స్వల్ప నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్

వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ తిరోగమనం వైపు పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాలను చవిచూసిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో స్వల్ప నష్టాలను నమోదు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 11 పాయింట్లు స్వల్పంగా క్షీణించి, 17,627 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీకూడా స్వల్ప నష్టంతో 5,271 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 16 Apr 2010 | 9:24 am

డ్యూయెల్ సిమ్ ఫోన్లను ప్రవేశ పెట్టనున్న నోకియా

మొబైల్ ఫోన్ల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న నోకియా సంస్థ రానున్న రోజుల్లో డ్యూయెల్ సిమ్ ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రధాన మేనేజర్ (నార్త్) చందన్ డాంగ్ శుక్రవారం మీడియాకు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 16 Apr 2010 | 9:21 am

వ్యాపారం ప్రారంభించేందుకు లెహ్మన్ బ్రదర్స్‌కు మళ్ళీ అనుమతి

ఆర్థిక మాంద్యంతో అతలాకుతలమై 2008లో దివాళా తీసిన అమెరికా బ్యాంక్ లెహ్మన్ బ్రదర్స్ హోల్డింగ్ ఇన్‌కార్పోరేషన్ మరో కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు న్యూయార్క్‌ కోర్టు అనుమతినిచ్చింది. లెహ్మన్ బ్రదర్స్ సంస్థ దివాళా తీసిన తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుదేలైన విషయం విదితమే.
Source: Yahoo! Telugu: News | 16 Apr 2010 | 9:10 am

తెలుగుదేశం వేస్ట్.. కాంగ్రెస్ బెస్ట్: నన్నపనేని రాజకుమారి

తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా ముద్ర వేసుకున్న నన్నపనేని రాజకుమారి ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. శుక్రవారం తెలుగుదేశం పార్టీ ప్రణాళికకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డవారికి న్యాయం జరుగుతుందనీ, తెలుగుదేశం పార్టీలో మాత్రం దీనికి భిన్నంగా కష్టపడ్డవారికి అవకాశాలు రావని తెదేపా అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Source: Yahoo! Telugu: News | 16 Apr 2010 | 8:53 am

విమానయాన రంగంలోకి చొచ్చుకురానున్న రిల్

కెప్టన్ జిఆర్ గోపీనాథ్ స్థాపించిన కార్గో ఎయిర్‌లైన్ డెక్కన్ 360 సంస్థలో తమ సంస్థ పెట్టుబడులు పెట్టి విమానయాన రంగంలోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు రూపొందించుకుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ శుక్రవారం మీడియాకు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 16 Apr 2010 | 8:47 am

స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 80 పాయింట్ల పతనం

వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ మదుపుదారులను నిరాశ పరిచింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 82 పాయింట్లు క్షీణించి, 17,556 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 25 పాయింట్ల నష్టంతో, 5,248 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 16 Apr 2010 | 8:07 am

అధికార దుర్వినియోగానికి పాల్పడలేదుః శశి థరూర్

ఇండియన్ ప్రీమిటయర్ లీగ్(ఐపీఎల్)కు చెందిన కొచ్చి ఫ్రాంచైజ్ విషయంలో తాను ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి శశి థరూర్ శుక్రవారం లోక్‌సభలో స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 16 Apr 2010 | 8:06 am

పాక్‌లో పేలుడుః కెమెరామెన్‌‌తోసహా నలుగురి మృతి

పాకిస్థాన్‌కు నైరుతి ప్రాంతంలోని క్వేటాలో శుక్రవారం ఉదయం గం. 10.15లకు ఆత్మాహుతి దళానికి చెందిన సభ్యుడు తనను తాను బాంబుతో పేల్చేసుకోవడంతో స్థానిక టీవీ కెమెరామెన్‌తోపాటు నలుగురు మృతి చెందగా మరో పదిమందికిపైగా తీవ్రగాయాలైనయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 16 Apr 2010 | 7:53 am

ట్రేడింగ్ క్షీణత: నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్

వారంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్‌కు ఏ మాత్రం కలిసిరాలేదు. ఫలితంగా శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, 43 పాయింట్లు క్షీణించి, 17,595 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 21 పాయింట్లు పడిపోయి, 5,252 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 16 Apr 2010 | 7:28 am

