|
భుట్టో హత్యకు కొన్ని గంటల ముందు కర్జాయ్ హెచ్చరిక!హత్య జరిగేందుకు కొన్ని గంటల ముందుగా పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు హామీద్ కర్జాయ్ హెచ్చరించినట్టు ఐక్యరాజ్య సమితి విచారణ కమిటీ అభిప్రాయపడింది. పాకిస్థాన్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఐరాసకు చెందిన ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ జరిపింది. ఈ కమిటీ నివేదికను శనివారం వెలుగు చూసింది.Source: Yahoo! Telugu: News | 17 Apr 2010 | 9:19 am నేడు ఆహార భద్రతా చట్టంపై ప్లానింగ్ కమిషన్ భేటీ!కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రతా చట్టంపై తలెత్తిన వివాదంపై చర్చించేందుకు ప్రణాళికా సంఘం బృందం శనివారం భేటీ కానుంది. ఈ చట్టం అమలుకు సురేష్ టెండూల్కర్ కమిటీకి, ప్రణాళికా సంఘానికి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పైపెచ్చు ఆ చట్టం అమలు వల్ల ఎంతమంది పేదలు లబ్దిపొందుతారన్న అంశంపై యూపీఏ సంకీర్ణ సర్కారులోనే అభిప్రాయభేదాలు పొడచూపాయి. అందువల్ల ఆహార భద్రత చట్టంపై చర్చించేందుకు ప్రణాళికా సంఘం కీలక భేటీ నిర్వహించనుంది.Source: Yahoo! Telugu: News | 17 Apr 2010 | 8:48 am ఐమ్యాక్స్ సమీపంలో వైఎస్సార్ స్మారక పార్కు: సీఎంరాష్ట్ర రాజధాని హైదరాబాద్, ఐమ్యాక్స్ సమీపంలో వైఎస్సార్ స్మారక పార్కును ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె.రోశయ్య తెలిపారు. ఆయన శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఐమ్యాక్స్ సమీపంలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాల గుట్ట సమీపంలో ప్రైవేట్ భూములు సేకరించి వైఎస్ స్మారక వనాన్ని నెలకొల్పుతామన్నారు.Source: Yahoo! Telugu: News | 17 Apr 2010 | 7:42 am సీమాంధ్ర నాయకుల నివేదికలతో కేసీఆర్ "బెదుర్స్"సమైక్యాంధ్ర హీరో.. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం.. తెరాస ఇచ్చిన నివేదికే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సరిపోతుందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ అండ్ కో రూపొందించిన నివేదికలో ఏమాత్రం పస లేదనీ లగడపాటి పదేపదే బల్లగుద్ది చెపుతున్నారు.Source: Yahoo! Telugu: News | 17 Apr 2010 | 7:18 am కేసీఆర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అదిరింది: దుగ్గల్ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు.. కేంద్రం ఏర్పాటు చేసిన సంప్రదింపులు కమిటీకి తమ వాదనను వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కమిటీ సభ్యులను అబ్బురపరిచింది. తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాంతం ఏ విధంగా వివక్షకు గురైందో కళ్ళకు కట్టేలా కేసీఆర్ తన వివరించారు.Source: Yahoo! Telugu: News | 17 Apr 2010 | 7:01 am తమిళనాడులో వైద్య పరికరాల తయారీ కేంద్రం: ఆజాద్తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లాలో వైద్య పరికరాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్టు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖామంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపారు. ఈ కేంద్రం ఆ రాష్ట్ర రాజధాని చెన్నయ్‌కు సమీపంలో ఉంటుందని ఆయన చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రతిపక్ష సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఆజాద్ పై విధంగా సమాధానం ఇచ్చారు.Source: Yahoo! Telugu: News | 17 Apr 2010 | 6:49 am జీఎస్ఎల్‌వీ డీ3 ప్రయోగ విఫలంపై నేడు విశ్లేషణ!