పుంజుకున్న ట్రేడింగ్: లాభాల్లో స్టాక్ మార్కెట్

మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం దిశగా ర్యాలీని కొనసాగిస్తున్న సెన్సెక్స్, నిఫ్టీలు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వృద్ధిని నమోదు చేసుకున్నాయి. దీంతో సెన్సెక్స్ సూచీ లాభాలతో 17,540 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 5,255 పాయింట్ల మార్కును తాకింది.
Source: Yahoo! Telugu: News | 20 Apr 2010 | 9:17 am

మూడో అణు పరీక్షకు ఉత్తర కొరియా సిద్ధం: రిపోర్ట్స్

అంతర్జాతీయ సమాజంలో ఏర్పడిన అణ్వాయుధ పోటీని తగ్గించాలని ప్రపంచ దేశాలన్ని ముక్తకంఠంతో ఓ వైపు పిలుపునిస్తున్నాయి. మరోవైపు.. ఉత్తరకొరియా, ఇరాన్ వంటి దేశాలు గుట్టుచప్పుడు కాకుండా అణు పరీక్షలు నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
Source: Yahoo! Telugu: News | 20 Apr 2010 | 9:13 am

పూర్తి స్థాయి దర్యాప్తు కోసమే రాజీనామా చేశా: థరూర్

తనపై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే తాను మంత్రిపదవికి రాజీనామా చేసినట్టు కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ సభ్యుడు శశి థరూర్ స్పష్టం చేశారు. ఐపీఎల్ వ్యవహారానికి సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన మంగళవారం లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. ఐపీఎల్ ఫ్రాంచైజీల వేలం పాటల్లో చట్టానికి, అంతరాత్మ ప్రభోధానికి వ్యతిరేకంగా తాను వ్యవహరించలేదన్నారు.
Source: Yahoo! Telugu: News | 20 Apr 2010 | 8:41 am

వడ్డీ రేట్లను బ్యాంకులు ఇప్పట్లో పెంచవుః సెంట్రల్ బ్యాంక్

ఆర్‌బీఐ బేసిస్ పాయింట్లను పెంచిన నేపథ్యంలో దేశీయ బ్యాంకులు వడ్డీ రేట్లను ఇప్పట్లో పెంచవని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ కౌల్ మంగళవారం ముంబైలో తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 20 Apr 2010 | 8:33 am

ఆర్‌బీఐ ప్రభావం: లాభాల్లో స్టాక్ మార్కెట్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించడం బాంబే స్టాక్ మార్కెట్‌కు ఊతమిచ్చింది. ఫలితంగా మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, 147 పాయింట్లు వృద్ధి చెంది, 17,547 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 51 పాయింట్లు పుంజుకుని, 5,255 పాయింట్ల మార్కును తాకింది.
Source: Yahoo! Telugu: News | 20 Apr 2010 | 8:33 am

నమితను నగ్నంగా మార్చేసిన సెక్సీ సైజులు..?!!

బోండాంలా మారిపోయిన నమిత నాజూకుదనం కోసం డైటింగ్‌లు, యోగా తదితర పద్ధతులను పాటిస్తోంది. కడుపును మాడ్చుకుంటూ ఎలాగైనా తన భారీ సైజులను తగ్గించుకోవాలనుకున్న నమిత ఆశ ఫలించింది. భారీ సైజులు కాస్తా క్రమంగా తగ్గిపోయాయి. స్లిమ్‌గా మారిన తర్వాత టాలీవుడ్‌లో తన సత్తాను చాటుకోవాలని నమిత ఉవ్విళ్లూరుతోంది. అంతా బాగానే ఉంది.కానీ తాజా చిత్రం "దేశద్రోహి"లో నటిస్తున్న నమితకోసం చెన్నైలోని కాస్ట్యూమ్ డిజైనర్ ఒకరు దుస్తులు పంపించాడట. అతడు పంపిన దుస్తుల్ని ధరించి చిత్రంలోని ఓ పాటకోసం నమిత నర్తించడం మొదలుపెట్టిందట. అలా నాట్యం చేస్తుండగానే నమిత ధరించిన దుస్తులు గబుక్కున కిందకు జారిపోయాయట. ఈ హఠత్పరిణామానికి బెంబేలెత్తిన నమిత జారిపోతున్న దుస్తుల్ని చేత బట్టుకుని తన మేకప్ రూమ్‌లోకి పరుగు లంకించుకున్నదట. కానీ ఆ సరికే ఒంటిపై ఉన్న దుస్తులన్నీ దాదాపు ఊడిపోయి నమిత నగ్నంగా మారిపోయినంత పనైందట.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Apr 2010 | 7:35 am

