ప్రజాపథానికి సర్వం సిద్ధం: రేపటి నుంచి ప్రారంభం!

గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపథానికి అంతా సిద్ధమైంది. ప్రజాపథంలో ప్రజల సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించేలా ఈ యాత్రను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇది సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఈనెల 19 నుంచి మే 14వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
Source: Yahoo! Telugu: News | 18 Apr 2010 | 9:42 am

మేలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న "చేత వెన్నముద్ద"

ఆల్తాఫ్, క్రితిక కృష్ణన్ జంటగా రోహిత్. ఎస్. అభ్యుదయ్ దర్శకత్వంలో ఫుల్‌మూన్ పిక్చర్స్ పతాకంపై పి.ఆర్.కుమార్ నిర్మిస్తున్న చిత్రం "చేత వెన్నముద్ద". ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు రోహిత్ అభ్యుదయ్ మాట్లాడుతూ.. పాటలన్నీ చక్కటి సాహిత్యంతో అందరినీ ఆకట్టుకుంటాయి. సున్నితమైన కథాంశంతో హృదయానికి హత్తుకునే సన్నివేశాలు ఇందులో వుంటాయి. ఇమంది రామారావు రాసిన పాట చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పాటలను త్వరలో విడుదల చేసి సినిమాను మే నెలలో సినిమాను విడుదల చేస్తాం" అని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Apr 2010 | 9:28 am

మరో రెండు కొత్త మార్గాల్లో కింగ్‌ఫిషర్ విమానాలు

ప్రైవేట్ విమానయాన రంగ సంస్థ కింగ్‌ఫిషర్ సంస్థ మరో రెండు కొత్త అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులను నడుపనుంది. దేశ వాణిజ్య రాజధాని ముంబై, దేశ రాజధాని ఢిల్లీ నుంచి బ్యాంకాగ్‌కు ఈ సర్వీసులను నడుపాలని ఆ సంస్థ నిర్ణయించింది.
Source: Yahoo! Telugu: News | 18 Apr 2010 | 9:25 am

భారత్ అభివృద్ధిని కాంక్షిస్తున్న ప్రపంచం: పీఎం

ప్రపంచ దేశాలన్నీ మనదేశ ఎదుగుదలను, అభివృద్ధిని కోరుకుంటున్నాయని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. ఈ సదావకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనను ముగించుకుని ఆయన శనివారం స్వదేశానికి చేరుకున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన తన ప్రత్యేక విమానంలో మీడియాతో మాట్లాడారు.
Source: Yahoo! Telugu: News | 18 Apr 2010 | 8:08 am

భారతీయ వైద్యుని హత్య: ఇద్దరికి జీవిత ఖైదు

బ్రిటన్‌లో భారతీయ వైద్యుని హత్య కేసులో ఇద్దరు నిందితులకు ఆ దేశ కోర్టు యావజ్జీవ కారాగారశిక్షను విధించింది. భారత్‌కు చెందిన డాక్టర్ నాదీమ్ గులామ్ హుస్సేన్ వాలా అనే వైద్యుడు బ్రిటన్‌లో వైద్యునిగా పని చేస్తూ వచ్చాడు. ఈయన గత యేడాది జూలై 25వ తేదీన హత్యకు గురయ్యాడు. ఆ రోజు రాత్రి తన స్నేహితులతో కలిసి తన రాత్రికి ఇంటికి వస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
Source: Yahoo! Telugu: News | 18 Apr 2010 | 7:49 am

థరూర్‌ను మంత్రిపదవి నుంచి తొలగించాలి: అద్వానీ

అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శశిథరూర్‌ను తక్షణం మంత్రిపదవి నుంచి తొలగించాలని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ డిమాండ్ చేశారు. ఆయనకు వామపక్ష పార్టీల నేతలు కూడా వంతపాట పాడారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Source: Yahoo! Telugu: News | 18 Apr 2010 | 7:16 am