ఇటీవల ప్రయోగించి విఫలమైన క్రయోజనిక్ జీఎస్ఎల్‌వి డీ3 రాకెట్ ప్రయోగంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు శనివారం నుంచి విశ్లేషణ చేపట్టనున్నారు. ఇందులో దేశీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కూడా పాలు పంచుకోనున్నారు.Source: Yahoo! Telugu: News | 17 Apr 2010 | 6:38 am "కామసూత్ర"తో హాట్ బేబీ అంకిత జర్క్"ఐ లవ్ యూ రస్నా" అంటూ ఊరించే మాటలు పలుకి ఆ తర్వాత తెలుగుతెరపై గ్లామర్ విందులు చేసిన తార అంకిత. టాలీవుడ్ వెండితెరపై నెంబర్‌వన్‌గా వెలిగిపోవాలని ఎంత ఎక్స్‌పోజింగ్ చేసినా రేసులో మాత్రం వెనకబడి పోయింది. ఆ తర్వాత బాత్ టబ్‌లో స్నానం చేస్తూ వేడి వేడి దృశ్యాలను సైతం లీక్ చేసింది. అయినా సినీజనం ఆఫర్లు ఇస్తేగా...?!! అందుకేనేమో.. తాజాగా కామసూత్ర ప్రకటనలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ కామసూత్రతోనైనా తన కెరీర్లో బ్రేక్ వస్తుందేమోనని అంకిత గంపెడు ఆశలు పెట్టుకున్నట్లు టాలీవుడ్ సినీజనం అంటున్నారు.కథానాయికగా విఫలమైన తర్వాత ఐటం గాళ్‌గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినా ఆమె ఐటమ్ ఎవరికీ నచ్చలేదు. దీంతో కామసూత్రతో ప్రేక్షకులకు ఓ జర్క్ ఇద్దామని అంకిత నిర్ణయించుకున్నట్లు సమాచారం. బాలీవుడ్‌లో మల్లికా శెరావత్, నేహా ధూపియా వంటి తారలు శరీరాన్ని మోతాదుకు మించి చూపించే కదా వెలుగులోకి వచ్చిందీ.. ఆ ఫార్ములానే అంకిత ఫాలో అవుతుందేమో మరి..Source: Yahoo! Telugu: Entertainment | 17 Apr 2010 | 6:32 am యూరప్‌లో బూడిద మేఘాలు: విమాన సర్వీసులు రద్దు!యూరప్‌ను బూడిద మేఘాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఐస్‌లాండ్‌లోని అగ్నిపర్వతం నుంచి నిరంతరాయంగా బూడిద వెలువడుతోంది. ఈ బూడిద మేఘాలతో కలిసి పోయి దట్టమైన మేఘాలుగా ఏర్పడ్డాయి. దీంతో యూరప్‌లో 17 వేల విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇంత పెద్ద ఎత్తున విమాన సర్వీసులను రద్దు చేయడం యూరప్ చరిత్రలో ఇదే తొలిసారి.Source: Yahoo! Telugu: News | 17 Apr 2010 | 6:18 am ఐటీ ఉచ్చు నుంచి మోడీని రక్షించిన మహిళ ఎవరు..?!!ముంబయిలోని మోడీ ఐపీఎల్ కార్యాలయంపై ఐటీ అధికారులు నిర్వహించిన దాడుల్లో లలిత్ మోడీ తృటిలో తప్పించుకున్నారు. ఐటీ దాడుల నుంచి ఆయనను ఓ గుర్తు తెలియని మహిళ రక్షించినట్లు సీసీటీవీ ఫూటేజ్‌లో బహిర్గతమైనట్లు సమాచారం.Source: Yahoo! Telugu: News | 17 Apr 2010 | 5:51 am రాజధానిలో రోజుకు 12 లక్షల బీరు బాటిళ్ళ విక్రయంరాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని యువకులు మద్యం మత్తులో మునిగి తేలుతున్నారు. ఫలితంగా.. రాజధానిలో రోజుకు 12 లక్షల బీరు బాటిళ్లు ఖాళీ అవుతున్నాయి. దీన్ని సొమ్ము చేసుకునేందుకు మద్యం దుకాణాల యజమానులు అడ్డుగోలుగా ధరలు పెంచి రెండు చేతులా అర్జిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 17 Apr 2010 | 5:46 am ఆర్య- త్రిషల "సర్వం" ట్రెయిలర్తమిళ నటుడు ఆర్యతో చిత్రాలు తీసే దర్శుకుడు విష్ణువర్థన్ తాజాగా రూపొందించిన "సర్వం" చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సింహపురి టాకీస్‌పై ఎం.రఘునాథ్, ఎం.