ముఖ్యమంత్రి కోసం రూ.150 కోట్లతో జెట్ విమానం

ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కోసం ప్రత్యేకంగా జెట్ విమానాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం 150 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. ముఖ్యమంత్రికి మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా, రోడ్డు, రైలు మార్గాల్లో ప్రయాణించడం ఏమాత్రం సురక్షితం కాదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆయన ప్రయాణించే మార్గాల్లో ముందస్తు తనిఖీలు నిర్వహించడమే కాకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని ఆ వర్గాలు సూచించాయి.
Source: Yahoo! Telugu: News | 20 Apr 2010 | 7:31 am

దశలవారీగా విద్యుత్ కోత ఎత్తివేతకు సీఎం ఆదేశం

రాష్ట్రంలో పరిశ్రమలకు అమలు చేస్తున్న విద్యుత్ కోతను దశల వారీగా ఎత్తివేయాల్సిందిగా ముఖ్యమంత్రి కె.రోశయ్య ఆదేశించారు. ఆయన మంగళవారం ఆశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు విద్యుత్ కోతను వీలైనంత త్వరగా తగ్గించాలని సూచించారు. ముఖ్యంగా, విద్యుత్ హాలిడేను ఒక్కరోజుకు కుదించాలని ఆయన కోరారు.
Source: Yahoo! Telugu: News | 20 Apr 2010 | 7:18 am

లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి

ఆసియా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జించింది. గోల్డ్‌మన్ ప్రభావంతో సోమవారం కుప్పకూలిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మంగళవారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో 149 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 47 పాయింట్లు బలపడి, 5,251 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 20 Apr 2010 | 7:17 am

నక్సల్స్ అణిచివేతలో దేశానికే ఆదర్శం రాష్ట్రం: సబిత

మావోయిస్టుల ఏరివేతలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గుంటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో యువత పెడదారి పట్టకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Source: Yahoo! Telugu: News | 20 Apr 2010 | 7:09 am

2014 సీఎం రేసులో తేదేపా తరపున "షష్టిపూర్తి" బాబేనా..?!!

ఆంధ్రప్రదేశ్‌ను హైటెక్ రాష్ట్రంగా దేశంలో కొత్త పుంతలు తొక్కించిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీని తన సుడిగాలి పర్యటనలతో మట్టిగరిపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు అల్లుడైన చంద్రబాబు తొలుత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి, ఆ పిదప మామగారి పార్టీలోకి జంప్ అయ్యారు.
Source: Yahoo! Telugu: News | 20 Apr 2010 | 7:02 am

రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో "థ్రిల్లింగ్" మూవీ!

ఆర్.ఎం. ప్రొడక్షన్స్ పతాకంపై "థ్రిల్లింగ్" అనే చిత్రం ప్రారంభమైంది. గతంలో పలు చిత్రాలకు కథానాయకుడిగా నటించిన రాజేంద్రప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మున్నావర్ అలీ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో హేరాజ్ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్నో అనుభవావాలను నేర్చుకున్నాను. నటునిగా పలు చిత్రాలు చేశాను. దర్శకుడిగా మారుతానని అనుకోలేదు. ఈ చిత్రం అందరూ మెచ్చే చిత్రమవుతుందనే నమ్మకముంది. థ్రిల్లర్ అయినా లవ్‌స్టోరి కూడా ఇందులో ఉంది. ప్రముఖ హీరో ఇందులో నటిస్తున్నారు. కథ చెప్పగానే వెంటనే నటించేందుకు అంగీకరించారు. ఆ పాత్ర సస్పెన్స్. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది" అని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Apr 2010 | 6:48 am