ఇండస్‌యిండ్ బ్యాంకు లాభం రూ.98 కోట్లు

ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన ఇండస్‌యిండ్ బ్యాంకు ఆదాయం 94 శాతం మేరకు పెరిగింది. గత మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 98 కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జించింది. అంతకుముందుటి ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు సాధించిన లాభం కంటే ఇది 94 శాతం అధికమని ఆ బ్యాంకు తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 18 Apr 2010 | 6:58 am

వ్యాఖ్యలపై సంజాయిషీ ఇచ్చే ప్రశ్నేలేదు: నన్నపనేని

పార్టీ ఇచ్చిన నోటీసులకు సంజాయిషీ ఇచ్చే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ ఫైర్‌బ్రాండ్ నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు. తానెలాంటి తప్పు చేయలేదనీ, ఏ ఒక్కరినీ విమర్శించలేదన్నారు. అందువల్ల పార్టీ నియమించిన ద్విసభ్య కమిటీ ఎదుట హాజరై సంజాయిషీ ఇచ్చే ప్రశ్నే లేదని ఆమె తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం.
Source: Yahoo! Telugu: News | 18 Apr 2010 | 6:29 am

ధోరణి మార్చుకుంటేనే చిరంజీవికి మంచి భవిష్యత్!

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి భవిష్యత్‌పై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. కోట్లాది మంది సినీ అభిమానులను కలిగిన చిరంజీవి.. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. పార్టీ ఆవిర్భావం అదిరినప్పటికీ.. ఎన్నికల ఫలితాల్లో మాత్రం తుస్సుమంది.
Source: Yahoo! Telugu: News | 18 Apr 2010 | 6:07 am

విమాన సంస్థలకు రూ.4227 కోట్ల మేర నష్టం!

ఐస్‌లాండ్‌ అగ్నిపర్వతం నుంచి విడుదలవుతున్న బూడిద కణాల వల్ల ప్రపంచంలోని పలు విమానయాన సంస్థలకు 4227 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది. అగ్నిపర్వతం నుంచి విడుదలవుతున్న బూడిద కారణంగా యూరప్‌లో 17 వేల విమాన సర్వీసులు నిలిచి పోయిన విషయం తెల్సిందే. ఈ ప్రభావం పలు ప్రపంచ దేశాలపై పడింది.
Source: Yahoo! Telugu: News | 18 Apr 2010 | 5:47 am

చైనాలో భూకంపం: 17 వేల మందికి ప్రాణదానం

చైనా భూకంప శిథిలాల కింద చిక్కుకున్న 17 వేల మంది ప్రజలను సహాయక సిబ్బంది రక్షించారు. ఈ భూకంపం ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1500 దాటినట్టు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించాయి. భూకంప బాధిత ప్రాంతాల్లో చైనా ప్రధాని ఆదివారం పర్యటిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 18 Apr 2010 | 5:23 am

ప్రజాపథానికి సర్వం సిద్ధం: రేపటి నుంచి ప్రారంభం!

గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపథానికి అంతా సిద్ధమైంది. ప్రజాపథంలో ప్రజల సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించేలా ఈ యాత్రను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇది సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఈనెల 19 నుంచి మే 14వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
Source: ఏపీ న్యూస్ | 18 Apr 2010 | 4:12 am

థరూర్‌ను మంత్రిపదవి నుంచి తొలగించాలి: అద్వానీ

అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శశిథరూర్‌ను తక్షణం మంత్రిపదవి నుంచి తొలగించాలని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ డిమాండ్ చేశారు. ఆయనకు వామపక్ష పార్టీల నేతలు కూడా వంతపాట పాడారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Source: జాతీయ | 18 Apr 2010 | 1:46 am

ధోరణి మార్చుకుంటేనే చిరంజీవికి మంచి భవిష్యత్!