నరేంద్రలు నిర్మించారు. నరేంద్ర మాట్లాడుతూ... విష్ణువర్థన్ ఈ చిత్రాన్ని చక్కగా తీశాడు. ఆయనతో స్ట్రెయిట్ తెలుగు సినిమా తీయాలనే ఆలోచన ఉంది. సర్వం చిత్రం బాగా వచ్చింది. దేవుడు సర్వాంతర్యామి. అన్నీ తెలిసిన వాడిని సర్వాంతర్యామి అని అంటారు. మా చిత్రంలో కథ ఆ నేపధ్యంలో ఉంటుంది. జేడీ చక్రవర్తి బాగా చేశాడు. అన్ని విధాలుగా ఉన్నత విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించాం అని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Apr 2010 | 5:13 am 19 నుంచి "బావ" మూడో షెడ్యూల్సిద్దార్థ్ కథానాయకునిగా రూపొందుతోన్న చిత్రం బావ. డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఇందులో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. ప్రణీత కథానాయిక. శ్రీకీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్. పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రాంబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం మూడో షెడ్యూల్ ఈనెల 19 నుంచి 14 రోజులపాటు హైదరాబాదులో జరుగనుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎం.ఎల్.పద్మ కుమార్ చౌదరి మాట్లాడుతూ... తొలి షెడ్యూల్ తూర్పు గోదావరి జిల్లా రాజోలులో చేశాం. రెండో షెడ్యూలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, పరిసరాల్లో చేశాం. గోదావరి తీరాన పెదపట్నం లంకలో వేసిన సెట్‌లో సిద్ధార్థ్, ప్రణీతలపై లవ్ సీన్స్ తీశాం.Source: Yahoo! Telugu: Entertainment | 17 Apr 2010 | 5:09 am నేడు ఆహార భద్రతా చట్టంపై ప్లానింగ్ కమిషన్ భేటీ!కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రతా చట్టంపై తలెత్తిన వివాదంపై చర్చించేందుకు ప్రణాళికా సంఘం బృందం శనివారం భేటీ కానుంది. ఈ చట్టం అమలుకు సురేష్ టెండూల్కర్ కమిటీకి, ప్రణాళికా సంఘానికి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పైపెచ్చు ఆ చట్టం అమలు వల్ల ఎంతమంది పేదలు లబ్దిపొందుతారన్న అంశంపై యూపీఏ సంకీర్ణ సర్కారులోనే అభిప్రాయభేదాలు పొడచూపాయి. అందువల్ల ఆహార భద్రత చట్టంపై చర్చించేందుకు ప్రణాళికా సంఘం కీలక భేటీ నిర్వహించనుంది.Source: జాతీయ | 17 Apr 2010 | 3:18 am ఐమ్యాక్స్ సమీపంలో వైఎస్సార్ స్మారక పార్కు: సీఎంరాష్ట్ర రాజధాని హైదరాబాద్, ఐమ్యాక్స్ సమీపంలో వైఎస్సార్ స్మారక పార్కును ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె.రోశయ్య తెలిపారు. ఆయన శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఐమ్యాక్స్ సమీపంలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాల గుట్ట సమీపంలో ప్రైవేట్ భూములు సేకరించి వైఎస్ స్మారక వనాన్ని నెలకొల్పుతామన్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Apr 2010 | 2:13 am కేసీఆర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అదిరింది: దుగ్గల్ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు.. కేంద్రం ఏర్పాటు చేసిన సంప్రదింపులు కమిటీకి తమ వాదనను వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కమిటీ సభ్యులను అబ్బురపరిచింది. తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాంతం ఏ విధంగా వివక్షకు గురైందో కళ్ళకు కట్టేలా కేసీఆర్ తన వివరించారు.Source: ఏపీ న్యూస్ | 17 Apr 2010 | 1:31 am కేరళ జవాను కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా: సీఎంమావోయిస్టుల దాడితో దంతెవాడ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన కేరళ సీఆర్పీఎఫ్ జవాను రాజేష్‌కు కేరళ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. ఏప్రిల్ ఆరో తేదీన దంతెవాడలో జరిగిన దుర్ఘటనలో కేరళ రాష్ట్రం, ఎర్నాకులం జిల్లాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ రాజేష్ మరణించారు.Source: జాతీయ | 17 Apr 2010 | 1:15 am జీఎస్ఎల్‌వీ డీ3 ప్రయోగ విఫలంపై నేడు విశ్లేషణ!