ఆర్థిక మంత్రి ప్రణబ్‌ను కలవనున్న ఆర్‌బీఐ గవర్నర్

భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) గవర్నరు దువ్వూరి సుబ్బారావు కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీని శుక్రవారం సాయంత్రం కలవనున్నారు. ఈ సందర్భంగా వచ్చే వారం ఆర్‌‍బీఐ నిర్వహించనున్న ద్రవ్యపరపతి విధాన సమీక్షపై చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 16 Apr 2010 | 7:24 am

"యంగ్ ఇండియా" వైఎస్సార్‌కు అంకితం: దాసరి

శతచిత్ర దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణరావు అంతా కొత్తవారిని పరిచయం చేస్తూ నిర్మించిన "యంగ్ ఇండియా" ఆడియో ఆవిష్కరణోత్సవ సంబరం ఏప్రిల్ 10న రవీంద్రభారతిలో అత్యంత వైభవంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. 81మంది అచ్చ తెలుగు నటీనటులను పరిచయం చేస్తూ డాక్టర్ దాసరి నారాయణరావు తీర్చిదిద్దుతున్న ఈ క్రేజీ చిత్రాన్ని ఆయన శ్రీమతి దాసరి పద్మ సమర్పిస్తుండగా కె. రామకృష్ణ ప్రసాద్ సిరి మీడియా పతాకంపై అందిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Apr 2010 | 7:15 am

అల్లరి నరేష్ హీరోగా వంశీ "సరదాగా కాసేపు"

వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ఓ చిత్రం మొదలైంది. "సరదాగా కాసేపు..." పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్ పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ సరసన మధురిమ నాయికగా చేస్తున్నారు. అష్టాచమ్మా ఫేమ్ అవసరాల శ్రీనివాస్ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Apr 2010 | 6:20 am

వార్షిక ప్రణాళిక రూపకల్పనపై మాంటెక్ సింగ్‌తో సీఎం చర్చ!

హస్తినలో పర్యటిస్తోన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య శుక్రవారం కేంద్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడు మాంటెక్ సింగ్‌ అహ్లువాలియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక రూపకల్పనపై చర్చలు జరిపారు.
Source: ఏపీ న్యూస్ | 16 Apr 2010 | 3:47 am

తెలుగుదేశం వేస్ట్.. కాంగ్రెస్ బెస్ట్: నన్నపనేని రాజకుమారి

తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా ముద్ర వేసుకున్న నన్నపనేని రాజకుమారి ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. శుక్రవారం తెలుగుదేశం పార్టీ ప్రణాళికకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డవారికి న్యాయం జరుగుతుందనీ, తెలుగుదేశం పార్టీలో మాత్రం దీనికి భిన్నంగా కష్టపడ్డవారికి అవకాశాలు రావని తెదేపా అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 16 Apr 2010 | 3:25 am

అధికార దుర్వినియోగానికి పాల్పడలేదుః శశి థరూర్

ఇండియన్ ప్రీమిటయర్ లీగ్(ఐపీఎల్)కు చెందిన కొచ్చి ఫ్రాంచైజ్ విషయంలో తాను ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి శశి థరూర్ శుక్రవారం లోక్‌సభలో స్పష్టం చేశారు.
Source: జాతీయ | 16 Apr 2010 | 2:37 am

కడప జిల్లాలో "ఓదార్పు యాత్ర" వాయిదా: జగన్మోహనరెడ్డి

పార్లమెంట్ సమావేశాలను పురస్కరించుకుని తన సొంత నియోజకవర్గమైన కడప జిల్లాలో ఓదార్పు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కడప ఎంపీ, దివంగత సీఎం వైఎస్. రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన రెడ్డి తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో హాజరుకావాల్సి ఉండటంతో కడప ఓదార్పు యాత్రను వాయిదా వేసినట్లు ఆయన వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 16 Apr 2010 | 1:52 am

