|
కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు పోరాటం: నన్నపనేనిపార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ పని చేస్తున్న కార్యకర్తలకు న్యాయం జరిగేంత వరకు తాను పోరాడుతానని తెలుగుదేశం పార్టీ మహిళా ఫైర్‌బ్రాండ్ నన్నపనేని రాజకుమారి అన్నారు. తెదేపాలో పని చేసే వారికి గుర్తింపు లేదంటూ తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని ఆమె మరోమారు స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 19 Apr 2010 | 9:28 am షోయబ్ మాలిక్ పాస్‌పోర్టు అప్పగించండి: హైకోర్టుషోయబ్ మాలిక్ పాస్‌పోర్టును అతనికి అప్పగించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సోమవారం పోలీసు శాఖను ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన అయేషా సిదిఖీ అనే యువతిని వివాహం చేసుకుని మోసం చేసిన కేసులో షోయబ్ మాలిక్ పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 19 Apr 2010 | 8:42 am ట్రేడింగ్ క్షీణత: 157 పాయింట్లు పతనమైన సెన్సెక్స్దేశీయ వాటాల ట్రేడింగ్ క్షీణించడంతో బాంబే స్టాక్ మార్కెట్ పతనమైంది. గోల్డ్‌మెన్ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్ల ట్రేడింగ్ ఊపందుకోకపోవడంతో ఆ ప్రభావం బాంబే స్టాక్ ఎక్చేంజ్‌పై పడింది. దీంతో సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు సెన్సెక్స్, 157 పాయింట్లు క్షీణించి, 17,433 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 52 పాయింట్లు పడిపోయి, 5,210 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 19 Apr 2010 | 8:23 am కేసీఆర్ బృందంపై దాడులు తప్పవేమో: కాంగ్రెస్ నేతలుప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుతో పాటు ఆయన బృందంపై దాడులు చేయక తప్పదని ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా, ప్రజలను రెచ్చగొట్టేలా ఆయన వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అందువల్ల కేసీఆర్ అండ్ కో పై దాడులు చేయక తప్పదని కాంగ్రెస్ తెలంగాణ నేతలు ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 19 Apr 2010 | 7:58 am శశి థరూర్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన ఆర్థికమంత్రిత్వ శాఖకొచ్చి-ఐపీఏల్ వివాదంలో కూరుకున్న మాజీ కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి శశి థరూర్‌కు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం క్లీన్ చిట్ ఇచ్చింది.Source: Yahoo! Telugu: News | 19 Apr 2010 | 7:51 am శ్రీశ్రీ స్ఫూర్తితో శర్వానంద్ రాజకీయ "ప్రస్థానం"మనిషి "ప్రస్థానం" ఎలా ఉంటుందో తన కవిత్వంలో చొప్పించాడు శ్రీశ్రీ. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని కథ అల్లాడు దర్శకుడు దేవకట్టా. ఎన్నారై అయిన దేవకట్టా తొలిసారిగా తన స్నేహితులతో కలిసి "వెన్నెల" అనే చిత్రాన్ని తీసి మెప్పించాడు. మళ్ళీ చాలా కాలం గ్యాప్ తీసుకుని కథపై అవగాహనతో ముందుకు వచ్చాడు. అదే "ప్రస్థానం"గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషిలో అసూయద్వేషాలు, కోపతాపాలు, కుటుంబంలో ఒకరు ఎక్కువ, తక్కువ అనే స్వభావాలు ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందనే విషయాన్ని సజీవ పాత్రల ద్వారా చూపారు. ఇందులో నటీనటులు అందరూ బాగానే చేశారు. శర్వానంద్‌కు మంచి బ్రేక్ ఇచ్చే సినిమా. "గమ్యం" తర్వాత శర్వానంద్‌కు అంతపేరు వస్తుంది. ఇదే కథతో పేరున్న హీరో అయితే సినిమా రేంజే