ఇటీవల ప్రయోగించి విఫలమైన క్రయోజనిక్ జీఎస్ఎల్‌వి డీ3 రాకెట్ ప్రయోగంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు శనివారం నుంచి విశ్లేషణ చేపట్టనున్నారు. ఇందులో దేశీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కూడా పాలు పంచుకోనున్నారు.Source: జాతీయ | 17 Apr 2010 | 1:09 am ఐటీ ఉచ్చు నుంచి మోడీని రక్షించిన మహిళ ఎవరు..?!!ముంబయిలోని మోడీ ఐపీఎల్ కార్యాలయంపై ఐటీ అధికారులు నిర్వహించిన దాడుల్లో లలిత్ మోడీ తృటిలో తప్పించుకున్నారు. ఐటీ దాడుల నుంచి ఆయనను ఓ గుర్తు తెలియని మహిళ రక్షించినట్లు సీసీటీవీ ఫూటేజ్‌లో బహిర్గతమైనట్లు సమాచారం.Source: జాతీయ | 17 Apr 2010 | 12:22 am నేటితో ముగియనున్న వైఎస్.జగన్ ఓదార్పు యాత్రకడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర శనివారంతో ముగియనుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో యువజన కాంగ్రెస్ ఏర్పాటు చేసిన వీడ్కోలు సభతో ఈ యాత్ర ముగుస్తుంది.Source: ఏపీ న్యూస్ | 16 Apr 2010 | 11:20 pm కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం: 9 మంది మృత్యువాతకడప జిల్లా మైదుకూరు మండలంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ మండలంలోని వరదాయపాలెం వద్ద ప్రయాణికులతో వెళుతున్న ఆటోను ఓ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. మృతులంతా సమీప గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు దుర్ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.Source: ఏపీ న్యూస్ | 16 Apr 2010 | 11:11 pm ఐదేళ్ళుగా ట్రై చేశా.. బుట్టలో పడేశా: షోయబ్ మాలిక్భారత టెన్నిస్ తార సానియా మీర్జాను తన ప్రేమలో పడేసేందుకు ఐదు సంవత్సరాలుగా ట్రై చేశానని పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన మనస్సులోని మాటను వెల్లడించాడు. తన తండ్రి కోర్కె మేరకే ఈ పని చేశానని చెప్పాడు.Source: ఏపీ న్యూస్ | 16 Apr 2010 | 11:03 pm ఓదార్పు యాత్ర కాదు.. ఓట్ల యాత్ర: తెలంగాణావాదులుదివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టింది. ఓదార్పు యాత్ర కాదని తెలంగాణా వాదులు అభిప్రాయపడుతున్నారు. అయితే, తెలంగాణ ప్రజలు మాత్రం యువనేతకు బ్రహ్మరథం పడుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 16 Apr 2010 | 10:50 pm ముంబై దాడులు: తీవ్రవాదులకు ఆఫ్ఘనిస్థాన్‌లో శిక్షణ!దేశ వాణిజ్య రాజధాని ముంబైపై దాడులు చేసేందుకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆప్ఘనిస్థాన్‌లోని అల్‌ఖైదా తీవ్రవాద సంస్థకు చెందిన శిబిరాల్లో శిక్షణ పొందినట్టు అనధికార వర్గాల సమాచారం. దీంతో ముంబై దాడుల్లో తొలిసారిగా ఆప్ఘన్ ప్రమేయం కూడా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఈ ఊహాగానాలు నిజమైతే.. ఆప్ఘన్ పునర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న భారత్.. తన భవిష్యత్‌పై పునఃపరిశీలన చేసుకునే అవకాశాలు లేక పోలేదని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి.Source: జాతీయ | 16 Apr 2010 | 10:02 pm కంప్యూటర్ నెట్‌వర్క్‌తో పొంచివున్న ముప్పు: ఆంటోనీకంప్యూటర్ నెట్‌వర్క్‌తో దేశ అంతర్గత భద్రతకు ముప్పు పొంచివుందని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, చైనీస్ హాకర్ల నుంచి ప్రమాదం ఏర్పడిందన్నారు. దేశ రక్షణ, దౌత్య