో మూడవ తరం (3జీ), బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ వేలం ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 45,000 కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర టెలికాం శాఖామంత్రి ఏ రాజా న్యూ ఢిల్లీలో బుధవారం వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 21 Apr 2010 | 7:44 am

ఉద్యోగులను నియమించనున్న హెచ్‌సీఎల్

దేశీయ ఐటీ సేవలను అందించడంలో అగ్రగామిగానున్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ 5,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ఆ సంస్థ సీఎఫ్ఓ అనిల్ చనానా బుధవారం న్యూ ఢిల్లీలో తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 21 Apr 2010 | 7:28 am

తెలంగాణా జిల్లాల్లో పర్యటిస్తా.. ఏం చేస్తారో చూస్తా: చిరు

తెలంగాణ జిల్లాల్లో తాను ఒంటరిగానే పర్యటిస్తానని.. ఏం చేస్తారో చూస్తానని ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి సవాల్ విసిరారు. ఒక్కరి స్వార్థం కోసమే తెలంగాణ వాదం పుట్టుకొచ్చిందన్నారు. వీరికి తగిన సమయంలో ప్రజలు గుణపాఠం చెపుతారన్నారు.
Source: Yahoo! Telugu: News | 21 Apr 2010 | 7:22 am

ఆ సీన్‌లో నగ్నంగా స్నానం చేయలేదు: నీతూ చంద్రా

"అపార్ట్‌మెంట్" చిత్రంకోసం హాటెస్ట్ బేబీ నీతూ చంద్రా ఓ బాతింగ్ సన్నివేశంలో నటించింది. ఆ సన్నివేశంలో నీతూ షవర్ కింద తడుస్తూ స్నానం చేస్తున్నట్లుగా నటించాలి. దర్శకుడు తాను అనుకున్నట్లు సన్నివేశాన్ని చిత్రీకరించాడు. అయితే ఆ సీన్‌లో నీతూ శరీరంపై నూలుపోగు లేనట్లుగా ఓ అద్దం చాటు నుంచి కనబడుతుంది. ఆ సీన్ చూసినవారంతా నీతూ నిజంగానే నగ్నంగా నటించిందేమోనని అనుకోవడం ఖాయం. కానీ తను బట్టల్లేకుండా ఆ సన్నివేశంలో నటించినట్లు కొంతమంది చెప్పడంపై నీతూ చంద్రా చిందులేస్తోందట. బాతింగ్ సన్నివేశం కనుక దుస్తులను పొదుపుగా ధరించాలని దర్శకుడు చెప్పినప్పటికీ శరీరానికి అతుక్కుపోయే డ్రెస్ వేసుకుని అందులో నటించానని మరీ చెపుతోందట. కెమేరా ట్రిక్‌తో స్నానం చేసేటపుడు శరీరం ఎలా ఉంటుందో అలా చూపించారని అంటోందట. అంతేతప్ప తాను నగ్నంగా స్నానం చేయలేదని వాపోతోందట.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Apr 2010 | 6:59 am

హిందీలో రీమేక్ కానున్న శర్వానంద్ "ప్రస్థానం"!

శర్వానంద్ దర్శకత్వంలో దేవకట్టా దర్శకత్వంలో రూపొందిన "ప్రస్థానం" చిత్రానికి సక్సెస్ టాక్ వచ్చింది. ఈ చిత్రాన్ని ముంబైకి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రీమేక్ చేయడానికి హక్కులు అడిగారని, అలాగే తమిళంలో కూడా రీమేక్ చేయమని ఆఫర్లు వచ్చాయని చిత్ర దర్శకుడు దేవకట్టా మంగళవారం తెలియజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Apr 2010 | 6:30 am

అభిలాష్‌కు ఆర్.ఆర్ మూవీ మేకర్స్ అధినేత వెంకట్ చేయూత!

ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అభిలాష్‌ వైద్య చికిత్సల కోసం ఆర్.ఆర్. మూవీ మేకర్స్ అధినేత వెంకట్ ఐదు లక్షల రూపాయలను అందజేశారు. సమర్పకులు కె. అచ్చిరెడ్డి ద్వారా హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అభిలాష్‌కు ఐదు లక్షల రూపాయల డీడీని పంపించారు. కె.అచ్చిరెడ్డి అభిలాష్‌ను పరామర్శించి ఐదులక్షల రూపాయల డీడీని అందజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Apr 2010 | 6:10 am

ప్రభాస్ "డార్లింగ్"కు క్లీన్ "యు" సర్టిఫికేట్: 23న విడుదల

యంగ్‌రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై "తొలిప్రేమ" కరుణాకరన్ దర్శకత్వంలో "ఛత్రపతి" ప్రసాద్ నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఫిలిమ్ "డార్లింగ్" సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ "యు" సర్టిఫికేట్ పొందింది. ఈ సందర్భంగా నిర్మాత ఛత్రపతి ప్రసాద్ మాట్లాడుతూ.. ఇటీవల సెన్సార్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ "యు" సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మంచి ఫీల్‌గుడ్ మూవీగా అందరి ప్రశంసలు పొందుతుంది. ఇది లవ్‌స్టోరీ అయినప్పటికీ యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటుంది. ప్రభాస్ కెరీర్‌లోనే "డార్లింగ్" బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఇటీవల విడుదలైన ఆడియోకు అద్భుతమైన స్పందన వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని "డార్లింగ్" చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నాం" అని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Apr 2010 | 6:01 am

డబ్బింగ్‌లో ఈతరం ఫిలిమ్ "ఏం పిల్లో ఏం పిల్లడో"

ఈతరం ఫిలిమ్స్ పతాకంపై పోకూరి బాబూరావు నిర్మిస్తోన్న చిత్రం "ఏం పిల్లో ఏం పిల్లడో". ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమం జరుగుతోంది. మరోవైపు ఐదు పాటల్లో రెండు పాటలను పూర్తి చేశామనీ, మిగిలిన పాటలను మే నెలలో కేరళలో చిత్రీకరించనున్నామని నిర్మాత తెలియజేశారు. ఈ చిత్రంలో చరణ్ రాజ్, విజయ్ చంద్, ఆహుతి ప్రసాద్, చంద్రమోహన్ పోషించిన పాత్రలు వినోదాన్ని పండిస్తాయన్నారు. కాగా ఈ చిత్రంలో ఐదుగురిని కొత్తవారిని పరిచయం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. యజ్ఞం తర్వాత రవికుమార్ చౌదరి తమ చిత్రానికి పనిచేస్తున్నారని చెపుతూ... ప్రేమ కథ అయినా ఈతరం ఫ్లేవర్ ఎక్కడా చెదిరిపోకుండా ఉంటుందని చెప్పారు. ప్రతి పాత్ర ప్రాధాన్యతగలదిగా ఉంటుందన్నారు. దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ... హీరోహీరోయన్లు నువ్వా.. నేనా.. అని పోటీపడి నటించారన్నారు. ఈ చిత్రానికి కథ: ఈతరం యూనిట్, మాటలు: భాషశ్రీ, ఆర్ట్: వెంకటేశ్వరరావు, సమర్పణ: పోకూరి రామారావు
Source: Yahoo! Telugu: Entertainment | 21 Apr 2010 | 5:52 am

బాబుకు సారీ చెప్పా.. వివాదం సమసింది: నన్నపనేని

పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సారీ చెప్పానని, ఫలితంగా తన వల్ల చెలరేగిన వివాదం సమసి పోయిందని తెలుగుదేశం పార్టీ మహిళానేత, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి చెప్పారు. పార్టీ కోసం శ్రమించే వారికి తెదేపాలో సరైన గుర్తింపు లేదంటూ ఆమె తన మనస్సులోని అక్కసును ఇటీవల వెళ్లగక్కిన విషయం తెల్సిందే. దీనిపై ఆ పార్టీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకోసం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
Source: ఏపీ న్యూస్ | 21 Apr 2010 | 4:02 am

హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో నిత్యానంద స్వామి అరెస్టు

ఎట్టకేలకు నిత్యానంద స్వామి పోలీసులకు చిక్కారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈయన గత కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆర్కిలో ఉన్నట్టు సమాచారం అందుకున్న బెంగుళూరు పోలీసులు అక్కడకు చేరుకుని స్థానిక పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు. భక్తి ముసుగులో మహిళలు లోబరుచుకున్నారనే ఆరోపణల కింద ఆయనను అరెస్టు చేసినట్టు బెంగుళూరు పోలీసులు వెల్లడించారు.
Source: జాతీయ | 21 Apr 2010 | 3:14 am