సిట్జర్లాండ్‌లో "మా అన్నయ్య బంగారం" షూటింగ్

డాక్టర్ రాజశేఖర్, కమలినీ ముఖర్జీ నాయకానాయికలుగా జొన్నలగడ్డ శ్రీను దర్శకత్వంలో విశాఖ టాకీస్ పతాకంపై నట్టికుమార్ నిర్మిస్తున్న "మా అన్నయ్య బంగారం" చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ఎల్.జె. స్టూడియోలో ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీత సారథ్యంలో ఈ సినిమా పాటల రికార్డింగ్ జరుగుతోందని నిర్మాత తెలిపారు. ఈ పాటలకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారని ఆయన చెప్పారు. ఇంకా ఈ నెల 22 నుంచి 30 వరకు సిట్జర్లాండ్‌లో రెండు పాటలను చిత్రీకరించనున్నామని నిర్మాత వెల్లడించారు. మే 3 నుంచి జూలై ఐదో తేదీ వరకు సింగిల్ షెడ్యూల్‌తో ఏకధాటిగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామని నట్టికుమార్ చెప్పారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై చివరి వారంలో సినిమాను విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Apr 2010 | 6:31 am

మే మొదటివారంలో "ఆంటీ అంకుల్ నందగోపాల్"

వడ్డే నవీన్ హీరోగా యం.విజయకుమారి సమర్పణలో జయకృష్ణా క్రియేషన్స్ పతాకంపై డి.వి.కె.నాగేశ్వరరావు దర్శకత్వంలో సి.గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ "ఆంటీ అంకుల్ నందగోపాల్". షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా డీటీఎస్ మిక్సింగ్ జరుపుకుంటోంది.ఈ సందర్భంగా నిర్మాత సి.గోపాలకృష్ణ మాట్లాడుతూ... కుటుంబ సమేతంగా చూడదగ్గ హాస్యభరిత చిత్రంగా మా ఆంటీ అంకుల్ నందగోపాల్ రూపొందుతోంది. చక్కని కథ, కథనాలతో అందరినీ ఆకట్టుకునే ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటులంతా నటించారు. ఆంటీ అంకుల్ నందగోపాల్ అనే టైటిల్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Apr 2010 | 5:35 am

పూర్తి స్థాయి దర్యాప్తు కోసమే రాజీనామా చేశా: థరూర్

తనపై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే తాను మంత్రిపదవికి రాజీనామా చేసినట్టు కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ సభ్యుడు శశి థరూర్ స్పష్టం చేశారు. ఐపీఎల్ వ్యవహారానికి సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన మంగళవారం లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. ఐపీఎల్ ఫ్రాంచైజీల వేలం పాటల్లో చట్టానికి, అంతరాత్మ ప్రభోధానికి వ్యతిరేకంగా తాను వ్యవహరించలేదన్నారు.
Source: జాతీయ | 20 Apr 2010 | 3:12 am

ముఖ్యమంత్రి కోసం రూ.150 కోట్లతో జెట్ విమానం

ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కోసం ప్రత్యేకంగా జెట్ విమానాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం 150 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. ముఖ్యమంత్రికి మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా, రోడ్డు, రైలు మార్గాల్లో ప్రయాణించడం ఏమాత్రం సురక్షితం కాదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆయన ప్రయాణించే మార్గాల్లో ముందస్తు తనిఖీలు నిర్వహించడమే కాకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని ఆ వర్గాలు సూచించాయి.
Source: ఏపీ న్యూస్ | 20 Apr 2010 | 2:03 am

దశలవారీగా విద్యుత్ కోత ఎత్తివేతకు సీఎం ఆదేశం

రాష్ట్రంలో పరిశ్రమలకు అమలు చేస్తున్న విద్యుత్ కోతను దశల వారీగా ఎత్తివేయాల్సిందిగా ముఖ్యమంత్రి కె.రోశయ్య ఆదేశించారు. ఆయన మంగళవారం ఆశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు విద్యుత్ కోతను వీలైనంత త్వరగా తగ్గించాలని సూచించారు. ముఖ్యంగా, విద్యుత్ హాలిడేను ఒక్కరోజుకు కుదించాలని ఆయన కోరారు.
Source: ఏపీ న్యూస్ | 20 Apr 2010 | 1:48 am

నక్సల్స్ అణిచివేతలో దేశానికే ఆదర్శం రాష్ట్రం: సబిత

మావోయిస్టుల ఏరివేతలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గుంటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో యువత పెడదారి పట్టకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 20 Apr 2010 | 1:39 am

అందరి కళ్లూ ఆర్థూర్ రోడ్డు కేంద్ర కారాగారం వైపే!