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి భవిష్యత్‌పై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. కోట్లాది మంది సినీ అభిమానులను కలిగిన చిరంజీవి.. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. పార్టీ ఆవిర్భావం అదిరినప్పటికీ.. ఎన్నికల ఫలితాల్లో మాత్రం తుస్సుమంది.
Source: ఏపీ న్యూస్ | 18 Apr 2010 | 1:01 am

వ్యాఖ్యలపై సంజాయిషీ ఇచ్చే ప్రశ్నేలేదు: నన్నపనేని

పార్టీ ఇచ్చిన నోటీసులకు సంజాయిషీ ఇచ్చే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ ఫైర్‌బ్రాండ్ నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు. తానెలాంటి తప్పు చేయలేదనీ, ఏ ఒక్కరినీ విమర్శించలేదన్నారు. అందువల్ల పార్టీ నియమించిన ద్విసభ్య కమిటీ ఎదుట హాజరై సంజాయిషీ ఇచ్చే ప్రశ్నే లేదని ఆమె తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 18 Apr 2010 | 1:00 am

నేడు థరూర్ వ్యవహారంపై కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శశి థరూర్ భవితవ్యం ఆదివారం తేలనుంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సాయంత్రం భేటీ కానుంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో జరిగే ఈ భేటీలో ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, ఏకే.ఆంటోనీలతో పాటు సోనియా వ్యక్తిగత రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌లు హాజరుకానున్నారు.
Source: జాతీయ | 17 Apr 2010 | 11:03 pm

శశిథరూర్ వ్యవహారం: ప్రధాని కీలక నిర్ణయం నేడే!

కేంద్ర మంత్రి శశిథరూర్ వ్యవహారంపై ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌లో ఆడే కొచ్చి ఫ్రాంచైజీ వివాదంలో కీలక పాత్ర పోషించిన శశిథరూర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించడమా? లేదా? అనే అంశంపై ప్రధాని సరైన నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Source: జాతీయ | 17 Apr 2010 | 10:15 pm

"కొమరం పులి" హిస్టరీ క్రియేట్ చేస్తుంది: ఎస్.జె.సూర్య

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా "ఖుషి" ఫేం ఎస్.జె సూర్య దర్శకత్వంలో ఎస్.సత్యరామమూర్తి సమర్పణలో కనకరత్న మూవీస్ పతాకంపై ప్రముఖ ఫైనాన్షియర్, నిర్మాత రమేష్ బాబు నిర్మిస్తున్న భారీ చిత్రం "కొమరం పులి" నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.ఈ సందర్భంగా దర్శకుడు ఎస్.జె సూర్య మాట్లాడుతూ... ఖుషిలాంటి సూపర్ హిట్ తర్వాత చేస్తున్న కొమరం పులి చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కొమరం పులిగా పవన్ కల్యాణ్ నిజంగా పులిలాగా ఉన్నారు. పవన్ కల్యాణ్‌తో ఇంత గొప్ప కమర్షియల్ హిట్ ఫిల్మ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్‌గా కొమరం పులిగా పవన్ కల్యాణ్ హిస్టరీ క్రియేట్ చేస్తారు అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Apr 2010 | 11:11 am

ఖమ్మంలో జగన్ "ఓదార్పు" యాత్ర: జనమే జనం

అదే జోరు.. అదే హోరు... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఓదార్పు యాత్రకు తెలంగాణా జిల్లాలోని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఖమ్మం జిల్లాలోని మధిర పట్టణంలో పర్యటించారు.
Source: ఏపీ న్యూస్ | 17 Apr 2010 | 10:02 am

బెంగళూరులో జంట పేలుళ్లు: 15మందికి గాయాలు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర్లో శనివారం జంట పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లలో 15మంది గాయపడ్డాకు. ఐపీఎల్ మ్యాచ్ జరగాల్సిన చోట పేలుళ్లు సంభవించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
Source: జాతీయ | 17 Apr 2010 | 9:17 am