విదేశీ ప్రయాణికుల వీసా గడువు పొడగింపు: హోంశాఖ

ఐస్‌లాండ్ అగ్నిపర్వతం కారణంగా విమానసర్వీసులు రద్దు కావడంతో స్వదేశంలోనే చిక్కున్న విదేశీ ప్రయాణికుల విసా కాలపరిమితిని పొడగించనున్నట్టు కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు.. ఇతర ప్రాంతాలకు విమాన సర్వీసులు పునరుద్ధరించే వరకు వీసా కాలాన్ని పొడగిస్తామని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 21 Apr 2010 | 2:23 am

తెలంగాణా జిల్లాల్లో పర్యటిస్తా.. ఏం చేస్తారో చూస్తా: చిరు

తెలంగాణ జిల్లాల్లో తాను ఒంటరిగానే పర్యటిస్తానని.. ఏం చేస్తారో చూస్తానని ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి సవాల్ విసిరారు. ఒక్కరి స్వార్థం కోసమే తెలంగాణ వాదం పుట్టుకొచ్చిందన్నారు. వీరికి తగిన సమయంలో ప్రజలు గుణపాఠం చెపుతారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Apr 2010 | 1:53 am

ప్రజారాజ్యం - ప్రజా తెలంగాణ సమితి శ్రేణుల ఘర్షణ

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రజారాజ్యం పార్టీ, ప్రజా తెలంగాణ సమితి కార్యకర్తల మధ్య బుధవారం ఘర్షణ, తోపులాట చోటు చేసుకుంది. ప్రరాపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఫిల్మ్‌నగర్ క్లబ్‌లో ఆ పార్టీ అధినేత చిరంజీవి నేతృత్వంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ నేతలతో పాటు.. కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రజా తెలంగాణ సమితి కార్యకర్తలు అక్కడకు చేరుకుని జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 21 Apr 2010 | 1:28 am

వివాదమూ లేదూ... నా బొందా లేదు: నన్నపనేని

తాను చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద వివాదాన్ని సృష్టించాయని వస్తున్న వార్తలను తెలుగుదేశం పార్టీ మహిళా ఫైర్‌బ్రాండ్ నన్నపనేని రాజకుమారి తేలిగ్గా కొట్టిపారేశారు. వివాదమూ లేదూ.. నా బొందా లేదూ అంటూ ఆమె సమాధానమిచ్చారు. అలాంటిదేమైనా ఉంటే మీకు వివరిస్తానని మీడియా మిత్రులతో అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Apr 2010 | 1:21 am

బాబూ.. ఇకచాలుగానీ బాలయ్యకు ఇవ్వండి: ప్రసన్న

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ తిరుగుబాటు నేత, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మరోమారు విమర్శలు ఎక్కుపెట్టారు. పార్టీ అధ్యక్షుడిగా ఇంతవరకు చేసింది చాలనీ.. ఇకపై పార్టీ పగ్గాలను దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నట వారసుడు హీరో బాలకృష్ణకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 21 Apr 2010 | 1:09 am

షార్ట్‌కట్‌లో దోచుకోవాలనుకున్నవారే వీడారు: చిరంజీవి

తన ఇమేజ్‌ను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చి షార్ట్‌కట్‌లో రాష్ట్రాన్ని దోచుకోవాలని భావించిన వారే పార్టీని వీడి పోయారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఘాటుగా వ్యాఖ్యానించారు. తన మిత్రులు, శ్రేయోభిలాషులు, హితులు, సన్నిహితులందరూ పార్టీలోనే ఉన్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ క్లబ్‌‍లో ప్రారంభమైంది.
Source: ఏపీ న్యూస్ | 21 Apr 2010 | 1:00 am

అనంత స్వర్ణమయాన్ని ఆపేయండి: హైకోర్టు ఉత్తర్వులు

తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన అనంత స్వర్ణమయం ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపి వేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పథకానికి సంబంధించి తదుపరి చేపట్టబోయే పనులన్నిటినీ నిలిపివేయాలని ఆదేశించింది.
Source: ఏపీ న్యూస్ | 21 Apr 2010 | 12:46 am