మెజార్టీ ప్రజలు వద్దన్నా రాష్ట్రాన్ని విభజించాల్సిందే: యాష్కీ

శ్రీకృష్ణ కమిటీకి సీమాంధ్ర నాయకులు నివేదికల మీద నివేదికలిస్తూ తెలంగాణా నాయకులను బెంబేలెత్తిస్తున్నారు. పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు సమైక్య రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ, గతంలో తెలంగాణా ప్రాంత నాయకులు సమైక్యంగా ఉండాలని చేసిన అభ్యర్థనలన్నిటినీ కమిటీకి తమ నివేదికల ద్వారా తెలియజేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 Apr 2010 | 1:46 am

ఐపీఎల్ చిచ్చుతో వాయిదాపడ్డ ఉభయసభలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ రేపిన చిచ్చుతో అటు లోక్‌సభలోను, ఇటు రాజ్యసభలోను విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఈ వ్యవహారంపై సంబంధిత మంత్రి ప్రకటన చేయాలని విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో లోక్‌సభ మధ్యాహ్నం రెండుగంటల వరకు వాయిదాపడింది. అలాగే రాజ్యసభ ఏకంగా సోమవారానికి వాయిదాపడింది.
Source: జాతీయ | 16 Apr 2010 | 1:39 am

తెరాసతో సంప్రదింపులు జరిపిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొన్న వ్యవహారాలపై ప్రత్యేకంగా నియమించిన శ్రీకృష్ణ కమిటీ శుక్రవారం ఉదయం 11 గంటలకు న్యూ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖరరావు బృందంతో సంప్రదింపులు జరిపింది.
Source: జాతీయ | 16 Apr 2010 | 1:28 am

షోయబ్ పాస్‌పోర్ట్ విచారణ: సోమవారానికి వాయిదా!

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను మనువాడిన పాకిస్థాన్ కొత్త వరుడు, క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు పాస్‌పోర్ట్‌తో ఇబ్బందులు తప్పేలా లేవు. అయేషా ఫిర్యాదు సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న తన పాస్‌పోర్ట్‌ను ఇప్పించాల్సిందిగా షోయబ్ మాలిక్ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
Source: ఏపీ న్యూస్ | 16 Apr 2010 | 12:16 am

పశ్చిమబెంగాల్, అసోం, బీహార్‌లో పెరిగిన తుఫాను మృతులు

పశ్చిమబెంగాల్, అసోం బీహార్ రాష్ట్రాలను ఒక్కసారిగా కుదిపేసిన తుఫాను కారణంగా మృతుల సంఖ్య 128కి పెరిగింది. పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర దినావ్పూర్‌లో మరో రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకోవడంతో మృతుల సంఖ్య 41కి పెరిగింది. అసోంలో ఏర్పడ్డ తుఫాను కారణంగా నలుగురు మరణించిన విషయాన్ని అధికారులు తెలిపారు.
Source: జాతీయ | 15 Apr 2010 | 10:27 pm

విజయవంతమైన మానవ రహిత విమానాల ప్రయోగం

దేశంలో వేళ్ళూనుకునివున్న మావోయిస్టులను ఏరివేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం మానవ రహిత విమానాలను(యూఏవీ) ప్రయోగించాలన్న ప్రభుత్వ ప్రయత్నం విజయవంతమైంది. ఇటీవల దంతెవాడలో మావోయిస్టులు, సైనికులకు మధ్య కాల్పుల్లో పలువురు సైనికులు మృతి చెందిన విషయం విదితమే
Source: జాతీయ | 15 Apr 2010 | 9:35 pm

ఆర్య- త్రిషల "సర్వం" ట్రెయిలర్

తమిళ నటుడు ఆర్యతో చిత్రాలు తీసే దర్శుకుడు విష్ణువర్థన్ తాజాగా రూపొందించిన "సర్వం" చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సింహపురి టాకీస్‌పై ఎం.రఘునాథ్, ఎం.నరేంద్రలు నిర్మించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Apr 2010 | 12:05 pm