వేరుగా ఉండేది. కథను పూర్తి సీరియస్‌గా తెరకెక్కించిన దేవకట్టా సఫలీకృతుడయ్యాడు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Apr 2010 | 7:41 am రాత్రిపూట కరెంట్ లైటు వేస్తే కేన్సర్ వస్తుంది: రీసెర్స్రాత్రిపూట అకస్మాత్తుగా విద్యుత్ లైటు వేయడం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్, ఇజ్రాయేల్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. రాత్రిపూట అకస్మాత్తుగా ఒక్కసారి లైటు వేయడం వల్ల శరీరంలోని కణాలు తీవ్ర ఒత్తిడికి లోనవుతాయని వారు చెపుతున్నారు.Source: Yahoo! Telugu: News | 19 Apr 2010 | 7:40 am లపాంగ్ రాజీనామా లేఖపై గవర్నర్ ఆమోదముద్రకాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం మెజారిటీని కోల్పోయిన మేఘాలయా ముఖ్యమంత్రి డీడీ.లపాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై ఆ రాష్ట్ర గవర్నర్ తక్షణం ఆమోద ముద్ర వేశారు. అయితే, కొత్త శాసనసభానేతను ఎన్నుకునేందుకు మేఘాలయా రాష్ట్ర కాంగ్రెస్ సీఎల్పీ భేటీ సోమవారం సాయంత్రం జరుగనుంది. ఈ భేటీలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత డాక్టర్ ముఖుల్ ఎం సంగ్మాను ఎన్నుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.Source: Yahoo! Telugu: News | 19 Apr 2010 | 7:25 am మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి "రాక్షసి"ది వాల్ట్ డిస్నీ కంపెనీ ( ఇండియా) తన మొదటి దక్షిణ భారత చలనచిత్రాన్ని కె.రాఘవేంద్రరావుతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రాజెక్టును నవంబరు 2009లో ప్రారంభించి, జనవరి 2011న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యపాత్రలో సిద్ధార్థ్, శృతిహాసన్, లక్ష్మి మంచు, హర్షిత నటిస్తున్నారు.సిద్ధార్థ్ తన లవర్ బాయ్ ఇమేజ్‌కు భిన్నంగా కత్తి యుద్ధాలతో పోరాట యోధునిగా ఒక కొత్త పాత్రలో కనబడబోతున్నారు. కథానాయకిగా కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. బుల్లితెర వ్యాఖ్యాతగా అనతికాలంలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించిన డాక్టర్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఒక విభిన్నమైన పాత్రలో నటించనున్నారు. ఇతర ముఖ్యపాత్రలలో డాక్టర్ బ్రహ్మానందం, రవిబాబు, అలీ కనిపించనున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Apr 2010 | 7:18 am ప్రజాపథం అడ్డుకునేవారు రాజకీయ మూర్ఖులు: రోశయ్యప్రజా సమస్యల పరిష్కారం కోసం తాము తలపెట్టిన ప్రజాపథాన్ని అడ్డుకోవాలని చూసే వారు రాజకీయ మూర్ఖులతో సమానమని ముఖ్యమంత్రి కె.రోశయ్య అభిప్రాయపడ్డారు. ఐదో విడత ప్రజాపథం కార్యక్రమాన్ని ఆయన సోమవారం తన సొంత జిల్లాలోని కటారివారిపాలెంలో ప్రారంభించారు.Source: Yahoo! Telugu: News | 19 Apr 2010 | 7:09 am నష్టాల్లో స్టాక్ మార్కెట్: భారీగా క్షీణించిన సెన్సెక్స్సోమవారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. గోల్డ్‌మెన్ ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ తిరోగమనం దిశగా ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి భారీగా పతనమైన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో 262 పాయింట్లు భారీగా పతనమైంది. దీంతో సెన్సెక్స్ సూచీ 17,328 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 77 పాయింట్లు పడిపోయి, 5,185 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 19 Apr 2010 | 7:03 am దేశంలో ముందుగానే