ఢిల్లీలో ధరల పెరుగుదలపై భాజపా సమర భేరీ

నిత్యావసర వస్తు ధరల పెరుగుదలపై ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ దేశ రాజధానిలో సమరభేరీ మోగించింది. ఇక్కడి రామ్‌లీలా మైదానంలో ఆ పార్టీకి చెందిన లక్షలాది మంది కార్యకర్తలు చేరుకుని ధర్నా చేస్తున్నారు. సుమారు మూడు లక్షల మంది కార్యకర్తలు ఇందులో పాల్గొంటారని అంచా వేస్తున్నారు. ఇక్కడ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు.
Source: జాతీయ | 21 Apr 2010 | 12:35 am

ఆంధ్రప్రదేశ్‌ను మరో ఛత్తీస్‌గఢ్‌గా మార్చొద్దు: విద్యార్థులు

అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంగా మార్చొద్దని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు కర్నూలు జిల్లా వాసులు విన్నవించారు. ఒక్కరి స్వప్రయోజనం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని, సమైక్యగానే ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 21 Apr 2010 | 12:06 am

ఐపీఎల్‌ను నిషేధించండి .. క్రికెట్‌ను రక్షించండి: థాక్రే

వివాదాస్పద ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అలియాస్ ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్)ను దేశంలో నిషేధించాలని శివసేన చీఫ్ బాల్‌థాక్రే డిమాండ్ చేశారు. ఈ క్రీడను దేశంలో నిషేధించి క్రికెట్‌ను రక్షించాలని ఆయన కేంద్రానికి సూచన చేశారు.
Source: జాతీయ | 20 Apr 2010 | 11:36 pm

కేసీఆర్‌ను పీడిస్తున్న దంతెవాడ మావోయిస్టుల భయం

ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుకు ఇపుడు ఓ భయం పట్టుకుంది. దంతెవాడ మావోయిస్టులు దుశ్చర్య ఆయనను పట్టిపీడిస్తోంది. వీరి వల్ల తన డిమాండ్ వెనక్కి పోయే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. అందువల్ల రాష్ట్రానికి చెందిన మావోలతో రాయబారం నడిపి, కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేయనున్నట్టు తెలుస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 20 Apr 2010 | 11:22 pm

ముఖ్యమంత్రిగా రోశయ్యకు ఎనిమిది నెలలే అవకాశం?!!

ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కొణిజేటి రోశయ్యకు ఎనిమిది నెలలు మాత్రమే అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ లోపు రాష్ట్రంలో పరిస్థితులు ఓ కొలిక్కి వస్తే యువ నేతకు పట్టాభిషేకం చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహరచన చేస్తోంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ పాలనను అధిష్టానం సాగిస్తోందని ఢిల్లీ వర్గాలు చెపుతున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 20 Apr 2010 | 10:51 pm

భద్రతా వలయంలో వాణిజ్య రాజధాని ముంబై నగరం

దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం భద్రతా వలయంలో చిక్కుకు పోయింది. ఇక్కడ జరిగే ఐపీఎల్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లపై ఉగ్రవాద దాడులు జరుగవచ్చని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నగరంలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, స్టాక్ మార్కెట్‌, ఇండియా గేట్, స్టార్ హోటల్స్, పేరొందిన బేకరీలు, ఆలయాలతో పాటు జనస్సమ్మర్ధ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు.
Source: జాతీయ | 20 Apr 2010 | 10:21 pm

మేఘాలయ కొత్త ముఖ్యమంత్రిగా ముకుల్ సంగ్మా

మేఘాలయ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం సమసిపోయింది. ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా 45 సంవత్సరాల ముకుల్ సంగ్మా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన చేత ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎస్.మూషాహరి ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే, ఉప ముఖ్యమంత్రిగా బీఎం.లపాంగ్, మంత్రులుగా జేఏ లింగ్డో, ఏటీ మండల్‌లు ప్రమాణ స్వీకారం చేశారు.
Source: జాతీయ | 20 Apr 2010 | 9:55 pm