ముంబై మారణహోమంలో సజీవంగా పట్టుబడిన పాక్ ప్రేరేపిత లష్కర్ తోయిబా ఉగ్రవాది అజ్మల్ కసబ్ భవితవ్యం వచ్చే నెల మూడో తేదీన తేలనుంది. ముంబై దాడుల కేసు విచారణ ముంబైలోని ఆర్థూర్ రోడ్ సెంట్రల్ జైలులో పూర్తయింది. ఈ కేసు తుది తీర్పు మే మూడో తేదీన విడుదల కానుంది. దీంతో అందరికళ్లూ అటువైపే కేంద్రీకృతమై ఉంది.
Source: జాతీయ | 20 Apr 2010 | 1:15 am

మొదట సెక్స్ - ఆ తర్వాతే వివాహం: ఖాకీ జంట నిర్వాకం

తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను, భద్రతను కాపాడాల్సిన పోలీసులే.. ఆ ఆలయాన్ని అపవిత్రం చేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే.. తిరుమల కొండపై ఉన్న అతిథి గృహాలు శృంగార కార్యకలాపాలకు నిలయాలు అనే పేరుంది. ఇది మరోమారు సార్థకత అయ్యేలా ఓ పోలీసు ప్రేమ జంట వ్యవహరించింది.
Source: ఏపీ న్యూస్ | 20 Apr 2010 | 1:15 am

ఐపీఎల్ వ్యవహారం.. మరో ఇద్దరు మంత్రులకు లింకు!

ఇడియన్ ప్రీమియర్ లీగ్ కాస్త.. ఇండియన్ పొలిటికల్ లీగ్‌గా మారిపోయినట్టు కనిపిస్తోంది. ఐపీఎల్ కొత్త జట్ల ఎంపిక వ్యవహార వివాదంలో చిక్కుకుని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శశిథరూర్ తన మంత్రిపదవిని వదులుకున్న విషయం తెల్సిందే. తాజాగా మరో ఇద్దరు కేంద్ర మంత్రులకు ఇందులో సంబంధం ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి.
Source: జాతీయ | 20 Apr 2010 | 12:24 am

విజయవంతంగా సాగుతున్న ప్రజాపథం: ముఖ్యమంత్రి

ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ఐదో విడత ప్రజాపథం కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నట్టు ముఖ్యమంత్రి కె.రోశయ్య తెలిపారు. తన సొంత జిల్లా ప్రకాశంలో ప్రజాపథం కార్యక్రమానికి సోమవారం ప్రారంభించిన ఆయన మంగళవారం సికింద్రాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజాపథంలో పలు చోట్ల అడ్డంకులు ఎదురైనప్పటికీ విజయవంతంగా సాగుతోందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 19 Apr 2010 | 11:31 pm

అక్కడా ఆంధ్రావాలేనా: మండిపడుతున్న 'టి' వాదులు!

ఆంధ్రాప్రాంతం వారిపై తెలంగాణ వాదులు మరోమారు తమ అక్కసు వెళ్లగక్కారు. ఎక్కడకు వెళ్లినా.. ఈ ఆంధ్రావాలాలు తమను వదిలేలా లేరని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన అంశంపై జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి చెందిన సభ్యుల్లో రవీందర్ కౌర్, అబూసలె షరీఫ్‌లు ప్రజలతో సంప్రదింపులు జరుపుతున్న విషయం తెల్సిందే. వీరి తొలి పర్యటన మహబూబ్‌నగర్ జిల్లాలో సాగుతోంది.
Source: ఏపీ న్యూస్ | 19 Apr 2010 | 11:20 pm