"ఆవహం" చూసే దమ్ముందా...? ఐతే రూ. 5 లక్షలు మీవే

రామ్ గోపాల్ వర్మ సమర్పణలో మిలింద్ గదగ్‌కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆవహం. పూంఖ్ -1కి ఈ చిత్రం కొనసాగింపు. ఈ చిత్రాన్ని ఈనెల 16న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఒంటరిగా చూసినవారికి ఐదు లక్షల బహుమతి ప్రకటించింది ఈ చిత్ర నిర్మాణ సంస్థ. ఇప్పటికే దేశంలో ఆరు లక్షలమంది ఎంట్రీలు పంపారనీ, అందులో ఆంధ్రప్రదేశ్‌లోనే లక్షా 8వేల మంది ఉన్నారన్నారు. ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే పాల్గొనడం విశేషమన్నారు. తమ డాక్టర్ల పర్యవేక్షణలో వీరి ఆరోగ్య కండిషన్స్ పరీక్షించి డ్రా ప్రకారం కొందరిని ఎంపిక చేస్తామని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ప్రశాంత్ బుర్ర తెలిపారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 1200 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇదంతా మార్కెట్ స్ట్రాటజీ మాత్రమేనన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Apr 2010 | 11:43 am

ఇలియానాను టాలీవుడ్ పొమ్మంటోందా...?

ఒక భాషలో నటిస్తే మరో భాషలో సినిమాలు మిస్ అవుతాయని తాను అనుకోవడం లేదని ఇలియానా చెపుతోంది. తమిళ చిత్రాల్లో నటిస్తే తెలుగులో అవకాశాలు పోతాయనే వాదనను కొట్టి వేస్తూ తెలుగులో తనకంటూ ప్రత్యేక స్థానముందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇకపై తమిళ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తానని చెపుతోంది. ఈ మధ్య నితిన్, విష్ణువతో ఆమె నటించిన చిత్రాలు బోర్లా పడ్డాయి. దీంతో తమిళం వైపు మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. అన్నట్లు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలియానా అందాలకు మించిన అందగత్తెలు రంగప్రవేశం చేసిన దరిమిలా, ఇలియానా పక్క చూపులు చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Apr 2010 | 7:18 am

"ఆవహం" చూసే దమ్ముందా...? ఐతే రూ. 5 లక్షలు మీవే

రామ్ గోపాల్ వర్మ సమర్పణలో మిలింద్ గదగ్‌కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆవాహం. పూంఖ్ -1కి ఈ చిత్రం కొనసాగింపు. ఈ చిత్రాన్ని ఈనెల 16న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఒంటరిగా చూసినవారికి ఐదు లక్షల బహుమతి ప్రకటించింది ఈ చిత్ర నిర్మాణ సంస్థ. ఇప్పటికే దేశంలో ఆరు లక్షలమంది ఎంట్రీలు పంపారనీ, అందులో ఆంధ్రప్రదేశ్‌లోనే...
Source: వినోదం | 15 Apr 2010 | 6:15 am

మే నెలలో మహేష్ - శ్రీను వైట్ల చిత్రం

మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్న చిత్రం మే నెలలో ప్రారంభం కానుంది. ఇందులో ఏ మాయ చేసావె ఫేమ్ సమంత కథానాయిక. ఈ చిత్రాన్ని 2011 సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ సంస్థ వెంకటేష్‌తో నమో వెంకటేశ చిత్రాన్ని నిర్మించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Apr 2010 | 5:59 am

జిఎస్ఎల్‌వి-డీ3 రాకెట్ ప్రయోగం విఫలం: శాస్త్రవేత్తలు

తొలి స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్‌తో భారత అంతరిక్ష కేంద్రం (ఇస్రో) శాస్త్రవేత్తలు రూపొందించిన జిఎస్ఎల్‌వి-డీ3 రాకెట్ ప్రయోగం విఫలమైంది. కానీ నిర్దేశిక కక్ష్య నుంచి రాకెట్ పక్కకు తొలగి పోవడంతో షార్ సెంటర్‌‍కు సమాచారం అందలేదని ఇస్రో తెలిపింది. దీంతో జిఎస్ఎల్‌వి-డీ3 రాకెట్ ప్రయోగం విఫలమైంది.
Source: జాతీయ | 15 Apr 2010 | 5:39 am

ఆహార వస్తువులపై వ్యాట్ విధించడం అన్యాయం: బాబు

ఆహార వస్తువులపై వ్యాట్ విధించడం అన్యాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోలు ధరలను విపరీతంగా పెంచేశారని బాబు ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని పెంచుకున్నాయే తప్ప, పేదవాడి గురించి ఏ మాత్రం ఆలోచించలేదని చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు.
Source: ఏపీ న్యూస్ | 15 Apr 2010 | 4:53 am

ఇలియానాను టాలీవుడ్ పొమ్మంటోందా...?