"కామసూత్ర"తో హాట్ బేబీ అంకిత జర్క్

"ఐ లవ్ యూ రస్నా" అంటూ ఊరించే మాటలు పలుకి ఆ తర్వాత తెలుగుతెరపై గ్లామర్ విందులు చేసిన తార అంకిత. టాలీవుడ్ వెండితెరపై నెంబర్‌వన్‌గా వెలిగిపోవాలని ఎంత ఎక్స్‌పోజింగ్ చేసినా రేసులో మాత్రం వెనకబడి పోయింది. ఆ తర్వాత బాత్ టబ్‌లో స్నానం చేస్తూ వేడి వేడి దృశ్యాలను సైతం లీక్ చేసింది. అయినా సినీజనం ఆఫర్లు ఇస్తేగా...?!! అందుకేనేమో.. తాజాగా కామసూత్ర ప్రకటనలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ కామసూత్రతోనైనా తన కెరీర్లో బ్రేక్ వస్తుందేమోనని అంకిత గంపెడు ఆశలు పెట్టుకున్నట్లు టాలీవుడ్ సినీజనం అంటున్నారు.కథానాయికగా విఫలమైన తర్వాత ఐటం గాళ్‌గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినా ఆమె ఐటమ్ ఎవరికీ నచ్చలేదు. దీంతో కామసూత్రతో ప్రేక్షకులకు ఓ జర్క్ ఇద్దామని అంకిత నిర్ణయించుకున్నట్లు సమాచారం. బాలీవుడ్‌లో మల్లికా శెరావత్, నేహా ధూపియా వంటి తారలు శరీరాన్ని మోతాదుకు మించి చూపించే కదా వెలుగులోకి వచ్చిందీ.. ఆ ఫార్ములానే అంకిత ఫాలో అవుతుందేమో మరి..
Source: Yahoo! Telugu: Entertainment | 17 Apr 2010 | 6:32 am

ప్రతి నేతలో ఎత్తుపల్లాలు సహజం: ప్రధాని మన్మోహన్

ప్రతి రాజకీయ నాయకుడి జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటాయని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. తన మంత్రివర్గ సహచరుడు, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌పై వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ వివాదంపై ఆయన పై విధంగా స్పందించారు.
Source: జాతీయ | 17 Apr 2010 | 6:03 am

"కొమరం పులి" హిస్టరీ క్రియేట్ చేస్తుంది: ఎస్.జె.సూర్య

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా "ఖుషి" ఫేం ఎస్.జె సూర్య దర్శకత్వంలో ఎస్.సత్యరామమూర్తి సమర్పణలో కనకరత్న మూవీస్ పతాకంపై ప్రముఖ ఫైనాన్షియర్, నిర్మాత రమేష్ బాబు నిర్మిస్తున్న భారీ చిత్రం "కొమరం పులి" నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.ఈ సందర్భంగా దర్శకుడు ఎస్.జె సూర్య మాట్లాడుతూ... ఖుషిలాంటి సూపర్ హిట్ తర్వాత చేస్తున్న కొమరం పులి చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కొమరం పులిగా పవన్ కల్యాణ్ నిజంగా పులిలాగా ఉన్నారు. పవన్ కల్యాణ్‌తో ఇంత గొప్ప కమర్షియల్ హిట్ ఫిల్మ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్‌గా కొమరం పులిగా పవన్ కల్యాణ్ హిస్టరీ క్రియేట్ చేస్తారు అన్నారు.
Source: వినోదం | 17 Apr 2010 | 5:42 am

ఆర్య- త్రిషల "సర్వం" ట్రెయిలర్

తమిళ నటుడు ఆర్యతో చిత్రాలు తీసే దర్శుకుడు విష్ణువర్థన్ తాజాగా రూపొందించిన "సర్వం" చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సింహపురి టాకీస్‌పై ఎం.రఘునాథ్, ఎం.నరేంద్రలు నిర్మించారు. నరేంద్ర మాట్లాడుతూ... విష్ణువర్థన్ ఈ చిత్రాన్ని చక్కగా తీశాడు. ఆయనతో స్ట్రెయిట్ తెలుగు సినిమా తీయాలనే ఆలోచన ఉంది. సర్వం చిత్రం బాగా వచ్చింది. దేవుడు సర్వాంతర్యామి. అన్నీ తెలిసిన వాడిని సర్వాంతర్యామి అని అంటారు. మా చిత్రంలో కథ ఆ నేపధ్యంలో ఉంటుంది. జేడీ చక్రవర్తి బాగా చేశాడు. అన్ని విధాలుగా ఉన్నత విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించాం అని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Apr 2010 | 5:13 am