దశల వారీగా మిగ్ 21 ఫ్లైట్స్ తొలగింపు: ఆంటోనీ

భారత వైమానిక దళంలో ఉన్న మిగ్ 21 రకం విమానాలను దశల వారీగా తొలగించనున్నట్టు కేంద్ర రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే ఎయిర్‌క్రాఫ్ట్‌లను వైమానిక దళానికి సమకూర్చుతామన్నారు.
Source: జాతీయ | 19 Apr 2010 | 10:19 pm

మేఘాలయ రాష్ట్రంలో పదేళ్ళలో 11 ప్రభుత్వాలు

రాజకీయ సంక్షోభాలకు నిలయంగా మేఘాలాయ రాష్ట్ర పేరుగడిస్తోంది. గత పది సంవత్సరాల్లో 11 ప్రభుత్వం ఏర్పాటు కానుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తాజాగా, 11వ ప్రభుత్వం కొలువుదీరేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.
Source: జాతీయ | 19 Apr 2010 | 10:19 pm

వరల్డ్ మూవీస్ "ఏక్"కి నాగార్జున క్లాప్

వరల్డ్ మూవీస్ పతాకంపై బిష్ణు, అపర్ణశర్మ హీరోహీరోయిన్లుగా ఏక్ అనే చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం ప్రారంభించారు. హీరోహీరోయిన్లపై అక్కినేని నాగార్జున క్లాప్ కొట్టగా, స్టూడియో మేనేజర్ సీత కెమేరా స్విచాన్ చేశారు. ఈ చిత్రానికి కథ, కథనం, నిర్మాత: హారిక్, దర్శకత్వం: సంపత్చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ... మా చిత్రానికి నాగార్జున ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. వియ్ ఆర్ ఆల్ ఒన్- అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నాం. ఇందులో 5 పాటలున్నాయి. మంత్ర ఆనంద్ బాణీలు సమకూర్చారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Apr 2010 | 2:22 pm

దెయ్యాన్ని చూస్తే నాలుక పిడచకట్టుక పోవాలి: వర్మ

మన దెయ్యపు సినిమాలు ప్రేక్షకులను అంతగా భయపెట్టలేకపోతున్నాయంటున్నారు క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. హాలీవుడ్ దెయ్యం సినిమాలు రూపొందిన స్థాయిలో మన దెయ్యం సినిమాలు ఉండటం లేదంటున్నారు. బాలీవుడ్‌లో ఇటీవల విక్రమ్ భట్ అందించిన "శాపిత్", స్నేహా ఉల్లాల్, శ్రేయాస్ తల్పడే నటించిన "క్లిక్" చిత్రాలు బాలీవుడ్ ప్రేక్షకులకు అంత భయంకరమైన అనుభూతిని కలిగించలేదని ఆయన అభిప్రాయపడ్డారు.అదేసమయంలో హాలీవుడ్ దెయ్యపు సినిమాల్ని చూసినప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయనీ, నాలుక పిడచ కట్టుకపోతుందని అన్నారు. అయితే ఇక్కడ దెయ్యం సినిమాల్ని చూసినప్పుడు ఆ అనుభూతి కలగటం లేదని చెప్పుకొచ్చారు.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Apr 2010 | 10:57 am

హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాల్సిందే: దానం

రాష్ట్ర విభజన అనివార్యమైన పక్షంలో రాజధాని హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాల్సిందేనని రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. అలాగే, జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి ఎంఐఎం ఇచ్చిన నివేదికతో తాము ఏకీభవించబోమన్నారు. హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలను కలిపి గ్రేటర్ తెలంగాణగా ఏర్పాటు చేయడానికి తాము అంగీకరించబోమన్నారు.
Source: ఏపీ న్యూస్ | 19 Apr 2010 | 9:47 am

మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్సీలకు స్థానం: రోశయ్య

త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటించారు. సోమవారం ప్రకాశం జిల్లాలో ప్రజాపథంలో పాల్గొన్న ముఖ్యమంత్రి తొలిసారిగా మంత్రివర్గ విస్తరణపై నోరు విప్పారు.తాను చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్సీలకు కూడా అవకాశం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 19 Apr 2010 | 7:42 am