కురవనున్న వర్షాలుదేశంలో ప్రతి ఏడాది జూన్-సెప్టెంబరు మధ్య కాలంలో వర్షాలు కురుస్తుంటాయి. కాని ఈ సంవత్సరం ఇంచుమించుగా ముందుగానే కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పెన్సిల్వేనియాకు చెందిన వాతావరణ పరిశోధనా సంస్థ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు ఓ వార్తా సంస్థ సోమవారం వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 19 Apr 2010 | 7:01 am మేలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న "ధూల్"జై మారుతి ఫిలింస్ పతాకంపై ప్రముఖ వ్యాపారావేత్త కె.ఆర్.ఎస్. అయ్యంగార్ ఫైట్ మాస్టర్ బి.విక్కీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "ధూల్". బి. విక్కీ కథ, స్క్రీన్‌ప్లే దర్శకత్వంలో కొత్త కథానాయకుల్ని పరిచయం చేస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలైంది. ప్రస్తుతం రామానాయుడు స్టూడియోలో రీ-రికార్డింగ్‌ను పూర్తిచేసుకుని డీటీఎస్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి చిత్ర దర్శక నిర్మాత అయ్యంగార్ మాట్లాడుతూ.. ఇటీవలే విడుదలైన ఆడియోకి మంచి స్పందన లభించింది. సంగీత దర్శకుడు ఖుద్దూస్‌కి ఈ పాటల ద్వారా మంచి పేరు వచ్చింది. మే మొదటివారంలో రెండో విడతగా ఆడియో సీడీలను విడుదల చేయనున్నాం. ఇక సినిమాపరంగా దర్శకుడు విక్కీ ఎంతో శ్రమించి దీన్ని తీర్చిదిద్దారు. తప్పకుండా "ధూల్" అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏప్రిల్ 25 కల్లా "ధూల్" తొలి కాపీని సిద్ధం చేస్తాం. దీనికి ముందుగా "ధూల్" సినిమా ట్రైలర్స్‌ని మే తొలివారంలోని రాష్ట్రంలోని అన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తాం" అని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Apr 2010 | 6:52 am హిమాలయాల్లో "తకిట తకిట" షూటింగ్!అందరూ కొత్త తారలతో భూమిక ముఖ్య పాత్రలో, కింగ్ నాగార్జున, అరుంధతి అనుష్క స్పెషల్ అప్పియరెన్స్‌తో డౌన్‌టౌన్ ఫిలింస్ పతాకంపై శ్రీహరి నాను దర్శకత్వంలో భూమికా చావ్లా సమర్పణలో భరత్ ఠాకూర్ నిర్మిస్తున్న "తకిట తకిట" చిత్రం చివరి షెడ్యూల్ హిమాలయాల్లో జరుగుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 19 Apr 2010 | 6:37 am 23న వస్తోన్న ప్రభాస్, కాజల్ అగర్వాల్‌ల "డార్లింగ్"యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై "తొలిప్రేమ" కరుణాకరన్ దర్శకత్వంలో "ఛత్రపతి" ప్రసాద్ నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఫిలిమ్ "డార్లింగ్" షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇంకా మగధీర హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఈ నెల 23వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Apr 2010 | 5:24 am కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు పోరాటం: నన్నపనేనిపార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ పని చేస్తున్న కార్యకర్తలకు న్యాయం జరిగేంత వరకు తాను పోరాడుతానని తెలుగుదేశం పార్టీ మహిళా ఫైర్‌బ్రాండ్ నన్నపనేని రాజకుమారి అన్నారు. తెదేపాలో పని చేసే వారికి గుర్తింపు లేదంటూ తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని ఆమె మరోమారు స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 19 Apr 2010 | 3:58 am షోయబ్ మాలిక్ పాస్‌పోర్టు అప్పగించండి: హైకోర్టుషోయబ్ మాలిక్ పాస్‌పోర్టును అతనికి అప్పగించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సోమవారం