విభాగాలకు చెందిన కంప్యూటర్ నెట్‌వర్క్‌ల నుంచి చైనీస్ హాకర్లు కీలక సమాచారాన్ని అపహరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళికను చేపట్టనున్నట్టు చెప్పారు.Source: జాతీయ | 16 Apr 2010 | 9:39 pm శతదినోత్సవానికి చేరువలో "ఏ మాయ చేసావె"యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం, ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సూపర్‌స్టార్ కృష్ణ సమర్పణలో సంజయ్ స్వరూప్ నిర్మించిన ప్రేమకథా చిత్రం "ఏ మాయ చేసావె". ఈ సినిమా విడుదలై 102 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుని శతదినోత్సవానికి పరుగులు తీస్తోందిSource: Yahoo! Telugu: Entertainment | 16 Apr 2010 | 11:55 am రీమాకు ముద్దులే ముద్దులు.. 30 ముద్దులు పెట్టినా...తేజ "చిత్రం"లో కవ్వించే నటనతో టీనేజ్ కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన రీమాసేన్ తాజాగా ఓ బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. అక్కడి కుర్రాళ్లలో హీట్ రేకెత్తించాలనుకున్నదో ఏమోగానీ ఆ చిత్రం తాలూకు సన్నివేశంలో గాఢ చుంబన రుచి చూస్తున్నట్లు నటించింది. అయితే ఆ ముద్దు పర్‌ఫెక్ట్‌గా రాలేదని సదరు చిత్ర దర్శకుడు రీమాసేన్‌ను హీరోతో ముద్దులపై ముద్దులు పెట్టించాడట. చివరికి 30వ ముద్దు పక్కాగా రావడంతో హీరో ముద్దు పెట్టడం ఆపేశాడట. రీమా మాత్రం ఇంకా ముద్దులు పెడతాడేమోనన్నట్లు ఎదురు చూసిందట.Source: Yahoo! Telugu: Entertainment | 16 Apr 2010 | 9:38 am కాశ్మీర్‌లో "ఎస్ఎమ్ఎస్" నిషేధాన్ని కేంద్రం ఎత్తివేతజమ్మూ కాశ్మీర్‌లో ఎస్ఎమ్‌ఎస్‌లపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపివేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా శుక్రవారం తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో ఎస్ఎమ్ఎస్‌లపై కేంద్రం నిషేధం విధించడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.Source: జాతీయ | 16 Apr 2010 | 8:56 am శశిథరూర్ వ్యవహారం: పార్లమెంట్‌లో ప్రధాని నివేదిక!ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొచ్చి ఫ్రాంచైజీ జట్టు వ్యవహారంలో కీలక సూత్రధారి కేంద్ర మంత్రి శశిథరూర్ వ్యవహారంపై ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌లో నివేదిక సమర్పించనున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్.. తిరిగి స్వదేశానికి చేరుకున్న తర్వాత ఈ వ్యవహారంపై సమగ్ర పరిశీలన జరుపుతారని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమాచారం.Source: జాతీయ | 16 Apr 2010 | 8:25 am తెలుగుదేశం వేస్ట్.. కాంగ్రెస్ బెస్ట్: నన్నపనేని రాజకుమారితెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా ముద్ర వేసుకున్న నన్నపనేని రాజకుమారి ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డవారికి న్యాయం జరుగుతుందనీ, తెలుగుదేశం పార్టీలో మాత్రం దీనికి భిన్నంగా కష్టపడ్డవారికి అవకాశాలు రావని తెదేపా అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.Source: ఏపీ న్యూస్ | 16 Apr 2010 | 7:35 am నా సూచనలను వక్రీకరిస్తూ తీగల కృష్ణారెడ్డి కంపు చేశాడుతానేదో తెలుగుదేశం పార్టీని పటిష్టం చేద్దామని మంచికోసం సూచనలు చేస్తే దానిని తీగల కృష్ణారెడ్డి కంపు కంపు చేశాడని తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ధ్వజమెత్తారు.Source: ఏపీ న్యూస్ | 16 Apr 2010 | 7:26 am "యంగ్ ఇండియా" వైఎస్సార్‌కు అంకితం: దాసరిశతచిత్ర దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణరావు అంతా కొత్తవారిని పరిచయం చేస్తూ నిర్మించిన "యంగ్ ఇండియా" ఆడియో ఆవిష్కరణోత్సవ సంబరం ఏప్రిల్ 10న రవీంద్రభారతిలో అత్యంత వైభవంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. 