ఒక భాషలో నటిస్తే మరో భాషలో సినిమాలు మిస్ అవుతాయని తాను అనుకోవడం లేదని ఇలియానా చెపుతోంది. తమిళ చిత్రాల్లో నటిస్తే తెలుగులో అవకాశాలు పోతాయనే వాదనను కొట్టి వేస్తూ తెలుగులో తనకంటూ ప్రత్యేక స్థానముందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇకపై తమిళ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తానని చెపుతోంది. ఈ మధ్య నితిన్, విష్ణువతో ఆమె నటించిన చిత్రాలు బోర్లా పడ్డాయి. దీంతో తమిళం వైపు మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. అన్నట్లు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలియానా అందాలకు మించిన అందగత్తెలు రంగప్రవేశం చేసిన దరిమిలా, ఇలియానా పక్క చూపులు చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Source: వినోదం | 15 Apr 2010 | 4:45 am

ప్రభుత్వాన్ని కూలదోయడమే మావోల లక్ష్యం: చిదంబరం

దంతెవాడ సంఘటనపై పార్లమెంటు దద్ధరిల్లింది. దంతెవాడ ఘటన 76మంది జవాన్ల ప్రాణాలను మావోలు బలిగొన్న సంఘటనపై భుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ విపక్షాలు ధ్వజమెత్తాయి. అసలు మావోల అణచివేతకు సంబంధించి యూపీఎ భాగస్వామ్య పార్టీల మధ్య ఐక్యత లేదని ఆరోపించాయి.
Source: జాతీయ | 15 Apr 2010 | 3:55 am

రైతులను అన్ని విధాలా ఆదుకోవాలి: సీఎం రోశయ్య

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య పేర్కొన్నారు. ఇంకా నష్టపోయిన రైతులకు సహాయక చర్యలు అందేలా చూడాలని ఆదేశించారు. దీనిపై ప్రభుత్వ కార్యదర్శితోనూ రోశయ్య సమీక్ష జరిపారు. నష్టపోయిన రైతులను అన్నివిధాలా ఆదుకోవాలని ఆదేశించారు.
Source: ఏపీ న్యూస్ | 15 Apr 2010 | 3:46 am

హైకోర్టులో పిటిషన్ వేసిన నూతన వరుడు షోయబ్!!

పాకిస్థాన్ క్రికెట్ ఆటగాడు, హైదరాబాదీ అల్లుడు షోయబ్ మాలిక్ తన పాస్‌పోర్టును తిరిగి అప్పజెప్పాలంటూ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను వివాహం చేసుకునే నేపథ్యంలో హైదరాబాద్ వచ్చి, ఆయేషా సిద్దీకీ వివాదంలో చిక్కుకున్న షోయబ్ పాస్‌పోర్టును నగర పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకుని కోర్టుకు సమర్పించారు.
Source: ఏపీ న్యూస్ | 15 Apr 2010 | 2:57 am

కేసీఆరూ.. సీమాంధ్రలో పర్యటించవయ్యా.!: అనంత ఎంపీ

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు యధేచ్చగా సీమాంధ్రలో పర్యటించవచ్చునని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా యాత్రలు చేపట్టవచ్చునని కేసీఆర్‌కు అనంత ఎంపీ హితవు పలికారు.
Source: ఏపీ న్యూస్ | 15 Apr 2010 | 2:43 am

శ్రీహరికోటలో జీఎస్ఎల్‌‍వీ-డీ3 ప్రయోగం: కౌంట్‌డౌన్ ప్రారంభం!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మొట్టమొదటిసారిగా క్రియోజోనిక్ టెక్నాలజీతో రూపొందించిన జిఎస్ఎల్‌వి-డీ3 రాకెట్‌ ప్రయోగానికి శ్రీహరి కోట వేదికైంది. అత్యాధునిక టెక్నాలజీతో ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన జీఎస్ఎల్‌‍వీ-డీ3 రాకెట్ గురువారం నింగికి ఎగసేందుకు సిద్ధమవుతోంది.
Source: జాతీయ | 15 Apr 2010 | 2:28 am