పోలీసు శాఖను ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన అయేషా సిదిఖీ అనే యువతిని వివాహం చేసుకుని మోసం చేసిన కేసులో షోయబ్ మాలిక్ పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 19 Apr 2010 | 3:12 am కేసీఆర్ బృందంపై దాడులు తప్పవేమో: కాంగ్రెస్ నేతలుప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుతో పాటు ఆయన బృందంపై దాడులు చేయక తప్పదని ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా, ప్రజలను రెచ్చగొట్టేలా ఆయన వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అందువల్ల కేసీఆర్ అండ్ కో పై దాడులు చేయక తప్పదని కాంగ్రెస్ తెలంగాణ నేతలు ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 19 Apr 2010 | 2:29 am లపాంగ్ రాజీనామా లేఖపై గవర్నర్ ఆమోదముద్రకాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం మెజారిటీని కోల్పోయిన మేఘాలయా ముఖ్యమంత్రి డీడీ.లపాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై ఆ రాష్ట్ర గవర్నర్ తక్షణం ఆమోద ముద్ర వేశారు. అయితే, కొత్త శాసనసభానేతను ఎన్నుకునేందుకు మేఘాలయా రాష్ట్ర కాంగ్రెస్ సీఎల్పీ భేటీ సోమవారం సాయంత్రం జరుగనుంది. ఈ భేటీలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత డాక్టర్ ముఖుల్ ఎం సంగ్మాను ఎన్నుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.Source: జాతీయ | 19 Apr 2010 | 1:55 am ప్రజాపథం అడ్డుకునేవారు రాజకీయ మూర్ఖులు: రోశయ్యప్రజా సమస్యల పరిష్కారం కోసం తాము తలపెట్టిన ప్రజాపథాన్ని అడ్డుకోవాలని చూసే వారు రాజకీయ మూర్ఖులతో సమానమని ముఖ్యమంత్రి కె.రోశయ్య అభిప్రాయపడ్డారు. ఐదో విడత ప్రజాపథం కార్యక్రమాన్ని ఆయన సోమవారం తన సొంత జిల్లాలోని కటారివారిపాలెంలో ప్రారంభించారు.Source: ఏపీ న్యూస్ | 19 Apr 2010 | 1:40 am జస్సికా లాల్ హత్య కేసు.. ఢిల్లీ కోర్టు తీర్పు సబబే: సుప్రీంప్రముఖ మోడల్ జస్సికా లాల్ హత్య కేసులో హర్యానా కాంగ్రెస్ మాజీ మంత్రి కుమారుడు మను శర్మకు ఢిల్లీ కోర్టు విధించిన జైలుశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే, ఈ కేసులో మరో ఇద్దరిని దోషులుగా పేర్కొంటూ జస్టీస్ పి.సదాశివం, స్వాంతనంతర్ కుమార్‌లతో ఏర్పాటు చేసిన ధర్మాసనం సోమవారం తీర్పు ఇచ్చింది. అలాగే, ఢిల్లీ కోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ మనుశర్మ దాఖలు చేసుకున్న పిటీషన్‌ను కోర్టు తోసివేసింది.Source: జాతీయ | 19 Apr 2010 | 1:04 am రాజస్థాన్ ప్రభుత్వం - గుజ్జర్ల మధ్య కుదిరిన ఒప్పందం!రాజస్థాన్ ప్రభుత్వం, గుజ్జర్ల సంఘ ప్రతినిధులు ఓ అవగాహనకు వచ్చారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో గుజ్జర్లు శాంతించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 80 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గుజ్జర్ల డిమాండ్ మేరకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.Source: జాతీయ | 19 Apr 2010 | 12:01 am మౌనం వీడిన ఎంఐఎం: మాకు "సమైక్యమే" ముద్దుఎట్టకేలకు ఎంఐఎం అగ్రనేతల మౌనం వీడారు. విభజన అంశంతో రాష్ట్రం అట్టుడికి పోయినా ఏమాత్రం చలించని ఎంఐఎం నేతలు.. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి తమ మనస్సులోని అభిప్రాయాన్ని నివేదిక రూపంలో సమర్పించారు. ఈ పార్టీ నివేదిక పరోక్షంగా సమైక్యవాదాన్నే సమర్థించేలా ఉంది. రాష్ట్రాన్ని విభజించాల్సిన పరిస్థితి అనివార్యమైతే తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలను కలిపి గ్రేటర్ హైదరాబాద్ లేదా గ్రేటర్ తెలంగాణాను ఏర్పాటు చేయాలని సూచన చేయడం గమనార్హం.Source: ఏపీ న్యూస్ | 18 Apr 2010 | 11:48 pm అబ్బో.. పాలమూరు ప్రజలు చైతన్యవంతులే: షరీఫ్పాలమూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలు మంచి చైతన్యవంతులే అని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యుల్లో ఒకరైన ప్రముఖ పరిశోధకుడు అబూసలె షరీఫ్ అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సంప్రదింపులు జరిపేందుకు ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ప్రజలతో ముఖాముఖీ సంప్రదింపులకు సోమవారం నుంచి శ్రీకారం చుట్టింది.Source: ఏపీ న్యూస్ | 18 Apr 2010 | 11:32 pm నేటి నుంచి శ్రీకృష్ణ కమిటీ సభ్యుల సంప్రదింపులు!రాష్ట్ర విభజనపై రాష్ట్రంలో నెలకొన్న అంశాలపై సంప్రదింపుల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీలో సభ్యులైన రవీందర్ కౌర్, అబూ సలేం షరీఫ్‌లు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం వీరు ఆదివారం రాష్ట్ర రాజధానికి చేరుకున్నారు. ఆ తర్వాత సోమవారం నుంచి ప్రజలతో నేరుగా సమావేశమై సంప్రదింపులు ప్రారంభించారు.Source: ఏపీ న్యూస్ | 18 Apr 2010 | 10:42 pm మంత్రి పవార్‌ను నిందించడం భావ్యం కాదు: గడ్కారీదేశ వ్యాప్తంగా నిత్యావసర వస్తు ధరలు విపరీతంగా పెరిగి పోవడానికి కారణం కేవలం కేంద్ర ఆహార శాఖామంత్రి శరద్ పవార్ ఒక్కరే కారణం కాదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 18 Apr 2010 | 10:00 pm ఐపీఎల్ వ్యవహారం: మంత్రిపదవికి థరూర్ గుడ్‌బై!ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొచ్చి క్రికెట్ ఫ్రాంచైజ్ వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొన్న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శశిథరూర్ ఆదివారం రాత్రి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అనంతరం ఆయన తన పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. థరూర్ రాజీనామాను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తక్షణం ఆమోదముద్ర వేసి, రాష్ట్రపతి భవన్‌కు పంపినట్టు పీఎంఓ కార్యాలయ ప్రతినిధి స్పష్టం చేశారు.Source: జాతీయ | 18 Apr 2010 | 9:53 pm తెలంగాణ ఉద్యమానికి అద్దం పట్టే "వీర తెలంగాణ"స్నేహ చిత్ర పతాకంపై 22వ చిత్రంగా ఆర్. నారాయణమూర్తి "వీర తెలంగాణ" చిత్రాన్ని నిర్మించారు. భూమికోసం, భుక్తికోసం వెట్టిచాకిరీ విముక్తికోసం సాగిన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసిన నాలుగువేల మంది అమరవీరులకు ఈ చిత్రం అకింతమని ప్రకటించారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Apr 2010 | 10:27 am బాలయ్య "సింహా" రికార్డులను తిరగరాస్తుంది: చంద్రబాబునందమూరి బాలకృష్ణ హీరోగా నమిత, నయనతార, స్నేహ ఉల్లాల్ హీరోయిన్లుగా నటించిన "సింహా" ఆడియో సక్సెస్ సభ శనివారం రాత్రి మాదాపూర్‌లోని రాక్‌గార్డెన్స్‌లో జరిగింది. నందమూరి అభిమానుల కేరింతల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి నందమూరి వంశీయులతో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, డాక్టర్. దాసరినారాయణరావు విశిష్ట అతిథిగా విచ్చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియో అమ్మకాలు జోరుగా సాగాయని అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చిత్ర నిర్మాత పరుచూరి కిరీటి తెలియజేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Apr 2010 | 10:15 am మేలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న "చేత వెన్నముద్ద"ఆల్తాఫ్, క్రితిక కృష్ణన్ జంటగా రోహిత్. ఎస్. అభ్యుదయ్ దర్శకత్వంలో ఫుల్‌మూన్ పిక్చర్స్ పతాకంపై పి.