19 నుంచి "బావ" మూడో షెడ్యూల్

సిద్దార్థ్ కథానాయకునిగా రూపొందుతోన్న చిత్రం బావ. డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఇందులో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. ప్రణీత కథానాయిక. శ్రీకీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్. పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రాంబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం మూడో షెడ్యూల్ ఈనెల 19 నుంచి 14 రోజులపాటు హైదరాబాదులో జరుగనుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎం.ఎల్.పద్మ కుమార్ చౌదరి మాట్లాడుతూ... తొలి షెడ్యూల్ తూర్పు గోదావరి జిల్లా రాజోలులో చేశాం. రెండో షెడ్యూలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, పరిసరాల్లో చేశాం. గోదావరి తీరాన పెదపట్నం లంకలో వేసిన సెట్‌లో సిద్ధార్థ్, ప్రణీతలపై లవ్ సీన్స్ తీశాం.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Apr 2010 | 5:09 am

ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు చేసిన కాంగ్రెస్

త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. వీరి పేర్లను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ శనివారం వెల్లడించారు. రాష్ట్రంలోని విధానమండలిలో మూడు సీట్లు ఖాళీ ఉండగా, వీటిలో రెండింటిలో కాంగ్రెస్ పోటీ చేస్తుండగా, ఎంఐఎంకు ఒక స్థానాన్ని కేటాయించింది.
Source: ఏపీ న్యూస్ | 17 Apr 2010 | 4:22 am

ప్రజాపథం పేరుతో గుంటనక్కలు వస్తున్నాయ్: కేసీఆర్

'ప్రజాపథం' పేరుతో గుంట నక్కలు తెలంగాణ ప్రాంతంలో ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోపించారు. ఇలాంటి పిచ్చిపిచ్చి వేషాలను తాము ప్రతిఘటించి తీరుతామని ఆయన హెచ్చరించారు. ఓదార్పు యాత్రలు, ప్రజాపథం పేరుతో తెలంగాణవాదాన్ని మరుగున పడేసేందుకు ఈ గుంట నక్కలు ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 17 Apr 2010 | 4:03 am

ప్లాట్‍ఫారం జాగ్రత్త!

పుల్లారావు రైల్వేస్టేషన్‌కు మొదటిసారి వచ్చాడు. మైక్‌లో ఇలా అనౌన్స్ చేస్తున్నారు"బొంబాయినుంచి విశాఖకు వెళ్లే 1745 నంబరు గల విశాఖ ఎక్స్ ప్రెస్ మరికొద్ది సేపట్లో ఒకటో నంబరు ప్లాట్ ఫారం...
Source: వినోదం | 17 Apr 2010 | 3:31 am

ఇద్దరు నడపాల్సిన బస్సును...

"సుబ్బు హైదరాబాదుకు రావటం అదే మొదటిసారి""అక్కడ డబుల్ టక్కర్ బస్సెక్కి కండక్టరు అప్పారావుతో పోట్లాడుతున్నాడు"సుబ్బు: "ఈ నగరంలో మీకు డ్రైవర్లు కూడా దొరకటం లేదా?"అప్పారావు..
Source: వినోదం | 17 Apr 2010 | 3:24 am

నేడు ఆహార భద్రతా చట్టంపై ప్లానింగ్ కమిషన్ భేటీ!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రతా చట్టంపై తలెత్తిన వివాదంపై చర్చించేందుకు ప్రణాళికా సంఘం బృందం శనివారం భేటీ కానుంది. ఈ చట్టం అమలుకు సురేష్ టెండూల్కర్ కమిటీకి, ప్రణాళికా సంఘానికి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పైపెచ్చు ఆ చట్టం అమలు వల్ల ఎంతమంది పేదలు లబ్దిపొందుతారన్న అంశంపై యూపీఏ సంకీర్ణ సర్కారులోనే అభిప్రాయభేదాలు పొడచూపాయి. అందువల్ల ఆహార భద్రత చట్టంపై చర్చించేందుకు ప్రణాళికా సంఘం కీలక భేటీ నిర్వహించనుంది.
Source: జాతీయ | 17 Apr 2010 | 3:18 am