శ్రీశ్రీ స్ఫూర్తితో శర్వానంద్ రాజకీయ "ప్రస్థానం"

మనిషి "ప్రస్థానం" ఎలా ఉంటుందో తన కవిత్వంలో చొప్పించాడు శ్రీశ్రీ. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని కథ అల్లాడు దర్శకుడు దేవకట్టా. ఎన్నారై అయిన దేవకట్టా తొలిసారిగా తన స్నేహితులతో కలిసి "వెన్నెల" అనే చిత్రాన్ని తీసి మెప్పించాడు. మళ్ళీ చాలా కాలం గ్యాప్ తీసుకుని కథపై అవగాహనతో ముందుకు వచ్చాడు. అదే "ప్రస్థానం"గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషిలో అసూయద్వేషాలు, కోపతాపాలు, కుటుంబంలో ఒకరు ఎక్కువ, తక్కువ అనే స్వభావాలు ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందనే విషయాన్ని సజీవ పాత్రల ద్వారా చూపారు. ఇందులో నటీనటులు అందరూ బాగానే చేశారు. శర్వానంద్‌కు మంచి బ్రేక్ ఇచ్చే సినిమా. "గమ్యం" తర్వాత శర్వానంద్‌కు అంతపేరు వస్తుంది. ఇదే కథతో పేరున్న హీరో అయితే సినిమా రేంజే వేరుగా ఉండేది. కథను పూర్తి సీరియస్‌గా తెరకెక్కించిన దేవకట్టా సఫలీకృతుడయ్యాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Apr 2010 | 7:41 am

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి "రాక్షసి"

ది వాల్ట్ డిస్నీ కంపెనీ ( ఇండియా) తన మొదటి దక్షిణ భారత చలనచిత్రాన్ని కె.రాఘవేంద్రరావుతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రాజెక్టును నవంబరు 2009లో ప్రారంభించి, జనవరి 2011న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యపాత్రలో సిద్ధార్థ్, శృతిహాసన్, లక్ష్మి మంచు, హర్షిత నటిస్తున్నారు.సిద్ధార్థ్ తన లవర్ బాయ్ ఇమేజ్‌కు భిన్నంగా కత్తి యుద్ధాలతో పోరాట యోధునిగా ఒక కొత్త పాత్రలో కనబడబోతున్నారు. కథానాయకిగా కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. బుల్లితెర వ్యాఖ్యాతగా అనతికాలంలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించిన డాక్టర్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఒక విభిన్నమైన పాత్రలో నటించనున్నారు. ఇతర ముఖ్యపాత్రలలో డాక్టర్ బ్రహ్మానందం, రవిబాబు, అలీ కనిపించనున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Apr 2010 | 7:18 am

మేలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న "ధూల్"

జై మారుతి ఫిలింస్ పతాకంపై ప్రముఖ వ్యాపారావేత్త కె.ఆర్.ఎస్. అయ్యంగార్ ఫైట్ మాస్టర్ బి.విక్కీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "ధూల్". బి. విక్కీ కథ, స్క్రీన్‌ప్లే దర్శకత్వంలో కొత్త కథానాయకుల్ని పరిచయం చేస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలైంది. ప్రస్తుతం రామానాయుడు స్టూడియోలో రీ-రికార్డింగ్‌ను పూర్తిచేసుకుని డీటీఎస్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి చిత్ర దర్శక నిర్మాత అయ్యంగార్ మాట్లాడుతూ.. ఇటీవలే విడుదలైన ఆడియోకి మంచి స్పందన లభించింది. సంగీత దర్శకుడు ఖుద్దూస్‌కి ఈ పాటల ద్వారా మంచి పేరు వచ్చింది. మే మొదటివారంలో రెండో విడతగా ఆడియో సీడీలను విడుదల చేయనున్నాం. ఇక సినిమాపరంగా దర్శకుడు విక్కీ ఎంతో శ్రమించి దీన్ని తీర్చిదిద్దారు. తప్పకుండా "ధూల్" అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏప్రిల్ 25 కల్లా "ధూల్" తొలి కాపీని సిద్ధం చేస్తాం. దీనికి ముందుగా "ధూల్" సినిమా ట్రైలర్స్‌ని మే తొలివారంలోని రాష్ట్రంలోని అన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తాం" అని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Apr 2010 | 6:52 am

హిమాలయాల్లో "తకిట తకిట" షూటింగ్!