81మంది అచ్చ తెలుగు నటీనటులను పరిచయం చేస్తూ డాక్టర్ దాసరి నారాయణరావు తీర్చిదిద్దుతున్న ఈ క్రేజీ చిత్రాన్ని ఆయన శ్రీమతి దాసరి పద్మ సమర్పిస్తుండగా కె. రామకృష్ణ ప్రసాద్ సిరి మీడియా పతాకంపై అందిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Apr 2010 | 7:15 am తేడా జరిగితే "సివిల్ వార్" తప్పదు: కేసీఆర్ హెచ్చరికఢిల్లీలో శ్రీకృష్ణ కమటీకి నివేదిక సమర్పించిన అనంతరం నివేదికలో ఏయే అంశాలను జోడించారో చెప్పుకొచ్చారు తెరాస అధినేత కేసీఆర్. ఆంధ్రప్రాంత పెట్టుబడిదారులు తెలంగాణాలో పరిశ్రమలు నెలకొల్పి ఈ ప్రాంతాన్ని ఎలా దోచుకుంటున్నారో వివరించామన్నారు.Source: ఏపీ న్యూస్ | 16 Apr 2010 | 7:07 am చిదంబరం నేరుగా నాతో మాట్లాడాలి: నితీష్ కుమార్సున్నితమైన నక్సలైట్ల అంశంపై కేంద్రం హోం మంత్రి మీడియా ద్వారా తనతో మాట్లాడేకంటే నన్ను పిలిచి నాతో నేరుగా మాట్లాడితే బావుంటుందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు.Source: జాతీయ | 16 Apr 2010 | 6:32 am శతదినోత్సవానికి చేరువలో "ఏ మాయ చేసావె"యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం, ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సూపర్‌స్టార్ కృష్ణ సమర్పణలో సంజయ్ స్వరూప్ నిర్మించిన ప్రేమకథా చిత్రం "ఏ మాయ చేసావె". ఈ సినిమా విడుదలై 102 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుని శతదినోత్సవానికి పరుగులు తీస్తోందిSource: వినోదం | 16 Apr 2010 | 6:26 am అల్లరి నరేష్ హీరోగా వంశీ "సరదాగా కాసేపు"వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ఓ చిత్రం మొదలైంది. "సరదాగా కాసేపు..." పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్ పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ సరసన మధురిమ నాయికగా చేస్తున్నారు. అష్టాచమ్మా ఫేమ్ అవసరాల శ్రీనివాస్ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Apr 2010 | 6:20 am రీమాకు ముద్దులే ముద్దులు.. 30 ముద్దులు పెట్టినా...తేజ "చిత్రం"లో కవ్వించే నటనతో టీనేజ్ కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన రీమాసేన్ తాజాగా ఓ బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. అక్కడి కుర్రాళ్లలో హీట్ రేకెత్తించాలనుకున్నదో ఏమోగానీ ఆ చిత్రం తాలూకు సన్నివేశంలో గాఢ చుంబన రుచి చూస్తున్నట్లు నటించింది. అయితే ఆ ముద్దు పర్‌ఫెక్ట్‌గా రాలేదని సదరు చిత్ర దర్శకుడు రీమాసేన్‌ను హీరోతో ముద్దులపై...Source: వినోదం | 16 Apr 2010 | 4:09 am వార్షిక ప్రణాళిక రూపకల్పనపై మాంటెక్ సింగ్‌తో సీఎం చర్చ!హస్తినలో పర్యటిస్తోన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య శుక్రవారం కేంద్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక రూపకల్పనపై చర్చలు జరిపారు.Source: ఏపీ న్యూస్ | 16 Apr 2010 | 3:47 am అధికార దుర్వినియోగానికి పాల్పడలేదుః శశి థరూర్ఇండియన్ ప్రీమిటయర్ లీగ్(ఐపీఎల్)కు చెందిన కొచ్చి ఫ్రాంచైజ్ విషయంలో తాను ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి శశి థరూర్ శుక్రవారం లోక్‌సభలో స్పష్టం చేశారు.Source: జాతీయ | 16 Apr 2010 | 2:37 am
|