ఫిలిమ్ ప్రొడక్షన్ బడ్జెట్ కంట్రోల్‌పై నిర్మాతల సమావేశం

తెలుగు చలనచిత్ర నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతున్న దృష్ట్యా దీనిపై చర్చించేందుకు అత్యవసర సమావేశం మంగళవారంనాడు ఫిలిమ్ ఛాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అన్నపూర్ణా స్టూడియో నుంచి సుప్రియ, ఇంకా డి. సురేష్ బాబు, కె.సి. శేఖర్ బాబు, పోకూరి బాబూరావుతోపాటు పలువురు నిర్మాతలు పాల్గొన్నారు. ప్రస్తుతం సినీ నిర్మాణవ్యయం పెరిగిపోయి నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లుతున్నందున వ్యయాన్ని తగ్గించుకోవాలని కొందరు సూచించారు. ఈ విషయాన్ని కూలంకషంగా చర్చించడానికి 11మంది సభ్యులతో దాసరి నారాయణరావు అధ్యక్షతన ఒక కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Apr 2010 | 1:54 pm

దర్శకరత్న అయితే ఎవడికేంటి..?!!

ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు కావడం తెలిసిందే. ఇండస్ట్రీకి తానే పెద్ద దిక్కుగా భావిస్తూ పలు రకాలుగా అన్ని సమస్యల్లో వేలు పెడుతున్న దర్శకరత్నకు పరాభవం జరిగింది. ఒకప్పుడు ఎన్టీఆర్‌తో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయనను దర్శనం చేసుకునేందుకు చెన్నైలో ప్రముఖ నిర్మాతలంతా పడిగాపులు కాసేవారు. కార్లు లైన్లో క్యూ కట్టి నిలబడి ఉండేవి. అంతటి ప్రభను చూపించిన ఆయన ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి ఇండస్ట్రీకి దూరమయ్యారు. మళ్లీ పదవి పోయాక ఇండస్ట్రీకి తిరిగి వచ్చి తానే ఇండస్ట్రీకి పెద్ద దిక్కని ప్రచారం చేసుకున్నారు. తిరిగి వచ్చిన తర్వాత తొలిసారిగా "ఫూల్స్" అనే సినిమా తీసి "ఫూల్" అయ్యారు. ఆయన దర్శకత్వానికి పసపోయిందనేది ఆయన అసిస్టింట్లే అంటుంటారు. ఇంకో విషయం ఏంటంటే.. ఆయన చిత్రాల్లో ఆయన శిష్యులే ఎక్కువగా పనిచేస్తారు.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Apr 2010 | 12:07 pm

నమితను నగ్నంగా మార్చేసిన సెక్సీ సైజులు..?!!

బోండాంలా మారిపోయిన నమిత నాజూకుదనం కోసం డైటింగ్‌లు, యోగా తదితర పద్ధతులను పాటిస్తోంది. కడుపును మాడ్చుకుంటూ ఎలాగైనా తన భారీ సైజులను తగ్గించుకోవాలనుకున్న నమిత ఆశ ఫలించింది. భారీ సైజులు కాస్తా క్రమంగా తగ్గిపోయాయి. స్లిమ్‌గా మారిన తర్వాత టాలీవుడ్‌లో తన సత్తాను చాటుకోవాలని నమిత ఉవ్విళ్లూరుతోంది. అంతా బాగానే ఉంది.కానీ తాజా చిత్రం "దేశద్రోహి"లో నటిస్తున్న నమితకోసం చెన్నైలోని కాస్ట్యూమ్ డిజైనర్ ఒకరు దుస్తులు పంపించాడట. అతడు పంపిన దుస్తుల్ని ధరించి చిత్రంలోని ఓ పాటకోసం నమిత నర్తించడం మొదలుపెట్టిందట. అలా నాట్యం చేస్తుండగానే నమిత ధరించిన దుస్తులు గబుక్కున కిందకు జారిపోయాయట. ఈ హఠత్పరిణామానికి బెంబేలెత్తిన నమిత జారిపోతున్న దుస్తుల్ని చేత బట్టుకుని తన మేకప్ రూమ్‌లోకి పరుగు లంకించుకున్నదట. కానీ ఆ సరికే ఒంటిపై ఉన్న దుస్తులన్నీ దాదాపు ఊడిపోయి నమిత నగ్నంగా మారిపోయినంత పనైందట.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Apr 2010 | 7:35 am

రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో "థ్రిల్లింగ్" మూవీ!