అందరూ కొత్త తారలతో భూమిక ముఖ్య పాత్రలో, కింగ్ నాగార్జున, అరుంధతి అనుష్క స్పెషల్ అప్పియరెన్స్‌తో డౌన్‌టౌన్ ఫిలింస్ పతాకంపై శ్రీహరి నాను దర్శకత్వంలో భూమికా చావ్లా సమర్పణలో భరత్ ఠాకూర్ నిర్మిస్తున్న "తకిట తకిట" చిత్రం చివరి షెడ్యూల్ హిమాలయాల్లో జరుగుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Apr 2010 | 6:37 am

దెయ్యాన్ని చూస్తే నాలుక పిడచకట్టుక పోవాలి: వర్మ

మన దెయ్యపు సినిమాలు ప్రేక్షకులను అంతగా భయపెట్టలేకపోతున్నాయంటున్నారు క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. హాలీవుడ్ దెయ్యం సినిమాలను రూపొందిన స్థాయిలో మన దెయ్యం సినిమాలు ఉండటం లేదంటున్నారు. బాలీవుడ్‌లో ఇటీవల విక్రమ్ భట్ అందించిన "శాపిత్", స్నేహా ఉల్లాల్, శ్రేయాస్ తల్పడే నటించిన "క్లిక్" చిత్రాలు బాలీవుడ్ ప్రేక్షకులకు...
Source: వినోదం | 19 Apr 2010 | 5:29 am

తెలంగాణ ద్రోహుల జాబితాలో ఎంఐఎం: తెరాస

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రతిబంధకంగా మారిన ద్రోహుల జాబితాలో తాజాగా ఎంఐఎం పార్టీని కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చేర్చింది. ఇప్పటికే.. ఆ జాబితాలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్, ప్రజారాజ్యం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడులు ఉన్నారు. తాజాగా ఎంఐఎం సమైక్యాంధ్రకు అనుకూలంగా జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి నివేదిక సమర్పించింది. దీంతో ఆ పార్టీని కూడా తెలంగాణ ద్రోహుల పార్టీగా కేసీఆర్ అండ్ కో అభివర్ణిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 19 Apr 2010 | 5:06 am

ఐపీఎల్ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ: మంత్రి ప్రణబ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తలెత్తిన వివాదం అన్ని ఫ్రాంచైజీల మెడకు చుట్టుకుంటోంది. ఎనిమిది జట్ల ఆర్థిక లావాదేవీలపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం తెలిపారు. ఈ విచారణలో దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షిస్తామని లోక్‌సభలో వెల్లడించారు.
Source: జాతీయ | 19 Apr 2010 | 4:36 am

కొలిచినవారి కొంగు బంగారం "కొల్లేటికోట పెద్దింట్లమ్మ"

తొమ్మిది అడుగుల ఎత్తుతో, విశాల నేత్రాలతో, వీరాసన భంగిమలో కొల్లేటికోటలో కొలువైయున్న "పెద్దింట్లమ్మ" కొలిచినవారి కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. కొల్లేరు లంక గ్రామాల ప్రజల ఆరాధ్య దైవమైన పెద్దింట్లమ్మను దర్శించుకునేందుకు ఆంధ్రరాష్ట్రంలోని వివిధ ప్రాంతలనుంచి వేల సంఖ్యలో భక్తులు, పర్యాటకులు తరలివస్తుంటారు.
Source: వినోదం | 19 Apr 2010 | 4:25 am

కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు పోరాటం: నన్నపనేని

పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ పని చేస్తున్న కార్యకర్తలకు న్యాయం జరిగేంత వరకు తాను పోరాడుతానని తెలుగుదేశం పార్టీ మహిళా ఫైర్‌బ్రాండ్ నన్నపనేని రాజకుమారి అన్నారు. తెదేపాలో పని చేసే వారికి గుర్తింపు లేదంటూ తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని ఆమె మరోమారు స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 19 Apr 2010 | 3:58 am