ఆర్.కుమార్ నిర్మిస్తున్న చిత్రం "చేత వెన్నముద్ద". ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు రోహిత్ అభ్యుదయ్ మాట్లాడుతూ.. పాటలన్నీ చక్కటి సాహిత్యంతో అందరినీ ఆకట్టుకుంటాయి. సున్నితమైన కథాంశంతో హృదయానికి హత్తుకునే సన్నివేశాలు ఇందులో వుంటాయి. ఇమంది రామారావు రాసిన పాట చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పాటలను త్వరలో విడుదల చేసి సినిమాను మే నెలలో సినిమాను విడుదల చేస్తాం" అని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Apr 2010 | 9:28 am జగన్ యాత్రలో పార్టీ గురించి మాట్లాడితే బాగుండు: వీహెచ్కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రలో కాంగ్రెస్ గురించి నాలుగు మాటలు చెపితే బాగుండు అని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీహెచ్.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ చేపట్టిన ఓదార్పు యాత్ర వల్ల పార్టీకి మేలు చేకూరుతుందన్నారు.Source: ఏపీ న్యూస్ | 18 Apr 2010 | 6:34 am గ్రేటర్ హైదరాబాద్‌ను ఏర్పాటు చేయండి: ఎంఐఎంఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాల్సిన పరిస్థితి అనివార్యమైతే వెనుకుబాటుకు గురైన తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలను కలిపి గ్రేటర్ హైదరాబాద్‌ను ఏర్పాటు చేయాలని ఎంఐఎం అభిప్రాయపడింది. ఈ మేరకు జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి ఎంఐఎం ఆదివారం నివేదిక సమర్పించింది. అదేసమయంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయవద్దని ఆ పార్టీ తన నివేదికలో పేర్కొంది.Source: ఏపీ న్యూస్ | 18 Apr 2010 | 6:18 am స్టేడియం సమీపంలో అమ్మోనియం నైట్రేట్ స్వాధీనంబెంగుళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం సమీపంలో 3.5 కేజీల బరువు గల అమ్మోనియం నైట్రేట్ బ్యాగులను పోలీసులను ఆదివారం కనుగొన్నారు. అలాగే, క్రికెట్ స్టేడియం సమీపంలో మరో పేలని బాంబును స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బాంబు నిర్వీర్య బృందం నిర్వీర్యం చేసింది. ఈ విషయాన్ని బెంగుళూరు పోలీసు కమిషనర్ శంకర్ బిదారి వెల్లడించారు.Source: జాతీయ | 18 Apr 2010 | 5:13 am జస్సికా హత్యకేసు: రేపు సుప్రీంకోర్టు తుదితీర్పుజస్సికాలాల్ హత్య కేసులో ముద్దాయి మను శర్మ చేసుకున్న అప్పీలుపై సుప్రీంకోర్టు సోమవారం తుదితీర్పును వెలువరించనుంది. హర్యానా రాష్ట్ర మాజీ మంత్రి వినోద్ శర్మ కుమారుడైన సిద్ధార్థ్ వశిష్ట్ అలియాస్ మనుశర్మ 1999 సంవత్సరంలో జరిగిన జస్సికాలాల్ హత్య కేసులో దోషిగా తేలిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 18 Apr 2010 | 4:39 am ప్రజాపథానికి సర్వం సిద్ధం: రేపటి నుంచి ప్రారంభం!గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపథానికి అంతా సిద్ధమైంది. ప్రజాపథంలో ప్రజల సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించేలా ఈ యాత్రను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇది సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఈనెల 19 నుంచి మే 14వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.Source: ఏపీ న్యూస్ | 18 Apr 2010 | 4:12 am
|