ఆర్.ఎం. ప్రొడక్షన్స్ పతాకంపై "థ్రిల్లింగ్" అనే చిత్రం ప్రారంభమైంది. గతంలో పలు చిత్రాలకు కథానాయకుడిగా నటించిన రాజేంద్రప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మున్నావర్ అలీ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో హేరాజ్ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్నో అనుభవావాలను నేర్చుకున్నాను. నటునిగా పలు చిత్రాలు చేశాను. దర్శకుడిగా మారుతానని అనుకోలేదు. ఈ చిత్రం అందరూ మెచ్చే చిత్రమవుతుందనే నమ్మకముంది. థ్రిల్లర్ అయినా లవ్‌స్టోరి కూడా ఇందులో ఉంది. ప్రముఖ హీరో ఇందులో నటిస్తున్నారు. కథ చెప్పగానే వెంటనే నటించేందుకు అంగీకరించారు. ఆ పాత్ర సస్పెన్స్. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది" అని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Apr 2010 | 6:48 am

సిట్జర్లాండ్‌లో "మా అన్నయ్య బంగారం" షూటింగ్

డాక్టర్ రాజశేఖర్, కమలినీ ముఖర్జీ నాయకానాయికలుగా జొన్నలగడ్డ శ్రీను దర్శకత్వంలో విశాఖ టాకీస్ పతాకంపై నట్టికుమార్ నిర్మిస్తున్న "మా అన్నయ్య బంగారం" చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ఎల్.జె. స్టూడియోలో ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీత సారథ్యంలో ఈ సినిమా పాటల రికార్డింగ్ జరుగుతోందని నిర్మాత తెలిపారు. ఈ పాటలకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారని ఆయన చెప్పారు. ఇంకా ఈ నెల 22 నుంచి 30 వరకు సిట్జర్లాండ్‌లో రెండు పాటలను చిత్రీకరించనున్నామని నిర్మాత వెల్లడించారు. మే 3 నుంచి జూలై ఐదో తేదీ వరకు సింగిల్ షెడ్యూల్‌తో ఏకధాటిగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామని నట్టికుమార్ చెప్పారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై చివరి వారంలో సినిమాను విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Apr 2010 | 6:31 am

సమ్మర్ బ్యూటీ అండ్ కూల్ స్పాట్ "కొడైకెనాల్"

వేసవిలో ఎండతాపాన్ని చల్లార్చుకునేందుకు చల్లగా ఉండే ప్రదేశాలను వెతుక్కుని మరీ వాలిపోయే ప్రకృతి ప్రేమికులకు అచ్చమైన దేశీయ కూల్ స్పాట్ "కొడైకెనాల్". పర్యాటకులంతా "ప్రిన్స్ ఆఫ్ హిల్‌స్టేషన్‌" అంటూ ముద్దుగా పిలుచుకునే ఈ ప్రదేశం దక్షిణ భారతదేశంలోని చెన్నై నగరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Source: వినోదం | 20 Apr 2010 | 5:29 am

లలిత్ మోడీపై సమిష్టిగానే నిర్ణయం : శరద్ పవార్

ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు గవర్నింగ్ బాడీ సమావేశంలో సమిష్టిగా ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి, బీసీసీఐ మాజీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. అనేకంగా ఆయనపై ఈనెల 26వ తేదీన చర్య తీసుకునే అవకాశం లేకపోలేదని పవార్ సూచన ప్రాయంగా వెల్లడించారు.
Source: జాతీయ | 20 Apr 2010 | 5:01 am

పూర్తి స్థాయి దర్యాప్తు కోసమే రాజీనామా చేశా: థరూర్

తనపై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే తాను మంత్రిపదవికి రాజీనామా చేసినట్టు కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ సభ్యుడు శశి థరూర్ స్పష్టం చేశారు. ఐపీఎల్ వ్యవహారానికి సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన మంగళవారం లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. ఐపీఎల్ ఫ్రాంచైజీల వేలం పాటల్లో చట్టానికి, అంతరాత్మ ప్రభోధానికి వ్యతిరేకంగా తాను వ్యవహరించలేదన్నారు.
Source: జాతీయ | 20 Apr 2010 | 3:12 am